-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sravanthi Ravi Kishore"



చిత్రం: రెడ్ (2021)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: రామ్ పోతినేని, నభా నటేష్ , నివేథా పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్
దర్శకత్వం: కిషోర్ తిరుమల
నిర్మాణం : శ్రవంతి రవి కిశోర్
విడుదల తేది: 14.01.2021



Songs List:



నువ్వే నువ్వే నువ్వే పాట సాహిత్యం

 
చిత్రం: రెడ్ (2021)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: రమ్యా బెహ్రా , అనురాగ్ కులకర్ణి 

నువ్వే నువ్వే నువ్వే
నువ్వుంటే చాలుగా
మరెవరం కోరే పనేమీ లేదుగా
ఎడారి దారిలో ఎదురయ్యే వానగా
తనంత తానుగా కదిలొచ్చే కానుక

నీ స్పర్శే చెప్పింది
నే సగమే ఉన్నానంటూ
నీలో కరిగినాడే నేనంటూ పూర్తయినట్టు
ఇన్నాళ్లు ఉన్నట్టు
నాక్కూడా తెలియదు ఒట్టు
నువ్వంటూ రాకుంటే
నేనుండున్నాను లేనట్టు
ఈ లోకంలో మనమే తొలి జంటని
అనిపించే ప్రేమంటే పిచ్చే కదా
ఆ పిచ్చే లేకుంటే ప్రేమేదని
చాటిస్తే తప్పుందా నిజం కాదా

నువ్వే నువ్వే నువ్వే
నువ్వుంటే చాలుగా
మారె వరం కోరే పనేమీ లేదుగా
ఎడారి దారిలో ఎదురయ్యే వానగా
తనంత తానుగా కదిలొచ్చే కానుక

ఎందుకు జీవించాలో అనిపించిందంటే చాలు
ఇందుకు అంటూ నిన్ను చూపిస్తాయి ప్రాణాలు
ఎవ్వరితో చెప్పోదే మనిద్దరిదీ గుట్టు
నువ్వే నా గుండెల్లో గువ్వల్లే గూడును కట్టు
ఎటు వెళ్లాలో వెతికే పదాలకు
బదులయి ఎదురొచ్చింది నువ్వే కదా
నన్నేవారికివ్వాలి అన్నందుకు
నేనూనున్నది నువ్వే కదా




డించిక్ డించిక్ డింకా... పాట సాహిత్యం

 
చిత్రం: రెడ్ (2021)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: సాకేత్, కీర్తన శర్మ

ఎక్కడీ దానవే... సక్కనీ కోమలి
ఒక్కదానివి ఉన్నావేందే... వస్తవా భీమిలీ
గంపెడు ఆశతో... దాటినా వాకిలి
మోసం చేస్తే మీ మొగాళ్ళంతా... ఇడిసినా ఫ్యామిలీ
అయ్.. చెప్పుకుంటే బాధ... అరె, తీరిపోద్ది చంచిత
అరె..సెట్టంతా మావోడున్నాడు... సెట్టు సేత్తడు నీ కథా
ఏడి... ఎక్కడున్నడు..?
నా కళ్ళకు కనిపించమను, మీ హీరోని కూసింత

పన్నెండు డబ్బాల... పాసెంజర్ బండెక్కి...
పదకొండు గంటలకు... పోదమన్నడు బొంబైకి
పదిమంది సూచారని... సాటుగ వచ్చా టేషనుకి
హే..తొమ్మిదో నెంబర్ మీదికి... రైలొచ్చేరొవ్వంతటికే
సల్లటి ఏసీ బోగీలో... సూపిత్తాడే ఒకటికి
హాయ్ చెప్పి దుప్పటి ఏసి... దూరిండమ్మీ మాపటికీ
కూ చుక్ చుక్ కూతలు తప్ప... మోతలు లేవే రాతిరికి
ఇంజిన్ మొత్తం హీటెక్కించి... జంపయ్యిండే పొద్దటికీ

ఆయ్...డించిక్ డించి డింకా... ఆడా ఈడా దూకకేజింకా
డించిక్ డించిక్ డింకా... మా బుచ్చుకి
రావే ఇంకా
అరె డించిక్ డించిక్ డింకా... తగలెట్టేస్తానీలంకా
డించిక్ డించి డింకా... తీగ లాగితే కదిలే డొంకా

గుంజూతుంటే చైను... గురునాథం పిలిచే నన్ను
కట్టే చేస్తే సీను... చెన్నైలో తేలాను
రంజూగుందే స్టోరీ... ఏటయ్యిందే ఈసారి
కంచిపట్టు సారీ... నలిగిందా లేదా జారి
ఇంగిలీషు సినిమా సూద్దాం... ఇంగవా అన్నాడు
ఎంగిలి ముద్దులంటే నేర్పిస్తానన్నాడు
రొంబ రొంబ సంతోషమా... నాటి నాంచారు
పంబరేగి పోయిందేమో... నైటు హుషారు
లుంగీ డాన్స్ చేద్దామంటూ... పొంగించాడే ఓ బీరు
తొంగున్నాడు గుర్రుపెట్టి... మెక్కి ఇడ్లీ సాంబారు, ఊఊ

ఆయ్...డించిక్ డించి డింకా... ఆడా ఈడా దూకకేజింకా
డించిక్ డించిక్ డింకా... మా బుచ్చుకి
రావే ఇంకా
అరె డించిక్ డించిక్ డింకా... తగలెట్టేస్తానీలంకా
డించిక్ డించి డింకా... తీగ లాగితే కదిలే డొంకా

తిప్పి సందు సందూ... నా వల్ల కాదని చందు
ఛార్మినారు ముందు... తాగించాడే మందు
జాగాలన్నీ చుట్టి... మా వైజాగోచ్చావా చిట్టి
బాగుంటాదే సిట్టీ... చూస్తావా చెమట పట్టీ
లైటు హౌజులాగా ఉంది బాసు కటౌటు
రూటు పట్టి రౌండే సొద్దాం... పట్నం సూపెట్టు
చెండూ లాగా మెత్తగా ఉంది... పాప నీ ఒళ్ళు
గ్రౌండులో దిగావంటే... తిరుగుతాయే కళ్ళు
ఎత్తుపళ్ళం ఎక్కి దిగి... వచ్చిందయ్యో ఈ రైలు
సత్తా జూసి ఈన్నే ఉంటా... ఇచ్చావంటే సిగ్నళ్ళు, ఊఊ

ఆయ్... డించిక్ డించిక్ డింకా... ఆడా ఈడా దూకకే జింకా
డించిక్ డించిక్ డింకా... మా బుచ్చుకి
రావే ఇంకా
అరె డించిక్ డించిక్ డింకా... తగలెట్టేస్తా నీలంకా
డించిక్ డించి డింకా... తీగలాగితే కదిలే డొంకా



కౌన్ హై అచ్చ... పాట సాహిత్యం

 
చిత్రం: రెడ్ (2021)
నటీనటులు: రామ్ పోతినేని, మాళవిక శర్మ, అమ్రితా అయ్యర్
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి
గానం: అనురాగ్ కులకర్ణి
దర్శకత్వం: కిషోర్ తిరుమల
నిర్మాణం : శ్రవంతి రవికిశోర్
విడుదల తేది: 14.01.2021

వాడు వీడు బ్యాడు అంటూ... నువ్వు చెప్పకు,
దొబ్బెయ్
మంచి అంటూ ఒకటి అసలుంటేగా
నంగి నంగి చూసే... గండు పిల్లిలాంటి
నీకు రంగులెన్ని చెప్పు...

నీలోపల ఉన్న బూచోడు చేసేటివన్ని... చెప్పుకోవు నీకు నువ్వైనా, క్యారె
వేషాలింకా చాలు ఇంకైనా... మంచోడిలాగా నువ్వు అంటే ఏంటో చెప్పినా

కౌన్ హై అచ్చా... కౌన్ హై లుచ్చా
ఫరకే లేదు చిచ్చా... ఎందుకంటా రచ్చా
కౌన్ హై అచ్చ... కౌన్ హై లుచ్చా
బోలో మేరె బచ్చా... ఇదంతా నీ పిచ్చా
నింగి నేల చూశా... నీతి ఎక్కడుంది చెప్పు
చూసి వద్దాం కాస్త...
మారిపోద్ది న్యాయం... నోటు రేటు మారేకొద్ది

వెతకమాకు దాన్ని... ఆ
అంతా తెలుసని అంటావు... తెలిసిందేదైనా అంతా కానేకాదు,
సమ్లోనా
లైఫ్ ఫెయిరు కాదు అన్నావో... ఒకటిచ్చుకొన
ఎవడు మాటిచ్చాడు నీకైనా...
రచ్చా
కౌన్ హై అచ్చా... కౌన్ హై లుచ్చా
ఫరఖే లేదు
చిచ్చా...
ఎందుకంటా
కౌన్ హై అచ్చ...
కౌన్ హై లుచ్చా
బోలో మేం
బచ్చా...
ఇదంతా నీ పిచ్చా
కళ్ళలోకి చూసే... నిన్ను లెక్క వేసేనంట
లోకం అంత అంతే రేయ్...
పూటకొక్క మాట... పూటకూళ్ళ వాడి బాట
నువ్వు మాత్రం కాదా... చెత్త నా కొ**
నువ్వు నమ్మేవేగా నిజాలు నీకెప్పుడైనా... ఒప్పుకోవు ఉన్న
నిజాన్ని, అర్హహా
నాటకాలు ఆడుజగాన... నీ అద్దం ముందు ఆపుకొం

నాటకాలు ఆడు జగాన... నీ అద్దం ముందు ఆపు కొంతైనా,
హేయ్ థు
కౌన్ హై అచ్చా...
కౌన్ హై లుచ్చా
ఫరఖే లేదు చిచ్చా... ఎందుకంటా రచ్చా
కౌన్ హై అచ్చ... కౌన్ హై లుచ్చా
బోలో మేరె బచ్చా... ఇదంతా నీ పిచ్చా





మౌనంగా ఉన్నా పాట సాహిత్యం

 
చిత్రం: రెడ్ (2021)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: దిన్కర్ , నూతన్ మోహన్

మౌనంగా ఉన్నా నీతో అంటున్నా
నా వెంట నిన్ను రారమ్మని
తెల్లారుతున్నా కల్లోనే ఉన్నా
కదపొద్దంటున్నా లేలెమ్మనీ

వినలేదా కాస్తయినా నీ ఎదసడిలోనే లేనా
వెతకాల ఏమైనా నిను నాలోనే చూస్తున్నా
ఒకటే బ్రతుకు మన ఇద్దరిది ఇకపైన

ప్రాణం ఇమ్మన్నా ఇస్తారమ్మన్నా
వినలేదా నువ్వు నా ఆలాపన
ఏం చేస్తూ ఉన్నా ఏం చూస్తూ ఉన్నా
నిను వీడదే నా ఆలోచన

లోలో చిగురించిన ఆశకు చెలిమే ఆయువు పోసి
ఊరించే తియతియ్యని ఊహకు ఒడిలో ఊయల వేసి
నీ పేరుతో కొత్తగా పుట్టనీ 
నా జీవితం ఇప్పుడే మొదలనీ
ఒకటే బ్రతుకు మన ఇద్దరిది ఇకపైన

ప్రాణం ఇమ్మన్నా ఇస్తారమ్మన్నా
వినలేదా నువ్వు నా ఆలాపన

ఎవరూ మన జాడని చూడని చోటే కనిపెడదామా
ఎపుడూ మనమిద్దరి ఒక్కరిలాగే కనబడుదామా
నా పెదవిలో నవ్వులా చేరిపో నా ఊపిరే నువ్వులా మారిపో
ఒకటే బ్రతుకు మన ఇద్దరికి ఇకపైన

ప్రాణం ఇమ్మన్నా ఇస్తారమ్మన్నా
వినలేదా నువ్వు నా ఆలాపన
ఏం చేస్తూ ఉన్నా ఏం చూస్తూ ఉన్నా
నిను వీడదే నా ఆలోచన

Palli Balakrishna Sunday, January 17, 2021


చిత్రం: జైత్రయాత్ర (1991)
సంగీతం: యస్. పి.బాలసుబ్రహ్మణ్యం
సాహిత్యం: అదృష్ట దీపక్
గానం: యస్. పి.బాలు
నటీనటులు: నాగార్జున, విజయశాంతి
దర్శకత్వం: ఉప్పలపాటి నారాయణ రావు
నిర్మాత: స్రవంతి రవికిశోర్
విడుదల తేది: 13.11.1991

యెన్నల్లమ్మ యెన్నెల్లమ్మా సోకాల ఈ చీకటీ
వేకువ రావలమ్మ వేదన తీరలమ్మా
యెన్నల్లమ్మ యెన్నెల్లమ్మా సోకాల ఈ చీకటీ
వేకువ రావలమ్మ వేదన తీరలమ్మా

ఓ చెట్టెమ్మ చిన్నమ్మ చిలకమ్మ సీతమ్మ
నా మాట వింటారా
ఓ చిన్నరి పొన్నరి సింగరి బంగారి
నా పాట వింటార
ఓ చెట్టెమ్మ చిన్నమ్మ చిలకమ్మ సీతమ్మ
నా మాట వింటారా
ఓ చిన్నరి పొన్నరి సింగరి బంగారి
నా పాట వింటార

బడిలో మీకిక చదువే లోకం
బలపం పట్టె వేల గురువే దైవం
పెరిగె ఈడున న్యాయం నేరం
కలలే కన్నిలైతే బ్రతుకే భారం
నేర్చిన అర్దలన్ని మారిపోయేను
పేర్చిన స్వప్నాలన్ని కూలిపోయేను
ఆకల్ల సోకాలు ఈ కుల్లు లోకలు
నిన్ను నన్ను నేడు చుట్టుముట్టెను
చేతులు కలపండిరా...సైనుకై లేండిరా

యెన్నల్లమ్మ యెన్నెల్లమ్మా సోకాల ఈ చీకటీ
వేకువ రావలమ్మ వేదన తీరలమ్మా

కదిలె కాలమై గమనం సాగీ
ఎదలొ ద్యేయం కోసం సమరం రేగీ
రగిలె గాయమై పొగిలె ప్రాణం
పగిలె ద్యేయం తానై మిగిలే గానం
కన్నొల్ల కన్నుల్లోన వెన్నెలే పంచి
ఇన్నల్ల చీకట్లకు చెల్లు రాయించి
కష్టాలు లేనట్టి కన్నిల్లు రానట్టి
పూల దారుల్లోకి సాగిపోదామూ
నేరుగ నడవండిరా...మార్పును కోరండిరా

యెన్నల్లమ్మ యెన్నెల్లమ్మా సోకాల ఈ చీకటీ
వేకువ రావలమ్మ వేదన తీరలమ్మా
ఓ చెట్టెమ్మ చిన్నమ్మ చిలకమ్మ సీతమ్మ
నా మాట వింటారా
ఓ చిన్నరి పొన్నరి సింగరి బంగారి
నా పాట వింటార


*******  ******  *******


చిత్రం: జైత్రయాత్ర (1991)
సంగీతం: యస్. పి.బాలసుబ్రహ్మణ్యం
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి.బాలు, యస్. పి.శైలజ

నీడల్లె వున్న నిన్నా
సూరిడ నిన్నె కన్నా
రేయంత కాటుక చేసి రెప్పల్లొ వేకువ పూసి
వేడిచ్చె వేల నీడ దాటి నేడు వెలుగు జతకలవనా

జ్వాలన్నె ఉన్నా నిన్న
జాబిల్లి నిన్నె కన్నా
మంటల్లె మల్లెలు చేసి నీ జల్లొ చల్లగ దాచి
లాలించె లీల చేరువైన నేడు చలువ సిరి చిలుకలా

కోకంత ఒకే కూని రాగం
సోకంత అదోలాంటి మైకం ఏమో ఏమైందో
మేనంత నిషలాగ నాట్యం
చూపుల్లొ కసె దాని సాక్ష్యం లొలో ఏముందో
రాసిస్త రహస్యల రాజ్యం
రానించె వయ్యరాల కోసం అందే ఆనందం
రమ్మందె విసేషాల రంగం
వన్నెల్లో వసంతాల మాసం చిందే శ్రీ గందం
వాగల్లె రేగె వేగలాగెనా
వెయ్యెల్ల ముల్లె ఉన్నా
తీరని దాహం నేడె నేనై రానా

నీడల్లె వున్న నిన్నా
సూరిడ నిన్నె కన్నా
మంటల్లె మల్లెలు చేసి నీ జల్లొ చల్లగ దాచి
లాలించె లీల చేరువైన నేడు చలువ సిరి చిలుకలా

గుండెల్లొ గులాబీల బాణం
గుచ్చిందె విలాసాల వైనం పూచే గాయాలు
బావుందె పదరెల్ల భావం
పైటంత పరకైన ప్రాయం వీచే గరాలూ
గుమ్మంలొ దిగె పాల పుంత
గుట్టంత గుబారించెననంట రోజూ పున్నాలే
వెచ్చంగా వరించింది స్వప్నం
అచ్చంగా వరలిచ్చె స్వర్గం పూలే పొంగాలే
కౌగిల్లొ కాగే కాలం కరిగేనా ముంచెత్తె మోహం ఉన్న
కోరిక తీరే దారే కానా...

జ్వాలన్నె ఉన్నా నిన్న
జాబిల్లి నిన్నె కన్నా
రేయంత కాటుక చేసి రెప్పల్లొ వేకువ పూసి
వేడిచ్చె వేల నీడ దాటి నేడు వెలుగు జతకలవనా


*******  ******  *******


చిత్రం: జైత్రయాత్ర (1991)
సంగీతం: యస్. పి.బాలసుబ్రహ్మణ్యం
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఒక్కటై వచ్చయి యెండ వాన
ముక్కలై పోతున్న గుండెలోన
ఒంటిగా నింద్రించు ఆకశాన
చుక్కలే కన్నిటి చుక్కల్వునా మౌనమే ద్వనించునా

ఒక్కటై వచ్చయి యెండ వాన
ముక్కలై పోతున్న గుండెలోన
ఒంటిగా నింద్రించు ఆకశాన
చుక్కలే కన్నిటి చుక్కల్వునా మౌనమే ద్వనించునా

నిట్టుర్పు వేడి లోనా ఓదార్పు జల్లుగా
ఎద సేద తీరు వేల ఒడిలో చల్లగా
చిరునవ్వు నీకు నేను కానా

కన్నుల్లొ అగ్ని గోలం కాగుతుంటె రేగుతుంటే
గుండెల్లొ గ్రీష్మ తాపం నిండుతుంటె మండుతుంటె
మబ్బుల్లొ మంచుముక్క తుంచుకొస్త పంచి ఇస్తా
మల్లెల్లొ మంచి ఘందం మోసుకొస్త మోదుకిస్తా
కాలల ఈ ఇంద్ర జాలలలో కన్నిల్లు ఎన్నాల్లనీ
కనుపాపలాగ జోల పాడి వందెల్లు లాలించనీ

ఒక్కటై వచ్చయి యెండ వాన
ముక్కలై పోతున్న గుండెలోన
ఒంటిగా నింద్రించు ఆకశాన
చుక్కలే కన్నిటి చుక్కల్వునా మౌనమే ద్వనించునా

సిసిరాలి దారిలోనా కుసుమాలు కురియనా
నిషివీహిలోన నీకై శశినై చేరనా
కలనైన నీకు నీడ కానా

చిందించె చింతలోన అమ్రుతాలే అగ్ని వాన
స్పందించె బాధ నేడు బాష లేని శ్వాస లోనా
మిన్నెటి వెన్నెలల్లె వెల్లువల్లె అల్లుకోనా
కన్నిటి జాడ లేని వాడ దాక తోడు రాన
వెసారె ఆశల్లొ ఆవేదనా తిరెనా ఈ సోదనా
రసగీతమైన జీవితాన రాగల తేలించనా

ఒక్కటై వచ్చయి యెండ వాన
ముక్కలై పోతున్న గుండెలోన
ఒంటిగా నింద్రించు ఆకశాన
చుక్కలే కన్నిటి చుక్కల్వునా మౌనమే ద్వనించునా

Palli Balakrishna Friday, December 15, 2017



చిత్రం: గౌరి (2004)
సంగీతం: కోటి
నటీనటులు: సుమంత్, ఛార్మి , నరేష్ , కౌశల్య
దర్శకత్వం: బి.వి.రమణ
నిర్మాతలు: స్రవంతి రవికిశోర్
విడుదల తేది: 03.09.2004



Songs List:



ఏం మాత్రం వేశావో పాట సాహిత్యం

 
చిత్రం: గౌరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కోటి, సంతోషిని

ఏం మాత్రం వేశావో





గుండెలలో గుడి గంట పాట సాహిత్యం

 
చిత్రం: గౌరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మల్లికార్జున్, ఉష

గుండెలలో గుడి గంట




ఏనాడో జరిగిన పాట సాహిత్యం

 
చిత్రం: గౌరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో

ఏనాడో జరిగిన





జిగి జిగి జింక పాట సాహిత్యం

 
చిత్రం: గౌరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రవివర్మ, స్మిత

జిగి జిగి జింక




నెమ్మది నెమ్మది నెమ్మదిగా పాట సాహిత్యం

 
చిత్రం: గౌరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సునీత , సందీప్

పల్లవి:
నెమ్మది నెమ్మది నెమ్మదిగా 
నా మది నమ్మినది
నీ జతనల్లిన మాలతిగా వేరే జన్మ ఇది
రెప్పలే దాటని స్వప్నమా లెమ్మని
చెలిమిలో స్వాగతం పిలువగా

నెమ్మది నెమ్మది నెమ్మదిగా 
నా మది నమ్మినది
నీ జతనల్లిన మాలతిగా వేరే జన్మ ఇది

చరణం: 1
పూలగాలి స్వరముల వెంట చేరుకోమంది
నీ నేస్తమే కవి క్షేత్రమై
ఆకశాన్ని చినుకుల వెంట నేల దించింది
నీ స్నేహమే ఆషాడమై
మచ్చ మాటునున్న కన్నెకొమ్మ ఎన్నినాళ్ళకి
లేత పూతపడ్డ కులుకుతున్నది
మంచి మాటలన్ని వానజల్లు ముందునాళ్ళకి
నాకు పచ్చనాశ చూపుతున్నది
ప్రాయమే తోడుగా నడపగా

నెమ్మది నెమ్మది నెమ్మదిగా నా మది నమ్మినది
నీ జతనల్లిన మాలతిగా వేరే జన్మ ఇది

చరణం: 2
చూపులోన చుర చురలన్ని దీపమనుకోన
అనుమానమా అనురాగమా
చేతిలోని మధుకళశాన్ని భారమనుకున్నా
మన్నించుమా మమకారమా
తేనె ఉప్పెనల్లే పొంగుతున్న ప్రేమ దొంగని
అందుకుంది చూడు నిండు దోసిలి
నింగి ద్వారమంటి పోల్చుకున్న గుండెసవ్వడి
గొంతు దాటనంది ఎందుకో మరి
మౌనమే గానమై తెలుపదా




ముద్దొస్తోంది పాట సాహిత్యం

 
చిత్రం: గౌరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: వేణు, నిత్యసంతోషిని

ముద్దొస్తోంది 

Palli Balakrishna Wednesday, November 22, 2017



చిత్రం: ఉన్నది ఒక్కటే జిందగి (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: రామ్ పోతినేని, లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్
దర్శకత్వం: కిషోర్ తిరుమల
నిర్మాత: స్రవంతి రవికిశోర్
విడుదల తేది: 27.10.2017



Songs List:



ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే పాట సాహిత్యం

 
చిత్రం: ఉన్నది ఒక్కటే జిందగి (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: దేవి శ్రీ ప్రసాద్

ఉన్నది ఒకటే జిందగి
ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా 
ఈ జిందగి మొత్తం మనతో ఉండేవాడే 
నిజమైన ఫ్రెండ్
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే

నిక్కర్ నుండి జీన్స్ లోకి మారినా
సైకిల్ నుండి బైక్ లోకి మారినా
కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారినా
నోట్ బుక్ నుండి ఫేస్బుక్ కి మారినా
ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాక 
కాలింగ్ మారినా...
ఫ్రెండ్ అన్న మాటలోన స్పెల్లింగ్ మారునా
ఫీలింగ్ మారునా....

ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే
ఎండ్ కాని బాండ్ పేరే ఫ్రెండ్షిప్పే
ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే
గుండెలోని సౌండ్ పేరు ఫ్రెండ్షిప్పే

పుల్ల ఐస్ నుండి క్రీమ్ స్టోన్ కి మారినా
రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్పే
ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ఫోన్ కి మారినా
మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్పే 
టూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారినా
పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్పే
పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్పే

ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే
ఎండ్ కాని బాండ్ పేరే ఫ్రెండ్షిప్పే
ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే
గుండెలోని సౌండ్ పేరు ఫ్రెండ్షిప్పే

పెన్సిళ్ల నుండి పెండ్రైవ్ కి మారినా
నేర్చుకున్న సబ్జెక్ట్  ఫ్రెండ్షిప్పే
ఫ్రూటీల నుండి బీరులోకి మారినా
పొందుతున్న కిక్ పేరే ఫ్రెండ్షిప్పే
మొట్టికాయ నుండి గట్టిపంచ్ లోకి మారినా
నొప్పిలేని తీపిదనం ఫ్రెండ్షిప్పే
అన్ని ఓర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్పే

ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే
ఎండ్ కాని బాండ్ పేరే ఫ్రెండ్షిప్పే
ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే
గుండెలోని సౌండ్ పేరు ఫ్రెండ్షిప్పే





వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: ఉన్నది ఒక్కటే జిందగి (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: దేవి శ్రీ ప్రసాద్

ఆ.. మైక్ ఉన్నదే పాట లేదు
డప్పు ఉన్నదే బీటే లేదు
స్పీకరున్నదే పెప్పే లేదూ
స్టేజు ఉన్నదే స్టెప్పే లేదూ
వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా
వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా

పంచ్ ఉన్నదే కౌంటర్ లేదు
సర్కిలున్నదే సెంటర్ లేదు
ఈడు ఉన్నదే ఈలే లేదు
బాడీ లోపల గోలే లేదు
వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా
వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా

హే రాగమున్నది రంభే లేదు
రంగు ఉన్నది పొంగే లేదు
బ్యాండ్ ఉన్నది సౌండే లేదు
గ్యాంగ్ ఉన్నది బాంగే లేదు
మేజువాని ఉన్నా ఏ జవాని లేదు
వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా
అరె వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా అయ్యో..

టీజర్ చూసి మోసపోయి సినిమాకెళ్లి బుక్కైనట్టు
రేటింగ్ చూసి రెచ్చిపోయి డిన్నర్ కెళ్ళి లాకైనట్టు
క్రేజ్ చూసి మోజుపడి చైనా ఫోన్ కి ఫూలైనట్టు
ఆఫరుంటే ఆశపడి ఆన్లైన్ మని బ్లాకైనట్టు
వెల్కమ్ పోస్టర్ ఉంది కాని పార్టీ ఊసే లేదు
డిస్కో డాన్స్ ఉందీ కాని జ్యోతిలక్ష్మీ లేదూ 
గ్లామర్ బోలెడు ఉంది కాని ఓ గ్రామరంటు లేదు
రాతిరి మొత్తం ఉంది జాతర జాగరమే లేదు
వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా
అరె వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా మ్మ మ్మ మ్మ మ్మ

ఆ పండగేల తెచ్చుకున్న థౌసాండ్ వాలా తుస్సన్నట్టు
కల్లు తాగి కోతిపిల్ల లోల్లే మరచి తొంగున్నట్టు
పవర్ బాంక్ ఫుల్ గున్నా ఛార్జింగ్ కేబుల్ కట్టైనట్టు
ఫ్రైడే రోజు పబ్బు ఉన్నా ట్రై డే అంటూ బోర్డెట్టినట్టు
గ్రూపు ట్రూపు ఉంది ఊపులేమి లేవు
బారు బీరు ఉంది ఏ జోరు లేనే లేదు
మ్యాటర్ బోలెడు ఉంది ఓ మీటరంటు లేదు
ప్రాణం పంచే స్నేహం ఉంది మనసే పంచే మార్గం లేదు
వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా
అమ్మ వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా మ్మ మ్మ మ్మ మ్మ
వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా మ్మ మ్మ మ్మ మ్మ



హా రయ్యి రయ్యిమంటూ పాట సాహిత్యం

 
చిత్రం: ఉన్నది ఒక్కటే జిందగి (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: దివ్య కుమార్ , యమ్.యమ్.మానసి

స రి గ రి స ని స ని స
ప ని మ ప ఆ అ అ ఆ
ప మ ప మ గ ప మ
స గ స గ స ని

గ స ని ప
స స ని ప ని
ని ని ప మ ప
గ మ గ మ
మ ప మ ప
అ ఆఆ ఆ ఆఆ ఆఆఆ 

హా రయ్యి రయ్యిమంటూ
రెక్క విప్పుకుంటూ
వచ్చి వాలెనే మనసు సొంత గూటిలో

స గ స గ రి స ని ప

హే ఘల్లు ఘల్లు మంటూ 
గుండె ఝల్లుమంటూ
అడుగులేసేనే స్వరాల కొత్త బాటలో

సా... గ స గమ ప మ గ

నీలాకాశం ఎంత దూరం ఉన్నా
ఎగిరామంటే,అందదా 
ఊహ లోకం ఎక్కడెక్కడున్న 
పిలిచామంటే నిజాంగా నిజం కదా ..

రయ్యి రయ్యిమంటూ
రెక్క విప్పుకుంటూ
వచ్చి వాలెనే మనసు సొంత గూటిలో

ఆ ఆఆఆఆ

ఘల్లు ఘల్లు మంటూ 
గుండె ఝల్లుమంటూ
అడుగులేసేనే స్వరాల కొత్త బాటలో

స రి ప ని స రి మ గ రి స 
స రి గ ప మ గ రి స
స రి ప ని స రి మ గ రి స 
స రి గ ప మ గ ద …
ప ద ప మ గ మ గ రి గ రి 
రి గ మ ప గ రి స రి 
ప ద ప మ గ మ గ రి గ రి 
రి గ మ ప గ 

ఒక్క అడుగైనా వేసి చూడందే
వద్దకొచ్చేనా కలల తీరమే 
ఒక్క కలనైనా 
నిజము చేయందే
నిదుర పోనందే గెలుపు ఖాయమే
స్వేచ్ఛ అంటే అర్థం
ఏ కుక్క పిల్లో కాదు 
కోరుకున్న నిజము ఎగిరి వెళ్లిపోదామే

రయ్యి రయ్యిమంటూ
రెక్క విప్పుకుంటూ
వచ్చి వాలెనే మనసు సొంత గూటిలో

ఘల్లు ఘల్లు మంటూ 
గుండె ఝల్లుమంటూ
అడుగులేసేనే స్వరాల కొత్త బాటలో

హ ఆ ఆఆ… దారి చూపించే
వెలుగు వెంటుంటే
కారు చీకట్లో ఎన్నెన్ని కాంతులొ 
బొమ్మ గీయించి కుంచె తోడుంటే
రేయిని సైతం ఎన్నెన్ని రంగులో
చెలిమి అంటే అర్థం పరిచయాలు కాదు
తోడు నీడ కాలి నడకలో పరుగులు 

రయ్యి రయ్యిమంటూ
రెక్క విప్పుకుంటూ
వచ్చి వాలెనే మనసు సొంత గూటిలో

ఓ ఓహోహో .. ఘల్లు ఘల్లు మంటూ 
గుండె ఝల్లుమంటూ
అడుగులేసేనే స్వరాల కొత్త బాటలో




లైఫ్ ఇస్ అ రెయిన్ బో  పాట సాహిత్యం

 
చిత్రం: ఉన్నది ఒక్కటే జిందగి (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: యాజిన్ నిజార్ , ప్రియ హిమేష్

యల్లో అంటే స్వేచ్చా 
ఆరెంజ్ అంటే ఆశా 
బ్లూ అంటే సంతోషం 
రెడ్ అంటే ఆవేసం 
గ్రీన్ అంటే ప్రసాంతం 
వైలెట్ అంటే పంతం 
ఇండిగో ప్రేమల సిద్దాంతం 
రంగులన్ని చల్లిన కాగితం జీవితం 

లైఫ్ ఇస్ అ రెయిన్.బో 
రంగుల్లో రంగైపో 
ల్లైఫ్ ఇస్ అ రెయిన్.బో 
రంగుల్లో రంగైపో 

గయ్స్ టునైట్ ఐయాం గోఇంగ్ టూ 
ఇంట్రడ్యూస్ టూ యూ ఆల్ బ్యుటిఫుల్ వాఇస్ 
హూ’స్ గోన్న రాక్ యు 
లేడీస్ అండ్ జెంటిల్మెన్ 
ప్లీస్ వెల్కం మహా 

హా ఆ ఆ ఆ ఆ మేఘంలాగ మొదలైంది 
నాలోని రాగం 
గాలే వచ్చి కదిలించింది 
ఓ తీపి స్నేహం 

మెరుపయ్యింది ఉరుమయ్యింది 
ఇన్నాల్ల మౌనం 
వానయ్యింది వరదయ్యింది 
ఈ నాటి గానం 

నా పాటె ఓ వానై వస్తే 
మీరంత ఓ వెలుగై ఉంటే 
హెయ్ నా పాటె ఓ వానై వస్తే 
మీరంత ఓ వెలుగై ఉంటే 
వాన వెలుగు కలిసిన వేల 
ఆనందాల హరివిల్లె రాదా 

లైఫ్ ఇస్ అ రెయిన్.బో 
రంగుల్లో రంగైపో 
ల్లైఫ్ ఇస్ అ రెయిన్.బో 
రంగుల్లో రంగైపో 

హా..ఆ..మాటె తీయ్యని పాటవుతుంది 
స్వరమే తోడుంటే 
భాదే చివరకి బలమౌతుంది 
చెలిమే తోడుంటే 

హోయ్ కడలే ఎగసే అలలవుతుంది 
కలలే తోడుంటే 
కలలే కంటె నిజమౌతుంది 
తపనే తోడుంటే 

నమ్మకమే నీ తోడై ఉంటే 
అరె నిమిషాలన్నీ నిచ్చెన కావా 
హొ హో నమ్మకమే నీ తోడై ఉంటే 
నిమిషాలన్ని నిచ్చన కావా 
చిరునవ్వే తోడై ఉంటే 
నీ చిరునామ హరివిల్లే కాదా 

లైఫ్ ఇస్ అ రెయిన్.బో 
రంగుల్లో రంగైపో 
ల్లైఫ్ ఇస్ అ రెయిన్.బో 
రంగుల్లో రంగైపో



ఉన్నది ఒకటే జిందగీ పాట సాహిత్యం

 
చిత్రం: ఉన్నది ఒక్కటే జిందగి (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: సాగర్

ఎవరెస్ట్ హైటే చాలదే ఓ..
పసిఫిక్ లోతే చెల్లదే ఓ...
కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు
మనసులో స్మైలుకు  ఓ స్కేల్ ఎందుకు

ఎవరెస్ట్ హైటే చాలదే ఓ..
పసిఫిక్ లోతే చెల్లదే ఓ...
కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు
మనసులో స్మైలుకు  ఓ స్కేల్ ఎందుకు
అర్  ఎక్సయిట్మెంట్  ఎగ్జామ్పులై పద ముందుకు 

ఉన్నది ఒకటే జిందగీ 
చూసేద్దాం దాని సంగతి 
ఉన్నది ఒకటే జిందగీ 
చూసేద్దాం దాని సంగతి 

లైఫే ఒక పాఠశాల 
కష్టం నష్టం మన బెంచ్ మేట్సే
ఎన్నో అనుభవాల 
మన పయనాలే మొత్తం బెంచ్ మర్క్స్
చిరు చిరు గొడవల పిడుగుల వానొచ్చినా 
మన చెలిమను గొడుగును దాటొచ్చునా
మన అడుగుల కలిపిన ఓ నిచ్చెనే స్నేహం హం హం హం
ఒడి దుడుకుల్లో రైడింగ్ చేసే రంగు రంగు సైకిల్ లాగా 

ఉన్నది ఒకటే జిందగీ 
చూసేద్దాం దాని సంగతి 
ఉన్నది ఒకటే జిందగీ 
చూసేద్దాం దాని సంగతి

కడదాం ఓ కొత్త కంట్రీ 
స్నేహం కోసం ఖండాలు దాటి 
పెడదాం ఓ కొత్త పార్టీ 
ఫ్రెండ్షిప్పంటూ మరి పేరు పెట్టి 
డేట్ అఫ్ బర్త్ ని మార్చే వీలుండదే 
మన జర్నీ ఎండ్ కి డేటుండదే 
నడి మధ్యలో లైఫ్ ని గిఫ్ట్ గ ఫీలవుదాం ధామ్ ధామ్
ఆ గిఫ్ట్ ని ఇచ్చే ఫ్రెండ్ తో కలిసి జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం 

ఉన్నది ఒకటే జిందగీ 
చూసేద్దాం దాని సంగతి 
ఉన్నది ఒకటే జిందగీ 
చూసేద్దాం దాని సంగతి

Palli Balakrishna Saturday, September 2, 2017



చిత్రం: వారసుడొచ్చాడు (1988)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: వెంకటేష్, సుహాసిని, మాలశ్రీ, మోహన్ బాబు
దర్శకత్వం: ఎ.మోహన్ గాంధి
నిర్మాత: స్రవంతి రవికిశోర్
విడుదల తేది: 03.10.1988



Songs List:



నీ అందం నా ప్రేమ గీత పాట సాహిత్యం

 
చిత్రం: వారసుడొచ్చాడు (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
నీ అందం నా ప్రేమ గీత గోవిందం
నీ వర్ణం నా కీరవాణి సంకేతం 
నీ రాగం ఏ ప్రేమ వీణ సంగీతం
ఈ యోగం ఏ జీవధార సంయోగం 
వయ్యారి రూపం.. గాంధార శిల్పం.. శృంగార దీపం వెలిగిస్తే
నీ చూపు కోణం సంధించు బాణం నా లేత ప్రాణం వేధిస్తే

నీ అందం నా ప్రేమ గీత గోవిందం
ఈ యోగం ఏ జీవధార సంయోగం

చరణం: 1
జీరాడు కుచ్చిళ్ళ పారాడు పాదాల పారాణి వేదాలు గమకించగా
కోరాడు మీసాల తారాడు మోసాల నా మందహాసాలు చమకించగా
ఆరారు ఋతువుల్లో అల్లారు ముద్దుల్లో ఎదజంట తాళాలు వినిపించగా
ఆషాడ మేఘాల ఆవేశ గీతాలు సరికొత్త బావాలు సవరించగా 

నీ కోసమే ఈడు నేను వేచాములే
నీ కోసమే నాలో నన్నే దాచానులే
నిను పిలిచాను మలిసంధ్య పేరంటం
ఇక మొదలాయే పొదరింటి పోరాటం ఆరాటం

నీ అందం నా ప్రేమ గీత గోవిందం
ఈ యోగం ఏ జీవధార సంయోగం

చరణం: 2
హంసల్లె వచ్చింది హింసల్లె గిచ్చింది నీ నవ్వు నా పువ్వు వికసించగా
మాటల్లే వచ్చింది మనసేదో విప్పింది వద్దన్నా నీ మాట వలపించగా
రెప్పల్లొ కొచ్చింది రేపల్లె కాళింది నా నువ్వు నీ నేను క్రీడించగా
గాదల్లొ నిదరోయీ రాధమ్మ లేచింది నా వేణువె నాకు వినిపించగా 

నీ పించమే కిలకించితాలు చేసిందిలే
నా కోసమే ఈ పారిజాతం పూసిందిలే
మన హృదయాలలో ప్రేమ తారంగం
స్వరబృందా విహారాల కుందేటి ఆనందం

నీ రాగం ఏ ప్రేమ వీణ సంగీతం
ఈ యోగం ఏ జీవధార సంయోగం
వయ్యారి రూపం గాంధార శిల్పం శృంగార దీపం వెలిగిస్తే
నీ చూపు కోణం సంధించు బాణం నా లేత ప్రాణం వేధిస్తే
నీ అందం నా ప్రేమ గీత గోవిందం
ఈ యోగం ఏ జీవధార సంయోగం




పచ్చిపాల పాట సాహిత్యం

 
చిత్రం: వారసుడొచ్చాడు (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వెన్నలకంటి 
గానం: చిత్ర, యస్.పి.శైలజ

పచ్చిపాల 




గుజ్జన గుడి పాట సాహిత్యం

 
చిత్రం: వారసుడొచ్చాడు (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, చిత్ర

గుజ్జన గుడి 




చెంప దెబ్బ పాట సాహిత్యం

 
చిత్రం: వారసుడొచ్చాడు (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు

చెంప దెబ్బ 




జాం జనకు జనకు పాట సాహిత్యం

 
చిత్రం: వారసుడొచ్చాడు (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, యస్.పి.సుశీల 

జాం జనకు జనకు 



యాలద్రి వెంకన్న పాట సాహిత్యం

 
చిత్రం: వారసుడొచ్చాడు (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: జాలాది 
గానం: యస్.పి.బాలు

యాలద్రి వెంకన్న 

Palli Balakrishna Friday, September 1, 2017



చిత్రం: మహర్షి (1987)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: రాఘవ , నిశాంతి (శాంతి ప్రియ)
మాటలు: తనికెళ్ళ భరణి 
దర్శకత్వం: వంశీ
నిర్మాత: స్రవంతి రవికిశోర్
విడుదల తేది: 31.12.1987



Songs List:



ఊర్వశి గ్లౌం భా పాట సాహిత్యం

 
చిత్రం: మహర్షి (1987)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: జొన్నవిత్తుల 
గానం: యస్.పి.బాలు,  చిత్ర 

ఊర్వశి  గ్లౌం భా ప్రేయశి హ్రీం మా  (2)

అస్మత్ విద్వత్ విద్యుత్ దీపిక త్వంయేవ 
రసవత్ విలసత్ విభవత్ గీతిక త్వంయేవ (2)

ఊర్వశి గ్లౌం భా ప్రేయశి హ్రీం మా

లసత్ చమత్క్రుతి నటత్ ప్రతిద్యుతి ఘనత్ హరిత్మని త్వంయేవ
షుంబద్ ప్రమోద ఝుంబద్ ప్రవాహ ధవళ గగనధుని త్వంయేవ
లసత్ చమత్క్రుతి నటత్ ప్రతిద్యుతి ఘనత్ హరిత్మని త్వంయేవ
షుంబద్ ప్రమోద ఝుంబద్ ప్రవాహ ధవళ గగనధుని త్వంయేవ

అస్మత్ విద్వత్ విద్యుత్ దీపిక త్వంయేవ
రసవత్ విలసత్ విభవత్ గీతిక త్వంయేవ (2)

త్వంయేవ త్వంయేవ ఏవ 

ఊర్వశి గ్లౌం భా ప్రేయశి హ్రీం మా (2)

భజే భజే భజరే భజే భజే – భజే భజే భజరే భజే భజే

భజరే భజించరే – జపరే జపించరే (2)
భజ భజ భజ భజ – జప జప జప జప (2)

నమ్రామ్రద్రుమ థమ్రణవోద్యమ స్వరభుత్సుకసఖి త్వంయేవ
నికట ప్రకట ఘట ఘటిత త్రిపుట స్పుట నినద నిదానం త్వంయేవ

అస్మత్ విద్వత్ విద్యుత్ దీపిక త్వంయేవ 
రసవత్ విలసత్ విభవత్ గీతిక త్వంయేవ (2)

త్వంయేవ త్వంయేవ ఏవ
ఊర్వశి గ్లౌం భా ప్రేయశి హ్రీం మా

ఊర్వశి గ్లౌం భా ప్రేయశి హ్రీం మా

అస్మత్ విద్వత్ విద్యుత్ దీపిక త్వంయేవ
రసవత్ విలసత్ విభవత్ గీతిక త్వంయేవ (2)

ఊర్వశి గ్లౌం భా ప్రేయశి హ్రీం మా (2)




సుమంప్రతి సుమం సుమం పాట సాహిత్యం

 
చిత్రం: మహర్షి (1987)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

తననాననాన తననాననాన

సుమంప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
సుమంప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
జగం అణువణువున కలకలహం
భానోదయాన చంద్రోదయాలు!!
సుమంప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం

హ హా... ఆ ఆ హ హ హ హా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

వేణువ వీణియ ఏవిటి నాదము??
వేణువ వీణియ ఏవిటి నాదము??
అచంచలం సుఖం మధుర మధురం
మయం హృదం తరం గిరిజ సురతం
ఈ వేళ నాలో రాగోల్లసాలు
ఈ వేళ నాలో రాగోల్లసాలు
కాదు మనసా... ఆ ఆ ప్రేమ మహిమా... నాదు హృదయం
భానోదయాన చంద్రోదయాలు!!

సుమంప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
హా తార రతార రతారా తార రతార రతార
హా ఆ ఆ ఆ

రంగులే రంగులు అంబరాలంతట
రంగులే రంగులు అంబరాలంతట!!
సగం నిజం సగం వరము అమరం
వరం వరం వరం చెలియ ప్రణయం
ఆ వేగమేదీ నాలోన లేదు
ఆ వేగమేదీ నాలోన లేదు
ప్రేమమయమూ... ఆ ఆ ప్రేమమయమూ నాదు హృదయం
భానోదయాన చంద్రోదయాలు!!

సుమంప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
సుమంప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
జగం అణువణువున కలకలహం
భానోదయాన చంద్రోదయాలు!!
సుమంప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం



మాటరాని మౌనమిది పాట సాహిత్యం

 
చిత్రం: మహర్షి (1987)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది
మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది
గానమిది నీ ధ్యానమిది ధ్యానములో నా ప్రాణమిది
ప్రాణమైన మూగగుండె రాగమిది
మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది
మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది

చరణం: 1
ముత్యాల పాటల్లో కోయిలమ్మా
ముద్దారబోసేది ఎప్పుడమ్మా
ఆ పాల నవ్వుల్లో వెన్నెలమ్మా
దీపాలు పెట్టేది ఎన్నడమ్మా
ఈ మౌన రాగాల ప్రేమావేశం
ఏనాడో ఒకరి సొంతం
ఆకాశ దీపాలు జాబిలి కోసం
నీకేలా ఇంత పంతం
నింగి నేలా కూడే వేళ నీకు నాకు దూరాలేలా
అందరాని కొమ్మ ఇది కొమ్మచాటు అందమిది

మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది

చరణం: 2
చైత్రాన కూసేను కోయిలమ్మా
గ్రీష్మానికా పాట ఎందుకమ్మా
రేయంతా నవ్వేను వెన్నెలమ్మా
నీరెండకా నవ్వు దేనికమ్మా
రాగాల తీగల్లో వీణా నాదం
కోరింది ప్రణయ వేదం
వేసారు గుండెల్లో రేగే గాయం
పాడింది మధుర గేయం
ఆకాశాన తారా తీరం అంతే లేని ఎంతో దూరం
మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది
అందరాని కొమ్మ ఇది కొమ్మచాటు అందమిది
దూరమిది జత కూడనిది
చూడనిది మది పాడనిది
చెప్పరాని చిక్కుముడి వీడనిది

మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది
అందరాని కొమ్మ ఇది కొమ్మచాటు అందమిది





సాహసం నా పథం పాట సాహిత్యం

 
చిత్రం: మహర్షి (1987)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

సాహసం నా పథం రాజసం నా రథం
సాగితే ఆపడం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం
కైవసం కావడం కష్టమా
లోకమే బానిసై చేయదా ఊడిగం
శాశనం దాటడం సఖ్యమా
నా పదగతిలో ఏ ప్రతి ఘటన ఈ పిడికిటిలో తానొదుగునుగా
సాహసం నా పథం రాజసం నా రథం
సాగితే ఆపడం సాధ్యమా

నిశ్చయం నిశ్చలం నిర్బయం నా హయాం హా

చరణం: 1
కానిదేముంది నే కోరుకుంటే బూని సాధించుకోనా
లాభమేముంది కలకాలముంటే కామితం తీరకుండా
తప్పనీ ఒప్పనీ తర్కమే చెయ్యను
కష్టమో నష్టమో లెక్కలే వెయ్యను
ఊరుకుంటే కాలమంతా జారిపోదా ఊహ వెంట
నే మనసు పడితే ఏ కళలనైనా
ఈ చిటిక కొడుతూ నే పిలవనా

సాహసం నా పథం రాజసం నా రథం
సాగితే ఆపడం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం
కైవసం కావడం కష్టమా

అదరనీ బెదరనీ ప్రవుత్తి ఒదగనీ మదగజమే మహర్షి

చరణం: 2
వేడితే లేడి ఒడి చేరుతుందా..వేట సాగాలి కాదా
ఓడితే జాలి చూపేన కాలం..కాలరాసేసి పోదా
అంతము సొంతము పంతమే వీడను
మందలో పందిలా ఉండనే ఉండను
భీరువల్లే పారిపోనూ..రేయి ఒళ్ళో దూరిపోను
నే మొదలుపెడితే ఏ సమరమైనా నా కెదురుపడునా ఏ అపజయం

సాహసం నా పథం రాజసం నా రథం
సాగితే ఆపడం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం
కైవసం కావడం కష్టమా
లోకమే బానిసై చేయదా ఊడిగం
శాశనం దాటడం సఖ్యమా
నా పదగతిలో ఏ ప్రతి ఘటన ఈ పిడికిటిలో తానొదుగునుగా
సాహసం నా పథం రాజసం నా రథం
సాగితే ఆపడం సాధ్యమా




కోనలో సన్న జాజిమల్లి పాట సాహిత్యం

 
చిత్రం: మహర్షి (1987)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

పల్లవి:
కోనలో సన్న జాజిమల్లి జాజిమల్లి
మేనులో పొన్న పూలవల్లి పాలవల్లి
వేణిలో కన్నె నాగమల్లి నాగమల్లి
తేరులో అనురాగవల్లి రాగవల్లి
కావ్యాలకే హో శ్రీకారమై హో
కస్తూరి తాంబూలమీవే
కోరుకో సన్న జాజిమల్లి జాజిమల్లి
ఏలుకో కన్నె సోకులన్నీ సోకులన్నీ
పాడుకో ప్రేమ కవితలన్నీ కవితలన్నీ
వేసుకో పాలబుగ్గపైన రంగవల్లి

చరణం: 1
మేని సోయగాలు ప్రేమ బంధనాలు
మౌన స్వాగతాలు రాగ రంజితాలు
సరసములో సమరములు సరసులకు సహజములు
ప్రాభావాలలోన నవ శోభనాలు జాణ
రాగదే రాగమై రాధవై

కోరుకో సన్న జాజిమల్లి జాజిమల్లి
ఏలుకో కన్నె సోకులన్నీ సోకులన్నీ
పాడుకో ప్రేమ కవితలన్నీ కవితలన్నీ
వేసుకో పాలబుగ్గపైన రంగవల్లి
రాగాలనే హోయ్ బోయిలతో హోయ్ మేఘాల మేనల్లో రానా
కోనలో సన్న జాజిమల్లి జాజిమల్లి
మేనులో పొన్న పూలవల్లి పాలవల్లి
వేణిలో కన్నె నాగమల్లి నాగమల్లి
తేరులో అనురాగవల్లి రాగవల్లి

చరణం: 2
కోయిలమ్మ రాగం కొండవాగు వేగం
పారిజాత సారం ఏకమైన రూపం
అధరముపై అరుణిమలు మధురిమకై మధనములు
నందనాలలోన రసమందిరాలలోన
హాయిగా సాగగ చేరగా

కోనలో సన్న జాజిమల్లి జాజిమల్లి
మేనులో పొన్న పూలవల్లి పాలవల్లి
వేణిలో కన్నె నాగమల్లి నాగమల్లి
తేరులో అనురాగవల్లి రాగవల్లి
కావ్యాలకే హో శ్రీకారమై హో
కస్తూరి తాంబూలమీవే
కోరుకో సన్న జాజిమల్లి జాజిమల్లి
ఏలుకో కన్నె సోకులన్నీ సోకులన్నీ
పాడుకో ప్రేమ కవితలన్నీ కవితలన్నీ
వేసుకో పాలబుగ్గపైన రంగవల్లి

Palli Balakrishna Tuesday, August 22, 2017


చిత్రం: నేను శైలజ (2016)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: సాగర్
నటీనటులు: రామ్, కీర్తి సురేష్, ప్రిన్స్, శ్రీముఖి
దర్శకత్వం: కిషోర్ తిరుమల
నిర్మాత: స్రవంతి రవికిశోర్
విడుదల తేది: 01.01.2016

నువ్వు నేను కలుసుకున్న చొటు‌ మారలేదు
బైక్ మీద రైయ్ మన్న రూటు మారలేదు
నీకు నాకు ఫేవరెట్టు స్పాట్ మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా

మనం కబురులాడుకున్న బీచ్ మారలేదు
మనవంక చూసి కుళ్ళుకున్న బాచ్ మారలేదు
మనం ఎక్కిదిగిన రైల్ కొచ్ మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా

ధియెటర్లో మన కార్నర్ సీటు మారలేదు
నీ మాటల్లో దాగిఉన్న స్వీట్ మారలేదు
నిన్ను దాచుకున్న హర్ట్ బీట్ మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా శైలజా

శైలజా శైలజా శైలజా శైలజా
గుండెల్లో కొట్టావే డోల్ బాజా
శైలజా శైలజా శైలజా శైలజా
నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజా
శైలజా శైలజా శైలజా శైలజా
గుండెల్లో కొట్టావే డోల్ బాజా
శైలజా శైలజా శైలజా శైలజా
నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజా

మా అమ్మ రోజువేసిపెట్టె అట్టు మారలేదు
మా నాన్న కొపమొస్తె తీట్టే తిట్టు మారలేదు
నెలవారి సామాన్ల లిస్టు మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా

వీధి కుళాయ్ దగ్గరేమొ ఫైట్ మారలేదు
నల్లరంగు పూసుకున్న నైట్ మారలేదు
పగలు వెలుగుతున్న స్ర్టీట్ లైట్ మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా

సమ్మర్ లో సుర్ మనె ఎండ మారలేదు
బాధలోన మందుతెచ్చే ఫ్రెండ్ మారలేదు
సాగదీసే సీరియల్స్ ట్రెండ్ మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా శైలజా

శైలజా శైలజా శైలజా శైలజా
గుండెల్లో కొట్టావే డోల్ బాజా
శైలజా శైలజా శైలజా శైలజా
నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజా

నీ ఫొటొని దాచుకున్న పర్స్ మారలేదు
నీ కోసం కొట్టుకొనే పల్స్ మారలేదు
నువ్వు ఎంతకాదు అన్న మనసు మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా
నీ స్ర్కీన్ సేవరెట్టుకున్న ఫోను మారలేదు
నీకిష్టమయిన ఐస్ క్రీమ్ కోన్ మారలేదు
నీ మీద ఆశ పెంచుకున్న నేను మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా

బ్రాంది విస్కీ రమ్ములొన కిక్కు మారలేదు
ఈస్టు వెస్టు నార్త్ సౌతు దిక్కు మారలేదు
ప్రేమ ప్యార్ మహబ్బత్ ఇష్క్ మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా శైలజా

శైలజా శైలజా శైలజా శైలజా
గుండెల్లో కొట్టావే డోల్ బాజా
శైలజా శైలజా శైలజా శైలజా
నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజా


********  *******   ********


చిత్రం: నేను శైలజ (2016)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి
గానం: పృథ్వీచంద్ర

కాంపౌండ్ వాల్ ఎక్కి ఫోను మాట్లాడుతుంటే
చైనా వాల్ ఎక్కి మూను తాకినట్టుందే

మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే
మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సేల్ఫీ దిగినట్టుందే

ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్

రోడ్ సైడ్ నీతోటి పానిపూరీ తింటుంటే
ప్లేట్ కి కోటైనా చీప్ అనిపిస్తుందే
నీ షర్ట్ బాగుందని ఓ మాటే నువ్వంటే
కుట్టిన వాడికి గుడి కట్టాలనిపిస్తుందే

క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్

నిన్న మొన్న దాక సూపర్ అన్న ఫిగరే
నిన్ను చూసినాక సో సో గుందే
రోజు నన్ను మోసే నా బ్యాచిలర్ బైకే
నువ్వు ఎక్కినాక  ఐ యామ్ హ్యాపీ అందే
రాంగ్ రూట్ అంటూ కేసు రాసి ఎస్సై
పేరు చెప్పమంటే గంటట్టిందే
నిన్ను నాతో చూసి బాయ్స్ లోన జలసి
పెరుగుతుంటే ఆస్కార్  విన్ అయినట్టుందే
సారీ హరి  నో అన్న అమ్మాయిలందరినీ
వీకెండ్ పార్టీ కి పిలవాలని ఉందే
ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మన ఇద్దరి ఫ్యూచర్ ని
ఐమాక్స్ లో వాళ్ళకి షో వెయ్యాలని వుందే

క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
బేబీ నీకు నాకు మధ్య లవ్ డీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
బేబీ నీకు నాకు మధ్య లవ్ డీలింగ్


********  *******   ********


చిత్రం: నేను శైలజ (2016)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర

నా మనసున చోటు చిన్నది
ఒక వరమే కోరుకున్నది
అడగకనే చేరుకుంది మది మోయలేని అనుబంధమై అది
నువు ఇచ్చిన సంపదే ఇది
నా చుట్టు అల్లుకున్నది
నిను కూడా నిలిపి ఉంచగల వీలు లేని ఇరుకైనది
సుదూరమైన ఆశలెన్నొ చేరువౌతు ఉన్నా
అవందుకోను నిన్ను వీడి నే వెళ్ళనా
పొందేదేదో పోతున్నదెదో తేల్చేదెవ్వరు
ఈ ప్రేమకీ ఏవిటి వేడుక
ఏ జన్మకీ జంటగా ఉండక


********  *******   ********


చిత్రం: నేను శైలజ (2016)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తిక్

ఏం చెప్పను నిన్నెలా ఆపను
ఓ ప్రాణమా నిన్నెలా వదలను
ఏ ప్రశ్నను ఎవరినేం అడగను
ఓ మౌనమా నిన్నెలా దాటను
పెదాల పైన నవ్వు పూత పూసుకున్న నేనే
కన్నీటితో ఈవేళ దాన్నెలా చెరపను
తన జ్ఞాపకమైన తగదని మనసునెలా మార్చాను
ఈ ప్రేమకి ఏవిటి వేడుక
ఏ జన్మకి జంటగా ఉండక

ఏం చెప్పను నిన్నెలా ఆపను
ఓ ప్రాణమా నిన్నెలా వదలను

ఇదివరకలవాటు లేనిది
మనసుకి ఈ మమత కొత్తది
దొరకక దొరికింది గనుక చేయి జారుతుంటే ఎం తోచకున్నది
ఊరించిన నిలిమబ్బుని ఉహించని గాలి తాకిడి
ఎటువైపో తరుముతుంటే కళ్ళార చూస్తూ ఎల్లా మరి
ఎడారి వైపు వెళ్లకంటూ ఆపి వాన చెలిని
తడారుతున్న గుండెలోకి రా రమ్మని
తన వెంటపడి ఇటు తిసుకురాలేవా ఉపిరి

ఈ ప్రేమకి ఏవిటి వేడుకా
ఏ జన్మకి జంటగా ఉండక

నా మనసున చోటు చిన్నది
ఒక వరమే కోరుకున్నది
అడగకనే చేరుకుంది మది మోయలేని అనుభందమై అది
నువ్విచ్చిన సంపదే ఇది
నా చుట్టూ అల్లుకున్నది
నిను కూడా నిలిపి ఉంచగల వీలులేని ఇరుకైనది
సుదూరమైన ఆశలెన్నొ చేరువవుతు ఉన్నా
అవందుకోనూ నిన్ను వీడి నే వెళ్ళనా
పొందేది ఎదో పోతున్నదెదో తెల్చేదేవ్వరు

ఈ ప్రేమకి ఏవిటి వేడుకా
ఏ జన్మకి జంటగా ఉండక



Palli Balakrishna Tuesday, August 1, 2017
Ladies Tailor (1986) Telugu Songs Lyrics Album Cover

Ladies Tailor (1986) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Ladies Tailor (1986)
Banner : Sri Sravanthi Movies
Music : Ilaiyaraaja
Director : Vamsy
Producer : K. Sarada Devi, Sravanthi Ravi Kishore
Actors : Rajendra Prasad
Actresses : Archana
Release Date : 4 December 1986

Porapatidhi Song Lyrics in Telugu – Ladies Tailor (1986)

'Porapatidhi' song from Ladies Tailor (1986) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam, S. Janaki and Rajendra Prasad. Lyrics are written by Sirivennela Seetharama Sastry.

SONG INFORMATION
Movie : Ladies Tailor (1986)
Music : Ilaiyaraaja
చిత్రం: లేడీస్ టైలర్ (1986) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి, శ్రీరామచంద్ర పొరబాటిది తటబాటిది గుంజీలేతీసెయ్యనా పొరబాటిది తటబాటిది గుంజీలేతీసెయ్యనా ఏదో పాపం పసివాణ్ణి జాలిచూపి వదలండి మన్నించండి అతి తెలివితో మతిపోయేనా నీ వేషం నాముందరా అతి తెలివితో మతిపోయేనా నీ వేషం నాముందరా వలను కొరికే చేప నేను... ఎరను చూసి మోసపోను వెకిలివేషాలు ముదిరిపోతేను అసలు పాఠాలు నేర్పగా యముడిలా వాడు వెనక వున్నాడు తెలుసునా తెలియజెప్పనా వద్దు వద్దు బాబోయ్ తప్పుకాయ్ తల్లోయ్ చెంపలేసుకుంటా గోడకుర్చీ వేస్తా మొన్ననే నేను కళ్ళుతెరిచాను ఇంతలో నన్ను బూచాడికి ఇచ్చెయకు అతి తెలివితో మతిపోయేనా నీ వేషం నాముందరా అతి తెలివితో మతిపోయేనా నీ వేషం నాముందరా పోని పాపం అనుకుంటే తనువే ముదిరిందే మరియాదేనా పొరబాటిది తటబాటిది గుంజీలేతీసెయ్యనా విలువ తెలిసే వెతికి చేరా బ్రతుకు నీతో ముడినివేసా దరికి చేరాను వరము వేడాను కరుణతో దారి చూపవా మనసులో మాట తెలుసుకోవమ్మా చెలిమితో కలిమి కురియవా చిన్నవాడ నిన్ను నమ్ముతాను లేవోయి అల్లరెందుకు ఇంకా పల్లకిని తేవోయి కోతివేషాలు మానితే చాలు నిన్ను వెన్నంటే వుంటాను ఏనాడు పొరబాటిది తటబాటిది గుంజీలేతీసెయ్యనా పొరబాటిది తటబాటిది గుంజీలేతీసెయ్యనా ఏదో పాపం పసివాణ్ణి జాలిచూపి వదలండి మన్నించండి అతి తెలివితో మతిపోయేనా నీ వేషం నాముందరా అతి తెలివితో మతిపోయేనా నీ వేషం నాముందరా

Gopilola Song Lyrics in Telugu – Ladies Tailor (1986)

'Gopilola' song from Ladies Tailor (1986) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam and S. P. Sailaja. Lyrics are written by Sirivennela Seetharama Sastry.

SONG INFORMATION
Movie : Ladies Tailor (1986)
Music : Ilaiyaraaja
చిత్రం: లేడీస్ టైలర్ (1986) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల గోపీలోల నీ పాల పడ్డమురా లీలాలొల అల్లాడుతున్నామురా చన్నీరులో వున్నామురా చిన్నారులం మన్నించరా భామా భామా తీరాన్ని చేరాలమ్మా పరువేకోరి చెయ్యేత్తి మొక్కలమ్మా అందాక మీ అందాలకు ఆ దిక్కులే దిక్కమ్మాలు గోపీలోల నీ పాల పడ్డమురా లీలాలొల అల్లాడుతున్నామురా చన్నీరులో వున్నామురా చిన్నారులం మన్నించరా భామా భామా తీరాన్ని చేరాలమ్మా పరువేకోరి చెయ్యేత్తి మొక్కలమ్మా అందాక మీ అందాలకు ఆ దిక్కులే దిక్కమ్మాలు చరణం: 1 కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా మచ్చ మచ్చ  మచ్చ  మచ్చ కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా జాలిమాలిన ఈగాలి తేరిపార చూసి చిందేసే ఇలా మావిమాటున దాగుంటే కూతవేసి గువ్వలు నవ్వే గోలా తరుణిలో కరుణతో మోక్షంచూపే కిరణమై నిలిచానే తనువులో పుట్టేమాయను తెలుపగా పిలిచానే మోక్షం కన్న మానం మిన్న   గోపీలోల నీ పాల పడ్డమురా లీలాలొల అల్లాడుతున్నామురా చరణం: 2 వాడిపోని సిరులెన్నో పూలుపూచేటి కొమ్మ రెమ్మ గుమ్మ నేనుకోరే ఆ తార ఏది మీలోన భామా భామా  భామా  తగదురా ఇది మరి చోద్యంకాదా సొగసరి గోవిందా అందరు నీవారేగా ఒకరితో ముడివుందా చూసే కలలు ఎన్నో ఉన్నా చూపే హృదయం ఒకటే ఉందమ్మా  గోపీలోల నీ పాల పడ్డమురా లీలాలొల అల్లాడుతున్నామురా చన్నీరులో వున్నామురా చిన్నారులం మన్నించరా భామా భామా తీరాన్ని చేరాలమ్మా పరువేకోరి చెయ్యేత్తి మొక్కలమ్మా అందాక మీ అందాలకు ఆ దిక్కులే దిక్కమ్మాలు

Hayamma Hayamma Song Lyrics in Telugu – Ladies Tailor (1986)

'Hayamma Hayamma' song from Ladies Tailor (1986) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam and S. Janaki. Lyrics are written by Sirivennela Seetharama Sastry.

SONG INFORMATION
Movie : Ladies Tailor (1986)
Music : Ilaiyaraaja
చిత్రం: లేడీస్ టైలర్ (1986) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి హాయమ్మా హాయమ్మా హాయమ్మా  (4) అందాల బంధంలో వుందామా ఆనందం అందుకుందామా బంగారు స్వప్నాలు కందమా కౌగిళ్ళు పంచుకుందామా ఓయమ్మా ఓయమ్మా  ఓయమ్మా  (4) సింగారి గంగల్లే పొంగెను కంగారై గుండె కుంగెను శృంగార రంగాన చిక్కెను రంగేళి నీకే దక్కెను చరణం: 1 దరహాసమై నీ అధరాలపైనే ఉండమ్మా ఉండమ్మా ఉండమ్మా చిరవాసముండే సరళాక్షి నేనే ఔనమ్మా ఔనమ్మా  ఔనమ్మా  నను చూడు సయ్యమ్మ సయ్యమ్మ మనువాడు సయ్యమ్మ సయ్యమ్మ అలివేణి నాదమ్మ నాదమ్మ కలవాణి  నీవమ్మ నీవమ్మ నీనుగానే ఎదనదిలో అలజడి ఏదో సుడితిరిగే నీవే జతవైతే కల తీరేను ఈవేళ "హాయమ్మా" చరణం: 2 మదిలోని బాల ఎదురైన వేళ  హాయమ్మా హాయమ్మా హాయమ్మా పదహారువేళ మదిరాచులేలా హాయమ్మా హాయమ్మా హాయమ్మా మురిపాలు హాయమ్మా హాయమ్మా సరదాలు హాయమ్మా హాయమ్మా సరసాలు హాయమ్మా హాయమ్మా సగపాలు హాయమ్మా హాయమ్మా తరుణం నిన్నే పిలిచేనురా తరుణం నేడే కుదిరేనురా ఏడు జన్మాల నీ జోడు నేనేరా  "హాయమ్మా"

Ekkada Ekkada Song Lyrics in Telugu – Ladies Tailor (1986)

'Ekkada Ekkada' song from Ladies Tailor (1986) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam and S. P. Sailaja. Lyrics are written by Sirivennela Seetharama Sastry.

SONG INFORMATION
Movie : Ladies Tailor (1986)
Music : Ilaiyaraaja
చిత్రం: లేడీస్ టైలర్ (1986) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్క ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవే తప్పున చక్కగ టక్కున టక్కరి పిట్టా నిన్ను పట్టే దెట్టా మచ్చున భామా - కనులకు కనరావా ఉన్నాను రావా - నలు చెరుగుల తిరుగుదు మరి ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్క ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవే తప్పున చక్కగ టక్కున టక్కరి పిట్టా నిన్ను పట్టే దెట్టా ఆకారం చూస్తే సరిపోదంటా  ఒకటే గురుతూ తెలిసేదెట్టా ఆకారం చూస్తే సరిపోదంటా ఒకటే గురుతూ తెలిసేదెట్టా ఈ మందలో ఏ సుందరో తీయాలిలే కూపీ ఈ మందలో ఏ సుందరో తీయాలిలే కూపీ గుట్టు మట్టు చేసీ - పుట్టు మచ్చను చూసీ టక్కున పట్టేయ్యాలి - నక్కను తొక్కేయ్యాలి పొరబడి పరులకు దొరకక ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్క ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవే తప్పున చక్కగ టక్కున టక్కరి పిట్టా నిన్ను పట్టే దెట్టా మచ్చున భామా - కనులకు కనరావా ఉన్నాను రావా - నలు చెరుగుల తిరుగుదు మరి ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్క ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవే తప్పున చక్కగ టక్కున టక్కరి పిట్టా నిన్ను పట్టే దెట్టా శ్రీదేవి వాణి పశుపతి రాణి ఎదురై నిలిచే సమయము లేనా శ్రీదేవి వాణి పశుపతి రాణి ఎదురై నిలిచే సమయము లేనా ఎల్లాగనీ గుర్తించనూ శ్రీదేవినీ ఆ దేవిని ఎల్లాగనీ గుర్తించనూ నా దేవి ఏదో గుర్తులు గుట్టుగ దాచి - అల్లరి పెట్టే వేళ ఎవ్వరి నవ్వులు నమ్మను - గుండెను ఎవ్వరికివ్వను హరి హరి ఇకమరి పని సరి ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్క ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవే తప్పున చక్కగ టక్కున టక్కరి పిట్టా నిన్ను పట్టే దెట్టా మచ్చున భామా - కనులకు కనరావా ఉన్నాను రావా - నలు చెరుగుల తిరుగుదు మరి

Vetaadande Olokochchi Song Lyrics in Telugu – Ladies Tailor (1986)

'Vetaadande Olokochchi' song from Ladies Tailor (1986) movie is composed by Ilaiyaraaja and sung by Mano and Chorus. Lyrics are written by Sirivennela Seetharama Sastry.

SONG INFORMATION
Movie : Ladies Tailor (1986)
Music : Ilaiyaraaja
Singers : Mano, Chorus
చిత్రం: లేడీస్ టైలర్ (1986) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: మనో & కోరస్ వేటాడందే ఒళ్లోకొచ్చి చేప చేరదు రెక్కాడందే గూటిలోకి కూడు చేరదు తెల్లారాక ఏ కొట్టు కునుకు తీయదు గింజా గింజా ఎరందే పూట తీరదు ఓ గురువా సోమరిగా ఉంటె ఎలా బద్దకమే ఈ జన్మకు వదిలిపోదా

Palli Balakrishna Monday, July 31, 2017



చిత్రం: గణేష్ (2009)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (All Songs)
నటీనటులు: రామ్ పోతినేని, కాజల్
దర్శకత్వం: యమ్. శరవణన్
నిర్మాత: స్రవంతి రవికిషోర్
విడుదల తేది: 24.09.2009



Songs List:



తనేమందో పాట సాహిత్యం

 
చిత్రం: గణేష్ (2009)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: జావేద్ అలీ, అజీష్ మిక్స్

ఇవ్వాళ నాకు చాలా హ్యాపీగా ఉంది
లైఫంతా నాతో ఇలాగే ఉంటావా?

తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా
మదేం విందో విందోలేదో కలేం కాదే ఇదంతా
ఇంతలోనే అంత మైకం పనికిరాదే ప్రాణమా
పరవశంలో మునిగిపోతే పైకి రాగలమా

తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా
మదేం విందో విందోలేదో కలేం కాదే ఇదంతా

కుడివైపున ఇంకో హృదయం ఉన్నా సరిపోదో ఏమో
ఈ వెలుగును దాచాలంటే...
పడమరలో నైనా ఉదయం ఈ రోజే చూసానేమో
మనసంతా ప్రేమైపోతే...
ఎగిరొచ్చిన ఏదో లోకం నా చుట్టు వెలిసిందేమో
మైమరపున నే నిలుచుంటే...
ఇంతలోనే అంత మైకం పనికిరాదే ప్రాణమా
పరవశంలో మునిగిపోతే పైకి రాగలమా

తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా
మదేం విందో విందోలేదో కలేం కాదే ఇదంతా

ఇదే క్షణం శిలై నిలవనీ
సదా మనం ఇలా మిగలనీ
జన్మంటే ఇదంటూ తెలీదే ఇన్నాళ్ళు
నీ జంటై ఇవ్వాళే జీవించా నూరేళ్ళు
తనేమందో... మదేం విందో...

తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా
మదేం విందో విందో లేదో కలేం కాదే ఇదంతా
ఇంతలోనే అంత మైకం పనికిరాదే ప్రాణమా
పరవశంలో మునిగిపోతే పైకి రాగలమా

తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా
మదేం విందో విందో లేదో కలేం కాదే ఇదంతా




లల్ల లాయి పాట సాహిత్యం

 
చిత్రం: గణేష్ (2009)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: కృష్ణ చైతన్య , శ్వేతా పండిట్

లల్ల లాయి



ఎలెయ్ ఎలెయ్ పాట సాహిత్యం

 
చిత్రం: గణేష్ (2009)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: శ్రీ మధుమిత 

ఎలెయ్ ఎలెయ్ ఎలెయ్ ఏలే ఎల్లెలెయ్
తెలిసిన మాటే నువ్వఅంటుంటే
మల్లి కొత్తగా వింటున్న
కలగన్నట్టే నిజమైనదంటే
చాలా సంబరపడుతున్న

చూస్తూ చూస్తూనే నవ్వే మువ్వయ్ పోతున్న
అరెరే ఆలోచిస్తూనే నేనే నువ్వయి పోతున్న

చినుకయినా తడిలేని వాన వాన
మనసంతా కురిసేన ఈ సమయాన
హరివిలై కనిపించే నా నీడైన
తనువంతా వణికింది ఆనందాన

ఎలెయ్ ఎలెయ్ ఎలెయ్ ఏలే ఎల్లెలెయ్
ఎలెయ్ ఎలెయ్ ఎలెయ్ ఏలే ఎల్లెలెయ్

నేనింతగా ఎప్పుడైనా కేరింతలో మునిగానా
ఎం చిత్రమై కదిలించావిలా ఓ ఓ ఓ
నీ సందడే ఎదలోనా వేయింతలై పెరిగేనా
గాల్లో ఇలా పరుగయిందలా

ననన ననన ననన ననన నాననాననననానా
ననన ననన ననన ననన నాననాననననానా

తెలిసిన మాటే నువ్వుంటుంటే
మల్లి కొత్తగా వింటున్న
కలగన్నట్టే నిజమైనదంటే
చాలా సంబరపడుతున్న

య మే బి వెన్ ఐ సి ది అయిస్
ది ఫీలింగ్ ఇస్ స్ట్రాంగ్
ఐ ఫీల్ యువర్ లవ్
టూ షో వాట్ ఐ సే

ఎలెయ్ ఎలెయ్ యః

ఆకాశమై ఇకపైన నా లోకమే నీ పైన
నీ మెరుపుకే మెరుపందించేనా ఓ ఓ ఓ
ఏ మాయలో నేనున్నా ఏ మాట నేనంటున్న
నా స్వరముగా ప్రేమే పలికేనా

ఎలెయ్ ఎలెయ్ ఎలెయ్ ఏలే ఎల్లెలెయ్

ననన ననన ననన ననన నాననాననననానా

తెలిసిన మాటే నువ్వఅంటుంటే
మల్లి కొత్తగా వింటున్న
కలగన్నట్టే నిజమెదురైతే
చాలా సంబరపడుతున్న
చూస్తూ చూస్తూనే నవ్వే మువ్వయ్ పోతున్న
అరెరే ఆలోచిస్తూనే నేనే నువ్వయి పోతున్న

చినుకయినా తడిలేని వాన వాన
మనసంతా కురిసేన ఈ సమయాన
హరివిలై కనిపించే నా నీడైన
తనువంతా వణికింది ఆనందాన

ఎలెయ్ ఎలెయ్ ఎలెయ్ ఏలే ఎల్లెలెయ్
ఎలెయ్ ఎలెయ్ ఎలెయ్ ఏలే ఎల్లెలెయ్




రాజకుమారి పాట సాహిత్యం

 
చిత్రం: గణేష్ (2009)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం:  కునాల్ గంజవాల,  శ్రీ మధుమిత 

రాజకుమారి 



చలోరే పాట సాహిత్యం

 
చిత్రం: గణేష్ (2009)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం:  కార్తీక్ & కిడ్స్ కోరస్ 

చలోరే 



రాజా మహారాజా పాట సాహిత్యం

 
చిత్రం: గణేష్ (2009)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం:  రంజిత్ 

రాజా మహారాజా

Palli Balakrishna Saturday, July 29, 2017



చిత్రం: ఎలా చెప్పను (2003)
సంగీతం: కోటి
నటీనటులు: తరుణ్ , శ్రేయ శరన్
దర్శకత్వం: బి.వి.రమణ
నిర్మాత: స్రవంతి రవికిశోర్
విడుదల తేది: 02.10.2003



Songs List:



రంగుల తారక పాట సాహిత్యం

 
చిత్రం: ఎలా చెప్పను (2003)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్, సుచిత్ర

Yes I am from bombay
come baby lets play
sing with me swing with me
dont you ever feel so

రంగుల తారక నింగిని ఆగక కిందికి జారినదా
ముంబై మేనక ముందరి కాళ్ళకి బంధము వేసినదా
తప్పు జరిగేలా తప్పటడుగేలా
సిగ్గు బెదిరేలా చిందులెయ్యాల

బంగరు బాలిక పొంగుల కానుక వద్దనరాదు కదా
సంగతి తేలక లొంగని కోరిక నిద్దరపోదు కదా
తట్టి పిలవాలా బెట్టు వదిలేలా జట్టు కలిపేలా చెట్టు దిగావేలా

ఎత్తులో పొడగరి కట్టులో పొదుపరి కాపలా చాలదే చిలిపి చిన్నారి
ఊహలో అలజడి ఉరకదే తదుపరి ఊరికే దేనికి మాట కచ్చేరి
చక్కదనం చూడమని ఉక్కిరి బిక్కిరి చెయ్యకిలా
మక్కువనే అణుచుకుని చక్కెర చేదంటే ఎలా
హెయ్ అందరు చేరి మందలా మారి చెయ్యరా చోరి బెదరదే పోరి హా

బంగరు బాలిక పొంగుల కానుక వద్దనరాదు కదా
సంగతి తేలక లొంగని కోరిక నిద్దరపోదు కదా

సొంపులే దోచుకో సొంతమే చేసుకో కాదని లేదని అడ్డు చెబుతానా
వద్దులే దాచుకో కొద్దిగా ఓర్చుకో వీధిలో విసరకే ఎంత బరువైనా
కన్నెదరే ఉంది కదా అడగని వరమై కన్నె ధనం
కర్ణుడికే లేదుగదా నువ్వు చూపే ఈ దాన గుణం
అప్సరస మీద ఆశపడరాదా పౌరుషం లేదా పరువు చెడిపోదా

రంగుల తారక నింగిని ఆగక కిందికి జారినదా
ముంబై మేనక ముందరి కాళ్ళకి బంధము వేసినదా
తప్పు జరిగేలా తప్పటడుగేలా
సిగ్గు బెదిరేలా చిందులెయ్యాల





ఈ క్షణం ఒకే ఒక కోరిక పాట సాహిత్యం

 
చిత్రం: ఎలా చెప్పను (2003)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర

ఈ క్షణం ఒకే ఒక కోరిక
నీ స్వరం వినాలని తియ్యగా
ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తియ్యగా
తరగని దూరములో...ఓ...ఓ...
తెలియని దారులలో... ఓ... ఓ...
ఎక్కడున్నావు అంటోంది ఆశగా
ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తియ్యగా

ఎన్ని వేల నిమిషాలో లెక్కపెట్టుకుంటోంది
ఎంత సేపు గడపాలో చెప్పవేమి అంటోంది
నిన్ననేగా వెళ్ళావన్న సంగతి గుర్తేలేని గుండె ఇదీ...
ఆ... ఆ... ఆ... ఆ...
మళ్లీ నిన్ను చూసేదాకా నాలో నన్ను ఉండనీక ఆరాటంగా కొట్టుకున్నది
ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తియ్యగా

రెప్ప వేయనంటోంది ఎంత పిచ్చి మనసు ఇది
రేపు నువ్వు రాగానే కాస్త నచ్చచెప్పు మరి
నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే మళ్లీ మళ్లీ తలచుకుని 
ఆ... ఆ... ఆ... ఆ...
ఇంకా ఎన్నో ఉన్నాయంటు ఇప్పుడే చెప్పాలంటు నిద్దరోను అంటోంది

ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తియ్యగా
తరగని దూరములో...ఓ...ఓ...
తెలియని దారులలో... ఓ... ఓ...
ఎక్కడున్నావు అంటోంది ఆశగా



ఆ నవ్వులో ఏమున్నదో పాట సాహిత్యం

 
చిత్రం: ఎలా చెప్పను (2003)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్

ఆ నవ్వులో ఏమున్నదో చలించింది నా మనసు తొలిసారిగా
ఆ కళ్ళతో ఏమన్నదో ఒకే చూపుతో నన్ను మంత్రించగా
ఉదయంలా కనిపించింది హృదయంలో కొలువయ్యింది
మెరుపల్లె నను తాకింది వరదల్లే నను ముంచిందీ...
అవునన్నా కాదన్నా అయ్యేది అయ్యిందిగా చేసేది ఏముందికా...

నచ్చజెప్పినా ఏ ఒకరు నమ్మరే ఎలా నన్నిపుడు నేనే నేనన్నా (2)
మునుపు ఎన్నడూ ఇంతిదిగా మురిసిపోలేదుగా
అదుపు తప్పేంత అలజడిగా ఊగిపోలేదుగా
అడుగడుగు అలలవగా పరుగులు నేర్పింది తానే కదా...
అవునన్నా కాదన్నా అయ్యేది అయ్యిందిగా చేసేది ఏముందిక

గుర్తుపట్టనే లేదసలు గుండెలోతులో గుసగుసలు తానొచ్చేదాక (2)
తెలియజెప్పింది తుంటరిగా వయసువచ్చిందని
తలుపుతట్టింది సందడిగా నిదర ఎన్నాళ్ళని
తన చెలిమే అడగమని తరుముకు వచ్చింది తుఫానుగా
అవునన్నా కాదన్నా అయ్యేది అయ్యిందిగా చేసేది ఏముందిక...

ఆ నవ్వులో ఏమున్నదో చలించింది నా మనసు తొలిసారిగా
ఉదయంలా కనిపించింది హృదయంలో కొలువయ్యింది
మెరుపల్లె నను తాకింది వరదల్లే నను ముంచిందీ...
అవునన్నా కాదన్నా అయ్యేది అయ్యిందిగా చేసేది ఏముందికా...




మేఘాల పల్లకిలోన పాట సాహిత్యం

 
చిత్రం: ఎలా చెప్పను (2003)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సునీత, శ్రీరాం ప్రభు

మేఘాల పల్లకిలోన దిగి వచ్చింది ఈ దేవకన్య (2)
మిలమిల మెరిసిన శశికళ చినుకులా కురిసిన హరివిల్లా
గుడిలో దివ్వేలా గుండెలో మువ్వలా
ఎగిరే గువ్వలా ఎదిగే పువ్వులా
నవ్వవే నిత్యం ఇలా ముత్యాల వానలా
అందాల మందార కొమ్మా హోయ్ అల్లారు ముద్దైన బొమ్మా

నీలా నవ్వాలని నీతో నడవాలని
పచ్చని పండుగ వచ్చింది చల్లని కబురు తెచ్చింది
వచ్చే నూరేళ్ళ కాలానికి నువ్వే మారాణివంటున్నది
ప్రతి రోజులా ఒక రోజా ఇది ఏడాదిలో మహారాజే ఇది
లోకాన ఉన్న అందరికన్నా చక్కనైన చిన్నది 
తన ఒడిలో పుట్టింది అంటున్నది

మేఘాల పల్లకిలోనా...
మేఘాల పల్లకిలోన దిగి వచ్చింది ఈ దేవకన్య
మిలమిల మెరిసిన శశికళ చినుకులా కురిసిన హరివిల్లా

నన్నే మరిపించగా నిన్నే మురిపించగా
ప్రతి రాతిరి వేళల్లో రాని చందమామయ్యని
నీ కలువ కన్నుల్లో ఎన్నో కళలు నింపాలని
నీకోసమే ఆ నీలాకాశం పంపిందమ్మా వెన్నెల సందేశం
నిన్నటి కన్నా రేపెంతో మిన్న చూడమన్న ఆశతో 
సందడిగా చేరింది సంతోషం

మేఘాల పల్లకిలోనా...
మేఘాల పల్లకిలోన దిగి వచ్చింది ఈ దేవకన్య
మిలమిల మెరిసిన శశికళ చినుకులా కురిసిన హరివిల్లా



మాఘమాస వేళ పాట సాహిత్యం

 
చిత్రం: ఎలా చెప్పను (2003)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఉదిత్ నారాయణ్, శ్రేయ ఘోషల్

కళలు చిలుకు అలివేణి నుదుట కస్తూరి తిలకమును దిద్దరే
సిగ్గులొలుకు చెలి పసిడి బుగ్గలకు పసుపుతో నిగ్గు పెంచరే
కొత్త వెలుగు చూపించగలుగు పారాణి పూసి నడిపించరే
కన్నె గోదారి వధువుగా మారి కడలి కౌగిలికి చేరు తరుణమిది
వేడుకైన కళ్యాణ సమయమిది

మాఘమాస వేళ కోకిలమ్మ పాట
ప్రేమ పర్ణశాల చూపుతున్న బాట
అనురాగం తోడు రాగా నవలోకం ఏలుకోగా
శుభలగ్నం చేరుకుందని పిలిచేలా

ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... (2)

మాఘమాస వేళ కోకిలమ్మ పాట

తందాన తందాన తానాన తానానా
తందాన తందాన తననన నా...

ఎవరిని నే చూసినా అడుగులు ఎటు వేసినా
ఎదురయేది నువ్వే నీకు తెలుసునా
నిను కలవని రోజున గడవదు ఏం చేసినా
వదలనంది నన్నే తీపి యాతన
నువ్వు వెతికే మజిలీ అవనా...
నెచ్చెలిగా మదిలో చేరనా...
ఇక అటు ఇటు ఎగరకే పావురమా
నా కౌగిలి కొలువున స్థిరపడుమా
తలపును దోచిన దొరతనమా
నా అనుమతి తమకిక అవసరమా
నన్ను నీలో నిన్ను నాలో నింపే నీ ప్రేమ

మాఘమాస వేళ కోకిలమ్మ పాట

మనసుకి మలి జన్మగా నువు మలిచిన బొమ్మగా
నిన్ను అల్లుకోనీ కొత్త ఊపిరి
హో గగనము దిగి నేరుగా ప్రియసఖిలా చేరగా
నన్ను కలుసుకుందా నింగి జాబిలి
నా మనవిని విననే వినవా...
ఇది నిజమని అననే ఆనవా...
నది నడకలు నేర్పిన సాగరమా
నీ ఒడిలో ఒదిగితే చాలు సుమా
తెలియని సైగల స్వాగతమా
ఈ బిడియము దేనికే సోయగమా
ఆగనీదు సాగనీదు చూడు ఈ ప్రేమ

మాఘమాస వేళ కోకిలమ్మ పాట
అనురాగం తోడు రాగా నవలోకం ఏలుకోగా
శుభలగ్నం చేరుకుందని పిలిచేలా
ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... (2)




మన్నించు ఓ ప్రేమా పాట సాహిత్యం

 
చిత్రం: ఎలా చెప్పను (2003)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర, ఉదిత్ నారాయన్

ఓ ప్రేమా ప్రేమా ప్రేమా...
మన్నించు ఓ ప్రేమా మురిపించుకోకమ్మా
మౌనాలు కరిగించేలా మాటాడుమా
మన్నించు ఓ ప్రేమా మరుగేల చెప్పమ్మా
దరిచేరు దారేదైనా చూపించుమా
చెప్పనంటు దాచడానికైనా
అంత చెప్పరాని మాట కాదు ఔనా
ఇంత మంచి వేళ ఎదురైనా
మరి చెప్పుకోవ ఇంక ఇపుడైనా
పట్టరాని ఆశ పెంచుకున్నా
అది మోయరాని భారమవుతున్నా
చెప్పుకుంటే తప్పు లేదు అయినా
నువ్వు ఒప్పుకోవో ఏమో అనుకున్న...
ఓ ప్రేమా ప్రేమా ప్రేమా...
మన్నించు ఓ ప్రేమా మురిపించుకోకమ్మా
మౌనాలు కరిగించేలా మాటాడుమా

జంట కమ్మని వెంట రమ్మని పిలిచే నేస్తమా
కొంత చేరువై కొంత దూరమై ఉంటే న్యాయమా
రెండు చేతులా అందుకోమని అనవేం స్నేహమా
చెంత నిలిచినా చేయి కలపవేం నాదే నేరమా
చొరవగా పొదువుకో నడిపే ప్రణయమా
బిడియమే వదులుకో బెదిరే ప్రియతమా
తగిన తరుణమని ఉదయ కిరణమై
ఎదురుపడిన వరమా
మన్నించు ఓ ప్రేమా మురిపించుకోకమ్మా
మౌనాలు కరిగించేలా మాటాడుమా

అన్నివైపులా చెలిమి కాపలా అల్లే బంధమా
మబ్బులో అలా దాగితే ఎలా దిగిరా చంద్రమా
నిదురలో అలా నిలిచిపోకలా మెరిసే స్వప్నమా
కంటిపాపలో కబురులేమిటో చెబితే పాపమా
తలపునే తెలుపవే నాలో ప్రాణమా
పెదవిపై పలకవే ఊహా గానమా
మదిని మీటినది నీవు కాదా మరి మధురమైన స్వరమా
మన్నించు ఓ ప్రేమా మురిపించుకోకమ్మా
మౌనాలు కరిగించేలా మాటాడుమా
చెప్పనంటు దాచడానికైనా
అంత చెప్పరాని మాట కాదు ఔనా
ఇంత మంచి వేళ ఎదురైనా
మరి చెప్పుకోవ ఇంక ఇపుడైనా
ఓ ప్రేమా ప్రేమా ప్రేమా... ఓ ప్రేమా ప్రేమా ప్రేమా...





మంచు తాకినా ఈ వనం పాట సాహిత్యం

 
చిత్రం: ఎలా చెప్పను (2003)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మల్లికార్జున్

మంచు తాకినా ఈ వనం పూలు తొడిగేనా
ముగవోయిన జీవితం మళ్ళీ పలికేనా
చిరునవ్వుల ఇక ఈ పెదవులకి జ్ఞాపకమై మిగిలేనా
కల జారిన ఈ కనుపాపలకి నలువైపుల నలుపేనా ఏమో 

మంచు తాకిన ఈ వనం పూలు తొడిగేనా
ముగవోయిన జీవితం మళ్ళీ పలికేనా

తుంచిన పూలను తెచ్చి అతికించలేను గాని
చైత్రం నేనై వచ్చి నా తప్పు దిద్దుకోని
చిగురాశలు రాలిన కొమ్మా చినబోకమ్మా
పచ్చదనం నీలో ఇంకా మిగిలుందమ్మా
అందామని ఉన్నా అవకాశం ఉందా
నిందించలేని మౌనమే నన్నాపగా

మంచు తాకిన ఈ వనం పూలు తొడిగేనా
ముగవోయిన జీవితం మళ్ళీ పలికేనా

నిన్నటి స్వప్నం కోసం వెనుదిరిగి చూడకంటూ
రేపటి ఉదయం కోసం ముందడుగు వెయ్యమంటూ
తెలవారని రేయని నడిపే వెలుగవగలనా...
తడి ఆరని చెంపలు తుడిచే చెలిమవగలనా...
నిదురించని నిజమై నిలదీసే గతమే
భరించలేని భారమై వెంటాడగా...

మంచు తాకిన ఈ వనం పూలు తొడిగేనా
ముగవోయిన జీవితం మళ్ళీ పలికేనా
చిరునవ్వుల ఇక ఈ పెదవులకి జ్ఞాపకమై మిగిలేనా
కల జారిన ఈ కనుపాపలకి నలువైపుల నలుపేనా ఏమో 




ప్రతీ నిజం పగటి కలగా పాట సాహిత్యం

 
చిత్రం: ఎలా చెప్పను (2003)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర 

ప్రతీ నిజం పగటి కలగా నిరాశగా నిలవనా
ప్రతీ క్షణం కలత పడగా నిరీక్షగా గడపనా
కన్నీటి సంద్రంలో నావనై ఎన్నాళ్ళీ ఎదురీత
ఏనాడు ఏ తీరం ఎదుట కనబడక

ప్రతీ నిజం పగటి కలగా నిరాశగా నిలవనా
ప్రతీ క్షణం కలత పడగా నిరీక్షగా గడపనా

పెదవులు మరచిన చిరు నగవై నిను రమ్మని పిలిచానా
వెతకని వెలుగుల పరిచయమై వరమిమ్మని అడిగానా
నిదరపోయే ఎదను లేపి నిశిను చూపించగా
ఆశతో చాచిన దోసిట శూన్యం నింపీ
కరగకుమా నా కన్నులనే వెలి వేసి...

ప్రతీ నిజం పగటి కలగా నిరాశగా నిలవనా
ప్రతీ క్షణం కలత పడగా నిరీక్షగా గడపనా

ఎక్కడ నువ్వని దిక్కులలో నిను వెతికిన నా కేక
శిలలను తాకిన ప్రతిధ్వనిగా నను చేరితే ఒంటరిగా
సగములోనే అలసిపోయే పయనమయ్యాగా
ఇసుకను చేసిన సంతకమా నీ స్నేహం
ఏ అల నిను చేరిపిందో తెలుపదు కాలం


Palli Balakrishna Thursday, July 27, 2017

Most Recent

Default