Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Sahasam Swasaga Sagipo (2016)



చిత్రం: సాహసం శ్వాసగా సాగిపో (2016)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: శ్రీజో
గానం: సిద్ శ్రీరామ్, ఏ డి కె
నటీనటులు: నాగ చైతన్య, మంజిమా మోహన్
దర్శకత్వం: గౌతమ్ మీనన్
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
విడుదల తేది: 11.11.2016

కాలం నేడిలా మారెనే
పరుగులు తిసేనే
హృదయం వేగం వీడదే...
వెతికే చెలిమే నీడై నన్ను చేరితే
కన్నుల్లో నీవేగా నిలువెల్లా...
స్నేహంగా తోడున్నా నివే
ఇక గుండెలో ఇలా
నడిచే క్షణమే ఎదసడి ఆగే
ఉపిరి పాడే పెదవిని వీడే
పదమొక కవితై
మది నీవశమై నువు నా సగమై ఎదలో..
తోలిప్రేమే కడలై ఎగిసే వేళా
పసివాడై కెరటాలే ఈ క్షణం
చూడన చుడనా..
ఎగిరే నింగి దాక ఉహలనే రెక్కలుగా చేసిందే ఈ భావం
ఓకాలాన్నే కాజేసే కళ్ళ కౌగిలిలో
కరిగే.. కలలేవో... ఓ
వెన్నెల్లో వేదించే వెండి వానల్లో వెలిగే..మనమే

మౌనంగా లోలోనే కావ్యంగా మారే కలే

పన్నీటి జల్లై ప్రాణమే తాకే
ఉపిరే పోసే ఇది తొలి ప్రణయం
మనం ఆపినా ఆగదే...
ఎన్నడు వీడదే ...

వెళ్లిపోమాకే ఎదనే  వదిలేళ్లి పోమాకే
మనసే మరువై నడవాలి ఎందాకే
వెళ్లిపోమాకే ఎదనే  వదిలేళ్లి పోమాకే
మనసే మరువై నడవాలి ఎందాకే
భాషే తెలియందే లిపి లేదే కనుచుపే చాలందే
లోకాలంతమైన నిలిచేలా మన ప్రేమే ఉంటుందే ఇది వరమే...

మనసుని తరిమే చేలిమొక వరమే
మురిసిన పెదవుల సడి తెలిపే స్వరమే
ప్రణయపు కిరణం ఎదకిది అరుణం
కనులకి కనులని ఎర వేసిన తొలి తరుణం
మది నదిలో ప్రేమే మెరిసే
ఏ అనుమతి అడగక కురిసే
నీలో నాలో హృదయం ఒకటై పాడే
కలలిక కనులని వీడవే
మనసిక పరుగే ఆపదే

మనసిక పరుగే ఆపదే
నీలో నాలో

నీలో నాలో

నీలో నాలో


**********   **********  *********


చిత్రం: సాహసం శ్వాసగా సాగిపో (2016)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: విజయ్ ప్రకాష్

తాను నేను మొయిలు మిన్న
తాను నేను కలువ కొలను
తాను నేను పైరు చేను
తాను నేను వేరు మాను
శశి తానైతే నిశినే నేను
కుసుమం తావి తాను నేను
వెలుగు దివ్వె తెలుగు తీపి
తాను నేను మనసు మాను


దారి నేను తీరం తాను
దారం నేను హారం తాను
దాహం నేను నీరం తాను
కావ్యం నేను సారం తాను
నేను తాను రెప్ప కన్ను
వేరైపోని పుడమి మన్ను
నేను తాను రెప్ప కన్ను
వేరైపోని పుడమి మన్ను
తాను నేను మొయిలు మిన్ను
తాను నేను కలువ కొలను
తాను నేను గానం గమకం
తాను నేను ప్రాయం తమకం
తాను నేను మొయిలు మిన్ను
తాను నేను కలువ కొలను
తాను నేను పైరు చేను
తాను నేను వేరు మాను
శశి తానైతే నిశినే నేను
కుసుమం తావి తాను నేను
వెలుగు దివ్వె తెలుగు తీపి
తాను నేను మనసు మేను

మనసు మేను మనుసు మేను



**********   **********  *********



చిత్రం: సాహసం శ్వాసగా సాగిపో (2016)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: హరిచరన్ , చిన్మయి

కన్నుల ముందే కనపడుతుందే..
కల అనుకుంటే నన్నే కొట్టిందే..
నను చూడరా అంటోందిరా..
తను ఎదకే కనువిందా..
ఈరోజే నేను మళ్లీ పుట్టాను..
నాకదే బాగుందిలే..

ఈరోజేందుకో నిన్ను చూడనట్టు చూశా..
నాకదే బాగుందిలే..
ఈరోజే నా ఉదయం మేలుకుంది నీతో..
నాకదే బాగుందిలే..
ఈరోజే మరీ తెలుగు కీర్తనైన నువ్వేలే..
నాకదే బాగుందిలే..
ఈరోజే చెలి వీచే గాలివై తాకితే..
నాకదే బాగుందిలే..

ఓ..కోయిల రాగంలో సంగీతం ఉందా..
పాడే పలికిందా ఓ..
ఈ కోయిల చూస్తే అయ్యయ్యయ్యో..
ఆ చూపుకి ఏమైపోతానో..
నేనైతే పడిపోయాను..
అయినా బాగుందంటాను..
ఆ చూపుకి ఏమైపోతాను..

ఈరోజేందుకో నిన్ను చూడనట్టు చూశా..
నాకదే బాగుందిలే..
నిన్ను చూడనట్టే చూశా..
నాకదే బాగుందిలే..
తెలుగు కీర్తనైన నువ్వేలే..
నాకదే బాగుందిలే..
మేలుకుంది నీతో..
నాకదే బాగుందిలే..
అదే..అదే..అదే..అదే..అదే..అదే..బాగుందిలే..
అదే..అదే..అదే..అదే..అదే..అదే..బాగుందిలే..
అదే..అదే..బాగుందిలే ..



**********   **********  *********



చిత్రం: సాహసం శ్వాసగా సాగిపో (2016)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: సత్య ప్రకాష్ , సశా తిరుపతి

పదవే నీ రెక్కలు నా రెక్కలు చాచి..
పోదాం ఈ దిక్కులు ఆ చుక్కలు దాటి..
పరువంలో రాదారి ఆకాశం అయిందే..
పైపైకెల్లాల్లన్నదే..చక్కోరి..
పదరా ఆ చోటుకీ ఈ చోటికంటానా..
నీతో ఏ చోటికైనా వెంట నే రానా..
చక్కోరి..పందెములో..పందెములో..
నే ముందరో నువు ముందరో చూద్దాం..చూద్దాం..
మొదట ఆ మాటని మాట్టాడగలదెవరో..
మొదట ఈ ప్రేమని బయటుంచగలదెవరో..
తొలిగా మౌనాలని మోగించగలదెవరో..
ముందు చెప్పేదెవరో ముందుండేదెవరో..
ఎదురుగ నిలిచి ఎదలను తెరిచే..
కాలం ఎప్పుడో ఆ క్షణం ఇంకెప్పుడో..

ఇట్టే పసిగట్టి కను కదలిక బట్టి కనిపెట్టి..
వలపుల రుచి బట్టే పని ముట్టే అవసరమట ఇకపైన..
ఇన్నాళ్లుగ దాగున్నది విరహం..
ఎన్నాళ్లని మొయ్యాలట హృదయం..
అందాకీ పయనం సులువుగ మరి ముగిసేన..

ఇట్టే పసిగట్టి కను కదలిక బట్టి కనిపెట్టి..
వలపుల రుచి బట్టే పని ముట్టే అవసరమట ఇకపైన..
ఇన్నాళ్లుగ దాగున్నది విరహం..
ఎన్నాళ్లని మొయ్యాలట హృదయం..
అందాకీ పయనం సులువుగ మరి ముగిసేన..
చక్కోరి..పందెములో..పందెములో..
మొదట ఆ మాటని మాట్టాడగలదెవరో..
మొదట ఈ ప్రేమని బయటుంచగలదెవరో..

నిన్ను కోరి..నిన్ను కోరి..నిన్ను కోరి ఉన్నానురా..
నిన్ను కోరి ఉన్నానురా..నిన్ను కోరి..కోరి..
తోడై నువు తీయించిన పరుగులు..
నీడై నువు అందించిన వెలుగులు..
త్రోవై నువు చూపించే మలుపులు మరిచేనా..
బాగున్నది నీతో ఈ అనుభవం..
ఇంకా ఇది వందేళ్ళూ అవసరం..
నేనెందుకు ఏంచేయాలన్నది మరి తెలిసేనా ..

తోడై నువు తీయించిన పరుగులు..
నీడై నువు అందించిన వెలుగులు..
త్రోవై నువు చూపించే మలుపులు మరిచేనా..
బాగున్నది నీతో ఈ అనుభవం..
ఇంకా ఇది వందేళ్ళూ అవసరం..
నేనెందుకు ఏంచేయాలన్నది మరి తెలిసేనా....

చక్కోరి..పందెములో..పందెములో..
మొదట ఆ మాటని మాట్టాడగలదెవరో..
మొదట ఈ ప్రేమని బయటుంచగలదెవరో..
తొలిగా మౌనాలని మోగించగలదెవరో..
ముందు చెప్పేదెవరో ముందుండేదెవరో..
ఎదురుగ నిలిచి ఎదలను తెరిచే..
కాలం ఎప్పుడో..ఆ క్షణం ఇంకెప్పుడో..
కాలం ఎప్పుడో..ఆ క్షణం ఇంకెప్పుడో..
క్షణం ఇంకెప్పుడో..క్షణం ఇంకెప్పుడో ..

Most Recent

Default