Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box



చిత్రం: ఓ భార్య కథ (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం:
గానం: యస్.జానకి
నటీనటులు: శరత్ బాబు, చంద్రమోహన్, జయసుధ,
దర్శకత్వం: మౌళి
నిర్మాత: రామోజీరావు
విడుదల తేది: 1988

మనసులకు లాలిపాట మన కథల జాలిపాట
రెప్పలేని కంటి పాపకే
నాపాపకి దూరాన ఉన్న తల్లి గారాల జోలపాట

మనసులకు లాలిపాట మన కథల జాలిపాట
రెప్పలేని కంటి పాపకే
నాపాపకి దూరాన ఉన్న తల్లి గారాల జోలపాట
మనసులకు లాలిపాట మన కథల జాలిపాట

ఏ దేవుడీ చేరాతలో నాపాపగా నిన్ను చేసే
నాదేవుడే చేజేతులా ఈ అమ్మనే బొమ్మ చేసే
నీదిక్కుగా నేనుండగా నాదివ్వె నీలోన మెరిసే
కన్నీటి లో కమలాలకై ఏ తుమ్మెదో వేచి చూసే
నాగీతమోగీతమై.. నా కంటి జలపాతమై ..
నీతల్లిగా జోల నేపాడనా నీడోల నేనూపనా

మనసులకు లాలిపాట మన కథల జాలిపాట
జో జో లాలి జో  హాయి జో జో లాలి జో

ఏజన్మకీ స్త్రీ జన్మమే నీకొద్దు నా చిట్టీ తల్లి
ఏకాకిలా ఓ కాకిలా మారింది ఈ కన్నతల్లి
ఈకోవెలా నాకో వెలా తెచ్చింది ఈనాడు తల్లి
నావెన్నెలే ఆవేదనై పొంగింది నా కంట మళ్ళి
వాల్మికి వారించినా వగచింది ఆ జానకి
నీ జోల కావాలి ఈ అమ్మకి నాతల్లిగా జన్మకి

మనసులకు లాలిపాట మన కథల జాలిపాట
రెప్పలేని కంటి పాపకే
నాపాపకి దూరాన ఉన్న తల్లి గారాల జోలపాట
మనసులకు లాలిపాట మన కథల జాలిపాట
జో జో లాలి జో  హాయి జో జో ...

Most Recent

Default