చిత్రం: ఓ సీత కథ (1974) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, వేటూరి సుందరరామ మూర్తి, సముద్రాల సీనియర్ నటీనటులు: చంద్రమోహన్, కాంతారావు, శ్యాంసుందర్, కనకాల దేవదాస్, రోజారమణి, శుభ, పండరీ బాయి, రమాప్రభ, పుష్పకుమారి, కల్పనారాయ్. మాటలు: గొల్లపూడి మారుతీరావు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె. విశ్వనాధ్ నిర్వహణ: అశ్వినీదత్ చలసాని సమర్పణ: టి. కాశీ నిర్మాణ సంస్థ: సావరిన్ సినీ ఎంటర్ ప్రైసెస్ విడుదల తేదీ: 19.07.1974
Songs List:
చింత చిగురు పులుపని పాట సాహిత్యం
చిత్రం: ఓ సీత కథ (1974) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: సముద్రాల సీనియర్ గానం: యస్.పి.బాలు చింత చిగురు పులుపని చీకటంటె నలుపని చెప్పందే తెలియని చిన్న పిల్ల అది చెరువులో పెరుగుతున్న చేప పిల్ల అభం శుభం తెలియని పిచ్చి పిల్ల చింత చిగురు పులుపని చీకటంటె నలుపని చెప్పందే తెలియని చిన్న పిల్ల అది చెరువులో పెరుగుతున్న చేప పిల్ల అభం శుభం తెలియని పిచ్చి పిల్ల గట్టుమీద కొంగను చూసి చెట్టు మీద డేగను చూసి చుట్టమని అనుకుంది చేప పిల్ల పాపం చేప పిల్ల గట్టుమీద కొంగను చూసి చెట్టు మీద డేగను చూసి చుట్టమని అనుకుంది చేప పిల్ల పాపం చేప పిల్ల చెంగు చెంగున చెరువు దాటి చెంత నిలిచి చేయి చాచి చెలిమి చేయ పిలిచింది చేప పిల్ల అభం శుభం తెలియని పిచ్చి పిల్ల చింత చిగురు పులుపని చీకటంటె నలుపని చెప్పందే తెలియని చిన్న పిల్ల అది చెరువులో పెరుగుతున్న చేప పిల్ల అభం శుభం తెలియని పిచ్చి పిల్ల చింత చిగురు పులుపని చీకటంటె నలుపని చెప్పందే తెలియని చిన్న పిల్ల అది చెరువులో పెరుగుతున్న చేప పిల్ల అభం శుభం తెలియని పిచ్చి పిల్ల ఎర వేసిన పిల్లవాడు ఎవరనుకుందో ఎగిరి వచ్చి పడ్డదీ ఆతని ఒడిలో తుళ్ళి తుళ్ళి ఆడే... చిలిపి చేప పిల్ల తాళి లేని తల్లాయే అమ్మ చెల్లా నాన్న లేని పాపతో నవ్వే లోకంలో ఎన్నాల్లు వేగేను చేప తల్లి అభం శుభం తెలియని పిచ్చి తల్లి పిచ్చి తల్లి...
మల్లె కన్న తెల్లన పాట సాహిత్యం
చిత్రం: ఓ సీత కథ (1974) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, పి.సుశీల పల్లవి: మల్లె కన్న తెల్లన మా సీత సొగసు వెన్నెలంత చల్లన మా సీత సొగసు ఏదీ? ఏదీ? ఏదీ? తేనెకన్న తీయన మా బాప మనసు తెలుగంత కమ్మనా మా బావ మనసు చరణం: 1 నన్ను పిలిచి అత్తమ్మా అడగాలీ (2) ఏమని కన్నె సీత కలలన్నీ పండేది ఎపుడనీ (2) నీతోనే ఒకమాట... నీతోనే ఒకమాట చెప్పాలి ఏమని నీతోడే లేకుంటే ఈ సీతే లేదనీ మల్లె కన్న తెల్లన మా సీత సొగసూ తేనెకన్న తీయన మా బావ మనసు చరణం: 2 మనసుంది ఎందుకనీ... మమతకు గుడిగా మారాలనీ... వలపుంది ఎందుకనీ... ఆ గుడిలో దివ్వెగ నిలవాలనీ మనసుంది ఎందుకనీ... మమతకు గుడిగా మారాలనీ... వలపుంది ఎందుకనీ... ఆ గుడిలో దివ్వెగ నిలవాలనీ ఆ మనువుంది ఎందుకనీ... ఆ దివ్వెకు వెలుగై పోవాలనీ బ్రతుకుంది ఎందుకనీ.... ఆ వెలుగే నీవుగ చూడాలనీ ఆ వెలుగే నీవుగ చూడాలనీ మల్లెకన్న తెల్లనా... హుహుహు... తేనెకన్న తీయనా... హుహుహు....
పుత్తడి బొమ్మ మా పెళ్ళిపడుచు పాట సాహిత్యం
చిత్రం: ఓ సీత కథ (1974) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, పి.సుశీల పల్లవి: పుత్తడి బొమ్మ మా పెళ్ళిపడుచు పున్నమి రెమ్మ మా పెళ్ళిపడుచు పుత్తడి బొమ్మ మా పెళ్ళిపడుచు పున్నమి రెమ్మ మా పెళ్ళిపడుచు ఆ బొమ్మకున్న ఆభరణం అందాలకందని మంచి గుణం అందాలకందని మంచి గుణం మహరాజు కాడు మా పెళ్ళికొడుకు మనసైనవాడు మా పెళ్ళి కొడుకు మహరాజు కాడు మా పెళ్ళికొడుకు మనసైనవాడు మా పెళ్ళి కొడుకు మావాడికున్న వింత గుణం తన మాట తప్పని మంచితనం పుత్తడి బొమ్మ మా పెళ్ళి పడుచు పున్నమి రెమ్మ మా పెళ్ళి పడుచు చరణం: 1 గళమున లేవు ఏ ముత్యాల సరాలు ఉన్నవిలే హరినామ స్మరాలు కరమున లేవు బంగారు కడియాలు ఉన్నవిలే శివపూజ కుశుమాలు మదిలో లేవు సంపదల మీద ఆశలు మదిలో లేవు సంపదల మీద ఆశలు ఉన్నవిలే పతి సేవా కాంక్షలు ఆ బొమ్మకున్న ఆభరణం అందాలకందని మంచి గుణం అందాలకందని మంచి గుణం పుత్తడి బొమ్మ మా పెళ్ళి పడుచు పున్నమి రెమ్మ మా పెళ్ళి పడుచు మహరాజు కాడు మా పెళ్ళికొడుకు మనసైనవాడు మా పెళ్ళి కొడుకు చరణం: 2 పెళ్ళిలకు మధుమాసం చైత్రమాసం వచ్చే చైత్రమాసం పెళ్ళికొడుకు ఊ అంటే మాకు సంతోషం మరి మరీ సంతోషం పెళ్ళిలకు మధుమాసం చైత్రమాసం వచ్చే చైత్రమాసం పెళ్ళికొడుకు ఊ అంటే మాకు సంతోషం మరి మరీ సంతోషం చరణం: 3 రాచిలకల రప్పించు మావిడి తోరణాలు కట్టించు కోయిలలను పిలిపించు మంగళవాద్యాలను తెప్పించు ఆకాశమంత పందిరి వేసి భూలోకమంత పీఠ వేసి పెళ్ళికొడుకును పెళ్ళిపడుచును పీటల మీద కూర్చోబెట్టి శ్రీదేవి భూదేవి శ్రీవాణి శ్రీగౌరి అందరు చల్లగ అక్షితలు చల్లగ కల్యాణం జరిపించాలి..ఆ వైభోగం తిలకించాలి
నిను కన్న కథ..పాట సాహిత్యం
చిత్రం: ఓ సీత కథ (1974) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం:పి. సుశీల, బి. వసంత పల్లవి: నిను కన్న కథ..మీ అమ్మ కథ వినిపించనా..కన్నా.. ఆ కథ వినిపించి నిను కన్నయ్య కనులు తెరిపించనా నాన్నా నిను కన్న కథ..మీ అమ్మ కథ వినిపించనా..కన్నా.. ఆ కథ వినిపించి నిను కన్నయ్య కనులు తెరిపించనా నాన్నా నిను కన్న కథ..మీ అమ్మ కథ చరణం: 1 తూరుపు తల్లికి పడమర తండ్రికి గారాల కొడుకు ఈ నెలరేడూ తూరుపు తల్లికి పడమర తండ్రికి రాల కొడుకు ఈ నెలరేడూ కలవని దిక్కుల పొత్తిలిలో కలువల పుప్పొడి మెత్తలలో కలవని దిక్కుల పొత్తిలిలో కలువల పుప్పొడి మెత్తలలో పెరుగుతు వున్నాడు పెరుగుతునే వుంటాడూ నిను కన్న కథ..మీ అమ్మ కథ వినిపించనా..కన్నా..ఆ చరణం: 2 అడుగులు వేసే ఆ రోజున పది అడుగులు వేస్తే నాన్న.. అడుగో నాన్న అడిగి తెలుసుకో అప్పుడు కన్నా అడిగినంతనే..మన సిచ్చిన ఈ అపర శకుంతల కథ అమాయకురాలి కథ నిను కన్న కథ..మీ అమ్మ కథ వినిపించనా..కన్నా..ఆ చరణం: 3 కంటిపాపగా చూచుకునే తల్లిని చూసి చంటిపాప తెలుసుకున్నది ఆడది ఎవరో వయసున్న మసిబారిన మనసైతే చదువున్నా చెరపట్టిన మనిషైతే ఆడదానిలో అమ్మను చూడలేడూ ఆ అమ్మకు అంకితమైపోలేడూ ఈ కథ వినిపించి నిను కన్నయ్య కనులు తెరిపించనా నాన్నా నిను కన్న కథ..మీ అమ్మ కథ
కల్లాకపటం ఎరుగని పిల్లలు పాట సాహిత్యం
చిత్రం: ఓ సీత కథ (1974) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం:పి. సుశీల కల్లాకపటం ఎరుగని పిల్లలు
భరతనారి చరితము పాట సాహిత్యం
చిత్రం: ఓ సీత కథ (1974) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం:పి. లీల భరతనారి చరితము