Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Tholi Prema (1998)

చిత్రం: తొలిప్రేమ (1998)
సంగీతం: దేవా
నటీనటులు: పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి
దర్శకత్వం: ఎ. కరుణాకరన్
నిర్మాత: జి. వి. జి. రాజు
విడుదల తేది: 24.07.1998Songs List:ఈ మనసే పాట సాహిత్యం

 
చిత్రం: తొలిప్రేమ (1998)
సంగీతం: దేవా
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు

అలబలబ అలబలబ ఎహె
పా... మపపని మపగా...
మనిరిసగమపా... మపపని మపగా...
అలబలబ అలబలబ ఎహె
అలబలబ అలబలబ ఎహె
అలబలబ అలబలబ ఎహె
అలబలబ అలబలబ ఎహె

అలబలబ ఆయియాయ ఎహె
అలబలబ ఆయియాయ ఎహె
అలబలబ ఆయియాయ ఎహె
అలబలబ అలబలబ

ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
పరుగెడుతోంది నీకేసి, వినమంటొందీ తన ఊసే
అలలెగసే కలవరమాయె తనలో నిను చూసే

ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్

హాలబ హాలబ
అలబా అలబా అలబా అలబా 
అలబా అలబా అలబా అలబా 

ఎన్నో కలలను చూసి కన్నే కునుకొదిలేసే
నువ్వే నను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే
ఎన్నో కలలను చూసి కన్నే కునుకొదిలేసే
నువ్వే నను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే
కోరుకున్న తీరాన్నే తాను చేరినా
తీరిపోని ఆరాటంతొ కలవరించెనా
వెనకనె తిరుగుతూ చెలిజత విడువదు
దొరికిన వరమది కుదురుగ ఉండదు
ఏం చేస్తే బాగుంటుందో చెప్పని వింత నసే

ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్

హాలబ హాలబ
అలబా అలబా అలబా అలబా 
అలబా అలబా అలబా అలబా

నీతో చెలిమిని చేసే నీలో చలువని చూసే
ఐనా ఇంకా ఏదో అడిగే అత్యాశె
నీతో చెలిమిని చేసే నీలో చలువని చూసే
ఐనా ఇంకా ఏదో అడిగే అత్యాశె
వెల్లువంటి నీ స్నేహం నన్ను అల్లినా
వెన్నలంటి నీ నవ్వుల్లో చెమ్మగిల్లినా
తహ తహ తరగదు అలజడి అణగదు
తన సొద ఇది అని తలపులు తెలుపదు
ఏమిస్తే శాంతిస్తుందో తెలుసా ఏం వరసే

ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
పరుగెడుతోంది నీకేసి, వినమంటొందీ తన ఊసే
అలలెగసే కలవరమాయె తనలో నిను చూసే

ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్ఏమయిందో ఏమో ఈ వేళ పాట సాహిత్యం

 
చిత్రం: తొలిప్రేమ (1998)
సంగీతం: దేవా
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు

ఏమయిందో ఏమో ఈ వేళ
రేగింది గుండెలో కొత్త పిచ్చి
ఎంత వింతో బాడి ఈ వేళ
తూలింది గాలిలో రెక్కలొచ్చి
న్యూటన్ థియరీ తల్లకిందులై
తప్పుకున్నదా భూమికి ఆకర్షణ
తారానగరి కళ్ళవిందులై
చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ

చరణం: 1
వెతకాలా వైకుంఠం కోసం అంతరిక్షం వెనకాలా
హే ప్రియురాలే నీ సొంతం అయితే 
అంత కష్టం మనకేల
ప్రతి కలని చిటికెలతో గెలిచే ప్రణయాన
జత వలతో ఋతువులనే పట్టే సమయాన
ముల్లోకాలు గుప్పిట్లోనే చిక్కవా
ఒళ్లో తానే స్వర్గం వచ్చి దిగదా

చరణం: 2
జనులారా ఒట్టేసి చెబుతా నమ్ముతారా నా మాట
మనసారా ప్రేమించి చూస్తే అమృతం అందేనంట
మిస్ లైలా మిస్సైలా స్మైలే విసిరిందా
అది తగిలి కునుకొదిలి మనసే చెదిరిందా
అదే కాదా లవ్‌లో లవ్లీ లీల
అయ్యా నేనే ఇంకో మజునూలా

ఏమయిందో ఏమో ఈ వేళ
రేగింది గుండెలో కొత్త పిచ్చి
ఎంత వింతో బాడి ఈ వేళ
తూలింది గాలిలో రెక్కలొచ్చి
న్యూటన్ థియరీ తల్లకిందులై
తప్పుకున్నదా భూమికి ఆకర్షణ
తారానగరి కళ్ళవిందులై
చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణఏమి సోదరా మనసుకి ఏమయిందిరా పాట సాహిత్యం

 
చిత్రం: తొలిప్రేమ (1998)
సంగీతం: దేవా
సాహిత్యం:  భువనచంద్ర
గానం: కృష్ణరాజ్

ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా
ఒళ్ళు తోమలా పౌడర్ పుయ్యలా
అరె ఇంతలోనే ఎంత డేంజరైపోయరా

ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా

కళ్ళు తెరుచుకుంటే కలలాయె
అవి మూసుకుంటే ఎద వినదాయె
సరికొత్త ఊపు వచ్చి మనసు నిలవదాయే
తారురోడ్డే స్టారు హోటలాయె
మంచినీళ్ళే ఓల్డ్ మాంకు రమ్మాయే
కారు హెడ్ లైట్సే కన్నె కొంటె చూపులాయే
పువ్వే నవ్వై హొయలొలికించేస్తుంటే
గుండే గువ్వై అరె దూసుకుపోతుంటే
లైఫ్ అంతా కైపేలే సోదరా

క్లాసు బుక్స్ యమ బోరాయె
న్యూ తాట్సు డే అండ్ నైటు విడవాయే
నిముషాలె యుగములై నిద్దర కరువాయే
క్లోజు ఫ్రెండ్సు కనపడరాయె
పేరెంట్సు మాట వినపడదాయె
పచ్చనోట్లు కూడ పేపర్ బోట్సైపోయాయే
ఏమవుతుందో కనుగొంటే ఒక వింత
కాలం చాచే కౌగిట్లో గిలిగింత
డూ యు నో వాట్ ఈజ్ దిస్ నేస్తమా

ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా
ఒళ్ళు తోమలా పౌడరు పుయ్యలా
అరె ఇంతలోనే ఎంత డేంజరైపోయరాగగనానికి ఉదయం ఒకటే పాట సాహిత్యం

 
చిత్రం: తొలిప్రేమ (1998)
సంగీతం: దేవా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
ప్రణయానికి నిలయం మనమై
యుగయుగముల పయనం మనమై
ప్రతి జన్మలొ కలిశాం మనమె మనమే
జన్మించలేదా నీవు నాకోసమే
గుర్తించలేదా నన్ను నా ప్రాణమే
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే

చరణం: 1
నీ కన్నుల్లో కలను అడుగు ఇతడు ఎవరని
నీ గుండెల్లో తిరిగే లయనే బదులు పలకని
నిదురించు యవ్వనంలో పొద్దుపొడుపై
కదిలించలేదా నేనే మేలుకొలుపై
గతజన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువా
కలకాలం మంచు పొరలో ఉండగలనా

గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే

చరణం: 2
నా ఊహల్లో కదిలే కళలే ఎదుట పడినవి
నా ఊపిరిలో ఎగసే సెగలే కుదుట పడినవి
సమయాన్ని శాశ్వతంగా నిలిచిపోనీ
మమతన్న అమృతంలో మునిగిపోనీ
మనవైన ఈ క్షణాలే అక్షరాలై
మృతి లేని ప్రేమకథగా మిగిలిపోని

గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
ప్రణయానికి నిలయం మనమై
యుగయుగముల పయనం మనమై
ప్రతి జన్మలొ కలిశాం మనమె మనమే
జన్మించలేదా నీవు నాకోసమే
గుర్తించలేదా నన్ను నా ప్రాణమే
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమరొమాన్స్ లో రిథమ్స్ కలగలిపిన పాట సాహిత్యం

 
చిత్రం: తొలిప్రేమ (1998)
సంగీతం: దేవా
సాహిత్యం: చంద్రబోస్
గానం: సురేష్ పీటర్స్, ఉన్ని కృష్ణన్

రొమాన్స్ లో రిథమ్స్ కలగలిపిన
లిటిల్ హార్ట్ తడాఖా
తెలిసెను గనక ఓ ఓ ఆగదే పసి చిలక
ఆశలు కాస్త ముదిరాక వలపు తగదనక
ఈడుకు వేడి తగిలాక తప్పదిక చురక
ఎ ప్లస్ బి ఏన్ ఈక్వేషన్ హే
యు అండ్ మి కలిస్తే సెన్సేషన్

డైలీ క్లాసుల్నెగ్గొట్టి లేడీస్ బస్ స్టాండ్ లో వేచే
క్రేజీ స్టూడెంట్స్ గుండె గుస గుసలే
కన్నె కళ్ళల్లోకొచ్చి కొత్త కోర్కెల్ని రేపి
కొంటె పాటలనెన్నో నేర్పించావ
టీనేజి సొగసు లోని స్వీట్నెస్
తెలుసుకోని లైఫే పరమ వేస్ట్ కన్నా
కాలేజ్ కాంపస్ లోనే లవ్ సీక్రెట్స్
తెలుసుకున్న వాడే గ్రేట్ లవర్ చిన్నా...

రిగ రిగ రిగ రిగ రి
రిగ రిగ రిగ రిగ రి

రొమాన్స్ లో రిథమ్స్ కలగలిపిన
లిటిల్ హార్ట్ తడాఖా
తెలిసెను గనక ఓ ఓ ఆగదే పసి చిలక

ప్రాణాల కన్న ప్రియురాలే మిన్న
అనుకున్న  ప్రియునిదే స్వర్గం
ఓ తొలి చూపు తోనే మగవాని మనసు
అలరించు లలనదే భాగ్యం
లేటెస్ట్ లవ్ సూత్రం బట్టీ పట్టి కాంటీన్లో అడుగెట్టి
చూపించు టాలెంట్ శక్తి
డేరింగ్ గర్ల్స్ తో జట్టు కట్టి కుర్భాని కిస్ కొట్టి
ఆడించే వెన్ను తట్టి

రిగ రిగ రిగ రిగ రి
స్టార్ట్ చేయి నువ్వు లవ్ స్టోరీ

రొమాన్స్ లో రిథమ్స్ కలగలిపిన
లిటిల్ హార్ట్ తడాఖా
తెలిసెను గనక ఓ ఓ ఆగదే పసి చిలక
హే ఆశలు కాస్త ముదిరాక వలపు తగదనక
ఈడుకు వేడి తగిలాక తప్పదిక చురక
ఎ ప్లస్ బి ఏన్ ఈక్వేషన్ హే
యు అండ్ మి కలిస్తే సెన్సేషన్

Most Recent

Default