Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Deva"
Prema Poojari (1992)



చిత్రం: ప్రేమ పూజారి (1992)
సంగీతం: దేవా
సాహిత్యం: రాజశ్రీ 
గానం: యస్.పి.బాలు, కె. యస్. చిత్ర 
నటీనటులు: ప్రశాంత్, మోహిని
దర్శకత్వం: ఆర్.కె.సెల్వమణి
నిర్మాత: సాంబశివరెడ్డి
విడుదల తేది: 15.05.1992



Songs List:



ఓ రాధ ఓ రాధ పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ పూజారి (1992)
సంగీతం: దేవా
సాహిత్యం: రాజశ్రీ 
గానం: యస్.పి.బాలు,

ఓ రాధ ఓ రాధ




ఇది నా ఆశయం పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ పూజారి (1992)
సంగీతం: దేవా
సాహిత్యం: రాజశ్రీ 
గానం: యస్.పి.బాలు

ఇది నా ఆశయం 



ఓ క్రిష్ణ ఓ క్రిష్ణ పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ పూజారి (1992)
సంగీతం: దేవా
సాహిత్యం: రాజశ్రీ 
గానం: కె. యస్. చిత్ర 

ఓ క్రిష్ణ ఓ క్రిష్ణ 




మందారం ముద్ధ మందారం పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ పూజారి (1992)
సంగీతం: దేవా
సాహిత్యం: రాజశ్రీ 
గానం: యస్.పి.బాలు, కె. యస్. చిత్ర 

మందారం ముద్ధ మందారం




మావా మావా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ పూజారి (1992)
సంగీతం: దేవా
సాహిత్యం: రాజశ్రీ 
గానం: యస్.పి.బాలు, కె. యస్. చిత్ర 

మావా మావా 

Palli Balakrishna Monday, March 4, 2019
Vandemataram (2001)



చిత్రం: వందేమాతరం (2001)
సంగీతం: దేవా
సాహిత్యం: వేటూరి, జొన్నవిత్తుల, చంద్రబోస్, సుద్ధాల అశోక్ తేజ, భారవి 
గానం: యస్.పి.బాలు, పి.ఉన్నికృష్ణన్,ఉన్ని మీనన్, గంగాధర్, స్వర్ణలత (జూనియర్), అనురాధ శ్రీరామ్
నటీనటులు: విజయశాంతి, ఆనంద్, అంబరీష్, హరీశ్, రవితేజ
కథ, మాటలు, స్క్రీన్ ప్లే: JK.భారవి
దర్శకత్వం: ఓం ప్రకాశ్ రావు
నిర్మాత: నారాజయ శ్రీదేవి
విడుదల తేది: 05.01.2001



Songs List:



నో ప్రాబ్లమ్ పాట సాహిత్యం

 
చిత్రం: వందేమాతరం (2001)
సంగీతం: దేవా
సాహిత్యం: చంద్రబోస్
గానం: స్వర్ణలత, ఉన్ని మీనన్, మనో, పి. ఉన్నికృష్ణన్, గంగాధర్

నో ప్రాబ్లమ్




చందనం చంద్రుడు పాట సాహిత్యం

 
చిత్రం: వందేమాతరం (2001)
సంగీతం: దేవా
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: మనో, పి. ఉన్నికృష్ణన్, గంగాధర్, స్వర్ణలత

చందనం చంద్రుడు 



మా తుఝే సలాం పాట సాహిత్యం

 
చిత్రం: వందేమాతరం (2001)
సంగీతం: దేవా
సాహిత్యం:  JK. భారవి
గానం: పి. ఉన్నికృష్ణన్, ఉన్ని మీనన్, మనో, గంగాధర్

మా తుఝే సలాం




హిందూస్థాన అంటేనే పాట సాహిత్యం

 
చిత్రం: వందేమాతరం (2001)
సంగీతం: దేవా
సాహిత్యం: వేటూరి
గానం: అనురాధ శ్రీరామ్,  పి. ఉన్నికృష్ణన్, ఉన్ని మీనన్, మనో

హిందూస్థాన అంటేనే 




తయ్య తకిట పాట సాహిత్యం

 
చిత్రం: వందేమాతరం (2001)
సంగీతం: దేవా
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: మనో, అనురాధ శ్రీరామ్,  పి. ఉన్నికృష్ణన్, ఉన్ని మీనన్, గంగాధర్

తయ్య తకిట



పౌరుషమే చచ్చేనా పాట సాహిత్యం

 
చిత్రం: వందేమాతరం (2001)
సంగీతం: దేవా
సాహిత్యం: సుద్ధాల అశోక్ తేజ
గానం: స్వర్ణలత

పౌరుషమే చచ్చేనా

Palli Balakrishna Wednesday, February 20, 2019
Chocolate (2001)



చిత్రం: చాక్లెట్ (2001)
సంగీతం: దేవా
నటీనటులు: ప్రశాంత్, జయరే, ముంతాజ్
దర్శకత్వం: ఎ.వెంకటేష్
నిర్మాత: ఆర్.మదేశ్
విడుదల తేది: 07.09.2001



Songs List:



పల్లు పల్లు పల్లు మావిడి పల్లు పాట సాహిత్యం

 
చిత్రం: చాక్లెట్ (2001)
సంగీతం: దేవా
సాహిత్యం: శివ గణేష్
గానం: అనురాధ శ్రీరామ్, రెహన

పల్లు పల్లు పల్లు మావిడి పల్లు పల్లు మావిడి పల్లు
వళ్ళు వళ్ళు వళ్ళు బంగరు వళ్ళు బంగారు వళ్ళు
హే పల్లు పల్లు పల్లు మావిడి పల్లు పల్లు మావిడి పల్లు
వళ్ళు వళ్ళు వళ్ళు బంగరు వళ్ళు వళ్ళు బంగారు వళ్ళు
బుగ్గలోన ఆపిల్ పల్లు సిగ్గులోన చెర్రీ పల్లు
లేడీస్ హాస్టల్ సొగసు వళ్ళు నైటీలోన పడుచు వళ్ళు
మావిడి మావిడి మావిడి పల్లు మావిడి పల్లు
పడుచు వళ్ళు పడుచు వళ్ళు పరువాలు
మావిడి పల్లు మావిడి పల్లు మావిడి పల్లు

పల్లు పల్లు పల్లోయ్ పల్లు  పల్లోయ్ పల్లు పల్లు
వళ్ళు వళ్ళు వళ్ళోయ్ వళ్ళు  వళ్ళోయ్ వళ్ళు వళ్ళు

అనుదినం నిజం కాలేజ్ రేష్మి కాలేజి లైలా కాలేజి
సొంగకార్చు బంగినపల్లి మావిడి పల్లు మేమేలే
కన్ను వేసి కన్నం వేసి దోపిడి దొంగలు దోచుకుపోయే
కోహినూరు వజ్రాలతో చేసిన వళ్ళు మాదేలే
హయ్యె హయ్యె హమ్మా అబ్బ జాలీలేదోయ్ జన్మ
సిగ్గెంటోలే కొమ్మ పాడు గుంతలకిడి గుమ్మా
మావిడిపల్లు పల్లు పల్లు పల్లు పల్లు పల్లోయ్ పల్లు
బాలయ్యా ఎందీ గోలయ్యా
ఇది 70 MM కథలు రీలయ్యా
ఈశ్వర ఇహ నువ్ గ్రేట్ రా
శభాష్ గుందిరా బంగ్లా సిందూర

పల్లు పల్లు పల్లోయ్ పల్లు  పల్లోయ్ పల్లు పల్లు
వళ్ళు వళ్ళు వళ్ళోయ్ వళ్ళు  వళ్ళోయ్ వళ్ళు వళ్ళు

హే బిజ్జు వెయిటింగ్ యార్

మత్తు జల్లెరా మనసు గిల్లెరా
మత్తు జల్లెరా మనసు గిల్లెరా
బావ పొట్టోడురా  భలే గట్టోడురా
రెండు అంటించినా బయట పడనోడురా

పచ్చి పచ్చి జోకులు పేల్చి  యారోలు గుచ్చి హీరోలు మెచ్చే
బత్తాయి పల్లు బొప్పాయి పల్లు పనస పల్లు మేమేలే
సారి రాంగ్ నెంబర్
అబిడ్స్ టు బంజార హిల్స్ పాసింజర్ బస్లో మాతోటి వచ్చే
పాసింజర్స్ అల్లాడి మొక్కే సుఖాల వళ్ళు మాదేలే
హయ్యె హయ్యె డాక్టర్ సూది మందులతో డాక్టర్
హయ్యె హయ్యె సిస్టర్ ఓ బీర్ కొట్టు సిస్టర్
మావిడిపల్లు పల్లు పల్లు పల్లు పల్లు పల్లోయ్ పల్లు
కోకిల ఏంది విలవిల అది టివియే చూస్తూ చతికిల
టివియే పెడితే సీరియల్ కానీ బెటర్ మన రాస్కెల్

పల్లు పల్లు పల్లు మావిడి పల్లు పల్లు మావిడి పల్లు
వళ్ళు వళ్ళు వళ్ళు బంగరు వళ్ళు వళ్ళు బంగారు వళ్ళు
బుగ్గలోన ఆపిల్ పల్లు సిగ్గులోన చెర్రీ పల్లు
లేడీస్ హాస్టల్ సొగసు వళ్ళు నైటీలోన పడుచు వళ్ళు
మావిడి మావిడి మావిడి పల్లు మావిడి పల్లు
పడుచు వళ్ళు పడుచు వళ్ళు పరువాలు
మావిడి పల్లు మావిడి పల్లు మావిడి పల్లు
పల్లు పల్లు పల్లోయ్ పల్లు  పల్లోయ్ పల్లు పల్లు
వళ్ళు వళ్ళు వళ్ళోయ్ వళ్ళు  వళ్ళోయ్ వళ్ళు వళ్ళు




ఒసీమా! ఒసీమా! పాట సాహిత్యం

 
చిత్రం: చాక్లెట్ (2001)
సంగీతం: దేవా
సాహిత్యం: శివ గణేష్
గానం: దేవన్, అనుపమ 

ఒసీమా! ఒసీమా!



నా నీడైనా పాట సాహిత్యం

 
చిత్రం: చాక్లెట్ (2001)
సంగీతం: దేవా
సాహిత్యం: శివ గణేష్
గానం: టిప్పు 

నా నీడైనా 




సుయోధనా! సుయోధనా! పాట సాహిత్యం

 
చిత్రం: చాక్లెట్ (2001)
సంగీతం: దేవా
సాహిత్యం: శివ గణేష్
గానం: ఉన్ని మీనన్, మహాలక్ష్మి అయ్యర్ 

సుయోధనా! సుయోధనా!



ఓ ప్రియా! ఓ ప్రియా! పాట సాహిత్యం

 
చిత్రం: చాక్లెట్ (2001)
సంగీతం: దేవా
సాహిత్యం: శివ గణేష్
గానం: శ్రీనివాస్, మహాలక్ష్మి అయ్యర్ 

ఓ ప్రియా! ఓ ప్రియా! 



చింతామణి చింతామణి పాట సాహిత్యం

 
చిత్రం: చాక్లెట్ (2001)
సంగీతం: దేవా
సాహిత్యం: శివ గణేష్
గానం: మాతంగి 

చింతామణి చింతామణి 




కోకరగిరి పాట సాహిత్యం

 
చిత్రం: చాక్లెట్ (2001)
సంగీతం: దేవా
సాహిత్యం: శివ గణేష్
గానం: మురళి, సబేష్, మాతంగి 

కోకరగిరి




ఫైవ్ స్టార్ పాట సాహిత్యం

 
చిత్రం: చాక్లెట్ (2001)
సంగీతం: దేవా
సాహిత్యం: శివ గణేష్
గానం: నబారుణ్ గోష్

ఫైవ్ స్టార్ 

Palli Balakrishna Tuesday, April 17, 2018
Auto Driver (1998)


చిత్రం: ఆటో డ్రైవర్ (1998)
సంగీతం: దేవా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు, సుజాత
నటీనటులు: నాగార్జున, దీప్తి బట్నాగర్, సిమ్రాన్
దర్శకత్వం: సురేష్ కృష్ణ
నిర్మాత: డి. శివ ప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 24.04.1998

అబ్బై అబ్బై అబ్బై అబ్బై అబ్బయీ
నాకేం తక్కువ నువ్వె చెప్పు అబ్బయీ
అమ్మై అమ్మై అమ్మై అమ్మై అమ్మయె
నీకన్ని యెక్కువ అదే చిక్కు అమ్మయీ

కోరి కనక పడితే ఈ చీర తప్పు కాద
వద్దు మొర్రొ అంటె ఈ ముద్దె ముల్లు అవదా
ముల్లు పెట్టి మోగని ఈ సన్నయీ
ఎక్కిల్లు పెట్టి యెగసి పడకె పువ్వాయీ

అబ్బై అబ్బై అబ్బై అబ్బై అబ్బయీ
నాకేం తక్కువ నువ్వె చెప్పు అబ్బయీ
అమ్మై అమ్మై అమ్మై అమ్మై అమ్మయె
నీకన్ని యెక్కువ అదే చిక్కు అమ్మయీ

తమరి వయసు పాతికా
తక్కువేమి కాదుగా
తమరి జతను వెతకవేంది నాయక
పడుచు తనపు ఓపికా
ఓపగలవ గోపికా
గడుచుతనపు మడత పేచి వెయ్యకా
అరె చూస్త కాదంటె సతాయిస్తా
సరే వస్త జాగర్త సొగసు కాస్త
అందాలన్ని కందాలని తొందరపడ్డవే
అటొ ఇటొ అవ్తాయేమొ అమీ తుమీ లడాయితో

అబ్బై అబ్బై అబ్బై అబ్బై అబ్బయీ
నాకేం తక్కువ నువ్వె చెప్పు అబ్బయీ
అమ్మై అమ్మై అమ్మై అమ్మై అమ్మయె
నీకన్ని యెక్కువ అదే చిక్కు అమ్మయీ

అసలు కొసరు తెలియకా
కొసరుతుంది తియ్యగా
పగటి కలల పసితనాల కోరికా
ఒకటి ఒకటి కలపకా
ఒకటి అయ్యె కూడికా
తెలియనతంత లేత మొగ్గ కానుగా
హమ్మొ ఐతే నువ్వంత మహ ముదురా
అలా అంటె నేనుండను నీ ఎదరా
ఉడుక్కనే తలుక్కంటె నాకు మక్కువా
వొల్లొ వచ్చి పడ్డననే హడావిడి బడాయిలా

అబ్బై అబ్బై అబ్బై అబ్బై అబ్బయీ
నాకేం తక్కువ నువ్వె చెప్పు అబ్బయీ
అరె అమ్మై అమ్మై అమ్మై అమ్మై అమ్మయె
నీకన్ని యెక్కువ అదే చిక్కు అమ్మయీ

కోరి కనక పడితే ఈ చీర తప్పు కాద
వద్దు మొర్రొ అంటె ఈ ముద్దె ముల్లు అవదా
ముల్లు పెట్టి మోగని ఈ సన్నయీ
ఎక్కిల్లు పెట్టి యెగసి పడకె పువ్వాయీ



*******   *******   ********


చిత్రం: ఆటో డ్రైవర్ (1998)
సంగీతం: దేవా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్ , సుజాత

అక్కినేని అక్కినేని యువసామ్రట్ హేరోవే
యువరాణి యువరాణి ఏం వరమీయ్ మంటావే
అక్కినేని అక్కినేని యువసామ్రట్ హేరోవే
యువరాణి యువరాణీ ఏం వరమీయ్ మంటావే

ఎన్నో విన్నను నీ గురించి వచ్చను వల్లుమరచి
సర్లే నీవైనం ఆలకించి అవ్నంట ఆదరించి

అక్కినేని అక్కినేని యువసామ్రట్ హేరోవే
యువరాణి యువరాణీ ఏం వరమీయ్ మంటావే

పెదవేలె పదవిస్త మహరాజా రారా
పరువాలే చదివిస్తా రవితేజా లేరా
నుంపెక్కి సింగారం మెరిసిందే బాలా
నడుమెక్కి నయగారం వేసిందే వీలా
సిగ్గంత జడిచేలా జతకట్టి జోకొట్టి పోవేలా
నిట్టుర్పు ఎగసేలా నీవలనా జాబిల్లి జవరాలా
ముత్యాల చమటల్లో ముస్తాబే కరిగేలా
ముద్దడె పద్దతిలో నా సాటె నువ్వే

యువరాణి యువరాణీ ఏం వరమీయ్ మంటావే
అక్కినేని అక్కినేని యువసామ్రట్ హేరోవే

మొటిమల్లొ మోహాలే ముదిరే ఈ వేలా
చిటికల్లో అణిగేల అదిమేస్తె చాలా
అది కూడ అడగాల రసలీల లోలా
సుఖమంటె తెలిసేలా రగలాలి జ్వాలా
చూపుల్లొ సురకత్తి తగిలితే ఆగేన సుకుమారం
ఈడంత ఉడుకెత్తి అడిగితే ఇంకేంటి అనుమానం
ఊపెక్కె ఉపకారం కైపెక్కె అపచారం
కానిచ్చె కౌగిలిలో తీర్చేద్దం హాయీ

అక్కినేని అక్కినేని యువసామ్రట్ హేరోవే
యువరాణి యువరాణీ ఏం వరమీయ్ మంటావే
అక్కినేని అక్కినేని యువసామ్రట్ హేరోవే
యువరాణి యువరాణీ ఏం వరమీయ్ మంటావే

ఎన్నో విన్నను నీ గురించి వచ్చను వల్లుమరచి
సర్లే నీవైనం ఆలకించి అవ్నంట ఆదరించి


*******   *******   ********


చిత్రం: ఆటో డ్రైవర్ (1998)
సంగీతం: దేవా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిహరన్ , సుజాత

చందమామ చందమామ సింగారాల చందమామ
చందమామ చందమామ సాయంత్రాల చక్కనమ్మ
వస్తావా కలిసొస్తావా
కవ్వించే కన్నుల వెన్నెలతో

ఇస్తావా మనసిస్తావా కైపెక్కే కమ్మని కౌగిలితో
నింగి నేల తాళాలేసే మేళాలెన్నాడో
నిన్ను నన్ను ఊరేగించే మేఘాలెక్కడో ఓ ఓ ఓ

చందమామ చందమామ సింగారాల చందమామ

కుర్ర బుగ్గ ఎర్ర సిగ్గు పిల్ల నవ్వు
తెల్ల ముగ్గు వేసుకుంటానే
గీకైకంతా రేగేమంతా చేస్తే ఉంటా
నిన్నే జంట చేసుకుంటాలె
ఊరించేటి అందాలన్నీ ఆ
ఊరించేటి అందాలన్నీ ఆరేశాక ఆరా తీశా
చీకట్లోని చిన్నుండాలా చిత్రాలెన్నో దాచాలే
గుడిసైనా చాలే మనసుంటే
గుడికన్నా పదిలం కలిసుంటే
దాయి దాయి దాయి దాటిపోనీకు రేయి

చందమామ చందమామ సింగారాల చందమామ

తుళ్ళి పాడే గోదారల్లే ఏరు నీరు
నీవు నేనై పొంగి పోదామా
చుక్క కళ్ళ నీలాకాశం
జాబిలమ్మ జాడే ఉండే పున్నమైపొదా
మల్లె గాలి పాడె లాలి అ అ
మల్లె గాలి పాడె లాలి
గిల్లి గింత పెట్టె వేళ
సన్నజాజి సయ్యాటల్లో కన్నె మోజు చూశాలే
చెలికాడా నీడై నిలుచుంటా
జవరాలా అవుతా నీ జంట
చేయి చేయి చేయి దాటిపోనీకు హాయి
చందమామ చందమామ సింగారాల చందమామ
చందమామ చందమామ సాయంత్రాల చక్కనమ్మ
వస్తావా కలిసొస్తావా
కవ్వించే కన్నుల వెన్నెలతో
ఇస్తావా మనసిస్తావా కైపెక్కే కమ్మని కౌగిలితో
నింగి నేల తాళాలేసే మేళాలెన్నాడో
నిన్ను నన్ను ఊరేగించే మేఘాలెక్కడో


*******   *******   ********


చిత్రం: ఆటో డ్రైవర్ (1998)
సంగీతం: దేవా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుజాత

ఏమొ ఏమొ అయ్యిందిరా
అది ప్రేమొ యేమో బాగుందిరా
ఏమొ ఏమొ అయ్యిందిరా
అది ప్రేమొ యేమో బాగుందిరా

సోకొ సొమ్మొ తాకిందిరా
అది షాకో గీకో కొట్టిందిరా
వొంటికే తాకినా వల్లె జిల్లు
జంటగా మారిన ఎంగేజిలో
వొంటికే తాకినా వల్లె జిల్లు
జంటగా మారిన ఎంగేజిలో

ఏమొ ఏమొ అయ్యిందిరా
అది ప్రేమొ యేమో బాగుందిరా
సోకొ సొమ్మొ తాకిందిరా
అది షాకో గీకో కొట్టిందిరా

కిర్రు బిర్రు గున్న కుర్ర దాన
అడుగడుకు నీ వెనకే వేసుకోనా...హేయ్
కస్సు బుస్సు మన్న కల్ల వాడ
నీ చూపుల్లొ అందాలు దాచుకోనా
గింక ఒనుకు పుట్టిందే జంకే కాల్లలోనా
ఇంకా ఏమి పుట్టునో నీ డంఖా మోతలోనా
కసి కసి ఊసులూ కలవరీ ఆసులూ
కరిగిన షేపులు నరాలకే ఊపులూ

ఏమొ ఏమొ అయ్యిందిరా
అది ప్రేమొ యేమో బాగుందిరా
సోకొ సొమ్మొ తాకిందిరా
అది షాకో గీకో కొట్టిందిరా

రెచ్చి రెచ్చి పోకు అందగాడ
రేయన పగలనక చిందులోనా
ఓయ్...పిస్త పిస్త గున్న పిల్ల దానా
నీ పిలుపులకే ఒలపులతో రెచ్చిపోనా
ఒల్లొ పడ్డ ఓకె నా వొల్లె ఇస్త నీకే
యల్లొ పూల బుగ్గ మాయల్లొ పడ్డ నేడే
మరిగిన వయసులో మనోహరి వరసలు
తెరచిన తలుపులు తెనాలికే పిలుపులూ

ఏమొ ఏమొ అయ్యిందిరా
అది ప్రేమొ యేమో బాగుందిరా
చూపో చుక్కో పొడిచిందిరా
అది షేపొ రూపో మార్చిందిరా
పైటతో చుట్టినా ప్యాకేజిల్లో
చాటుగ తాకిన షాటెజుల్లో
అరె అరె వొంటికే తాకినా వల్లె జిల్లు
జంటగా మారిన ఎంగేజిలో


*******   *******   ********


చిత్రం: ఆటో డ్రైవర్ (1998)
సంగీతం: దేవా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుజాత, స్వర్ణలత

మామ మజరే మాయ బజారే
మామ మజరే మాయ బజారే
షీతో షికారే యెంతో హుషారే
షేకు షేకు రాక్ రాక్ ఊపుల్లో
గ్రీకు వీర రాకుమార చూపుల్లో
జలసాల జగడపు రగడల సొగసురి తగవులలో
నువ్వె నా సొంతం గురువ గురువ గురువ గురువ గురువా
నాదే నీ అందం మగువ బిగువ i love you అనవా

మామ మజరే మాయ బజారే
షీతో షికారే యెంతో హుషారే

విరిసాను పువ్వల్లే మెరిసాను రవ్వల్లే
దివ్వల్లె ఉంటాను నీ ఇంట చోటిస్తే
రవ్వంటె రాయేలె,దివ్వంటె వేడెలే
చాలించు నీ పోసు చలి మంట చూపమ్మా
జాబిల్లినిస్తాను జాగార వేలల్లో
పక్కేసుకుంటాను నీ పాలపుంతల్లో
తళుక్కుమంటు తరుముతా
ఉలుక్కుమటే ఉరుముతా
ఉడుక్కుపోతె ఉరుకుతా
ఇరుక్కుపోయాగా
హమేష చొరవ చొరవ చొరవ చొరవ దడైతె దరువా
హమాష తడవా తడవా తడవా ఇదేమి గొడవా

మామ మజరే మాయ బజారే
షీతో షికారే యెంతో హుషారే

అందిస్త నా వల్లు అందాల హరివిల్లు
నా సత్త వర్నాల వయ్యరి కావిల్లు
కాటెస్తె నీ కల్లు వాటెస్త నీ వొల్లు
నే దోచుకుంటాను శ్రుంగార దోసిల్లు
చుక్కెత్తుకుంటాను నీ చూపు సందిల్లో
నీ చుక్క ఎదురైతె చిక్కంట ప్రేమల్లో
వయ్యరమంత మరచిరా
మయూరమల్లె నడచిరా
వరించమంటు అడుగుతా
ఒయె భరించలేనంటా
మడు నా మెరుపో విరుపో పిలుపుకు నొగ్గొ గురువా
మెరీనా అదివొ రధొవి సతివో అతుక్కొ జతగా

మామ మజరే మాయ బజారే
మామ మజరే మాయ బజారే
షీతో షికారే యెంతో హుషారే
షేకు షేకు రాక్ రాక్ ఊపుల్లో
గ్రీకు వీర రాకుమార చూపుల్లో
జలసాల జగడపు రగడల సొగసురి తగవులలో
నువ్వె నా సొంతం గురువ గురువ గురువ గురువ గురువా
నాదే నీ అందం మగువ బిగువ i love you అనవా

థనాన తలుకొ బెలుకొ కులుకుక లుక్కొ గురుడా
హైరాన పడకె పడకె చెడకె ప్రయాస పడకే


Palli Balakrishna Monday, January 8, 2018
Prema Lekha (1996)



చిత్రం: ప్రేమలేఖ (1996)
సంగీతం: దేవా
నటీనటులు: అజిత్ కుమార్, దేవయాని, హీరా రాజగోపాల్
దర్శకత్వం: అగతియాన్
నిర్మాత: శివశక్తి పాండియన్
విడుదల తేది: 12.07.1996



Songs List:



నీ పిలుపే ప్రేమగీతం పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలేఖ (1996)
సంగీతం: దేవా
సాహిత్యం: భువనచంద్ర
గానం: చిత్ర, ఉన్ని కృష్ణన్

నీ పిలుపే ప్రేమగీతం
నీ పలుకే ప్రేమవేదం
ఆశలే బాసలై
కలలు కనే పసి మనసులై
కవితలు పాడీ
కవ్వించని కవ్వించని కవ్వించనీ
 
కళ్ళు కళ్ళు మూసుకున్నా
హృదయంతో మాటాడునమ్మా ప్రేమా
నిద్దుర చెదిరి పోయేనమ్మా
నేస్తం కోసం వెతికేనమ్మా ప్రేమా
ఆడించి పాడించి అనురాగం కురిపించీ
అలరించేదే ప్రేమా
రమ్మంటే పొమ్మంటూ పొమ్మంటే రమ్మంటూ
కవ్వించేదే ప్రేమా
ప్రేమలకు హద్దు లేదులే
దాన్ని ఎవ్వరైన ఆపలేరులే

నీ పిలుపే ప్రేమగీతం
 
జాతి లేదు మతము లేదు
కట్నాలేవి కోరుకోదు ప్రేమా
ఆది లేదు అంతం లేదు
లోకం అంతా తానై ఉండును ప్రేమా
ఊరేదో పేరేదో కన్నోళ్ళ ఊసేదో
అడగదు నిన్ను ప్రేమా 
నాలోనా నీవుండి నీలోనా నేనుండి
జీవించేదే ప్రేమా
జాతకాలు చూడబోదులే
ఎన్ని జన్మలైనా వీడిపోదులే 
 
నీ పిలుపే ప్రేమగీతం
నీ పలుకే ప్రేమవేదం
ఆశలే బాసలై
కలలు కనే పసి మనసులై
కవితలు పాడీ
కవ్వించని కవ్వించని కవ్వించనీ





దిగులు పడకురా సహొదరా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలేఖ (1996)
సంగీతం: దేవా
సాహిత్యం: భువనచంద్ర
గానం: వందేమాతరం శ్రీనివాస్

దిగులు పడకురా సహొదరా 
దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మా 
నీ ప్రేమను కాచునమ్మా దిగులు పడకురా సహొదరా
యమ్మా యమ్మా యమ్మా యమ్మా 
చినదాన్ని చూడ్లేదమ్మా వల్లోన పడ్లేదమ్మా 
మనసంతా ప్రేమేకదమ్మా


చరణం: 1 
గాంధీ స్టాచ్యూ ప్రక్కనేచూసిన ప్రేమవేరురా 
జగదాంబ ధియేటర్లో నేచూసిన ప్రేమవేరురా 
ఉడా పార్కు ఫోయే ప్రేమ వచ్చేటప్పుడు మిగలదు 
వి ఐ పి కి ప్రేమవస్తే హొటల్ రూమ్‌ దొరకదు 
ఆటో ఎక్కి తిరుగుతుంటే . . . ఓహొ . . . 
నేనాటో ఎక్కి తిరుగుతుంటే తాలోపడ్డడంటరా 
మనసుమారి ఇంకోళ్ళని ప్రేమిస్తోంది చూడరా 
కళ్ళలోనే చూసిన ప్రేమ కధలు వేరురా 
ఉన్నతమయిన ప్రేమ నీదేరా సోదరా


చరణం: 2 
లిఫ్ట్ అడిగి వచ్చే ప్రేమ షిఫ్ట్ మారి పోయెరా 
చీరలిచ్చికొన్న ప్రేమ చెయ్యిజారి పోయెరా 
ఆఫీస్‌లో పుట్టే ప్రేమ ఐదింటికి ముగిసెరా మరోప్రేమ 
బస్‌ష్టాండ్‌లో ఆరింటికి మొదలురా 
నూరు రూపాయి నోటుచూస్తే . . . ||ఓహొ|| 
నూరు రూపాయి నోటుచూస్తే ప్రేమపుట్టేకాలంరా 
ఊరుమొత్తం చుట్టిచూస్తే చూసిందంత మాయరా కళ్ళతో




పట్టూ పట్టు పరువాల పట్టు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలేఖ (1996)
సంగీతం: దేవా
సాహిత్యం: భువనచంద్ర
గానం: స్వర్ణలత

పట్టూ పట్టు పరువాల పట్టు కట్టూకట్టు సొగసైన కట్టు 
ఒట్టూ ఒట్టూ ఎదపైన ఒట్టూ చుట్టూ చుట్టూ చీరల్లే చుట్టు 
సుందరుడా నిను వలచితిరా చెలి పిలిచిన బిగువటరా 
చేకొనరా చిరు చిలకనురా నను పలుచన చేయకురా 


చరణం: 1
ఎదే నదై తరించదా నీమాటలు వింటే 
రతి మతి చలించరా నీరూపం కంటే 
ఒంపు సొంపు అంటించుకుంటా ముద్దు ముచ్చటేపంచుకుంటా 
తనువై నిన్ను పెనవేసుకుంటా నాలో నిన్ను దాచేసుకుంటా ||2|| 
విరహపు సొద వినలేవా దేవా సొగసరి సొగసులు నీవే నీవే రావాసుందరుడా 

చరణం: 2 
అనుక్షణం తపించరా నిను చూడని కళ్ళు 
ప్రతిక్షణం భరించెనా వసివాడిన వళ్ళు 
మనసే నిన్నుకోరింది గనుక మత్తే హత్తుకొమ్మంది గనుక 
ముద్దే నన్ను మురిపించి ముత్యం నీవై వేచి ఉంటానుసత్యం ||2|| 
విరహపు సొద వినలేవా దేవా సొగసరి సొగసులు నీవే నీవే రావాసుందరుడా





చిన్నదానా ఓసి చిన్నదానా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలేఖ (1996)
సంగీతం: దేవా
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఆర్.కృష్ణారాజ్, భువనచంద్ర

చిన్నదానా ఓసి చిన్నదానా
ఆశపెట్టేసి పోమాకె కుర్రదానా
చిన్నదానా ఓసి చిన్నదానా
ఆశపెట్టేసి పోమాకె కుర్రదానా
కళ్ళూ అందాలకళ్ళు కవ్వించేలే కన్నెఒళ్ళు 
చిన్నా రైలులోన చిక్కాయిలే చీనిపళ్ళు
చిన్నదానా ఓసి చిన్నదానా
ఆశపెట్టేసి పోమాకె కుర్రదానా

నువ్వునేను కలిసిన వేళ ఆశగ ఏదో మాటాడాల
ఏంకావాలో చెవిలో చెప్పెయ్ చిన్నమ్మా
ఓ .. సింగపూరు సెంటు చీర జీనూపాంటు గాజువాక 
రెండోమూడో  ఇళ్ళిస్తానే బుల్లేమ్మా
ఊరి ముందర మేళం పెట్టి పూలమేడలో తాళిని కట్టి
నా పక్కన వుండక్కర్ల జాలీగా
నీ మెరుపుల చూపులు చాలు నీ నవ్వుల మాటలు చాలు
నేనిమ్మనే నూరుముద్దులు ఇస్తావా
నీ తలంపే మత్తేక్కిస్తుందే .. బడబడబడమని
నామస్సుని తోందరచేస్తుందే
కళ్ళురెండు వెతికేస్తున్నాయే గడగడగడమని
తట్టినన్ను లాగేస్తున్నాయే ఓ..

చిన్నదానా ఓసి చిన్నదానా
ఆశపెట్టేసి పోమాకె కుర్రదానా

చూసి చూడకుండా వెళ్ళె పడుచు పిల్లలార
ఈ ప్రేమికుడివంక కాస్త కళ్ళుతెరచి చూడండోయ్..
రెండుకాళ్ళమీదా లేసి నిలబడి కళ్ళళ్ళో కళ్ళు పెట్టిచూసారంటే
మోహమొచ్చి మైకంలో పడిపొతారోయ్

సిగ్గు లజ్జ మానం అన్నీ మరిపించేదే నాగరికత
ఎనిమిదిమూరల చీరాలెందుకు చిన్నమ్మా
ఆ .. వంకాయ్ పులుసు వండాలంటే పుస్తకాలు తిరగేసేయటం
ఫ్యాషన్ ఐపోయిందే ఇప్పుడు బుల్లెమ్మా
పేస్ కట్ కి ఫెయిర్ & లవ్లీ జాకెట్ కి లోకట్ డైలీ 
లోహిప్ కీ నో రిప్లై ఏలమ్మా
లాకెట్టులో లారాకాంబ్లీ  నోట్ బుక్లో సచిన్ జాక్సన్
హెయిర్  కట్ కు  బ్యూటీపార్లర్  ఏలమ్మా

నీతలంపే మత్తేక్కిస్తుందే .. బడబడమని
నా మనసుని తొందరచేస్తుందే
కళ్ళురెండు వెతికేస్తున్నాయే గడగడమని 
తట్టినన్ను లాగేస్తున్నాయే   ఓ .. ఓ .. ఓ ..

చిన్నదానా ఓసి చిన్నదానా
ఆశపెట్టేసి పోమాకె కుర్రదానా
చిన్నదానా ఓసి చిన్నదానా
ఆశపెట్టేసి పోమాకె కుర్రదానా
కళ్ళూ అందాలకళ్ళు కవ్వించేనే కన్నెఒళ్ళు 
చిన్నా రైలులోన చిక్కాయిలే చీనిపళ్ళు




ప్రియా నిను చూడలేక  పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలేఖ (1996)
సంగీతం: దేవా
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, అనురాధ శ్రీరామ్

ప్రియా నిను చూడలేక 
ఊహలో నీ రూపు రాకా 
నీ తలపుతోనే నే బ్రతుకుతున్నా 
నీ తలపుతోనే నే బ్రతుకుతున్నా 
ప్రియా నిను చూడలేక 
ఊహలో నీ రూపు రాకా 

వీచేటి గాలులను నేనడిగాను నీ కుశలం 
ఉదయించే సూర్యుడినే నేనడిగాను నీ కుశలం 
అనుక్షణం నా మనసు తహతహలాడే 
ప్రతిక్షణం నీకోసం విలవిలలాడే 
అనుదినం కలలో నీ కథలే 
కనులకు నిదురలే కరువాయే 
ప్రియా నిను చూడలేక 
ఊహలో నీ రూపు రాకా 

కోవేలలో కోరితిని నీ దరికి నను చేర్చమని 
దేవుడినే వేడితిని కలకాలం నిను చూడమని 
లేఖతో ముద్దైన అందించరాదా 
నినుకాక లేఖలనే పెదవంటుకోదా 
వలపులు నీ దరి చేరుటెలా 
ఊహల పడవలే చేర్చునులే 

ప్రియా నిను చూడలేక 
ఊహలో నీ రూపు రాకా 
నీ తలపుతోనే నే బ్రతుకుతున్నా 
నీ తలపుతోనే నే బ్రతుకుతున్నా 
ప్రియా నిను చూడలేక 
ఊహలో నీ రూపు రాకా




ఎరుపు లోలాకు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలేఖ (1996)
సంగీతం: దేవా
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు

ఎరుపు లోలాకు కులికెను కులికెను 
ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను (2) 
అమ్మమ్మా అందాలే ఏనుగెక్కి పోతుంటే 
కలల్లో కొంటెగా సైగలేవో చేస్తుంటే 
రాజస్తానీ కన్నెపిల్ల వయసుకి వన్నెలు వచ్చిన వేళ 
ఎరుపు లోలాకు కులికెను కులికెను 
ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను 

మనసంతా మనసంతా మరుమల్లెల పులకింత 
వయసంతా వయసంతా చిరుకవితల కవ్వింత (2) 
ఏ ఊరి చల్లగాలి ఈ ఊరికొచ్చెనమ్మా 
ఒంటె మీదకెక్కి నన్ను ఊరు చుట్టు తిప్పెనమ్మ 
ఏటిగట్టు ఊరిగట్టు నన్ను చూసి పాడంగా 
సంగతులు ఎన్నెన్నో వంతులేసి చెప్పంగా 
రాజస్తానీ కన్నెపిల్ల వయసుకి వన్నెలు వచ్చిన వేళ 
ఎరుపు లోలాకు కులికెను కులికెను 
ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను 

ఆకాశం ఆకాశం ఈ సుందర ఆకాశం 
బహుదూరం బహుదూరం మనకందని నవలోకం (2) 
చుట్టి చుట్టి నన్ను చుట్టె చక్కనైన తోకచుక్క 
ముద్దు ముద్దు మాటలాడె ముచ్చటైన పాలపిట్ట 
అందాలే చిందెనులే లేత నుదుటి కుంకుమలు 
పగ్గాలే వేసెనులే నీలి నీలి ముంగురులు 
రాజస్తానీ కన్నెపిల్ల వయసుకి వన్నెలు వచ్చిన వేళ 
ఎరుపు లోలాకు కులికెను కులికెను 
ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను (2) 
అమ్మమ్మా అందాలే ఏనుగెక్కి పోతుంటే 
కలల్లో కొంటెగా సైగలేవో చేస్తుంటే 
రాజస్తానీ కన్నెపిల్ల వయసుకి వన్నెలు వచ్చిన వేళ 
ఎరుపు లోలాకు కులికెను కులికెను 
ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను


Palli Balakrishna Wednesday, August 16, 2017
Baashha (1995)


చిత్రం: బాషా (1995)
సంగీతం: దేవా
సాహిత్యం: వెన్నలకంటి (All Songs)
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: రజనీకాంత్, నగ్మా
దర్శకత్వం: సురేష్ కృష్ణ
నిర్మాత: ఆర్.యమ్. వీరప్పన్
విడుదల తేది: 12.01.1995

అదిరే.. అదిరే..
నీ నడకల స్టైలదిరే - అదిరే
నీ నవ్వుల కైపదిరే అదిరే
నీ మాటల తీరదిరే అదిరే
నీ చూపుకు ఎదఅదిరే

అదిరే.. అదిరే..
ఓ కన్నె ఎదే దోచుకున్న నీ ఫోజు అదిరే
ఆ పోజు చూసినాక జారుపైట అదిరే
అదిరే అదిరే

శీఘ్రమేవ గుడ్ బాయ్ ఫ్రెండ్ ప్రాప్తిరస్తు
నీ అల్లరి వయసే నేనొదలను పిల్లా
నన్నల్లుకు పోకా ఇక తప్పదు పిల్లా
కసి కత్తెరలేసే నీ అత్తరు పైట
చలి ఒత్తిడి కోరే తొలి వలపుల ఆట
మల్లెల లాహిరి మన్మధ చాకిరి అనువుగ కోరినది
తీయని తిమ్మిరి తేనెల చిమ్మిలి అరుదుగ అడిగినది
ముద్దు పెట్టారాదా హద్దు దాటరాదా

అదిరే.. అదిరే..
హా... నీ నడకల స్టైలదిరే - అదిరే
నీ నవ్వుల కైపదిరే అదిరే
నీ మాటల తీరదిరే అదిరే
నీ చూపుకు ఎదఅదిరే
అదిరే.. అదిరే..

నీ చూపులలోనా కసి తుమ్మెదలాడే
సెగ రేపిన ఈడే బిగి కౌగిలి కోరే
నీ మోహన దాహం నా మోవిని చేరే
ఆ వలపుల మంత్రం చలిచెమ్మలు కోరే
పెర పెరలాడే పెదవుల రాగం మధువులు కోరెనమ్మ
వయసుకు వయసే వచ్చిన వేళ మనసిక ఆగదమ్మ
పులకరింత నదిలో జలకమాడుదామా

అదిరే.. అదిరే..
ఓ నీ కులుకు నడకదిరే -  అదిరే
నీ మొలక నడుమదిరే అదిరే
వరదంటీ వయసదిరే అదిరే
పాలుగారు బుగ్గదిరే..
అదిరే.. అదిరే..
ఓ జాజిపూల మోజు పంచె అందమంత అదిరే
ఆగలేక రేగుతున్న నీ పరువం అదిరే
అదిరే అదిరే అదిరే అదిరే

Palli Balakrishna Monday, July 24, 2017
Tholi Prema (1998)




చిత్రం: తొలిప్రేమ (1998)
సంగీతం: దేవా
నటీనటులు: పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి
దర్శకత్వం: ఎ. కరుణాకరన్
నిర్మాత: జి. వి. జి. రాజు
విడుదల తేది: 24.07.1998



Songs List:



ఈ మనసే పాట సాహిత్యం

 
చిత్రం: తొలిప్రేమ (1998)
సంగీతం: దేవా
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు

అలబలబ అలబలబ ఎహె
పా... మపపని మపగా...
మనిరిసగమపా... మపపని మపగా...
అలబలబ అలబలబ ఎహె
అలబలబ అలబలబ ఎహె
అలబలబ అలబలబ ఎహె
అలబలబ అలబలబ ఎహె

అలబలబ ఆయియాయ ఎహె
అలబలబ ఆయియాయ ఎహె
అలబలబ ఆయియాయ ఎహె
అలబలబ అలబలబ

ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
పరుగెడుతోంది నీకేసి, వినమంటొందీ తన ఊసే
అలలెగసే కలవరమాయె తనలో నిను చూసే

ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్

హాలబ హాలబ
అలబా అలబా అలబా అలబా 
అలబా అలబా అలబా అలబా 

ఎన్నో కలలను చూసి కన్నే కునుకొదిలేసే
నువ్వే నను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే
ఎన్నో కలలను చూసి కన్నే కునుకొదిలేసే
నువ్వే నను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే
కోరుకున్న తీరాన్నే తాను చేరినా
తీరిపోని ఆరాటంతొ కలవరించెనా
వెనకనె తిరుగుతూ చెలిజత విడువదు
దొరికిన వరమది కుదురుగ ఉండదు
ఏం చేస్తే బాగుంటుందో చెప్పని వింత నసే

ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్

హాలబ హాలబ
అలబా అలబా అలబా అలబా 
అలబా అలబా అలబా అలబా

నీతో చెలిమిని చేసే నీలో చలువని చూసే
ఐనా ఇంకా ఏదో అడిగే అత్యాశె
నీతో చెలిమిని చేసే నీలో చలువని చూసే
ఐనా ఇంకా ఏదో అడిగే అత్యాశె
వెల్లువంటి నీ స్నేహం నన్ను అల్లినా
వెన్నలంటి నీ నవ్వుల్లో చెమ్మగిల్లినా
తహ తహ తరగదు అలజడి అణగదు
తన సొద ఇది అని తలపులు తెలుపదు
ఏమిస్తే శాంతిస్తుందో తెలుసా ఏం వరసే

ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
పరుగెడుతోంది నీకేసి, వినమంటొందీ తన ఊసే
అలలెగసే కలవరమాయె తనలో నిను చూసే

ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్



ఏమయిందో ఏమో ఈ వేళ పాట సాహిత్యం

 
చిత్రం: తొలిప్రేమ (1998)
సంగీతం: దేవా
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు

ఏమయిందో ఏమో ఈ వేళ
రేగింది గుండెలో కొత్త పిచ్చి
ఎంత వింతో బాడి ఈ వేళ
తూలింది గాలిలో రెక్కలొచ్చి
న్యూటన్ థియరీ తల్లకిందులై
తప్పుకున్నదా భూమికి ఆకర్షణ
తారానగరి కళ్ళవిందులై
చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ

చరణం: 1
వెతకాలా వైకుంఠం కోసం అంతరిక్షం వెనకాలా
హే ప్రియురాలే నీ సొంతం అయితే 
అంత కష్టం మనకేల
ప్రతి కలని చిటికెలతో గెలిచే ప్రణయాన
జత వలతో ఋతువులనే పట్టే సమయాన
ముల్లోకాలు గుప్పిట్లోనే చిక్కవా
ఒళ్లో తానే స్వర్గం వచ్చి దిగదా

చరణం: 2
జనులారా ఒట్టేసి చెబుతా నమ్ముతారా నా మాట
మనసారా ప్రేమించి చూస్తే అమృతం అందేనంట
మిస్ లైలా మిస్సైలా స్మైలే విసిరిందా
అది తగిలి కునుకొదిలి మనసే చెదిరిందా
అదే కాదా లవ్‌లో లవ్లీ లీల
అయ్యా నేనే ఇంకో మజునూలా

ఏమయిందో ఏమో ఈ వేళ
రేగింది గుండెలో కొత్త పిచ్చి
ఎంత వింతో బాడి ఈ వేళ
తూలింది గాలిలో రెక్కలొచ్చి
న్యూటన్ థియరీ తల్లకిందులై
తప్పుకున్నదా భూమికి ఆకర్షణ
తారానగరి కళ్ళవిందులై
చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ



ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా పాట సాహిత్యం

 
చిత్రం: తొలిప్రేమ (1998)
సంగీతం: దేవా
సాహిత్యం:  భువనచంద్ర
గానం: కృష్ణరాజ్

ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా
ఒళ్ళు తోమలా పౌడర్ పుయ్యలా
అరె ఇంతలోనే ఎంత డేంజరైపోయరా

ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా

కళ్ళు తెరుచుకుంటే కలలాయె
అవి మూసుకుంటే ఎద వినదాయె
సరికొత్త ఊపు వచ్చి మనసు నిలవదాయే
తారురోడ్డే స్టారు హోటలాయె
మంచినీళ్ళే ఓల్డ్ మాంకు రమ్మాయే
కారు హెడ్ లైట్సే కన్నె కొంటె చూపులాయే
పువ్వే నవ్వై హొయలొలికించేస్తుంటే
గుండే గువ్వై అరె దూసుకుపోతుంటే
లైఫ్ అంతా కైపేలే సోదరా

క్లాసు బుక్స్ యమ బోరాయె
న్యూ తాట్సు డే అండ్ నైటు విడవాయే
నిముషాలె యుగములై నిద్దర కరువాయే
క్లోజు ఫ్రెండ్సు కనపడరాయె
పేరెంట్సు మాట వినపడదాయె
పచ్చనోట్లు కూడ పేపర్ బోట్సైపోయాయే
ఏమవుతుందో కనుగొంటే ఒక వింత
కాలం చాచే కౌగిట్లో గిలిగింత
డూ యు నో వాట్ ఈజ్ దిస్ నేస్తమా

ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా
ఒళ్ళు తోమలా పౌడరు పుయ్యలా
అరె ఇంతలోనే ఎంత డేంజరైపోయరా



గగనానికి ఉదయం ఒకటే పాట సాహిత్యం

 
చిత్రం: తొలిప్రేమ (1998)
సంగీతం: దేవా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
ప్రణయానికి నిలయం మనమై
యుగయుగముల పయనం మనమై
ప్రతి జన్మలొ కలిశాం మనమె మనమే
జన్మించలేదా నీవు నాకోసమే
గుర్తించలేదా నన్ను నా ప్రాణమే
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే

చరణం: 1
నీ కన్నుల్లో కలను అడుగు ఇతడు ఎవరని
నీ గుండెల్లో తిరిగే లయనే బదులు పలకని
నిదురించు యవ్వనంలో పొద్దుపొడుపై
కదిలించలేదా నేనే మేలుకొలుపై
గతజన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువా
కలకాలం మంచు పొరలో ఉండగలనా

గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే

చరణం: 2
నా ఊహల్లో కదిలే కళలే ఎదుట పడినవి
నా ఊపిరిలో ఎగసే సెగలే కుదుట పడినవి
సమయాన్ని శాశ్వతంగా నిలిచిపోనీ
మమతన్న అమృతంలో మునిగిపోనీ
మనవైన ఈ క్షణాలే అక్షరాలై
మృతి లేని ప్రేమకథగా మిగిలిపోని

గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
ప్రణయానికి నిలయం మనమై
యుగయుగముల పయనం మనమై
ప్రతి జన్మలొ కలిశాం మనమె మనమే
జన్మించలేదా నీవు నాకోసమే
గుర్తించలేదా నన్ను నా ప్రాణమే
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ



రొమాన్స్ లో రిథమ్స్ కలగలిపిన పాట సాహిత్యం

 
చిత్రం: తొలిప్రేమ (1998)
సంగీతం: దేవా
సాహిత్యం: చంద్రబోస్
గానం: సురేష్ పీటర్స్, ఉన్ని కృష్ణన్

రొమాన్స్ లో రిథమ్స్ కలగలిపిన
లిటిల్ హార్ట్ తడాఖా
తెలిసెను గనక ఓ ఓ ఆగదే పసి చిలక
ఆశలు కాస్త ముదిరాక వలపు తగదనక
ఈడుకు వేడి తగిలాక తప్పదిక చురక
ఎ ప్లస్ బి ఏన్ ఈక్వేషన్ హే
యు అండ్ మి కలిస్తే సెన్సేషన్

డైలీ క్లాసుల్నెగ్గొట్టి లేడీస్ బస్ స్టాండ్ లో వేచే
క్రేజీ స్టూడెంట్స్ గుండె గుస గుసలే
కన్నె కళ్ళల్లోకొచ్చి కొత్త కోర్కెల్ని రేపి
కొంటె పాటలనెన్నో నేర్పించావ
టీనేజి సొగసు లోని స్వీట్నెస్
తెలుసుకోని లైఫే పరమ వేస్ట్ కన్నా
కాలేజ్ కాంపస్ లోనే లవ్ సీక్రెట్స్
తెలుసుకున్న వాడే గ్రేట్ లవర్ చిన్నా...

రిగ రిగ రిగ రిగ రి
రిగ రిగ రిగ రిగ రి

రొమాన్స్ లో రిథమ్స్ కలగలిపిన
లిటిల్ హార్ట్ తడాఖా
తెలిసెను గనక ఓ ఓ ఆగదే పసి చిలక

ప్రాణాల కన్న ప్రియురాలే మిన్న
అనుకున్న  ప్రియునిదే స్వర్గం
ఓ తొలి చూపు తోనే మగవాని మనసు
అలరించు లలనదే భాగ్యం
లేటెస్ట్ లవ్ సూత్రం బట్టీ పట్టి కాంటీన్లో అడుగెట్టి
చూపించు టాలెంట్ శక్తి
డేరింగ్ గర్ల్స్ తో జట్టు కట్టి కుర్భాని కిస్ కొట్టి
ఆడించే వెన్ను తట్టి

రిగ రిగ రిగ రిగ రి
స్టార్ట్ చేయి నువ్వు లవ్ స్టోరీ

రొమాన్స్ లో రిథమ్స్ కలగలిపిన
లిటిల్ హార్ట్ తడాఖా
తెలిసెను గనక ఓ ఓ ఆగదే పసి చిలక
హే ఆశలు కాస్త ముదిరాక వలపు తగదనక
ఈడుకు వేడి తగిలాక తప్పదిక చురక
ఎ ప్లస్ బి ఏన్ ఈక్వేషన్ హే
యు అండ్ మి కలిస్తే సెన్సేషన్

Palli Balakrishna Sunday, July 23, 2017
Naaga (2003)



చిత్రం: నాగ (2003)
సంగీతం: విద్యాసాగర్ , దేవా
నటీనటులు: జూ. యన్.టి.ఆర్, సదా, జన్నీఫర్ కొత్వాల్
దర్శకత్వం: సురేష్
నిర్మాత: ఏ. యమ్. రత్నం
విడుదల తేది: 10.01.2003



Songs List:



ఇంత చిన్న ముద్దులోన పాట సాహిత్యం

 
చిత్రం: నాగ (2003)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: ఏ. యమ్. రత్నం
గానం: ఉదిత్ నారాయణ్ , శ్రేయా గోషల్

ఇంత చిన్న ముద్దులోన ఇష్టమున్నదా 
లేక ఇంగ్లీషు ముద్దులోన కష్టమున్నదా 
ఇంచ్ ఇంచ్ ముద్దుపెట్ట ఇష్టమున్నదా 
లేక ఎంచి ఎంచి ముద్దు పెట్ట కష్టమున్నదా 
కలలో కత్తి యుద్ధం చేతుల్లో కర్ర యుద్ధం 
బుగ్గల్లో ముద్దు యుద్ధం సైయ్యా సైయ్యా 
మొత్తంగా తీపియుద్దం మెత్తంగా ముష్టి యుద్దం 
గుత్తంగా హత్తుకుందాం సైయ్యా సైయ్య 
అరెరె నీనీ నీ నీ నీ వంటే ఇష్టం 
అరెరె నీనీ నీ నీ నీతోనే కష్టం

హే ఇంత చిన్న ముద్దులోన ఇష్టమున్నదా 
లేక ఇంగ్లీషు ముద్దులోన కష్టమున్నదా 
ఏ ఇంచ్ ఇంచ్ ముద్దుపెట్ట ఇష్టమున్నదా 
లేక ఎంచి ఎంచి ముద్దు పెట్ట కష్టమున్నదా 

పూవంటి నునుమెత్తని నీ వంటి ఒంపుసొంపులు నావంటా 
చాక్కంటి చురుకైన నీ కంటి కొంటె చూపులు నావంటా 
అయ్యయ్యో వెన్నెల రేయి వేసవిగా మారినదోయ్ 
ఆ వేడి ఎదలో చేరి మోహాలే విసిరినదో 
వేయ్ వేయ్ వేయ్ వేయ్ నా మీద చేయి వేయ్ 
చేయ్ చేయ్ చేయ్ చేయ్ నా వయసు దోచేయ్ 

హే ఇంత చిన్న ముద్దులోన ఇష్టమున్నదా 
లేక ఇంగ్లీషు ముద్దులోన కష్టమున్నదా 

నడుము ఒంపులనే చూస్తుంటే మనసు జివ్వున లాగెనులే 
హ చేతి వడుపులలో నువ్వేదో పులకరించిపోయేనులే 
మచిలీపట్నం మల్లెల పడవ ఆశగ నన్నే చూసింది 
ఏటూరు ఏనుగు దంతం మెల్లగా నన్నే తాకింది 
ఏయ్ సల్సా సల్సా కలిపేయ్ వరసా 
ఏయ్ గుల్సా గుల్సా చేసేయ్ జల్సా 

హెయ్ ఇంత చిన్న ముద్దులోన ఇష్టమున్నదా 
లేక ఇంగ్లీషు ముద్దులోన కష్టమున్నదా 
ఇంచ్ ఇంచ్ ముద్దుపెట్ట ఇష్టమున్నదా 
లేక ఎంచి ఎంచి ముద్దు పెట్ట కష్టమున్నదా 
కలలో కత్తి యుద్ధం చేతుల్లో కర్ర యుద్ధం 
బుగ్గల్లో ముద్దు యుద్ధం సైయ్యా సైయ్యా 
మొత్తంగా తీపియుద్దం మెత్తంగా ముష్టి యుద్దం 
గుత్తంగా హత్తుకుందాం సైయ్యా సైయ్య 
అరెరె నీనీ నీ నీ నీ వంటే ఇష్టం 
అరెరె నీనీ నీ నీ నీతోనే కష్టం




మెకరీనా మెకరీనా పాట సాహిత్యం

 
చిత్రం: నాగ (2003)
సంగీతం: దేవా
సాహిత్యం: ఏ. యమ్. రత్నం
గానం: దేవన్, సౌమ్యారావ్

మ్యక్ మ్యక్ మ్యక్ మెకరీనా 
మ్యక్ మ్యక్ మ్యక్ మెకరీనా 
మ్యక్ మ్యక్ మ్యక్ మెకరీనా 
మెకరీనా  (4)


మెకరీనా మెకరీనా 
సొగసైన చిన్నదానా 
మెకరీనా మెకరీనా 
రెక్కలొచ్చే వయసుదానా 
మెకరీనా చిన్నదానా మగగగగ..రీనా 
కళ్ళు కొంటెకళ్ళు ఆ చూపుకు కందెను ఒళ్ళు 
మా ఎదలను దోచేయ్ కు 
మా ఎదలను దోచేయ్ కు  
పడతులు అంటే పూవులు 
అవి శ్వాసించేదే పురుషులు 
మా మనసును దోసేయ్ కు 
మెత్తని మనసులు కోసేయ్ కు 

మెకరీనా మెకరీనా 
సొగసైన చిన్నదానా 
మెకరీనా చిన్నదానా మగగగగ..రీనా 

మ్యక్ మ్యక్ మ్యక్ మెకరీనా 
మ్యక్ మ్యక్ మ్యక్ మెకరీనా 
మ్యక్ మ్యక్ మ్యక్ మెకరీనా 

నే తలచిన తిరిగే భువినై ఒక్క నిమిషం ఆపేస్తా 
ఊపిరి సేవిరి సేసడినై ఒక క్యాసెట్ చేసేస్తా హో హో హో 
నే తలచిన మబ్బుల మాలనే నా సిగలో తురిమేస్తా 
తొలకరి తో తొలి చినుకులనే బోయ్ ఫ్రెండుకు అర్పిస్తా 
ఓ ఓ ఓ 
నురగలే లేనిచో అలలే లేవోయీ
ఉరకలే లేనిచో వయసే కాదోయీ 

మ్యక్ మ్యక్ మ్యక్ మెకరీనా 
మ్యక్ మ్యక్ మ్యక్ మెకరీనా 
మ్యక్ మ్యక్ మ్యక్ మెకరీనా 
మెకరీనా  (2)

మనమిద్దరము హంసలమై ఆ నింగిలో విహరిద్దాం 
ఆకాశం అంచున నిలచి ఈ భూమిని తిలకిద్దాం ఓ ఓ ఓ 
దాహముతో పెదవెండినచో ఆ మేఘపు నీరు తాగుదాం 
రోదసిలో ఆకలివేస్తే ఆ తారలనే తిందాం ఓ ఓ ఓ 
ఆకాశంలో భూలోకంలో నివసిద్దాం రామ్మా
బోరే కొడితే వీనస్ పైన విందులు చేద్దామా

మ్యక్ మ్యక్ మ్యక్ మెకరీనా 
మ్యక్ మ్యక్ మ్యక్ మెకరీనా 
మ్యక్ మ్యక్ మ్యక్ మెకరీనా 
మెకరీనా  (2)

మెకరీనా మెకరీనా 
సొగసైన చిన్నదానా 
మెకరీనా మెకరీనా 
రెక్కలొచ్చే వయసుదానా 
మెకరీనా చిన్నదానా మగగగగ..రీనా
కళ్ళు కొంటెకళ్ళు ఆ చూపుకు కందెను ఒళ్ళు 
మా ఎదలను దోచేయ్ కు 
మా ఎదలను దోచేయ్ కు  
పడతులు అంటే పూవులు 
అవి శ్వాసించేదే పురుషులు 
మా మనసును దోసేయ్ కు 
మెత్తని మనసులు కోసేయ్ కు 



నాయుడోరి పిల్ల పాట సాహిత్యం

 
చిత్రం: నాగ (2003)
సంగీతం: దేవా
సాహిత్యం: కులశేఖర్
గానం: మనో

నాయుడోరి పిల్ల నా ఇంటికొస్తావా 
హొయి హొయి హొయి 
నాటుకోడి పులుసు నాకొండి పెడతావా 
హొయి హొయి హొయి 
నాయుడోరి పిల్ల నా ఇంటికొస్తావా 
నాటుకోడి పులుసు నాకొండి పెడతావా 
చిట్టిగారె నాకిష్టం ఆ పుట్టతేనె నాకిష్టం 
పిత్తపరిగెలు పీతవేపుడు ఎంతో ఇష్టం 
డిబ్బరొట్టె నాకిష్టం 
బూరె బుగ్గ నాకిష్టం 
పొద్దు గూకిన పస్తులుంచితె నీకే నష్టం 

నాయుడోరి పిల్ల ఓ ఓ...
నాయుడోరి పిల్ల నా ఇంటికొస్తావా 
నాటుకోడి పులుసు నాకొండి పెడతావా 

ఓ పిల్ల ఓ పిల్లా నాయుడోరి పిల్లా
ఓ పిల్ల ఓ పిల్ల ఓ పిల్లా 
ఓ పిల్ల ఓ పిల్లా నాయుడోరి పిల్లా
ఓ పిల్ల ఓ పిల్ల ఓ పిల్లా 

నా మాట విన్నావంటే వడ్డాణం చేయిస్తా 
నా మోజు తీర్చావంటే మాగాణి రాసిస్తా 
అ భలే అ భలే అ భలే అ భలే 
నా మాట విన్నావంటే వడ్డాణం చేయిస్తా 
నా మోజు తీర్చావంటే మాగాణి రాసిస్తా 
రవ్వల గాజులు తొడిగి 
నీ కాలికి గజ్జెలు కడతా 
కళ్ళకు గంతలు కట్టి 
నీ ఒళ్ళో పిల్లడినౌతా 

నాయుడోరి పిల్ల నా ఇంటికొస్తావా 
నాటుకోడి పులుసు నాకొండి పెడతావా 

రమ్మంటే రావేలా లోలోపల రగిలే జ్వాల 
సిగ్గంటు పోతావేలా ఎంచక్కటి సంధే వేళ 
రమ్మంటే రావేలా లోలోపల రగిలే జ్వాల 
సిగ్గంటు పోతావేలా ఎంచక్కటి సంధే వేళ 
అత్తరు పూసుకురానా మరుమల్లెలు చుట్టుకు రానా 
అరె మెత్తటి దుప్పటి తేనా 
నిను చాటుగా ఎత్తుకు పోనా 

నాయుడోరి పిల్ల ఓ ఓ ఓ...
నాయుడోరి పిల్ల నా ఇంటికొస్తావా 
నాటుకోడి పులుసు నాకొండి పెడతావా 
చిట్టిగారె నాకిష్టం ఆ పుట్టతేనె నాకిష్టం 
పిత్తపరిగెలు పీత వేపుడు ఎంతో ఇష్టం 
డిబ్బరొట్టె నాకిష్టం 
బూరె బుగ్గ నాకిష్టం 
పొద్దు గూకిన పస్తులుంచితె నీకే నష్టం 

నాయుడోరి పిల్ల ఓ ఓ ఓ...
నాయుడోరి పిల్ల నా ఇంటికొస్తావా 
నాటుకోడి పులుసు నాకొండి పెడతావా






ఒక కొంటె పిల్లనే చూశా పాట సాహిత్యం

 
చిత్రం: నాగ (2003)
సంగీతం: దేవా
సాహిత్యం: ఏ. యమ్. రత్నం
గానం: హరి హరన్, కార్తిక్, అనూరాధ శ్రీరామ్

ఒక కొంటె పిల్లనే చూశా
సెంటి మీటర్ నవ్వమని అడిగా 
తను నవ్వే నవ్వితే వంద మంది చచ్చిపోయారే 
అయ్యో అయ్యో అయ్యయ్యో 

ఒక కొంటె పిల్లనే చూశా 
సెంటి మీటర్ నవ్వమని అడిగా 
తను నవ్వే నవ్వితే వంద మంది చచ్చిపోయారే
అయ్యో అయ్యో అయ్యయ్యో 

బాపూ బాపూ బాపూ బాపూ 

ఒక కుర్రవాడినే చూశా నా వంక చూడమని అడిగా 
తను చూసే చూపుకి పచ్చిగడ్డి భగ్గుమన్నదే 
హాయ్యో హయ్యో హయ్యయ్యో 
బాపూ బాపూ బాపూ బాపూ 

హయ్యయ్యో హయ్యయ్యో 
హయ్యయ్యో హయ్యయ్యో 

కన్నవారినే మరిచి నిన్ను మనసులో తలచా 
పరిక్షలు వ్రాసే బదులు ప్రేమలేఖ రాశా 
స్నానపు గదిలో చిందు తలచి మదిలోన మురిశా 
వలువలు విడిచి వచ్చి సబ్బు నురగనే తొడిగా 
ఒక దోమ కుట్టినా ఓర్వనులే అది మెత్తని నా ఒంటి నైజం 
నను తేలు కుట్టినా జంకనులే అది అబ్బాయి గారి బింకం 
బాపూ బాపూ బాపూ బాపూ
మెలకువలోన కలలను కన్నా నిద్దురలోన నిజమునుకన్నా 
ఇది నీకు కలుగునే చెప్పవే భామా 
అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో 
నీకు ఏమైందో తెలియదులే అది నువ్వైనా ఎరగవే 
ఒక మాటైనా పెగలదులే ఇది తీపి చేదు కధలే 

అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో 

జామురాతిరి జాబిల్లి జగడమాడే నన గిల్లి 
నీ తోడు కోరితే గాని నిప్పు కణములే జల్లే 
శ్రావణ మాసపు జల్లు గుండెలోన గుచ్చే ముల్లు 
ఎంగిలి మింగే వేళ గొంతులోన గోల 
పర స్త్రీలను చూస్తే పడదాయె 
నా నీడతొ నాకు గొడవాయె 
మగవారిని చూస్తే విసుగాయే 
నా రేయికి వెలుతురు బరువాయె 
బాపూ బాపూ బాపూ బాపూ 
పిడుగే పడినా వినబడలేదు 
మదిలో అలజడి నిద్రపోలేదు 
ఇది నీకు తప్పదు ఒప్పుకో మామా

అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో 

ఒక కొంటె పిల్లనే చూసా 
సెంటి మీటర్ నవ్వమని అడిగా 
తను నవ్వే నవ్వితే వంద మంది చచ్చిపోయారే

తను చూసే చూపుకి పచ్చగడ్డి భగ్గుమన్నదే 
తను నవ్వే నవ్వితే వంద మంది చచ్చిపోయారే




మేఘం కరిగెను పాట సాహిత్యం

 
చిత్రం: నాగ (2003)
సంగీతం: దేవా
సాహిత్యం: ఏ. యమ్. రత్నం
గానం: కార్తిక్, చిన్మయి

తకుచికు తకజిన్ తకుచికు తకజిన్ తకుచికు తకజిన్
తకుచికు తకజిన్ తకుచికు తకజిన్ తకుచికు తకజిన్

తకుచికు తకజిన్ తకుచికు తకజిన్ 
తకుచికు తకజిన్ తకుచికు తకజిన్ 

తకుచికు తకజిన్ తకుచికు తకజిన్ 
తకుచికు తకజిన్ తకుచికు తకజిన్ 

మేఘం కరిగెను  - తకుచికు తకజిన్
మెరుపే మెరిసెను - తకుచికు తకజిన్
చినుకులు చిందెను - తకుచికు తకజిన్
హృదయం పొంగెను - తకుచికు తకజిన్
మేఘం కరిగెను మెరుపే మెరిసెను చినుకులు చిందెనులే
నా మనసుకి నచ్చిన ప్రియుడే నన్ను రమ్మని పిలిచెనులే

మేఘం కరిగెను  - తకుచికు తకజిన్
మెరుపే మెరిసెను - తకుచికు తకజిన్
చినుకులు చిందెను - తకుచికు తకజిన్
హృదయం పొంగెను - తకుచికు తకజిన్
చిన్ననాటి చిన్నది మనసివ్వమన్నది
కాదని అన్నచో నిను వదలనన్నది
చెలియ నీ గోల నా ఎదలో పూమాల

మేఘం కరిగెను  - తకుచికు తకజిన్
మెరుపే మెరిసెను - తకుచికు తకజిన్

మావయ్యా రా రా రా
నా తోడు రా రా రా
నా తనువు నీకే సొంతము రా
ఒళ్ళంతా ముద్దులాడి పోరా
వయ్యారీ రా రా రా
ఊరించా రా రా రా
ఈ ఆశ బాసలు వెంట రా
ఈ మురిపెం తీర్చి పంపుతా రా
తుమ్మెదలా రెక్కలు దాల్చి విహరించ రావయ్యా
కమ్మంగా తేనెలు గ్రోలి పులకించి పోవయ్యా
వలపుల గతం వయసుకు అందం మళ్ళి మళ్ళి వల్లిస్తా
ఇరవైరెండు ప్రాయంలోనే కాలాన్నాపేస్తా... హోయ్

చిన్ననాటి చిన్నది మనసివ్వమన్నది
కాదని అన్నచో నిను వదలనన్నది
చెలియ  నీ గోల  నా ఎదలో  పూమాల

తకుచికు తకుచికు తకుచికు తకుచికు 
తకుచికు తకుచికు తకుచికు తకుచికు చిక్ చిక్
తకుచికు తకుచికు తకుచికు తకుచికు 
తకుచికు తకుచికు తకుచికు తకుచికు చిక్ చిక్
తకుచికు తకజిన్  తకుచికు తకజిన్
తకుచికు తకజిన్   తకుచికు తకజిన్

మన్మధా రా రా రా
మత్తుగా రా రా రా
మనసులో బాణం వేసేయ్ రా
మల్లెల జల్లు చల్లిపో రా
వెన్నెలా రా రా రా
వెల్లువై రా రా రా
నీ అందం ఆరాధిస్తా రా
ఆనందం అంచు చూపుతా రా
అందాన్ని ఆనందాన్ని పంచేది తనువయ్యా
బంధాన్ని అనుబంధాన్ని పెంచేది మనసయ్యా
తనువున తాపం మనసున మోహం  ప్రేమతో తీర్చేస్తా
ఎన్నటికైన ఎప్పటికైనా నీ వరుడే నేనౌతా  హోయ్

చిన్ననాటి చిన్నది  మనసివ్వమన్నది
కాదని అన్నచో నిను వదలనన్నది
చెలియ నీ గోల  నా ఎదలో పూమాల

మేఘం కరిగెను  - తకుచికు తకజిన్
మెరుపే మెరిసెను  - తకుచికు తకజిన్
చినుకులు చిందెను  - తకుచికు తకజిన్
హృదయం పొంగెను  
మేఘం కరిగెను మెరుపే మెరిసెను చినుకులు చిందెనులే
నా మనసుకి నచ్చిన ప్రియుడే నన్ను రమ్మని పిలిచెనులే

తకుచికు తకజిన్ తకుచికు తకజిన్ 
తకుచికు తకజిన్ తకుచికు తకజిన్



అనకాపల్లి సెంటర్లోన పాట సాహిత్యం

 
చిత్రం: నాగ (2003)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: చంద్రబోస్
గానం: కార్తిక్, టిప్పు, చంద్రన్, వాసు, మణిక్క వినయగం, టిమ్మి


అనకాపల్లి సెంటర్లోన

Palli Balakrishna Friday, July 21, 2017
Master (1997)



చిత్రం: మాస్టర్ (1997)
సంగీతం: దేవా
నటీనటులు: చిరంజీవి, సాక్షి శివానంద్, రోషిణి
దర్శకత్వం: సురేష్ కృష్ణ
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 02.10.1997



Songs List:



తమ్ముడు అరె తమ్ముడు పాట సాహిత్యం

 
చిత్రం: మాస్టర్ (1997)
సంగీతం: దేవా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిరంజీవి

తమ్ముడు అరె తమ్ముడు
ఈ తికమక తెగులే ప్రేమంటే
ఈ తెలియని దిగులే ప్రేమంటే
నను అడగర చెబుతా డౌటుంటే
నువు బెదరవు కదా నా మాటింటే
అమ్మడు ఓయ్ అమ్మడు
నువు మరీ పరాగ్గా ఉంటుంటే
నీకు నిదరే సరిగా రాకుంటే
ఏం జరిగిందో తెలియాలంటే
ఆ రహస్యాన్ని చెబుతా వింటే
మాస్టారూ మాస్టారూ మాంచి లెక్చర్ ఇచ్చారు

మాస్టారూ మాస్టారూ లవ్లో మీరు మెగాస్టారు
థాంక్యూ... తమ్ముడు అరె తమ్ముడు
ఈ తికమక తెగులే ప్రేమంటే
ఈ తెలియని దిగులే ప్రేమంటే

మీరింత బాగా పాడగలరని మేమస్సలనుకోలేదు మాస్టర్
ఇంతవరకు నేనెప్పుడూ పాడలేడోయ్ ఇదే ఫస్ట్ టైం
సార్ మొదటిసారి మీరు అదరగొట్టేశారు సార్
ఆ మీ ఉత్సాహం చూసి ఏదో సరదాగా హమ్ చేయాలనిపించింది చేశానంతే
మాస్టర్ ఈ పాటకి మంచి స్టెప్ కలిసిందంటే అదురుతుంది
డాన్సేగా చాలా బాగుంటుంది చేయండి
హే... మేము కాదు మాస్టర్ మీరు
నేను డాన్సా నో నో నో
ప్లీజ్ సర్ ప్లీజ్
ఓకే ఓకే హేయ్...

వేల వేల భాషలున్న నేల మీద ఎక్కడైనా ప్రేమ గ్లామరొక్కటే లవరు
ఆ లాంగ్వేజ్ తెలియనిదెవరూ
మూగసైగలైన చాలు వేడి ఊపిరైన చాలు గుర్తుపట్టలేరా ప్రేమికులు
అవి అచ్చుతప్పు లేని ప్రేమలేఖలు
అమెరికాలో ఇంగ్లిష్ ప్రేమ
ఆఫ్రికాలో జంగిల్ ప్రేమ
హా ఏకమయ్యే ఏకాంతంలో ఎక్కడైనా ఒకటే ప్రేమ
తమ్ముడు అరె తమ్ముడు
పొట్టివాళ్లు పొట్టవాళ్లు నల్లవాళ్ళు తెల్లవాళ్ళు
ప్రేమదేశం వెళ్లగానే మానవులుగా మిగులుతారు

తమ్ముడు అరె తమ్ముడు
ఈ తికమక తెగులే ప్రేమంటే

ఈ తెలియని దిగులే ప్రేమంటే
నను అడగర చెబుతా డౌటుంటే
నువు బెదరవు కదా నా మాటింటే

లక్షాలాది లక్షణాలు చూపుతున్న ప్రేమకున్న అక్షరాలు మాత్రం రెండు
అది మహాసముద్రం ఫ్రెండు
సెంచరీల కొద్ది పెద్ద సీరియల్గా సాగుతున్న మహా నవలరా ప్యారు
ఆ స్టోరీ కొట్టదు బోరు
కా గుణింతం తెలియని వాళ్లు కాళిదాసులు అయిపోతారు
హా కాఫీ టీలే తాగని వాళ్లు దేవదాసులు అయిపోతారు
అమ్మడు ఓయ్ అమ్మడు లబ్బుడబ్బు హార్ట్ బీట్ లవ్వులవ్వు అన్నదంటే
హైక్లాసు లోక్లాసు చూసుకోదు ప్రేమ కేసు

తమ్ముడు అరె తమ్ముడు
ఈ తికమక తెగులే ప్రేమంటే

ఈ తెలియని దిగులే ప్రేమంటే
నను అడగర చెబుతా డౌటుంటే
నువు బెదరవు కదా నా మాటింటే
అమ్మడు ఓయ్ అమ్మడు
నువు మరీ పరాగ్గా ఉంటుంటే
నీకు నిదరే సరిగా రాకుంటే
ఏం జరిగిందో తెలియాలంటే
ఆ రహస్యాన్ని చెబుతా వింటే
మాస్టారూ మాస్టారూ మాంచి లెక్చర్ ఇచ్చారు
మాస్టారూ మాస్టారూ లవ్లో మీరు మెగాస్టారు





ఇంటిలోకి వెల్కమంటు పాట సాహిత్యం

 
చిత్రం: మాస్టర్ (1997)
సంగీతం: దేవా
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాజేష్, సౌమ్య

ఇంటిలోకి వెల్కమంటు గేటు తీసినాడు మాస్టరు
టేస్ట్ కాస్త చూడమంటు బూస్ట్ కలిపినాడు మాస్టరు
అలా అలా హఠాత్తుగా అటూ ఇటూ కరంట్ పోగా
నెక్స్ట్ సీను ఎం జరిగింది జస్ట్ నాకు సిగ్గేస్తుంది
నెక్స్ట్ సీను ఎం జరిగింది జస్ట్ నాకు సిగ్గేస్తుంది

ఇంటిలోకి వెల్కమంటు గేటు తీసినాడు మాస్టరు
టేస్ట్ కాస్త చూడమంటు బూస్ట్ కలిపినాడు మాస్టరు

శిస్యురాల చారుశీల శీఘ్రమేవ రొమాన్స్ నీకు ప్రాప్తిరస్తు
అక్షరాల దీక్ష బూని లవ్ లోని లెసెన్స్ నేను అలకిస్తు
అందంతో పరీక్ష ఇప్పుడు అర్ధాంగి ప్రమోషనెప్పుడు
ఫలితం రానున్నది పరువం ఔనన్నది

ఇంటిలోకి వెల్కమంటు గేటు తీసినాడు మాస్టరు
టేస్ట్ కాస్త చూడమంటు బూస్ట్ కలిపినాడు మాస్టరు

పోర్టికోలో లైబ్రరీలో కారిడార్లో భరించలేని తాపమాయె
పుస్తకాల్లో డిక్షనరీలో బ్లాకు బోర్డులో లిఖించలేని ఆకళాయే
వల్లించేయ్ వయస్సు వాచకం
చెల్లించేయ్ వయ్యారి వేతనం
గురువా లెటెందుకు
లఘువై రా ముందుకూ

ఇంటిలోకి వెల్కమంటు గేటు తీసినాడు మాస్టరు
టేస్ట్ కాస్త చూడమంటు బూస్ట్ కలిపినాడు మాస్టరు
అలా అలా హఠాత్తుగా అటూ ఇటూ కరంట్ పోగా
నెక్స్ట్ సీను ఎం జరిగింది జస్ట్ నాకు సిగ్గేస్తుంది
నెక్స్ట్ సీను ఎం జరిగింది జస్ట్ నాకు సిగ్గేస్తుంది

ఇంటిలోకి వెల్కమంటు గేటు తీసినాడు మాస్టరు
టేస్ట్ కాస్త చూడమంటు బూస్ట్ కలిపినాడు మాస్టరు




BSC అయినాగాని పాట సాహిత్యం

 
చిత్రం: మాస్టర్ (1997)
సంగీతం: దేవా
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాజేష్, కృష్ణరాజ్, చంద్రబోస్, మురళీధర్

గిల్లేలే గిల్లెల్లేలే గిల్లెల్లేలే గిల్లెల్లేలే
గిల్లేలే గిల్లెల్లేలే గిల్లెల్లేలే లే
గిల్లేలే గిల్లెల్లేలే గిల్లెల్లేలే గిల్లెల్లేలే
గిల్లేలే గిల్లెల్లేలే గిల్లెల్లేలే లే

BSC అయినాగాని MSC అయినాగాని 
SSC అయినాగాని PUC అయినాగాని
KG గాని PG గాని ఆంద్రా గాని ఆగ్రా గాని
స్టూడెంట్ లైఫ్ చాలా జాలి రమ్మన్నా రాదండి మళ్ళీ
స్టూడెంట్ లైఫ్ చాలా జాలి ఉండదు క్షణమైన కాళీ
ఓరోరి సోదరా హంగామా నీదిరా
ఓరోరి సోదరా హంగామా నీదిరా

డాడీ జేబులో డబ్బులు తీసి దాబా కెళ్ళొచ్చు
మమ్మీ పర్సును మాయం చేసి మూవీ చూడొచ్చు
బెడ్ రూమ్ నిండా పోస్టర్లెన్నో అతికించ వచ్చు
వాటిని చూస్తూ వందల ఏళ్ళు బ్రతికేయ వచ్చు
తోచిందేదో తప్పైనా చేసేయొచ్చు
తమ్ముడుకేమో యమ నీతులు బోదించొచ్చు

స్టూడెంట్ లైఫ్ చాలా జాలి రమ్మన్నా రాదండి మళ్ళీ
స్టూడెంట్ లైఫ్ చాలా జాలి ఉండదు క్షణమైన కాళీ

పీలగ ఉన్న పిల్లను నువ్వు పిన్ని అనవచ్చు
బొద్దుగ ఉన్న భామను నువ్వు భామ్మా అనవచ్చు
ఎత్తుగ ఉంటె అత్తా అంటూ వరసే కలపొచ్చు
పొట్టిగ పాపా అంటే పాప్కార్నివ్వొచ్చు
అందంగుంటే నువ్వు అడ్వాన్స్ అయిపోవచ్చు
పెళ్లి అంటే నువు ప్లేటే తిప్పేయొచ్చు

హే స్టూడెంట్ లైఫ్ చాలా జాలి రమ్మన్నా రాదండి మళ్ళీ
స్టూడెంట్ లైఫ్ చాలా జాలి ఉండదు క్షణమైన కాళీ

హే BSC అయినాగాని MSC అయినాగాని 
SSC అయినాగాని PUC అయినాగాని
KG గాని PG గాని ఆంద్రా గాని ఆగ్రా గాని
స్టూడెంట్ లైఫ్ చాలా జాలి రమ్మన్నా రాదండి మళ్ళీ
స్టూడెంట్ లైఫ్ చాలా జాలి ఉండదు క్షణమైన కాళీ
అరె రరెరే రరెరే...

ఆనందంగా ఎన్నికలల్లో పోటీచేయొచ్చు
అవతలవాడి బ్యానర్ మీద పేడే కొట్టొచ్చు
కొత్తగ వచ్చిన ఫ్యాషన్లన్నీ ఫాలో కావచ్చు
కోతికి మనకు తేడా లేదని తేల్చేయ వచ్చు
మంత్రులు పొతే సంతాపం  తెలిపేయొచ్చు
ఆతరువాత హాలిడే మనకే వచ్చు

స్టూడెంట్ లైఫ్ చాలా జాలి రమ్మన్నా రాదండి మళ్ళీ
స్టూడెంట్ లైఫ్ చాలా జాలి ఉండదు క్షణమైన కాళీ

ముప్పై మార్కులు వస్తే నువ్వు ఓకే అనవచ్చు
నలభై గాని వచ్చాయంటే షాకే తినవచ్చు
ఏబై వస్తే ప్లేబాయ్ లాగా ఫోజే కొట్టొచ్చు
అరవై వస్తే ఆలిండియానే అమ్మేయవచ్చు
డెబ్భై వస్తే నువు అబ్బుర పడిపోవచ్చు
డౌటే లేక హార్ట్ ఫెయిలైపోనువచ్చు

స్టూడెంట్ లైఫ్ చాలా జాలి రమ్మన్నా రాదండి మళ్ళీ
స్టూడెంట్ లైఫ్ చాలా జాలి ఉండదు క్షణమైన కాళీ

BSC అయినాగాని MSC అయినాగాని 
SSC అయినాగాని PUC అయినాగాని
KG గాని PG గాని ఆంద్రా గాని ఆగ్రా గాని
స్టూడెంట్ లైఫ్ చాలా జాలి రమ్మన్నా రాదండి మళ్ళీ
స్టూడెంట్ లైఫ్ చాలా జాలి ఉండదు క్షణమైన కాళీ
ఓరోరి సోదరా హంగామా నీదిరా
ఓరోరి సోదరా హంగామా నీదిరా





తిలోత్తమా ప్రియ వయ్యారమా పాట సాహిత్యం

 
చిత్రం: మాస్టర్ (1997)
సంగీతం: దేవా
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిహరన్, సుజాత

తిలోత్తమా ప్రియ వయ్యారమా
ప్రభాతమా శుభ వసంతమా
నే మోయలేనంటూ హృదయాన్ని అందించా
నేనున్నా లెమ్మంటూ అది నాలో దాచేశా
ఏ దారిలో సాగుతున్నా ఎద నీవైపుకే లాగుతోంది
ఏ వేళలో ఎప్పుడైనా మది నీ ఊహలో ఊగుతోంది

ఆ... తిలోత్తమా ప్రియ వయ్యారమా...

చరణం: 1
పెదవే ఓ మధుర కవిత చదివే
అడుగే నా గడపనొదిలి కదిలే
ఇన్నాళ్ళు లేని ఈ కొత్త బాణీ 
ఇవ్వాళే మనకెవరు నేర్పారమ్మా
ఈ మాయ చేసింది ప్రేమే
ప్రియా ప్రేమంటే ఒకటైన మనమే

తిలోత్తమా సుఖ వసంతమా

చరణం: 2
కలలే నా ఎదుట నిలిచె నిజమై
వలపే నా ఒడికి దొరికె వరమై
ఏ రాహువైనా ఆషాఢమైనా 
ఈ బహుబంధాన్ని విడదీయునా
నీ మాటలే వేదమంత్రం
చెలి నువ్వన్నదే నా ప్రపంచం

తిలోత్తమా ప్రియ వయ్యారమా
ప్రభాతమా శుభ వసంతమా
నే మోయలేనంటూ హృదయాన్ని అందించా
నేనున్నా లెమ్మంటూ అది నాలో దాచేశా
ఏ దారిలో సాగుతున్నా ఎద నీవైపుకే లాగుతోంది
ఏ వేళలో ఎప్పుడైనా మది నీ ఊహలో ఊగుతోంది




బావున్నార బాగున్నార పాట సాహిత్యం

 
చిత్రం: మాస్టర్ (1997)
సంగీతం: దేవా
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాజేష్, సౌమ్య

బావున్నార బాగున్నార  భామ గారు బాగున్నారా
ఆ బావున్నార బాగున్నార  భామ గారు బాగున్నారా
బావున్నార బాగున్నార  బావగారు బాగున్నారా
ఎదురు చూపులు చూస్తున్నారా మధన జపమే చేస్తున్నారా
ఆరు అడుగుల మాగధీరుడిని ఎవ్వరైనా వదిలేస్తారా
ఇంతబాగా శెలవిస్తారా అమ్మో చిన్నమ్మమ్మో...
అమ్మో అమ్మమ్మమ్మో...

ఆ బావున్నార బాగున్నార  భామ గారు బాగున్నారా
బావున్నార బాగున్నార  బావగారు బాగున్నారా

చిన్ని ముద్దు ఇమ్మంటారా ఛి పో వద్దు పొమ్మంటారా
చుమ్మా అంటు చెంతకొస్తే కొమ్మమీద కూర్చుంటారా
మాట మాట పెంచేశారా మంచి చెడ్డా మానేశారా
గోటితోటి పోయేదాన్ని గూటిదాకా లాగేశారా
వరసలు కలిపి మరదలు ఒడికే వేంచేస్తారా మనసారా
బూరెల్లాంటి బుగ్గలు రెండు బొంచేస్తాలే కడుపార
ఆపై రతి మహరాజల్లే మత్తుల్లో ముంచేస్తారా
అమ్మో అమ్మమ్మమ్మో...
అమ్మో చిన్నమ్మమ్మో...

బావున్నార బాగున్నార  భామ గారు బాగున్నారా
బాగున్నార బాగున్నార  బావగారు బాగున్నారా

పిల్లా అంటు లాలిస్తారా పెళ్ళాం పోస్ట్ ఇప్పిస్తారా
లిల్లిపూల మంచం మీద పిల్లో నాకు పంచిస్తారా
వేళా పాలా లేదంటారా వేలాకోళం కాదంటారా
చాటుమాటు పాఠాలన్ని నోటితోటి చెప్పిస్తారా
ఆలుమగలం అయిపోతాంలే అడిగిందిచ్చే సుకుమారా
నోరే జారితే పరవాలేదు కాలే జారకు యువతారా
జరిగే కళ్యాణం దాకా జాగారం చెయ్ మంటారా
అమ్మో అమ్మమ్మమ్మో...
అమ్మో చిన్నమ్మమ్మో...

బావున్నార బాగున్నార  భామ గారు బాగున్నారా
బావున్నార బాగున్నార  బావగారు బాగున్నారా
ఎదురు చూపులు చూస్తున్నారా మధన జపమే చేస్తున్నారా
ఆరు అడుగుల మాగధీరుడిని ఎవ్వరైనా వదిలేస్తారా
ఇంతబాగా శెలవిస్తారా అమ్మో చిన్నమ్మమ్మో...
అమ్మో అమ్మమ్మమ్మో...

Palli Balakrishna Sunday, July 16, 2017

Most Recent

Default