-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Keerthi Reddy"
Tholi Prema (1998) Telugu Songs Lyrics Album Cover

Tholi Prema (1998) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Tholi Prema (1998)
Music : Deva
Director : A. Karunakaran
Producer : G. V. G. Raju
Actors : Pawan Kalyan
Actresses : Keerthi Reddy
Release Date : 24 July 1998

Ee Manase Se Se Song Lyrics in Telugu – Tholi Prema (1998)

'Ee Manase Se Se' song from Tholi Prema (1998) movie is composed by Deva and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Tholi Prema (1998)
Music : Deva
చిత్రం: తొలిప్రేమ (1998) సంగీతం: దేవా సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం అలబలబ అలబలబ ఎహె పా... మపపని మపగా... మనిరిసగమపా... మపపని మపగా... అలబలబ అలబలబ ఎహె అలబలబ అలబలబ ఎహె అలబలబ అలబలబ ఎహె అలబలబ అలబలబ ఎహె అలబలబ ఆయియాయ ఎహె అలబలబ ఆయియాయ ఎహె అలబలబ ఆయియాయ ఎహె అలబలబ అలబలబ ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్ నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్ పరుగెడుతోంది నీకేసి, వినమంటొందీ తన ఊసే అలలెగసే కలవరమాయె తనలో నిను చూసే ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్ నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్ హాలబ హాలబ అలబా అలబా అలబా అలబా అలబా అలబా అలబా అలబా ఎన్నో కలలను చూసి కన్నే కునుకొదిలేసే నువ్వే నను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే ఎన్నో కలలను చూసి కన్నే కునుకొదిలేసే నువ్వే నను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే కోరుకున్న తీరాన్నే తాను చేరినా తీరిపోని ఆరాటంతొ కలవరించెనా వెనకనె తిరుగుతూ చెలిజత విడువదు దొరికిన వరమది కుదురుగ ఉండదు ఏం చేస్తే బాగుంటుందో చెప్పని వింత నసే ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్ నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్ హాలబ హాలబ అలబా అలబా అలబా అలబా అలబా అలబా అలబా అలబా నీతో చెలిమిని చేసే నీలో చలువని చూసే ఐనా ఇంకా ఏదో అడిగే అత్యాశె నీతో చెలిమిని చేసే నీలో చలువని చూసే ఐనా ఇంకా ఏదో అడిగే అత్యాశె వెల్లువంటి నీ స్నేహం నన్ను అల్లినా వెన్నలంటి నీ నవ్వుల్లో చెమ్మగిల్లినా తహ తహ తరగదు అలజడి అణగదు తన సొద ఇది అని తలపులు తెలుపదు ఏమిస్తే శాంతిస్తుందో తెలుసా ఏం వరసే ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్ నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్ పరుగెడుతోంది నీకేసి, వినమంటొందీ తన ఊసే అలలెగసే కలవరమాయె తనలో నిను చూసే ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్ నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్

Yemaindo Yemo Ee Vela Song Lyrics in Telugu – Tholi Prema (1998)

'Yemaindo Yemo Ee Vela' song from Tholi Prema (1998) movie is composed by Deva and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Tholi Prema (1998)
Music : Deva
Lyricist : Bhuvanachandra
చిత్రం: తొలిప్రేమ (1998) సంగీతం: దేవా సాహిత్యం: భువనచంద్ర గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఏమయిందో ఏమో ఈ వేళ రేగింది గుండెలో కొత్త పిచ్చి ఎంత వింతో బాడి ఈ వేళ తూలింది గాలిలో రెక్కలొచ్చి న్యూటన్ థియరీ తల్లకిందులై తప్పుకున్నదా భూమికి ఆకర్షణ తారానగరి కళ్ళవిందులై చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ చరణం: 1 వెతకాలా వైకుంఠం కోసం అంతరిక్షం వెనకాలా హే ప్రియురాలే నీ సొంతం అయితే అంత కష్టం మనకేల ప్రతి కలని చిటికెలతో గెలిచే ప్రణయాన జత వలతో ఋతువులనే పట్టే సమయాన ముల్లోకాలు గుప్పిట్లోనే చిక్కవా ఒళ్లో తానే స్వర్గం వచ్చి దిగదా చరణం: 2 జనులారా ఒట్టేసి చెబుతా నమ్ముతారా నా మాట మనసారా ప్రేమించి చూస్తే అమృతం అందేనంట మిస్ లైలా మిస్సైలా స్మైలే విసిరిందా అది తగిలి కునుకొదిలి మనసే చెదిరిందా అదే కాదా లవ్‌లో లవ్లీ లీల అయ్యా నేనే ఇంకో మజునూలా ఏమయిందో ఏమో ఈ వేళ రేగింది గుండెలో కొత్త పిచ్చి ఎంత వింతో బాడి ఈ వేళ తూలింది గాలిలో రెక్కలొచ్చి న్యూటన్ థియరీ తల్లకిందులై తప్పుకున్నదా భూమికి ఆకర్షణ తారానగరి కళ్ళవిందులై చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ

Emi Sodhara Song Lyrics in Telugu – Tholi Prema (1998)

'Emi Sodhara' song from Tholi Prema (1998) movie is composed by Deva and sung by Krishna Raj.

SONG INFORMATION
Movie : Tholi Prema (1998)
Music : Deva
Singers : Krishna Raj
చిత్రం: తొలిప్రేమ (1998) సంగీతం: దేవా సాహిత్యం: సిరివెన్నెల గానం: కృష్ణరాజ్ ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా ఒళ్ళు తోమలా పౌడర్ పుయ్యలా అరె ఇంతలోనే ఎంత డేంజరైపోయరా ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా కళ్ళు తెరుచుకుంటే కలలాయె అవి మూసుకుంటే ఎద వినదాయె సరికొత్త ఊపు వచ్చి మనసు నిలవదాయే తారురోడ్డే స్టారు హోటలాయె మంచినీళ్ళే ఓల్డ్ మాంకు రమ్మాయే కారు హెడ్ లైట్సే కన్నె కొంటె చూపులాయే పువ్వే నవ్వై హొయలొలికించేస్తుంటే గుండే గువ్వై అరె దూసుకుపోతుంటే లైఫ్ అంతా కైపేలే సోదరా క్లాసు బుక్స్ యమ బోరాయె న్యూ తాట్సు డే అండ్ నైటు విడవాయే నిముషాలె యుగములై నిద్దర కరువాయే క్లోజు ఫ్రెండ్సు కనపడరాయె పేరెంట్సు మాట వినపడదాయె పచ్చనోట్లు కూడ పేపర్ బోట్సైపోయాయే ఏమవుతుందో కనుగొంటే ఒక వింత కాలం చాచే కౌగిట్లో గిలిగింత డూ యు నో వాట్ ఈజ్ దిస్ నేస్తమా ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా ఒళ్ళు తోమలా పౌడరు పుయ్యలా అరె ఇంతలోనే ఎంత డేంజరైపోయరా

Gagananiki Udayam Song Lyrics in Telugu – Tholi Prema (1998)

'Gagananiki Udayam' song from Tholi Prema (1998) movie is composed by Deva and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Tholi Prema (1998)
Music : Deva
చిత్రం: తొలిప్రేమ (1998) సంగీతం: దేవా సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే ప్రణయానికి నిలయం మనమై యుగయుగముల పయనం మనమై ప్రతి జన్మలొ కలిశాం మనమె మనమే జన్మించలేదా నీవు నాకోసమే గుర్తించలేదా నన్ను నా ప్రాణమే ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే చరణం: 1 నీ కన్నుల్లో కలను అడుగు ఇతడు ఎవరని నీ గుండెల్లో తిరిగే లయనే బదులు పలకని నిదురించు యవ్వనంలో పొద్దుపొడుపై కదిలించలేదా నేనే మేలుకొలుపై గతజన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువా కలకాలం మంచు పొరలో ఉండగలనా గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే చరణం: 2 నా ఊహల్లో కదిలే కళలే ఎదుట పడినవి నా ఊపిరిలో ఎగసే సెగలే కుదుట పడినవి సమయాన్ని శాశ్వతంగా నిలిచిపోనీ మమతన్న అమృతంలో మునిగిపోనీ మనవైన ఈ క్షణాలే అక్షరాలై మృతి లేని ప్రేమకథగా మిగిలిపోని గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే ప్రణయానికి నిలయం మనమై యుగయుగముల పయనం మనమై ప్రతి జన్మలొ కలిశాం మనమె మనమే జన్మించలేదా నీవు నాకోసమే గుర్తించలేదా నన్ను నా ప్రాణమే ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

Romance Rhythm Song Lyrics in Telugu – Tholi Prema (1998)

'Romance Rhythm' song from Tholi Prema (1998) movie is composed by Deva and sung by Suresh Peters and P. Unnikrishnan.

SONG INFORMATION
Movie : Tholi Prema (1998)
Music : Deva
Lyricist : Bhuvanachandra
చిత్రం: తొలిప్రేమ (1998) సంగీతం: దేవా సాహిత్యం: భువనచంద్ర గానం: సురేష్ పీటర్స్, ఉన్ని కృష్ణన్ రొమాన్స్ లో రిథమ్స్ కలగలిపిన లిటిల్ హార్ట్ తడాఖా తెలిసెను గనక ఓ ఓ ఆగదే పసి చిలక ఆశలు కాస్త ముదిరాక వలపు తగదనక ఈడుకు వేడి తగిలాక తప్పదిక చురక ఎ ప్లస్ బి ఏన్ ఈక్వేషన్ హే యు అండ్ మి కలిస్తే సెన్సేషన్ డైలీ క్లాసుల్నెగ్గొట్టి లేడీస్ బస్ స్టాండ్ లో వేచే క్రేజీ స్టూడెంట్స్ గుండె గుస గుసలే కన్నె కళ్ళల్లోకొచ్చి కొత్త కోర్కెల్ని రేపి కొంటె పాటలనెన్నో నేర్పించావ టీనేజి సొగసు లోని స్వీట్నెస్ తెలుసుకోని లైఫే పరమ వేస్ట్ కన్నా కాలేజ్ కాంపస్ లోనే లవ్ సీక్రెట్స్ తెలుసుకున్న వాడే గ్రేట్ లవర్ చిన్నా... రిగ రిగ రిగ రిగ రి రిగ రిగ రిగ రిగ రి రొమాన్స్ లో రిథమ్స్ కలగలిపిన లిటిల్ హార్ట్ తడాఖా తెలిసెను గనక ఓ ఓ ఆగదే పసి చిలక ప్రాణాల కన్న ప్రియురాలే మిన్న అనుకున్న ప్రియునిదే స్వర్గం ఓ తొలి చూపు తోనే మగవాని మనసు అలరించు లలనదే భాగ్యం లేటెస్ట్ లవ్ సూత్రం బట్టీ పట్టి కాంటీన్లో అడుగెట్టి చూపించు టాలెంట్ శక్తి డేరింగ్ గర్ల్స్ తో జట్టు కట్టి కుర్భాని కిస్ కొట్టి ఆడించే వెన్ను తట్టి రిగ రిగ రిగ రిగ రి స్టార్ట్ చేయి నువ్వు లవ్ స్టోరీ రొమాన్స్ లో రిథమ్స్ కలగలిపిన లిటిల్ హార్ట్ తడాఖా తెలిసెను గనక ఓ ఓ ఆగదే పసి చిలక హే ఆశలు కాస్త ముదిరాక వలపు తగదనక ఈడుకు వేడి తగిలాక తప్పదిక చురక ఎ ప్లస్ బి ఏన్ ఈక్వేషన్ హే యు అండ్ మి కలిస్తే సెన్సేషన్

Palli Balakrishna Monday, June 22, 2026


చిత్రం: ప్రేమించే మనసు (1999)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్
నటీనటులు: వడ్డే నవీన్, కీర్తి రెడ్డి, రవితేజ
దర్శకత్వం: ఆదినారాయణ
నిర్మాత:
విడుదల తేది: 17.09.1999



ఎవరే చెలి నువ్వెవరే



*****  ******  *******


చిత్రం: ప్రేమించే మనసు (1999)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: చంద్రబోస్
గానం: మనో


మాలోని  మాట పాట ఆట



*****  ******  *******


చిత్రం: ప్రేమించే మనసు (1999)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర


నీకు తెలుసు కథ



*****  ******  *******


చిత్రం: ప్రేమించే మనసు (1999)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్


నీ చూపు చలమ్మ



*****  ******  *******


చిత్రం: ప్రేమించే మనసు (1999)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: చంద్రబోస్
గానం:


మై డియర్ మై డియర్



*****  ******  *******


చిత్రం: ప్రేమించే మనసు (1999)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: చంద్రబోస్
గానం:


ముంబై మినుకు బంగారు షేక్




Palli Balakrishna Wednesday, February 13, 2019




చిత్రం: అర్జున్ (2004)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: మహేష్ బాబు, శ్రేయ, రాజా, కీర్తిరెడ్డి
దర్శకత్వం: గుణశేఖర్
నిర్మాత: జి. రమేష్ బాబు
విడుదల తేది: 20.08.2004



Songs List:



ఒక్క మాట పాట సాహిత్యం

 
చిత్రం: అర్జున్ (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: శంకర్ మహదేవన్

సంభవామి సంభవామి 
సాగరాలే దాటిపోనీ, 
అంబరాలే అంటుకోనీ.. 
సంభవామి. 

పల్లవి : 
ఒక్క మాట ఒక్క బాణం ఒక్కటేలే గురి గురి 
ఒక్క చూపుకి దిక్కులన్ని పిక్కటిల్లే చరి చరి 
ఓటుమంటు లేని వాడు ఒక్కడైన సరి 
ఓ మనస్సు ఉంటే మార్చుదాకా మార్గముంది చలో 
ఛల్‌రె చల్‌రే ఛలో . . .ఛల్‌రె చల్‌రే ఛలో . . . 

free ur mind free ur soul 
see what u find and take control 
high high through the sky through the sky fly high 
through the sky fly 
through the sky fly high fly 
one word one shoot 
i am here to stay 

చరణం: 1 
చుక్కలు తెంచెయ్‌ చకా చకా 
హక్కులు మనవే పక పక 
రెక్కల గుర్రం ఎక్కిపో ఆ గగనాన్ని ఏలుకో 
స్వాగతం అనధిరంగా గీతికా 
జోకులకే కధ చేబుదాం వెన్నెలతో మొరపెడదాం 
సాహసం చెయ్యర ఇంకా ఢింభకా 
చెంగులతో ఓడిద్దాం చెడుగుడునే ఆడేద్దాం 
ఆకాశంలో భూకంపాలే సంభవం సర్వంనీకే సంభవం 
ఓ దశ నీ ప్రేయసేలే ఛల్‌రేఛలో ఛల్‌రే ఛలో ||ఒక్కమాట|| 

చరణం: 2 
పరుగులు పెట్టే గంగ నువ్వు ఉరికే కృష్ణకు కలపరా 
నదులే కాదు యెదలను కలిపిస్తేనే గెలుపురా 
జీవితం ఈ పేటర్ల‌లో స్నేహితం 
స్వరములతో జతకడదాం క్షణములలో గురి పెడదాం 
ఎవ్వరం ఇజీకోల్టు అద్భుతం 
మనస్సల్లే పరిగెడదాం మనిషల్లే నిలబడదాం 
వేగం వేగం అంతా వేగం సంభవం సర్వం నీకే సంభవం 
ఊర్వశి నీ ప్రేయసేలే ఛల్‌రె ఛలో ఛల్‌రేఛలో



ఓ చెలి పాట సాహిత్యం

 
చిత్రం: అర్జున్ (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర, కార్తీక్

ఓ చెలి




మధుర మధురతర మీనాక్షి పాట సాహిత్యం

 
చిత్రం: అర్జున్ (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: ఉన్ని కృష్ణన్, హరిణి

మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి 
మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . . 
మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి 
మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . 
జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ . . . 
జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ . . . 
లేత సిగ్గులా సరిగమలా జాబిలీ 
అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి 
వరముల చిలకా స్వరముల చిలకా తరమున చిలక కలదానా 
హిమగిరి చిలకా శివగిరి చిలకా 
మమతలు చిలుకా దిగి రావా

మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి
మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . .

శృంగారం వాగైనదీ ఆ వాగే వరదైనదీ 

ముడిపెట్టి యేరైనది విడిపోతే నీరైనది 
భరతనాట్య సంభరిత నర్తని కూచిపూడిలో తకదిమితోం 
విశ్వనాధుని ఏకవీర తమిళ మహిళల వనుకువతో 

మనసే మధురై కొలువైన తల్లి మా మీనాక్షి
యెదలో యమునై మమ్మేటి ప్రేమకి మీసాక్షి 

వరముల చిలకా స్వరముల చిలకా తరమున చిలక కలదానా
హిమగిరి చిలకా శివగిరి చిలకా
మమతలు చిలుకా దిగి రావా


అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది 
సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది 
మధురమేను మా తెలుగు నాయకుల మధుర సాహితి రసికతలో 
కట్టబ్రహ్మ తొడగొట్టి నిలిచిన తెలుగు వీర ఘన చరితలలో 
తెలుగూ తమిళం జత కట్టెనెన్నడో మీనాక్షి 
మనసూ మనసూ ఒకటైన జంటకి ఈ  సాక్షి

వరముల చిలకా స్వరముల చిలకా తరమున చిలక కలదానా
హిమగిరి చిలకా శివగిరి చిలకా
మమతలు చిలుకా దిగి రావా

మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి

మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . . 

జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ . . .
జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ . . .
లేత సిగ్గులా సరిగమలా జాబిలీ
అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి
వరముల చిలకా స్వరముల చిలకా తరమున చిలక కలదానా
హిమగిరి చిలకా శివగిరి చిలకా
మమతలు చిలుకా దిగి రావా

మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి
మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . . 




రారా రాజకుమారా పాట సాహిత్యం

 
చిత్రం: అర్జున్ (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: ఉదిత్ నారాయణ్, స్వర్ణలత 

రారా రాజకుమారా



ఏయ్‌ పిల్ల ఏం చేద్దాం చెప్పు పాట సాహిత్యం

 
చిత్రం: అర్జున్ (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. చరణ్, శ్రేయ గోషల్

ఏయ్‌ పిల్ల ఏం చేద్దాం చెప్పు 
ఏదో చేసెయ్‌ అది మాత్రం తప్పు 
ఏయ్‌ పిల్లా ఏంటమ్మా తప్పు 
ఏయ్‌ అబ్బాయ్‌ అడగద్దు ఆ అప్పు 
ఏఏ కన్నేసా కోనేట్లో ఆడేసా అందాలలో చాలీసా 
కోయ్‌ కోయ్‌ అబ్బాయి లేలేత సొరకాయి 
బోర్లిస్తా బొప్పాస్కాయి 

చరణం: 1 
ఆ తేనెలలో ప్రేమలీల ఎన్నడో 
ఓ ఫ్యామలీగా రాసలీల ఎప్పుడో 
నే పక్కకొస్తే నీకు ఎంత తిక్కరో 
నే ముద్దు కోరి సోకితే నీ చక్కిరో 
అందాలు మాట్లాడు అమ్మాయి ఒళ్ళంతా 
అల్లుకుంటే హాయి కంటే తీపి తుళ్ళింతా 
ఆరాలు తీసేటి అబ్బాయి కళ్ళంతా 
బేరానికొస్తాయి అమ్మయి కళ్ళంతా

చరణం: 2 
నే చాకులాంటి సోకులున్న పిల్లని 
నా సోకు కిందపైట చాటు ఉండని 
ఏ దక్కకున్న తీరదే ఈ దప్పిక 
నువ్వు ఒప్పుకుంటే తప్పులేదే గోపిక 
రేపొచ్చి కనిపించు రెండో కృష్ణయ్యా 
ఈలకైనా తీలకైనా వేళ ఉందయ్యా 
కోనేటి కెరటాల కోలాటాలమ్మా 
నాటికోక కట్టుకోక బెట్టు ఏలమ్మా 
ఏయ్‌ పిల్లా ఏం చేద్దాం చెప్పు 
ఏయ్‌ చెప్పు కాఫీ ఓకప్పు 
ఏయ్ ‌ఒళ్ళు ఎట్టుందో చెప్పు 
ఎట్టా ఉన్నా ఉడకదులే నీపప్పు 




డుమ్ డుమారే డుమ్ డుమారే పాట సాహిత్యం

 
చిత్రం: అర్జున్ (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి.బాలు, చిత్ర

డుమ్ డుమారే డుమ్ డుమారే 
పిల్ల పెళ్ళి చాంగుభళారే భళారే
జంజమారే జంజమారే శివుడు పెళ్ళి చాంగు భళారే భళారే
ఆళ్గర్ పిరుమూడ్లు అందాల చెల్లెలా మిల మిలలాడే మీనాక్షి
నీకంటి పాపని కాచుకో చల్లగా తెల తెలవారని ఈ రాత్ర్రి
చిందెయ్యరా ఓ సుందరా శ్రీగారికే బొట్టు పెట్టెయ్యరా
తందనాలా తారలతో బంజరు మాకు తప్పించారా
ఈ పెళ్ళికి పేరంటమే ఊరేగవే ఊరంతా
కళ్యాణమే వైభోగమే కన్నార్పకే కాసంతా

చరణం: 1
మధురా వురికే రా చిలకా రావేనులే
పెళ్ళి పందిళ్ళలో ముగ్గేసినా పన్నీటి ముత్యాలెన్నో
కనుచాపలకు నిదురంటూ రారాదని
కరగెంటానులే ఆడానులే గంగమ్మ నాట్యాలెన్నో
భువిలో కోలాటం గుండెలో ఆరాటం
యెదలో మొదలాయే పోరాటమే

చరణం: 2
అతి సుందరుడే సోదరుడే తోడు ఉండగా తల్లి ఈ కాపురం
శ్రీ గోపురం తాకాలి నీలాకాశం
ఇలా పేగుముడి ప్రేమగుడి నా తల్లివే
నువ్వు నా అండగా నాకుండగా కంపించి పోదా కైలాసం
ఇప్పుడే శుభ లగ్నం ఇది నా సంకల్పం
విధినే ఎదిరిస్తా నీ సాక్షిగా

Palli Balakrishna Saturday, August 19, 2017

Most Recent

Default