Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Aamani"
Shubhamasthu (1995)



చిత్రం: శుభమస్తు (1995)
సంగీతం: కోటి 
నటీనటులు: జగపతి బాబు, ఆమని, ఇంద్రజ, కృష్ణ
దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు
నిర్మాత: ఎం.వి.లక్ష్మి, ఎడిటర్ మోహన్
విడుదల తేది: 20.10.1995



Songs List:



గో గో గోపాల పాట సాహిత్యం

 
చిత్రం: శుభమస్తు (1995)
సంగీతం: కోటి 
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, స్వర్ణలత జూనియర్ 

(ఇంద్రజ, కృష్ణ లపై చిత్రీకరించారు)

గో గో గోపాల



ఈ భందనాల నందనాన్ని పాట సాహిత్యం

 
చిత్రం: శుభమస్తు (1995)
సంగీతం: కోటి 
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు

ఈ భందనాల నందనాన్ని 



ఘల్ ఘల్ అను పాట సాహిత్యం

 
చిత్రం: శుభమస్తు (1995)
సంగీతం: కోటి 
సాహిత్యం: సామవేదం షణ్ముఖశర్మ 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

ఘల్ ఘల్ అను




ఓసి మిస్సో ఓని మిస్సో పాట సాహిత్యం

 
చిత్రం: శుభమస్తు (1995)
సంగీతం: కోటి 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

ఓసి మిస్సో ఓని మిస్సో 



ఓ మామ పాట సాహిత్యం

 
చిత్రం: శుభమస్తు (1995)
సంగీతం: కోటి 
సాహిత్యం: డి.నారాయణ వర్మ
గానం: రాధిక, మురళి

ఓ మామ
పొయ్యి మీద పులుసెట్టి పొయ్యి కింద పిడకెట్టి 

Palli Balakrishna Thursday, November 23, 2023
Narayana & Co (2023)



చిత్రం: నారాయణ & కో (2023)
సంగీతం: నాగ వంశి
నటీనటులు: సుధాకర కోమకుల, ఆమని 
దర్శకత్వం: చిన్నా పాపిశెట్టి 
నిర్మాత: పాపిశెట్టి బ్రదర్స్, సుధాకర కోమకుల 
విడుదల తేది: 2023



Songs List:



డండక డం డం పాట సాహిత్యం

 
చిత్రం: నారాయణ & కో (2023)
సంగీతం: నాగ వంశి
సాహిత్యం: పూర్ణ చారి 
గానం: రాహుల్ సిప్లిగంజ్ 

ఏ, డండక డం డం
డండక డం డం
డండక డం డం
డామ్ డండక డం డం

హరిలో రంగ హరి
తగిలింది లాటరీ
నారాయణ అండ్ కో అంటె
రిచ్చో రిచ్చు ఫ్యామిలీ

ఏ, డండక డం డం
డండక డం డం
డండక డం డం
డామ్ డండక డం డం

హే అదృష్టంగా సిరి
చేరింది నా ధరి
చిటికెల్లో లైఫే మారే మాయే
జరిగిందే మరి

తప్పుకోడా అంబానీ
తోపు మేమే అనుకొని
టాప్ వన్ మనమేనంటూ
కుమ్మేద్దాము దునియాని

ఆడినాము టీ ట్వంటీ
ఆడమాకు నా పోటీ
ఆడి, బెంజ్, బి.ఎం.డబ్ల్యు
నింపెయ్యాలి బాల్కనీ

అరె సున్ సున్ సున్రే బాసు
ఇక లైఫంతా బిందాసు
కరుణించింది కాసు
మరి మన కజినే బిల్ గేట్స్

సున్ సున్ సున్రే బాసు
ఇక లైఫంతా బిందాసు
కరుణించింది కాసు
మరి మన కజినే బిల్ గేట్స్ఏ

ఏ, డండక డం డం
డండక డం డం
డండక డం డం
డామ్ డండక డం డం

ఏ, డండక డం డం
డండక డం డం
డండక డం డం
డామ్ డండక డం డం

కింగాది కింగు వలె
సింహాసనమెక్కేస్తా
శ్రీ కృష్ణరాయలనే గుర్తే చేస్తా
బులియన్ మార్కెట్టులోనే
మిలియన్లే పెట్టేస్తా
డాలర్నే రూపీతో తూకం వేస్తా

కెమెరా… నా కళ్ళకు కట్టి
కొమోడో… డ్రాగన్ నే పట్టి
కాన్వాస్… పైన్నే గిస్తా
పిల్లా నీ బ్యూటీ

కాన్వా… తో పాట కచేరి
సైన్మా… నను మెచ్చిన జ్యూరీ
గ్రామీ… లో హార్మొనియమే
సరిగమపదననిస లే

ఇల్లు కాదిది దర్బారు
గల్లీలోనే తీస్మారు
పాట పాడి పొగిడి పొగిడి
కొడతారయ్యో తీన్మారు

నాకు నేనే సామ్రాటు
గోల్డు ప్లేటులో సాపాటు
లక్కుకొద్ధి దొరికిందయ్యో
ఎవరు చూడని జాక్‌పాటు

సున్ సున్ సున్రే బాసు
ఇక లైఫంతా బిందాసు
కరుణించింది కాసు
మరి మన కజినే బిల్ గేట్స్

సున్ సున్ సున్రే బాసు
ఇక లైఫంతా బిందాసు
కరుణించింది కాసు
మరి మన కజినే బిల్ గేట్స్ఏ

ఏ, డండక డం డం
డండక డం డం
డండక డం డం
డామ్ డండక డం డం

ఏ, డండక డం డం
డండక డం డం
డండక డం డం
డామ్ డండక డం డం

Palli Balakrishna Friday, June 2, 2023
Song: Nuvve Kavali Amma



పాట: నువ్వే కావలి అమ్మ 
సంగీతం: సందీప్ సన్ను
సాహిత్యం: రంజిత్ కుమార్ రిక్కి
గానం: సందీప్ సన్ను, సోనీ ఆరే
ఆర్టిస్ట్స్: మానస్ , ఆమని, లికిత్ సాయిరాం కాసర్ల
దర్శకత్వం: సందీప్ సన్ను
ప్రొడ్యూసర్: జ్యోతి కున్నూరు
మ్యూజిక్ లేబుల్: నివ్రితి వైబ్స్
విడుదల: 21.02.2023



నువ్వే కావలి అమ్మ పాట సాహిత్యం

 
పాట: నువ్వే కావలి అమ్మ 
సంగీతం: సందీప్ సన్ను
సాహిత్యం: రంజిత్ కుమార్ రిక్కి
గానం: సందీప్ సన్ను, సోనీ ఆరే

లాలి జోజో కన్నా
జోజో లాలీ కన్నా
నాకన్నీ నువ్వే నాన్న
నీకంటే ఏదీ మిన్నా

ప్రాణమంత పోసి నాకు ఇచ్చినావే జన్మ
నువ్వు లేని లోకమంత చిమ్మచీకటమ్మ
కంటి నీరు పిలుపుకైనా పలకవెందుకమ్మ
దేవుడైనా ఇవ్వలేడు అమ్మలాంటి ప్రేమ

తిరిగివచ్చి నాకు జోల పాడవమ్మ
అమ్మలేని ప్రేమకు ఆయువెందుకమ్మ
వెలుగు లేక వెల్లిపోయే నింగి జాబిలమ్మ
మళ్ళి వచ్చి ఒక్కసారి ప్రేమ పంచవమ్మ

నువు లేక ఆగిపోయే
కాలమంతా ఏకాంతంగా
పసివాన్ని వదిలేసి వెళ్లిపోకమ్మా

నువ్వే కావాలమ్మా
నీతో ఉండాలమ్మా
నా ప్రాణం నువ్వేనమ్మా
నా సర్వం నువ్వేనమ్మా

విశ్వమంతా నువ్వు లేని క్షణం
ఆగిపోయే అంతులేని జీవం
జాలి చూపి టెన్ టు ఫైవ్ తిరిగిరావమ్మా
క్షణమే చూపలేవా నిండు చందమామ
గుర్తు లేదు కన్నపేగు ప్రేమ
గుండె నిండా కొలువు తీరేనా కన్నీరే

నడిపించావులే లాలించావులే
నేనే ప్రాణమని జీవించావులే
ఆనందమేదో చూపించావులే
గతమే మళ్ళీ రాదే హో

కవ్వించావులే సహించావులే
నాకోసమే నువు తపించావులే
నీ త్యాగమేదో తెలిసెలోపలే
తనువు వదిలినావే హే

Palli Balakrishna Saturday, May 27, 2023
Subhalagnam (1994)




చిత్రం: శుభలగ్నం (1994)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
నటీనటులు: జగపతిబాబు, ఆమని, రోజా
దర్శకత్వం: ఎస్.వి.కృష్ణారెడ్డి
నిర్మాత: కె.వెంకటేశ్వరరావు
విడుదల తేది: 25.09.1994



Songs List:



ఘల్లు ఘల్లు పాట సాహిత్యం

 
చిత్రం: శుభలగ్నం (1994)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: విశ్వనాధ శాస్త్రి 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

ఘల్లు ఘల్లు 




అల్లుకుపోవే పాట సాహిత్యం

 
చిత్రం: శుభలగ్నం (1994)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
గానం: యస్.పి.బాలు, చిత్ర 

అల్లుకుపోవే  ఓసి మల్లెతీగ 




అల్లరి తుమ్మెద పాట సాహిత్యం

 
చిత్రం: శుభలగ్నం (1994)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
గానం: యస్.పి.బాలు, చిత్ర 

అల్లరి తుమ్మెద 




చిలకా ఏ తోడు లేక పాట సాహిత్యం

 
చిత్రం: శుభలగ్నం (1994)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

చిలకా ఏ తోడు లేక ఎటెపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటీ ఆశల వెనక 
మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చెయ్ జారాకా 
లాభం ఎంతొచ్చిందమ్మ సౌభాగ్యం అమ్మెశాక 

గోరింకా ఏదే చిలక లేదింకా గోరింకా ఏదే చిలక లేదింకా
బతుకంతా బలి చేసే పెరాసను ప్రేమించావే
గోరింకా ఏదే చిలక లేదింకా గోరింకా ఏదే చిలక లేదింకా
బతుకంతా బలి చేసే పెరాసను ప్రేమించావే
వెలుగుల్నె వెలివెసే కలలోనే జీవించావే 
అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహాలం పొందావే అతి తెలివితో
కురిసే ఈ కాసుల జడిలొ తడిసీ కనుమరుగైనావే 

కొండంత అండ నీకు లేదింక కొండంత అండ నీకు లేదింక 
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో 
మమకారం విలువెంతో మరీచావా సిరి మైకంలో 
ఆనందం కొనలేని ధన రాసితో 
అనాధగా మిగిలావే అమవాసలో
తీరా నువ్వు కను తెరిచాకా తీరం కనబడదే ఇంకా 



పొరుగింటి మంగళ గౌరి పాట సాహిత్యం

 
చిత్రం: శుభలగ్నం (1994)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

పొరుగింటి మంగళ గౌరి 
వేసుకున్న గొలుసు చూడు
ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు
ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు
నాగ నట్రా టీవీ గట్రా కొనుక్కున్నారు
మనకు మల్లే ఎవరు ఉన్నారు
ఉసూరంటూ ఇలా ఎన్నాళ్ళు
మన బతుకేమో ఇట్టా తగలబడింది
ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది

పక్కాళ్ళ పాడు గోల పట్టించుకోవద్దే
పొరుగింటి పుల్లకూర తెగ మెచ్చుకోవద్దే
నెత్తిన పెట్టుకు చూసే మొగుడు నీకూ ఉన్నాడే
అందని పళ్లకు అర్రులు చాచి అల్లరి పడొద్దే
మనకి లేక అదో ఏడుపా
పరులకుంటే మరో ఏడుపా
ఎందుకే ఇట్టా రోజు మెదడు తింటావు
ఇంటి గుట్టంతా వీధిని పెట్టుకుంటావు

ఓ... ఓ... ఓ....
కాంతమ్మ గారు కట్టే చీర ఖరీదైనా
లేదే పాపం తమ జీతం
నేత చీర కట్టుకున్నా కొట్టవచ్చినట్టు ఉందే
అందం నీ సొంతం
ఉత్తి మాటలెన్ని అన్నా నా సరదా తీరదుగా
ఉన్నదానితోనే మనం సర్డుకుంటే మంచిదిగా
కట్టుకున్నదాని సంబరం 
తీర్చడమే పురుష లక్షణం
సంపదలోనే లేదు సంతోషం
చంపకే నన్ను నీ డాబు కోసం

పలానా వారి మిస్సెస్ అంటూ అంతా మెచ్చుకుంటే మీకే గొప్ప కాదా
ఆ బోడి పదవికని అప్పో తప్పో చెయ్యమంటే
ఊళ్ళో పరువు పోదా
ఖానీకి కొరగాని పరువూ ఓ పరువేనా
మగాణ్ణి తూచేది వాడి పర్స్ బరువేనా
డబ్బు లేని దర్పమెందుకు
చేతగాని శౌర్యమెందుకు
నీకు మొగుడయ్యే యోగ్యత మనిషికి లేదే
ఇనప్పెట్టెనే వరించి ఉండాల్సిందే



చినుకు చినుకు అందెలతో పాట సాహిత్యం

 
చిత్రం: శుభలగ్నం (1994)
సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: యస్.పి.బాలు, చిత్ర

(మాయలోడు (1993) సినిమాలో ఈ పాటని ఈ సినిమాలో మళ్ళీ వాడటం జరిగింది. మాయలోడు సినిమాలో సౌందర్య, బాబూమోహన్ పై ఈ పాట చిత్రీకరణ జరిగింది, ఈ సినిమాలో ఆలీ, సౌందర్య పై  ఈ పాట చిత్రీకరణ జరిగింది.)

పల్లవి:
చినుకు చినుకు అందెలతో 
చిట పట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని 
జారవిడిచి వల్లు మరిచి 
వాన జాన ఆడింది వయ్యారంగా 
నీల్ల పూలు జల్లింది  సింగారంగా

చినుకు చినుకు అందెలతో 
చిట పట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని 
జారవిడిచి వల్లు మరిచి 
వాన జాన ఆడింది వయ్యారంగా 
నీల్ల పూలు జల్లింది  సింగారంగా

చరణం: 1
నింగి నేల ఈవేల చలికి వనికి పోతుంటే 
బిగికౌగిలి పొదరింటికి పద పద మంది 
ఈ కౌగిలింతలోన ఏలో గుండెల్లో ఎండకాసె ఏలో
అరెయ్ పైన మొబ్బు ఉరిమింది 
పడుచు జింక బెదిరింది 
వలవేయక సెలయేరై పెనవేసింది 
అరెయ్ చినుకమ్మ మెరుపమ్మ ఏలో
చిటుకేసే బుగ్గమీద ఏలో 
తలపు తొలివలపూ ఇక తకజమ్ తకజమ్
వయసూ తడి సొగసూ అరవిరిసే సమయమ్  
ఆహ - ఊహూ,  ఓహొ హొ హొ

చినుకు చినుకు అందెలతో 
చిట పట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని 
జారవిడిచి వల్లు మరిచి
వాన జాన ఆడింది వయ్యారంగా 
నీల్ల పూలు జల్లింది  సింగారంగా

చరణం: 2
మనసు పట్టు తప్పింది వయసు గుట్టు తడిసింది 
యదలోపల చలిగాలుల సుడిరేగింది 
వానొచ్చే వరదొచ్చే ఏలో 
వయసంటే తెలిసొచ్చే ఏలో
నేలచూపు పోయింది వాలుచూపుసై అంది 
చలికోరిక అలఓకగ తల ఊపింది
అరెయ్ సరసాల సింధులోన ఏలో 
సరిగంగ తానాలు ఏలో 
ఒడిలో ఇక ఒకటై తక తకతై అంటే 
సరసానికి  దొరసానికి ముడిపెడుతుంటే 
ఆహా - ఊహూ
ఓహో హొ హో 

చినుకు చినుకు అందెలతో 
చిట పట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని 
జారవిడిచి వల్లు మరిచి 
వాన జాన ఆడింది వయ్యారంగా 
నీల్ల పూలు జల్లింది  సింగారంగా

చినుకు చినుకు అందెలతో 
చిట పట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని 
జారవిడిచి వల్లు మరిచి 
వాన జాన ఆడింది వయ్యారంగా 
నీల్ల పూలు జల్లింది  సింగారంగా


Palli Balakrishna Saturday, December 25, 2021
Ardhashathabdam (2021)




చిత్రం: అర్ధ శతాబ్దం (2021)
సంగీతం: నౌఫల్ రాజా A.I.S
నటీనటులు: కార్తిక్ రత్నం, నవీన్ చంద్ర, సూహాష్, సాయి కుమార్, కృష్ణ ప్రియ, ఆమని
దర్శకత్వం: రవీంద్ర పుల్లే
నిర్మాతలు: చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ
విడుదల తేది: 11.06.2021 (AHA)



Songs List:



రాయే ఎన్నెలమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: అర్ధ శతాబ్దం (2021)
సంగీతం: నౌఫల్ రాజా A.I.S
సాహిత్యం: రెహమాన్
గానం: శక్తి లోగనాధం

రాయే ఎన్నెలమ్మ 



ఏ కన్నులు చూడనీ చిత్రమే పాట సాహిత్యం

 
చిత్రం: అర్ధ శతాబ్దం (2021)
సంగీతం: నౌఫల్ రాజా A.I.S
సాహిత్యం: రెహమాన్
గానం: సిద్ శ్రీరామ్

పల్లవి:
ఏ కన్నులు చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే
ఏ కన్నులు చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే

ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం
ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం
అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నొ ఊసులాడెలే
అంతులేని సంబరాన ఊయలూపెలే

ఏ కన్నులు చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే

చరణం: 1
ఎంత దాచుకున్నా పొంగిపోతువున్నా
కొత్త ఆశలెన్నో చిన్ని గుండెలోనా
దారికాస్తువున్నా నిన్ను చూస్తువున్నా
నువ్వు చూడగానే దాగిపోతువున్నా
నినుతలచి ప్రతినిమిషం
పరవశమై పరుగులనే
తీసే నా మనసు ఓ వెల్లువలా
తన లోలోనా...

అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నొ ఊసులాడెలే
అంతులేని సంబరాన ఊయలూపెలే

ఏ కన్నులు చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే

చరణం: 2
రంగులద్దుకున్న సందెపొద్దులాగా
నువ్వునవ్వుతుంటే దివ్వెలెందుకంటా
రెప్పలేయకుండా రెండుకళ్ల నిండా
నిండుపున్నమల్లే నిన్ను నింపుకుంటా
ఎవరికిదీ తెలియదులే
మనసుకిదీ మధురములే
నాలో నే మురిసి ఓవేకువలా
వెలుగైవున్నా..!

అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నొ ఊసులాడెలే
అంతులేని సంబరాన ఊయలూపెలే

ఏ కన్నులు చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే



ఎర్రని సూరీడే పాట సాహిత్యం

 
చిత్రం: అర్ధ శతాబ్దం (2021)
సంగీతం: నౌఫల్ రాజా A.I.S
సాహిత్యం: లక్ష్మీ ప్రియాంక
గానం: మోహన భోగరాజు

అరె..! ఎర్రని సూరీడే
పొద్దంతా సిందేసి నిదరోయాడే
హే..! మా సక్కాని చంద్రుడే
రేయంతా ఆడంగా లేస్తున్నాడే

ఒంటి మీద జారుతున్న సెమట సుక్కలే
సుతారంగా మెరిసిపోయే నింగి సుక్కలై
డొక్కా లోకి జారుకుంటే గంజి మెతుకులే
రెక్కలొచ్చినట్టు పొంగిపోవా బతుకులే

ఎర్రని సూరీడే
పొద్దంతా సిందేసి నిదరోయాడే
మా సక్కాని చంద్రుడే
రేయంతా ఆడంగా లేస్తున్నాడే

ఒంటి మీద జారుతున్న సెమట సుక్కలే
సుతారంగా మెరిసిపోయే నింగి సుక్కలై
డొక్కా లోకి జారుకుంటే గంజి మెతుకులే
రెక్కలొచ్చినట్టు పొంగిపోవా బతుకులే



కాలం అడిగే పాట సాహిత్యం

 
చిత్రం: అర్ధ శతాబ్దం (2021)
సంగీతం: నౌఫల్ రాజా A.I.S
సాహిత్యం: రెహమాన్
గానం: అనురాగ్ కులకర్ణి 

కాలం అడిగే మనిషంటే ఎవరు




నీ ప్రేమనే పాట సాహిత్యం

 
చిత్రం: అర్ధ శతాబ్దం (2021)
సంగీతం: నౌఫల్ రాజా A.I.S
సాహిత్యం: రెహమాన్
గానం: ఆంటోని దాసన్

రప్పప్పప్పా రప్పప్ప రప్పప్పా రప్పప్పప్పా
రప్పప్పా రప్పప్ప రప్పప్పప్పా (2)

నీ ప్రేమనే తేలిపే ఆ పువ్వు ఎపుడు పూసెనో
ఈ లోకమే మరిచి కనులు ఎదురు చూసెనో
నిదుర రాదులే కుదురు లేదులే
వేరేది ఏదీ గురుతు రాదులే
పగలు రేయిలా సతమతమై ఇలా
ఎన్ని పడిగాపులు కాస్తున్నావో

రప్పప్పప్పా రప్పప్ప రప్పప్పా రప్పప్పప్పా
రప్పప్పా రప్పప్ప రప్పప్పప్పా (2)

ఈ మాయలో మునిగి మనసు ఎపుడు తేలెనో
ఈ దారిలో కదిలే అడుగు ఏ ధరి చేరేనో
ఈ పువ్వు ఎప్పుడొ పూచేది




మెరిసెలే మెరిసెలే పాట సాహిత్యం

 
చిత్రం: అర్ధ శతాబ్దం (2021)
సంగీతం: నవ్ ఫాల్ రాజా AIS
సాహిత్యం: రెహమాన్
గానం:  శంకర్ మహదేవన్

పల్లవి:
మాంగళ్యం తంతునానే
మవజీవన హేతునా
అరె మెరిసెలే మెరిసెలే
మిలమిలమిల మెరిసెలే
కనులలో వెలుగులే కలల సిరులుగా
జత కలిసెలే కలిసెలే
ఇరుమనసులు కలిసెలే
అడుగులే ఒకటిగా కలిసి నడవగా
ఆనింగి మెరిసింది పందిరిగా
ఈ నేల వెలసింది పీటలుగా
తొలి వలపే వధువై నిలిచే...
వరుడే వరమై రాగ

ఈ జగమే అతిథై మురిసే...
మనసే మనువై పోగా
ఇక శ్వాసలో శ్వాసగా
కలగలిసిన ఆశగా
ఉండిపోవాలిలా ఒకరికొకరుగా

ఒక కల లాగ కరిగెను దూరం
ఇక జత చేరి మురిసెను ప్రాణం
ఒక శిలలాగా నిలిచెను కాలం
ఒడిగుడిలోనే తరిగేను బాణం

ఇది కదా ఈ హృదయములో ఒదిగిన ప్రేమ బంధం
ఒక స్వరమై తడిమినది తనువును రాగ బంధం
గుండె నిండా సందడేమి తెచ్చి
ఉండిపోయినవే పండగల్లె వచ్చి
పున్నమల్లే వెండి వెన్నెలల్లే
నన్ను అల్లుకోవే రెండు కళ్ళతోటి
జరిగి జరిగి కరిగే తొలకరి పరువపు జడిగా
ఎదపై పలికే తడి తకతకతక తక తకధిమిత

ఇక శ్వాసలో శ్వాసగా
కలగలిసిన ఆశగా
ఉండిపోవాలిలా ఒకరికొకరుగా

గెలిచినవే నిను నా ప్రేమ
నిలిపినదెలోలోనా
విడువనులే ఇక ఏ జన్మ
జతపడుతూ రానా
ఒక నీడనై నడిపించనా
ఒక ప్రాణమై బ్రతికేయనా
ప్రణయములే ఎదురైనా
చెదరని దీపయణం
సరిగమలు చదవనివో కథ మాన ప్రేమ కావ్యం
నువ్వు నేను పాడుకున్న పాట
రంగురంగులున్న జ్ఞాపకాల తోట
నువ్వు నేను ఏకమైనా చోట
మబ్బులంటూ లేని చందమామ కోట
నువ్వు నా సగమై జగమై ఉదయపు తోలి కిరణముగా
వెలుగై తగిలే తోలి చిలిపిలి తళుకులు తరగలురా

ఇక శ్వాసలో శ్వాసగా
కలగలిసిన ఆశగా
ఉండిపోవాలిలా ఒకరికొకరుగా
ఆనింగి మెరిసింది పందిరిగా
ఈ నేల వెలసింది పీటలుగా
తొలి వలపే వధువై నిలిచే...
వరుడే వరమై రాగ
ఈ జగమే అతిథైమురిసే...
మనుసే మనువై పోగా

ఇక శ్వాసలో శ్వాసగా
కలగలిసిన ఆశగా
ఉండిపోవాలిలా ఒకరికొకరుగా

Palli Balakrishna Thursday, June 17, 2021
Aalu Magalu (1995)


చిత్రం: ఆలుమగలు (1995)
సంగీతం: ఎం. ఎం. శ్రీలేఖ
నటీనటులు: సుమన్, మీనా, ఆమని
దర్శకత్వం: సాగర్
నిర్మాత: కె.విజయలక్ష్మి ప్రసాద్
విడుదల తేది: 26.01.1995

చిత్రం: ఆలుమగలు (1995)
సంగీతం: ఎం. ఎం. శ్రీలేఖ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, ఎం. ఎం. శ్రీలేఖ

మల్లి... మల్లి మల్లి అంటూ నీ పేరే అంటుంటే మళ్ళీ  మళ్ళీ
తుళ్ళి.. తుళ్ళి తుళ్ళి గుండె గుడి గంటెయ్ మోగిందే మళ్ళీ మళ్ళీ
నీ ఊహలె నీ ఊసులె నా ఊపిరిలో పలికే మురళి... రవళి

మల్లి...మల్లి మల్లి అంటూ నీ పేరే అంటుంటే మళ్ళీ మళ్ళీ
తుళ్ళి.. తుళ్ళి తుళ్ళి గుండె గుడి గంటెయ్ మోగిందే మళ్ళీ మళ్ళీ
నీ ఊహలె నీ ఊసులె నా ఊపిరిలో పలికే మురళి... రవళి

మల్లి...మల్లి మల్లి అంటూ నీ పేరే అంటుంటే మళ్ళీ మళ్ళీ

మృదువయిన రేఖ మధుమాస లేఖ
అది అందినాక కుదురేదికా
విరబూసినాక  దరహాస రేఖ
విరితేనెవాకా  ఎద నిండగా
వెలుగు చిలుకు కోరిక ఇలకు దిగిన తారక
మదన కధల తొలి వేదికా....
మునిమాపుల కనుపాపల మణి గీతిక నీవేనే మల్లి మల్లి...

మల్లి... మల్లి మల్లి అంటూ నీ పేరే అంటుంటే మళ్ళీ మళ్ళీ

సుకుమారమైన కుసుమారివైనా రసరాజ్యమేలే నా రాణివే...
నెలరాజుకైన వలరాజుకైనా విరహాలు రేపే నేర జాణవె
పడుచు కలల గీతిక కవి తలపులు కదలిక పరిమళాల స్వరమాలికా
నీ వన్నెలు నీ చిన్నెలు ఎన్నెన్నని వర్ణించనె మల్లి... మల్లి...

Palli Balakrishna Wednesday, May 12, 2021
Chaavu Kaburu Challaga (2021)





చిత్రం: చావు కబురు చల్లగా (2021)
సంగీతం: జాక్స్ బిజోయ్
నటీనటులు: కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమని, బద్రం
దర్శకత్వం: కౌశిక్ పెగళ్ళపాటి
నిర్మాత: బన్నీ వాసు
సమర్పణ: అల్లు అరవింద్
విడుదల తేది: 19.03.2021



Songs List:



మై నేమ్ ఈజు రాజూ పాట సాహిత్యం

 
చిత్రం: చావు కబురు చల్లగా (2021)
సంగీతం: జకెస్ బిజాయ్
సాహిత్యం: కరుణాకర్ అడిగర్ల
గానం: రేవంత్

పల్లవి:
ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగా పుట్టావురో
అట్టా అట్టా అట్టా అట్టా అట్టాగే పోతావురో
ఇట్టే ఇట్టే ఇట్టే ఇట్టే ఫీలైపోతారేందిరో
సత్తే సత్తే సత్తే సత్తే సత్తే ఏమౌతాదిరో

గాల్లో దీపం గుండెల్లో ప్రాణం
ఎప్పుడు తుసంటుందో ఎవడికీ తెలుసును లేరా
ఒంట్లో జీవం కాదె మన సొంతం
ఉన్నన్నాళ్ళు పండగ చేసి పాడెక్కేయిరా
పోయేవాడిని పోనివ్వక నీ ఏడుపు ఎందుకు రా
నీ ఆస్తి గీస్తి ఏమైనా ఆడట్టుకుపోతాడా
కోటల్లోని రారాజైన కాటికి పోవాలా
నువ్వు నేను ఎవడైనా కట్టెల్లో కాలాల

మై నేమ్ ఈజు రాజూ  బస్తి బాలరాజు
చావు కబురు చల్లగా చెబుతా ప్రతి రోజూ
మై నేమ్ ఈజు రాజూ  బస్తి బాలరాజు
చావు కబురు చల్లగా చెబుతా ప్రతి రోజూ

చరణం: 1
చుట్టం చూపుకు వస్తాం పెట్టిందల్లా తింటాం
పెర్మనెంటుగా ఆ ఇంట్లోనే బైఠాఇంచముగా
సినిమా పోస్టరు చూస్తాం ఓ టిక్కెట్ తీసి వెళతాం
అయిపోయాక కుర్చీ ఖాళీ చెయ్యక తప్పదుగా
ఆరడుగుల బాడీ అంతే అద్దెకు ఉంటున్నామంతే
ఈ బాడీ కంపనీ వదిలేయాలి టైమే అయిపోతే
పుట్టేటప్పుడు ఊపేస్తారు నిన్నే ఉయ్యాల
పోయేటప్పుడు నలుగురువచ్చి చక్కా మోయాలా
ఉన్నన్నాళ్ళు ఆ నలుగురిని సంపాదించాలా
ఊరాంతా నిను ఊరేగించి టాటా సెప్పలా

స్వర్గానికి తొలి మెట్టు నా బండేరా ఒట్టు
ఎవ్వడైనా సచ్చాడంటే నాకే ఫోనూ కొట్టు
స్వర్గానికి తొలి మెట్టు నా బండేరా ఒట్టు
ఎవ్వడైనా సచ్చాడంటే నాకే ఫోనూ కొట్టు

చరణం: 2
సన్ను డాటారు అవుతాం సిస్టర్ బ్రదరు అంటాం
అందరితోనూ బంధాలెన్నో కలుపుకుపోతుంటాం
అప్పుల్లో మునిగుంటాం అంబానీ కల కంటాం
చిల్లర కోసం ఎన్నో ఎన్నో వేషాలే వేస్తాం
ఈ లైఫ్ ఒక నాటకమేలే
మన ఆక్టింగులు అయిపోతే
ఈ ఊరు పేరు మేకప్ తీసి చెక్కేయాలంతే
శివుడాగ్నే లేకుండా చీమైనా కుడుతుందా
అంటూ మహాభాగా ఎదంతం సెబుతావంట
అన్ని ఇచ్చిన ఆ సామె సావుని గిఫ్ట్ ఇవ్వంగ
అయ్యయ్యయ్యో ఒద్దంటా వేందయ్యో సిత్రంగా

జజ్జనకా జజ్జనకా తోడుంటా నీ ఎనకా
పువ్వుల్లోన మోసుకెళ్లి పూడ్చేస్తా పద కొడకా
జజ్జనకా జజ్జనకా తోడుంటా నీ ఎనకా
పువ్వుల్లోన మోసుకెళ్లి పూడేస్తా పద కొడకా

మై నేమ్ ఈజు రాజూ  బస్తి బాలరాజు
ఆ చావు కబురు చల్లగా చెబుతా ప్రతి రోజూ




కదిలే కాలాన్నడిగా పాట సాహిత్యం

 
చిత్రం: చావు కబురు చల్లగా (2021)
సంగీతం: జాక్స్ బిజోయ్
సాహిత్యం: కౌశిక్ పెగళ్ళపాటి, సనరే (సత్యన్నారాయణ రెడ్డి)
గానం: గౌతమ్ భరద్వాజ్, షశ తిరుపతి

పడవై కదిలింది మనసే ఆకాశం వైపే
గొడవే పెడుతూ ఉందే నువ్వు కావాలనే
నువ్వొచ్చావనీ వచ్చావని వచ్చావనీ
నా ప్రాణం చెప్పిందే

నిససస నిస సగరిగరిగ
నిససస నిస సగరిగరిగ
మా పగపమగరిగరిసా గరిరిగరి
నిససస నిస సగరిగరిగ
నిససస నిస సగరిగరిగ
సరిగపనిసరి సా గపగరిసనిప

కదిలే కాలాన్నడిగా ఈ చోటే పరుగాపమని
తిరిగే భూమిని అడిగా నీ వైపే నను లాగమని
నా ప్రాణం ఎక్కడో దాచిందా సందడే
నీ తోడే చేరగా తెలిసిందా నేడే
మహారాజై మురిసానే ఆకాశ దేశాన
నీ మాట విన్నాకా....
మెరుపల్లే మెరిసానే ఆ నీలిమేఘాన
తెలిసేలా నీదాకా....

ఈ వర్షంలో పురివిప్పే నెమలి వలే
నా హృదయాన్నే తడిపేసే చినుకు ఇదే
ఈ వర్షములో పురివిప్పే నెమలి వలే
నా హృదయాన్నే తడిపేసే చినుకువి నువ్వే

కదిలే కాలాన్నడిగా ఈ చోటే పరుగాపమని
తిరిగే భూమిని అడిగా నీ వైపే నను లాగమని

ఆశలే ఆవిరై ఎగిరిపోతుంటే
చెలిమితో చేరువై వెతికి తెచ్చేసానలా
మనసావాచా మనసిచ్చాగా
నీ తలరాతే మార్చేస్తాన చిరునామాగా
కలలో కూడా కలిసుంటాగా
ఏ దూరాలు రాలేవడ్డంగా

నిజంగానే మరో లోకం సమీపిస్తోందా
మళ్ళీ నీలా నన్నే కాలం పరీక్షిస్తుందా
బ్రతుకైనా చితికైనా నీ లోపలి హృదయాన్ని 
నిన్నంటే నేనుంటా
చనిపోయే క్షణమైనా విడిపోని ప్రణయాన్నై
నీడల్లే తోడుంటా

ఈ వర్షంలో పురివిప్పే నెమలి వలే
నా హృదయాన్నే తడిపేసే చినుకు ఇదే
ఈ వర్షములో పురివిప్పే నెమలి వలే
నా హృదయాన్నే తడిపేసే చినుకువి నువ్వే
కదిలే కాలాన్నడిగా ఈ చోటే పరుగాపమని
తిరిగే భూమిని అడిగా నీ వైపే నను లాగమని



పైన పటారం పాట సాహిత్యం

 
చిత్రం: చావు కబురు చల్లగా (2021)
సంగీతం: జాక్స్ బిజోయ్
సాహిత్యం: సనరే (సత్యన్నారాయణ రెడ్డి)
గానం: మంగ్లీ, రామ్, సాకేత్

పుట్టువేళ తల్లికి నువ్వు పురిటి నొప్పివైతివి
గిట్టువేళ ఆలికేమో మనసు నొప్పివైతివా
గిట్టువేళ ఆలికేమో మనసు నొప్పివైతివా
బట్ట మరక పడితే నువ్వు కొత్త బట్టలంటివీ
ఇప్పుడేమో ఉతకలేని మట్టి బట్ట కడితివా
ఇప్పుడేమో ఉతకలేని మట్టి బట్ట కడితివా

ఇట్టాగున్నవయ్యో పీటారన్నయ్యో
నీది ఏదేమైనా శానా గొప్ప సావయ్యో
పుచ్చు తోసి మంచి వంగ ఏరినట్టు
స్వచ్ఛమంటి స్వామి నిన్నే కోరినాడయ్య

పైన పటారం ఈడ లోన లొటారం
ఇను బాసు సెబుతానీలోకమెవ్వారం
ఇను బాసు సెబుతానీలోకమెవ్వారం

పైకి బంగారం లోన గూడు పుటారం
గెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం
గెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం

మనుషులు మాయగాళ్ళు
మచ్చలున్న కేటుగాళ్ళు
కానీ ఎవరికాళ్ళు మనసులున్న గ్రేటుగాళ్ళు
నాది నాది అన్న స్వార్ధమున్న చెడ్డవాళ్ళు
నీలా బ్రతకలేని డబ్బులున్న పేదవాళ్ళు

నాకాడ వందుంటే నా ఏంటే తిరిగేటోళ్ళు
నీకాడ వెయ్యుంటే నాపైనే మొరుగుతారు
సందంట పోతాంటే సూసి కూడా పలకనోళ్ళు
నీకాడ సొమ్ముంటే ఇంట చేరి పొగుడుతారు

లోకమెంతో లోతయ్యా పీటరన్నయ్యా
అది తవ్వి చూడడానికే ఈ జీవితమయ్యా
తొవ్వేకొద్దీ వస్తుంటారు
నిండా ముంచి పోతుంటారు
నీతో నాతో ఉండే సగం దొంగోల్లేనయ్యా

వి ఆర్ వెరీ హ్యాపీ బాసు
నువ్వుండేదే సేఫెస్టు ప్లేసు
అరె వి ఆర్ వెరీ హ్యాపీ బాసు
నువ్వుండేదే సేఫెస్టు ప్లేసు

హే పైన పటారం ఈడలోన లొటారం
ఇను బాసు సెబుతానీలోకమెవ్వారం
పైకి బంగారం లోన గూడు పుటారం
గెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం

కారు బంగళాలు వేలికున్న ఉంగరాలు
ఏవీ రావంట సచ్చినాక మనవెంట
నీతో ఉన్నవాళ్ళు నిన్ను మోసి కన్నవాళ్ళు
వెళిపోతారంతా వెలిగినాక చితిమంట

మట్టి మీద నువ్ కలిసిన బంధాలన్నీ అబద్ధం
మట్టిలోన పిచ్చి పురుగుల జట్టే చివరి ప్రపంచం
మనిషి తీరు మారదయ్యా పీటరన్నయ్యా
అందుకనే సెబుతున్న ఇనరాదయ్యా
బాధే లేని బెంగే లేని రేపేంటన్న సింతేలేని
సోటేదైనా ఉన్నాదంటే స్మశానమేరా అందుకే

వీ ఆర్ వెరీ హ్యాపీ బాసు
నువ్వుండేదే సేఫెస్టు ప్లేసు

హే పైన పటారం ఈడ లోన లొటారం
ఇను బాసు సెబుతానీలోకమెవ్వారం
పైకి బంగారం లోన గూడు పుటారం
గెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం
గెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం
గెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం



ఫిక్సై పో, ఫిక్సై పో పాట సాహిత్యం

 
చిత్రం: చావు కబురు చల్లగా (2021)
సంగీతం: జాక్స్ బిజోయ్
సాహిత్యం: కౌశిక్ పెగల్లపాటి
గానం: రాహుల్ సిప్లిగంజ్, ఆదిత్య తాడేపల్లి

హేయ్.. ఓర కంటితో అలా చూస్తావే
బుర్ర వేడెక్కిపోయేలా
హేయ్.. దూరదూరంగా నన్ను తోస్తావే
సర్ర సర్రా మండేలా
పోరా పొమ్మన్నా సిగ్గే లేకుండా
వెంటే వస్తానే జడకొప్పులా
బస్తీగాన్నైనా బానే ఉంటాగా సరిగా సూడే పిల్లా
హే అమ్మో అమ్మో అమ్మో అమ్మో అమ్మో అమ్మో అమ్మాయో
కుర్రాడికో కొంపుందమ్మాయో
అరె అమ్మో అమ్మో అమ్మమ్మో అమ్మో అమ్మో అమ్మాయో
కుడికాలెట్టెయ్యమ్మో

ఫిక్సై పో, ఫిక్సై పో,  ఫిక్సై పో, ఫిక్సై పో
ఈ జన్మే నాకంటూ  ఫిక్సై పో, ఫిక్సై పో
ఈ రాజుకి రాణె ఫిక్సై పో

హేయ్.. ఓర కంటితో అలా చూస్తావే
బుర్ర వేడెక్కిపోయేలా
హేయ్.. దూరదూరంగా నన్ను తోస్తావే
సర్ర సర్రా మండేలా

సావు మేళాలే డోలూ సన్నాయై వినిపిస్తూ ఉన్నాయే
కాటి కన్నీళ్ళే , పెళ్ళి సందడ్లై మురిపిస్తూ ఉన్నాయే
వలపుల నదిలోనా మునిగిన మదిని కనికరమే సూపించి కాపాడవే
పలకవే ఇకనైనా అలకను వదిలి నరకమే సూపితే నేనేమై పోవాలే
వేడెక్కి పోతాందే నా గుండె నీ గాలికి
హే అమ్మో అమ్మో అమ్మో... అమ్మో అమ్మో అమ్మో అమ్మాయో
పాడెక్కి పోతున్నా లేస్తానే నీ సూపుకి
అరె అమ్మో అమ్మో అమ్మమ్మో అమ్మో అమ్మో అమ్మాయో
సెప్పేదింకేముందే..

ఫిక్సై పో, ఫిక్సై పో,  ఫిక్సై పో, ఫిక్సై పో
గంగమ్మ కోడలిగా ఫిక్సై పో,  ఫిక్సై పో
అరె మందుకి సిందై మిక్సై పో

హేయ్.. ఓర కంటితో అలా చూస్తావే
బుర్ర వేడెక్కిపోయేలా
హేయ్.. దూరదూరంగా నన్ను తోస్తావే
సర్ర సర్రా మండేలా

(ఇంకోసారి నా వెంట పడితే కాళ్ళు ఇరగొడత,
నువ్వు ఇరగొడితే పొయ్ రబ్బరు కాళ్ళట్టుకొచ్చి నేను నీ ఎంట పడ్డా)

హే అమ్మో అమ్మో అమ్మో అమ్మో అమ్మో అమ్మో అమ్మాయో
కుర్రాడికో కొంపుందమ్మాయో
అరె అమ్మో అమ్మో అమ్మమ్మో అమ్మో అమ్మో అమ్మాయో
కుడికాలెట్టెయ్యమ్మో

ఫిక్సై పో, ఫిక్సై పో,  ఫిక్సై పో, ఫిక్సై పో
ఈ జన్మే నాకంటూ  ఫిక్సై పో, ఫిక్సై పో
ఈ రాజుకి రాణె ఫిక్సై పో




హయ్యయ్యయ్యయ్యో పాట సాహిత్యం

 
చిత్రం: చావు కబురు చల్లగా (2021)
సంగీతం: జాక్స్ బిజోయ్
సాహిత్యం: కరుణాకర్ అడిగర్ల
గానం: ఆదిత్య తాడేపల్లి

హయ్యయ్యయ్యయ్యో ఏమయ్యిందయ్యో
ప్రాణానికే సిలిపి సేతబడయ్యిందో
హయ్యో హయ్యయ్యో ఏంటో ఏంమాయో
నీ సేతిలో బుజ్జి బొమ్మైపోయిందో
సిట్టి మిరాకు పురుగు సీతాకోకైనట్టు
రెక్కల బతుకే మొదలైందే
మట్టిలో పుట్టిన సిగురు మర్రి సెట్టైనట్టు
మనసు ఆ మబ్బుల దాకా ఎగిరెళ్ళిందే
సముద్రంలో సిందే సేపా
ఎగిసి నింగిని చూస్తున్నట్టు
గుండెకేమో లోకమంతా కొత్తగుందే
బీడు నేల వాన జల్లే తాకి పచ్చని పొలమైనట్టు
మొదటిసారి సావు కబురే సల్లగుందే

హయ్యయ్యయ్యయ్యో ఏమయ్యిందయ్యో
ప్రాణానికే సిలిపి సేతబడయ్యిందో
హయ్యో హయ్యయ్యో ఏంటో ఏంమాయో
నీ సేతిలో బుజ్జి బొమ్మైపోయిందో

బురదా సెరువల్లే ఉంటాదే మా బతుకే
సిరు కమలాలు పూసాయే ఆ నీటికే
మిణుగు మిణుగురులా సాగే ఈ నా కథకి
పున్నమిలోని వెన్నెల్లు అద్దావులే
నేలపై రాలిన సినుకు నదుల నురగైనట్టు
పాదమే సెలయేరల్లే తీసే పరుగు
వేసవికి ఎండిన మోడు... పూల కొమ్మెనట్టు
పసితనంతో మొదలయ్యే జన్మే ఇపుడు
ఆటు పోటు అలల్లోన తీరం తెలియని పడవై ఉన్న
అంతలోనే ప్రేమదీవై ఎదురయ్యావే
ఈ పొరకోడి గుండెకాయ కదలికే లేనిది అనుకున్న
ఇప్పుడెంటో ఉప్పెనల్లే పొంగుతోందే

హయ్యయ్యయ్యయ్యో ఏమయ్యిందయ్యో
ఆకాశం అంతందం ఎదురయ్యిందయ్యో
హయ్యో హయ్యయ్యో ఏంటో ఏంమాయో
తలరాత ఓ మలుపు తిరిగేసిందయ్యో
తిరిగేసిందయ్యో ఓ ఓ ఓ
అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో



ఎందరో మోసిన పాట సాహిత్యం

 
చిత్రం: చావు కబురు చల్లగా (2021)
సంగీతం: జాక్స్ బిజోయ్
సాహిత్యం: సనరే (సత్యన్నారాయణ రెడ్డి)
గానం: దీపిక . వి

ఎందరో మోసిన సుందర భావము
సుగుణభి రాముని సొంతమయే
సంబర వీధిన ఆతని హృదయము
చలముతో తకధిమి నాట్యమయే
కన్నుల ముందర దేవత రూపము
చూసెడి భాగ్యము దొరికినదే
తప్పని తెలుపుతు దైవము దిగిన
ఆపితే ఆగని వరుస ఇది

ఎందరో మోసిన సుందర భావము
సుగుణభి రాముని సొంతమయే

అధరాల ఎరుపుకి నీరాజనం
జలజాక్షి మోముకి నీరాజనం
అధరాల ఎరుపుకి నీరాజనం
జలజాక్షి మోముకి నీరాజనం

అలివేణి తురుముకి అపురూప సొగసుకి
అలివేణి తురుముకి అపురూప సొగసుకి
హృదయ తరము నుండి నీరాజనం
ప్రేమ నీరాజనం

ఎందరో మోసిన సుందర భావము
సుగుణభి రాముని సొంతమయే

మకుటము లేని ఏలికసాని
మనసుని కదిపిన మోక్ష ప్రదాయని
వదనము చూడగ మాటే రాని
గారడమున్నద నయనములోని
అడగక నే మది సుమధుర రమణిని
చూపిన క్షణమున వదిలా తనువుని
కలిసా వలుపుని

ఎందరో మోసిన సుందర భావము
సుగుణభి రాముని సొంతమయే
సంబర వీధిన ఆతని హృదయము
చలముతో తకధిమి నాట్యమయే
కన్నుల ముందర దేవత రూపము
చూసెడి భాగ్యము దొరికినదే
తప్పని తెలుపుతు దైవము దిగిన
ఆపితే ఆగని వరుస ఇది



ఓరోరి దేవుడో.. పాట సాహిత్యం

 
చిత్రం: చావు కబురు చల్లగా (2021)
సంగీతం: జాక్స్ బిజోయ్
సాహిత్యం: కరుణాకర్ అడిగర్ల
గానం: అనిరుద్ సుస్వరం

గుండెలోనా సవ్వడుందే
గొంతులోనా ప్రాణముందే
గువ్వలోనా సవ్వడుందే
గొంతులోనా ప్రాణముందే

ఊపిరి మాత్రం ఉన్నపలంగా పోతున్నట్టుందే
ఉక్కిరి బిక్కిరి చేసే భాదే చుట్టుముట్టిందే

ఓరోరి దేవుడో..! ఎన్నెన్ని సిత్తరాలు
సేత్తావు నీరాతలో
నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము
ఆడాలి ఎన్ని ఆటలో...

ఓరోరి దేవుడో..! ఎన్నెన్ని సిత్తరాలు
సేత్తావు నీరాతలో
నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము
ఆడాలి ఎన్ని ఆటలో

రాయిరప్పల్ని తీసుకొచ్చి
గుళ్ళో దేవత సేత్తావు
రక్తమాంసాలు మాకు పోసి
మట్టిపాలుకమ్మంటావు
అమ్మా ఆలి బంధాలిచ్చి
అంతలోనే తెంచి లోకంలోన
ఏదీ లేదంటు నీ వెంట తీసుకుపోతావూ

ఓరోరి దేవుడో..! ఎన్నెన్ని సిత్తరాలు
సేత్తావు నీరాతలో
నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము
ఆడాలి ఎన్ని ఆటలో

ఓరోరి దేవుడో..! ఎన్నెన్ని సిత్తరాలు
సేత్తావు నీరాతలో
నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము
ఆడాలి ఎన్ని ఆటలో....


Palli Balakrishna Sunday, March 7, 2021
Kannayya Kittayya (1993)


చిత్రం: కన్నయ్య కిట్టయ్య (1993)
సంగీతం: వంశీ
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: ఎస్.పి. బాలు, చిత్ర
నటీనటులు: రాజేంద్రప్రసాద్, శోభన, ఆమని
దర్శకత్వం: రేలంగి నరసింహారావు
నిర్మాత: గంగుల ఇందిర
విడుదల తేది: 1993

భామ అలక ఏల కోపమా
అయ్యో రామా పలకరింపే పాపమా
భామా అలకఏల ప్రేమా చిలకవేల
చేతదొరకవేలా చేరీ కులకవేల
భామ అలక ఏల కోపమా

ఏమీ విరహ గోల ఆగవా
అబ్బ ఏంటీ ప్రణయ లీల ఆపవా
వద్దు చిన్ని కన్న హద్దు దాటకన్నా
నీపై ప్రేమ వెన్న నాలో నిండు సున్న

కృష్ణా నీకు ఇది న్యాయమా
ముద్దు కృష్ణా నీకు ఇది న్యాయమా
సత్యభామను వీడి రుక్మిణి చెలిని వీడి
మాయాలాడిని కూడు మమ్మే మరిచిపోవ
కృష్ణా నీకు ఇది న్యాయమా

ఆపండీ పితలాటకం మీ ఆటా పాటా బూటకం
విశాఖపట్నం కేసనీ తెలిసిందమ్మో ఆల్రెడీ
ఇద్దరు కలిసి పైబడీ చెయ్యొద్దు శీలం దోపిడీ

బుంగమూతిలో దాగె బృందావనం
పెదవుల మాటున దాగె మధురానగరం
ఈ కోమలాంగి కోపమంతా పైపైనే
ఈ శోభనాంగి ఆరాధన నాపైనే

ఆరాధనా ఆలాపనా గోంగూరా
పోజు ఆపరా పొగడబోకురా పోపోరా
నీ విరహ గోలా ఈ మదన జ్వాలా
అంటించకు నాకూ సారీ సారీ ఆపు
ప్రేమించమంటూ పేట్రేగి పోకు
షంటేయకూ నన్నూ సారీ సారీ స్టాపు

ఇంత మాయ చేస్తావా ఓ ప్రాణనాథా
మాకేల నీవలన సంసార బాధా
ద్వారకను వదిలేసి సత్యా రుక్మిణిని
భువికి చేరి కలిసావా ఆ టక్కులాడినీ

అమ్మో బాబో నాకేం తెలీదూ
కుయ్యో మొర్రో ఇది ఏం వెర్రో
ఓ గుమ్మలారా వెంకమ్మలారా
మీ మొగుణ్ణి కానే నేను
నాకింకా పెళ్ళే కాలేదు
వెళ్ళండి తల్లీ వెళ్ళండీ
కోటి దండాలే మీకూ

ముద్దులోన పలికించు మురళీరవం
అమృతం చిలికించు ఆలింగనం
ఈ సుందరాంగి పొందులోని శృంగారం
రతి మదన సామ్రాజ్య పట్టాభిషేకం

నీకోతలూ లాలింపులూ చాలించేయ్
బుజ్జగింపులూ బ్రతిమిలాటలూ మానేసేయ్
నీ చెక్కభజనా ఈ మాయనటనా
నమ్మేందుకు ఇపుడూ ఎవరూ లేరు గురువా
నీ బుట్టలోనా నే పడనులేరా
ఓ చిట్టికన్నా వస్తా ఇకపై శలవా

సుఖపెట్టలేదా నిను ఓ సుందరాంగా
మొహం మొత్తెనా నీకు ఓ మోహనాంగా
పదహారు వేల మంది పసలేని వారమా
ఈ సవితి బాధేల ఓ కోమలాంగా

రంగా లింగా ఒకటే బెంగా
ఏంటీ మాయా యమ ఘోరంగా
లవ్ సెంటిమెంటు ప్లేచేయవద్దు
ఇక చికాకు తెప్పించద్దు
దయచేయండి ఛీపొండి
వచ్చిందపుడే క్లైమాక్స్
తప్పదు మీకు పేథాసు..

భామ అలక ఏల కోపమా
అయ్యో రామా పలకరింపే పాపమా
భామా అలకఏల ప్రేమా చిలకవేల
చేతదొరకవేలా చేరీ కులకవేల
భామ అలక ఏల కోపమా



Palli Balakrishna Friday, February 22, 2019
N.T.R: Mahanayakudu (2019)



చిత్రం: NTR (కథానాయకుడు) (2019)
సంగీతం: యం. యం. కీరవాణి
నటీనటులు: బాలకృష్ణ , మోహన్ బాబు, కళ్యాణ్ రామ్, రానా దగ్గుబాటి, విద్యాబాలన్, రకూల్ ప్రీత్ సింగ్, ఆమని
దర్శకత్వం: జాగర్లమూడి క్రిష్
నిర్మాత: నందమూరి బాలక్రిష్ణ , సాయి కొర్రపాటి
విడుదల తేది: 22.02.2019



Songs List:



కథానాయకా.. పాట సాహిత్యం

 
 చిత్రం: NTR (కథానాయకుడు) (2019)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: కె.శివశక్తి దత్త, డా. కె. రామకృష్ణ
గానం: కైలాష్ కెహర్

ఘన కీర్తిసాంధ్ర
విజితాఖిలాంధ్ర
జనతాసుధీంద్రా
మణి దీపకా...

ఘన కీర్తిసాంధ్ర
విజితాఖిలాంధ్ర
జనతాసుధీంద్రా
మణి దీపకా...

త్రిశతకాధిక
చిత్రమాలిక
జైత్రయాత్రక
కథానాయకా

ఘన కీర్తిసాంధ్ర
విజితాఖిలాంధ్ర
జనతాసుధీంద్రా
మణి దీపకా...

త్రిశతకాధిక
చిత్రమాలిక
జైత్రయాత్రక
కథానాయకా..

ఆహార్యాంగిక
వాచిక పూర్వక
అద్భుత అతులిత
నటనా ఘటికా..

భీమసేన వీరార్జున
కృష్ణ దానకర్ణ
మానధన సుయోధాన
భీష్మ బృహన్నల
విశ్వామిత్ర

లంకేశ్వర దశకంఠరావణాసురాధి
పురాణ పురుష భూమికా పోషకా… 
సాక్షాత్ సాక్షాత్కారకా..
త్వదీయ ఛాయాచిత్రాచ్ఛాదిత
రాజిత రంజిత్‌ చిత్రయవనికా..

న ఇదం పూర్వక
రసోత్పాదకా..
కీర్తికన్యాకా..
మనోనాయకా..
కథానాయకా..
కథానాయకా..

ఘన కీర్తిసాంధ్ర
విజితాఖిలాంధ్ర
జనతాసుధీంద్రా
మణి దీపకా...

త్రిశతకాధిక
చిత్రమాలిక
జైత్రయాత్రక
కథానాయకా




వెండితెర దొర పాట సాహిత్యం

 
చిత్రం: NTR (కథానాయకుడు) (2019)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: యం. యం. కీరవాణి
గానం: యం. యం. కీరవాణి

వెండితెర దొర 



బంటురీతి కొలువు పాట సాహిత్యం

 
చిత్రం: NTR (కథానాయకుడు) (2019)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: చిత్ర, శ్రీనిధి తిరుమల 

బంటురీతి కొలువు 




కథానాయకా (Female version) పాట సాహిత్యం

 
చిత్రం: NTR (కథానాయకుడు) (2019)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: కె.శివశక్తి దత్త, డా. కె. రామకృష్ణ
గానం: శ్రీనిధి తిరుమల, రమ్యా బెహ్ర, మోహన భోగరాజు 

కథానాయకా 




రామన్న కథ పాట సాహిత్యం

 
చిత్రం: NTR (కథానాయకుడు) (2019)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: యం. యం. కీరవాణి
గానం: చిత్ర, సునీత ఉపద్రస్ట 

రామన్న కథ 




చైతన్య రథం పాట సాహిత్యం

 
చిత్రం: NTR (కథానాయకుడు) (2019)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యం. యం. కీరవాణి, కాలభైరవ, కీర్తి సాగతియ, సాయి శివాని 

చైతన్య రథం 




రాజర్షి పాట పాట సాహిత్యం

 
చిత్రం: NTR (కథానాయకుడు) (2019)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: కె.శివశక్తి దత్త, డా. కె. రామకృష్ణ, యం. యం. కీరవాణి
గానం: శరత్ సంతోష్ ,  యం. యం. కీరవాణి, కాల భైరవ, శ్రీనిధి తిరుమల, మోహన భోగరాజు

నమాతా పితా నైవ
బంధుర్నమిత్రా
నమే ద్వేషరాగౌ
నమే లోభమోహౌ…

న పుణ్యం న పాపం
న సౌఖ్యం న దు:ఖం
చిదానందరూప:
శివోహం శివోహం..

తల్లి ఏది? తండ్రి ఏడి?
అడ్డు తగిలే బంధమేదీ?
మమతలేవీ? మాయలేవీ?
మనసుపొరల మసకలేవీ?

నీ ఇల్లు నీ వాళ్ళు
నీదంటూ ఈ చింత
సుంతైన లేని ఈ నేల పై నడయాడు ఋషివో
కృషితో నాస్తి దుర్భిక్షమని లోకాన్ని శాసించు
మనిషివో.. ఋషివో.. రాజర్షివో..
ఎవరివో.. నీవెవరివో.. నీవెవరివో.. ఎవరివో

న మంత్రో న తీర్ధం
న యజ్ఞా: న వేదం
న ధర్మో నచార్ధో
న మోక్ష : న కామం

న మృత్యుర్నశంకా
న మే జాతి భేదం
చిదానందరూప:
శివోహం శివోహం..

జాగృతములో జాగు ఏదీ? రాత్రి ఏదీ? పగలు ఏదీ?
కార్యదీక్షా బద్ధుడవుగా.. అలుపు ఏదీ? దిగులు ఏదీ?

ఉఛ్వాస నిశ్వాసముల ప్రాణయాగాన్ని 
ఉర్వీజనోద్ధరణకై  చేయు రాజయోగిీ..
కదనరంగాన కర్మయోగీ

అహం నిర్వికల్పో
నిరాకర రూపో
విభుర్వ్యాప్య సర్వత్ర
సర్వేంద్రియాణాం

న తేజో నవాయుర్ణ
భూమి ర్న వ్యోమం
చిదానందరూప:
శివోహం శివోహం..

నిర్వసన, వాసాన్న సంక్షేమ 
స్వాప్నికుడు ఇతడు..
నిష్క్రియా ప్రచ్ఛన్న సంగ్రామ 
శ్రామికుడు ఇతడు..
నిరత సంఘశ్రేయ సంధాన 
భావుకుడు ఇతడు..

మహానాయకుడు ఇతడు..
మహానాయకుడు ఇతడు..

నమాతా పితా నైవ
బంధుర్నమిత్రా
నమే ద్వేషరాగౌ
నమే లోభమోహౌ…

న పుణ్యం న పాపం
న సౌఖ్యం న దు:ఖం
చిదానందరూప:
శివోహం శివోహం..

న మంత్రో న తీర్ధం
న యజ్ఞా: న వేదం
న ధర్మో నచార్ధో
న మోక్ష : న కామం
న మృత్యుర్నశంకా
న మే జాతి భేదం

చిదానందరూప:
శివోహం శివోహం..
అహం నిర్వికల్పో
నిరాకర రూపో
విభుర్వ్యాప్య సర్వత్ర
సర్వేంద్రియాణాం

న తేజో నవాయుర్ణ
భూమి ర్న వ్యోమం
చిదానందరూప:
శివోహం శివోహం..

Palli Balakrishna Monday, January 21, 2019
Chandamama Kathalu (2014)


చిత్రం: చందమామ కథలు (2014)
సంగీతం: మిక్కీ జె. మేయర్
సాహిత్యం: 
గానం: కళ్యాణి
నటీనటులు: లక్ష్మీ మంచు, ఆమని, నరేష్ , నాగశౌర్య , చైతన్య కృష్ణ , రిచా పానయ్
దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
నిర్మాత: చాణక్య భూనేటి
విడుదల తేది: 25.04.2014

కలని ఇలని కలిపిన వారధులు
కలిమి లేమి కరిగిన సుధలు
ఎపుడేమైన తరగని సంపదలు
ఇప్పుడే భువిలో ఇవి జానపదులు

చందమామ కథలు సాటివారి ఎదలు దాచుమేడలు
చందమామ కథలు వారి వీరి సోదలు తమపునాదులు

ఇవ్వాళ ఇలాగ నీ ముందు ఉన్నాది
ఇలాగే ఇలాగే రేపుండదోయ్ అది
నిజంలో బలాన్ని చూపిస్తు ఉన్నది
కొన్నాళ్ళు వెలుగులలో కొన్నాళ్ళు మసకలలో
వందేళ్లు గడపమని అన్నాయి

కలని ఇలని కలిపిన వారధులు
కలిమి లేమి కరిగిన సుధలు
ఎపుడేమైన తరగని సంపదలు
ఇప్పుడే భువిలో ఇవి జానపదులు

చందమామ కథలు సాటివారి ఎదలు దాచుమేడలు
చందమామ కథలు వారి వీరి సోదలు తమపునాదులు

తపించే గుణాన్ని నీడల్లే మార్చుకో
శపించే క్షణాన్ని ఓడించి వంచుకో
నటించే జగములో నీ పాత్ర తెలుసుకో
ఆదిచాలు తరువాత మిగిలింది తలరాత
అనుకుంటూ బతకమని అన్నాయి

కలని ఇలని కలిపిన వారధులు
కలిమి లేమి కరిగిన సుధలు
ఎపుడేమైన తరగని సంపదలు
ఇప్పుడే భువిలో ఇవి జానపదులు

చందమామ కథలు సాటివారి ఎదలు దాచుమేడలు
చందమామ కథలు వారి వీరి సోదలు తమపునాదులు

Palli Balakrishna Monday, December 11, 2017
Sisindri (1995)


చిత్రం: సిసింద్రీ (1995)
సంగీతం: రాజ్
సాహిత్యం: సిరివెన్నెల (All)
గానం: యస్.పి.బాలు , చిత్ర
నటీనటులు: నాగార్జున, మాస్టర్ అఖిల్ , టబు, ఆమని, పూజా బట్రా
దర్శకత్వం: శివనాగేశ్వరరావు
నిర్మాత: నాగార్జున అక్కినేని
విడుదల తేది: 14.09.1995

ఆటాడుకుందం రా అందగాడ అందర చందురూడా
అల్లేసుకుందం రా మల్లెతీగ ఒప్పుకో సరదాగా
సై సై అంటా.. హొయ్ హొయ్
చూసెయ్ అంతా.. హొయ్ హొయ్
నీ సొమ్మంతా.. హొయ్ హొయ్
నాకే అంటా.. హొయ్ హొయ్

ఆటాడుకుందం రా అందగాడ అందర చందుౠఉడా
అల్లేసుకుందం రా మల్లెతీగ ఒప్పుకో సరదాగా

ఓరి గండు తుమ్మెదా చేరమంది పూపొదా
ఓసి కన్నెసంపదా దారి చుపుతా పదా
మాయదారి మన్మధ మరి అంత నెమ్మదా
అంత తీపి ఆపద పṇట నొక్కి ఆపెదా
వయస్సుంది వేడి మీద వరిస్తోంది చూడరాద
తీసి ఉంచు నీ ఎదా వీలు చూసి వాలెద
ఓ రాధ ని బాధ ఒదార్చి వెల్లేద

ఆటాడుకుందం రా అందగాడ అందర చందురూడా
అల్లేసుకుందం రా మల్లెతీగ ఒప్పుకో సరదాగా

ముద్దుముద్దుగున్నదీ ముచ్చతైన చిన్నదీ
జోరుజోరుగున్నదీ కుర్రవాడి సంగతీ
హోయ్ నిప్పు మేలుకున్నది
తప్పు చెయ్యమన్నది
రెప్ప వాలకున్నది
చూపు చుర్రుమన్నది
మరీ లేతగుంది బాడి భరిస్తుంద నా కబాడి
ఇష్టమైన ఒత్తిడి ఇంపుగానె ఉంటది
ఇందాక వచ్చక సందేహమేముంది

ఆటాడుకుందం రా అందగాడ అందర చందురూడా
అల్లేసుకుందం రా మల్లెతీగ ఒప్పుకో సరదాగా


******  ******  ******


చిత్రం: సిసింద్రీ (1995)
సంగీతం: రాజ్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: స్వర్ణలత

చిన్ని తండ్రీ నిను చూడగా
వేయి కల్లైన సరిపోవురా
అన్ని కల్లు చూస్తుండగా
నీకు దిష్టెంత తగిలేనురా
అందుకే అమ్మ వొడిలోనే దాగుండిపోరా

చిన్ని తండ్రీ నిను చూడగా
వేయి కల్లైన సరిపోవురా

ఏ చోటా నిమిషం కూడా వుండలేడు
చిన్నారి సిసింద్రిలా చిందు చూడు
పిలిచినా పలకడూ వెతికినా దొరకడూ
మా మధ్య వెలిశాడు ఆ జాబిలీ
ముంగిట్లొ నిలిపాడు దీపావలీ
నిలిచుండాలి కలకాలము ఈ సంభరాలు

చిన్ని తండ్రీ నిను చూడగా
వేయి కల్లైన సరిపోవురా
అన్ని కల్లు చూస్తుండగా
నీకు దిష్టెంత తగిలేనురా
అందుకే అమ్మ వొడిలోనే దాగుండిపోరా

ఆ మువ్వగోపాలుల్లా తిరుగుతుంటే
ఆ నవ్వె పిల్లంగ్రోవై మోగుతుంటే
మనసులో నందనం విరియదా ప్రతి క్షణం
మా కంటి వెలుగులె హరివిల్లుగా
మా ఇంటి గడపలె రేపల్లెగా
మా ఈ చిన్ని రాజ్యనికీ యువరాజు వీడూ

చందమామా చుసావటోయ్ అచ్చు నీలాంటి మా బాబునీ
నేల అద్దాన నీ బింబమై పారాడుతుంటే
చందమామా చుసావటోయ్ అచ్చు నీలాంటి మా బాబునీ




Palli Balakrishna Sunday, December 3, 2017
Nakshatra Poratam (1993)

చిత్రం: నక్షత్ర పోరాటం (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: సుమన్ , భనుచందర్, అరుణ్ పాండ్యన్,  ఆమని, రోజా, సిందూజా
దర్శకత్వం: సాగర్
నిర్మాత: టి. ఆర్.తులసి
విడుదల తేది: 1993

ఓ ప్రియా ప్రియా ప్రియా
దిల్ దియా దియా దియా
కన్నె సిగ్గు బరువాయే కంటినిద్ర కరువాయే
పిచ్చిప్రేమ రెచ్చిపోయే తెల్లవార్లు జాతరాయే

ఓ ప్రియా ప్రియా ప్రియా
దిల్ దియా దియా దియా

నీలి నింగి నీడలో ఓ రంగారు బంగారు మేడ కట్టేయనా
పాలపుంత జాడలో నును మొత్తంగ ముద్దిచ్చి
నిను చుట్టేయనా
వెచ్చంగా చేరుకున్నాక ఊరుకుంటాన పిల్లాడా
మొత్తంగా ఇచ్చుకున్నాకే పుచ్చుకుంటాలే బుజ్జమ్మా
ముందుగా ముచ్చటే తీరని ఈ పక్కనే నక్కిపోరా

ఓ ప్రియా ప్రియా ప్రియా
దిల్ దియా దియా దియా

కన్నె జాజి పువ్వులో మకరందాన్ని ఎంచక్కా కొల్లగొట్టేయనా కొంటె చందమామని ఒంటి ఒంపుల్లో పట్టేసి ఆట కట్టేయనా
వద్దంటూ మొండికేస్తుంది విందుకొస్తావేం అమ్మాడి
ఇన్నాళ్లు దాచుకుందంత దోచి ఇవ్వాలా అబ్బాడి
అందుకే వచ్చినా చోకిరి మొదలెట్టనా తందనా ఓ

ఓ ప్రియా ప్రియా ప్రియా
దిల్ దియా దియా దియా
కన్నె సిగ్గు బరువాయే కంటినిద్ర కరువాయే
పిచ్చిప్రేమ రెచ్చిపోయే తెల్లవార్లు జాతరాయే

ఓ ప్రియా ప్రియా ప్రియా
దిల్ దియా దియా దియా




Palli Balakrishna Thursday, November 2, 2017
Top Hero (1994)



చిత్రం: టాప్ హీరో (1994)
సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి
నటీనటులు: బాలక్రిష్ణ , సౌందర్య, ఆమని
దర్శకత్వం: యస్.వి.కృష్ణారెడ్డి
నిర్మాతలు: వెంకటరావు ముల్పూరు, అచంట గోపీనాథ్
విడుదల: 09.12.1994



Songs List:



ఓ పాప ముద్దు పాప పాట సాహిత్యం

 
చిత్రం: టాప్ హీరో (1994)
సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు 
గానం: యస్.పి. బాలు

ఓ పాప ముద్దు పాప



సామజవరగమన పాట సాహిత్యం

 
చిత్రం: టాప్ హీరో (1994)
సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు 
గానం: యస్.పి. బాలు, చిత్ర 

సామజవరగమన 



ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తే పాట సాహిత్యం

 
చిత్రం: టాప్ హీరో (1994)
సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల  
గానం: యస్.పి. బాలు, చిత్ర 

ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తే




జామురాతిరి కాసుకోమరి పాట సాహిత్యం

 
చిత్రం: టాప్ హీరో (1994)
సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు 
గానం: యస్.పి. బాలు, చిత్ర 

జామురాతిరి కాసుకోమరి



భామ నీ చీర కట్టు పాట సాహిత్యం

 
చిత్రం: టాప్ హీరో (1994)
సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు 
గానం: యస్.పి. బాలు, చిత్ర 

భామ నీ చీర కట్టు 



బీడీలు తాగండి పాట సాహిత్యం

 
చిత్రం: టాప్ హీరో (1994)
సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల  
గానం: యస్.పి. బాలు, చిత్ర 

బీడీలు తాగండి 

Palli Balakrishna Friday, September 1, 2017
Mister Pellam (1993)


చిత్రం:  మిస్టర్ పెళ్ళాం (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: రాజేంద్రప్రసాద్, ఆమని
దర్శకత్వం: బాపు
నిర్మాత: గవర పార్థసారథి
విడుదల తేది: 05.09.1993

సొగసు చూడ తరమా
హా హా హా హా
సొగసు చూడ తరమా
హ హ హ హ
నీ సొగసు చూడ తరమా
నీ సొగసు చూడ తరమా

నీ ఆపసోపాలు నీ తీపి శాపాలు
ఎర్రన్ని కొపాలు ఎన్నెన్నో దీపాలు
అందమే సుమా
సొగసు చూడ తరమా
నీ సొగసు చూడ తరమా

అరుగు మీద నిలబడి
నీ కురులను దువ్వే వేళ
చేజారిన దువ్వెన్నకు
బేజారుగ వంగినప్పుడు
చిరు కోపం చీర గట్టి
సిగ్గును చెంగున దాచి
ఫక్కుమన్న చక్కదనం
పరుగో పరుగెట్టినప్పుడు

ఆ సొగసు చూడ తరమా
నీ సొగసు చూడ తరమా

పెట్టీ పెట్టని ముద్దులు
ఇట్టే విదిలించి కొట్టి
గుమ్మెత్తే సోయగాల
గుమ్మాలను దాటు వేళ
చెంగు పట్టి రా రమ్మని
చలగాటకు దిగుతుంటే
తడి వారిన కన్నులతో
విడు విడు మంటున్నప్పుడు
విడు విడు మంటున్నప్పుడు

ఆ సొగసు చూడ తరమా
నీ సొగసు చూడ తరమా

పసిపాపకు పాలిస్తూ
పరవశించి వున్నప్పుడూ
పెద పాపడు పాకివచ్చి
మరి నాకో అన్నప్పుడు
మొట్టి కాయ వేసి
ఛీ పొండి అన్నప్పుడు
నా ఏడుపూ హహహ
హహహ నీ నవ్వులూ
హరివిల్లై వెలిసి నప్పుడు
ఆ సొగసు చూడ తరమా
నీ సొగసు చూడ తరమా

సిరి మల్లెలు హరి నీలపు
జడలో తురిమీ
క్షణమే యుగమై వేచీ వేచీ
చలి పొంగులు తొలి కోకల
ముడిలో అదిమీ
మనసే సొలసీ కన్నులు వాచి
నిట్టూర్పులా నిశి రాత్రి తో
నిదరోవు అందాలతో
త్యగరాజ కృతిలో
సీతాకృతి గల ఇటువంటీ

సొగసు చూడ తరమా
నీ సొగసు చూడ తరమా



*********  *********   ********


చిత్రం:  మిస్టర్ పెళ్ళాం (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

అడగవయ్య అయ్యగారి ఎక్కువేవిటో
అలా అడగవయ్య అయ్యగారి ఎక్కువేవిటో చెప్పమను ఆడవాళ్ళ తక్కువేవిటో
అడగవయ్య అయ్యగారి ఎక్కువేవిటో చెప్పమను ఆడవాళ్ళ తక్కువేవిటో
ఆ ఎక్కువేవిటో ఈ తక్కువేవిటో
ఆ ఎక్కువేవిటో ఈ తక్కువేవిటో

చరణం: 1
పదునాలుగు భువనాలన్నీ పలిస్తున్నాను పరిపాలిస్తున్నాను
ఆ భువనాలను దివనాలను నేను పోషిస్తున్నాను నేనే పోషిస్తున్నాను
సిరి లేని హరి వట్టి దేశ దిమ్మరి సిరి లేని హరి వట్టి దేశ దిమ్మరి
నేను అలిగి వెళ్ళానా తనకు లేదు టికానా
ఓహో ఏడు కొండలవాడి కథా తల్లీ నువు చెప్పేది బాగుందమ్మా కానీ కానీ
పెళ్లి కోసం తిప్పలు చేశాడండి అప్పులు
నాతో పెళ్లి కోసం తిప్పలు చేశాడండి అప్పులు
వడ్డీ కాసుల వాడా వెంకటరమణా గోవిందా గోవింద
కొండ మీద నేను మరి కొండ కింద ఎవరో ... నువ్వు అడగవయ్యా
నడిరేయి దాటగానే దిగి వచ్చేదెవరో దిగి వచ్చేదెవరో
అడగవయ్య అయ్యగారి ఎక్కువేవిటో చెప్పమను ఆడవాళ్ళ తక్కువేవిటో
ఆ ఎక్కువేవిటో ఈ తక్కువేవిటో
ఆ ఎక్కువేవిటో ఈ తక్కువేవిటో

చరణం: 2
త్రేతాయుగమున నేను ఆ శ్రీరామచంద్రుడిని
ఐనా సీతాపతి అనే పిలిచారండి మిమ్ము పిలిచారండి
నరకాసుర వధ చేసిన కృష్ణుడిని తెలుసా
సత్యభామని విల్లంబులు తెల్లంబుగ పట్టిన సత్యభామని వీరభామని
భామగారి నోరు భలే జోరు జోరు మొగుడిని దానమిచ్చినారు మొగసాలకెక్కినారు
ఆ తులాభారం అదో తలభారం ... భలే మంచి చౌక బేరము
సవతి చెంత కాళ్ళ బేరము
అయ్యా దొరగారి పరువు తులసీ దళం బరువు
సత్యం సత్యం పునః సత్యం
శ్రీ మద్ రమా రమణ గోవిందో హరిః



*******   *******   *******


చిత్రం:  మిస్టర్ పెళ్ళాం (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం
mummy పోయి daddy వచ్చే ఢాం ఢాం ఢాం
పెన్ను పోయి గరిటె వచ్చే ఢాం ఢాం ఢాం
ఇదే కొత్త kingdom ఢాం

చరణం: 1
అంట్లు తోమే ఆడది gents కు లోకువ చూడు
గాజులు తొడిగే శ్రీమతి పోజులు చెల్లవు నేడు
butler పని నే చేసినా hitler నేనని తెలుసా
ఆలుమగల యాత్రలో upper berth నే పరిచా
సమాన హక్కులంటే ఆ సమాధి లోపలంట
మగాడి నీడలోనే స్త్రీలకి ఉగాది ఉన్నదంట
భీముడల్లె వంట ఇంట కాముడల్లె పడకటింట
ఆడవాళ్లనేలుకొని కోడెగాడు ఎందుకంట ఢాం ఢాం ఢాం

ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం
mummy పోయి dummy వచ్చే ఢాం ఢాం ఢాం
ఏయ్ mummy పోయి daddy వచ్చే ఢాం ఢాం ఢాం
పెన్ను పోయి గరిటె వచ్చే ఢాం ఢాం ఢాం
ఇదే కొత్త kingdom ఢాం



*********   *********  *********


చిత్రం:  మిస్టర్ పెళ్ళాం (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర

రాదే చెలి నమ్మరాదే చెలి మగవారినిలా నమ్మరాదే చెలి
రాదే చెలి నమ్మరాదే చెలి మగనాళి మనస్సమ్మరాదే చెలి

చరణం: 1
నాడు పట్టు చీర కట్టవద్దు బరువన్నాడే
నేడు నూలు చీరకే డబ్బులు కరువన్నాడే
నెలతప్పిన నెలత తనకు పరువన్నాడే
నేడు నెలబాలుని చేతికిస్తే బరువన్నాడే
ముంగురులను చూసి నాడు మురిసిపోయాడే
ఆ కురులకు విరులివ్వడమే మరిచిపోయాడే
ప్రేమించు season లో పెద్ద మాటలు పెళ్ళయ్యాక plate ఫిరాయింపులు
మొదటి వలపు మధుర కథలు మరచెను ఘనుడు
మగవారినిలా నమ్మరాదే చెలి
రాదే చెలి నమ్మరాదే చెలి మగవారినిలా నమ్మరాదే చెలి

చరణం: 2
మాటల్తో కోట కట్టాడే అమ్మో నా మహారాణి నీవన్నాడే
కాలు కింద పెడితేనే కందిపోవునన్నాడే
వాలు తాకితే మోమున కాలు విరుగునన్నాడే
కవ్వించుకున్నాడే కౌగిలి కోసం ఆ కాస్తా తీరాకా మొదటికే మోసం
మనవి వినడు మనసు కనడు మాయల మొగుడు

మగవారినిలా నమ్మరాదే చెలి
రాదే చెలి నమ్మరాదే చెలి మగవారినిలా నమ్మరాదే చెలి
రాదే చెలి నమ్మరాదే చెలి మగనాళి మనస్సమ్మరాదే చెలి

తలలో నాలుకలా పూసలలో దారంబు మాట్టే
సతి మదిలో నన్నెలగిడు పురుషుడు కలుగుట
తొలి జన్మము నోమభయము తోయజనేత్రా
తనుగా వలచిన వరుడేనా ఈ పురుషోత్తముడు
వ్రతములు సలిపిన సతులకు గతి కలదా ఇలలో కలదో లేదో

Palli Balakrishna Wednesday, August 16, 2017
Gharana Bullodu (1995)



చిత్రం: ఘరానా బుల్లోడు (1995)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
నటీనటులు: నాగార్జున, రమ్యకృష్ణ , ఆమని
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
నిర్మాత: కె.కృష్ణమోహన్ రావు
విడుదల తేది: 27.04.1995



Songs List:



వంగి వంగి దండమెట్టు పాట సాహిత్యం

 
చిత్రం: ఘరానా బుల్లోడు (1995)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేస్వర రావు
గానం: మనో

హేయ్ ఓలే ఓలే ఓలే...
హేయ్ ఓలే ఓలే ఓలే ఓలే...

వంగి వంగి దండమెట్టు రాజకీయ రంభరో
లింగు లింగు మంటు వచ్చే సంగతేంటో చూడరో
గుమ్మ పాప చెమ్మ చెక్క యమా కసక్కురో
జున్ను బుగ్గ నొక్కుతుంటే ఝం ఝం చమక్కురో
ఏయ్ లగ్గా ఏసేయ్ లగ్గా
ఏయ్ లగ్గా ఏసేయ్ లగ్గా
దుయ్ లగ్గా దూసేయ్ లగ్గా
బుడి బుడి నడుముకు ఎగబడి తలబడి 
వేస్తా నా ఓటు చురకేస్తా ఓ మాటు

దిమి దిట పిట పిట దినా దినక్కురో
సగ మగ నిగ పమ  యమా కసక్కురో
చెయ్యమీద పడ్డదంటే చమా చమక్కురో
నచ్చినోడు మెచ్చుకుంటే నాకే పిచ్చెక్కిరో

ఏయ్ లగ్గా ఏసేయ్ లగ్గా
దుయ్ లగ్గా దూసేయ్ లగ్గా
వేస్తే ఓటు ఊరు వాడ కవరైపోతాది 
ఇది లవరై పోతాది

బత్తాయిలు సపోటాలు దానిమ్మపల్లండోయ్
బని సగ సని బని  సగ మప ప
నిస గమ పగా ప
నిస గమ గస నిమ పా
దానిమ్మ పళ్ళ పాప గంప దించి చూపించు
రంగు చూసుకొనివ్వు పళ్ళు పట్టుకోనివ్వు
మంచి గుందో ఎండ గుందో 
పండు గుందో చూడొద్దేంటి
చెయ్య పెట్టక్కుంటే సంగతెట్ట తెలుస్తాదే
నటక పిటక 

ఏంటది ఎటంతన్నావు నువ్వు 
ఈ మెలిక బాస నాకేటెరుక

పార్టి గుర్తు బంతి పువ్వు వేసేయ్ ఓటు రైకపల్లి
సెంటర్ లోన సభ పెడతా సత్తా ఏంటో చూపెడతా
కొక్కొరొక్కో కొంచం కోరుక్కో 
సిగ్గు దూస్కో బుగ్గ బుగ్గ రాస్కో
కన్నె జింకో కవ్వించి కాస్కో
విందు చేస్కో తేనే ముద్దరేస్కో
కిస్సు కిటుకు కుళికే సరుకు అడక్కు
వీడు జింగి చక్క చిందులేసి బరిలో దిగితే 
అగడే సోకులాడి
విరుచుకు పడితే ఇరుకున పడతావ్ 
కబాడీ మొనగాడా

వంగి వంగి దండమెట్టు రాజకీయ రంభరో
లింగు లింగు మంటు వచ్చే సంగతేంటి చూడరో
గుమ్మ పాప చెమ్మ చెక్క యమా కసక్కురో
జున్ను బుగ్గ నొక్కుతుంటే ఝం ఝం చమక్కురో
ఏయ్ లగ్గా ఏసేయ్ లగ్గా
ఏయ్ లగ్గా ఏసేయ్ లగ్గా
దుయ్ లగ్గా దూసేయ్ లగ్గా
వేస్తే ఓటు ఊరు వాడ కవరైపోతాది 
ఇది లవరై పోతాది

పండో కాయో ఇచ్చుకోవే
రండో రండని చేర్చుకోవే
కొండా కోన అదిరేలా జండా కర్ర పట్టుకోరా
ఆడి చూస్కో శృంగార డిస్కో
సందు సూస్కో సంబరాలు చేస్కో
లొంగదీస్కో మందార మాస్కో
దమ్ము చేస్కో సోకు సొమ్ము చేస్కో
పట్టు పడుచు పదవే చేరి అతుక్కో
నువ్వు జంట కట్టి వెంట ఉంటె 
చాలురా పిల్లగో ఎదురే లేదింకా
ఎగుడు దిగుడు ఆట పాటకి ఎగరాలే చిలక

దిమి దిట పిట పిట దినా దినక్కురో
సగ మగ నిగ పమ  యమా కసక్కురో
చెయ్యమీద పడ్డదంటే చమా చమక్కురో
నచ్చినోడు మెచ్చుకుంటే నాకే పిచ్చెక్కిరో

ఏయ్ లగ్గా ఏసేయ్ లగ్గా
దుయ్ లగ్గా దూసేయ్ లగ్గా
బుడి బుడి నడుముకు ఎగబడి తలబడి 
వేస్తా నా ఓటు చురకేస్తా  ఓ మాటు





భీమవరం బుల్లోడా పాలు కావాలా పాట సాహిత్యం

 
చిత్రం: ఘరానా బుల్లోడు (1995)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: యస్. పి. బాలు, చిత్ర

(ఈ పాట సుమంత్, ప్రియమణి, విమలారామన్ గారు నటించిన రాజ్ (2011)  సినిమాలో రీమిక్స్ చేశారు. దీనికి సంగీతం: కోటి,  గానం: శ్రీకృష్ణ , సునీత )


భీమవరం బుల్లోడా పాలు కావాలా 
మురి పాలు కావాలా
జింకు చకం  జింకు చకం
నరసాపురం నరసమ్మ నైసు గుందమ్మ 
నీ చెక్కెర చుమ్మా
జింకు చకం  జింకు చకం
పచ్చిపాలు మీగడా
జింకు చకం  జింకు చకం
అచ్చతెలుగు ఆవడా
పెదవుల్లోనే దాచావమ్మో ఓ ఓ ఓ

భీమవరం బుల్లోడా పాలు కావాలా 
మురి పాలు కావాలా

మావుళ్ళమ్మ జాతరలో
జింకు చకం  జింకు చకం
కౌగిళ్ళమ్మ సెంటర్లో
జింకు చకం  జింకు చకం
ఒళ్ళో కొచ్చి పడతావని ఒళ్ళంతా కళ్ళు చేసి 
నీ కోసం ఎదురుచూస్తి మావో
జారే పైట జంక్షన్ లో 
జింకు చకం  జింకు చకం
జోరే ఎక్కు టెన్సన్ లో 
జింకు చకం  జింకు చకం
కారకిళ్ళీ లాంటి కిస్సు ఆరార పెట్టమంటు 
నోరార అడిగినాను పిల్లో
కుర్రోడి కురుకుళ్ళకి ఎదే ఎర్రెక్కి పోతుంది పాడు
కుర్రోడి చిరు తిల్లుకి ఏదో ఎర్రెక్కి పోతుంది చూడు
ఆ అందుకో బాసు ఆటీను ఆసు ఓ ఓ ఓ

భీమవరం బుల్లోడా పాలు కావాలా 
మురి పాలు కావాలా
జింకు చకం  జింకు చకం
నరసాపురం నరసమ్మ నైసు గుందమ్మ 
నీ చెక్కెర చుమ్మా

తపాలమ్మ సావిట్లో 
జింకు చకం  జింకు చకం
దాహాలమ్మ సందిట్లో
జింకు చకం  జింకు చకం
రేపో మాపో నీతోని లంగరేసుకుందామని
చెంగు చాటుకొచ్చినాను పిల్లో
మొహాపురం స్టేషన్లో
జింకు చకం  జింకు చకం
ముద్దాపురం బస్సెక్కి
జింకు చకం  జింకు చకం
చెక్కిలి పల్లి చేరాలని అక్కరతో వచ్చినావు 
అందుకనే నచ్చినావు మావో
వరసైన దొరసానికి ఇక కరుసేలె ఇరుసైన రోజు
దరువేసే దొరబాబుకి 
ఈ పరువాల బరువెంతో మోజు
వయ్యారి జాణ ఒళ్లోకి రానా ఓ ఓ ఓ

జింకు చకం  జింకు చకం
భీమవరం బుల్లోడా పాలు కావాలా 
మురి పాలు కావాలా
జింకు చకం  జింకు చకం
నరసాపురం నరసమ్మ నైసు గుందమ్మ 
నీ చెక్కెర చుమ్మా
జింకు చకం  జింకు చకం
పచ్చిపాలు మీగడా
జింకు చకం  జింకు చకం
అచ్చతెలుగు ఆవడా
పెదవుల్లోనే దాచావమ్మో ఓ ఓ ఓ




ఎం కసి ఎం కసి ముద్దో పాట సాహిత్యం

 
చిత్రం: ఘరానా బుల్లోడు (1995)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: మనో, చిత్ర

పల్లవి:
ఎం కసి ఎం కసి ముద్దో తెచ్చింది ఏదో చలి
చుమ్మా... చుమ్మా...
ఎం కసి ఎం కసి ముద్దో గిచ్చింది ఏదో గిలి
చుమ్మా... చుమ్మా...
చంపకు చారడు ముద్దు 
సిరి సొంపుకు సోలెడు ముద్దు
చంపక మాలల ముద్దు 
నను చంపుకు తిన్నది తెల్లార్లు ఈ ముద్దు

ఎం కసి ఎం కసి ముద్దో తెచ్చింది ఏదో చలి
చుమ్మా... చుమ్మా...
ఎం కసి ఎం కసి ముద్దో గిచ్చింది ఏదో గిలి
చుమ్మా... చుమ్మా...

చరణం: 1
తెల్లా తెల్లాని మల్లెపూలు తెప్పిచ్చా తెప్పిచ్చా
ఒళ్లోకి వస్తే ఒక్కసారి కుక్కుచ్చా కుక్కుచ్చా
పెదవికి పెదవి అప్పిచ్చా
పెర పెర లన్ని తప్పిచ్చా
నిద్దర పొద్దుల ముద్దుల మద్దెల మోగించుకో
ఆరని చెమ్మల తీరని తిమ్మిరి తగ్గించుకో

ఓ ఓ ఓ ఎం కసి ఎం కసి ఎం కసి ఎం కసి
ఎం కసి ఎం కసి ముద్దో తెచ్చింది ఏదో చలి
చుమ్మా... చుమ్మా...
ఎం కసి ఎం కసి ముద్దో గిచ్చింది ఏదో గిలి
చుమ్మా... చుమ్మా...

చల్లా చల్లాని పిల్లగాలి గంటల్లో గంటల్లో
చక్కా చక్కాని చెక్కిలమ్మ గుంటల్లో గుంటల్లో
వయసుకు వయసే తెలిసింది
వరుసకు ఇరుసే కలిసింది
చీకటి చేతికి చిక్కని చక్కని ఆటే ఇది
ఆకలి లోతులు చూసిన చుక్కల పాటే ఇది

హో హో హో ఎం కసి ఎం కసి ఎం కసి ఎం కసి
ఎం కసి ఎం కసి ముద్దో తెచ్చింది ఏదో చలి
చుమ్మా... చుమ్మా...
ఎం కసి ఎం కసి ముద్దో గిచ్చింది ఏదో గిలి
చుమ్మా... చుమ్మా...





సై సై సయ్యారే పాట సాహిత్యం

 
చిత్రం: ఘరానా బుల్లోడు (1995)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

సై సై సయ్యారే  సై సై సయ్యారే (6)
పిక్కపైకి చీరకట్టి వస్తవా వస్తవా
సై సై సయ్యారే  సై సై సయ్యారే
మక్కువైన మల్లిచండు ఇస్తవా ఇస్తవా
సై సై సయ్యారే  సై సై సయ్యారే
కట్టులో పట్టు ఉంది కసి కసి కసిగుంది
కడవా కవ్వమంటే కలయిక మంది
దీని తస్సదియ్య దాని ఊపు చూసి 
నేను కాపు కాసి కొత్త కాపు కోసి
కొంగు చాటునున్న పొంగులన్ని చూస్తే
దాని తళుకు బెళుకు తొణికినపుడే
సై సై సయ్యారే  సై సై సయ్యార
సయ్యారే సయ్యరె సయ్యరె  సయ్యరె సయ్యరె సై

పిక్కపైకి చీరకట్టి వస్తవా వస్తవా
సై సై సయ్యారే  సై సై సయ్యారే
మక్కువైన మల్లిచండు ఇస్తవా ఇస్తవా
సై సై సయ్యారే  సై సై సయ్యారే

కడవతో కదిలొస్తుంటే 
కలా ఇలా శకుంతులై మెరిసింది
చిలిపిగా వెనకొస్తుంటే
జడా ధడా జతిస్వరం పలికింది
అగ్గేసి పోయే ఆరాటంలో 
మొగ్గేసి పోయే మోమాటంలో
వగలో వయ్యారమొ అదిరిందిలే
లయలో లడాయిలో తెలిసిందిలే
సయ్యారే సయ్యరె సయ్యరె  సయ్యరె సయ్యరె
సయ్యారే సయ్యరె సయ్యరె  సయ్యరె సయ్యరె సై

పిక్కపైకి చీరకట్టి వస్తవా వస్తవా
సై సై సయ్యారే  సై సై సయ్యారే
మక్కువైన మల్లిచండు ఇస్తవా ఇస్తవా
సై సై సయ్యారే  సై సై సయ్యారే

వలపుతో వల వేస్తుంటే 
అదిగ్గురు చలకిగ తగిలింది
పొలములో నాటేస్తుంటే
మనస్సులో ధనస్సుల విరిగింది
సంపంగి పూల సాయంత్రంలో
చింపంగి రేకు చీమంతంలో
హే పగలు పరాకులో పరువానికి
మధురం మనోహరం మనపేరులే

సయ్యారే సయ్యరె సయ్యరె  సయ్యరె సయ్యరె
సయ్యారే సయ్యరె సయ్యరె  సయ్యరె సయ్యరె సై

పిక్కపైకి చీరకట్టి వస్తవా వస్తవా
సై సై సయ్యారే  సై సై సయ్యారే
మక్కువైన మల్లిచండు ఇస్తవా ఇస్తవా
సై సై సయ్యారే  సై సై సయ్యారే
కట్టులో పట్టు ఉంది కసి కసి కసిగుంది
కడవా కవ్వమంటే కలయిక మంది
దీని తస్సదియ్య దాని ఊపు చూసి 
నేను కాపు కాసి కొత్త కాపు కోసి
కొంగు చాటునున్న పొంగులన్ని చూస్తే
దాని తళుకు బెళుకు తొణికినపుడే
సై సై సయ్యారే  సై సై సయ్యారే
సయ్యారే సయ్యరె సయ్యరె  సయ్యరె సయ్యరె

సై సై సయ్యారే  సై సై సయ్యారే 
సై సై సయ్యారే  సై సై సయ్యారే 
సై సై సయ్యారే  సై సై సయ్యారే సై 




అదిరిందిరో... పాట సాహిత్యం

 
చిత్రం: ఘరానా బుల్లోడు (1995)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: మనో, చిత్ర

అదిరిందిరో...
దీనబ్బ ఈ గుమ్మ సోకు నాజూకు
ఎందబ్బా గుచ్చుకుంది పూల బాకు
దీనబ్బ ఈ గుమ్మ సోకు నాజూకు
ఎందబ్బా గుచ్చుకుంది పూల బాకు
బీటువేస్తే బీహారు లేటుచేస్తే బేజారు
జోరు చూస్తే జోహారు దేనికైనా తయ్యారు
కొమ్మచాటు మండేకొడితే కొంగు జారితే కొల్లేరు

అదిరిందిరో...
దీనబ్బ ఈ గుమ్మ సోకు నాజూకు
ఎందబ్బా గుచ్చుకుంది పూల బాకు
దీనబ్బ ఈ గుమ్మ సోకు నాజూకు
ఎందబ్బా గుచ్చుకుంది పూల బాకు

ఓ ఓ ఓ బుగ్గా ఎరుపు నచ్చింది
మొగ్గ తుంచేయాలనే ఉందే
ఓ ఓ ఓ సిగ్గే పొరుపుకొచ్చింది
అది ఏదో రాజుకుంటుంది
సలపరింతలను సమ్మంగా 
నలిపెయ్యనా దులిపెయ్యనా
కలవరింతలను కమ్మంగా
కలిపెయ్యరా చెరిపెయ్యరా
రెక్కలున్న గుఱ్ఱం మీద రేసు
రెచ్చిపోయి వచ్చాడమ్మా బాసు
ఓ ఓ ఓ ఓ ఓ ఓ రెళ్ళు పూల తెప్పల్లోనా 
రేపో మాపో ఇచ్చేయ్ నా డోసు

అదిరిందిరో...
దీనబ్బ ఈ గుమ్మ సోకు నాజూకు
ఎందబ్బా గుచ్చుకుంది పూల బాకు
దీనబ్బ ఈ గుమ్మ సోకు నాజూకు
ఎందబ్బా గుచ్చుకుంది పూల బాకు

ఓ ఓ ఓ రిమ్మా తెగులు పుట్టిందే 
చమ్మా చక్కే ఆడమంటుందే
ఓ ఓ ఓ గుమ్మా గుబులు పట్టిందే
నిమ్మ చక్కా పిండుకోమందే
చిలిపి చాకిరికి చీరంతా 
అలిగిందిరో నలిగిందిరో
మధన చాకిరికి మనసంతా
అరిగిందిరో కరిగిందిరో 
మంచు పూల మంచం మీద చుమ్మా
పంచుకుంటే పంచదారేనమ్మా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ 
అంచు దాటి అందాలన్నీ 
అల్లి బిల్లి ఆటాడేనమ్మ

అదిరిందిరో...
దీనబ్బ ఈ గుమ్మ సోకు నాజూకు
ఎందబ్బా గుచ్చుకుంది పూల బాకు
దీనబ్బ ఈ గుమ్మ సోకు నాజూకు
ఎందబ్బా గుచ్చుకుంది పూల బాకు



చుక్కల్లో తళుకులా పాట సాహిత్యం

 
చిత్రం: ఘరానా బుల్లోడు (1995)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: మనో, చిత్ర

చుక్కల్లో తళుకులా ఓ ఓహొ
దిక్కుల చలి వెలుగులా ఓ ఓహొ
పొద్దుల్లో ఎరుపులా ఓ ఓహొ
మబ్బుల తొలి మెరుపులా ఓ ఓహొ
నింగి నుంచి తొంగి చూసి 
నచ్చగానే నిచ్చనేసి జర్రుమంటు జారింది
జాకిట్లో జాబిల్లి ఓ ఓహొ ఓ ఓహొ
జాజుల్లో నా మల్లి ఓ ఓహొ ఓ ఓహొ
జాకిట్లో జాబిల్లి...

చుక్కల్లో తళుకులా ఓ ఓహొ
దిక్కుల చలి వెలుగులా ఓ ఓహొ

మల్లె పూల చెల్లెలా నవ్వు పూల జల్లులా
మిల మిల సోకులే మీటనివ్వు నన్ను లేతగా
కొంగు చాటు ముంతలా పొంగు పాల పుంతలా
గిల గిలా గిల్లక రేపే రేపే రెండు చేతులా
నిబ్బరాల నిమ్మపండు ఒలిచి పెట్టవా
ఓ ఓహొ ఒహొహో హో
కొబ్బరంటి కొత్త ఈడు ఒలిచి పెట్టవా
ఓ ఓహొ ఒహొహో హో
ఏకాదశి నా ఊర్వశి శ్రీ రమ్య శృంగార రాశి 
త్రయోదశి జాబిల్లికి ఈనాడే పున్నమి 
చిగ్గమ్మ చి చి ఛి

చుక్కల్లో తళుకులా ఓ ఓహొ
దిక్కుల చలి వెలుగులా ఓ ఓహొ
పొద్దుల్లో ఎరుపులా ఓ ఓహొ
మబ్బుల తొలి మెరుపులా ఓ ఓహొ

నింగి నేల ఒడ్డున చందమామ బొడ్డున
తళ తళ తారలే తాకిపోయే నన్ను మెత్తగా
రాజహంస రెక్కలా రాసలీల పక్కలా 
గుస గుస గువ్వలా గూడు కట్టుకోవె మత్తుగా
పిక్కటిల్లి పోతే ఈడు పైట నిలుచునా 
ఓ ఓహొ ఒహొహో హో
పిక్కలావు పిల్లదాని నడుము పలచన
ఓ ఓహొ ఒహొహో హో
మహాశయా నా మన్మధ మందార సందిళ్లు రారా
సఖి ప్రియా సాగే లయ నా ప్రేమ తొందరా
చీకట్లో చిందేసి

చుక్కల్లో తళుకులా ఓ ఓహొ
దిక్కుల చలి వెలుగులా ఓ ఓహొ
పొద్దుల్లో ఎరుపులా ఓ ఓహొ
మబ్బుల తొలి మెరుపులా ఓ ఓహొ
నింగి నుంచి తొంగి చూసి 
నచ్చగానే నిచ్చనేసి జర్రుమంటు జారింది
జాకిట్లో జాబిల్లి ఓ ఓహొ ఓ ఓహొ
జాజుల్లో నా మల్లి ఓ ఓహొ ఓ ఓహొ
జాకిట్లో జాబిల్లి...

Palli Balakrishna Sunday, August 13, 2017
Chinna Alludu (1993)




చిత్రం: చిన్న అల్లుడు (1994)
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
నటీనటులు: సుమన్, రంభ, ఆమని, శ్రీకాంత్, దాసరి నారాయణరావు
దర్శకత్వం: శరత్ బాబు
నిర్మాత: చలసాని గోపి
విడుదల తేది: 18.11.1994



Songs List:



కులుకులు కులుకులు పాట సాహిత్యం

 
చిత్రం: చిన్న అల్లుడు (1994)
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

కులుకులు  కులుకులు 





కుర్రాడు బాబోయ్ కుంపటెట్టినాడు పాట సాహిత్యం

 
చిత్రం: చిన్న అల్లుడు (1994)
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
కుర్రాడు బాబోయ్ కుంపటెట్టినాడు
పిల్లాడు బాబోయ్ గిల్లి పెట్టినాడు
కుర్రాడు బాబోయ్ కుంపటెట్టినాడు
పిల్లాడు బాబోయ్ గిల్లి పెట్టినాడు
పరికిణి పావడ పరువపు ఆవడ...రుచిమరిగిన మగడా
విరహపు వీరుడ రసికుల సోముడ...విడువకు విరుల జడా

అమ్మాయి బాబోయ్ అందమైన పిట్ట
బుజ్జాయి బాబోయ్ బుజ్జగించుకుంట
అమ్మాయి బాబోయ్ అందమైన పిట్ట
బుజ్జాయి బాబోయ్ బుజ్జగించుకుంట

అలిగిన పోకడ వలపుల రాకడ..తెలిసెను చలి గురుడా
నున్నని నీమెడ వెన్నెల మీగడ..చెలిమికి చెరుకుగడా

కుర్రాడు బాబోయ్ కుంపటెట్టినాడు
పిల్లాడు బాబోయ్ గిల్లి పెట్టినాడు

అమ్మాయి బాబోయ్ అందమైన పిట్ట
బుజ్జాయి బాబోయ్ బుజ్జగించుకుంట

చరణం: 1
ముద్దు లియ్యవే...సిగ్గు నడికిస్తా
సిగ్గు లెందుకే...చీర నడిగోస్తా
చీర లెందుకే...చీపు రెట్టుకోస్తా
చీపు రెందుకే....దుమ్ము దులిపేస్తా
పోద్దుగూకితే....తేనిటీగ చురక
తెల్లవారితే...బుగ్గ మీద మరక
మంచెనీడలో ...మల్లెపూల పడక

కుర్రాడు బాబోయ్ కుంపటెట్టినాడు
పిల్లాడు బాబోయ్ గిల్లి పెట్టినాడు

అమ్మాయి బాబోయ్ అందమైన పిట్ట
బుజ్జాయి బాబోయ్ బుజ్జగించుకుంట

చరణం: 2
ఆత్రమెందుకు...అందముందిగనుకా
అందమెందుకు...చూపు ఉందిగనుకా
చూపు ఎందుకు...చాటుకొస్తె చెపుతా
చాటుకెందుకు...వచ్చి చూడు చెపుతా
ఏమి చూడను...చూడలేని చుక్కా
ఏమి చేయను...ఏసుకోవే పక్కా
ఆడ ఊపిరి అంటుంకుంటే లక్క..

అమ్మాయి బాబోయ్ అందమైన పిట్ట
బుజ్జాయి బాబోయ్ బుజ్జగించుకుంట

కుర్రాడు బాబోయ్ కుంపటెట్టినాడు
పిల్లాడు బాబోయ్ గిల్లి పెట్టినాడు

చరణం: 3
వయసు చెప్పవే...బోమ్మిడాయి పులుసు
మనసు విప్పవే...విప్పుకుంటే అలుసు
సోగసు దాచకు...దాచకుంటే కరుసు
చెక్కిళ్ళు ఇయ్యవే...తొక్కలేను అడుసు
వేడిపొంగులో...ఈడు పచ్చిపులుసు
తీపి అలకలొ...తాపమెంతో తెలుసు
బండిసాగితే పండుతుంది ఇరుసు

కుర్రాడు బాబోయ్ కుంపటెట్టినాడు
పిల్లాడు బాబోయ్ గిల్లి పెట్టినాడు
పరికిణి పావడ పరువపు ఆవడ...రుచిమరిగిన మగడా
విరహపు వీరుడ రసికుల సోముడ...విడువకు విరుల జడా....



మనసే ఓ మౌనగీతం పాట సాహిత్యం

 
చిత్రం: చిన్న అల్లుడు (1994)
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

మనసే ఓ మౌనగీతం 




ఓలమ్మి వద్దనంగా పాట సాహిత్యం

 
చిత్రం: చిన్న అల్లుడు (1994)
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఓలమ్మి వద్దనంగా 




అందమే ఆనందం పాట సాహిత్యం

 
చిత్రం: చిన్న అల్లుడు (1994)
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యమ్. యమ్.కీరవాణి

అందమే ఆనందం 



సిల్కో సింగారికన్నే పాట సాహిత్యం

 
చిత్రం: చిన్న అల్లుడు (1994)
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యమ్. యమ్.కీరవాణి

సిల్కో సింగారికన్నే

Palli Balakrishna Thursday, August 3, 2017

Most Recent

Default