Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Indraja"
Oka Chinna Maata (1997)



చిత్రం: ఒక చిన్న మాట (1997)
సంగీతం: రమణి భరద్వాజ్
నటీనటులు: జగపతి బాబు, ఇంద్రజ, రక్ష
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
నిర్మాత: బూరుగుపల్లి శివరామకృష్ణ
విడుదల తేది: 27.05.1997



Songs List:



ఓ మనసా తొందర పడకే పాట సాహిత్యం

 
చిత్రం: ఒక చిన్న మాట (1997)
సంగీతం: రమణి భరద్వాజ్
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఓ మనసా తొందర పడకే
పదిమందిలో అల్లరి తగదే
కను చూపులు కలిసే వేళ
నా మాటలు కొంచం వినవే
వరమిచ్చిన దేవుని చూసే
సుముహూర్తం వస్తున్న వేళ
నీకెందుకే ఈ తొందర

ఓ మనసా తొందర పడకే
పదిమందిలో అల్లరి తగదే
కను చూపులు కలిసే వేళ
నా మాటలు కొంచం వినవే
చిరునవ్వుల దేవిని చూసే
సుముహూర్తం వస్తున్న వేళ
నీకెందుకే ఈ తొందర

కోరుస్:
చెప్పవమ్మ చెప్పవమ్మ ఒక చిన్న మాట
చిన్నవాడి మనసు నీతో అన్న మాట

కోరుస్:
చెప్పు చెప్పు ఒక చిన్న మాట
చిన్నదాని మనసు నీతో అన్న మాట

తాజా గులాబి కన్నా
మురిపించు మల్లెల కన్నా
మెరిసే తార కన్నా
తన తలపే నాకు మిన్న

వేదాల ఘోష కన్నా
చిరుగాలి పాట కన్నా
ప్రియమార నన్ను తలిచే
తన మనసే నాకు మిన్న

మోహం, తొలి మోహం
కనుగీటుతున్న వేళ

రాగం, అనురాగం
ఎదపొంగుతున్న వేళ
చెప్పాలి ఒక చిన్న మాట

కోరుస్:
చెప్పవమ్మ చెప్పవమ్మ ఒక చిన్న మాట
చిన్నవాడి మనసు నీతో అన్న మాట

కోరుస్:
చెప్పు చెప్పు ఒక చిన్న మాట
చిన్నదాని మనసు నీతో అన్న మాట

నాలోని ఆశ తానై
తనలోని శ్వాస నేనై
రవలించు రాగమేదో
పలికింది ఈ క్షణాన

నా కంటి పాప తానై
తన గుండె చూపు నేనై
పాడేటి ఊసులన్ని
మెదిలాయి ఈ క్షణాన

గాలి, చిరుగాలి
కబురైనా చేర్చలేవా

చెలిని, నెచ్చెలని
ఒకమారు చూపలేవా
విరహాన వేచే క్షణాన

కోరుస్:
చెప్పవయ్య చెప్పవయ్య ఒక చిన్న మాట
చిన్నదాని మనసు నీతో అన్న మాట

కోరుస్:
చెప్పు చెప్పు ఒక చిన్న మాట
చిన్నవాడి మనసు నీతో అన్న మాట



కుర్రకారు పూజించే దైవమేది పాట సాహిత్యం

 
చిత్రం: ఒక చిన్న మాట (1997)
సంగీతం: రమణి భరద్వాజ్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

కుర్రకారు పూజించే దైవమేది 



ముమ్ము ముమ్ము ముద్దిస్తా మెత్తగా పాట సాహిత్యం

 
చిత్రం: ఒక చిన్న మాట (1997)
సంగీతం: రమణి భరద్వాజ్
సాహిత్యం: భువనచంద్ర
గానం: మనో, శ్రీలేఖ 

ముమ్ము ముమ్ము ముద్దిస్తా మెత్తగా




మధురము కాదా తిరుమల నాధ పాట సాహిత్యం

 
చిత్రం: ఒక చిన్న మాట (1997)
సంగీతం: రమణి భరద్వాజ్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర

మధురము కాదా తిరుమల నాధ



ప్రతి ఒకరికి తొలి వలపున పాట సాహిత్యం

 
చిత్రం: ఒక చిన్న మాట (1997)
సంగీతం: రమణి భరద్వాజ్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

ప్రతి ఒకరికి తొలి వలపున



ఎవరిని చూస్తూ ఉన్నా పాట సాహిత్యం

 
చిత్రం: ఒక చిన్న మాట (1997)
సంగీతం: రమణి భరద్వాజ్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఎవరిని చూస్తూ ఉన్నా

Palli Balakrishna Tuesday, December 5, 2023
Shubhamasthu (1995)



చిత్రం: శుభమస్తు (1995)
సంగీతం: కోటి 
నటీనటులు: జగపతి బాబు, ఆమని, ఇంద్రజ, కృష్ణ
దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు
నిర్మాత: ఎం.వి.లక్ష్మి, ఎడిటర్ మోహన్
విడుదల తేది: 20.10.1995



Songs List:



గో గో గోపాల పాట సాహిత్యం

 
చిత్రం: శుభమస్తు (1995)
సంగీతం: కోటి 
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, స్వర్ణలత జూనియర్ 

(ఇంద్రజ, కృష్ణ లపై చిత్రీకరించారు)

గో గో గోపాల



ఈ భందనాల నందనాన్ని పాట సాహిత్యం

 
చిత్రం: శుభమస్తు (1995)
సంగీతం: కోటి 
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు

ఈ భందనాల నందనాన్ని 



ఘల్ ఘల్ అను పాట సాహిత్యం

 
చిత్రం: శుభమస్తు (1995)
సంగీతం: కోటి 
సాహిత్యం: సామవేదం షణ్ముఖశర్మ 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

ఘల్ ఘల్ అను




ఓసి మిస్సో ఓని మిస్సో పాట సాహిత్యం

 
చిత్రం: శుభమస్తు (1995)
సంగీతం: కోటి 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

ఓసి మిస్సో ఓని మిస్సో 



ఓ మామ పాట సాహిత్యం

 
చిత్రం: శుభమస్తు (1995)
సంగీతం: కోటి 
సాహిత్యం: డి.నారాయణ వర్మ
గానం: రాధిక, మురళి

ఓ మామ
పొయ్యి మీద పులుసెట్టి పొయ్యి కింద పిడకెట్టి 

Palli Balakrishna Thursday, November 23, 2023
Yamaleela (1994)

చిత్రం: యమలీల (1994)
సంగీతం: ఎస్.వీ.కృష్ణారెడ్డి
నటీనటులు: ఆలీ, ఇంద్రజ, కైకాల సత్యనారాయణ
దర్శకత్వం: ఎస్.వీ. కృష్ణారెడ్డి
నిర్మాత: అచ్చిరెడ్డి
విడుదల తేది: 28.04.1994







చిత్రం: యమలీల (1994)
సంగీతం: ఎస్.వీ.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గాత్రం: చిత్ర , యస్. పి. బాలు

సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు
చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు
బుడిబుడి నడకల తప్పటడుగులే 
తరగని మాన్యాలు
చిటిపొటి పలుకుల ముద్దుమాటలే 
మా ధనధాన్యాలు

ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసికూన
ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా
మహరాజులా జీవించాలి నిండు నూరేళ్లు

సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు
చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు

జాబిల్లి జాబిల్లి జాబిల్లి 
మంచి జాబిల్లి జాబిల్లి జాబిల్లీ

చరణం: 1
నాలో మురిపెమంతా పాలబువ్వై పంచనీ
లోలో ఆశలన్ని నిజమయేలా పెంచనీ
మదిలో మచ్చలేని చందమామే నువ్వనీ
ఊరు వాడ నిన్నే మెచ్చుకుంటే చూడనీ
కలకాలము కనుపాపల్లే కాసుకోనీ
నీ నీడలో పసిపాపల్లే చేరుకోనీ

సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు
చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు
బుడిబుడి నడకల తప్పటడుగులే
తరగని మాన్యాలు
చిటిపొటి పలుకుల ముద్దుమాటలే
మా ధనధాన్యాలు

లాల లలలా లలలా లాలా
లాల లలలా లలలా 
లాలల లాలల లాలల లాలల 
లాలల లాలల లాలల లాలల 

చరణం: 2
వేశా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా
నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా
నాలో అణువు అణువు ఆలయంగా మారగా
నిత్యం కొలుచుకోనా అమ్మ ఋణమే తీరగా
తోడుండగా నను దీవించే కన్న ప్రేమ
కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా

సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు
చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు
బుడిబుడి నడకల తప్పటడుగులే
తరగని మాన్యాలు
చిటిపొటి పలుకుల ముద్దుమాటలే
మా ధనధాన్యాలు
ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసికూన
ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా
మహరాజులా జీవించాలి నిండు నూరేళ్లు

సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు
చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు







చిత్రం: యమలీల (1994)
సంగీతం: ఎస్.వీ.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గాత్రం: చిత్ర , యస్. పి. బాలు

ఆ... నీ జీను పేంటు చూసి బుల్లెమ్మోయ్
ఆ... నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్
ఆ... నీ జీను పేంటు చూసి బుల్లెమ్మోయ్
నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్
మనసు లాగేత్తంది లాగేత్తంది లాగేత్తంది హో
వయసు ఊగేత్తంది ఊగేత్తంది ఊగేత్తంది హా

ఆ... నీ బేగి పేంటు చూసి బుల్లోడోయ్
ఆ... నీ కురచా కోటు చూసి పిల్లోడోయ్
ఆ... నీ బేగి పేంటు చూసి బుల్లోడోయ్
నీ కురచా కోటు చూసి పిల్లోడోయ్
వలపు ఒలికేత్తంది ఒలికేత్తంది ఒలికేత్తంది రో
వయసు ఒనికేత్తంది ఒనికేత్తంది ఒనికేత్తంది రో

హే ఎయ్రో సూత్తవేరో, హే ఎయ్రో సూత్తవేరో

దిం దిం దిం ధింతనక జుం
దిం దిం దిం ధింతనక జుం
దిం దిం దిం దిం దిం దిం ధింతనక ఉఁ హా
దిం దిం దిం దిం దిం దిం ధింతనక ఉఁ హా

ఆ... అప్పరాల చెరువులోన అమ్మడు ఉఁ హా
కప్పపిల్ల బుస కొడితే అమ్మడు ఉఁ హా
ఒళ్ళు జివ్వు జివ్వుమంటు అమ్మడు ఉఁ హా
లవ్ పుట్టుకొస్తదంటా అమ్మడు ఉఁ హా
తిమ్మరాజు రేవుకాడ పిల్లగో ఉఁ హా
తొండ పిల్ల తొడగొడితే పిల్లగో ఉఁ హా
తాటి మట్ట తగులుకోని పిల్లగో ఉఁ హా
తాటలేసి పోతదంట పిల్లగో ఉఁ హా
కోపమేల బాల కొంగు చేరే వేళ
కుర్రవాడి స్పీడు చూసుకో

హే ఎయ్రో సూత్తవేరో, హే ఎయ్రో సూత్తవేరో

ఆ ఆ ఆ నీ జీను పేంటు చూసి బుల్లెమ్మోయ్
ఆఁ హ హ నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్
నీ బేగి పేంటు చూసి బుల్లోడోయ్
నీ కురచా కోటు చూసి పిల్లోడోయ్

హే ఎయ్రో సూత్తవేరో, హే ఎయ్రో సూత్తవేరో

ఆ... గోలిగూడా సెంటర్లో పిల్లగో ఉఁ హా
గొడవ గొడవ చేసేస్తే పిల్లగో ఉఁ హా
చిక్కడపల్లి సెంటర్లో పిల్లగో ఉఁ హా
చింతకాయ తినిపిస్తా పిల్లగో ఉఁ హా
ఒట్టి ఊక దంపుడేలా అమ్మడు ఉఁ హా
కొత్త పాట నేర్చుకోవే అమ్మడు ఉఁ హా
మడతపేచి మానుకుంటే అమ్మడు ఉఁ హా
తాళిబొట్టు కట్టిపెడతా అమ్మడు ఉఁ హా
తాళిబొట్టు మోజు పెళ్ళికొడకు
పోజు పక్కనెట్టి స్టెప్ లెయ్యారో

హే ఎయ్రో సూత్తవేరో, హే ఎయ్రో సూత్తవేరో

ఆ... నీ జీను పేంటు చూసి బుల్లెమ్మోయ్
ఆ... నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్
ఆ... నీ జీను పేంటు చూసి బుల్లెమ్మోయ్
నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్
మనసు లాగేత్తంది లాగేత్తంది లాగేత్తంది హో
వయసు ఊగేత్తంది ఊగేత్తంది ఊగేత్తంది హా

ఆ... నీ బేగి పేంటు చూసి బుల్లోడోయ్
ఆ... నీ కురచా కోటు చూసి పిల్లోడోయ్
ఆ... నీ బేగి పేంటు చూసి బుల్లోడోయ్
నీ కురచా కోటు చూసి పిల్లోడోయ్
వలపు ఒలికేత్తంది ఒలికేత్తంది ఒలికేత్తంది రో
వయసు ఒనికేత్తంది ఒనికేత్తంది ఒనికేత్తంది రో

హే ఎయ్రో సూత్తవేరో, హే ఎయ్రో సూత్తవేరో (2)







చిత్రం: యమలీల (1994)
సంగీతం: ఎస్.వీ.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గాత్రం: చిత్ర , యస్. పి. బాలు

ధర్మపరిరక్షణ ధురంధరుండా
సకలపాప శిక్షణ దక్షుండా
చండతర దండథర బహుమండిత విగ్రహుండా
నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలనా
నియముండా హ యముండా

అభివందనం యమ రాజాగ్రణీ
సుస్వాగతం సుర చూడామణీ
తమ సుగుణాలు పలుమారు కీర్తించనీ
ఆ..ఆ.. అ అ అ అ
ఏమీ శభాష్ సెహబాసులే నర నారీమణి
బహుబాగులే సుకుమారీమణి
నిను మెచ్చాను వచ్చాను రారమ్మనీ
ఆ..ఆ.. అ అ అ అ

సరసాలు చవిచూడ ఇటురా దొరా
నవమన్మథాకార నడుమందుకోరా
రాకాసి కింకరుల రారాజునే
నరకాన నీవంటి సరుకెపుడు కననే
పాపాలు తెగ మోసి తల మాసెనేమో
నా పాలబడి కాస్త సుఖమందుకోవోయ్
ఆ..ఆ.. అ అ అ అ
అవశ్యము అటులనే కానిమ్ము
నీ కౌగిలే నవ సింహాసనం
రసలోకమే ఇక మన కాపురం
యమ సరదాగా సాగాలి ఈ సంబరం
ఆ..ఆ.. అ అ అ అ

ఊర్వశికి నీవేమి కజినవుదువా
కాకున్న నీకింత సౌందర్యమేల
నరలోకమున ఊరికొక ఊర్వశి
స్వర్గాలే దిగివచ్చు మా కులుకు చూసి
ఊరించకే ఇక నా రాజహంస
యమ హాయి నీదేలే రసికావతంస
ఆ..ఆ.. అ అ అ అ

రసికాగ్రేసరుండా యముండా

మైకాలలో తమ మతిపోవగా
నా కేళిలో పడి మునకేయగా
గద వదిలేసి ఒడిలోకి రా దేవరా
ఆ..ఆ.. అ అ అ అ

మజ్జారే మదవతీ 
సెహబాసులే నర నారీమణి
బహుబాగులే సుకుమారీమణి
నిను మెచ్చాను వచ్చాను రారమ్మనీ
ఆ..ఆ.. అ అ అ అ

ధర్మపరిరక్షణ ధురంధరుండా
సకలపాప శిక్షణ దక్షుండా
చండతర దండథర బహుమండిత విగ్రహుండా
నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలనా
నియముండా హ యముండా







చిత్రం: యమలీల (1994)
సంగీతం: ఎస్.వీ.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గాత్రం: చిత్ర , యస్. పి. బాలు

డింకు టకుమ్, టకుమ్, టకుమ్, టకుమ్ (5)

ఓ... ఓ... ఓ...

ఎర్ర కలువ పువ్వా ఎద్దమా చలి మంట
ధింత నకిట తాత్త నకిట
ఎవరు చూడని చోట పొగరాని పొదరింటా 
ధింత నకిట తాత్త నకిట

ఎర్ర కలువ పువ్వా ఎద్దమా చలి మంట
ఎవరు చూడని చోట పొగరాని పొదరింటా

రా మరి చాటుకి సందామామ
కౌగిలి విందుకి సందామామ
సయ్యనె కాముడే సందామామ
ఆశలే తీరని సందామామ

సై రా సరదా గువ్వ పండించు నా పంట
పదరా మధన జాతర చేద్దాము పడకింటా
గాజుల మోతలో సందామామ
మోజులే మోగని సందామామ
తోడుగా సేరుకో సందామామ
ప్రేమనె తోడుకో సందామామ

రంప రపరి రంప రపరి రంప రపరి రా (2)

గిలి గిలి సల్లగాలి తగిలిందే ఓ హంస
సలి సలి సంబరాలు సాగిస్తే హైలెస్స
కేరింత కెరటలా... మునగాలా
కేరింత కెరటల ఊరంత మునగాల
ఉపందుకోవాల నీ పొందు కావాలా
నీ ఒడిలో తొంగుంట సందామామ
నీ కలలో నేనుంటా సందామామ
నా దొర నీవుర సందామామ
ఉహాల రాణివె సందామామ

సై రా సరదా గువ్వ పండించు నా పంట
పదరా మధన జాతర చేద్దాము పడకింటా

ఎన్నెలో ఎన్నెల ఎన్నెలో ఎన్నెల (2)

హా..కులుకులు కుమ్మరించి మురిపాలే తేవాలా
తళుకుల పూల తీగ సరసాల తేలాల
వయ్యారి అందాలు... ఒడిలోనా హోయ్
వయ్యారి అందాలు గాంధాలు తీయాల
మందారు బుగ్గల్లో మద్దెల్లు మోగాలా
ఏడేడు జనమాలు సందామామ
ఎలీకగ ఉంటనే సందామామ
తానుకే నేనిక సందామామ
నా ఎద నీదిక సందామామ 

ఎర్ర కాలువ పువ్వా ఎద్దమా చలి మంట
ధింత నకిట తాత్త నకిట
ఎవరు చూడని చోట పొగరాని పొదరింటా 
ధింత నకిట తాత్త నకిట

సై రా సరదా గువ్వ పండించు నా పంట
పదరా మధన జాతర చేద్దాము పడకింటా
గాజుల మోతలో సందామామ
మోజులే మోగని సందామామ
తోడుగా సేరుకో సందామామ
ప్రేమనె తోడుకో సందామామ


Palli Balakrishna Thursday, March 4, 2021
Dikkulu Choodaku Ramayya (2014)








చిత్రం: దిక్కులు చూడకు రామయ్య (2014)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: రమ్యా బెహ్రా
నటీనటులు: నాగ శౌర్య, సన మక్బూల్, అజయ్, ఇంద్రజ
దర్శకత్వం: త్రికోటి. పి
నిర్మాత: సాయి కొర్రపాటి
విడుదల తేది: 10.10.2014

తేలిపోతున్నా తేలి మబ్బుల తేలే దూది పింజలా
చిగురాకుల చిలకి కల రెల్లు పువ్వు రేకుల పిల్ల లూదిన సబ్బి బూరల ఉల్లిపాయపై పొరలా
పరువాలు దాచే వీలు లేక తాళలేక
పైకి వెళ్లే పైట లాగ

తేలిపోతున్నా నేనే తేలిపోతున్నా
తేలిపోతున్నా హాయ్ హాయ్
తేలిపోతున్నా

నన్ను నేనే చూడకుండా
నాకు నేనే అందకుండా ఆకాశంలో

తేలిపోతున్నా నేనే తేలిపోతున్నా
తేలిపోతున్నా హాయ్ హాయ్
తేలిపోతున్నా

రెక్కలు ఇచ్చిన నువ్వే
నా పక్కన లేకుంటే ఎలా
నీతో పాటే ఎందాకైనా ఎగురుతున్నానిలా
ముచ్చట తీర్చిన నువ్వే 
నా ముందర లేకుంటే ఎలా
ఎదిమ్మన్నా ఇట్టే ఇస్తా తీసుకో అలా

చాలా చేద్దాం చాలా చూద్దాం
చాలని పించేదాక రానిద్దాం
అంతా చేద్దాం అన్నీ చేద్దాం
ఆశలు తీరేదాకా ఆడేద్దాం
పైటంచు భారం మోసుకుంటూ
పైకి వెళ్లే చల్లగాలి పల్లకిలా

తేలిపోతున్నా నేనే తేలిపోతున్నా
తేలిపోతున్నా హాయ్ హాయ్
తేలిపోతున్నా

ముందు వెనక చూడకుండ
ఊహకైన అందకుండ
ఆరాటంలో ఓ ఓ

తేలిపోతున్నా నేనే తేలిపోతున్నా
తేలిపోతున్నా నీపై వాలి పోతున్నా
జారిపోతున్నా మొత్తం మారిపోతున్నా






Palli Balakrishna Wednesday, February 17, 2021
O Panai Pothundi Babu (1998)



చిత్రం: ఓ పనైపోతుంది బాబు..! (1998)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: సురేష్ , రవితేజ, మహేశ్వరి, ఇంద్రజ, రక్ష, కావ్య
దర్శకత్వం: శివనాగేశ్వరరావు
నిర్మాత: కె. ఆర్.కుమార్
విడుదల తేది: 1998

గమనిక: సురేష్ , రవితేజ, బ్రహ్మానందం ముగ్గురు కూడాను ఈ సినిమాలో ద్విపాత్రాభినయం

Palli Balakrishna Thursday, February 14, 2019
Vajram (1995)


చిత్రం: వజ్రం  (1995)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు , చిత్ర
నటీనటులు: నాగార్జున, రోజా, ఇంద్రజ
దర్శకత్వం: ఎస్.వి.కృష్ణారెడ్డి
నిర్మాత: సి.గౌతమ్ కుమార్ రెడ్డి
విడుదల తేది: 05.11.1995

కూత కూసె పిట్ట ...కుయిలె కుయిలె కుయిలె కుయిలె
పాత పాడిందంత...కుయిలె కుయిలె కుయిలె కుయిలె
కూత కూసె పిట్ట ...కుయిలె కుయిలె కుయిలె కుయిలె
పాత పాడిందంత...కుయిలె కుయిలె కుయిలె కుయిలె

ఉన్నట్టుండి యేమయ్యిందే....కుయిలె కుయిలె
సన్నయి రాగం విన్నట్టుందే...కుయిలె కుయిలె
పల్లకి తెచ్చె పెల్లీడొచ్చె...కుయిలె కుయిలె
పిల్లని మెచ్చె పిల్లాడొచ్చె....కుయిలె కుయిలె

కూత కూసె పిట్ట ...కుయిలె కుయిలె కుయిలె కుయిలె
పాత పాడిందంత...కుయిలె కుయిలె కుయిలె కుయిలె

మెల్లొ మూడు ముల్లనగానే మొదటేం చేస్తావే
మనువాదిన వాడిని కొంగున కట్టిపడేస్తాలే
మీసం ఉన్న మగాడ్ని యెట్ట దారికి తెస్తావే
మూడొచ్చి ముందుకు వస్తే మూడంకేస్తాలే
అమ్మడో నీ జిమ్మడో నిన్నేవ్వడూ పెళ్లాడడే
లయలేస్తాలే అహ ఏం style యే
లాగేస్తాన్లే...పడిపొతాన్లే

కూత కూసె పిట్ట ...కుయిలె కుయిలె కుయిలె కుయిలె
పాత పాడిందంత...కుయిలె కుయిలె కుయిలె కుయిలె
ఉన్నట్టుండి యేమయ్యిందే....కుయిలె కుయిలె
సన్నయి రాగం విన్నట్టుందే...కుయిలె కుయిలె
పల్లకి తెచ్చె పెల్లీడొచ్చె...కుయిలె కుయిలె
పిల్లని మెచ్చె పిల్లాడొచ్చె....కుయిలె కుయిలె

సాయంకాలం time అయితే నువ్ ఇంటికి చేరాలోయ్
అయ్యబాబొయ్ చిత్తం తల్లే ఇంకేం చెయ్యాలే
ఇక నుంచి ఈ wife అంటే నీ life అనుకొవాలోయ్
చస్తాన సర్లే కాని కర్మనుకుంటాలే
జుమ్మడొ ఈ జన్మలో ఆ బ్రహ్మ ముడినే నమ్మరో
నమ్మిస్తాలే....చూస్తుంటాలే
కలహం చాల్లే....కలిసుందంలే

కూత కూసె పిట్ట ...కుయిలె కుయిలె కుయిలె కుయిలె
పాత పాడిందంత...కుయిలె కుయిలె కుయిలె కుయిలె
ఉన్నట్టుండి యేమయ్యిందే....
సన్నయి రాగం విన్నట్టుందే...కుయిలె కుయిలె
పల్లకి తెచ్చె పెల్లీడొచ్చె...కుయిలె కుయిలె
పిల్లని మెచ్చె పిల్లాడొచ్చె....కుయిలె కుయిలె

కూత కూసె పిట్ట ...కుయిలె కుయిలె కుయిలె కుయిలె
పాత పాడిందంత...కుయిలె కుయిలె కుయిలె కుయిలె


*******   ********   *******


చిత్రం: వజ్రం  (1995)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు , రేణుక

మనసా ఎందుకె కన్నీరు
మనకోసం ఎవరున్నరు
కాలగనమని ఎవరన్నరు
కరిగితె ఎవరేం చేస్తారు

ఏ నవ్వు చినుకైనా చేరని ఈ ఎడారిలో
ఈ కాస్త తడినైనా ఆపవె గుండె లోతులో
తెగిన గాలి పటమై సాగుతున్న పయనం
తనది అన్న తీరం కోరుకుంటె నేరం

మనసా ఎందుకె కన్నిరు
మనకోసం ఎవరున్నరు
కాలగనమని ఎవరన్నరు
కరిగితె ఎవరేం చేస్తారు

చిన్న చిన్న ఆనందాలు
చిందులాడు చల్లని ఇల్లు
అందమైన అనుబంధాలు
సొంతమైతె అంతే చాలు
అంత కన్న గొప్ప వరాలు
అడగలేదు నువ్వేనాడు
చిటికిడంత ప్రేమను కోరి చెయ్యి చాచినావు
ఐనవాల్లు అంతా వుండి అందవైనావు
పంచలేనిదీ మమకారమెందుకు
పెంచలేక ఈ నిట్టూర్పులెందుకు

మనసా ఎందుకె కన్నిరు
మనకోసం ఎవరున్నరు
కాలగనమని ఎవరన్నరు
కరిగితె ఎవరేం చేస్తారు

రునం తీరిపోయే అంది
కన్న తండ్రి చేసిన లెక్క
శేషమంటు ఏముందింక
ఆయువుంది ఇంకా అందీ
మాయదారి దేవిడి లెక్క
మొండి బతుకు తప్పదు గనక
దీవెనియ్యవలసిన చెయ్యే శపిస్తాను అంటే
దారిచూపవలసిన దీపం దహిస్తాను అంటే
ఆలకించరే నీ గోడు ఎవ్వరు
ఆదరించడే ఏ రాతి దేవుడు

మనసా ఎందుకె కన్నిరు
మనకోసం ఎవరున్నరు
కాలగనమని ఎవరన్నరు
కరిగితె ఎవరేం చేస్తారు

ఏ నవ్వు చినుకైనా చేరని ఈ ఎడారిలో
ఈ కాస్త తడినైనా ఆపవె గుండె లోతులో
తెగిన గాలి పటమై సాగుతున్న పయనం
తనది అన్న తీరం కోరుకుంటె నేరం


Palli Balakrishna Sunday, December 3, 2017
Amma Donga (1995)



చిత్రం: అమ్మదొంగా! (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి (All)
గానం: మనో, చిత్ర, యస్. పి. శైలజ
నటీనటులు: కృష్ణ, సౌందర్య, ఆమని, ఇంద్రజ
దర్శకత్వం: సాగర్
నిర్మాతలు: Ch. సుధాకర్ రెడ్డి, భారతి దేవి మౌళి
విడుదల తేది: 12.01.1995



Songs List:



బోలో కృష్ణ ముకుంద పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మదొంగా!  (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
తక్క దిన్న తక్కా దిన్న  (2)
తకా  తక్కా దిన్న  (2)

బోలో కృష్ణ ముకుంద కిస్సే కిస్కింద 
వేణువిలా వాయించారా
ప్రియా రాధా గోవిందా ప్రేమారవింద 
వెన్నెలలా తేలించరా
ఒక బేబీ భామ పోరాటం
ఇది అల్లరి చిల్లరి తిమ్మిరి తిక్కల లవ్ బుల్లిరో
అది చుక్కల గాలికి మొక్కిన చక్కని జాబిల్లిరో

బోలో కృష్ణ ముకుంద కిస్సే కిస్కింద 
వేణువిలా వాయించారా
ప్రియా రాధా గోవిందా ప్రేమారవింద 
వెన్నెలలా తేలించరా

చరణం: 1
వెన్నెట్లో నేను వేడెక్కితే  
ముద్దు తేనెల్లో నన్ను ముంచెత్తరా
చిగ్గంటు లేక చలరేగితే 
ఉగ్గు పాలిచ్చి జోల పాడేయన
పొద్దు పోదోయ్ నాకు హద్దులేదోయ్ నీకు
ఆడదే అరిటాకు ముళ్ళు నే కానీకు
పడగెత్తిన పరువానికి అలవాటు
తొడగొట్టిన మహవీరుడి తొలిపాటు
ఇక చూడు మరి చూపు గురి 
పిల్లకిదే ఫిబ్రవరి చలి గిలి భళా భళిరో

బోలో కృష్ణ ముకుంద కిస్సే కిస్కింద 
వేణువిలా వాయించారా
ప్రియా రాధా గోవిందా ప్రేమారవింద 
వెన్నెలలా తేలించరా

కోరస్: 
కోయిలా కోయిలా 
కోయిలా కోయిలా కో  కో  కో  కోకోకో

చరణం: 2
నీ వేణు గానం విన్నప్పుడే 
నే రాధల్లె ఊగి పోయానులే
నీ ముగ ప్రేమ కన్నప్పుడే 
పారిజాతాబిషేకం చేశానులే
కన్నె వయసోయ్ నాది 
తేనే మనసోయ్ నీది
అందమే తాంబూలం పండని నాకోసం
విసుగెత్తిన విరహానికి విడిచేసి మారుమల్లెకు మరుజన్మకు వదిలేసి
ఇదే సత్యమని స్వప్నమని బంధమని పాశమని రచించని కధాకలిలో

బోలో కృష్ణ ముకుంద కిస్సే కిస్కింద 
వేణువిలా వాయించారా
ప్రియా రాధా గోవిందా ప్రేమారవింద 
వెన్నెలలా తేలించరా
ఒక బేబీ భామ పోరాటం
ఇది అల్లరి చిల్లరి తిమ్మిరి తిక్కల లవ్ బుల్లిరో
అది చుక్కల గాలికి మొక్కిన చక్కని జాబిల్లిరో




జం జుమ్మని నీ ముద్దు పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మదొంగా!  (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

జం జుమ్మని నీ ముద్దు నా తాయిలం
ఘుమ్ ఘుమ్మని నా బుగ్గ నీ వాయనం
జంటకే ఎదురేముందిలే కంటికే ఎదురే లేదులే
కవ్వింత రేగిందిలే రవ్వంత రాగమై

జం జుమ్మని నీ ముద్దు నా తాయిలం
ఘుమ్ ఘుమ్మని నీ బుగ్గ నా వాయనం

ఓ మెరుపులా మెరిశావు మిల మిల కిల కిల
నా నీల మేఘాలలో
ఆ ఉరుములా ఉరికావు ఫెళ ఫెళ తళ తళ
ఆకాశ దేశాలలో
వాటేస్తే వరించు ఒళ్ళోనే భరించు
కాదంటే క్షమించు కౌగిల్లే బిగించు
ఈనాటి స్త్రీ కావ్యాలలో వద్దంటే వలపే కదా...

జం జుమ్మని నీ ముద్దు నా తాయిలం
ఘుమ్ ఘుమ్మని నీ బుగ్గ నా వాయనం

నా సరసకి వచ్చుంటే సల సల విల విల 
సాయింత్ర మయ్యిందిలే
నీ సొగసునే చూస్తుంటే కలే ఇలై శకుంతలై 
పండింది భావాలలో
లవ్ చేస్తే లభించు నాకోసం తపించు
నా పేరే జపించు నాతోనే సుఖించు
శ్రీవారి శృంగారాలలో ఎన్నెల్లో ఎరుపాయేదా...

జం జుమ్మని నీ ముద్దు నా తాయిలం
ఘుమ్ ఘుమ్మని నీ బుగ్గ నా వాయనం
జంటకే ఎదురేముందిలే కంటికే ఎదురే లేదులే
కవ్వింత రేగిందిలే రవ్వంత రాగమై



తహ తహ తాకిడి తాకిన సోకుల పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మదొంగా!  (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: చిత్ర, యస్. పి. బాలు

తహ తహ తాకిడి తాకిన సోకుల
తహతహ తాకిడి తాకిన 
సోకుల తామర తంపరలో
తొలితొలి మీగడలంటిన 
ముద్దుల తేనెల తుంపరలో
జతకొద్దీ జంపాలా... హోయ్
చలికొద్దీ చంపాలా... హోయ్

మనిషి జుం  కల నిజం 
చితికి జుం జుం జుం జుం
తకిట జుం తపన జుం
బజబ జుం జుం జుం

తహ తహ తాకిడి తాకిన సోకుల
తహతహ తాకిడి తాకిన 
సోకుల తామర తంపరలో
తొలితొలి మీగడలంటిన 
ముద్దుల తేనెల తుంపరలో

చరణం: 1
చలివేస్తే సనక్కురో చెలితోనే అతుక్కుపో
కులాసాల మాలా.. ఖుషీ మత్తులో
బిడియాల బితుక్కులో 
తడియారే తలుక్కులో
భయాలేల భాలా భజానాలలో
జతపడమన్నాయి శకునాలు కలబడమన్నాయి నయనాలు
అదిరెను లేలేత అధరాలు
అదుముకుపోతుంటే మదురాలు
చలిమౌదం గోపాలా... హోయ్
పగటేలే దీపాలా.... హోయ్

తరిమెనే పరిమళం
పరవశం జుం జుం జుం
చెలియుగం తొలిసుఖం 
చెరి సగం జుం జుం జుం

తహతహ తాకిడి తాకిన 
సోకుల తామర తంపరలో
తొలితొలి మీగడలంటిన 
ముద్దుల తేనెల తుంపరలో

తకిట జుం తకిట జుం 
తకిట జుం జుం జుం జుం
తకిట జుం తకిట జుం తకిట

చరణం: 2
చినదాని చిరాకులో చిగురించే గులాబిలో
జమాయింపులన్నీ కులాసాలకే
ఉడుకెత్తే వయస్సులో ముడిపెట్టే మనస్సులో
నషాలానికంటే రసాలందుకో
సలలిక శృంగార సౌందర్య 
మధురస మందార మాధుర్య
ముసి ముసి మోహాల క్రిష్ణయ్య
మురళిని మోగించరాయయ్యా
కుసుమించే మొగ్గమ్మా .. ఓ ఓ ఓ హోయ్
కసిపెంచే కన్నయ్యా.... హోయ్

కలవడం నడుమునే 
కొలవడం జుం జుం జుం
అలగడం బలగతో 
మెలగడం జుం జుం జుం

తహతహ తాకిడి తాకిన 
సోకుల తామర తంపరలో
తొలితొలి మీగడలంటిన 
ముద్దుల తేనెల తుంపరలో
జతకొద్దీ జంపాలా... హోయ్
చలికొద్దీ చంపాలా... హోయ్

మనిషి జుం  కల నిజం 
చితికి జుం జుం జుం జుం
తకిట జుం తపన జుం
బజబ జుం జుం జుం




పిల్ల అదరహో... పిచ్చి ముదర హో... పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మదొంగా!  (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: మనో, స్వర్ణలత

పల్లవి:
పిల్ల అదరహో... పిచ్చి ముదర హో...
అరె పిల్ల అదరహో పిచ్చి ముదర హో
అబ్బ దీని సోకు మాడ ఉబ్బలూరు 
నిబ్బరాల డబ్బపండు కాపుకొచ్చి
మురిపాలే పొంగిస్తాది 
సగ పాలే అందిస్తాది

కన్నె కజరహో  కన్ను చదర హో
హా కన్నె కజరహో  కన్ను చదర హో
అమ్మ దొంగ చల్లకొచ్చి ముంతదోచి
బుజ్జగించి బుగ్గ పండు గాటు పెట్టి
మరుమల్లె చెండిస్తాడు 
మగడల్లే చెయ్యెస్తాడు

అరె పిల్ల అదరహో... 
హా కన్ను చదర హో...

చరణం: 1
ఆహా...
నచ్చిందే మెచ్చానే మెచ్చిందంతా గిచ్చానే
అచ్చాగ ఉన్నావే బచ్చా బంతి మొగ్గమ్మ
వచ్చిందే వయ్యారం వాటేస్తావ ఈ వారం
హా చేస్తావా సంసారం చేమంతుల్లో పై వారం
ఎగుడు దిగుడు సొగసు 
అది మొగుడు అడుగు వయసు
తళుకు బెళుకు తడిమే
తాలాంగుది తాళం ఇవాళ

కన్నె కజరహో... కన్ను చదర హో... 
అరెరరె అబ్బదీని సోకుమాడ
ఉబ్బలూరు నిబ్బరాల డబ్బపండు కాపుకొచ్చి
మరుమల్లె చెండిస్తాడు 
మగడల్లే చెయ్యేస్తాడు

చరణం: 2
హా హొ హా హా...
గుత్తంగా గుచ్చెక్కి గుంతల్ బంజాయిస్తాలే
మెత్తంగా మత్తెట్టి మెహదీపట్నం వస్తాలే
కళ్ళల్లో నీ రోషం 
అబ్బ కవ్వించింది ఈ మాసం
అరె తీస్తాలే నీకు సౌండ్ తీరుస్తావా ఉల్లాసం
గుబులు మనసు కబురు 
అది మొగలి పొదల గుబురు
నలక నడుము వనికె 
సుఖాలలో తుఫానివాలే...

పిల్ల అదరహో... పిచ్చి ముదర హో...
హా కన్నె కజరహో... కన్ను చదర హో...
అబ్బ దీని సోకు మాడ ఉబ్బలూరు 
నిబ్బరాల డబ్బపండు కాపుకొచ్చి
మరుమల్లె చెండిస్తాడు 
మగడల్లే చెయ్యేస్తాడు



ఏదో మనసు పడ్డాను గాని పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మదొంగా!  (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: మనో, చిత్ర, యస్.పి.శైలజ

పల్లవి:
ఏదో మనసు పడ్డాను గాని
కల్లో కలుసుకున్నాను గాని
నీపై ప్రేమో ఏమో నాలో

ఏదో మనసు పడ్డాను గాని
ఎంతో అలుసు అయ్యాను గాని
నాపై ప్రేమో ఏమో బోలో

రావా పడుచు మది తెకుసుకొనలేవా
తపన పడు తనువు ముడి మనువై మమతై మనదై పోయే అనురాగాల ఫలమై

ఏదో మనసు పడ్డాను గాని
కల్లో కలుసుకున్నాను గాని
నీపై ప్రేమో ఏమో నాలో

చరణం: 1
ఒక హృదయం పలికినది 
జతకోరే జతులు శృతులు కలిపి
ఒక పరువం పిలిచినది ప్రేమించి
ఒక అందం మెరిసినది 
ఎదలోన చిలిపి వలపు చిలికి
ఒక బంధం బిగిసినది వేధించి
తెలుసా ఏటి మనసా పూల వయసేమంటుందో
తెలిసి చంటిమనసే కంటి నలుసై పోతుందో
ఓ భామా రమ్మంటే ఈ ప్రేమ బాధే సరి
మెడవిరి గడుసరి సరి సరిలే

ఏదో మనసు పడ్డాను గాని
ఎంతో అలుసు అయ్యాను గాని
నాపై ప్రేమో ఏమో బోలో

చరణం: 2
ఒక మురిపం ముదిరినది 
మొగమాటం మరిచి ఎదుట నిలిచి
ఒక అధరం వనికినది ఆశించి 
ఒక మౌనం తెలిసినది 
నిదురించే కలలు కనుల నిలిపి
ఒక రూపం అలిగినది వాదించి
బహుశా భావసరసాలన్ని విరసాలౌను ఏమో
ఇక సాగించు జత సాదించు మనసే ఉన్నదేమో
ఓ పాపా నిందిస్తే ఆ పాపం నాదే మరి
విధి మరి విషమని మరి తెలిసే

ఏదో మనసు పడ్డాను గాని
కల్లో కలుసుకున్నాను గాని
నీపై ప్రేమో ఏమో నాలో

ఏదో మనసు పడ్డాను గాని
ఎంతో అలుసు అయ్యాను గాని
నాపై ప్రేమో ఏమో బోలో

రావా పడుచు మది తెకుసుకొనలేవా
తపన పడు తనువు ముడి మనువై మమతై మనదై పోయే అనురాగాల ఫలమే



నీతో సాయంత్రం ఎంతో సంతోషం పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మదొంగా!  (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర, యస్.పి.శైలజ

పల్లవి:
నీతో సాయంత్రం ఎంతో సంతోషం 
చేసేయ్ నీ సంతకం
కొంగే బంగారం పొంగే సింగారం 
చూసేయ్ నా వాలకం
ఓయమ్మో ఓపరాల గుమ్మో
ఒళ్ళంతా తిమ్మిరాయేనమ్మో
బావయ్యో బంతులాడవయ్యో
ఈ రాత్రే సంకురాతిరయ్యో
ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం

హో హో హో హో... హో హో హో... (2)

నీతో సాయంత్రం ఎంతో సంతోషం 
చేసేయ్ నీ సంతకం

చరణం: 1
నీ జంట కోరే సాయంత్రము
నా ఒంటి పేరే సౌందర్యము
ఆ వేళ కొస్తే ఓ ఆమని కౌగిల్లకిచ్చా నా ప్రేమని
ఆ రాధ గోలేమో రాగం తీసే 
ఈ రాస లీలేమో ప్రాణం తీసే
తగువే ఆనందం ఐనా పరువే గోవిందం
యమగుండం ఇతగాడే బతికుంటే జతగాడే
చలి చుక్కల గిలిగింతకు 
పులకింతకలు నిను పిలిచెలె

కొంగే బంగారం పొంగే సింగారం 
చూసేయ్ నా వాలకం
నీతో సాయంత్రం ఎంతో సంతోషం 
చేసేయ్ నీ సంతకం

చరణం: 2
మేనత్త కొడుకా ఇది మేనక
మరుజన్మ కోసం పరుగెత్తక
ఊహల్లో ఉంటే నీ ఊర్వశి
నీ కెందుకంట ఈ రాక్షసి
మీ కళ్ళలో మాయ మస్కా కొట్టి
నేనెల్లనా గాలి జట్కా ఎక్కి
అదిగో ఆకాశం తార సఖితో సావాసం
మన ఇద్దరి కసి ముద్దుల రసమద్దెల విందే
నిదరోయిన తొలి జన్మల సోదలిప్పుడు పొదలడిగెలే

నీతో సాయంత్రం ఎంతో సంతోషం 
చేసేయ్ నీ సంతకం
కొంగే బంగారం పొంగే సింగారం 
చూసేయ్ నా వాలకం
ఓయమ్మో ఓపరాల గుమ్మో
ఒళ్ళంతా తిమ్మిరాయేనమ్మో
బావయ్యో బంతులాడవయ్యో
ఈ రాత్రే సంకురాతిరయ్యో
ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం

హో హో హో హో... హో హో హో...
హా హా హా హా... హా హా హా...

Palli Balakrishna Friday, July 28, 2017
Peddannayya (1997)



చిత్రం: పెద్దన్నయ్య (1997)
సంగీతం: కోటి
నాటినటులు: బాలక్రిష్ణ, రోజా, ఇంద్రజ
దర్శకత్వం: శరత్
నిర్మాత: నందమూరి రామకృష్ణ
విడుదల తేది: 10.01.1997



Songs List:



ఓ ముస్తఫా నీ ముద్దబంతి పాట సాహిత్యం

 
చిత్రం: పెద్దన్నయ్య (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

ఓ ముస్తఫా నీ ముద్దబంతి బుగ్గ మీద ముద్దుపెట్టనా
దిల్ దిల్రుబా నీ కన్నె లేత మొగ్గలన్ని రాలగొట్టనా
ఓయమ్మో ఒళ్ళంతా వయ్యారాలు
వద్దన్నా కవ్వించే సింగారాలు
బోలెడంత అందమున్న వేలేడంత వెన్నెలాక్షి

ఓ ముస్తఫా నీ ముద్దబంతి బుగ్గ మీద ముద్దుపెట్టనా
దిల్ దిల్రుబా నీ కన్నె లేత మొగ్గలన్ని రాలగొట్టనా

కొత్త రాధ కోక చేదా నిన్ను చూడబోతే కంటికెంతో బాధ
ఓసి పిల్లా నత్తగూళ్ల నిన్ను వత్తబోతే ఉన్న బొడ్డు గుల్ల
సిగ్గే డైవర్స్ ఇచ్చే అమ్మడు
నీతో రొమాన్స్ ఆడేదెవ్వడు
తిక్కలాడి చక్కనోడ్ని ఆపేదెట్టా ముక్కుతాడు వేసేది ఎట్టా
వీడి ఒంగోలు వరసలు కొమ్ము విరిసితే దుమ్ము దులుపుడులే

ఓ ముస్తఫా నీ ముద్దబంతి బుగ్గ మీద ముద్దుపెట్టనా
దిల్ దిల్రుబా నీ కన్నె లేత మొగ్గలన్ని రాలగొట్టనా

ఓసి పాప పాల పీపా తోడుపెట్టుకోవే నాకు జోడి కట్టి
ఓసి గుంట తగ్గమంట నువ్వు కొట్టుకోకు డాబులమ్మ గంట
గుడ్బై టాటా చెప్పేటప్పుడు
ముద్దే నీకు ఇచ్చేదెవ్వరు
ఆకతాయి పిల్లగాడ్ని ఆపే దెట్టా వాడి జోరు దించే దెట్టా
వాడి వేసంగి పరువపు వేడి ముదిరితే వీపు పగులునులే

ఓ ముస్తఫా నీ ముద్దబంతు లాటలింక కట్టిపెట్టవా
కిస్ కిస్తఫా నీ కుర్రకారు కిర్రుదించి కిందపెట్టనా
ఓయమ్మో ఒళ్ళంతా వయ్యారాలు
హే వద్దన్నా కవ్వించే సింగరాలు
బోలెడంత అందమున్న వేలేడంత వెన్నెలాక్షి





నీ అందమంత చిందగొట్టి పాట సాహిత్యం

 
చిత్రం: పెద్దన్నయ్య (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

నిస సస నిస సస సమరిపమనిపమ నిస సస నిస సస సమరిపమ
నిస రిరి స
నీ అందమంత చిందగొట్టి గందమల్లే పూసుకుంట సందె ఎన్నెలలో
నిస సస నిస సస సమరిపమనిపమ నిస సస నిస సస సమరిపమ
నీ నవ్వులన్ని పువ్వులెట్టి నచ్చినట్టు వెచ్చగుంట చిమ్మ చీకటిలో
నిస సస నిస సస సమరిపమనిపమ 
నిస సస నిస సస సమరిపమ
అధరం మందారం మధురం తాంబూలం
అందం ఆనందం మాపటి మకరందం
పరువాల తొణికిస పాడే పదనిస జంట గుసగుసలో

నిస సస నిస సస సమరిపమనిపమ నిస సస నిస సస సమరిపమ
నిస సస నిస సస సమరిపమనిపమ నిస సస నిస సస సమరిపమ

నీ అందమంత చిందగొట్టి గందమల్లే పూసుకుంట సందె ఎన్నెలలో
నీ నవ్వులన్ని పువ్వులెట్టి నచ్చినట్టు వెచ్చగుంట చిమ్మ చీకటిలో

ప రిపరినిస
స నినిసనిప
పరిసరి పరిసరి పరి సరిప
పరి సనిప పరి సనిప
పరిరి రిరి రిరి సనిప
సస సస సస సని పని
రిసరిమ సరిపమ రిమపని మపనిస

అమ్మో పైటప్ప కొండ ఆపై కోకమ్మ కోన 
కన్నె చెట్టు తేనేపట్టు నాది తేనేటీగ కుట్టినంత తీపి
తోటమాలి చూపు ఎక్కడుందో తోరణాల కాపు అక్కడుంది
నడుమెక్కడో వెతకాలి నడిబొడ్డునే అడగాలి
తొడిమెక్కడో తెలియాలి తొలిసిగ్గునే దులపాలి
అదిరింది చెలీ... ఓ ఓ ఓ ఓ ఓ...

నిస సస నిస సస సమరిపమనిపమ నిస సస నిస సస సమరిపమ

నీ అందమంత చిందగొట్టి గందమల్లే పూసుకుంట
సందె ఎన్నెలలో
నీ నవ్వులన్ని పువ్వులెట్టి నచ్చినట్టు వెచ్చగుంట చిమ్మ చీకటిలో

ఆ... ఆ...ఆ...ఆ...

అమ్మో నీ ముద్దు మోత అసలే నా బుగ్గలేత
రాజుకుంది అగ్గిపూల వోణి రానిపోని చుంబనాల బోణి
నిన్ను చూడకుండ నీలవేణి నిద్దరైన పోనే కోడెగాడ్ని
గువ్వెప్పుడో కూసింది గుట్టప్పుడే తెలిసింది
పొయ్యెప్పుడో రగిలింది పొంగిప్పుడే తగిలింది
అదిరింది చలి... ఓ ఓ ఓ ఓ ఓ...

నిస సస నిస సస సమరిపమనిపమ నిస సస నిస సస సమరిపమ

నీ అందమంత చిందగొట్టి గందమల్లే పూసుకుంట సందె ఎన్నెలలో
నిస సస నిస సస సమరిపమనిపమ నిస సస నిస సస సమరిపమ
నీ నవ్వులన్ని పువ్వులెట్టి నచ్చినట్టు వెచ్చగుంట చిమ్మ చీకటిలో
నిస సస నిస సస సమరిపమనిపమ నిస సస నిస సస సమరిపమ
అధరం మందారం మధురం తాంబూలం
అందం ఆనందం మాపటి మకరందం
పరువాల తొణికిస పాడే పదనిస జంట గుసగుసలో
నిస సస నిస సస సమరిపమనిపమ నిస సస నిస సస సమరిపమ
నిస సస నిస సస సమరిపమనిపమ నిస సస నిస సస సమరిపమ



చక్కిలాల చుక్కా చక్కగుందిరో పాట సాహిత్యం

 
చిత్రం: పెద్దన్నయ్య (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

హొయ్యప్పా  హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా 

చక్కిలాల చుక్కా చక్కగుందిరో
పిక్కలావు చుస్తే తిక్కగుందిరో
చక్కిలాల చుక్కా చక్కగుందిరో
పిక్కలావు చుస్తే తిక్కగుందిరో
ఈడు జున్నుముక్క తోడుపూల పక్క
రెక్కనుంచి పిక్కదాకా దక్కదేమిరో
చక్కనోడు ఎంతో టక్కరోడురో
దిక్కులాగ నాకు దక్కినాడురో
ఆకు లేని వక్క అందగాడి తిక్క
మొక్కజొన్న చేను కాడ మొక్కులెందుకో

హొయ్యప్పా  హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా (2)

హొయ్యా హొయ్యా  హొయ్యా హొయ్యా 

పాలబుగ్గ మీగడా పంచదార జల్లెడా
నే పట్టబోతే జారిపోయి పక్కకొస్తే పారిపోయే
కొత్త ఈడు కోమలాంగి
అత్తలోరి అల్లుడా మల్లెపూల మల్లుడా
నీ జట్టు నాకు జాతరాయే గుట్టుకాడ అల్లరాయే
సూది కళ్ళ సుందరయ్యా
తునా బొడ్డు తూనీగ వేస్తానమ్మ నా పాగ
పూతరేకు పొత్తిళ్లలో
గొబ్బిళ్ళమ్మ నీ పాగ కుచ్చిళ్ళమ్మ జారాక గొబ్బిళ్ళన్ని దోసిళ్ళలో
భలిరా బస భలిరా దాని ఎటవాలు చూపు ఏందిరా

చక్కనోడు ఎంతో టక్కరోడురో
దిక్కులాగ నాకు దక్కినాడురో
ఈడు జున్నుముక్క తోడుపూల పక్క
రెక్కనుంచి పిక్కదాకా దక్కదేమిరో

హొయ్యప్పా  హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా 

అల్లరింటి పిల్లడు గిల్లమంటే గిల్లడు
నా కొత్తలన్ని పాతచేసి సిగ్గులన్ని పాతరేసి కోన సీమ కోడెగాడు
ఇవ్వమంది ఇవ్వదు అవ్వ బువ్వ పెట్టదు
నా ముద్దునాకు ఇవ్వదాయె ముద్దబంతు లాడదాయె పావు చీర పంకజాక్షి
వయ్యారాల ఉయ్యాల ఒళ్ళో వేస్తా ఇయ్యాల నింగి నేల నీ నీడగా
సంసారాల సందెల్లో సింగారాల చిందుల్లో నీకు నాకు గాలాడదు
బిగిసే కసి గిలిలో కౌగిలింత పట్టు బాగనాడరా

చక్కిలాల చుక్కా చక్కగుందిరో
పిక్కలావు చుస్తే తిక్కగుందిరో
ఆకు లేని వక్క అందగాడి తిక్క
మొక్కజొన్న చేను కాడ మొక్కులెందుకో

హొయ్యప్పా  హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా (2)




కుటుంభం అన్నగారి కుటుంభ పాట సాహిత్యం

 
చిత్రం: పెద్దన్నయ్య (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, చిత్ర

కుటుంభం అన్నగారి కుటుంభం (4)

విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు
విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు
మచ్చలేని మనుషులకు అచ్చమైన ప్రతిబింబం
అచ్చమైన ప్రతిబింబం

కుటుంభం అన్నగారి కుటుంభం (2)

చరణం: 1
తీపి తీపి దరహసాలు హా
చేదు చేదు పరిహాసాలు
పులుపు పులుపు భులపాటాలు
వగరు వగరు గుణపాఠాలు
ఈ ఉగాది రుచులై మాయని అభిరుచులై
ఈ ఉగాది రుచులై మాయని అభిరుచులై
నిలిచిన ఆనంద మందిరం
నిలిచిన ఆనంద మందిరం

కుటుంభం అన్నగారి కుటుంభం (2)

చరణం: 2
అమ్మంటే ఎవరో కాదు అనురాగ మణిదీపమే
అన్నంటే ఎవరో తెలుసా ఆ రాముని మరో రూపమే
తమ్ముల్లే తోడుగా నిత్యం కళ కళ లాడగా
తమ్ముల్లే తోడుగా నిత్యం కళ కళ లాడగా
ఈ ఇల్లే పూర్ణకుంభం 
ఈ ఇల్లే పూర్ణకుంభం 

కుటుంభం అన్నగారి కుటుంభం (2)

విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు
విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు
మచ్చలేని మనుషులకు అచ్చమైన ప్రతిబింబం
అచ్చమైన ప్రతిబింబం

కుటుంభం అన్నగారి కుటుంభం (2)




కల్లో కల్యాణమాల పాట సాహిత్యం

 
చిత్రం: పెద్దన్నయ్య (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

కల్లో కల్యాణమాల మెరిసిన శుభవేళ
కలలే నిజమైన వేళా మనువక రసలీల
పరిచయమైనవి పరువాలు
పరవశమైనవి హృదయాలు
కంటికే దీపమై గగణము విడిచెను తారక

కల్లో కల్యాణమాల మెరిసిన శుభవేళ

సిరికోయిలా చిలిపి వలపే పాడేనమ్మ
యదలోయల కనులే కలలై పండేనమ్మ
నిను చేరితే మనసే వయసై పిలిచేనమ్మ
నిదరోయినా సొగసే ఎదురై వలచేనమ్మ
మనసే మనువాడగా జతగా పెనవేయగా
ఊర్వసే ప్రేయసై వధువుగ వెలసెను కౌగిట

కల్లో కల్యాణమాల మెరిసిన శుభవేళ

సిరిమల్లిక సిగలో వగలే చిలికేనమ్మ
వరమల్లిక వలపై వగలే విసెరేనమ్మ
మధుమాసమే మనదై మధువే కురిసేనమ్మ
సుముహూర్తమే శుభమై సుఖమై కుదెరేనమ్మ
జరిగే మన పెళ్ళికి జగమే విరి పల్లకి
ఏకమై పోయిన మమతలు వెన్నెల కాయగ

కల్లో కల్యాణమాల మెరిసిన శుభవేళ
కలలే నిజమైన వేళా మనువక రసలీల
పరిచయమైనవి పరువాలు
పరవశమైనవి హృదయాలు
కంటికే దీపమై గగణము విడిచెను తారక

కల్లో కల్యాణమాల మెరిసిన శుభవేళ
కలలే నిజమైన వేళా మనువక రసలీల



చిక్కింది చామంతి పువ్వు పాట సాహిత్యం

 

చిత్రం: పెద్దన్నయ్య (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బాలు, చిత్ర

చిక్కింది చామంతి పువ్వు 
దాని బుగ్గల్లో దాక్కుంది నవ్వు
పుట్టింది గుండెల్లో జివ్వు
చూపు గాళాలు గుప్పించి రువ్వు
వచ్చింది పచ్చిసు వయసు
పిల్లకెట్టాగ తెలిపేది మనసూ
నీ ఆశ ఇందాకే తెలుసు
పైట పెట్టేసి చూసేయి సొగసు

చిక్కింది చామంతి పువ్వు 
దాని బుగ్గల్లో దాక్కుంది నవ్వు
పుట్టింది గుండెల్లో జివ్వు
చూపు గాళాలు గుప్పించి రువ్వు

అరె ఈ కొండ కోనల్లో 
పచ్చి నీరెండ ఛాయాల్లో
నీలి చెలయేటి తరగల్లో
ఒళ్లు తడిమేసుకుందామా
హే నన్ను ఇట్టగా ఊరిస్తే
ఒళ్ళు తడిమేసి కవ్విస్తే
నేను ఉయ్యాలనైపోనా
నీ ఒళ్లోన పడిపోనా
అరె పిల్ల ఒళ్లోన పడితే 
వయ్యారమంతా వత్తేసి పట్టేయనా
ఓసి నాజూకు తనమా
నడుమొంపులోన నాట్యాలు చేసేయనా
నువ్వు కొంగులు పట్టే కృష్ణుడు వైతే 
నీ రాధ నేనవ్వనా...

చిక్కింది చామంతి పువ్వు 
దాని బుగ్గల్లో దాక్కుంది నవ్వు
అరెరరె పుట్టింది గుండెల్లో జివ్వు
చూపు గాళాలు గుప్పించి రువ్వు
వచ్చింది పచ్చిసు వయసు
పిల్లకెట్టాగ తెలిపేది మనసూ
చిక్కింది చామంతి పువ్వు 
దాని బుగ్గల్లో దాక్కుంది నవ్వు
పుట్టింది గుండెల్లో జివ్వు
చూపు గాళాలు గుప్పించి రువ్వు

సోకు మందార పువ్విచ్చి
మోజు ముద్దుల్లో కరువచ్చే
కోటి కల్యాణ రాగాలే
నా ఎదలోన వినిపించే
కన్నే గోదారి పొంగొచ్చే
వెన్ను వనికేటి వయసొచ్చే
మల్లే తీగల్లే కౌగిట్లో
నువ్వు కులికేటి వేలొచ్చే
నువ్వు అవునంటే చాలు చూస్తాను వీలు అందాల బావయ్యో
నా పగడాల పెదవి పొగరంత కాస్తా చూసేయి ఓరయ్యో
నిన్ను చుట్టేసి కట్టేసి వెన్నెల్లోనా ఏలేలో పాడేయనా


చిక్కింది చామంతి పువ్వు 
దాని బుగ్గల్లో దాక్కుంది నవ్వు
అమ్మోయమ్మ పుట్టింది గుండెల్లో జివ్వు
చూపు గాళాలు గుప్పించి రువ్వు
వచ్చింది పచ్చిసు వయసు
పిల్లకెట్టాగ తెలిపేది మనసూ
నీ ఆశ ఇందాకే తెలుసు
పైట పెట్టేసి చూసేయి సొగసు


Palli Balakrishna Thursday, July 27, 2017
Chilakkottudu (1997)


చిత్రం: చిలక్కొట్టుడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర
నటీనటులు: జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, రమ్యకృష్ణ , మధుబాల, గౌతమి, కస్తూరి, ఇంద్రజ
దర్శకత్వం: ఇ. వి. వి. సత్యన్నారాయణ
నిర్మాత: యమ్.బాలాజీ నాగలింగం
విడుదల తేది: 1997

అదరహో అందమ ఖజురహో శిల్పమా
అదుముకో స్నేహమ ముదిరిపో మోహమా
అదరహో అందమ ఖజురహో శిల్పమా
అదుముకో స్నేహమ ముదిరిపో మోహమా
ఓ... ఓ ఓ ఓ ఓ ఓ...
మదిలో దాహాలు మధువే కోరేను
పెదవే అందించుమా

అదరహో అందమ ఖజురహో శిల్పమా
అదుముకో స్నేహమ ముదిరిపో మోహమా
అదరహో అందమ ఖజురహో శిల్పమా
అదుముకో స్నేహమ ముదిరిపో మోహమా
ఓ... ఓ ఓ ఓ ఓ ఓ...
మదిలో దాహాలు మధువే కోరేను
పెదవే అందించుమా

అదరహో అందమ ఖజురహో శిల్పమా
అదుముకో స్నేహమ ముదిరిపో మోహమా

చిటపట చినుకుగ చేరేదా
మిల మిల కుళుకులు మీటేదా
తడిసిన తళుకును తాకేదా
ఆపకే ఓ పై ఎద
తొలి తొలి తహా తహా చూపేదా
తెలియని తపనలు చెప్పేదా
నిలువున ముడిపడి పోయేదా
కమ్ముకుపో తుమ్మెద
మడి తాళం తీసేయ్ రాధా ఓ...
తడి తాళం వేసేయ్ రాదా ఓ...
హొయ్ తకతై సయ్యాట
అడిగే ఈ పూట ఒకటై పోదాం పద

అదరహో అందమ ఖజురహో శిల్పమా
అదుముకో స్నేహమ ముదిరిపో మోహమా

చిలిపిగ చిదిమెట నీ చూపు
కలగక కసిగల ఓ కైపు
ఎగబడి తడమకు కాసేపు
అబ్బా చాల్లేవయ్యా
బరువుగ పెరిగిన నీ రూపు
మగ జత ఎరగని ఆ షేపు
కరువుగ జరిగెను నా వైపు
ఆజా చెప్పేయమ్మో
అది మాటల్తో చెప్పాలా ఓ...
మరి మోమాటం చూపాలా ఓ...
ఎదుటే ఉన్నాను ఇదిగో అన్నాను
ఇంకేం కావాలయ్యో

అదరహో అందమ ఖజురహో శిల్పమా
అదుముకో స్నేహమ ముదిరిపో మోహమా
ఓ... ఓ ఓ ఓ ఓ ఓ...
ఓ మదిలో దాహాలు మధువే కోరేను
పెదవే అందించుమా




**********   **********   ***********



చిత్రం: చిలక్కొట్టుడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బాలు, చిత్ర

అందవే అందమా అంది అందాల
గంధాలు అందించు ఆనందమా
అంతలో ఆత్రమ ప్రేమ వల వేసి
ఒడి చేరి వలపించె ఉల్లాసమా
అందుకో పాట అందని పైట
ఆపవా ఆట అల్లరి వేట
అంచక్క ఇంచక్క ఎంచక్క
సయ్యాట సాగాలి రావే నా శ్వేత

అంతలో ఆత్రమ ప్రేమ వల వేసి
ఒడి చేరి వలపించె ఉల్లాసమా

కొంటె చూపు గుచ్చావంటే
ఇంటి మేకు సెంటై పోతా
కౌగిలించు కున్నావంటే
ఒంటి మీద షర్టైపోతా
షేపు చుస్తే వీపే కాదది ఐరోప
కిస్సు కొట్టకుంటే తప్పే ఓ పాపా
జట్టుకట్టి ఎట్టగొట్ట పట్టావయ్యో నా గుట్టు
పట్టినాక ప్రాణాలైన పెట్టేసేయ్నా తాకట్టు
మత్తుకమ్ముకున్నాదయ్యో
తస్సాదియ్య ఓ మైనరు

అందవే అందమా అంది అందాల
గంధాలు అందించు ఆనందమా

చెంత చేరి జల్సా రాయ
చెయ్యమాకు ఏదో మాయ
ఘాటు ప్రేమ పుట్టే వేళ
నాటు ముద్దె నందామయ్య
కొత్తగా ఉందోయబ్బా కోలాటం
కమ్మగా చూపించేయ్రో కైలాసం
ఏమి చాన్సు కొట్టారమ్మో
తస్సాదియ్య టైలర్స్
కళ్ళుతిరిగి పడ్డారేమో
తీసేవేళ కొలతల్స్
క్లోజు షాట్ తీశావంటే
క్లోజై పోనా ఓ దేవద

అందవే అందమా అంది అందాల
గంధాలు అందించు ఆనందమా
అంతలో ఆత్రమ ప్రేమ వల వేసి
ఒడి చేరి వలపించె ఉల్లాసమా
ఓ అందుకో పాట అందని పైట
ఆపవా ఆట అల్లరి వేట
అంచక్క ఇంచక్క ఎంచక్క
సయ్యాట సాగాలి రావే నా శ్వేత




*********   *********   *********



చిత్రం: చిలక్కొట్టుడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
గానం: యస్. పి. బాలు, చిత్ర

ఓ ఓ ఓ... ఓ ఓ ఓ...
ఆ... ఆ... ఆ... ఆ...ఆ... ఆ...

ముద్దుకోరి వచ్చిందమ్మ భామ
అదిరే ప్రేమతో తో తో తో తో తో
వయసే దాచేసుకుంది దాహం
మనసే దోచేసుకుంది మొహం
సొగసే పంచేసుకుంది తాపం
తెలిసే పెంచేసుకుంది మైకం
సరసాల వేళాయెరో...

ముద్దుకోరి వచ్చిందమ్మ భామ
అదిరే ప్రేమతో తో తో తో తో తో

ప్రియతమ ప్రియ మధురమ
పలుకుమ చెలి పరువమ
అలా అలా మనం చేరువై ఒకే జంటగా
ప్రణయమ సుధా సారమ
పిలుపుతో ఎదే తెలుపుమ
పెదాలపై పదం రాసుకో మహా ముద్దుగ
చలి వేసి గిలి గిలి గిలి గిలి  గింతల్లో వింతల్లో
నిలువెల్ల చుర చుర చురకల చూపుల్లో కైపుల్లో
నీ చెంగు వెంటా నే చేరుకుంటా
నా ముద్దు పంట పండించుకుంట ట...
మెళికే లాగింది కన్నె భామ
మొలకే వేసింది కొత్త ప్రేమ
కమ్మేసుకో మోహామా...

ముద్దుకోరి వచ్చిందమ్మ భామ
అదిరే ప్రేమతో తో తో తో తో తో

నరవరా మహా చొరవరా
ఎదలలో ఏదో గొడవరా
చాలకిగ భలే పెత్తనం చలాయించుకో
మిళ మిళా మిణుక్ మెరుపులా
తళ తళా తళుక్ తారలా
గులాబిలా చెలి సొంపులే
ఘుమాయింపులే
మది నిండా మధురిమ రిమ రిమ ప్రేమల్లో ఊహల్లో
కదిలిస్తే తకదిమి దిమి దిమి వేగంలో తాళంలో
రమ్మంటే రానా నీదాన్ని కానా
రప్పించుకుంటా రంగేళి జాణ రావే రావే...
కడితే కౌగిల్లు కట్టుకోరా
పడితే పంతాలు పట్టు చాల
నీ హద్దు దాటేసుకో...

ముద్దుకోరి వచ్చిందమ్మ భామ
అదిరే ప్రేమతో తో తో తో తో తో
వయసే దాచేసుకుంది దాహం
మనసే దోచేసుకుంది మొహం
సొగసే పంచేసుకుంది తాపం
తెలిసే పెంచేసుకుంది మైకం
సరసాల వేళాయెరో...



*********   *********   *********



చిత్రం: చిలక్కొట్టుడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

ఆ పచ్చి పచ్చి ప్రాయం గిచ్చి గిచ్చి గాయం
గుచ్చి గుచ్చి చూడకురా
పిచ్చ పిచ్చ అందం రెచ్చగొట్టె తాపం
చిచ్చుపెట్టి చంపకిలా
కుర్ర కుమారం కూకుంటె నేరం
కుర్ర కుమారం కూకుంటె నేరం
తొంగుంటె ఎట్టాగబ్బయ్యా యా యా

పిచ్చ పిచ్చ అందం రెచ్చగొట్టె తాపం
చిచ్చుపెట్టి చంపకిలా

ఒప్పుకోమ్మా - తప్పులేమ్మా
బుగ్గలిమ్మా - సిగ్గులేమ్మా
పదవే చాటుకు పడుచుదాన
పెదవే కానుకగా
కమ్మని ఒడి ఆ కాముని గుడి
గంటల సడి మా జంటకు పడి
మగువ సొగసు పొగడి

ఆ పచ్చి పచ్చి ప్రాయం గిచ్చి గిచ్చి గాయం
గుచ్చి గుచ్చి చూడకురా

తెల్లచీర - మాయనివ్వు
మల్లె చెండు - పెట్టనివ్వు
సలహా చెప్పకు సందెగాలికి సరసాలాడమని
విచ్చలవిడి నే ముచ్చట పడి
పెంచకు తడి దాటించకు దడి
మనవి మగని కబలి

ఆ...ఆ...ఆ...
ఆ పచ్చి పచ్చి ప్రాయం గిచ్చి గిచ్చి గాయం
గుచ్చి గుచ్చి చూడకురా
పిచ్చ పిచ్చ అందం రెచ్చగొట్టె తాపం
చిచ్చుపెట్టి చంపకిలా
కుర్ర కుమారం కూకుంటె నేరం
కుర్ర కుమారం కూకుంటె నేరం
తొంగుంటె ఎట్టాగబ్బయ్యా యా యా




*********   *********   *********



చిత్రం: చిలక్కొట్టుడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
గానం: యస్. పి. బాలు, చిత్ర

చామంతి పూబంతి వాసంతి రావే
సిరిబంతి నీ ఇంటి నావన్ని నీవే
ఏమున్నాదో నీ గురించి తపించు మనస్సులో
ఏమన్నాదో నిను వరించి తరించు వయస్సులో
ప్రేమించే ప్రాణమ భావమ
మోహించే ప్రణయ రాగ స్వరమ

చామంతి పూబంతి వాసంతి రావే
సిరిబంతి నీ ఇంటి నావన్ని నీవే

ఓ ఓ ఓ... - ఓ ఓ ఓ...
ఆ... - ఆ...

కొంచమైన తాళలేక పొంచివున్న ఆశలన్ని
కంచె దాటున కసి పెంచి రేగునా
మించిపోయి అంచుదాటె తెంచలేని హాయినంత
పంచిపెట్టన రుచి పెంచి ఇవ్వనా
ఆ పొద్దు ఈ పొద్దు ఆపద్దు నీ ముద్దు
దూరంగ పోవద్దు భామ
ఆలశ్యమేవద్దు ఏమాత్రమాగొద్దు
ఈ హద్దులే వద్దు కామ
రావే...సొగసరి మరి మరి విరిసిన తొలి విరి
నీకే నేను కుదిరి అదిరి

చామంతి పూబంతి వాసంతి రావే
సిరిబంతి నీ ఇంటి నావన్ని నీవే

ఆకుచాటు సోకులన్ని రేకువిప్పు వన్నెలన్ని
అందజేయనా జత పొందు చేరనా
ఓ ఓ ఓ ఓ
గోరువెచ్చనైనా తేనే దోరముద్దు లోనే పంచి
చెంత చేరనా మరి కొంత కోరనా
జడ్లోన పూలన్ని పక్కల్లో రాలేటి
రాత్రిళ్ళకై నేను వేచా
కల్లోన ఓ కామ కల్లోలమే రేగి
కల్లారగ నేడు చూశా
ఏదో తెలియని అలజడి కలిగిన అలికిడి
నాలో కలలు కదలి మెదలి

చామంతి పూబంతి వాసంతి రావే
సిరిబంతి నీ ఇంటి నావన్ని నీవే
ఏమున్నాదో నీ గురించి తపించు మనస్సులో
ఏమన్నాదో నిను వరించి తరించు వయస్సులో
ప్రేమించే ప్రాణమ భావమ
మోహించే ప్రణయ రాగ స్వరమ



*********   *********   *********



చిత్రం: చిలక్కొట్టుడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బాలు, చిత్ర

నచ్చాడే రౌడి పిల్లడు
వద్దన్నా ఒళ్ళో పడతడు
భలేవాడులే గుంటడు
ఆహా ఆహా ఆహా
చిలక్కొట్టుడే అంటడు
ఆహొ ఆహొ ఆహొ
రావే చుక్క రేగే తిక్క
లాగించేద్దాం చెమ్మా చెక్క
ప్రేమ యాత్రలో

నచ్చాడే రౌడి పిల్లడు
వద్దన్నా ఒళ్ళో పడతడు

వయసే వెర్రెత్తి పోయే అదో ఊహతో
నడుమే అల్లాడిపోయే అదే ఆశతో
ఆకులాంటి అందమిచ్చుకో
అందంగా హత్తుకున్న కొత్త మత్తులో
సోకు మల్లె రైక విప్పుకో చిత్రంగ
జివ్వుమన్న సిగ్గు మొగ్గులో
వసివాడని పసి అందమ
కసి జోల పాడనా

నచ్చాడే రౌడి పిల్లడు
వద్దన్నా ఒళ్ళో పడతడు
హ హహ హహ హహా

తడితే తపించిపోదా పసిడి పై ఎదా
పడితే కాటేసి పోదా పడుచు తుమ్మెద
పంటిగాటు ఓపనన్నాదోయ్ వయ్యారం
పచ్చి పాయసాల విందులో
రెచ్చిపోయి చూప మన్నదే ప్రతాపం
కెవ్వు మన్న గువ్వ గూటిలో
పడలేనురా విడలేనురా
ఒడి బాధ తీర్చరా

జగజగజ - నచ్చాడే రౌడి పిల్లడు
జగజగజ - వద్దన్నా ఒళ్ళో పడతడు
భలేవాడులే గుంటడు
ఆహా - ఆహా - ఆహా
చిలక్కొట్టుడే అంటడు
ఆహొ - ఒహొ - ఆహొ
రావే చుక్క రేగే తిక్క
లాగించేద్దాం చెమ్మా చెక్క
ప్రేమ యాత్రలో




*********   *********   *********



చిత్రం: చిలక్కొట్టుడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
గానం: యస్. పి. బాలు, చిత్ర

బం చికు బం చికు బం చికు బం చికు
బం చికు బం చికు బం చికు బం చికు
అరె బం చికు బం చికు బం చికు బం చికు బొంబాయి పాప
బం చికు బం చికు బం చికు బం చికు
బం చికు బం చికు బం చికు బం చికు
బం చికు బం చికు బం చికు బం చికు రైజింగ్ రాజ
బం చికు బం చికు బం చికు బం చికు
బం చికు బం చికు బం చికు బం చికు
తడితే థిళ్ళాన పడితే ఒళ్లోన తడిలో తందానా
లక్కుకు చిక్కిన చక్కని లవ్వరు కనక వెనక పడరో
కసెక్కే స్ట్రక్చరు కలర్ ఫుల్ పిక్చరు
మసాల మిక్చరు మడోన్నా కల్చరు

అరె బం చికు బం చికు బం చికు బం చికు బొంబాయి పాప
బం చికు బం చికు బం చికు బం చికు
బం చికు బం చికు బం చికు బం చికు
బం చికు బం చికు బం చికు బం చికు రైజింగ్ రాజ
బం చికు బం చికు బం చికు బం చికు
బం చికు బం చికు బం చికు బం చికు

హో లైలా లాంటి చిన్నది
లవ్ లవ్ అంటు ఉన్నది
నీలో ఊసే విన్నది
తోడై ఉంటానన్నది
పైటే చుస్తే భలేగ ఉంది
ఆపై అందం ఎలాగ ఉందో
చూడాలంటు తాపం రేగింది
నీతో ఉంటే మజాగ ఉంది
నీలో ఏదో మహత్తు ఉంది
నన్నే నీకే ముడేసి పెట్టింది
మెల్లగా మొత్తంగా ఒళ్ళో కొచ్చే చల్లగా
అంతట్లోనే అంతాతోచే యమా యమా యమగా

అరె బం చికు బం చికు బం చికు బం చికు బొంబాయి పాప
బం చికు బం చికు బం చికు బం చికు
బం చికు బం చికు బం చికు బం చికు
బం చికు బం చికు బం చికు బం చికు రైజింగ్ రాజ
బం చికు బం చికు బం చికు బం చికు
బం చికు బం చికు బం చికు బం చికు

హో చోటే ఇస్తే చాలట
ఆటే సాగిస్తాడట
చాటే చూస్తే మేలట
దాటే వేసే కైపట
మత్తెక్కించే మగాడు వస్తే
చిత్తే చేసి చిరాకు చేస్తే
మొత్తంగానే లవ్వాడేశానే
హాలీవుడ్లో అడుగే వేస్తే
బాలీవుడ్లో పిలుపే వస్తే
నంబర్ వన్ నువ్వే అవుతావే
చాలని అంటాన సందిట్లోనే చేరనా
నే రమ్మంటుంటే ఆగేదుందా సర్రంటు నే రానా

బం చికు బం చికు బం చికు బం చికు
బం చికు బం చికు బం చికు బం చికు బొంబాయి పాప
బం చికు బం చికు బం చికు బం చికు
బం చికు బం చికు బం చికు బం చికు
బం చికు బం చికు బం చికు బం చికు రైజింగ్ రాజ
బం చికు బం చికు బం చికు బం చికు
బం చికు బం చికు బం చికు బం చికు
తడితే థిళ్ళాన పడితే ఒళ్లోన తడిలో తందానా
లక్కుకు చిక్కిన చక్కని లవ్వరు కనక వెనక పడరో
కసెక్కే స్ట్రక్చరు కలర్ ఫుల్ పిక్చరు
మసాల మిక్చరు మడోన్నా కల్చరు


Palli Balakrishna Wednesday, July 5, 2017

Most Recent

Default