చిత్రం: తాతమ్మ కల (1974) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు నటీనటులు: బాలక్రిష్ణ , యన్.టి.రామారావు, హరిక్రిష్ణ దర్శకత్వం & నిర్మాత: యన్.టి.రామారావు విడుదల తేది: 30.08.1974
Songs List:
ఎవరనుకున్నారు పాట సాహిత్యం
చిత్రం: తాతమ్మ కల (1974) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: కొసరాజు గానం: భానుమతి రామకృష్ణ ఎవరనుకున్నారు
అయ్య లాలీ ముద్దులయ్య లాలీ.. పాట సాహిత్యం
చిత్రం: తాతమ్మ కల (1974) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: కొసరాజు గానం: భానుమతి రామకృష్ణ పల్లవి: అయ్య లాలీ ముద్దులయ్య లాలీ.. మురిపాల బుజ్జి ముసలయ్యలాలీ అయ్య లాలీ ముద్దులయ్య లాలీ.. మురిపాల బుజ్జి ముసలయ్యలాలీ లాలీ.. లాలీ.. లాలీ.. లాలీ చరణం: 1 తాతవే మనవడిగా పుట్టుకొచ్చావా.. నన్ను జూచి చిలిపిగా నవ్వుతున్నావా తాతవే మనవడిగా పుట్టుకొచ్చావా.. నన్ను జూచి చిలిపిగా నవ్వుతున్నావా ఎన్నాళ్ళకో నిన్ను మళ్ళీ చూశానూ.. ఎన్నాళ్ళకో నిన్ను మళ్ళీ చూశానూ ఇందుకేనేమో నేను బ్రతికే ఉన్నానూ అయ్య లాలీ ముద్దులయ్య లాలీ.. మురిపాల బుజ్జి ముసలయ్య లాలీ లాలీ.. లాలీ.. లాలీ.. లాలీ చరణం: 2 గొప్ప యింటి వాళ్ళమనే పేరొకటే మిగిలిందీ.. చెప్పుకుంటే సిగ్గు అప్పెంతో పెరిగిందీ ఈ తాతమ్మ ఇంకేమి కట్టబెట్టేనూ.. ఈ తాతమ్మ ఇంకేమి కట్టబెట్టేనూ బుగ్గ గిల్లి నీకింత ఉగ్గు పట్టేనూ అయ్య లాలీ ముద్దులయ్య లాలీ.. మురిపాల బుజ్జి ముసలయ్య లాలీ లాలీ.. లాలీ.. లాలీ.. లాలీ చరణం: 3 తిన్నదంతా కూడా జీర్ణమైపోవాలీ.. వెయ్యేనుగుల బలం నీకు రావాలీ నీ పెళ్ళిదాకా నే బ్రతికే ఉండాలీ.. నీ పెళ్ళిదాకా నే బ్రతికే ఉండాలీ నీ కళ్ళ ముందే నేను రాలిపోవాలీ అయ్య లాలీ ముద్దులయ్య లాలీ.. మురిపాల బుజ్జి ముసలయ్య లాలీ లాలీ.. లాలీ.. లాలీ.. లాలీ
ఏమండీ వదినగారు పాట సాహిత్యం
చిత్రం: తాతమ్మ కల (1974) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: కొసరాజు గానం: ఎల్.ఆర్.ఈశ్వరి పల్లవి: ఏమండి వదినగారూ.. ఏమండి వదినగారూ.. చెప్పండి కాస్త మీరూ ఏమండి వదినగారూ.. చెప్పండి కాస్త మీరూ మా అన్నయ్యను బుట్టలోన వేసుకున్నారూ.. మా అన్నయ్యను బుట్టలోన వేసుకున్నారూ.. ఎలా వేసుకున్నారూ . . ఏమండి వదినగారూ చరణం: 1 కాలేజి రోడ్డుమీదా కన్నుకొట్టావా.. సినిమాలో సీటు వెనక కాలు గోకావా కాలేజి రోడ్డుమీదా కన్నుకొట్టావా.. సినిమాలో సీటు వెనక కాలు గోకావా అబ్బబ్బ ఏమి లక్కు.. ఇక నో మోరు చిక్కు అబ్బబ్బ ఏమి లక్కు.. ఇక నో మోరు చిక్కు ఇది న్యూ మోడలు ట్రిక్కూ.. హహహహహ . . ఏమండి వదినగారూ.. చెప్పండి కాస్త మీరూ మా అన్నయ్యను బుట్టలోన వేసుకున్నారూ ఎలా వేసుకున్నారూ . . ఏమండి వదినగారూ చరణం: 2 కట్నం తప్పే వీలు కనిపెట్టావే.. రెడీమేడ్ హస్బెండును పట్టేసావే కట్నం తప్పే వీలు కనిపెట్టావే.. రెడీమేడ్ హస్బెండును పట్టేసావే వేసావులే బలె ఎత్తు.. చేసావులే అన్నను చిత్తు వేసావులే బలె ఎత్తు.. చేసావులే అన్నను చిత్తు.. చెప్పవే ఆ గమ్మత్తు.. ఒహో అహా ఏమండి వదినగారూ.. ఏమండి వదినగారూ.. చెప్పండి కాస్త మీరూ ఏమండి వదినగారూ.. చెప్పండి కాస్త మీరూ.. మా అన్నయ్యను బుట్టలోన వేసుకున్నారూ మా అన్నయ్యను బుట్టలోన వేసుకున్నారూ.. ఎలా వేసుకున్నారూ.. ఏమండి వదినగారూ
కోరమీసం కుర్రోడా పాట సాహిత్యం
చిత్రం: తాతమ్మ కల (1974) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: కొసరాజు గానం: ఘంటసాల, భానుమతి రామకృష్ణ కోరమీసం కుర్రోడా
శనగపూల రైకా దానా.. పాట సాహిత్యం
చిత్రం: తాతమ్మ కల (1974) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: కొసరాజు గానం: ఘంటసాల పల్లవి: శనగపూల రైకా దానా.. జారుపైటా చిన్నాదానా శనగపూల రైకా దానా.. జారుపైటా చిన్నాదానా ఆడే నీ వాలకం పసిగట్టానే.. నాదానా నువ్వేననీ కనిపెట్టానే శనగపూల రైకా దానా.. జారుపైటా చిన్నాదానా శనగపూల రైకా దానా . . జారుపైటా చిన్నాదానా ఆడే నీ వాలకం పసిగట్టానే.. నా దానా నువ్వేననీ కనిపెట్టానే చరణం: 1 ఘల్లు ఘల్లున అందెలు మోగుతుంటే.. ఘల్లు ఘల్లున అందెలు మోగుతుంటే గుమ్మెత్తించే వాసన రేగుతుంటే.. ఏ పక్క చప్పుడైనా . . ఏ దిక్కు అలికిడైనా నువ్వే వస్తుంటివనీ అనుకుంటినే.. నీతోడూ ఒట్టేసి చెబుతుంటినే శనగపూల రైకా దానా.. జారుపైటా చిన్నాదానా శనగపూల రైకా దానా.. జారుపైటా చిన్నాదానా ఆడే నీ వాలకం పసిగట్టానే.. నా దానా నువ్వేననీ కనిపెట్టానే చరణం: 2 గుబ్బల బరువున నడుము ఊగుతుంటే.. హంస లాగ నువ్వు అడుగు వేస్తుంటే గుబ్బల బరువున నడుము ఊగుతుంటే.. హంస లాగ నువ్వు అడుగు వేస్తుంటే వయ్యారమంత చూసి అబ్బబ్బ పళ్ళు పులిసీ వయ్యారమంత చూసి అబ్బబ్బ పళ్ళు పులిసీ పంట చేను సిగ్గుతోటి తల వంచిందే.. హహహహహ పకాపకా కొంటే నవ్వు కుమ్మరించిందే శనగపూల రైకా దానా.. జారుపైటా చిన్నాదానా శనగపూల రైకా దానా.. జారుపైటా చిన్నాదానా ఆడే నీ వాలకం పసిగట్టానే.. నా దానా నువ్వేననీ కనిపెట్టానే చరణం: 3 రంభ లాగ నువ్వు ఎదుట ఉంటేనూ.. రామచిలక లాగ కులుకుతుంటేనూ రంభ లాగ నువ్వు ఎదుట ఉంటేనూ.. రామచిలక లాగ కులుకుతుంటేనూ స్వర్గాన్ని కాదంటా నిన్నే కోరుకుంటా నా భాగ్యదేవతవి నీవని మురుచుకుంటానే.. భద్రంగా గుండెల్లో దాచుకుంటానే శనగపూల రైకా దానా.. జారుపైటా చిన్నాదానా శనగపూల రైకా దానా.. జారుపైటా చిన్నాదానా ఆడే నీ వాలకం పసిగట్టానే.. నా దానా నువ్వేననీ కనిపెట్టానే
పాండవులు పాండవులు పాట సాహిత్యం
చిత్రం: తాతమ్మ కల (1974) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: కొసరాజు గానం: యస్.పి. బాలు, మాధవపెద్ది సత్యం, కోవెల శాంత పాండవులు పాండవులు
సై అన్నానురా పాట సాహిత్యం
చిత్రం: తాతమ్మ కల (1974) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి. సుశీల సై అన్నానురా
ఏ మనిషి పాట సాహిత్యం
చిత్రం: తాతమ్మ కల (1974) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి. బాలు ఏ మనిషి
తారు రోడ్లుపై గింజలు పండవురా పాట సాహిత్యం
చిత్రం: తాతమ్మ కల (1974) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: మాధవపెద్ది రమేష్ భూమిని నమ్మితే బ్రతుకులున్నవి పొలం నవ్వితే గతులు వున్నవి తారు రోడ్లుపై గింజలు పండవురా ఓరయ్యా కబురులుతోటి కడుపులు నిండవురా