Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Rakshasudu (1986)





చిత్రం: రాక్షసుడు (1986)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: చిరంజీవి, రాధ, సుహాసిని
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: కె.యస్.రామారావు
విడుదల తేది: 02.10.1986



Songs List:



హెయ్ నాటీ పాట సాహిత్యం

 
చిత్రం: రాక్షసుడు (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు,  జానకి

పల్లవి:
హెయ్ నాటీ లవ్ బాయ్! ఈ బ్యూటీ నీదోయ్
నీ ప్రేమలేఖ నేనందుకున్నా.. 
ఆ నింగి దాగా నే పొంగుతున్న
నేడో రేపో పెళ్ళి...
నీ రూపే రూబీ.. ఐ లవ్ యూ బేబీ
నీ రూపే రూబీ.. ఐ లవ్ యూ బేబీ

చరణం: 1
ప్రేమల్లో అ ఆ లు.. సిగ్గుల్లో ఛీ పో లు ఈనాడే నే నేర్చాను
చీరమ్మ అందాలు.. సిరిమల్లె గంధాలు ఈనాడే నే చూశాను
హే.. ప్రేమల్లో అ ఆ లు.. సిగ్గుల్లో ఛీ పో లు ఈనాడే నే నేర్చాను
చీరమ్మ అందాలు.. సిరిమల్లె గంధాలు ఈనాడే నే చూశాను
వరించి వస్తున్నా.. వయ్యారమింక
తపించిపోతున్నా చెలాకి పిల్లా
కలగా మెరిసి కథలే తెలిసి సొదలే విరిసే

నీ రూపే రూబీ.. ఐ లవ్ యూ బేబీ
నీ ప్రేమలేఖ నేనందుకున్నా.. 
ఆ నింగి దాగా నే పొంగుతున్న
నేడో రేపో పెళ్ళి..
హెయ్ నాటీ లవ్ బాయ్! ఈ బ్యూటీ నీదోయ్
హెయ్ నాటీ లవ్ బాయ్! ఈ బ్యూటీ నీదోయ్

చరణం: 2
కళ్ళల్లో నాట్యాలు గుండెల్లో చేవ్రాలు ఏనాడో నువు చేశావు
పరువాల పత్యాలు బరువైన పాఠాలు ఏనాడో నాకు నేర్పావు
కళ్ళల్లో నాట్యాలు గుండెల్లో చేవ్రాలు ఏనాడో నువు చేశావు

పరువాల పత్యాలు బరువైన పాఠాలు ఏనాడో నాకు నేర్పావు

వయస్సు నీతోనే వసంతమాడే
సుగంధరాగాల ఉగాది నేడే
ఎదలో మెదిలే సొదలే కథలే ముదిరి మనసే కుదిరే
హెయ్ నాటీ లవ్ బాయ్.. ఐ లవ్ యూ బేబీ
నీ ప్రేమలేఖ నేనందుకున్నా.. 
ఆ నింగి దాగా నే పొంగుతున్న

నేడో రేపో పెళ్ళి..
హెయ్ నాటీ లవ్ బాయ్! ఈ బ్యూటీ నీదోయ్
నీ రూపే రూబీ.. ఐ లవ్ యూ బేబీ



మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు.. పాట సాహిత్యం

 
చిత్రం: రాక్షసుడు (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు,  జానకి

పల్లవి:
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు..
మల్లె జాజి అల్లుకున్న రోజు..
జాబిలంటీ ఈ చిన్నదాన్ని..
చూడకుంటే నాకు వెన్నెలేది..
ఏదో అడగాలనీ.. ఎంతో చెప్పాలనీ..
రగిలే ఆరాటంలో..
వెళ్ళలేను.. ఉండలేను.. ఏమి కాను...

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
మల్లె జాజి అల్లుకున్న రోజు

చరణం: 1
చేరువైనా రాయబారాలే చెప్పబోతే మాట మౌనం
దూరమైన ప్రేమధ్యానాలే పాడలేని భావగీతం
ఎండల్లో.. వెన్నెల్లో.. ఏంచేతో..
ఒక్కరం ఇద్దరం అవుతున్నా
వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది
గున్నమావి విరబూస్తున్నా తోటమాలి జాడేది
నా ఎదే తుమ్మెదై సన్నిదే చేరగా...

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
మల్లె జాజి అల్లుకున్న రోజు

చరణం: 2
కళ్ళనిండా నీలిస్వప్నాలే.. మోయలేని వింత మోహం
దేహమున్న లేవు ప్రాణాలే.. నీవు కాదా నాకు ప్రాణం
సందింట్లో ఈ మొగ్గే పూయనీ... రాగాలే బుగ్గల్లో దాయనీ
గులాబీలు పూయిస్తున్నా.. తేనేటీగ అతిధేడి
సందెమబ్బులెన్నొస్తున్నా.. స్వాతి చినుకు తడుపేది
రేవులో నావలా నీ జతే కోరదా
జాబిలంటి ఈ చిన్నదాన్ని.. చూడకుంటే నీకు వెన్నెలేది
ఏదో అడగాలనీ.. ఎంతో చెప్పాలనీ

రగిలే ఆరాటంలో...
వెళ్ళలేను.. ఉహ్మ్..
ఉండలేను.. ఉహ్మ్...
ఏమి కాను... హా..

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
మల్లె జాజి అల్లుకున్న రోజు
లలలల.. లలలలలాలా
ఉహ్మ్.. ఉహ్మ్.. హహహహా...




అచ్చా అచ్చా పాట సాహిత్యం

 
చిత్రం: రాక్షసుడు (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం:  వేటూరి
గానం:  యస్.పి.బాలు,  జానకి

పల్లవి:
లలలల... లలలల... లలలల
అచ్చా అచ్చా వచ్చా వచ్చా.. అచ్చా అచ్చా వచ్చా వచ్చా
అచ్చా అచ్చా వచ్చా వచ్చా.. అచ్చా అచ్చా వచ్చా వచ్చా
ఈడు వచ్చాక ఇట్టా వచ్చా... నువ్వు నచ్చాక నీకే ఇచ్చా

ఈడు వచ్చాక ఇట్టా వచ్చా... నువ్వు నచ్చాక నీకే ఇచ్చా
అచ్చా అచ్చా వచ్చా వచ్చా.. అచ్చా అచ్చా వచ్చా వచ్చా

చరణం: 1
రేతిరవుతుంటే రేగే నాలో కచ్చా.. పగటి పూటంతా ఒకటే ఇఛ్చా..
నిండు జాబిల్లికైనా ఉందీ మచ్చా... నీకు లేనందుకే నే మెచ్చా
కాచుకో ఘటోత్గజా కౌగిలే మజా.. అందుకే ఇలా వచ్చా చూడవే మజా

చీకటింట చిత్తగించా.. అందమంతా అప్పగించా
ముద్దు మురిపాలు ముందే ఇచ్చా... ముద్దబంతుల్లో నిన్నే ముంచా

అచ్చా అచ్చా వచ్చా వచ్చా.. అచ్చా అచ్చా వచ్చా వచ్చా
మొదటి గిచ్చుల్లు నిన్నే గిచ్చా.. మొగ్గ సిగ్గంతా నేనే తుంచా
మొదటి గిచ్చుల్లు నిన్నే గిచ్చా.. మొగ్గ సిగ్గంతా నేనే తుంచా

చరణం: 2
సోకులెన్నెన్నో నీలో నేనే చూచా.. మనసుతో పాటు మాటే ఇచ్చా
ఎన్ని రాత్రిళ్లు నీకై నేనే వేచా.. మనసులో నీకు చోటే ఇచ్చా
ప్రేమ పూజకే వచ్చా అందుకో రోజా.. చందమామనే తెచ్చా అందుకో రాజా
మోజులన్నీ మొసుకొచ్చా..  ఈడు జోడు రంగరించ్చా
నీకు ప్రేమంటే తెలుసా బచ్చా.. నన్ను ప్రేమిస్తే నువ్వే మచ్చా

అచ్చా అచ్చా వచ్చా వచ్చా.. అచ్చా అచ్చా వచ్చా వచ్చా
ఈడు వచ్చాక ఇట్టా వచ్చా... నువ్వు నచ్చాక నీకే ఇచ్చా 
మొదటి గిచ్చుల్లు నిన్నే గిచ్చా.. మొగ్గ సిగ్గంతా నేనే తుంచా
అచ్చా అచ్చా వచ్చా వచ్చా.. అచ్చా అచ్చా వచ్చా వచ్చా



గిలిగా గిలిగిలిగా పాట సాహిత్యం

 
చిత్రం:  రాక్షసుడు (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం:  వేటూరి
గానం:  యస్.పి.బాలు,  జానకి

పల్లవి:
గిలిగా గిలిగిలిగా గిలిగింతగా..
కసిగా కసికసిగా కవ్వింతగా..
ఒళ్లంత తుళ్లింతలై...
వాటేసుకున్నంతలై..
జపించి నీ పేరే నే తపించిపోతున్నా 
తెలుసా హే పురుషోత్తమా

గిలిగా గిలిగిలిగా గిలిగింతగా
కసిగా కసికసిగా కవ్వింతగా

చరణం: 1
వయసే నడినెత్తికెక్కింది ఈ పూట.. పైటే చలిపుట్టి జారిందయ్యో
వలపే కుడికన్ను కొట్టింది రమ్మంటా.. పెదవే తడిచేసుకుందామమ్మో
ఒదిగీ ఒకటైతే ఒకటే గొడవైతే ఇంకా ప్రేమకథా ముదిరేనయ్యా
పసుపు చెక్కిళ్లో ఎరుపు దుమారం

చిలిపి చూపులకే వణికే వయ్యారం
పగలే కోరికలు పడుచు అల్లికలు
ముదిరి ముదిరి మనువు కుదిరి
మనసు మనసు కలిసిన సిరిలో 

గిలిగా గిలిగిలిగా గిలిగింతగా... 
కసిగా కసికసిగా కవ్వింతగా
ఒళ్లంతతుళ్లింతలై... వాటేసుకున్నంతలై
జపించి నీ పేరే నే తపించిపోతున్నా..  
తెలుసా హే పురుషోత్తమా

గిలిగా గిలిగిలిగా గిలిగింతగా... 
కసిగా కసికసిగా కవ్వింతగా

చరణం: 2
ఎండా వానల్లో నీళ్లాడే అందాలు..  ఎదలో చప్పట్లే వేసేనమ్మా
మసక చీకట్లో చిగురేసే పరువాలు.. మతినే పోగొడితే ఎట్టాగయ్యో
నిదరే కరువైతే కలలే బరువైతే.. వయసు గుప్పిళ్లే తెరవాలమ్మో
సొగసు తోటల్లో పడుచు వయారం.. వడిసి పట్టగనే ఎంత సుతారం
అడిగే కానుకలు కరిగే కాటుకలు..
చిలిపి చిలిపి వలపు లిపిని.. కలికి చిలుక గిలికిన సడిలో

గిలిగా గిలిగిలిగా గిలిగింతగా... 
కసిగా కసికసిగా కవ్వింతగా
ఒళ్లంతతుళ్లింతలై... వాటేసుకున్నంతలై
జపించి నీ పేరే నే తపించిపోతున్నా..  
తెలుసా హే పురుషోత్తమా
గిలిగా గిలిగిలిగా గిలిగింతగా... 
కసిగా కసికసిగా కవ్వింతగా



నీ మీద నాకు ఇదయ్యో.. పాట సాహిత్యం

 
చిత్రం: రాక్షసుడు (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: దేవులపల్లి
గానం: యస్.పి.బాలు,  జానకి

పల్లవి:
నీ మీద నాకు ఇదయ్యో..
అందం నే దాచలేను పదయ్యో..
గిడిగాడి గిచ్చుళ్ళాయే... చలిగాలి చిచ్చాయే
చేయించు తొలి మర్యాద... యా యా యా యా

నీ మీద నాకు అదమ్మో..
పందెం నీ అంతు చూస్తా పదమ్మో...
నీ కళ్ళు కవ్విస్తుంటే .. ఆకళ్ళు మోపాయే
చేస్తాను తొలి మర్యాదా... యా యా యా యా

నీ మీద నాకు ఇదయ్యో..
పందెం నీ అంతు చూస్తా పదమ్మో...

చరణం: 1
నీ వంటి మగమహరాజే మగడే ఐతే...
నా వంటి కాంతామణికి బ్రతుకే హాయి...
నీ వంటి భామామణులు దొరికే వరకే..
ఈ బ్రహ్మచారి పొగరు కలుపు చేయి..
నీ వీర శృంగారాలే..ఏ..ఏ..
నీ వీర శృంగారాలే.... చూపించవా ఒకసారి ఒడి చేరి

నీ మీద నాకు అదమ్మో.. 
అందం నే దాచలేను పదయ్యో..

చరణం: 2
నీ చాటు సరసం చూసి గుబులే కలిగే...
నీ నాటు వరసే చూసి వలపే పెరిగే...
నీ చేతి వాటం చూసి ఎదలే అదిరే..
నీ లేత మీసం చూసి వయసే వలచే..
నీ ముద్దమందారాలే..ఏ..ఏ...
నీ ముద్దమందారాలే ... ముద్దాడనా ప్రతి రేయి... జత చేరి...

నీ మీద నాకు ఇదయ్యో..
అందం నే దాచలేను పదయ్యో..
నీ కళ్ళు కవ్విస్తుంటే .. ఆకళ్ళు మోపాయే
చేస్తాను తొలి మర్యాదా... యా యా యా యా...

నీ మీద నాకు ఇదయ్యో..
పందెం నీ అంతు చూస్తా పదమ్మో...



జయ జయ జయ ప్రియ భారత పాట సాహిత్యం

 
చిత్రం:  రాక్షసుడు (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం:  దేవులపల్లి
గానం:  జానకి

పల్లవి:
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి

చరణం: 1
జయ జయ సశ్యామల సుశ్యామ చలచ్చేలాంచల
జయ జయ సశ్యామల సుశ్యామ చలచ్చేలాంచల
జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణకుంతల
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి

చరణం: 2
జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పత విహరణ
జయ మదీయ మధురగేయ చుంబిత సుందర చరణ

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి

Most Recent

Default