-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box



చిత్రం: పరవశం (2౦౦1)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: ఏ.యమ్.రత్నం & శివ గణేష్
గానం: యస్.పి.బాలు, సాధన సర్గం
నటీనటులు: మాధవన్ , సిమ్రాన్, రాఘవ లారెన్స్, స్నేహా
దర్శకత్వం: కె.బాలచందర్
నిర్మాత: ఏ.యమ్.రత్నం
విడుదల తేది: 16.11.2001

చెలియా కుశలమా నీ కోపాలు కుశలమా
చెలియా కుశలమా నీ కోపాలు కుశలమా
ప్రియుడా కుశలమా నీ తాపాలు కుశలమా
ప్రియుడా కుశలమా నీ తాపాలు కుశలమా
గురువా కుశలమా కుశలమా ఏకాంతం కుశలమా కుశలమా
ఇల్లువాకిలి కుశలమా నీ పెరటి తోట కుశలమా
పూల పందిరి కుశలమా నీ కొంటె అల్లరి కుశలమా
ప్రియుడా ....కుశలమా నీ తాపాలు కుశలమా
చెలియా నిను వీడి నేను మతి లేక తిరిగితి
పగలు ఏడ్చినా సిగ్గు అంటూ చీకటింట్లో ఏడ్చితి
పగలు ఏడ్చినా సిగ్గు అంటూ చీకటింట్లో ఏడ్చితి
ప్రియుడా నిను ద్వేషించి మోడు నేనై పోతిని
విరహ వేదన తాళలేక చిక్కి శల్యం అయితిని
విరహ వేదన తాళలేక చిక్కి శల్యం అయితిని
కొత్త పువ్వులు పాత దండలో చేరేనా
కొత్త ముడులను పాత తాళికి వేరాడా
జీవితం ఓ వలయమై మొదటి చోటికి తిరిగిరాడా ..
జీవితం ఓ వలయమై మొదటి చోటికి తిరిగిరాడా ..
చెలియా ...... కుశలమా నీ కోపాలు కుశలమా

చెలియా కుశలమా నీ కోపాలు కుశలమా
చెలియా కుశలమా నీ కోపాలు కుశలమా
ప్రియుడా కుశలమా నీ తాపాలు కుశలమా
ప్రియుడా కుశలమా నీ తాపాలు కుశలమా
గురువా కుశలమా కుశలమా ఏకాంతం కుశలమా కుశలమా
ఇల్లువాకిలి కుశలమా నీ పెరటి తోట కుశలమా
పూల పందిరి కుశలమా నీ కొంటె అల్లరి కుశలమా
ప్రియుడా ....కుశలమా నీ తాపాలు కుశలమా

చిలిపి చేష్టకు తపించి ఓ రెక్కలేక కోల్పోయితి
ఒంటి రెక్కతో కుంటి పక్షి యెంత దూరం ఎగురునో
ప్రియతమా నిను పిల్చెద నీ ఆహింస హింసలు వరించేద
సీత దూకిన నిప్పులో నను దూకమన్నా దూకేదా
కంటి నీటిలో కలత కరువుతో కనలేదా
కలతలున్నదే మనిషి బ్రతుకని వినలేదా
ఇది కన్నీరు జరిపే రాయబారం విడిన మనసులు అతకవా ..
ఇది కన్నీరు జరిపే రాయబారం విడిన మనసులు అతకవా ..
చెలియా ...కుశలమా
ప్రియుడా ...కుశలమా
నీ కోపాలు కుశలమా
నీ తాపాలు కుశలమా
గురువా కుశలమా కుశలమా ఏకాంతం కుశలమా కుశలమా

లేత బుగ్గలు కుశలమా చివరి ముద్దు కుశలమా
పట్టెమంచం కుశలమా నా పట్టు తలగడ కుశలమా

Most Recent

Default