Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Legend (2014)

చిత్రం: లెజెండ్ (2014)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: బాలక్రిష్ణ , రాధికా ఆఫ్టే, సోనాల్ చౌహన్
దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాతలు: రామ్ అచంట, గోపిచంద్ అచంట, అనీల్ సుంకర
విడుదల తేది: 28.03.2014Songs List:హీ ఈజ్ ద లెజెండ్ పాట సాహిత్యం

 
చిత్రం: లెజెండ్ (2014)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: MLR. కార్తీకేయన్, దేవి శ్రీ ప్రసాద్

సూర్యుడు, చందుడు, రాముడు, భీముడు, 
కృష్ణుడు, విష్ణువు కలిశారంటే వీడు
హే మాటలు వాడడు మౌనమె ప్రేలుడు
ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు
జనమే లేరు నేనే జనమంటాడు 
రక్తం రంగే రక్షాగుణమంటాడు
ఊపిరి మొత్తం ఉద్యమరంగంలా
దౌర్జన్యాన్ని నిర్జించేలా గర్జిస్తున్నాడు

హీ ఈజ్ ద లెజెండ్ (8)

ధర్మ నిబద్ధుడు, సర్వ సమర్ధుడు 
చీకటి చీల్చె చెగువేరా వీడు
శక్తి సముద్రుడు, శత్రు ధుర్బేద్యుడు 
గన్నై పేలే కాంతి తత్వం వీడు
కదిలే చట్టం, నడిచే న్యాయం వీడు
వెలుతురు కన్నా వేగంగా వస్తాడు
నాయకుడైనా సేవకుడై వీడు
కష్టం తుడిచే చూపుడువేలై చరితను రాస్తాడు

హీ ఈజ్ ద లెజెండ్ (8)

నీకంటి చూపుల్లోకి పాట సాహిత్యం

 
చిత్రం: లెజెండ్ (2014)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: విజయ్ యేసుదాసు , చిత్ర

నీకంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏం మాయ చేసావే
నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే ఏం మంత్రమేసావే
సమయమే ఇక తెలియనంతగా మనసునటుఇటు కమ్మేసావే
పలు యుగాలకు తనివి తీరని కలల తలుపులు తెరిచినావే

నీకంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏం మాయ చేసావే
నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే ఏం మంత్రమేసావే ఓ ఓ

దీన దీన తనినత్తనా దీన దీన తనినత్తనా దీన దీన తనినత్తనా దీన దీన నా (2)

చూసేకొద్ది చూడాలంటూ చూపు నీవైపూ పోనీకుండా పట్టేసావే
ఇచ్చేకొద్దీ ఇవ్వాలంటూ నాకై నేనే నువ్వయిపోయేలా చుట్టేసావే
ఒంటరైన లోకం నిండిపోయె నీవుగా
ఇప్పుడున్న కాలం ఎప్పుడైనా లేదుగా
ఊపిరల్లో చిరునవ్వుల్లే నీకోసం నేనే ఉన్నా
నా ప్రేమదేశం నీకు రాసిచ్చుకున్నా

నీకంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏం మాయ చేసావే
నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే ఏం మంత్రమేసావే ఓ ఓ

ఏదో ఉంది ఎంతో ఉంది సూటి బాణాలు గుప్పించేటి నీరూపులో
నాదేముంది అంతా నీది మెరుగు పెట్టావే అందాన్నిల్లా నీచూపుతో
చిచ్చు పెట్టినావే వెచ్చనైన శ్వాసలో
గూడు కట్టినావే గుప్పెండంత ఆశలో
తెల్లారే ఉదయాలన్నీ నీతోనే మొదలైపోనీ
నీ జన్మ హక్కైపోనీ నా రోజులన్నీ

నీకంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏం మాయ చేసావే
నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే ఏం మంత్రమేసావే

దీన దీన తనినత్తనా దీన దీన తనినత్తనా దీన దీన తనినత్తనా దీన దీన నా
దీన దీన తనినత్తనా దీన దీన తనినత్తనా 
తంజావూరు బొమ్మల్లే పాట సాహిత్యం

 
చిత్రం: లెజెండ్ (2014)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సూరజ్ సంతోష్ , హరిణి

సీతారాముల జంటల్లే రాధాకృష్ణుల ప్రేమల్లే గౌరీశంకరులల్లే మీరు ఒకటవ్వాలి
నింగి నీలం రంగల్లే వెలుగు దీపానికిమల్లే
పాలుతేనే ఆలుమగలై కలిసుండాలి

హోయ్ పట్టుచీర బాగుందే కట్టుబొట్టు బాగుందే
చుట్టూ ముట్టే తెలుగందంలో అయస్కాంతం దాగిందే
హోయ్ పైట చెంగు బాగుందే పిట్టా నడుము బాగుందే
కుచ్చిళ్ళలో కులుకే చూసి నాగుండే ఆగిందే
హో నీకోసంగా పుట్టిన అందం నీదే కావాలి
నీ చూపుల్తో ఎదిగిన చందం నీకే ఇవ్వాలి
ఇందా అంటు నువ్విస్తుంటే ఇంకేంకావాలి
నీ ఇంగువ సొగసుల ఘుమ ఘుమ చూసి వచ్చా నోరూరి

తంజావూరు బొమ్మల్లే భలే ముద్దొస్తున్నావే
మనసే మడతేసే మాయాజాలం చేశావే
ఏయ్ అత్తాపూరు అత్తరు నాపై జల్లేస్తున్నావే
వయసే విరబూసే వడగాలై వచ్చేశావే

నీటిలో కాగితం పడవలా దూసుకొస్తుందే అశే నీవైపే
నడుమొంపులో ఒదిగే కడవలా వాలిపోయావే పిలిచే లోపే
హోయ్ గుండెసడి గుఱ్ఱం లాగా దూకిందే నీపైకే
కళ్ళెమొదిలేశా నేనే కావాలనే ఓయ్
కట్టు తెగి తూఫానయ్యే కడలంటి నువ్వేలే 
అదుపు దాటి ఆక్రమించు అస్సలు ఆపను నిన్ను

తంజావూరు బొమ్మల్లే భలే ముద్దొస్తున్నావే
మనసే మడతేసే మాయాజాలం చేశావే
ఏయ్ అత్తాపూరు అత్తరు నాపై జల్లేస్తున్నావే
వయసే విరబూసే వడగాలై వచ్చేశావే

ఎండలో నట్ట నడి ఎండలో కాలుమోపొద్దే కందిపోయేలా
నీడలో నన్ను నీ నీడలో దాచుకున్నాగా నాకు భయమేలా
అరే రాతిరికి గంతలు కట్టి నలుపంత దోచేసి
కాటుకలు దిద్దేస్తానే నీ కళ్ళకి హేయ్ 
సూర్యుడికి ముసుగే వేసి దూరంగ గిరవాటేసి
కాలమంత గడుపుకుంటా నీ వెలుగులో పడకేసి

తంజావూరు బొమ్మల్లే భలే ముద్దొస్తున్నావే
మనసే మడతేసే మాయాజాలం చేశావే
ఏయ్ అత్తాపూరు అత్తరు నాపై జల్లేస్తున్నావే
వయసే విరబూసే వడగాలై వచ్చేశావే
టైం బాంబ్ పేలిందే పిల్లా పాట సాహిత్యం

 
చిత్రం: లెజెండ్ (2014)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: నరేంద్ర , రీటా

హే రెక్సోనా సబ్బు రాసుకొచ్చినట్టు
సెక్సీగా నన్ను చంపకే
శాక్సాఫోన్ ఒంపులన్ని ముందరెట్టి 
మిక్సీలో నన్ను రుబ్బకే
దీని బాడీ సోం పాపిడీ చీమల్లే నేను నీ వెంటే
హేయ్ లేడీ నీలోవేడి నాపైకి దాడిచేస్తుంటే
టైం బాంబ్ పేలిందే పిల్లా
నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్లా
సైక్లోన్ వచ్చిందే పిల్లా
నా గుండెల్లో సైక్లోన్ వచ్చిందే పిల్లా

రాంబోలా స్టెన్ను గన్ను కన్ను కొట్టి 
తూటాలే దించినావురో
రైన్ బోలా లెప్టు రైటు చుట్టుముట్టి 
రంగుల్లో ముంచినావురో
హెడ్లైట్ వేసావ్  పిల్లోడా 
నా చూపుల్లో హెడ్ లైట్ వేసావ్ పిల్లోడా
బెడ్ లైట్ ఆపెయ్ బుల్లోడా
నా నిద్దర్లో బెడ్ లైట్ ఆపెయ్ బుల్లోడా

పాష్ డిస్కోలోని మాసు ఐటం నువ్వే
నీలో అందాల కోణాలు సోమెనీ
గుచ్చుకుంటే పోని ఇష్క్ బాణం నువ్వే
నీతో చేసుకోనా జాలీ జర్నీ
సెంటు బాటిల్లాంటి గోళీసోడా నువ్వే
కిస్సు కిస్సంటూ నీ సరుకే పేలనీ
స్పీడోమీటర్ లేని కిలోమీరట్ నువ్వే
నాలో మేటరంత నీదై పోనీ
మోకాల్పైకి నిక్కర్లో మోజేపెంచే లెక్కల్లో
చూపుల్తోనే పిల్లా నన్ను తాగేస్తంటే
లారీ గుద్దిందే పిల్లా నా గుండెల్ని
లారీ గుద్దిందే పిల్లా
మ్యారీ చేస్కో పిల్లోడా నా సోకుల్ని
మ్యారీ చేస్కో పిల్లోడా

యమా యాపిల్ పిల్లో కొరికే చూసే పన్లో
మేరామైండంతా ట్రాఫిక్కు జామైందిలే
నేన్నీ కాటన్ పిల్లో నలిగిపోయే కల్లో
చలో గ్రీను సిగ్నల్ ఇచ్చేస్తాలే
హల్లో చమ్మక్ చల్లో నువ్వేం క్రిక్కెట్ బాలో
బల్లే నా హార్టు విక్కెట్టు తీసావులే
మల్లె మైదానంలో మత్తు జాగారంలో 
ప్రతీ బంతి సిక్సరు కొట్టిస్తాలే
ఎగాదిగా నిన్నిట్టా ధగా ధగా చూసేసి
భగా భగా మగా ఈడు మంటెడతాంటే
రైన్ డేన్స్ మొదలైందే పిల్లా నా గుండెల్లో
రైన్ డేన్స్ మొదలైందే పిల్లా
గరం చాయ్ ఇస్తా పిల్లోడా నా చేతుల్తో
గరం చాయ్ ఇస్తా పిల్లోడా
ఓం శార్వణీ ఓం రుద్రాణి పాట సాహిత్యం

 
చిత్రం: లెజెండ్ (2014)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: యమ్.యమ్. మానసి

ఓం శార్వణీ ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం
ఓం కల్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణీ వందనం
ఓం శార్వణీ ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం
ఓం కల్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణీ వందనం

పావనీ జీవతరణి పాపసంతాప హరణీ
నీ కృపా చైత్ర సుధని మాపైన వర్షించనీ
శాంభవీ లోక జననీ త్రిభువనానందకారిణి
చింత రవ్వంత కనని చిరశాంతి విలసిల్లనీ
శ్రీ చక్రాన అమ్మవై ఉన్న ఆదినారాయణీ
నీ వాత్సల్య మాస్వాదించనీ మనసుని
ఓం శార్వణీ ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం
ఓం కల్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణీ వందనం

సజ్జన రంజని దుర్జన భంజని ధర్మశిరోమణి హైమవతి
సత్య సుభాషిణి నిత్య సువాసిని సరసిజహాసిని శంభుసతి
విశ్వవినోదిని భక్త ప్రమోదిని భాగ్య ప్రదాయిని శాంతిమతి
ఆత్మ విలాసిని ఆర్త పరాయణి అమృతవర్షిణి వేదవతి
శూలధారిణి శైలవిహారిణి మాంపాహి దేవీ చిదానంద రూపిణీ
ఓం శార్వణీ ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం
ఓం కల్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణీ వందనం

భగవతి భార్గవి భైరవి భ్రామరి మారి మనోహరి మూకాంబే
భక్తవ శంకరి భవనాశంకరి పరమశివంకరి దుర్గాంబే
ఓంకారేశ్వరి వర బీజాక్షరి మాహిమహేశ్వరి జగదంబే
శ్రీ పరమేశ్వరి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి భ్రమరాంబే
రౌద్రకాళీ యోగమరాళీ మాంపాహి గౌరీ శివానందలహరీ
ఓం కారునాక్షి ఓం హరినాక్షి ఓం నళినాక్షి వందనం
ఓం కామాక్షి ఓం కమలాక్షి వీరి మీనాక్షి వందనం
లస్కుటపా లస్కుటపా పాట సాహిత్యం

 
చిత్రం: లెజెండ్ (2014)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సాగర్ , మాలతి

లస్కుటపా లస్కుటపా లస్కుటపా
మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా 
లస్కుటపా లస్కుటపా లస్కుటపా
మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా
లస్కుటపా లస్కుటపా లస్కుటపా
మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా 
లస్కుటపా లస్కుటపా లస్కుటపా
మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా 

హే చెరుకు ముక్క నేను అరె కొరికి చూడు మావా
నీ దిమ్మదిరిగి బొమ్మడిపోద్ది
లస్కుటపా లస్కుటపా లస్కుటపా
మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా
గంజాయి మొక్క నేను ఎంజొయ్ చేయి మామ
నీ నరం నరం మెలికడిపోద్ది
లస్కుటపా లస్కుటపా లస్కుటపా
మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా
హే జరమొస్తే ఇస్తారు ఇంజీషను
నేనేమో జరమిచ్చే ఇంజీషను
సెల్లు నంబరడిగేస్తే ఇచ్చేస్తాను
ఒక్క మిస్సుడు కాలు నొక్కేస్తే వచ్చేస్తాను
మా ఊరు గుంటూరు నా సరుకు చూస్తె పావుశేరు
ఉడుకు చూస్తె నూట ఆరు లస్కులపా నా పేరు

లస్కుటపా లస్కుటపా లస్కుటపా
మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా
లస్కుటపా లస్కుటపా లస్కుటపా
మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా

కల్లుముంత వేస్టు నీ కళ్ళు చూస్తె చాలు తైతక్కలాడే కిక్కొస్తాదే
లస్కుటపా లస్కుటపా లస్కుటపా
పాపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా
హే రమ్ము జిన్ను వేస్టు నీ రంగు పెదవి చాలు
రంగుల్ రాట్నం ఎక్కిస్తాదే
లస్కుటపా లస్కుటపా లస్కుటపా
పాపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా
నన్ను భంగుతో చేశాడు భగవంతుడు
నా కళ్లలో దాచాడు కత్తులు రెండు
చెంపల్లో పొదిగాడు చెర్రీ పండు
నడుం మెలికలో పెట్టాడు వెల్కం బోర్డు
ఓలమ్మీ మీ మమ్మీ మరుమల్లెపూలు కప్పుకున్న
మందుపాతరంటి నిన్ను మాకోసం కన్నాదే

లస్కుటపా లస్కుటపా లస్కుటపా
మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా
లస్కుటపా లస్కుటపా లస్కుటపా
నేనే లస్కుటపా లస్కుటపా లస్కుటపా

నే తీపి ముద్దులిస్తే నీ షుగరు పెరిగిపోతే 
ఆ తప్పు నాది కానే కాదు
లస్కుటపా లస్కుటపా లస్కుటపా
మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా
నే ఘాటు కౌగలిస్తే నీ బీపీ పెరిగిపోతే
నా పూచీ లేనే లేదు
లస్కుటపా లస్కుటపా లస్కుటపా
మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా
హే ఓసినీ వొంపు సొంపు డేంజర్ లైటు
నువ్వున్న చోట పవరుకట్టు ఉంటే ఒట్టు
అయినా గానీ పెరుగుతాంది హీటో హీటు
ఓ చూపు చూసి నా ఒంటికి ఏసీపెట్టు
ఆరేసి ప ప పారేసి నా బ్యూటీ మొత్తం ఊటీ చేసి ఇచ్చుకోన చిల్డు ఖుషీ పైటచెంగు ఎగరేసి

లస్కుటపా లస్కుటపా లస్కుటపా
మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా
లస్కుటపా లస్కుటపా లస్కుటపా
మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా
లస్కుటపా...


Most Recent

Default