చిత్రం: అల్లుడా మజాకా (1995) సంగీతం: కోటి నటీనటులు: చిరంజీవి, రమ్యకృష్ణ , రంభ దర్శకత్వం: ఇ. వి.వి. సత్యనారాయణ నిర్మాత: దేవి వర ప్రసాద్ విడుదల తేది: 25.02.1995
Songs List:
చిన్న పాపకేమో పాట సాహిత్యం
చిత్రం: అల్లుడా మజాకా (1995) సంగీతం: కోటి సాహిత్యం: భువన చంద్ర గానం: యస్.పి. బాలు, చిత్ర చిన్న పాపకేమో చీర కాస్త
అత్తో అత్తమ్మ కూతురో పాట సాహిత్యం
చిత్రం: అల్లుడా మజాకా (1995) సంగీతం: కోటి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు, చిత్ర అత్తో అత్తమ్మ కూతురో
ఉంగా ఉంగా పాట సాహిత్యం
చిత్రం: అల్లుడా మజాకా (1995) సంగీతం: కోటి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు, సుజాత ఉంగా ఉంగా ఊపెయ్యంగా వంగా వంగా వాటెయ్యంగా వెచ్చంగా ఇచ్చెయ్యంగా నచ్చేవన్ని గిచ్చంగా ముచ్చంగా ముద్దియ్యంగా ముద్దబంతి విచ్చంగా ...నాకేం బెంగా బుంగా బుంగా బజ్జో రంగా వంగా వంగా వయ్యారంగా చల్లంగా దోచెయ్యంగా సల్లాపాల సారంగా సంపెంగ సందియ్యంగా సంసారాలే చేయంగా..టింగో రంగా ఉంగా ఉంగా ఊపెయ్యంగా వంగా వంగా వాటెయ్యంగా మత్తుల్లో దించిందే నీ అందమూ కసి కసి కామేశ్వరీ సిగ్గుల్లో చిందిందీ సింగారమూ చిరు చిరు చిందేశ్వరా మొగ్గే నీదీ పువ్వే నాదీ తేనే నీదీ తీపే నాదీ అందాలు ఈరేయి వెన్నెల్లొ ఆరేయి జాగారంగా బుంగా బుంగా బజ్జో రంగా వంగా వంగా వాటేయంగా కుర్రేడూ కిట్టిందీ కొయ్యో మొర్రో వలపుల వాస్తాయనా పిల్లోడు కోరిందీ పాలో పండో వయసుకి వడ్డించవా కట్టు బొట్టు కాజేస్తవా గుట్టు మట్టు గుంజేస్తాలే నీ తోడు జోడించి నా ఈడు ఓడించి ఉల్లాసంగా ఉంగా ఉంగా ఊపెయ్యంగా వంగా వంగా వయ్యారంగా వెచ్చంగా ఇచ్చెయ్యంగా నచ్చేవన్ని గిచ్చంగా సంపెంగ సందియ్యంగా సంసారాలే చేయంగా...నాకేం బెంగా
మా ఊరి దేవుడు పాట సాహిత్యం
చిత్రం: అల్లుడా మజాకా (1995) సంగీతం: కోటి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామా రఘురామా - జగమేలే జయరామా కదిలి రావయ్యా కళ్యాణరామా మనువు కోరింది సీతమ్మ భళిరా భళిరా భళిరా మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు చుక్కా చుక్కల లేడి రాంభజన సూది కన్నుల లేడి రాంభజన చుక్కా చుక్కల లేడి రాంభజన - అవును సూది కన్నుల లేడి రాంభజన రామయ్య నలుపంట సీతమ్మ తెలుపంట పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట శ్రీరాముడి కళ్యాణమే సీతమ్మకే వైభోగము మాతల్లికే పేరంటము లోకాలకే ఆనందము చైత్రమాస కోకిలమ్మ పూలమేళమెట్టెనంట నింగి వంగి నేల పొంగి జంటతాళమేసెనంట చెల్లిపోని మమతలకి చెల్లెలు సీతమ్మరా తాళికట్టు బావయ్యే తారక రామయ్యరా తుళ్లిపడ్డ కన్నెలకి పెళ్లీడు పాపలకి వలచిన వరుడంటే రామచంద్రుడే రాతినైన నాతిగచేసి కోతినైన దూతగ పంపే మహిమే నీ కథ రామా... ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు ధర్మానికే నీవు దైవానివైనావు అన్నంటే నీవంటు ఆదర్శమైనావు కన్నోళ్లకే నీవు కన్నీళ్లు తుడిచావు ఆకాశ పందిళ్లు భూలోక సందళ్లు ఓ రామ నీ పెళ్లికే... భళిరా భళిరా భళిరా... మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు దేవుడి గుడిలో హారతి తిప్పు... తిప్పు తిప్పు తిప్పు... దేవుడి గుడిలో హారతి తిప్పు దొరుకును దోసెడు వడపప్పు బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు ఏదిర లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందుచేత విన్నాను మారీచకూత వాడు లంకేశుడి మాయదూత లేడల్లె వచ్చాడు ఘాత వాణ్ణి బాణానికేస్తాను మేత ఏదిర లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందుచేత ఏదిరా లక్ష్మణ సీతా పర్ణశాలలో లేదెందుచేత నే నాడతా... నే పాడతా... నే నాడతా... నే పాడతా... వాడి అంతుచూసి నే నాడతా... వాడి గొంతుపిసికి నే పాడతా... నే నాడతా... నే పాడతా... నే నాడతా... నే పాడతా... రక్కసి బాధలేని పల్లెటూళ్లు మావూళ్లురా మంథర మాటవినే కైకలేదురా సీత సిరి పండించే మళ్లు ఉన్న మాగాణిరా కలిమికి చోటు ఇదే కరువులేదురా బుజ్జగింపు ఉడతకిచ్చి పుణ్యమేమొ కప్పకిచ్చే ఘనతే నీ కథ రామా... కంచర్ల గోపన్న బంధాలు తెంచావు శబరి ఎంగిలి పళ్లు నువ్వారగించావు త్యాగయ్య గానాల తానాలు చేశావు బాపూజీ ప్రాణాల కడమాటవైనావు సీతమ్మ రామయ్య పెళ్లాడుకుంటుంటే భూలోక కళ్యాణమే... భళిరా భళిరా భళిరా... మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామా రఘురామా - జగమేలే జయరామా కదిలి రావయ్యా కళ్యాణరామా మనువు కోరింది సీతమ్మ భళిరా భళిరా భళిరా... మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
పిట్ట కూతా పెట్టెరా పాట సాహిత్యం
చిత్రం: అల్లుడా మజాకా (1995) సంగీతం: కోటి సాహిత్యం: భువనచంద్ర గానం: యస్.పి. బాలు, చిత్ర పిట్ట కూతా పెట్టెరా పెట్టెరా ముద్దు మేతా పెట్టరా పెట్టరా జట్టు కట్టి వంచరా వంచరా పట్టు పట్టి దంచరా దంచరా గుమ్మతో బొమ్మతో లబ్సుగా జత కట్టూ జంతగా జోరుగా పట్టరో ఓ పట్టూ ఇంక మోతెక్కి పోవాల ముచ్చటా పిట్ట కూతా పెట్టెరా పెట్టెరా ముద్దు మేతా పెట్టరా పెట్టరా వాలు వాలు చొప్పులతో గాలమేసి లాగి లాగి ప్రేమలోకి దించుతారు ట్వౌను గుమ్మలూ కొంగు చూస్తె కరిగిపోయి పొంగు చూస్తె అదిరిపోయి మాయలోన పదతారు కుర్ర కుంకలూ చూపులేస్తే ఊపి చూపీ గాలమేస్తే గోల చేసీ చూపులేస్తే ఊపి చూపీ గాలమేస్తే గోల చేసీ ప్రేమలోకి దింపుతుంటె పంగ దీసి లొంగదీ పొగరు దించి వగరు దించి ముకు తాడు వేస్తాడు గడుచు రాముడు ఈ గడుచు రాముడు రాముడో ఓ దేవుడో మాకు మతిలేక వచ్చామురో...చచ్చారు కాముడో భీముడో నీకు దందాలు వదిలెయ్యరో వద్దు వద్దన్న తిప్పేన తిప్పలూ పిట్ట కూతా పెట్టెరా పెట్టెరా ముద్దు మేతా పెట్టరా పెట్టరా ముల్లు మీద ఆకు పడితె ముల్లు విరుగునా పండు వచ్చి గుద్దుకుంటె కొండ పగులునా పుట్టలోన చెయ్యి పెడితె పాము కుట్టదా అగ్గి మీద ముంత పెడితె వెన్న కరగదా పల్లెటూరీ పోటు గాడ్నీ పట్టు మీదా ఉన్న వాడ్నీ పల్లెటూరీ పోటు గాడ్నీ పట్టు మీదా ఉన్న వాడ్నీ కోరమీసమున్న వాడ్ని కన్నె బాద తెలిసినోడ్ని పాపలొచ్చి పట్టునుంటె కోకలొచ్చి చుట్టుకుంటె కాక తీరచనా కాక తీర్చనా రాముడో ఓ దేవుడో నీ కాలెట్టుకుంటామురోయ్ కాముడో భీముడొ మాకు బుద్దొచ్చె వదిలెయ్యరో మల్లి వచ్చారో మోగిస్త పంబలూ పిట్ట కూతా పెట్టెరా పెట్టెరా ముద్దు మేతా పెట్టరా పెట్టరా గుమ్మతో బొమ్మతో లబ్సుగా జత కట్టూ ఇంక మోతెక్కి పోవాల ముచ్చటా
రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు పాట సాహిత్యం
చిత్రం: అల్లుడా మజాకా (1995) సంగీతం: కోటి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు, చిత్ర రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వయ్ జడ్డు చూశా గుడ్డు గుడ్డు వెరీ గుడ్డూ వల్లో బెడ్డు సెంటర్ స్ప్రెడ్డు వేశా తకదిం ధనా ధనా దరువులే కలిపేయ్ చలాకిగా పెదవులే రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వయ్ జడ్డు చూశా గుడ్డు గుడ్డు వెరీ గుడ్డూ వల్లో బెడ్డు సెంటర్ స్ప్రెడ్డు వేశా కన్నె ఊపుతో కట్టడి చేస్తా ఉన్న ఊంపుతో ఉప్పెన తెస్తా ఊరిస్తే జోరిస్తా సుందర సూటయ్యో హత్తుకుంటె నీ అత్తర తీస్తా మొత్తుకున్న నీ మోజులు చూస్తా కస్ అంటే గిస్ అంటా తొందర పాటమ్మో ఓలయ్యో తస్సా దియ్యా తగ్గాలయ్యో మావయ్యో పగలే దీపాలెట్టే పంతాలొద్దయ్యో ఓయమ్మో వయ్యారమ్మో తయ్యారేలే రావమ్మో పెరికీ వేలా లేదూ పాలా లేదమ్మో టయ్యాట బుల్లోడు సయ్యాత లాడేసి హవ్వాయి బీటేసి లల్లాయి కొట్టేస్తె నడుము రగిలి నదక ముదిరె పడుచు పాటల్లో రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వయ్ జడ్డు చూశా గుడ్డు గుడ్డు వెరీ గుడ్డూ వల్లో బెడ్డు సెంటర్ స్ప్రెడ్డు వేశా ఆకు చాటునా పిందెను చూస్తా సోకు తీగలో పండును కోస్తా నువ్వొస్తే కవ్విస్తా ముద్దుల మూటమ్మో ఉక్కపూతకే ఊపిరి పోస్తా పక్క మేదకు పండుకటిస్తా ముద్దిస్తే బుగ్గిస్తా ముద్ద్యుల మూటయ్యో ఓలమ్మో పుకారులో షికారుగా రావమ్మో ఎదరే ఏడెక్కిస్తే ఎట్టా బుల్లెమ్మో ఓలయ్యో బజారులో పజాలకే రానయ్యో పగలే పక్కెక్కిస్తే తంటాలేవయ్యో మిడ్డీల మీదున్న మిస్సమ్మ ఎస్ అంటె వడ్డీలతోపాటు వల్లోకి వస్తుంటె పొగరు చిలకలెగిరి పడినె పడుచు పైటల్లో రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వయ్ జడ్డు చూశా గుడ్డు గుడ్డు వెరీ గుడ్డూ వల్లో బెడ్డు సెంటర్ స్ప్రెడ్డు వేశా తకదిం ధనా ధనా దరువులే కలిపేయ్ చలాకిగా పెదవులే