Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

April 1 Vidudala (1991)
చిత్రం: ఏప్రిల్ 1 న విడుదల (1991)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: రాజేంద్రప్రసాద్, శోభన
దర్శకత్వం: వంశీ
నిర్మాత: పి.వి.భాస్కర రెడ్డి
విడుదల తేది: 01.02 1991Songs List:చుక్కలు తెమ్మన్నా పాట సాహిత్యం

 
చిత్రం: ఏప్రిల్ 1 న విడుదల (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో, చిత్ర

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా  చేస్తానే ఎమైనా
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా  చేస్తానే ఎమైనా
నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మ ఎట్టాగైనా

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా  చేస్తానే ఎమైనా

షోలే ఉందా ఇదిగో ఇంద
చాల్లే ఇది జ్వాలకాదా తెలుగులొ తీసారే బాలా
ఖైదీ ఉందా ఇదిగో ఇంద
ఖైదీకన్నయ్య కాదే వీడికి అన్నయ్య వాడే
జగదేక వీరుడి కధ ఇది పాత పిక్చరు కద
అతిలోక సుందరి తల అతికించి ఇస్తా పద
ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా  చేస్తానే ఎమైనా

ఒకటా రెండా  పదులా వందా
బాకీ ఎగవేయకుండా బదులే తీర్చేది ఉందా
మెదడే ఉందా మతిపోయిందా
చాల్లే మీ కాకి గోలా వెళాపాళంటూ  లేదా
ఎమైంది భాగం కధ  కదిలిందాలేదా కధ
వ్రతమేదో చేస్తుందట అందాక ఆగాలట
లౌఖ్యంగా బ్రతకాలి  సౌఖ్యాలే పొందాలి

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా  చేస్తానే ఎమైనా
నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మ ఎట్టాగైనా
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా చేస్తానే ఎమైనా
ఒక్కటే ఆశా పాట సాహిత్యం

 
చిత్రం: ఏప్రిల్ 1 విడుదల (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం:  చిత్ర,  మనో (నాగూర్ బాబు) 

ఒక్కటే ఆశా .. అందుకో శ్వాసా
అచ్చగా అంకితం చేశా .. పుచ్చుకో ప్రాణేశా
అచ్చగా అంకితం చేశా .. పుచ్చుకో ప్రాణేశా

చుక్కనే చూశా .. లెక్కలే వేశా
నింగిపై అంగలే వేశా .. కిందికే దించేశా
నింగిపై అంగలే వేశా .. కిందికే దించేశా

ఒక్కటే ఆశా .. అందుకో శ్వాసా !

మెత్తగా వళ్ళో .. పెట్టుకో కాళ్ళూ
ఉందిగా అంక పీఠం .. ఆడపుట్టుకే అందుకోసం
గట్టిగా పట్టుకో .. భక్తిగా అద్దుకో
పుచ్చుకో పాద తీర్ధం .. పాద పూజలే ఆది పాఠం

చాకిరీ చెయ్యనా బానిసై .. నీ సేవలే చెయ్యనా పాదుషా
దీవెనే తీసుకో బాలికా .. నీ జీవితం సార్ధకం పొమ్మికా
మొక్కులే తీరీ .. అక్కునే చేరీ .. దక్కెనే సౌభాగ్యం

చుక్కనే చూశా .. లెక్కలే వేశా
నింగిపై అంగలే వేశా .. కిందికే దించేశా
అచ్చగా అంకితం చేశా .. పుచ్చుకో ప్రాణేశా

ఒక్కటే ఆశా .. అందుకో శ్వాసా !

నచ్చెనే నారీ .. వచ్చెనే కోరీ ..
తెచ్చెనే ప్రేమ సౌఖ్యం .. సాటి లేనిదీ ఇంటి సఖ్యం
మెచ్చెనే చేరీ .. ముచ్చటే తీరీ
ఇచ్చెనే ప్రేమ రాజ్యం .. అంతులేనిదే సంతోషం

స్వప్నమే సత్యమై వచ్చెనేమో .. వెచ్చగా సర్వమూ పంచగా
స్వర్గమే సొంతమై దక్కెనేమో .. అచ్చటా ముచ్చటా తీర్చగా
మక్కువే మీరీ .. ముద్దులే కోరీ .. అందెనా ఇంద్రభోగం

ఒక్కటే ఆశా .. అందుకో శ్వాసా
అచ్చగా అంకితం చేశా .. పుచ్చుకో ప్రాణేశా
నింగిపై అంగలే వేశా .. కిందికే దించేశా

ఒక్కటే ఆశా .. అందుకో శ్వాసా !
నిజమంటే నిప్పేకాదా పాట సాహిత్యం

 
చిత్రం: ఏప్రిల్ 1 విడుదల (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో (నాగూర్ బాబు) 

పల్లవి:
నిజమంటే నిప్పేకాదా ముట్టుకుంటే చుట్టుకోదా మంటా
దరికొస్తే ముప్పేకాదా తప్పుకోండి తగుదూరం అంతా 

నియమాలే దాటలేను నిజమేది దాచలేను 
నికరంగా నిష్టూరంగా డప్పుకొట్టి చెప్పిపోతా 

చరణం: 1
నమస్తే ముసలి మన్మథ క్షహిస్తే హితవు చెప్పెదా
నరాల్లో పసరు చచ్చినా బుసలు తగ్గలేదా
కులాసా దీనభందువ చరిత్రే చదవ మందువ
వలిస్తే మేదిపండువే పైకి వప్పుకోవా
దివాకర్ నామద్యేయము నిజాలే నాకు ద్యేయము
ప్రమాదం కలదు కాయము పరిస్థితి బహు బలీయము 
వప్పైనా తప్పైనా ముప్పైనా తప్పేనా 
కయ్యాలు వస్తాయి అంటారా ఏంచేయడం తగువు సహజం  

చరణం: 2
నిజంగా ఒక్కటే నిజం రహస్యం తెలిసెనీక్షణం
ప్రపంచం పరమ వికృతం ముసుగు తీసి చూస్తే
అసత్యం సహజ సుందరం అనంతం దాని వైభవం
అబద్దం కరిగిపోయెనా బ్రతుకు సాగదంతే
ప్రతీది పచ్చి బూటకం నిజం ఒక నిత్యనాటకం
మనస్షోకపాడు కీటకం ఇదేరా అసలు కీలకం
వ్యాపారం వ్యవహారం సంసారం శృంగారం 
అంగట్లో ముంగిట్లో అన్నిట్లో సత్యమే ఇనుప కవచం 

ఒంపుల వైఖరి పాట సాహిత్యం

 
చిత్రం: ఏప్రిల్ 1 విడుదల (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు, చిత్ర

ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ
మోవినీ మగతావినీ ముడివేయనీయవా
కాదని అనలేననీ ఘడియైన ఆగవా
అదుపు పొదుపూ లేని ఆనందం కావాలి
హద్దూ పొద్దూ లేని ఆరాటం ఆపాలి

ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ

మాంగళ్యం తంతునానేనా మమజీవన హేతునా
కంఠే బద్నామి శుభగే త్వంజీవ శరదశ్శతం
త్వంజీవ శరదశ్శతం త్వంజీవ శరదశ్శతం

లాలిలాలిలాలి ... లాలిలాలిలాలి
లాలీ లాలీ ... లాలీ లాలీ

కాంక్షలో కైపు నిప్పు ఎంతగా కాల్చినా
దీక్షగా ఓర్చుకున్నా మోక్షమే ఉండదా
శ్వాసలో మోహదాహం గ్రీష్మమై వీచగా
వాంఛతో వేగు దేహం వరయాగ వాటిక
కాలమే కాలిపోయే ఆజ్యమే పోయవా
మౌనమే గానమయ్యే మూర్తమే చూడవా

ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ

నిష్ఠగా నిన్ను కోరీ నియమమే దాటినా
కష్టమే సేదతీరే నేస్తమే నోచనా
నిగ్రహం నీరుగారే జ్వాలలోడించినా
నేర్పుగా ఈదిచేరే నిశ్చయం మెచ్చనా
సోయగం సొంతమయ్యే స్వర్గమై చేరవా
మధనమే అంతమయ్యే అమృతం అందుకో

ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ
మోవినీ మగతావినీ ముడివేయనీయవా
కాదని అనలేననీ ఘడియైన ఆగవా
అదుపు పొదుపూ లేని ఆనందం కావాలి
హద్దూ పొద్దూ లేని ఆరాటం ఆపాలి

ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ హాఆఆఅమాటంటే మాటేనంటా పాట సాహిత్యం

 
చిత్రం: ఏప్రిల్ 1 విడుదల (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు, చిత్ర

పల్లవి:
మాటంటే మాటేనంటా కంటబడ్డ నిజమంతా అంటా
బుజువంటు దొరికిందంటే గంట కొట్టి చాటేస్తూ ఉంటా
నిజమంటే పంతాలంటా నిక్కుతుంటే తిక్కదిగుతాదంటా
మొంలంటూ పెడతావంటా వెంటబడి తెగ తింటారంటా

గోపీ నా పక్కనుంటే భయమింకా ఎందుకంటా
ఎవరంటే నాకేమంటా తప్పులుంటే ఒప్పునంటా
నీవెంటే నేను ఉంటా చూస్తుంటా ఓరకంటా
నిజమంటూ నీలుగుతుంటే ముప్పు నీకు తప్పదంటా

చరణం:
నువ్వే మా మొదటి గెస్టని మా ఆవిడ వంట బెస్టని
ఈపిస్టుకు పిలుచుకొస్తని టేస్టు చెప్పిపోరా
ఇదే మావిందు భోజనం మీరే మా బంధువీదినం
రుచుల్లో మంచి చెడ్డలు ఎంచి తెలుపుతారా
అపార్థం చేసుకోరుగా అనర్థం చేయబోరుగా
యథార్థం చేదుగుంటది పదార్థం చెత్తగున్నది
ఇది విందా నా బొందా తిన్నోళ్ళు గోవిందా
జంకేది లేదింక నీ టెంక పీకేయిక పదర కుంకా 

చరణం :
భళారే నీలి చిత్రమా భలేగా ఉంది మిత్రమా
ఇలా రసయాత్ర సాగదా పక్కనుంటే భామా
కోరావు అసలు ట్రూతులు చూపాను సిసలు బూతులు
చిక్కారు తప్పుచేసి ఇక మక్కెలిరగదన్ను
తమాషా చూడబోతిరా తడాకా చూపమందువా
మగాళ్ళని అదిరి పడితిరా మదించి మొదలు చెడితిరా
సిగ్గైనా ఎగ్గైనా లేకుండా దొరికారా లోకప్పు పైకప్పు మీకిప్పుడే చూపుతా
బెండు తీస్తా

Most Recent

Default