Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Aaradhana - NTR (1976)




చిత్రం: ఆరాధన (1976)
సంగీతం: ఎస్. హనుమంత రావు
నటీనటులు: యన్.టి.రామారావు, వాణిశ్రీ, జగ్గయ్య
దర్శకత్వం: బి.వి.ప్రసాద్
నిర్మాత: అట్లూరి. పుండరీ కాక్షాయా
విడుదల తేది: 12.03.1976



Songs List:



నా మది నిన్ను పిలిచింది పాట సాహిత్యం

 
చిత్రం: ఆరాధన (1976)
సంగీతం: ఎస్. హనుమంత రావు
సాహిత్యం: డా. సి. నారాయణ రెడ్డి
గానం: మహమ్మద్ రఫీ, యస్.జానకి

ఓ ప్రియతమా... ప్రియతమా... ప్రియతమా...

నా మది నిన్ను పిలిచింది గానమై 
వేణు గానమై నా ప్రాణమై
నా మది నిన్ను పిలిచింది గానమై 
వేణు గానమై నా ప్రాణమై

నా మది నిన్ను పిలిచింది గానమై 
వేణు గానమై నా ప్రాణమై

జీవన యమునా తరంగాలపైన 
మోహన మురళీ రాగాలలోన
జీవన యమునా తరంగాలపైన 
మోహన మురళీ రాగాలలోన
మన అనురాగమే పలికేను కాదా 
మన అనురాగమే పలికేను కాదా
మధురిమలొలికే నాధమై

నా మది నిన్ను పిలిచింది గానమై 
వేణు గానమై నా ప్రాణమై

సూర్య చంద్రులు వెలిగే దాక 
తరులు గిరులు నిలిచేదాకా
సూర్య చంద్రులు వెలిగే దాక 
తరులు గిరులు నిలిచేదాకా
మన అనుబంధమే నిలిచేను కాదా 
మన అనుబంధమే నిలిచేను కాదా
మరువగా రాని వేదమై

నా మది నిన్ను పిలిచింది గానమై 
వేణు గానమై నా ప్రాణమై

ఆ రఘురాముని పోలిక నీవై
అలనాటి జానకి కోరిక నీదై
ఆ రఘురాముని పోలిక నీవై
అలనాటి జానకి కోరిక నీదై
మన కలయికయే వెలిచేను కాదా 
మన కలయికయే వెలిచేను కాదా
ప్రణయ జగతికే తేజమై దివ్య తేజమై

నా మది నిన్ను పిలిచింది గానమై 
వేణు గానమై నా ప్రాణమై



గడసరి బుల్లోడు పాట సాహిత్యం

 
చిత్రం: ఆరాధన (1976)
సంగీతం: ఎస్.హనుమంతరావు
సాహిత్యం: దాశరధి 
గానం: యస్.జానకి

గడసరి బుల్లోడా !
సొగసరి సిన్నోడా !
ఉన్నది నా మనసు నీమీద ఆ హోయ్,
జంటగనాయెంట రారా !

మిసమిసలాడే నా వయసు నీదేరా !
ముసి ముసి నవ్వులు సాలించిరారా ! 

నా నడుము నీ సేతిలో
నలిగి పోవాలిరా
నీ రూపు నా కళ్ళలో నిలిసీ పోవాలిరా !
మనసులు కలిసి
మనువులు కుదిరీ
బతుకే పండగ కావాలిరా

నందకిశోరా ! బృందా విహారా !
రాధను మరిచేవా మాధవా !
నను నీ మురళిగా మలచుకోరా !
నీ పెదవులపై నిలుపుకోరా
రాగం...అనురాగమునె రాగముగా
నీలో నేనొక భాగముగా
పరవశించగా ఆలపించరా



నేడే తెలిసింది పాట సాహిత్యం

 
చిత్రం: ఆరాధన (1976)
సంగీతం: ఎస్.హనుమంతరావు
సాహిత్యం: డా.సి.నారాయణరెడ్డి
గానం: మహమ్మద్ రఫీ, యస్.జానకి

నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది
నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది
కమ్మనికళకే రూపంవస్తే
కమ్మనికళకే రూపంవస్తే
అది నీ లాగే ఉంటుందని

నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది
ఓ... నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది
నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది
తియ్యని పాటకు ప్రాణం వస్తే
తియ్యని పాటకు ప్రాణం వస్తే
అది నీ లాగే ఉంటుందని

నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది

ఇంత మంచి రూపానికి అంత మంచి మనసుంటుందనీ
ఇంత మంచి రూపానికి అంత మంచి మనసుంటుందనీ
ఆ మనసున అంతరాలకూ తావన్నది లేనేలేదనీ
ఆ మనసున అంతరాలకూ తావన్నది లేనేలేదనీ
అది వలచేదొకసారేనని  ఆ వలపే విడిపోలేనిదని

నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది

మారుమూల పల్లెలోనా మధురగానముదయించేనని
మారుమూల పల్లెలోనా మధురగానముదయించేనని
శిలలకైనా ఆ గానం పులకింతలు కలిగించేనని
శిలలకైనా ఆ గానం పులకింతలు కలిగించేనని
అది జతగా నను చేరాలని నా బ్రతుకే శృతి చేయాలని

నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది
కమ్మని కళకే రూపం వస్తే అది నీ లాగే ఉంటుందని
నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది
ఓ... తియ్యని పాటకు ప్రాణం వస్తే 
అది నీ లాగే ఉంటుందని

నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది
నేడే తెలిసింది ఈ నాడే తెలిసింది





లైలా మజ్ను పాట సాహిత్యం

 
చిత్రం: ఆరాధన (1976)
సంగీతం: ఎస్.హనుమంతరావు
సాహిత్యం: డా.సి.నారాయణరెడ్డి
గానం: మహమ్మద్ రఫీ, యస్.జానకి

లైలా... లైలా... లైలా...

నిరుపేద మనసునే మురిపించి నీవు
రతనాల మహలులో నిదురించినావా !

లైలా... లైలా...

బంగారు గూటిలో పడివున్న చిలుకను
పెదవి దాటగలేని ఒక మూగ పిలుపును

ఇకనైన ననుచేర రావా (2)
ఒక సారి నీ మోము తిలకింపనీవా !
ఇకనైన ననుచేర రావా

ఆ.. నీతోడ నడయాడలేను
నీ ప్రేమ ఏనాడు విడనాడలేను
నే విడనాడలేను!

లైలా...
ఖైస్...
లైలా...
ఖైస్...

అందని పండును కోరీ
అర్రుసాచే వెర్రివాడా
అంతటి లైలాను వలచే
అర్హత నీ కెక్కడిదిరా
బ్రతుకుమీద ఆశవుంటే
పారిపోరా యిప్పుడే యిప్పుడే

ప్రేమించిన వాడెవ్వడు
పిరికివాడు కాడు
అనురాగ ప్రవాహాన్ని
అడ్డగించలేడెవ్వడూ
ఎవ్వరెంత కాదన్నా
మా అనుబంధం శాశ్వతం
లైలాకే నా జీవితం
అలనాడే అంకింతం!!

ఏయ్
నోర్ముయ్ వదరుబోతా
పట్టండి......పట్టండి
కత్తుల బోనులో నిలబెట్టండి
నిలువెత్తు గోతిలో పాతిపెట్టండి !!

కత్తులు ఛేదింపలేవు
నిప్పులు దహియింపలేవు
స్వచ్ఛమైన ప్రేమను
ఏశక్తులూ బంధింపలేవు

అనురాగమన్నది - విడదీయలేనిది
అదివున్న మదిలోనే - ఆ దైవమున్నది
ఆ దైవమున్నది

కులముతో పనిలేనిది
ధనముతో కొనలేనది
కులముతో పనిలేనిది
ధనముతో కొనలేనది
దేవుడిచ్చిన వరమది
మనిషి ఎన్నడు మాపలేనిది

అనురాగమన్నది - విడదీయలేనిది
అదివున్న మదిలోనే - ఆ దైవమున్నది
ఆ దైవమున్నది

విరబూసే పూలలో మా
చిరునవ్వులే ఉంటాయి
కదిలే చిరుగాలిలో మా 
కనుల బాసలుంటాయి
పొంగే కెరటాలలో మా
వలపు పొంగులుంటాయి
కలిసే మేఘాలలో మా
కన్నీటి ధారలే వుంటాయి

ఐనా

నేల ఉన్నంతకాలం
గాలి ఉన్నంతకాలం
నింగి ఉన్నంతకాలం
నీరు ఉన్నంతకాలం
వెలుతురున్నంతకాలం

కాలమున్నంతకాలం
ధర్మమున్నంతకాలం
దైవమున్నంతకాలం
ఇలలోన మిగిలేను
ఈ విషాద గాధా !!

ఓహో - ప్రియతమా ! ప్రియతమా !
నా పిలుపే వినలేవా
నీ చెలినే కనరావా
ఎందున్నావో - ఏమైనావో !
ఎందున్నావో - ఏమైనావో !

ప్రహరీలు దాటి - పహరాలు దాటి
పయనించి నే వచ్చినాను
ప్రళయమ్ముగాని - మరణమ్ముగాని
నిను వీడి నే నిలువలేను

ఎందున్నావో - ఏమైనా వో ! 

ఇక్కడే వున్నాను ఎక్కడికీ పోలేను
కడవూపిరితో నీకై కలవరించినాను
కన్నుమూసినా నీకై వేచి వేచి వుంటాను
వేచి వేచి వుంటాను వేచి వేచి వుంటాను

నీవులేని ఈ లోకం నరకం
నీవున్నచోటే నా స్వర్గం
నిన్నే కలుసుకోనీ
నీలో కలిసిపోనీ కలిసిపోనీ

కాలమున్నంతకాలం
ధర్మమున్నంతకాలం
దైవమున్నంతకాలం
ఇలలోన మిగిలేను
మా ప్రేమగాధ
ఈ అమరగాధ !!!




నీకేల ఇంత నిరాశ పాట సాహిత్యం

 
చిత్రం: ఆరాధన (1976)
సంగీతం: ఎస్.హనుమంతరావు
సాహిత్యం: దాశరధి 
గానం: యస్.జానకి

నీకేలా యింత నిరాశా
నీ కన్నులు కన్నీరేలా
అంతా దేవుని లీలా
ఆశ నిరాశల దాగుడు మూతల
ఆటేలే ఈ లోకం
ఆటేలే ఈ లోకం

కష్టసుఖాలా కలయికలోనే
ఉన్నదిలే మాధుర్యం
జీవిత మాధుర్యం
చీకటి కొంతా, వెలుతురు కొంతా
ఇంతే జీవితమంతా

నీ మదిలోని వేదనలన్నీ
నిలువవులే కలకాలం
నిలువవులే కలకాలం

వాడిన మోడు పూయకమానదు
వచ్చును వసంతకాలం
వచ్చును వసంతకాలం

నీతో కలసీ నీడగ నడిచే
తోడుగ నేనున్నాను....
తోడుగ నేనున్నాను




నీకేల ఇంత నిరాశ పాట సాహిత్యం

 
చిత్రం: ఆరాధన (1976)
సంగీతం: ఎస్.హనుమంతరావు
సాహిత్యం: దాశరధి 
గానం: మహమ్మద్ రఫీ

చిత్రం: ఆరాధన (1976)
సంగీతం: ఎస్.హనుమంతరావు
సాహిత్యం: దాశరధి 
గానం: మహమ్మద్ రఫీ

నీకేలా యింత నిరాశా
నీ మదిలోని వేదనలన్నీ
విలువవులే కలకాలం
నిలవవులే కలకాలం

ఆశ నిరాశాల దాగుడుమూతల
ఆటేలే ఈ లోకం
ఆటేలే ఈ లోకం
చీకటి కొంతా, వెలుతురు కొంతా
ఇంతే జీవితమంతా

నీకేలా యింత నిరాశా
నీ కేలా యింత నిరాశా
నీకేలా యింత నిరాశా




ఓ ప్రియతమా... పాట సాహిత్యం

 
చిత్రం: ఆరాధన (1976)
సంగీతం: ఎస్. హనుమంత రావు
సాహిత్యం: డా. సి. నారాయణ రెడ్డి
గానం: మహమ్మద్ రఫీ

ఓ ప్రియతమా... ప్రియతమా... ప్రియతమా...

నా మది నిన్ను పిలిచింది గానమై 
వేణు గానమై నా ప్రాణమై
నా మది నిన్ను పిలిచింది గానమై 
వేణు గానమై నా ప్రాణమై

ఎవ్వరివో నీవు నేనెరుగలేను
ఏ పేరున నిన్ను నే పిలవగలనూ
ఎవ్వరివో నీవు నేనెరుగలేను
ఏ పేరున నిన్ను నే పిలవగలనూ
తలపులలోనే నిలిచేవు నీవే 
తలపులలోనే నిలిచేవు నీవే
తొలకరి మెరుపుల రూపమై

నా మది నిన్ను పిలిచింది గానమై 
వేణు గానమై నా ప్రాణమై

ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను 
ఈ మూగ బాధా ఎందాకా దాచేను
ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను 
ఈ మూగ బాధా ఎందాకా దాచేను
వేచిన మదినే వెలిగింప రావే 
వేచిన మదినే వెలిగింప రావే
ఆరని అనురాగ దీపమై

నా మది నిన్ను పిలిచింది గానమై 
వేణు గానమై నా ప్రాణమై
నా మది నిన్ను పిలిచింది గానమై 
వేణు గానమై నా ప్రాణమై


Most Recent

Default