చిత్రం: మాపల్లెలో గోపాలుడు (1985)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సి.నారాయణరెడ్డి
గానం: యస్. పి.బాలు, పి. సుశీల
నటీనటులు: అర్జున్ , పూర్ణిమ జయరామ్
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: యస్. గోపాల్ రెడ్డి
విడుదల తేది: 07.10.1985
రాణి రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా
రాణి రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా
నీ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని
ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మా
రాణి రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా
రతనాల మేడలోన నిన్నొక రాణిగ చూడాలని
నీ అడుగులు కందకుండా నా అరిచేతులు ఉంచాలని
రతనాల మేడలోన నిన్నొక రాణిగ చూడాలని
నీ అడుగులు కందకుండా నా అరిచేతులు ఉంచాలని
ఎంతగా అనుకున్నాను... ఏమిటి చూస్తున్నాను...
ఎంతగా అనుకున్నాను ఏమిటి చూస్తున్నాను
పన్నీటి బతుకులోన కన్నీటి మంటలేన
రాణి రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా
నీ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని
ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మా
రాణి రాణమ్మ రాణి కన్నీళ్లు రానీయమ్మా
రాణి రాణమ్మ రాణి కన్నీళ్లు రానీయమ్మా
సహనం తీపి కవచమని శాంతం అందుకు సాక్ష్యమని
సహనం తీపి కవచమని శాంతం అందుకు సాక్ష్యమని
ఉన్నాను మౌనంగా కన్నులు దాటని కన్నీరుగా
రాణి రాణమ్మ రాణి కన్నీళ్లు రానీయమ్మా
గుండె రగిలిపోతూవుంటే గూడు మేడ ఒకటేలే
రాళ్ళు బడ్డ బావిపోతే ముళ్ళు పూలు ఒకటేలే
ఎదురుగా పొంగే సంద్రం... ఎక్కడో ఆవలి తీరం...
ఎదురుగా పొంగే సంద్రం ఎక్కడో ఆవలి తీరం
ఎదురీత ఆగదులే విధిరాత తప్పదులే
రాణి రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా
నీ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని
ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మా
రాణి రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా