Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Racha (2012)





చిత్రం: రచ్చ (2012)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: రాంచరణ్, తమన్నా
దర్శకత్వం: సంపత్ నంది
నిర్మాత: ఆర్.బి.చౌదరి
విడుదల తేది: 05.04.2012



Songs List:



రచ్చ పాట సాహిత్యం

 
చిత్రం: రచ్చ (2012)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: దీపు, పృద్వి చంద్ర

సైలెంటు చుపులోడు  వైలెంట్  చేతలోడు
కర్రెంటు కండలోడు
సైలెంటు  చూపులోడు వైలెంట్ చేతలోడు
కర్రెంటు  కండలోడు
కరక్కు  చై  వీడు  చిరుత ...
హి ఈజ్ ద మిస్టర్ తీస్మార్ ఖాన్ రచ్చ
అరే  దేఖ్ ధనాధన్  ధక్  ధక్  ధూమ్ ధామ్  రచ్చ
హి ఈజ్ ద మిస్టర్ తీస్మార్ ఖాన్ రచ్చ
అడుగేస్తే  సీడేడ్ ఆంధ్ర  నైజాం  రచ్చ

అరేయ్  కుర్రగాడు  సూడ బొతేయ్ గచ్చ
వీడి  లచ్చనాలు చూడ బొతేయ్  లచ్చ
వీడు  రేచిపోతేయ్  కచ్చితంగా  రచ్చ…

He is Gonna be a Megastar
He is Gonna be a GigaStar
Yuga Yuga Yugastar
Pagalu Ratri Yegasey Blaster..
హి ఈజ్ ద మిస్టర్ తీస్మార్ ఖాన్ రచ్చ
అరే  దేఖ్ ధనాధన్  ధక్  ధక్  ధూమ్ ధామ్  రచ్చ
హి ఈజ్ ద మిస్టర్ తీస్మార్ ఖాన్ రచ్చ
అడుగేస్తే  సీడేడ్ ఆంధ్ర  నైజాం  రచ్చ

నేనే నా బాటేదో చూస్తా  నేనే నా పోటికి  వస్తా
నేనే నా దిష్టంత తీస్తా రచ్చ రచ్చ  రచ్చ  రచ్చ
నేనే నా భారాన్ని మోస్తా నేనే నా కాలాన్ని  తోస్త
నేనే నా చరిత్ర  రాస్తా రచ్చ రచ్చ రచ్చ రచ్చ రేయ్
సంద్రమే నాలో ఉంటుంది  సిఖరమే  నా కిందుంటుంది
గమ్యమే నా వెనకే వస్తుంది  ధీ  ధీ  ధీ ...
అరేయ్  పట్టుకుందే  ఈడికేదో పిచ్చ
అది  పిచ్చి  కాదు అర్థమైతే  అచ్చ
వీడి పట్టుదల రాజుకుంటే  రచ్చ...

He is Gonna be a Google Star
He is Gonna be a Global Star
Vigo Vigo Vigo Star వీడి  బలుపె  వీడికి  బూస్టర్ ..
హి ఈజ్ ద మిస్టర్ తీస్మార్ ఖాన్ రచ్చ
అరే  దేఖ్ ధనాధన్  ధక్ ధక్ ధూమ్ ధామ్  రచ్చ

ఈల కొట్టి డోల కొట్టి డప్పు కొట్టి దంచ్చి కొట్టి
రచ్చ  రచ్చ హే రచ్చ  రచ్చ
గోల పెట్టి లొల్లి పెట్టి కేక పెట్టి కూత పెట్టి
రచ్చ  రచ్చ హే రచ్చ రచ్చ

Bailo se Meri Jaana Baldero
Tho Meri Dana Dana
See Racha He is a Sexy Star..
Dekho Se Hanahana Jamaico
Le Dikthara See Racha To The HandSome Star..

గెలుపే  నర నరాల్లో ఆస గెలుపే నవ నాడుల్లో  బాష
గెలుపే నా రక్తంలో గోషా రచ్చ రచ్చ రచ్చ రచ్చ
గెలుపే నా మాటల్లో యాస  గెలుపే నా పాటల్లో బాస
గెలుపే నా ప్రపంచ వీసా రచ్చ రచ్చ రచ్చ  రచ్చ హే
జీవమే మా నాన్నిచాడు జీవితం అది  మీరిచ్చారు
గెలవడం తను నాకే  నేర్పాడు డు డు
వీడి  మాటలోన లేదు లేదు  మచ్చ
వీడి  ముందు ఇంకా ఎవ్వడైన బచ్చా
వీడు  తలుచుకుంటే ఎక్కడైన రచ్చ…

He is Gonna be a Stunning Star
He is Gonna be a Spinning Star
Only One Winning Star
యువతి యువకుల ఎదలో పోస్టర్
హి ఈజ్ ద మిస్టర్ తీస్మార్ ఖాన్ రచ్చ
అరే దేఖ్ ధనాధన్ ధక్ ధక్ ధూమ్ ధామ్  రచ్చ




వాన వాన వెల్లువాయే పాట సాహిత్యం

 
చిత్రం: రచ్చ (2012)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువన చంద్ర
గానం:  రాహుల్ నంబియార్ , చైత్ర 


వాన వాన వెల్లువాయే




డిల్లకు డిల్లకు డిల్లా పాట సాహిత్యం

 
చిత్రం: రచ్చ (2012)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చిన్ని చరణ్
గానం: టిప్పు, గీతామాధురి

డిల్లకు డిల్లకు డిల్లా డిల్లా డిల్లా
డిల్లకు డిల్లకు డిల్లా డిల్లా డిల్లా

డిల్లకు డిల్లకు డిల్లకు డిల్లా డిల్లకు డిల్లకు డిల్లా
డిల్లకు డిల్లకు డిల్లకు డిల్లా డిల్లకు డిల్లకు డిల్లా
హే మిలుకు మిలుకు సిలకా నీ మీఠా పెదవే కొరకా
డిల్లకు డిల్లకు డిల్లకు డిల్లా డిల్లకు చేయ్యకే పిల్లా
మిలుకు మిలుకు సిలకా నీ మీఠా పెదవే కొరకా
కొణిదెల వారి కొడుకా నీకపుడే అంతంటి దుడుకా
ఏమైందో నిను చూసాకా ఎగిరిందే మనసే ఇనక
అయ్యబాబోయి వెనకే పడక కొంచమాగర కొత్త పెళ్ళికొడకా
హే తెల్ల తెల్ల తెల్ల తెల్ల తెల్ల కోడి పిల్లా
నువ్వు తల్లాడిల్లి తల్లవుతావే తెల్లవారెకల్లా
ఎల్లా ఎల్లా ఎల్లా నీ వల్ల కాదు ఎల్లా
నీ గల్లీ లొల్లి చెల్లదురో ఇది ట్యూనా చేప పిల్లా

మిలుకు మిలుకు సిలకా నీ మీఠా పెదవే కొరకా
కొణిదెల వారి కొడుకా నీకపుడే అంతంటి దుడుకా

ఎలలో ఎలలో ఎలలేమా ఎలలేమా ఏ ఎలలేమా
ఎలలో ఎలలో ఎలలేమా ఎలలేలేమా

రోటి కపడా లైఫే నీది
Rolls Royce రేంజే నాది
నీకు నాకు ప్యారంటే పరిహాసం రా చిన్నా
వంద టన్నుల పవరే ఉన్నా
ఒంపు సొంపుల శిల్పం నువ్వా
రిస్క్ లేని ఇష్క్ంటే థ్రిల్ల్ ఉండదు నాకైనా
ఏ సొగసైనా సరి తూగేనా ఎవరెస్టుని నేనేగా
నే చిటికేస్తే దిగి వస్తారే ఏంజెల్సే ఏకంగా
హే తెల్ల తెల్ల తెల్ల తెల్ల తెల్ల కోడి పిల్లా
నువ్వు తల్లాడిల్లి తల్లవుతావే తెల్లవారెకల్లా
ఎల్లా ఎల్లా ఎల్లా నీ వల్ల కాదు ఎల్లా
నీ గల్లీ లొల్లి చెల్లదురో ఇది ట్యూనా చేప పిల్లా

చింగుతాంగు చింగుతాంగు చనక్ చనక్
నీ పాలరాతి నవ్వులన్నీ హాంఫట్టు
అంతవరకు వెల్లిపోకు అందదయ్యో ఈ సరుకు
Brad Pitt లా Body పెంచి HipHop స్టెప్పులు నేర్చి
Rich పోరికి స్కెట్చే వేస్తే Reach అవ్వలేవంటా
కోరుకున్నది దొరికేదాక స్పీడు బ్రేకరు లేదే ఇంక
గోల్ ఎపుడూ మిస్సవదే నే గేలం వేసాక
పాగల్ హై క్యా యమ క్రేజీగా నువ్వు చేయకు భేజా ఫ్రై
ఏదేమైనా ఏం జాతకమే నే పడ్డా నీవెనకా

హే తెల్ల తెల్ల తెల్ల తెల్ల తెల్ల కోడి పిల్లా
నువ్వు తల్లాడిల్లి తల్లవుతావే తెల్లవారెకల్లా
ఎల్లా ఎల్లా ఎల్లా నీ వల్ల కాదు ఎల్లా
నీ గల్లీ లొల్లి చెల్లదురో ఇది ట్యూనా చేప పిల్లా




ఒక పాదం మోపగలిగే చోటే చాలే పాట సాహిత్యం

 
చిత్రం: రచ్చ (2012)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: హేమచంద్ర, మాళవిక

ఒక పాదం మోపగలిగే చోటే చాలే
ఒకరోజు జీవితాన్నే గడుపుదామే
ఒక పాదం మోపగలిగే చోటే చాలే
ఒకరోజు జీవితాన్నే గడుపుదామే
ఓ తమన్నా
యు ఆర్ యు ఆర్ యు ఆర్ మై దిల్ కి తమన్నా
ఓ తమన్నా
యు ఆర్ యు ఆర్ యు ఆర్ మై దిల్ కి తమన్నా
హేనా హేనా హో నీ కురులే కుర్కురే లేనా
హేనా హేనా హో నీ పాదం కేడ్బరీ ఏనా
హేనా హేనా ఈ నేలకు జారిన రెయిన్బో నువ్వేనా

నువ్వే నారేయి పగల్ నువ్వే నా హాయి దిగుల్
కాదల్లే గుండెల్లో చేరావే చూస్తూనే శ్వాసలకే సంకెల్లే వేసావే
నువ్వే నే కన్న కలల్ నువ్వే నాకున్న సిరుల్
మెరుపల్లే చినుకల్లే కలిసావే
వస్తూనే మబ్బల్లే ముసురల్లే కమ్మావే
సరికొత్తగ జన్మిస్తున్నా నిలువెత్తుగ జత కడుతున్నా
నీ నీడల్లోనే వెలుగై వస్తున్నా
హేనా హేనా హో వన్ డే నీ వెంటే కాన
హేనా హేనా హో వండర్లే చూపించేనా
హేనా హేనా వందేళ్ళకు సరిపడా సరదా అందియనా

ఒకటే ఆ ఆకాశం ఒకటే ఈ అవకాశం
పక్షులకే రెక్కలనే తొడగాలే
మెరిసేటి చుక్కలకే చుక్కలనే చూపాలే
ఒకటే ఈ సంతోషం ఒకటే మన సందేశం
ఈ పువ్వలకే రంగులనే పంచాలే
సెలయేటి పరుగులకే పరుగులనే పెంచాలే
అరెరరెరె హరివిల్లైనా అరెరరెరె సిరి జల్లైనా
మన ఆనందానికి ఆనందించేనా
హేనా హేనా హో వన్ డే  నీ వెంటే కాన
హేనా హేనా హో వండర్లే చూపించేనా
హేనా హేనా వందేళ్ళకు సరిపడ గుర్తులు నిలిపేనా




సింగరేణుంది బొగ్గే నిండింది పాట సాహిత్యం

 
చిత్రం: రచ్చ (2012)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: సాహితి, సుఖ్వింధర్ సింగ్

సింగరేణుంది బొగ్గే నిండింది
పోలవరం ఉంది పొలమే పండింది
కోనసీమ ఉంది కోకే కట్టింది
కన్నెపిల్ల ఉంది కన్నే చెదిరింది
చెయ్యేదో చెయ్యాలంది కాలేదో వెయ్యాలంది
గజ్జెల పట్టీలు తేరా నా చెర్రీ చెర్రీ
నా కన్నె వయసు తీర్చమంది వర్రీ వర్రీ
గజ్జెల పట్టీలు తెస్తాడే చెర్రీ చెర్రీ
నువ్వడిగిందే ఇస్తా డోంట్ వర్రీ వర్రీ

పండ్ల తోట ఉంది పండు తెంపలేదు
చింత చిగురు ఉంది పులుపు చూడలేదు
పాల ముంత ఉంది జున్ను తీయలేదు
కుర్ర కాంత ఉంది కౌగిలింత లేదు
హే పెదవేదో పెట్టాలంది నడుమేదో పట్టాలంది
పాపిటబిల్ల తేరా నా చెర్రీ చెర్రీ
పల్లకిలో వస్తా డోంట్ వర్రీ వర్రీ
ఏడు గుర్రాలెక్కొస్తా పోరీ పోరీ
ఏస్కుపోతా నిన్ను డోంట్ వర్రీ వర్రీ

పట్టెమంచముంది పక్క ఎక్కలేదు
పాల గ్లాసు ఉంది ఎంగిలి కాలేదు
అంత ఎదురగుంది అర్ధమైతలేదు
మేడ మిద్దె ఉంది ముచ్చటైతే లేదు
హే దర్వాజా ముయ్యాలంది తర్బూజా ఇయ్యాలంది
వెండి మట్టెల్ తేరా నా చెర్రీ చెర్రీ
వెంట పడి వస్తా డోంట్ వర్రీ వర్రీ
పుస్తెలతాడు తెస్తానే పోరీ పోరీ
పస్తు ఇంక లేదు డోంట్ వర్రీ వర్రీ

సింగరేణుంది బొగ్గే నిండింది
పోలవరం ఉంది పొలమే పండింది
కోనసీమ ఉంది కోకే కట్టింది
కన్నెపిల్ల ఉంది కన్నే చెదిరింది
చెయ్యేదో చెయ్యాలంది కాలేదో వెయ్యాలంది
గజ్జెల పట్టీలు తేరా నా చెర్రీ చెర్రీ
నా కన్నె వయసు తీర్చమంది వర్రీ వర్రీ
గజ్జెల పట్టీలు తెస్తాడే చెర్రీ చెర్రీ
నువ్వడిగిందే ఇస్తా డోంట్ వర్రీ వర్రీ

Most Recent

Default