చిత్రం: సత్యానికి సంకెళ్ళు (1974)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: కృష్ణ, వాణిశ్రీ
దర్శకత్వం: కె.యస్.ప్రకాశరావు
నిర్మాతలు: పి.రామకృష్ణారావు, ఆర్.ఏకాంబరం
విడుదల తేది: 06.11.1974
Songs List:
ఈ లోకంలో మనిషికి మనిషే తోడు పాట సాహిత్యం
చిత్రం: సత్యానికి సంకెళ్ళు (1974)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, శ్రీ శ్రీ
గానం: యస్. పి. బాలు, వాణిశ్రీ
ఈ లోకంలో మనిషికి మనిషే తోడు
భూలోకంలో మనకందరికి ఒకటే వీడు
నవ్వేవాళ్ళను జూసి ఏడవరాదు
ఏడ్చేవాళ్ళను చూసి నవ్వగరాదు
కాటికెళ్ళితే అందరు ఒకటే అనుకోబోకూ
అడకూడా తేడాలున్నాయి కాలేవరకు
చీకటిపడితే లోకం మొత్తం నిదురపోతుంది.
చిరుగు గుడిసెలో ఆకలిమాత్రం చిందులు వేస్తుంది.
పనిదొరకని పేదవాణ్ణి సోమరిపోతంటారు
పనిచెయ్యని గొప్పవాణ్ణి పల్లకిలో మోస్తారు
అరిగించుకునేవాడికి అన్నంలేదు.
అరగనివాళ్లకి మాత్రం అన్నీ ఉన్నాయీ
పెద్ద మనిషి చేస్తే అది రంగేళీ శృంగారం
పేదవాడు చేస్తే అది రంగేళీ వ్యభిచారం
లేనివాడు చేస్తే అది దొంగతనం కిందజమ
ఉన్నవాడు చేస్తే అది దేశభ క్తి పరిశ్రమ
అబద్దానికి నోరు పెద్దది అరుస్తూ ఉంటుంది.
సత్యానికి గుండె గట్టిది చావదూ ఎన్నటికి
నిప్పు గొప్పలుపోయి నీళ్ళనే కాస్తుంది.
ఆ నీళ్లే పొంగి పొంగి నిప్పు నార్పేస్తుంది
నీకూ నీవారులేరు పాట సాహిత్యం
చిత్రం: సత్యానికి సంకెళ్ళు (1974)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్. పి. బాలు
పల్లవి:
నీకూ నీవారులేరు నాకూ నావారులేరు ఏమంటావ్ ?
నీకు నేను - నాకు నువ్వే ఉందామా_ ఉందామా
చరణం : 1
సుక్కల్లా సీరగట్టి - సక్కగా కొప్పుపెట్టి
టిక్కుటిక్కు టిక్కుటక్కని నడిసెల్తన్నావే
పక్క సూపు సూడనంటావ్ పలకనైనా పలకనంటావ్
సెప్పిపోవే చిన్నదానా - ఎక్కడుంటావ్…నువ్వెక్కడుంటావ్
చరణం : 2
ఒళ్ళేన వాడలేదు - పెళ్లైన జాడలేదు
కళ్ళు రెండూ సేపలల్లే - తుళ్ళితుళ్ళి పడుతున్నాయ్
సేపలాగే జారుకుంటావ్ సిక్కమేస్తే సిక్కనంటావ్
సెప్పిపోవే కన్నెపిల్ల - ఎక్కడుంటావ్-నువ్వెప్పుడుంటావ్
చరణం: 3
రేతిరంతా కల్లోకొచ్చి రెచ్చగొట్టి పోతుంటావ్
రోజురోజు నీకె నేను రోడువెంట పడుతుంటాను
ఎంతకాలం ఎతుకులాట ఎందుకే యీ గంతలాట.
సెప్పిపోవే మరదలుపిల్లా ఎప్పుడొస్తావ్ మల్లెప్పుడొస్తావ్
ఎప్పుడంటావ్ - పెళ్లెప్పుడంటావ్
నీకూ నీవారులేరు (Duet) పాట సాహిత్యం
చిత్రం: సత్యానికి సంకెళ్ళు (1974)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: యస్. పి. బాలు, పి. సుశీల
నీకూ నీవారులేరు నాకూ నావారు లేరు
ఆసరాగా నాకు దొరికావు నా ఆశలన్నీ నిజం చేసావు
చరణం :
దారిలోన గడిపువ్వు - నలిగిపోయేవేళ నువ్వు
మల్లెపువ్వుగ మార్చివేశావు - నీ మనసులోనే దాచివేశావు
చరణం
రిక్షాకే రెక్కలొచ్చి - నక్షత్ర యాత్ర చేస్తే
పక్షులే మనపాట వింటాయి మబ్బులే తోరణాలు కడతాయి ॥ నీకూ॥
చరణం :
కప్పులేని ఇంటిలోన - గడపలేని పడక గదిలో
చందమామ తొంగి చూస్తాడు - తన అందమంతా వలకబోస్తాడు ॥నీకూ॥
లేనిదాన్ని నేను పాట సాహిత్యం
చిత్రం: సత్యానికి సంకెళ్ళు (1974)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్. జానకి
సాకీ : లేనిదాన్ని నేను - నాదనేది లేనిదాన్ని నేను లేదనేది లేనిదాన్ని నేను ॥లేనిదాన్ని॥
చరణం : సందెవేళ అందగాడు సరసమాడ వచ్చినాడు చెక్కిలంతా చిదిమి చిదిమి
చరణం: సందెవేళ అందగాడు సరసమాడ వచ్చినాడు
చేక్కిలంతా చిదిమి చిదిమి అక్కున నన్నదిమి అదిమి
సాకీ :
అప్పు డడిగాడు-ఇంతీ-ఎంత వయసెంతని? లేనిదాన్ని వయసనేదే లేనిదాన్ని
చరణం :
ఆకువక్క పంటనొక్కి అందుకొమ్మని వెంటచేరి మట్టుచెయ్యి వేసి నన్ను పట్టబోయి దొరకకుంటే
సాకీ :
అప్పుడడిగాడు-అతివా-ఎక్కడ నడుమె క్కడనీ లేనిదాన్ని నడుమనేదే లేనిదాన్ని
జిత్తులమారి నక్కరా పాట సాహిత్యం
చిత్రం: సత్యానికి సంకెళ్ళు (1974)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: రాజబాబు, రమాప్రభ
అప్పా: భళి భళి
భళానోయి భాయి తమ్ముడా-సై మేల్ భశానోయి దాదానా
లక్ష్మీ : జిత్తులమారి నక్కరా
దాని యెత్తులు తెలిసిపోయెరా-సై
కొత్తగా రంగు మార్చెరా… సై
కోతలు ఎన్నో కోసెరా-సై
తదికిట తకిట తా-
అప్పా : ఆగాగు! నక్కలంటున్నావు - రంగులంటున్నావు
మార్చటమంటున్నావు - అది ఏంటమ్మా ?
మాణి : అదేరా పెదోళ్ళు-మార్చటంలా అట్లాగే
అప్పా : పేదోళ్ళు- ఎవరమ్మా వాళ్ళు- ఓ ఓ మన నాయకులా
లక్ష్మీ: ఔ
అప్పా : అవును ఎట్లా మార్చిందమ్మా?
లక్ష్మీ: అదే వినరా పేదోడ వినరా బక్కోడ
విజయము మనదేరా తందానతాన
చెబుతా వినరా నక్కయ్యగారి చిదంబరం గుట్టు తందానతాన
తదికిట ఝం తది తా
లక్ష్మి: పట్టపగలు దోపిడీకి తన గుట్టు తెలిస్తే కష్టమని
అప్పా : అహ
లక్ష్మి : పట్టుపడకుండ రంగేదయినా పైకి పూయాలనుకుంది
అద్దకాల కొట్టుకువెళ్ళి అటుఇటు చూసింది ॥తందాన॥
తడికిట ఝం తది తా
కొత్తగవుంది నీలిరంగని గబుక్కున మునిగింది ॥తందాన॥
తడికిట ఝం తది తా
లేచి చూచుకొని బలెబలే యిక ఎదురులేదు నాకు ॥తందాన॥
రంగుమారినది ఐదేళ్ళయినా రాజ్యమేలవచ్చు
తా- తకిట తక తకిట తడికిట తా
అనుకుని నడచిందయ్యా అడవికి నక్కయ్యా ॥తందాన ॥
అప్పా : ఉండుండుండు. అయిదు పేర్లా అయిదు ఏళ్లా ?
మాణి : చెప్పేది అయిదు వేళ్ళ సిదాంతం దాన్ని తప్పించుకు తిరిగేది అయిదేళ్ళ కాలం
అప్పా : అదిసరే యింతకీ ఆ నక్క అడవికెందుకెళ్లింది ?
అక్క డేముంటుందని దానిబొంద
లక్ష్మి : అడవంటే ఏమనుకున్నావు ? అక్కడేగా మనలాంటి నోరు వాయిలేని మూగజీవాలుండేది
అప్పా ! అలాగా అయితే సప్పున నే నక్కడికి వెళ్ళిపోతాను
లక్ష్మి : అయ్యో అన్నల్లారా తమ్ముల్లారా ఆకలి తీరని కడుపుల్లారా
అన్నెం పున్నెం ఎరుగక మీరు అగచాట్లు పడుతున్నారా
॥తందాన॥
నడిపే నాయకుడెవడూ లేక తడబడుతున్నారా
॥తందాన॥
అయ్యో… తడికిట ఝం తడి తా
ఆయ్ దేవుడు నన్ను పంపాడు
మీ సేవలు చేయమన్నాడు
తా తకిట తక తడికిట తడికిట తా
అప్పా : ఆఁ- ఆ తరవాత
లక్ష్మి : ఆ తరువాత
అరరరదె చెట్టులుకొట్టి పుంలుకొట్టి ఇళ్లే కట్టాకా ॥భశాభళి॥
దిగంబరంగా ఉన్న మీకు నే బట్టలు కుట్టిస్తా ॥భశాభళి॥
ఆకులలములు మేసే మీకు అన్నం తినిపిస్తా ॥భశాభళి॥
అందలం ఎక్కిస్తా ఆరచేతిలో వైకుంఠం చూపిస్తా
అప్పా :అయ్యో పిస్తా పిస్తా అంటున్నావేమిటి ?
మా కోస్తానరకు రాదుకదా యీ పిస్తా
లక్ష్మి : అది అడవిలో వున్న మూగజీవాలన్నంటిని నమ్మించింది.
కాని ఒక నక్కకు మాత్రం అనుమానం వేసింది
అప్పా : అంతేకదా నక్కజిత్తులు నక్కకే తెలుస్తాయి
తెలిసేంచేసింది ఐక్కలాంటి ఆ సక్క
ಲಕ್ಷ್ಮಿ : అరసిందయ్యా ఆ నక్క
ఆ అరుపును పెన్న ఈ నక్క అలాగే తానూ అరిసింది. అసలుబుద్ధి తెలిసింది
అప్పా : నక్కలాగా అరిసి వెంటనే ఆ మూగజీవాలన్నీ ఏంచేశాయమ్మా
ಲಕ್ಷ್ಮಿ: మోసం మోసం మోసం అంటూ ముందుకువచ్చాయి ॥ భళాభళి॥
వేషం వేషం వేషం అంటూ విరుచుకు పడ్డాయి. భళాభళి॥
చిత్తుచిత్తుగా తన్నాయి చితగ్గొటి మరి తరిమాయి
అప్పా , మాణి: భళానోయి భాయి తమ్ముడా సై మేల్ భళనోయి దాదానా
అవును కథ బాగానే వుంది. కానీ ఇంతకీ నువ్వు చెప్పొచ్చే దేమిటి ?
లక్ష్మి : నక్కలాంటి మనుషులున్నారు రంగుపూసు కొస్తారు సమ్మకండి- నమ్మితే గొంతు కోస్తారు
అప్పా : అమ్మో- అందుకని అందరు బోర్డులు మార్చండి
కుక్కలున్నాయి జాగ్రత్తకాదు - నక్కలున్నాయి జాగ్రత్త
నక్కలున్నాయి జాగ్రత్త నక్కలున్నాయి జాగ్రత్త-
రా... రా...రాత్రివేళ పాట సాహిత్యం
చిత్రం: సత్యానికి సంకెళ్ళు (1974)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యల్. ఆర్. ఈశ్వరి
పల్లవి: రా... రా...
రాత్రివేళ మంచిది నెత్తురుడికే జామిది
నీలో మనసు చూసే చిన్నది నీకై వగలు సెగలౌతున్నది
చరణం :
మల్లెలాంటి మనసు నీది
కన్నులెందుకో ఎర్రబడినవి
కై పనాలా_అది కచ్చనాలా_మత్తనాల_మంటనాలా
కై సనాలా- అది, రెచ్చిపోయిన కచ్చనాలా
మత్తనాలా- వలపు రేపిన మంటనాలా
॥రాత్రి వేళ ||
చరణం :
వగలు తీరని పడుచు కోరిక
పడగ ఎత్తి ఆడుతున్నది.
రేపురాదు నీ పౌరుషాన్ని ఆపరాదు
తీర్చుకో రా నీ వేడినిప్పుడే ఆర్చుకోరా
||రాత్రి వేళ||
అరె మేరె బచ్ఛా - పాట సాహిత్యం
చిత్రం: సత్యానికి సంకెళ్ళు (1974)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: కొసరాజు
గానం: బాలసుబ్రహ్మణ్యం
ఆ బేటా - ఆ సత్యం
అరె మేరె బచ్ఛా - జౌ జారె బడా లుచ్ఛా
నీకు నాకు లడాయి హాపరా నీ బడాయి
మామూల్ గూర్గాగాదని హనుకున్నావా
మె తమెత్తగా హుంటే నె తికెక్కావా- బేటా
ది సీ మే సవ్వాల్ నా సంగతెరగరా
సం షేర్ నీ గుండెల్లో నిదరపోతారా ॥ఆరె మేరె బచ్ఛా॥
తోక తొక్కిన కోడెత్రాసు హేంచేస్తాది
కస్సుమని పడ్డవిప్పి కాచేస్తాది.
జబ్బచరిచి గుండెల్లో కుమ్మి పోతాడు ॥ఆరె మేరె బచ్చా॥
దెబ్బతిన్న మొనగాడు హేంచేస్తాడు.
చావుమూడి నాతో పగ తెచ్చుకున్నావు
తలకిందే కొరివి తెచ్చి పెటుకున్నావు.
దెబ్బకు దెబ్బాతీస్గా చూచుకోరా
నీ యబ్బతోటి చెప్పుకో కాచుకోరా ॥ఆరె మేరె బచ్ఛా॥
కళులేని అంధురాలు పాట సాహిత్యం
చిత్రం: సత్యానికి సంకెళ్ళు (1974)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: శ్రీశ్రీ
గానం: బాలసుబ్రహ్మణ్యం, సుశీల
ఆమె :
కళులేని అంధురాలు కళ్లుమూసి వెళ్ళింది
కణ్ణన్న అంధులారా తెరవండి కళ్ళంది.
అతడు :
కళ్లువున్న అంధులార ఐకమత్య హీనులార
ఇప్పుడై న కలిసిరండి నిజంకొరకు నిలబడండి
పల్లవి : అంతా ఒకటె పోరాడాలి అన్యాయాలనే హతమార్చాలి
ఆమె :
గుడిసె కాలినపుడై నా కడుపుమండినపుడై నా
పొరుగువాణి పురుగులాగ చూశారు
మనకెందుకు అని కన్నులు మూశారు
అతడు :
ఎందుకిలా ఉన్నామో ఎవరిందుకు కారణమో ఇపుడైనా తెలిసిందా
మనచేత కూనీలు మనచేత చోరీలు అవలీలగా చేయిస్తారు
తమ కక్షలు సాధిస్తారు చేసిన పాపానికీ చెయ్యని నేరానికీ శిక్షలు వేస్తారు
ఆమె:
వాళ్ళంతా నిర్దోషులు మనమంతా ముద్దాయిలం
సత్యానికి సంకెళ్లా జీవితమే చెరసాలా ॥అందరు॥
అతడు : పేదలందరిది ఒకటే కులమని
ఆమె : పేవజనం కలిసుంటే బలమని
ఇదరు : జగమంతా చాటించాలి మనధాటిని చూపించాలి ॥అందరు॥
భగవానుడనని, యెంచక పాట సాహిత్యం
చిత్రం: సత్యానికి సంకెళ్ళు (1974)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: కొసరాజు
గానం: బాలసుబ్రహ్మణ్యం
భగవానుడనని, యెంచక
నగుబాటొనరించి నీవు, నా విగ్రహముల్
తెగనమ్మి, ధనము గూర్చెదె
తగునే, నీ కిట్టివులు, దైవద్రోహీ !
చిక్కితివి నేటితో, ఇం
కెక్కడి కేగెదవురోరి, ఎముకలు ఇరుగన్
ముక్కలుముక్కలు సేయక
తక్కిన, నేనా యశోద తనయుండ నోరో !