Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Bharathi"
Manassakshi (1977)



చిత్రం: మనస్సాక్షి (1977)
సంగీతం: జె.వి.రాఘవులు 
నటీనటులు: కృష్ణ, భారతి, గిరిబాబు ఉమారాణి, జగయ్య, షావుకారు జానకి, కాంతారావు, త్యాగరాజు, మిక్కిలినేని, నగేష్, జ్యోతిలక్ష్మి   
దర్శకత్వం: పి. సాంబశివరావు 
నిర్మాత: అమరారామ సుబ్బారావు
నిర్మాణ సంస్థ: సీతారామాంజనేయ మూవీస్
విడుదల తేది: 02.12.1977



Songs List:



నిర్ణయం విధి నిర్ణయం పాట సాహిత్యం

 
చిత్రం: మనస్సాక్షి (1977)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: దాశరధి
గానం: జె.వి.రాఘవులు 

నిర్ణయం విధి నిర్ణయం 



నువ్వు నవ్వితే ఈ తోటంతా పాట సాహిత్యం

 
చిత్రం: మనస్సాక్షి (1977)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

నువ్వు నవ్వితే ఈ తోటంతా కోటి పూలతో నవ్వుతుందిలే



కళ్ళల్లో ఎన్నెన్ని కలలో పాట సాహిత్యం

 
చిత్రం: మనస్సాక్షి (1977)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

(ఈ పాటని  "గిరిబాబు, ఉమారాణి" పైన చిత్రీకరించారు)

కళ్ళల్లో ఎన్నెన్ని కథలో




నడిసంద్రంలో నావ తీరాయే బ్రతుకు పాట సాహిత్యం

 
చిత్రం: మనస్సాక్షి (1977)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

నడిసంద్రంలో నావ తీరాయే బ్రతుకు 



వచ్చానని వయసేమో కబురంపింది పాట సాహిత్యం

 
చిత్రం: మనస్సాక్షి (1977)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: పి.సుశీల

అరెరె వచ్చానని వయసేమో కబురంపింది

Palli Balakrishna Thursday, January 25, 2024
Bangaru Chellelu (1968)



చిత్రం: బంగారు గాజులు (1968)
సంగీతం: టి. చలపతి రావు 
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, భారతి, విజయ నిర్మల 
దర్శకత్వం: సి.యస్.రావు
నిర్మాత: తమ్మారెడ్డి కృష్ణమూర్తి 
విడుదల తేది: 22.08.1968



Songs List:



అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు గాజులు (1968)
సంగీతం: టి. చలపతి రావు 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల 

అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి
కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది
అన్నయ్య సన్నిధి

చరణం : 1
ఒకే తీగ పువ్వులమై ఒకే గూటి దివ్వెలమై.
ఒకే తీగ పువ్వులమై ఒకే గూటి దివ్వెలమై.
చీకటిలో వేకువలో చిరునవ్వుల రేకులలో
కన్నకడుపు చల్లగా కలసి మెలసి ఉన్నాము
అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి
కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది
అన్నయ్య సన్నిధి

చరణం : 2
కలిమి మనకు కరుైవె నాకాలమెంత ఎదురైన
కలిమి మనకు కరుైవె నాకాలమెంత ఎదురైన
ఈ బంధం విడిపోదన్న ఎన్నెన్ని యుగాలైన
ఆపదలో ఆనందంలో నీ నీడగ ఉంటానన్న
అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి
కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది
అన్నయ్య సన్నిధి




చెల్లాయి పెళ్లికూతురయేనే పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు గాజులు (1968)
సంగీతం: టి. చలపతి రావు 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల 

పల్లవి: 
చెల్లాయి పెళ్ళికూతురాయెను
పాల వెలులే నాలో పొంగి పోయెను

చరణం: 1
నా చెల్లి మందారవల్లి అది
ననుగన్న బంగారు తల్లి
ఎన్నెన్ని జన్మలెనగానీ 
నాకి చెల్లి కావాలి మళ్ళీ మళ్ళీ

చరణం: 2
బంగారుగాజులు తొడుగుకొని సిగలో
అందాల జౌజులు తురుముకొని
పెళ్ళిపీటపై చెల్లి కూచోవాలి నా
కళలో వెలగాలి దీపావళి...

చరణం: 3
చిన్నారి చెల్లికి పెళ్లయితే.. నా
పౌన్నారి బావతో వేళుతుంటే_ఈ
అన్నయ్య కన్నీరు ఆగేనా
వన్నీటి వాగై సాగేనా...




విన్నవించుకోనా పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు గాజులు (1968)
సంగీతం: టి. చలపతి రావు 
సాహిత్యం: దాశరథి 
గానం: ఘంటసాల, పి.సుశీల 

పల్లవి: 
విన్నవించుకోనా
విన్నవించుకోనా చిన్న కోరిక
ఇన్నాళ్ళూ నా మదిలో వున్న కోరిక

చరణం: 
నల్లనీ నీ కురులలో
తెలతెల్ల సిరిమల్లె నై
పరిమళాలు చిలుకుతూ
నే పరవశించి పోనా

వెచ్చనీ నీ కౌగిట
పవశించిన నవ వీణనై
రాగమే అనురాగమై
నీ మనసు నిండిపోనా

తీయని నీ పెదవిపై
చెలరేగిన ఒకపాటనై -
అందరానీ నీల నింగీ
అంచులందుకోవా...

చల్లనీ వీ చూపులే
తెలివెన్నెలై విరబూయగా
కుఱువనై నీ చెలియ నై
కన్నులందు వెలిగేనా




వలపు ఏమిటీ ఏమిటీ పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు గాజులు (1968)
సంగీతం: టి. చలపతి రావు 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి.సుశీల 

పల్లవి: 
వలపు ఏమిటి? ఏమిటి? ఏమిటి?
వయసు తొందర చేయుట ఏమిటి?
మనసు ఊయల పూగుట ఏమిటి?
ఎచట దాగెను రాగల పెనిమిటి?

చరణం: 1
అల్లరివాడో చల్లని రాజోలేక
అందాలు దోచేటి మగరాయుడో
కన్నులు మూసి, కపటాణ చేసి నన్ను
కవ్వించి కరగించు సుకుమారుడో
ఎవ్వరో ఎవ్వరో
నవ్వుతూ_సవ్వించుతూ
ఏలవాడే వాడే వాడే

చరణం: 2
మగసిరి చూపి_మననే నిలిపి కన్నె
మదిలోన మనుసిగ్గు లాలించునో
పొంకములన్నీ పొంగేవేళ_కోటి
మురిపాల కెరటాలు తేలించునో
చిలిపిగా చెలిమిగా
చనువుగా_తనివిగా
చేరరాడే వాడే నేడే



అ ఆ లు వస్తేగాని పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు గాజులు (1968)
సంగీతం: టి. చలపతి రావు 
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: మాధవపెద్ది సత్యం, వసంత 

పల్లవి: 
ఆ ఆ ఆ ఆగండి
అ ఆ లు వస్తేగాని అయిదు బళ్ళూ తావండి
ఆత్రంగా పైపైకొస్తే అట్టే మంచిది కాదండీ
ఏనాడో అయిదు బళ్ళూ నేర్పానే నా నవనీతం
సరిగములో సరసం గలిపి సాగిద్దాం మన సంగీతం

చరణం: 
ఇంటిలోన ఎవ్వరులేరు ఎట్లాగండి మాష్టారు
ఒక్కదాన్ని వుండాలంటే భయమేస్తున్నది మాష్టారు
జతగా మీరుంటారా కథలైనా చెపుతారా
కథలోని నాయకుడెల్లే కవ్విస్తారా ఓ నియహో కూ

చెంతనీవు వున్నావంటే హనుమంతుడిలా గంతేసా
వింతచూపు చూశావం చే యిక్కడెమకాము పెట్టేస్తో
నా రంగుల నవనీతం నా ముదుల సంగీతం
ఆపలేనె నేవీవిరహం వీదేచారం. ఓ నియహో కూ

అమ్మ నాన్న వచ్చేశాక నుప కథ ఏమిటి మాష్టారు
బొమ్మలాంటి మీ అవతారం చూసేదెలాగ మాష్టారు
ఓ మాస్టారూ... ఓ మాస్టారూ.
అమ్మ నాన్న రానేరారు నీకెందుకు యీ బేజారు
రైలెక్కి రాజమహేంద్రం పొయ్యుంటారు.
ఓ యహో కూ




ఏగలేక వున్నాను రా మావా పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు గాజులు (1968)
సంగీతం: టి. చలపతి రావు 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి 

పల్లవి: 
ఏగలేక వున్నాను రా మావా
ఎప్పుడేలుకుంటావు రా మావా
ఎప్పుడేలుకుంటావు రా 
ఏమి తొందరొచ్చిందోనే పిల్లా
ఏమి ముంచుకొచ్చిందో నే పిల్లా
ఏమి ముంచుకొచ్చిందో నే 

చరణం: 
బొట్లా బొట్లా చీరగట్టి
బొండుమల్లెలు కొప్పునబెట్టి
కంది చేలో పందిరేసి
పందిరెక్కి నిక్కి చూసీ
ఒళ్ళంతా ళ్ళుచేసి కక్లన్నీ కాయగాసి 
విసిగి విసిగి వేగిపోతిరా మామా
చీమ చిటుకుమంటే వులికి పడితిరా

చరణం: 
పొందూరూ పంచెగట్టి మందారా నూనె రాసి
ఆదంలో నీడ చూసి నీడలోనే నిన్ను చూసి
లేత లేత బుగ్గలకోవం_బుగ్గల మీద సిగ్గుల కోసం
వురికి పురికి చేరవస్తినే పిల్లా
ముద్దుల సుద్దుల మూటలు తెస్తివే 

చరణం:
పైరగాలి జోరులోన, పెటచెంగు జాలిపోయె
నీవులేక నిల్వలేను_కావమింక నైవలేను
మూడు ముళ్ళు వేసేవాకా. ఆగవే నా రామ చిలకా
కాముని పున్నమి ముందు వున్నదే పిల్లా
కమ్మని కౌగిలి విందు వున్నదే...






జాజిరి జాజిరి పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు గాజులు (1968)
సంగీతం: టి. చలపతి రావు 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి 

జాజిరి జాజిరి జక్క మామా_చించించున్
జింగిరి బింగిరి జితుల మాహ_చించించున్
కాకరో చెట్టు మేకలు మేనేచించించున్

చరణం: 
నీ దేశం బంగరు బర్మా చించించాంచూం
నీ బావే తెలియదు ఖర్మా
సరదాగా వినుచూస్తేనే తరియించెను మా జన్మ
రతనాలే తెచ్చావో - ఇ ఈ జతగోరే వచ్చావో
మోజుంటే ముందుకు రావోయ్ చించించున్ 

చరణం: 
వంటింట్లో కుందేలుందీ
వాకిట్లో తోడేలుందీ
గురి పెట్టి చూచావంటే
గుండె ఝుల్లుమంటుంది
నీ మీసం భాగుందీ_ఇ ఈ నీ వేషం బాగుందీ
తొడగొట్టి దూసుకుపోవోయ్ చించించున్

చరణం: 
చెయ్ తిరిగిన మా బాసు_ఇ ఈ...చెయ్యడులే తిరకాసు
చెల్లుతుందీ వరహాలాగా అతనిచేతి అరకాసు
వ్యవహారం చేస్తావో ఎగనామం పెడతావో
ఏదైనా నీదేభారం_చించించున్ ....

Palli Balakrishna Thursday, November 23, 2023
Kotha Kapuram (1975)



చిత్రం: కొత్తకాపురం (1975)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య, డా॥ సి. నారాయణరెడ్డి, దాశరథి, మోదుకూరి జాన్సన్, ముద్దులపల్లి సత్యనారాయణ శాస్త్రి 
గానం: పి. సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, యస్.పి. బాలు 
నటీనటులు: కృష్ణ, భారతి, చంద్రమోహన్, బేబీ శ్రీదేవి 
దర్శకత్వం: పి. చంద్రశేఖర్ రెడ్డి 
నిర్మాత: జి. వెంకటరత్నం 
విడుదల తేది: 08.04.1975



సూపర్ స్టార్ కృష్ణ గారితో బేబీ శ్రీదేవి నటించిన సినిమాలు:
1. మా నాన్న నిర్దోషి (1970) - బేబీ శ్రీదేవి
2. విధి విలాసం (1970) - బేబీ శ్రీదేవి
3. అగ్నిపరీక్ష (1970) ) - బేబీ శ్రీదేవి
4. అత్తలు కోడళ్లు (1971) - బేబీ శ్రీదేవి
5. నేనూ మనిషినే (1971) - బేబీ శ్రీదేవి
6. రాజమహల్ (1972) - కుమారి శ్రీదేవి
7. మేనకోడలు (1972) - కుమారి శ్రీదేవి
8. మల్లమ్మ కథ (1973) - బేబీ శ్రీదేవి
9. మమత (1973) - బేబీ శ్రీదేవి
10. మీనా (1973) - బేబీ శ్రీదేవి
11. కొత్తకాపురం (1975) - బేబీ శ్రీదేవి
12 దేవుడులాంటి మనిషి (1975) - కుమారి శ్రీదేవి

(1972 లో రిలీజ్ అయిన సినిమాల్లో కుమారి శ్రీదేవి అని టైటిల్స్ లో ఉంది, కానీ 1973 లో రిలీజైన మల్లమ్మ కథ, మమత, మీనా సినిమాలో, 1975 లో రిలీజైన కొత్తకాపురం సినిమాల్లో మాత్రం బేబీ శ్రీదేవి అని ఉంది, అంటే బహుశా ఈ సినిమాలు రిలీజ్ ఆలస్యం అయ్యుంటుంది)



Palli Balakrishna Saturday, June 10, 2023
Andariki Monagadu (1971)



చిత్రం: అందరికీ మొనగాడు  (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర (All)
గానం: పి. సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, యస్.పి. బాలు 
నటీనటులు: కృష్ణ , భారతి, జయసుధ 
నిర్మాత, దర్శకత్వం: ఎమ్.మల్లికార్జున రావు 
విడుదల తేది: 13.02.1971



Songs List:



అడగనా మాననా అమ్మాయి పాట సాహిత్యం

 
చిత్రం: అందరికీ మొనగాడు  (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

పల్లవి:
అడగనా మాననా అమ్మాయి 
అడిగితే ఇస్తావా హాయి
అడగనా మాననా అమ్మాయి 
అడిగితే ఇస్తావా హాయి
అడిగినా మానినా అబ్బాయి
ఎన్నడో కలిపాను చేయి
అడిగినా మానినా అబ్బాయి
ఎన్నడో కలిపాను చేయి

చరణం: 1
మగవాడు చేసేది ఏమిటి
వగలాడి మురిసేది ఏమిటి
మగవాడు చేసేది ఏమిటి
వగలాడి మురిసేది ఏమిటి
మగవాడు చేసేది అల్లరి
మగవాడు చేసేది అల్లరి
వగలాడి మురిసేది రాగ వల్లరి

అడగనా మాననా అమ్మాయి 
అడిగితే ఇస్తాను హాయి

చరణం: 2
మగవాడు తలచేది ఏమిటీ
జవరాలు మరువనిది ఏమిటీ
మగవాడు తలచేది ఏమిటీ
జవరాలు మరువనిది ఏమిటీ
మగవాడు తలచేది కమ్మని కైపు
మగవాడు తలచేది కమ్మని కైపు
ప్రియురాలు మరువనిది ప్రియతమ రూపు

అడగనా మాననా అమ్మాయి 
అడిగితే ఇస్తాను హాయి

చరణం: 3
మగవాడు కోరేది ఏమిటీ
ప్రియురాలు ఇచ్చేది ఏమిటీ
మగవాడు కోరేది ఏమిటీ
ప్రియురాలు ఇచ్చేది ఏమిటీ
మగవాడు కోరేది ఆనందం
మగవాడు కోరేది ఆనందం
ప్రియురాలు ఇచ్చేది మెచ్చేది అనుబంధం

అడగనా మాననా అమ్మాయి 
అడిగితే ఇస్తావా హాయి
అడిగినా మానినా అబ్బాయి
ఎన్నడో కలిపాను చేయి




నా బింకం లోని పెంకితనం పాట సాహిత్యం

 
చిత్రం: అందరికీ మొనగాడు  (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

నా బింకం లోని పెంకితనం నాదే నాదే నాదే
నా పొంకం లోని వెచ్చదనం నీదే నీదే నీదే 



దారెంట పోయేదానా పాట సాహిత్యం

 
చిత్రం: అందరికీ మొనగాడు  (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్.పి. బాలు 

దారెంట పోయేదానా నీవెంట నేను రానా 




ఓ...కమ్మనిదొకటి దాచాను పాట సాహిత్యం

 
చిత్రం: అందరికీ మొనగాడు  (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి & కోరస్ 

ఓ...కమ్మనిదొకటి దాచాను 
ఇమ్మన్నది నీకు ఇస్తానూ
చక్కని వాడ మక్కువ తీర
ఉక్కిరి బిక్కిరి చేస్తాను



ఒక పని మీద వచ్చాను పాట సాహిత్యం

 
చిత్రం: అందరికీ మొనగాడు  (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

ఒక పని మీద వచ్చాను
వచ్చిన పనినే మరచాను
నీ మగసిరి రవ్వంత చూసి 
నా మనసు పూర్తిగా ఇచ్చాను

Palli Balakrishna Sunday, July 10, 2022
Akhandudu (1970)



చిత్రం: అఖండుడు (1970)
సంగీతం: టి చలపతి రావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరథి, అప్పలాచార్య, సినారె, మహారధి
గానం: పి బి. శ్రీనివాస్, సుశీల, మాధవపెద్ది, జానకి, జయదేవ్, స్వర్ణలత
నటీనటులు: కృష్ణ , భారతి
కథ: సి. యస్. రావు
మాటలు: మహారధి
దర్శకత్వం: వి. రామచంద్ర రావు
నిర్మాతలు: నెల్లూరు కాంతారావు, H.S.హుసేన్
విడుదల తేది: 24.07.1970



Songs List:



ఓం హర పురహర శంకర పాట సాహిత్యం

 
చిత్రం: అఖండుడు (1970)
సంగీతం: టి చలపతి రావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: టి. ఆర్. జయదేవ్, యస్. జానకి 

ఓమ్: హరా పురహరాః హరా! శంకరా!
హరా! అమర గంగాధరా!
గిరిజా మానస కమల మధుకరా 
బాలచంద్ర కోటీరా: ఓమ్: ఓమ్: ఓమ్! 

పు. సాకీ: 
ఒక్కనాగిని పినాకిని మహేశుని గూర్చీ 
చెక్కు చెదరక తపము చేసే
పెక్కు యుగములు తపముచే సె తపముచేసే ....

పల్లవి: 
చంద్రశేఖరా రారా
పిలచి పిలచి అలసినారా చంద్రశేఖరా రారా

చరణం: 1
నాగినిరా అనురాగినిరా-నీ గుణ మెరిగిన భోగినిరా
కరుణాసదనా కదలి రారా
కన్నులారా కాంచువరకు కదలను
నిన్నుగాక వేరువరము కోరును రారా ॥చంద్రశేఖరా||

చరణం: 2
నేతవులే నరదాతపులే నీవే జీవ విధాతవులే 
భువన మోహన మూరి విలే
కొండపైని మింటిపైని కొలువై 
సురలకేని మునులకే దొరకవు రా రా

చరణం: 3
నీకాలికి కడియం కావాలనీ
ఆ కేలికి కంకణ మవ్వాలనీ
ఆకంఠంచుట్టూ మాలికనై ఒకడోలికనై ఊగాలనీ 
కోరికరాః వేడెదరా! నీదయరా!   ॥చంద్ర శేఖరా||




నా పేరే మల్లెమొగ్గ పాట సాహిత్యం

 
చిత్రం: అఖండుడు (1970)
సంగీతం: టి చలపతి రావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్. జానకి 

నా పేరు మల్లెమొగ్గ - నాకున్నది రోజా బుగ్గ 
నా రంగూ పొంగూ చూసే ఓరయ్యో యింత సిగ్గా  
ఓరయ్యో యింత  సిగ్గా

చరణం: 1
నాకన్ను గిలుపు లోకాలకు మేలుకొలుపు
నా మేని విరుపు రసికులకే వెన్ను చరుపు

అబ్బా!
ఒక చిరునవ్వు చిలికిన చాలు
వికసించేను నవ నందనాలు
పైట చిరుగాలి సోకినచాలు 
కోటిపరువాలు సడ గెతి ఆడేను ॥నా పేరు॥

చరణం: 2
నా విందు పిలుపు అందుకుంటే మరులు గొలుపు 
నా తేనె వలపు అందకుంటే ద్రాక్ష పులుపు
ఏం పులుపు?
ద్రాక్ష పులుపు
ఒక జడవ్రేటు తగిలిన చాలూ 
త్రుళ్ళి పడతాయి సురలోకాలూ
గజ్జె ఘల్లంటు మ్రోగిన చాలూ 
నీల గగనాలు పురి విప్పి ఆడేనూ 
 వారేవా !    ॥నా పేరు॥




కిటికీ లో నిలబడి చూశావు పాట సాహిత్యం

 
చిత్రం: అఖండుడు (1970)
సంగీతం: టి చలపతి రావు
సాహిత్యం: అప్పలాచార్య కొడకండ్ల 
గానం: మాదవ పెద్ది సత్యం, టి. ఆర్. జయదేవ్, స్వర్ణలత 

ఆ ఆ.....
కిటికీలో నిలాబాడీ చూసేవు న్యాయమా 
ననుజేరా రావేలనే - అందాల బొమ్మా
వినవే భామామణీ
నా ముద్దు గుమ్మా - ననుజేరా రావేలనే 
తీగలాగ సాగే ప్రేమ పూలుపూసి కాసేలోగా 
తీగలాగ సాగే ప్రేమ - పూలు పూసి కాసేలోగా 
ముసలిడొక్కు పందికొక్కు వచ్చినాడే ఏమి సేతునే 
డొక్కు వచ్చినాడే ఏమి సేతునే.....
దూరానా నిలబడి పిలిచేవూ న్యాయమా
చెరలోన వున్నానురా - అందాల రాజా 
ఓహో మోహనాంగా
నా బాలరాజా చెరలోనా వున్నానురా
సరసమాడె సమయమాయెను
విరహ వేదన సైపజాలను

అయ్యో ఏమి సేతునే భామా!
ఓ..... ...... ....

సరసమాడే సమయ మాయెను
విరహ వేదన సైపజాలను 
వీధి తలుపూ గడియతీసీ
ఏలుకోరా పూలరంగా నా పూలరంగా 
ఫ్రియుడా నా బాబే ఇపుడే వస్తే
నువు ఏంజేస్తావుర ప్రియుడా - నాబాబే యిపుడేవస్తే

ఏంజేస్తానా!
మొట్ట మొదట వాడి మొహాన వూస్తా
జుట్టు పట్టుకుని కిందికి తోస్తా

కిటతకు తెయ్యకు థాథిమితా

కోరస్:
మొట్ట మొదట వాడి మొహాన పూస్తా 
జుట్టు పట్టుకుని కిందికి తోస్తా 

మొట్ట మొదట వాడి మొహాన పూస్తా
జుట్టు పట్టుకుని క్రిందికి తోస్తా
మొట మొదట వాడి
మొహాన వూస్తా - జుట్టు పట్టుకొని 
కిందికి తోస్తా
మొట్ట మొదట వాడి మొహన వూస్తా 
జుట్టు పట్టుకొని కిందికి తోస్తా  

పాత చెప్పులే చేత పట్టుకొని
కొడతాన్ - తిడతాన్
సఖియా నీ బాబంటే ఒక లెఖా పారేసిన బీడీ ముక్కా
ఓ సఖియా - నీ బాబంటే ఒక లెక్కా
అరేయ్ గాడిద
గాడిద నేను నీడొక్క చించుతానురా
గాడిద నేను నీడొక్క - నేను నీకొక్క 
ఓరేయ్ నీడొక్క చించు తానురా 
నీ ముక్కు చెక్కేసి నోరు నొక్కేసి రక్కేసి తోలు
నీ ముక్కు చెక్కేసి నోరు నొక్కేసి రక్కేసి తోలు
చీరేసి ఎండేసి డోలు కట్టించి వాయించుతాను

నీ డొక్క - నేను నీ డొక్క 
ఓరేయ్ నీడొక్క చించుతానురా! 
గాడిద నేను నీ డొక్క చించుతానురా
రా...రా...రా!




ఓ యమ్మో ఇంతకోపం ఏల ఏల పాట సాహిత్యం

 
చిత్రం: అఖండుడు (1970)
సంగీతం: టి చలపతి రావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. బి. శ్రీనివాస్ 

పల్లవి:
ఓయమ్మో - ఇంత కోపం ఎలా ఎలా 
ఇంతకోపం ఎలా ఎలా తిరిగి చూడవె ఇలా ఇలా

చరణం: 1
దారిలో బంజారిగాళ్ళుంటారు 
ఊరిలో సోంబేరిగాళ్ళుంటారు
ఎక్కడవున్నా - అన్నుల మిన్నా 
మాటేసి గురిచూసి వేటాడుతుంటారు... ॥ఓయమ్మో॥

చరణం: 2
డేగలా ఎగిసి పడుతున్నావు 
నాగులా బుసలు కొడుతున్నావు
కసురుకున్నా - కలికి మిన్నా
నీ జాడలో నీడలో దాగివుంటాను   ॥ఓయమ్మో॥

చరణం: 3
గూటిలో చిక్కింది చిన్న జాగా 
కోటలో వేశావు పెద్దపాగా
చాలు చాలు - నాటకాలు
నీ గుట్టు లోగుట్టు కనిపెట్టి వుంటాను..... ॥ఓయమ్మో॥




ఓ హంస నడకల దాన పాట సాహిత్యం

 
చిత్రం: అఖండుడు (1970)
సంగీతం: టి చలపతి రావు
సాహిత్యం: దాశరథి 
గానం: పి. బి. శ్రీనివాస్ 

పల్లవి:
ఓ హంస నడకల దానా అందాల కనుల దానా
నా వలవు తెలుపుకోనా నీ మనసు తెలుసుకోనా
నీ పెదవిపై చిరునవ్వునై
కల కాలముండి పోనా

చరణం: 1
నీ సొంపులు చూసీ - నీ సొగసులు చూసీ
నా మది తొందర చేసే నీ మోములో ఒకజాబిలి
నా కన్నుల వెన్నెల కురిసె.... ॥ఓ హంస॥

చరణం: 2
నీ చల్లని మాటే ఒక కమ్మని పాటై 
వినిపించెను నా నోట నా రాగమే అనురాగ మై
వేసింది పూల బాట....    ॥ఓ హంస॥

చరణం: 3
ఒక తీయని స్వప్నం - అది మలచిన శిల్పం 
నాలో నిలచిన రూపం నీరూపమే నా మనసులో 
వెలిగించెను రంగుల దీపం..... ॥ఓ హంస॥




మంచి బియ్యంలోన మట్టిబెడ్డలు జేర్చి పాట సాహిత్యం

 
చిత్రం: అఖండుడు (1970)
సంగీతం: టి చలపతి రావు
సాహిత్యం: మహారధి 
గానం: మాధవపెద్ది సత్యం, టి. ఆర్. జయదేవ్

మంచి బియ్యములోన మట్టిబెడ్డలు జేర్చి 
బొర్ర పెంచిన యట్టి ముచ్చు యితడు 
ప్రతిదిన మేడు గంపల మట్టి గరిపించి 
గడ్డి మేయించుడీ ఖలుని చేత 

పాల డబ్బాలనే బ్లాకు మార్కెటు జేసి
పసివారి జంపిన పాపియితడు
సలసల కాగేటి చమురులో పడదోసి
మన్వంతరము పాటు మాడ్చు డితని

లంచాలు తెగమేసి లక్షలు గడియించి
దేశాన్ని అమ్మిన దేబె యితడు 
సీసమ్ము కరిగించి చెవినిండుగా బోసి 
కొరడాల బాదుడీ క్రూరమతిని

నోట్లు పెట్టుబడిగా ఓట్లు సంపాదించి 
పార్టీలు మారిన భ్రష్టు డితడు
ఉక్కు ముక్కుల కాకులుక్కు మీరి పొడుచు 
తరి ముంచుడితని వైతరణిలోన

పాపులధికులై  భూమికి భారమగుట
రౌరవాది నరకముల ప్రళయ భీక 
రాగ్ని కీలలన్ దహియించి అయ్యధముల
పాతకాల్ కడిగించుడో దూత లారా!




రా రా రమ్మంటే రావేల పాట సాహిత్యం

 
చిత్రం: అఖండుడు (1970)
సంగీతం: టి చలపతి రావు
సాహిత్యం: దాశరథి 
గానం: పి. బి. శ్రీనివాస్, పి. సుశీల 

రా! రా! - రమ్మంటే రావేలా
నీకింత బెదురేలా ఒంటరిగా వున్నారా
నను కాపాడిన చేతులలోనే
వాలేదనంటే యీ బిగు వేలా!
మగువే తానై వలచిన వేళా 
మగవారి బింకాలన్నీ యింతేనా

రా! రా!  రమ్మంటే రావాలా 
పొమ్మంటే పోవాలా - నీ మాటే సాగాలా
పలుకులతోనే వలపులు కురిసీ
చూపులలోనే కోపం మెరిసే
నిలకడలేనీ చెలియలతీరూ
దివినుండే దేవునికైనా తెలియదులే 

యౌవ్వన మంతా దోసిట నింపి
జీవితమే ఒక కానుక జేసే
నీవే నీవే నా సర్వమనీ
నీ కోసం వేచితినోయీ రావోయీ   ॥రా రా॥ 

Palli Balakrishna Thursday, December 23, 2021
Neramu Siksha (1973)




చిత్రం: నేరము శిక్ష (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
నటీనటులు: కృష్ణ, భారతి, కుమారి, పండరి భాయి 
దర్శకత్వం: కె.విశ్వనాధ్
నిర్మాత: ఎమ్. బాలయ్య
విడుదల తేది: 27.07.1973



Songs List:



One Two One Two పాట సాహిత్యం

 
చిత్రం: నేరము శిక్ష (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల 
గానం: యస్.పి.బాలు, ఆనంద్ 

One two  One two One two
ఒకరికి తోడుగ ఒకరుంటూ
నేడు నిజమంటూ రేపు లేదంటూ
ఆడుతూ పాడుతూ సాగిపోతుంటే
జీవితమంతా Joy Enjoy
హాయ్ - హాయ్ - హాయ్

చరణం: 1
జేబుల్ నిండా డబ్బుంటే
జల్సాచేసే దమ్ముంటే
మనసుకు నచ్చిన మగువుంటే
మనిషికి వేరే స్వర్గం లేదూ
జీవితమంతా Joy - Enjoy
హాయ్ - హాయ్ - హాయ్

చరణం: 2
బాధ్యతలన్నీ పెదల కొదిలెయ్ దేవా - ఓ దేవా
పరీక్ష మాట పంతులు కొదిలెయ్ - దేవా - ఓ దేవా
పరువం పోతే మళ్ళీ రాదూ జీవా - ఓ జీవా
కరువుతీరా అనుభవించరా జీవా - ఓ జీవా
జీవితమంతా Joy - Enjoy
హాయ్ - హాయ్ - హాయ్

చరణం: 3
కొత్తసినిమా వచ్చిందంటే - ఫస్టు షోకి చెక్కే సెయ్
అమ్మ నాన్న అడిగారంటే - అలిగి అన్నం మానేసెయ్
ఫీజుకట్టే 'పైకంతో - పిక్ నిక్ పార్టీ పెట్టేసెయ్
ప్రిన్సిపాల్ సస్పెండ్ చేస్తే - గుడ్ బై చెప్పి వచ్చే సెయ్

జీవితమంతా Joy - Enjoy
హాయ్ - హాయ్ - హాయ్





చేసిన పాపం నీది పాట సాహిత్యం

 
చిత్రం: నేరము శిక్ష (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: డి.వి.కృష్ణ శాస్త్రి 
గానం: యస్.పి.బాలు

చరణం: 1
చేసిన పాపం నీది
చితికిన బ్రతుకింకొకరిది
ఒకరిదా నేరం - వేరొకరికా శిక్ష
దిక్కులేని దీన అదిగో
రెక్క తెగిన పక్షి అదిగో
అక్కడ గూడైనా లేదు
ఎక్కడా ఒక తోడు లేదు
ఏమిటింత దారుణం
దీనికెవ్వరు కారణం ?

చరణం: 2
కన్నులా వెలుగారిపోయె
ఉన్న ఊత జారిపోయె
ఊరులేదు, వాడ లేదు
దారి యేదీ కానరాదు
ఏమిటింత దారుణం
దీనికెవ్వరు కారణం ?

చేసిన పాపం నీది
చితికిన బ్రతుకింకొకరిది
ఒకరిదా నేరం - వేకొకరికా శిక్ష !

చరణం: 3
చేసిన పాపం నీది
చితికిన బ్రతుకింకొకరిది
ఒకరిదా నేరం-వేరొకరికా శిక్ష
ఏమిటింత దారుణం
దీనికెవ్వరు కారణం




దాగుడుమూత దండాకోర్ పాట సాహిత్యం

 
చిత్రం: నేరము శిక్ష (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: డి.వి.కృష్ణ శాస్త్రి 
గానం: యస్.పి.బాలు, భాస్కర్, లత

పల్లవి
దాగుడుమూత దండాకోర్ చెల్లెమ్మా 
నీ బావొచ్చాడు భద్రం భద్రం బుల్లెమ్మా
ఓ చెల్లెమ్మా సొగసరి బుల్లెమ్మా!
ఒహో' చెల్లెమ్మా ! గడసరి బుల్లెమ్మా

చరణం: 1
చంద్రుణ్ని అడిగాను సూర్యుడ్ని అడిగాను
ఏడని ! నీ వాడేడని ?
చుక్కల్ని అడిగాను - దిక్కుల్ని అడిగాను
ఏడని ? మా బావేడని ?
ఎక్కడా ? చిరునామా ఎక్కడా ?
ఎక్కడా చిరునామా చిక్కక చక్కావచ్చాను
చివరి నీ మూగమనసే చెపితే విన్నాను
ఏమని ? ఇతగాడే నీ జతగాడని

చరణం: 2
ఇన్నాళ్ళు నువ్వు నా చెల్లివి
మరి ఈనాడో అతని మరుమల్లివి
వలచే ప్రియురాలవై కొలిచే యిల్లాలివే
మనసిచ్చే నెచ్చెలివై మమతలు పంచు తల్లివై
నువ్వు కమ్మగా కాపురం వుండాలి
నీ అన్నయ్య దీవనలే పండాలి

చరణం: 3
ఏనాడు నీ బొమ్మ చూశానో
ఆనాడే నాలోన దాచాను
ఆనాటినుండి అనురాగం పండి
అను నిమిషం నీకోసం వేచాను
చెరిగిపోని తొలివలపే నీదని
మచ్చలేని మలెమనసు నీదని
తెలిసింది ఓ చెలీ, కలిసింది కౌగిలి
కలకాలు ఈ బంధం కళతగని జాబిలి




ఏమండి సారూ పాట సాహిత్యం

 
చిత్రం: నేరము శిక్ష (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దాశరధి 
గానం: యస్.పి.బాలు, జానకి 

ఏమండి సారూ  ఓ బట్లర్ దొరగారూ
అన్నీ తెలుసని అన్నారు
యెన్నో కోతలు కోశారు
ఇంతేనా - మీ పనితన మింతేనా

అయ్యోయ్యయో అయ్యయయ్యే
అయ్యయ్యయో అయ్యయయ్యో
అంతటిమాట అనకండి
అఖరుదాకా ఆగండి
చూడండీ నా పనితనమేదో చూడండి

చరణం: 1
బీరా కంద చామా
యే కూరైన ఒకటే రుచి ఓ రామా
కోడి పులావు కుర్మా
తిందామంటే నల్లుల వాసన ఖర్మా !
యెరువులు వేసిన కాయగూరలు
ఎవరు వండిన అంతేనమ్మా !

కమ్మని రుచులు కావాలంటే
కల్తీలేని శాల్తీలిచ్చి చూడండి
నా పనితనమేదో చూడండి !

అయ్యయ్యయో ! అయ్యయయ్యో !
అయ్యయ్యయో ! అయ్యయాయ్యో !
అందాకా ఈ ప్రాణం నిలిచేనా !

చరణం: 2
మనసు మమత మంచి
కలిపి దేవుడు వండినవంటే మనిషి
యెందుకు ఉప్పుకారం
మీలోనే వున్నది కమ్మని మమకారం
అయ్యలు మా కలలోటి
తియ్యటి  మాటలతోటి 
తీరునటయ్యా ఆకలి
చేతలలో నే చూపాలి
నీ చేతి మహత్యం చూపాలి




రాముని భంటునిరా పాట సాహిత్యం

 
చిత్రం: నేరము శిక్ష (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు
గానం: యస్.పి.బాలు, జానకి 

జై రామచంద్రకీ జై
రాముని బంటునురా
సీతారాముని బంటునురా !
దిక్కుల కాంతులు పిక్కటిల్లగా
గుప్పున కన్నుల నిప్పులు రాలగ
బర బర బర బర అంబర వీధిని
వాలము దిప్పుడు వచ్చినాడురా.....

చరణం: 1
ఇక్కడ వున్నాడొక రావణుడు
నక్కలాగ పొంచున్నాడు గుంట
సక్కలాగ పొంచున్నాడు
వాడిని పట్టి నేలకు కొట్టి
కండలు కోసి గుండెలు చీల్చి
కాకుల కెగరేసాడు నీడు

చరణం: 2
పిచ్చివాడిని నేనురా మద
పిచ్చివాడిని కానురా
చచ్చు పుచ్చు లోకానికి
చదుపు చెప్పే వాడ్నిరా
పచ్చపచ్చని కాపురాలకు
చిచ్చు పెట్టి వాళ్ళ మెడకు
ఉచ్చులాంటి వాడ్నిరా
కార్చిచ్చులాంటి వాడ్నిరా....

చరణం: 3
అమ్మా ! సీతమ్మా !
ఆ రాముడు సంపగ వచ్చానమ్మా
రఘురాముడు పంపగ వచ్చానమ్మా !
కష్టాలన్నీ కడతేరే ఆ
మంచిరోజు వచ్చేనమ్మా
అమ్మా ! సీతమ్మా !
ఈ రక్కసి బాధల నుక్కడంప
నీ రక్షణకై వచ్చానమ్మా.....




వేశావు భలే వేషాల పాట సాహిత్యం

 
చిత్రం: నేరము శిక్ష (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: పి.గణపతి శాస్త్రి 
గానం: సుశీల 

పల్లవి:
రాజ నా రాజా!
వేశావు బలే వేషాలు
చేశావులే తమాషాలు
తెలిసెనులే - ఇక తెలిసెనులే
తెరలో దాగిన దెవ్వరో -- నీ వెవరో
తెలిసె తెలెసెలే తెలిసెనులే....

చరణం: 1
మింటి నడుమ జాబిల్లీ నీవే
వంటఇంటి కుందేలై నావే
మగసిరులొలికే మహరాజ
మగువల చేతలు తమకేల?
పసందైన ఈ కోడె వయస్సులో
హుషారులేదా - విషాదమే
రాజా.... నా రాజా....

|| వేశావు||

చరణం: 2
ఉలకపు పలకవు
పెదవి కదిపితే వొలికి పోవునా వరహాలే
ఒక్క మాటతో - ఓరచూపుతో
ఒళ్ళు పులకరించేనే
నా గుండె జలదరించేనే....
బెట్టు చేయనేల ? పట్టు విడచి రావా ?
లెక్కచేయవేల ! అక్కున చేర్చుకోవా ?
రాజా.... నా రాజా....

|| వేశావు||



Palli Balakrishna Wednesday, March 13, 2019
Thulasi (1974)


చిత్రం: తులసి (1974)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఎస్.పి. బాలు, పి.సుశీల
నటీనటులు: కృష్ణంరాజు, భారతి, కల్పన
దర్శకత్వం: కె.బాబురావు
నిర్మాత: కె.ఎ. ప్రభాకర్
బ్యానర్: రమావిజేత ఫిలిమ్స్
విడుదల తేది: 1974

పల్లవి:
లలలలాలలలా...అహా...
లలలలాలలలా...అహా...

అహహహా...హా..అహహహా...హా...
సెలయేటి గలగల... ఆ...
చిరుగాలి కిలకిలా..ఆ..
సెలయేటి గలగల చిరుగాలి కిలకిల
సిగ్గుపడే బుగ్గలతో చెలి నవ్వుల మిల మిల
చిలిపి చిలిపి చూపులతో నీ ఊహలే తళతళ

చరణం: 1
చందమామ కన్నా నీ చెలిమి చల్లన
సన్నజాజి కన్నా నీ మనసు తెల్లన
నిన్ను కౌగిలించ గుండే ఝల్లన
ఆ...నిన్ను కౌగిలించ గుండే ఝల్లన
నిలువెల్ల పులకించె మెల్లమెల్లన

సెలయేటి గలగల...ఆ...
చిరుగాలి కిలకిల..ఆ...
సెలయేటి గలగల చిరుగాలి కిలకిలా
సిగ్గుపడే బుగ్గలతో చెలి నవ్వుల మిలమిల
చిలిపి చిలిపి చూపులతో నీ ఊహలే తళతళ

చరణం: 2
పసి నిమ్మపండు కన్న నీవు పచ్చన
ఫలియించిన మన వలపే వెచ్చవెచ్చన
అనురాగం ఏదేదో అమరభావన
అనురాగం ఏదేదో అమరభావన
అది నీవు దయచేసిన గొప్ప దీవెన

సెలయేటి గలగల...ఆ...
చిరుగాలి కిలకిల..ఆ...
సెలయేటి గలగల.....చిరుగాలి కిలకిల....
సిగ్గుపడే బుగ్గలతో చెలి నవ్వుల మిలమిల
చిలిపి చిలిపి చూపులతో నీ ఊహలే తళతళ

అహా...అ...అ.. .అహా...
అహహహా...హా..అహహహా...హా...


******  ******  ******


చిత్రం: తులసి (1974)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల

పల్లవి:
లాలీ నా కన్నా..జోజో నా చిన్నా
జాబిల్లి జోల పాడాలీ..కలలందు నీవు చేరాలి

చరణం: 1
చీకటి ఇంట వెన్నెలపంట..పండేనోయి ఈరేయీ
ఎన్ని ఆశలో నాలో..కన్నెకలువలై విరిసాయి

లాలీ నా కన్నా..జోజో నా చిన్నా
జాబిల్లి జోల పాడాలీ..కలలందు నీవు చేరాలి

చరణం: 2
నీవూ నేను నాన్నకు ప్రాణం..దీవించేనూ మనకోసం
నీవూ నేను నాన్నకు ప్రాణం..దీవించేనూ మనకోసం
పెరిగి పెద్దవై నీవే..తోడు నీడగా నిలవాలి

లాలీ నా కన్నా..జోజో నా చిన్నా
జాబిల్లి జోల పాడాలీ..కలలందు నీవు చేరాలి


*****  ******  ******


చిత్రం: తులసి (1974)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం:
గానం: పి.సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి

పల్లవి:
కలికి ముత్యాల కొలికి.. పడకమ్మ ఉలికి ఉలికి...
కలికి ముత్యాల కొలికి.. పడకమ్మ ఉలికి ఉలికి...

ఆడబిడ్దంటే అర్ధమొగుడని అన్నావే... ఏ..ఏ..
మరి తీరా వస్తే... చల్లగా జారుకున్నావే..

మాట వరసకు అన్నాను గానీ ఓయమ్మో...
నువు అన్నంత చేస్తావనుకోలేదే గున్నమ్మో...
కలికి ముత్యాల కొలికి.. పడకమ్మ ఉలికి ఉలికి...

చరణం: 1
కోటేరు ముక్కుంది... కోటంత ఎత్తుంది...
మీసమంటు లేదు గానీ... పౌరుషం భలేగుందీ...
అందుకే నిను మెచ్చాను... ఒంటిగా ఇటు వచ్చాను...
హరి హరి నారాయణా... చచ్చాను... బాబోయ్ చచ్చాను...

కలికి ముత్యాల కొలికి... పడకమ్మ ఉలికి ఉలికి...
కలికి ముత్యాల కొలికి... రాకమ్మ ఉరికి ఉరికి..


చరణం: 2
ఆనాడు రాధగా నీ మేను తాకగా...
నిలువెల్ల కలిగింది గిలిగింత వెచ్చగా...
నిదరే రాదాయే....గుండెలో బాధాయే...
శివ శివ ... నీ వాలకం శృతిమించిపోయే....మించిపోయే...

కలికి ముత్యాల కొలికి...పడకమ్మ ఉలికి ఉలికి...
ఆడబిడ్దంటే అర్ధమొగుడని అన్నావే...ఏ..ఏ..
మరి తీరా వస్తే...చల్లగా జారుకున్నావే ...

మాటవరసకు అన్నాను కానీ ఓయమ్మో...ఓ...
నువు అన్నంత చేస్తావనుకోలేదు గున్నమ్మో...

కలికి ముత్యాల కొలికి...పడకమ్మ ఉలికి ఉలికి...
పడకమ్మ ఉలికి ఉలికి....రాకమ్మ ఉరికి ఉరికి...

Palli Balakrishna Tuesday, February 26, 2019
Ninne Pelladata (1968)


చిత్రం: నిన్నే పెళ్ళాడతా (1968)
సంగీతం: విజయ కృష్ణమూర్తి
సాహిత్యం: సినారె
గానం: సుశీల
నటీనటులు: యన్ .టి.రామారావు, భారతి
దర్శకత్వం: బి.వి.శ్రీనివాస్
దర్శకత్వ పర్యవేక్షణ: జి.విశ్వనాధం
నిర్మాత: బి. విఠలాచార్య
విడుదల తేది: 30.08.1968

పల్లవి:
మల్లెల పానుపు ఉంది...చల్లని జాబిలి ఉంది
నీ కోసమా నా కోసమా...
నీ కోసమా నా కోసమా...కాదోయి కాదు మన కోసమే

చరణం: 1
నీ జోడుగా నేనుంటానని...నీ జోడుగా నేనుంటానని
నీ నీడలో మేడ కడతానని..అన్నాను కాదా ఆనాడే
అది తీరలేదా ఈనాడే...ఏ..ఏ..

మల్లెల పానుపు ఉంది...చల్లని జాబిలి ఉంది
నీ కోసమా నా కోసమా...
నీ కోసమా నా కోసమా...కాదోయి కాదు మన కోసమే

చరణం: 2
అందాల గంధాలు అందించనా...అందాల గంధాలు అందించనా
పరువాల పన్నీరు చిందించనా...
కనరానిదోయి ఈ హాయి...మనసైన దోయి ఈ రేయి

మల్లెల పానుపు ఉంది...చల్లని జాబిలి ఉంది
నీ కోసమా నా కోసమా...
నీ కోసమా నా కోసమా...కాదోయి కాదు మన కోసమే...


Palli Balakrishna Friday, February 8, 2019
Govula Gopanna (1968)


చిత్రం: గోవుల గోపన్న (1968)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం:  కొసరాజు
గానం: ఘంటసాల, పి.సుశీల
నటీనటులు: నాగేశ్వరరావు, రాజశ్రీ , భారతి
దర్శకత్వం: సి.యస్. రావు
నిర్మాతలు: లక్ష్మీ రాజ్యం, శ్రీధర్ రావు
విడుదల తేది: 10.04.1968

పల్లవి:
ఓ...ఓ...ఓ...ఒ...ఒ...
వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా
వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా
గోమాతను నేనేరా నాతో సరిపోలవురా
వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా

చరణం: 1
కల్లాకపటం యెరుగని గంగీగోవును నేనూ
ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను
పారేసిన గడ్డి తినీ బ్రతుకు గడుపుతున్నాను
పారేసిన గడ్డి తినీ బ్రతుకు గడుపుతున్నాను
పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను

వినరా వినరా నరుడా...తెలుసుకోర పామరుడా

చరణం: 2
కమ్మనైన గుమ్మపాలు కడవలతో ఇస్తున్నా
నా దూడల కాదని మీ కడుపులు నిండిస్తున్నా
వయసుడిగిననాడు నన్ను కటికివాని పాల్చేస్తే
వయసుడిగిననాడు నన్ను కటికివాని పాల్చేస్తే
ఉసురు గోలుపోయి మీకే ఉపయేగిస్తున్నాను

వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా

చరణం: 3
నా బిడ్డలు భూమిచీల్చి దుక్కి దున్నుతున్నవోయ్
నా యెరువున పైరు పెరిగి పంట పండుతున్నదోయ్
నా చర్మమె మీ కాలికి చెప్పులుగా మారునోయ్
నా చర్మమె మీ కాలికి చెప్పులుగా మారునోయ్
నా ఒళ్ళె ఢంకాలకు నాదము పుట్టించునోయ్

వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా

Palli Balakrishna Thursday, December 14, 2017
Tapassu (1995)


చిత్రం: తపస్సు (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: మనో
నటీనటులు: భరత్, భాస్కర్, క్రిష్ణ భారతి
కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: భరత్
నిర్మాత: భరత్, సి. ఎస్. అవధాని
విడుదల తేది: 1995

లల లల లల లాలా (2)

తళుకుమన్నది కుళుకుల తార
పలుకుతున్నది వలపు సితార
తళుకుమన్నది కుళుకుల తార
పలుకుతున్నది వలపు సితార

ఓ మైనా వదలనిక ఏమైన
నా లోన శృతిలయలు నీవేన
గుండెల్లోన నిండే ఊహా నీవే కిరణ్ రావే కిరణ్

తళుకుమన్నది కుళుకుల తార
పలుకుతున్నది వలపు సితార
తళుకుమన్నది కుళుకుల తార
పలుకుతున్నది వలపు సితార

నేడే... కొండా కోన తోడుగా
ఎండా వాన చూడగా ఈడు జోడుగ
ఎన్నో ఊసులాడగా తోడు నీడగ
ఈడు గోదారి పొంగింది చూడు
నాదారికొచ్చింది నేడు ఆశ తీరగ
ప్రేమ మాగాణి పండింది నేడు
మారాని పారాణి తోటి నన్ను చేరగ
గువ్వల జంటగ ఓ ఓ సాగే వేళలో
నవ్వుల పంటగ ఓ ఓ రావే నా కిరణ్

తళుకుమన్నది కుళుకుల తార
పలుకుతున్నది వలపు సితార
తళుకుమన్నది కుళుకుల తార
పలుకుతున్నది వలపు సితార

రావే... ఆకాశాన విల్లుగ
ఆనందాల జల్లుగ మల్లెలు చల్లగ
ముద్దే నేడు తీయగ తెరే తీయగ
గుండె కొండెక్కి జాబిల్లి వచ్చి
ఎండల్లో వెన్నెళ్ళు తెచ్చి పానుపేయగా
కోటి మందార గాంధాల తోటి
అందాల చందాలు నాకు కానుకీయగ
ఊహల లాహిరి ఓ ఓ ఊగే వేళలో
ఊపిరి నీవుగ ఓ ఓ రావే నా కిరణ్

తళుకుమన్నది కుళుకుల తార
పలుకుతున్నది వలపు సితార
తళుకుమన్నది కుళుకుల తార
పలుకుతున్నది వలపు సితార

ఓ మైనా వదలనిక ఏమైన
నా లోన శృతిలయలు నీవేన
గుండెల్లోన నిండే ఊహా నీవే కిరణ్ రావే కిరణ్

Palli Balakrishna Sunday, July 16, 2017

Most Recent

Default