చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి, కొసరాజు రాఘవయ్యచౌదరి, ఎరమాకుల ఆదిశేషా రెడ్డి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు
నటీనటులు: యన్. టి. రామారావు, జమున
దర్శకత్వం: బి.యన్.రెడ్డి
నిర్మాణ సంస్థ: పొన్నలూరి బ్రదర్స్
విడుదల తేది: 20.02 1957
Songs List:
మనసా తెలుసా పాట సాహిత్యం
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు
మనసా తెలుసా
నీ విరాగమంతా వృథాయని తెలుసా
అనుబంధాలను తెంచేనని
నీ వనుకొని మురిసేవా
నీ మనసున భమ సేవా
మమకారమనే పాళము మరిమరి
పెనవేసెను తెలుసా
దీపములేని కోవెలలో పల
దేవుడు వెలిసేనా
శ్రీ ధాముడు వెలిసేనా
అనురాగ మొలుకు మనసే ఆహరి
ఆలయమని తెలుసా
అందాల రాజెవడు రా పాట సాహిత్యం
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు రాఘవయ్యచౌదరి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు
అందాల రాజెవడు రా
నా వన్నెకాడు ఎందు దాగియున్నాడురా
ముచ్చటైన నా సొగసు
ముద్దుగారు నా వయసు
మురిపించి కరిగించి
మోజుదీర్చు మొనగాడు
సుంద రాంగి నామీద దయలేదటే
చేయిచేయి కలిపి నన్ను సేరరాదటె
సక్కదనము గల్ల వోణ్ణి
సరదా సెల్లించువోణ్ణి
కొండనైన పిండిజేసి కోర్కెదీర్చు కోడెగాణ్ణి
ఎన్నాళ్ళకు నిక్కావురా సోగ్గాడా
ఏ మూల నక్కావురా నా సోగ్గాడ
ఏమూల నక్కావురా.....
పోకిళ్ళ పుట్టవు - పూర్నాల బుట్టవు
బంగారు మొలకవు - పంచదార చిలకవు.
ఉప్పులేక ముప్పుందుం - చప్పరించు గొప్పవాడ
హేయ్!..
నావంక జూడవేమే వయ్యారిభామ
నా వలపు దీర్చవేమే
మూడూ లోకాలనన్ను బోలినోడు కానరాడు
వీరాధి వీరుణ్ణి శూరాధి శూరుణ్ణి
వాడెంత వీడెంత వంజగాళ్ల బతుకెంత
ధీరుల్ని చూచానురా
మీ కండ బిగువు తేల్చుకుంటే వలచేనురా
కోతలన్ని కట్టిపెట్టి - కూతలన్ని చుట్టబెట్టి
మూతిమీద మీసముంటె
ముందు దూకి బరిమీద
పందెంలో గెల్చి - నా అంద మనుభవించేటి
అరె నీవెవడపురా
నిన్ను అంతు తేల్చేదనురా
రారా ! అంతు దేల్చెదనురా
అరరె కండలు దీస్తారా నిన్ను
కరకర కోస్తారా నిన్ను
పరపర కోస్తారా...
తిరుమల మందిర సుందరా పాట సాహిత్యం
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు
తిరుమల మందిర సుందరా
హరి గోవిందా గోఫందు
కొండ కొమ్ముపై కూర్చుంటే
దండ భక్తులే కొలువుంటే
నామాట నీ చెవుల పడుతుందా నీ
మనసులోని దయ పుడుతుందా
కోటి మెట్లబడి రాలేను ఏ
పాటి కానుకలు తేలేను
లోతులు నీకై చేతుల జాపీ
నా తండ్రియన నెనరుందా
కన్నె ఎంతో సుందరి పాట సాహిత్యం
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు
కన్నె ఎంతో సుందరి
సన్న జాజి పందిరి
చిన్నెజూసి వన్నె జూసి పోరా
మథు వొల్కేటి మందారము
మన సిచ్చేటిలే బ్రాయము
తన తళుకులతో - నును బెళుకులతో
సఖి నీకోస మీవాకిట
వేచేను సఖరారా....
తన వాల్జూపు లుయ్యాలలై
అనురాగాలు పూమాలలై
తన మురిపెముతో
తన సరసముతో
సఖి నీకోస మీవాకిట
వేచేను సఖరారా....
నిను ఏనాడు దర్శింతునే
మన సేనాడు అర్పింతునో
అని దరియుటకై
కని మురియుటకై
సఖి నీకోస మీవాకిట
వేచేను సఖరారా
నీవుండేదా కొండపై నాస్వామి పాట సాహిత్యం
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు
నీవుండేదా కొండపై నాస్వామి నేనుండే దీనేలపై
ఏలీల సేవింతునో ఏపూల పూజింతునో
శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె
ఈ పేదరాలి మనస్సెంతో వేచె
నీ పాద సేవా మహాభాగ్య మీవా
నా పైని దయజూపవా నాస్వామి
దూరాన నైనా కనే భాగ్యమీవా
నీరూపు నాలో సదానిల్పనీవా
ఏడుకొండలపైన వీడైనస్వామి
నా పైని దయజూపవా నాస్వామి
నీ సిగే సింగారమే ఓ చెలియ పాట సాహిత్యం
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు
నీ సిగే సింగారమే ఓ చెలియ నీ సొగసే బంగారమే
కనులార గని మెచ్చేనే ఓ వనలక్ష్మి మనసిచ్చి దిగివచ్చేనే
నీ నవ్వుపూలు అవేమాకు చాలు
నీ ఒయ్యారాలు అవే వేనవేలు
ఓ పేదరాలా మరేపూజ లేలా
మా పై ని దయజూపవా ఓ నా చెలి
మా తోట పూచే వసంతమ్ము
మా బాట చూపే ప్రభాతమ్ము
మాలోన కొలువైన మహలక్ష్మి నీవే
మాపై ని దయ చూపవా - ఒ నా చెలీ
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు
ఓ నా మొరవినరాదా
ఇక ఈ చెర విడిపోదా
అబలననీ అనాదననీ
జాలిలేని కూరుని
పాలబడిన దానిని
నీ చెంత జేర్పవా
వంతదీర్చవా - నే
నిక సై పను ఈ బాధ
ఏడ నున్నవాడవో
జాడ తెలియదాయె నే
కాపాడరా సఖా
జాగు సేయక నీవు
వినా గతి వేరెవరు
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు
కన్నీటి కడలిలోన చుక్కాని లేని నావ
దిక్కైన లేని నావ
ఏ తీరమైన చేరునో - ఏరాల పాలబడునో
ఏగాలి వాత బడునో
నాపాలి భాగ్యదీపము - నన్నేలు దివ్యతార
పోయేన జీవనతార
కన్నీటి కడలిలోన - కనరాక దాటిపోయె
నన వీడి మాయమాయె
నా ఆసలే అడియాసలై - మాసేన జీవనగాధ
ఈ నా విషాద గాధ
కన్నీటి కడలీలోన - నడిచారి రాత్రి మూసె
నవచంద్ర కాంతి మాసె
ఏనాటికీ వసంతము - ఈ తోట కింకరాదా
నా వీట వెలుగిక లేదా.
కన్నీటి కడలీలోన - కనరాక దాటిపోయె
ననువీడి మాయమాయె
లోకం గమ్మత్తురా పాట సాహిత్యం
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: ఎరమాకుల ఆదిశేషా రెడ్డి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు
లోకం గమ్మత్తురా
ఈ లోకం గమ్మత్తుగా
చెయ్యాలి యేదో మరమ్మత్తురా
రేసుల కాసుల వేలుగబోసె
వస్తారిండ్లకు వట్టిచేతుల
కనికరించి ఈ బీదా బిక్కికి
కానీ యివ్వరు అదేమొగాని
వ్యాధుల మిషతో తాగుడుకోసం
బాధ లెన్ని యో పడుదురుగాని
వ్యాధికి మందే ఎరుగని పేదల
ఆదరించరు అవేమొగాని
వడ్డికి వడ్డి నెత్తిన రుద్ది
అసలుకు మోసం దెచ్చుకుందురు
కాలే కడుపుకు జాలే జూపరు
కలలో నైనను అదేమొగాని
నేడో రేపో పొలాలూడితే
నిలువు రెప్పల నింగిజూ తురు
ఇన్నో అన్నో నూకలువేసి
పున్నెం గట్టరు అదేమొగాని
వచ్చిన లాభం చచ్చిన జూపక
రచ్చకెక్కుదురు బోర్డులదిప్పి
మచ్చుకై నా బిచ్చం పెట్టరు
చచ్చే జీవుల కదేమొగాని
అన్ మేరే అన్ మేరే పాట సాహిత్యం
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు రాఘవయ్యచౌదరి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు
అన్ మేరే అన్ మేరే
దేఖో మందు మజా
ఏక్ బుడ్డి ఆరణా దో బుడ్డి బారనా
పత్తెమేమి లేదండీ బాబా గురు వాజ్ఞండి
రొట్టె తినండి - ఉడుకునీళ్ళు తినండి
అరె పాలు తినండి - పంచదార తినండి
బట్టతలకు తగిలిస్తే జుట్టు పుట్టుకొస్తాది
కంటి జబ్బులకు రాస్తే నంటకి సుఖమిస్తాది
మంచిమాట చేస్తాము మనసులోది చెప్తాము
పాముకుట్టితే తేలు కొరికి తే
అరె ఎలుక కుమ్మితే ఎద్దు కర్చితే
ఒక్కసారి పట్టిస్తే ఉన్న జబ్బు ఒదుల్తుంది
అనుమానం లేవండి గుణమిచ్చే మందండి
ఏలూరులో దీన్ని వాడి ఇనుములాగ బలిశారు
సాలూర్లో డాక్టర్లే సర్టిఫికేట్లిచ్చారు
బారెడు గడ్డాల వాళ్ళు మూరెడు మీసాల వాళ్ళు
అనుపానం లేకుండా ఆవుపాల మర్దించిరి
కారు చీకటి దారిగనలేని నాకు పాట సాహిత్యం
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు
కారు చీకటి దారిగనలేని నాకు
వెలలేని బంగారు వెలుగు చూపించి
అంతలో దయమాలి - అర్పి వేయుదువా
దీప మార్పివేయుదువా
తల్లిని తండ్రిని ఎరుగ గదా
నా తండ్రి) ఏ సుఖమెరుగ గదా
ఉన్నది ఈ నిధి ఒక టెగదా
కాపాడుము వరదా
ఓ దేవా - దేవా
దిగి రావ దయా జలధీ
దిగి రావయ ప్రేమనిధీ
ఓ తిరుమల వేంకటరమణా !
సరిహరి మురహరి మొరవిన రాదా
చరణ కమలముల నమ్మితిగా దా
జీవన జీవన జగధీశా !
దీనజనావన తిరుమల వాసా
ఆపద మొక్కుల దేవా రావా
నీ పదదాసిని బోవగ రావా
శరణు శరణు పరమేశా
శరణు శరణు జగదీశా
ఓ తిరుమల వేంకటరమణా !
చిత్రం: కొల్లేటి కాపురం (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: శ్రీ శ్రీ, ఆరుద్ర, సుగంబాబు, రాజా శివానంద్
గానం: పి.సుశీల, యస్.జానకి, సి.విజయలక్ష్మి, యస్.పి.బాలు, గోపాలం, అనుపమవిల్సన్, పూర్ణచంద్రరావు, ఎస్.కె.రవి
నటీనటులు: కృష్ణ, ప్రభ
మాటలు: రాజా శివానంద్
దర్శకత్వం: కె. బి.తిలక్
నిర్మాతలు: గుమ్మడి శ్రీమన్నారాయణ, కొల్లిపర కృష్ణారావు
విడుదల తేది: 15.09.1976
Songs List:
అంబా పరాకు దేవీ వరాకు పాట సాహిత్యం
చిత్రం: కొల్లేటి కాపురం (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: యస్.పి.బాలు
అంబా పరాకు దేవీ వరాకు
కొల్లేటి మా పెద్దింటమ్మా పరాకు
వలచి వచ్చిన వేల్పు ముమ్మొన
వాలు దాల్పున రాణివై తివి
కొలుచు వారల కరుణ నేలగ
వెలసి మా జలదుర్గ వైతివి
అంబా పరాకు దేవీ పరాకు
కొల్లేటి మా పెద్దింటమ్మా పరాకు
ఇదేనండి ఇదేనండి పాట సాహిత్యం
చిత్రం: కొల్లేటి కాపురం (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: యస్.జానకి, గోపాలం
ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం
ముప్పేటల తెలుగువారి ముఖ్య పట్టణం
అలనాడు పాలించెను కులీ కుతుబ్ షా
భాగమతి అతని యొక్క ముద్దుల దేవి
ప్రేయసికై కట్టినాడు పెద్ద ఊరు
ఆ ఊరే ఈనాడు హైదరాబాదు
సరసులు, చతురులు, సాహసవంతులు
చదువులలో పదవులలో పారంగతులు
ఎందరో మహనీయులున్న సుందరనగరం
భరతమాత జడలోని పసిడి నాగరం
ఎల్లారే నల్లామాను పాట సాహిత్యం
చిత్రం: కొల్లేటి కాపురం (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, అనుపమవిల్సన్
హైలేసా హైలేసా హైలేసా
హైలేసా హైలేసా హైలేసా
హైలేసా హైలేసా హైలేసా
ఎల్లారే నల్లామాను ---- హైలేసా బైలేసా
అంతరాల పడవమీద - హెలేసా బైలేసా
అందిపువ్వులు కొయ్యాబోతే
కొమ్మావంగి కొప్పూనిండే
ఎల్లారే చల్లాగాలి – హైలేసా . బైలేసా
పడుచూ చిలకలు పడవయెక్కె - హైలేసా బైలేసా
ఆ గడుసూ తలపులు గంతులువేసె
చల్లాగాలి అల్లరిచేసె
కోడె వయసు ఐసో డై సో
ఆడపిల్ల లు - సేసో సేసో
కోడె వయసు - ఐసో బె సో
ఆడపిల్లలు - సేసో సేసో
జట్టూకట్టి - బ్యూటీ బ్యూటీ
జాతర కెళితే - నాటీ హాటీ
కొంటెవాడు వెంటాపడెను
కొక్కిరాయి వెక్కిరించె
కుఱ్ఱడేమొ కన్నెఱజేస్తే
వెట్టివాడు తుర్
కోరచూపు - హైలేసా
ఆ - కోపగించె - బైలేసా
ఆయ్ - కోరచూపు - హైలేసా
కోపగించె - బై లేసా
ఆ - ఓరా చూపు - హైలేసా
ఓయనిపించే - బై లేసా
ఆ కన్ను కోపం, ఈ కన్ను తాపం
ఏం చెయ్యాలో తోచదు పాప
దోరవయసు తొందరచేస్తే
ఉక్కిరి బిక్కిరి చక్కిలి గింత
చక్కని చుక్క - బ్యూటీ బ్యూటీ
ఫక్కున నవ్వె - నాటీ హాటీ
చక్కని చుక్క - బ్యూటీ బ్యూటీ
ఫక్కున నవ్వే - నాటీ హాటీ
చక్కని చుక్క - బ్యూటీ బ్యూటీ
ఫక్కున నవ్వె - నాటీ హాటీ
అది చూసి హీరో – ఐసో బైసో
జోరంత తగె - సేసో సేసో
మంచి తెలియక మాట్లాడుతుంది
మాట కలిపితే కాట్లాడుతుంది
మాటచాటున మమత ఉందని
మనసు కలిపితే మచ్చికౌతుంది
చిత్రం: కొల్లేటి కాపురం (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: పూర్ణచంద్రరావు
చీలిపోయెను మనసులూ
చెదరిపోయేను మమతలూ
ఎడ పెడ దారుల పయనంలో
ఇరువురి గమ్యం ఒకటే అయినా
మరల కలయిక ఏనాడో ....
తప్పు తప్పు తప్పు పాట సాహిత్యం
చిత్రం: కొల్లేటి కాపురం (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: యస్.జానకి, ఎస్.కె.రవి
తప్పు తప్పు తప్పు
అదిగో అదే తప్పు
అలా చూడడం తప్పు - ఇలా చేయడం తప్పు
తప్పనుకుంటే అంతా తప్పే.
లలల. లలల....
ఆడదాన్ని ఆస్తి లాగ వాడడమే తప్పు
ఎదిరించినదాన్ని రచ్చ కీడ్చడమే ఒప్పు
కప్పవలసిన చీర విప్పడమే తప్పు
కప్పవలసిన చీర విప్పడమే తప్పు
తప్పును ఒప్పుగా చూపే వాళ్ళకే మెప్పు
అదే మా గొప్ప
యా .... యా
నాచో నాచో గోరీ మేరి ప్యారీ
నాచో నాచో గోరీ మేరి ప్యారీ
ఈయ్య....
తెలిసి తెలివి కానిపనులు చేసేవారంతా
తెలివిగ దైవం చాటున దాగడమే వింత
మనలోనే ఎందరో తెగబడి చేసే తప్పు
మనలోనే ఎందరో తెగబడి చేసే తప్పు
సమాజానికే తీరని అప్పు
తప్పుమీద తిరుగుబాటు చేయడమే ఒప్పు
యా .... చూ ....
ఈయ్య....
సత్యమే నిత్యమూ సిద్ధన్నా పాట సాహిత్యం
చిత్రం: కొల్లేటి కాపురం (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఎస్.కె.రవి
సత్యమే నిత్యమూ సిద్ధన్నా
సర్వమూ తెలిసేను సిద్దన్నా
మంచి మర్మములేవొ సిద్దన్నా
తెలియజెప్పర నీవు సిద్ధన్నా
పొంచి దాగితె నిన్ను సిద్దన్నా
ఎంచి దొంగంటారు సిద్దన్నా
పడగెత్తి సర్పాలు సిద్దన్నా
పడగొట్టనున్నాయి సిద్ధన్నా
బుట్టలో పెట్టాలి. సిద్ధన్నా
పట్టి బుట్టలో పెట్టాలి సిద్దన్నా
చెప్పలేడూ మాట సిద్దన్నా
చేసి చూపేవాడు సిద్దన్నా
మనసు కలిగుంటాడు సిద్దన్నా
మిత్రుడే వీడెపుడు సిద్దన్నా
తిన్ననీ వారేదో సిద్దన్నా
చెన్నడే చూపాడు సిద్దన్నా
నీ చెన్నడే చూపాడు సిద్దన్నా
మంచివారికి మంచి సిద్దన్నా
తోడు నీడాతుండి సిద్దన్నా
మంచిగా నను నమ్ము సిగన్నా
ఆరిజెల్లా - బేరిమోత పాట సాహిత్యం
చిత్రం: కొల్లేటి కాపురం (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.జానకి
ఆరిజెల్లా - బేరిమోత
ఆరిజెల్లా - బేరిమోత
నత్తగుల్లా - నాచుపీత
లల్లలాలాలాలలల్లలా
లల్లలాలా లాలలల్లలా
సూడబోతె మట్టగిడస - పట్టబోతే బొమ్మిడాయి
పట్కొ....పట్కొ.... పట్కొ.... ఆ పట్కొ.... ఆ పట్కొ
ఆ పట్కొ.... పట్కొ.... పట్కొ... పల్కొ.... పట్కొ....
మన కొల్లేటి లంకల్లో జాబు
గుడ్డికొంగ లెన్నో ఉన్నాయి బాబు
దిక్కులేని సేపల్ని కొక్కిరాయి మింగబోతె
ఎండ్రకాయ ఒకటి వచ్చి ఏకంగా గొంతుపట్టె
సిన్న సిన్న పురుగుల్ని మెలిమెల్లిగా తింటు
సిన్న పేప బతుకుతాడి బాబూ
దాన్ని పెద్దసేప మింగుతాది బాబూ ॥మన కొల్లేటి॥
ఆ పెద్దసేప నోటికేమొ - సిన్నపురుగు నెఱసూపి
గడుసోడు గాలమేసి ఒడుపుగాను పడతాడు -
లేనోళ్ళ ఉసురుగొడితే బాబూ
అయ్యొలోకాలె చల్లంతు బాబూ
లల్లలాలాలాలలల్లలా
లల్లలాలా లాలలల్లలా
మోసగాళ్ళ బతుకుమీన బుడమేరు పొంగకుంటె
మచ్చావతారు డొచ్చి, మంచిబుద్ధి సెప్తాడు
ఎవ్వారే .... యవ్వా... పాట సాహిత్యం
చిత్రం: కొల్లేటి కాపురం (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: రాజా శివానంద్
గానం: సి.విజయలక్ష్మి, ఎస్.కె.రవి, అండ్ పార్టీ
ఎవ్వారే .... యవ్వా...
ఎవ్వారే యవ్వా - ఇనుకోవే గువ్వా
నేల దున్నే యేల నెలవంక పొడిచింది
అహ – జనక రాజింటిలో సీతమ్మ వెలిసింది
శివుని విల్లూ విరిసి సీతమ్మనే పట్టె
పట్టమూ గట్టంగ పట్టు పట్టి కైక
నార బట్టల తోడ నట్టడవి కంపె
వనములో సీకమ్మ పంటరిగనుండ
పది తలల రేడు పరమనీచుడు వాడు
బిచ్చమంటూ వచ్చి బింకమూ సూపి
లంకకే చేర్చెను, అకళంక సీతను
చిత్రం: మాతృమూర్తి (1972)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: రాజశ్రీ
గానం: పి.సుశీల
అమ్మకు మీరిద్దరు ఒకటే ఒకటే
నీ కంటిలోన నలుసుపడిన బాధ ఒక్కటే
ఒక్కటే
చెడ్డవారితో చెలిమి చేయకూడదు
ఎగతాళి కైననూ, కల్లలాడ కూడదు
కలిమి కలిగినా మనిషి మారకూడదు
నీ మనసులోని మంచితనం విడువ కూడదు
ఈ తల్లి మాట జీవితాన మురువ కూడదు
శ్రద్దగాను చదువు లెన్నో చదవాలి
మీకు బుద్ధిమంతులనే పేరు రావాలి
రామ లక్ష్మణుల రీతి మెలగాలి
మీరు కలకాలం కలిసి మెలిసి ఉండాలి
ఈ తల్లి కన్న పసిడికలలు పండాలి
కళ్ళజోడు పెట్టుకున్న అమ్మాయీ పాట సాహిత్యం
చిత్రం: మాతృమూర్తి (1972)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
డిర్ ర్ ర్
కళ్ళజోడు పెట్టుకున్న అమ్మాయీ
నల్ల కళ్ళజోడు పెట్టుకున్న అమ్మాయీ
కాసేపు ఆపవమ్మ నీ బడాయీ !
ఒళ్ళు దగ్గరుంచుకుంటె ఉంది హాయి
దింతక్క దింతక్క దొరికిందిరా పిట్టా
డిర్ ర్ ర్
కారుమీద ఎక్కగానే కన్నుగానవు
పక్కన మనిషున్నాడని తెలుసుకోవు
బురద నెత్తిమీద చల్లి పోయావు
చేతిలోన చిక్కావిపుడేమౌతావు.... ఇపుడేమౌతావూ
దింతక్క దింతక్క దొరికిందిరా పిట్టా
డిర్ ర్ ర్
ఉన్నదానిననే గర్వముండకూడదు
లేనివాళ్ళలో అసూయ రేపకూడదు
మునుపటి కాలంకాదు
డబ్బుకు విలువే లేదు
హెయ్ హెయ్
మంచితనం లేకుంటే
మనిషి క్రింద జమకాదు
మన దెబ్బంటే ఎప్పుడు రుచి చూచి ఎరుగవు
రబ్బరు బొమ్మలే గింగిరాల్ తిరిగేవు
చక్కని అబ్బాయి చెయ్యి పడితేగాని
నీ తిక్క కాస్త వదలదే డైమన్ రాణి
నీ నీడగా నన్ను కదలాడనీ పాట సాహిత్యం
చిత్రం: మాతృమూర్తి (1972)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: రాజశ్రీ
గానం: ఘంటసాల, పి.సుశీల
నీ నీడగా నన్ను కదలాడనీ
నీ గుండెలో నన్ను నిదురించనీ
నీ చూపులోన ప్రణయాల వీణ
శతకోటి రాగాలు వినిపించనీ
మై మరపించనీ
జాజులు తెలుపు జాబిల్లి తెలుపు
నను మురిపించే నీ మనసు తెలుపు
కుంకుమ ఎరుపు, కెంపులు ఎరుపు
సుధలూరే నీ అధరాలు ఎరుపు
అనురాగాలే అనుబంధాలె
నిన్ను నన్ను ముడి వేయనీ
మది పాడనీ
హరివిలు చూశా, నీ మేను చూశా
హరి విల్లులో లేని హోయలుంది నీలో
సెలయేరు చూశా, నీ దుడుకు చూశా
సెలయేటిలో లేని చొరవుంది నీలో
తీయని చెలిమి తరగని కలిమి
మనలో మదిలో కొనసాగనీ ఊయలూగని
ఎడమొగం పెడమొగం పాట సాహిత్యం
చిత్రం: మాతృమూర్తి (1972)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: రాజశ్రీ
గానం: జమునారాణి
పల్లవి:
ఎడమొగం పెడమొగం ఏంది ఈ కత
ఉలకరూ పలకరూ ఏంది ఈ జత
చరణం: 1
పాల గువ్వలాంటి పసందైన చిన్నది
మొగలి పూవులాగ మొగం ముడుచు కున్నది
అందగాడి పచ్చనైన పసిడి బుగ్గలు
మందార పూలలాగ కందెనెందుకో
ఇది సిరాకో పరాకో గడుసరి అలుకో
కోరి కట్టుకున్నదని ఏడిపించక
అలుసుచేసి ఆడితే అందదు సిలక
ఆడదాని దోర మనసు వెన్నలాంటిది
ఆశ తెలిసి మసలితే కరిగిపోతది
ఈ సిరాకూ పరాకూ ఎగిరి పోతది
ఆలుమగల తగవు రచ్చకెక్క కూడదు
పటు విడుపు లేకుంటే మనువే కాదు
వగలు చూపి పడుపుగా వల విసరాలి
మగవాడిని నీ కొంగున ముడివెయ్యాలి.
నా పలుకులోని కిటుకును తెలిసి మసులుకో
ఆడాలి అందాల జూదం పాట సాహిత్యం
చిత్రం: మాతృమూర్తి (1972)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: రాజశ్రీ
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి
విస్కీ గ్లాసు
ఇస్పేట్ ఆసు
మూడు చుక్కలు వేసుకో
పదమూడు ముక్కలు ఆడుకో
ఈ సుఖము....పరవశము
ఇహ నీదే.... నీదే.... నీదే.... అహ అహ
ఆడాలి అందాల జూదం
అది కావాలి మనకింక వేదం
ఆరార త్రాగాలి అమృతం
ఆ కసిలోన కొటాలి పందెం
ఇక్కడే .... ఇప్పుడే.... మార్చుకో జాతకం
లలల్ల.... లలల్ల .... లలల్ల ....
నా కళ్ళలో వాడి ఉంది
నీ గుండెలో వేడి ఉంది
నా నవ్వులో మైకముంది
నీ జేబులో పైకముంది
చూసుకో... కాచుకో... గెలుచుకో
తురు తురు తురు.... తూ
ఇంతే ఈ లోకం తీరింతే పాట సాహిత్యం
చిత్రం: మాతృమూర్తి (1972)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల
సాకి :
తెంచుకున్నావు రక్తపాశం
పెంచుకున్నావు ప్రేమపాశం
ఫలితం ఇంతే నమ్మా
త్యాగానికి ప్రతిఫల మింతేనమ్మా
పల్లవి:
పాము కాటు వేసిందమ్మా
అనురాగం చూపావమ్మా
అవమానం పొందావమ్మా... అమ్మా
ఇంతే ఈ లోకం తీరింతే
ప్రతిఫల మింతే సమ్మా
కన్నకొడుకునే కాదన్నావు
కడుపు తీపితో విలపించేవు
కన్నీరైనా తుడిచేవారు
కనరారమ్మా ఈ నాడు
పసిడి కలలనే కన్నావమ్మా
పచ్చని బ్రతుకులు కోరావమ్మా
కన్న కలలే కల్లలు కాగా
కారుచీక టే మిగిలిందమ్మా
చిత్రం: వెలుగునీడలు (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం శ్రీ శ్రీ , కొసరాజు
నటీనటులు: అక్కినేని నాగేశ్వర రావు , సావిత్రి, రాజ సులోచన (అతిధి పాత్రలో)
మాటలు: ఆచార్య ఆత్రేయ
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
నిర్మాత: డి. మధుసూధన రావు
విడుదల తేది: 01.01.1961
Songs List:
హాయి హాయిగా జాబిల్లి పాట సాహిత్యం
చిత్రం: వెలుగునీడలు (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం శ్రీ శ్రీ
గానం: ఘంటసాల, పి. సుశీల
హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి మందుజల్లి నవ్వసాగే ఎందుకో
పాడవోయి భారతీయుడా పాట సాహిత్యం
చిత్రం: వెలుగునీడలు (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల, పి. సుశీల
పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయగీతికా...
పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయగీతికా...
పాడవోయి భారతీయుడా...
నేడే స్వాతంత్రదినం వీరుల త్యాగఫలం
నేడే స్వాతంత్రదినం వీరుల త్యాగఫలం
నేడే నవోదయం నీదే ఆనందం ఓ ఓ ఓ
పాడవోయి భారతీయుడా
ఆడి పాడవోయి విజయగీతికా...
పాడవోయి భారతీయుడా
ఓ ఓఓ ఓఓ ఓఓ…
స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి
స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి
సాధించినదానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి
ఆగకోయి భారతీయుడా కదిలి సాగవోయి ప్రగతిదారులా...
ఆగకోయి భారతీయుడా కదిలి సాగవోయి ప్రగతిదారులా...
ఆగకోయి భారతీయుడా
ఆకాశమందుకునే ధరలొకవైపు అదుపులేని నిరుద్యోగమింకొకవైపూ
ఆకాశమందుకునే ధరలొకవైపు అదుపులేని నిరుద్యోగమింకొకవైపూ
అవినీతి, బంధుప్రీతి… చీకటి బజారూ
అలముకున్న నీ దేశమెటు దిగజారూ
కాంచవోయి నేటి దుస్థితి ఎదిరించవోయి ఈ పరీస్థితి...
కాంచవోయి నేటి దుస్థితి ఎదిరించవోయి ఈ పరీస్థితి...
కాంచవోయి నేటి దుస్థితి
పదవీ వ్యామోహాలూ కులమతభేదాలూ భాషాద్వేషాలూ చెలరేగే నేడూ
పదవీ వ్యామోహాలూ కులమతభేదాలూ భాషాద్వేషాలూ చెలరేగే నేడూ
ప్రతిమనిషీ మరియొకని దోచుకునేవాడే ఏ ఏ ఏ
ప్రతిమనిషీ మరియొకని దోచుకునేవాడే
తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునేవాడే
స్వార్థమే అనర్థకారణం అది చంపుకొనుటే క్షేమదాయకం...
స్వార్థమే అనర్థకారణం అది చంపుకొనుటే క్షేమదాయక...
స్వార్థమే అనర్థకారణం
సమసమాజనిర్మాణమే నీ ధ్యేయం నీ ధ్యేయం
సకలజనుల సౌభాగ్యమే నీ లక్ష్యం నీ లక్ష్యం
సమసమాజనిర్మాణమే నీ ధ్యేయం సకలజనుల సౌభాగ్యమే నీ లక్ష్యం
సమసమాజనిర్మాణమే నీ ధ్యేయం సకలజనుల సౌభాగ్యమే నీ లక్ష్యం
ఏకదీక్షతో గమ్యం చేరిననాడే
లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సంకేతం
లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సంకేతం
లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సంకేతం
చల్లని వెన్నెల సోనలు పాట సాహిత్యం
చిత్రం: వెలుగునీడలు (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: జిక్కీ, పి. సుశీల
చల్లని వెన్నెల సోనలు - తెల్లని మల్లెల మాలలు
మా పాపాయి బోసినవ్వులే
మంచి ముత్యముల వానలు
పిడికిలి మూసిన చేతులు లేత గులాబీ
రేకులు పిడికిలి
మూసిన చేతులు లేత గులాబీ రేకులు పిడికిలి
చెంపకు చారెడు సోగకన్నులే
సంపదలీనెడు జ్యోతులు
మా పాపాయి బోసినవ్వులే మంచి ముత్యముల వానలు
ఇంటను వెలసిన దైవము - కంటను మెరిసిన దీపం
మా హృదయాలకు హాయి నొసంగే
పాపాయే మా ప్రాణము
చల్లని వెన్నెల సోనలు - తెల్లని మల్లెల మాలలు
మా పాపాయి నవ్వు పువ్వులె
మంచి ముత్యముల వానలు
నోచిన నోముల పంటగ అందరి కళ్ళకు విందుగా
పేరు ప్రతిష్టలె నీ పెన్నిధిగా
నూరేళ్ళాయువు పొందుమా
ఓ రంగయో పూలరంగయో పాట సాహిత్యం
చిత్రం: వెలుగునీడలు (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల, పి. సుశీల
ఓ రంగయో పూలరంగయో ఓరచూపు చాలించి సాగిపోవయో
కల కానిది విలువైనది పాట సాహిత్యం
చిత్రం: వెలుగునీడలు (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల
కల కానిది విలువైనది బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు
కల కానిది విలువైనది బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు
గాలివీచి పూవులతీగ నేలవాలిపోగా
గాలివీచి పూవులతీగ నేలవాలిపోగా
జాలివీడి అటులే దాని వదలివైతువా ఓ..ఓ..ఓ...ఓ.. చేరదీసి నీరుపోసి చిగురించనీయవా
కల కానిది విలువైనది బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు
అలముకొన్న చీకటిలోనే అలమటించనేలా
అలముకొన్న చీకటిలోనే అలమటించనేలా
కలతలకే లొంగిపోయీ కలువరించనేలా ఓ..ఓ..ఓ...ఓ.. సాహసమను జ్యొతినీ చేకొనేసాగిపో
కల కానిది విలువైనది బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు
అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే సోకాలమరుగున దాగీ సుఖమున్నదిలే
అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే సోకాలమరుగున దాగీ సుఖమున్నదిలే
ఏదీ తనంతతానై నీదరికి రాదూ సోదించి సాదించాలి అదియే ధీరగుణం
కల కానిది విలువైనది బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు
చిత్రం: వెలుగునీడలు (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల , మాధవపెద్ది సత్యం
భలే భలే
చిట్టీపొట్టీ చిన్నారి పుట్టినరోజు పాట సాహిత్యం
చిత్రం: వెలుగునీడలు (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: పి. సుశీల , స్వర్ణలత
చిట్టీపొట్టీ చిన్నారి పుట్టినరోజు, చేరి మనం ఆడేపాడే పండుగరోజు
శివ గోవింద గోవింద పాట సాహిత్యం
చిత్రం: వెలుగునీడలు (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం: కొసరాజు
గానం: మాధవపెద్ది సత్యం, ఉడుత సరోజినీ
శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద
శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద
సంతానమే లేక స్వర్గమే లేదని
చిట్టి పాపను తెచ్చి పెంచుకుంటారు
సంతానమే లేక స్వర్గమే లేదని
చిట్టి పాపను తెచ్చి పెంచుకుంటారు
సంతు కలిగిందంటే చిట్టి పాపాయి గతి
శ్రీమతే రామానుజాయ నమ
శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద
తమ బాగు కోసమై తంటాలు పడలేరు
ఎదుటి కొంపకు ఎసరు పెడతారయా
పొరుగు పచ్చకు ఓర్వలేని వారి గతి
శ్రీమతే రామానుజాయ నమ
శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద
పొరుల కోసం త్యాగమొనరించు వారొకరు
పరుల మోసం చేసి బ్రతుకు వారింకొకరు
పొరుల కోసం త్యాగమొనరించు వారొకరు
పరుల మోసం చేసి బ్రతుకు వారింకొకరు
ఉపకారికే కీడు తలపెట్టు వారి గతి
శ్రీమద్రమారమణ గోవిందో
శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద
కలిమి లేనన్నాళ్ళు కలిసి మెలిసుంటారు
కలిమి చేరిన నాడు కాట్లాడుకుంటారు
కలిమి పెంచే కాయ కష్ట జీవుల పని
శ్రీమతే రామానుజాయ నమ
శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద
ఆనాడు శ్రీ యోగి వీరబ్రహ్మం గారు
కాలజ్ఞానము బోధ చేశారయా
ఆ నాడి శ్రీ యోగి వీరబ్రహ్మం గారు
కాలజ్ఞానము బోధ చేశారయా
ఈనాడు కొడసరి వెంగళప్ప మాట
అక్షరాలా జరిగి తీరేనయా
శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద
శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద
చిత్రం: భాగ్య చక్రము (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: ఘంటసాల
కుండకాదు కుండకాదు చిన్నదానా
నా గుండెలదర గొటినావే చిన్నదానా ॥
పరుగిడితే అందాలన్నీ ఒలికిపోయెనే
తిరిగిచూడ కన్నులలోన మెరుపు మెరిసెనే
ఒలికిన అందాలతో మెరిసిన నీ చూపులతో
ఎంత కలచినావో నన్ను ఎరుగవే తివే - ఓ హో హో ||
మొదటి చూపులోనే మనసు దోచుకుంటివే
ఎదుటపడిన నీ వలపు దాచుకొంటివే
దోచుకున్న నా మనసు దాచుకున్న నీ వలపు
అల్లిబిల్లి అయినాగానీ తెలియవైతివే ఓ హో హో ||
నన్ను చూచు కోరికతోనే వచ్చినావుగా
నిన్ను చూచు ఆశతోనే వేచినానుగా
పచ్చినట్టి నీ నెపము వేచినట్టి నా తపము
ఫలమునిలుపు కొందమన్న నిలువపై తివే - ఓ హో హో |
ఆశ నిరాశను చేస్తివిరా పాట సాహిత్యం
చిత్రం: భాగ్య చక్రము (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: ఘంటసాల
ఆశనిరాశను చేసితివా
రావా చెలియా రాలేవా
రావా చెలియా రాలేవా ॥
తోడుగనడిచేవనీ - నా నీడగనిలచేవనీ
జీవితమే ఒక స్వర్గముగా - ఇక చేసెదవని నే తలచితినే
ప్రాణము నీవేయనీ - నా రాణివి నీవేయనీ
రాగముతో అనురాగముతో - నను ఏలెదవని నేనమ్మితినే
చిత్రం: పెళ్లి సంబంధం (1970)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం: దాశరధి, కొసరాజు, కె. వరప్రసాద్ రావు
గానం: ఘంటసాల, సుశీల, జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి
నటీనటులు: కృష్ణ , విజయ నిర్మల , కృష్ణంరాజు, వాణిశ్రీ, హేమలత
దర్శకత్వం: కె. వరప్రసాద్ రావు
నిర్మాత: బి.విశ్వనాధ్
విడుదల తేది: 02.04.1970
Songs List:
ఇంటికే కలదెచ్చు ఇల్లాలు పాట సాహిత్యం
చిత్రం: పెళ్లి సంబంధం (1970)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల, సుశీల
ఇంటికే కలదెచ్చు ఇల్లాలు
చుపిస్తాలే తమాషా పాట సాహిత్యం
చిత్రం: పెళ్లి సంబంధం (1970)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం: దాశరధి
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి
చుపిస్తాలే తమాషా
నీలి మేఘాలలో నిలిచి చూసెదవేల పాట సాహిత్యం
చిత్రం: పెళ్లి సంబంధం (1970)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం: కె. వరప్రసాద్ రావు
గానం: పి. సుశీల
నీలి మేఘాలలో నిలిచి చూసెదవేల
ఎందుకు తాగేది ఎందుకు పాట సాహిత్యం
చిత్రం: పెళ్లి సంబంధం (1970)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం: కె. వరప్రసాద్ రావు
గానం: ఘంటసాల
ఎందుకు తాగేది ఎందుకు
అలుక కథమును తెలుపవు పాట సాహిత్యం
చిత్రం: పెళ్లి సంబంధం (1970)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం: కె. వరప్రసాద్ రావు
గానం: పి. సుశీల
అలుక కథమును తెలుపవు
చెప్పకే తప్పించుకు పోవకు పాట సాహిత్యం
చిత్రం: పెళ్లి సంబంధం (1970)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం: కె. వరప్రసాద్ రావు
గానం: యస్. జానకి, ఘంటసాల
చెప్పకే తప్పించుకు పోవకు
నీలి మేఘాలలో నిలిచి చూసెదవేల పాట సాహిత్యం
చిత్రం: పెళ్లి సంబంధం (1970)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం: కె. వరప్రసాద్ రావు
గానం: పి. సుశీల
నీలి మేఘాలలో నిలిచి చూసెదవేల
చిత్రం: మా నాన్న నిర్దోషి (1970)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నటీనటులు: కృష్ణ, విజయ నిర్మల, బేబి శ్రీదేవి
దర్శకత్వం: కె. వి. నందనరావు
నిర్మాతలు: ఎస్. వి. ఎన్ రావు అండ్ బ్రదర్స్
విడుదల తేది: 30.01.1970
సూపర్ స్టార్ కృష్ణ గారితో బేబీ శ్రీదేవి నటించిన సినిమాలు:
చిత్రం: మా నాన్న నిర్దోషి (1970)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, యస్.జానకి
నను భవదీయదాసుని మనంబున తియ్యని కిన్కబూని
తన్నిన అదినాకు మన్న నయ నీ మృదు పాదములెంత నొచ్చెనో
యను తలపే కలంచు హృదయంబును నమ్ముము
బెంగుళూరు నిన్గొని చనువాడ రేపకడ
కోపము మానుము కోమలాంగిరో
హుఁ చాలు, చాలు.
ఇకనీ గీచిన గీటు దాటనని ఎన్నోమార్లు ఏ మార్చి
ఇచ్చకముల్ పల్కుచు ప్లేట్లు మార్చీ మార్చీ
కడకీ చందాన నాకాళ్ళపై మొకమున్ వంచి నటించు
నక్క వినయమ్ముల్ చాలులే పంచకా॥
మీరజాలగలనా నీ ఆనతి
మీరజాలగలనా! ఓ లలనా
మీరజాలగలనా ॥
ముత్యాల హారం తెస్తానని
మూడు నెలలు మురిపించావు
రవ్వల వాచీ ఇస్తానని
రాత్రు లెన్నొ కరిగించావు
ఖాళీజేబుతో! పై పై డాబుతో కడకు
కాళ్ళ బేరాని కొచ్చావు నా కాళ్ళ బేరాని కొచ్చావు
ఛీ అంటె దండం పెట్టావు
ఉన్న సిగ్గుకు సున్నాచుట్టావు
నిన్ను నమ్మ గలనాః ఈ జన్మకు
నిన్ను నమ్మ గలనా! ఓ మదనా
నిన్ను నమ్మ గలనా |
ఒక్కొక్క నవ్వుకు ఒక్కొక్క వంద
మక్కువతో అర్పించానే
ఒక్కొక్క కులుకుకు ఒక్కొక్క వెయ్యి
లెక్కలేక చెల్లించానే
లక్కు మారితే నాటిక్కు పారితే
ఓ లైలా ! లక్షలపై నడిపిస్తానే
నిను యక్ష కన్య నే చేస్తానే !
అటు కాశ్మీరు తీసుక వెళతానే
ఇటు కన్యాకుమారి చూపిస్తానే ॥
ఏప్రిల్ ఫూల్ ఏప్రిల్ ఫూల్ పాట సాహిత్యం
చిత్రం: మా నాన్న నిర్దోషి (1970)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: యస్.జానకి
ఏప్రిల్ ఫూల్ ఏప్రిల్ ఫూల్
అన్నయ్యా ఏప్రిల్ ఫూల్: రాధమ్మ ఏప్రిల్ ఫూల్
అమ్మ దొంగ చెమ్మ చెక్క ఆట కట్టింది
అమ్మాయి రంగు అబ్బాయి హంగు అంతా తెలిసిందీ
ఆ కొస చూపు ఆ జడ ఊపు
అంతా హుళక్కి లేవమ్మా
ఈ పూట నువు రాధమ్మ
రేపో మాపో వదినమ్మ
మీ మూగ గుండెల్లోన దాగియున్నపాట
ఆపలేక నా నోట అంటే పొరపాటా ॥అమ్మ॥
ఈడూ జోడూ కుదిరెను చూడు
ఎందుకు బిడియం చిలకమ్మా
ముద్దు మురిపెం తీరే తరుణం
ముందున్నదిలే ఓ టొమ్మా
తుళ్ళిపడకు అన్నయ్యా పెళ్ళి జరుగుతుంది
చురుకు కళ్ళ వదినమ్మ శిరసు వంచుతుంది ॥అమ్మ॥
ఏమండి అబ్బాయిగారు పాట సాహిత్యం
చిత్రం: మా నాన్న నిర్దోషి (1970)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి
ఏమండి అబ్బాయిగారు
ఏమండి అబ్బాయిగారు ఎలా వున్నారు
ఎలా వున్నారు
కలత నిదురాయె కనులు బరువాయె
మేను సగమాయె తేనె వెగటాయె
ఏముంది అమ్మాయిగారు
ఇలా వున్నాము ఇలా వున్నాము
కన్నియ రూపం దాచాలనీ
నీ కనులు బరువాయె నేమో
నేను సగమె నిండాలనీ
నీ మేను సగమాయె నేమో
నీ మేను సగమాయె నేమో
రేయి పగలాయె । లేని దిగులాయె
మనసు ఓ యమ్మో మాట వినదాయె
చెలియ కౌగిట చేరాలనీ
కలవరించింది నీ మనసు
దోర సొగసును దోచాలనీ
దారి కాచింది నీ వయసు
దారి కాచింది నీ వయసు
అలకలు తీరిన కన్నులు పాట సాహిత్యం
చిత్రం: మా నాన్న నిర్దోషి (1970)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
అలకలు తీరిన కన్నులు ఏమనె ప్రియా
అల్లరి చూపుల సల్లవి పాడెను ప్రియా
కదలే పూలగాలి నా యెదపై తేలి తేలి
ఏ కధలో తెలుపసాగె ఏ కలలో పలుకసాగె
ఆ తీయని గాధల రాడవు నీవే ప్రియా
నా తీరని వలపుల మాధురి నీవే ప్రియా
మదిలో రాగమాల నవ మధువే పొంగువేళ
నా తనువే పల్లవించె అణు వణువే పరవశించే
ఆ గానములో నను లీనము కానీ ప్రియా
నీ ప్రాణములో ఒక ప్రాణము కానీ ప్రియా
అలకలు తీరిన కన్నులు ఏమనె ప్రియా
అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా॥
నింగి అంచుల వీడి। పాట సాహిత్యం
చిత్రం: మా నాన్న నిర్దోషి (1970)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి
నింగి అంచుల వీడి। నేలపై నడయాడి।
నన్ను వలచిన తారకా నీకు నే నందింతు ఏ కానుకా?
ఏ కళంకము తేని ఏ కళలు కోల్పోని।
మనసైన ఓ చంద్రమా నీ నిండు మమతయే ఆ కానుక
నా అంగణమ్మునే నందన వనమ్ముగా
తీర్చి దిద్దిన పారిజాతమా
నీ ఋణము తీరిపోనిది సుమా ప్రియతమా
నీ వలపు తోటలో నే గరిక పువ్వునై
నిలిచితిని అదియే పదివేలు
తురువినికించు నవ పరిమళాలు
చిత్రం: మా నాన్న నిర్దోషి (1970)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: రమణ, పి.సుశీల
ఓ చిన్నా నీకన్న నా పెన్నిధి ఎవరు
నీపాల నవ్వులు నెలవంకల నేలు
మీనాన్నను చూశావుగదరా
వారన్నది విన్నావు గదరా
ఏ పాపం ఎరుగని వారనీ
ఆ పరమాత్మునికే తెలుసునురా
పసిపాపవు నీకెలా తెలిసేనురా
గోరంత దీపం కొండలకు వెలుగు
మా చిన్ని పాపాయి మా యింటి వెలుగు
మా బాబు వేసిన ఒక్కొక్క అడుగు
నా మోడు బ్రతుకున ఒక్కొక్క చిగురు
జయ జయ వెంకట రమణా
జయ జయ పావన చరణా
మమ్ము కాపాడ రావయ్యా
మా నమ్మిన దైవము నీవే నయా
చిన్నారి పాపలారా పాట సాహిత్యం
చిత్రం: మా నాన్న నిర్దోషి (1970)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: పి.సుశీల, యస్.జానకి
చిన్నారి పాపలారా పొన్నారి బాలలారా
విన్నారా దేవుని లీలలు కనుగొన్నారా
ఏడీ ? కనపడేం?
గాలి వీచెను ఏదీ కనిపించెనా?
పూలవాసన ఏదీ కనిపించెనా?
ఊఁ... హు
అట్టివాడే దేవుడు జగమంత తానై ఉన్నాడు
నిండుమనసున పిలువగా మన అండ నిలిచే నన్నాడు
పిలిచారా ఎవరైన పలికాడా ఎవరికైనా?
ఓ ఆ కధ చెబుతా వింటారా ఊఁ కొడుతూ ఉంటారా?
ఊఁ ఊఁ
అనగనగా ఒక ఊళ్ళో ఒక అనాధ బాలుడు ఉన్నాడు
ఒక కోడె దూడ తన తోడు నీడగా
బ్రతుకు గడుపు తున్నాడు తన వెతలు మరచియున్నాడు
ఊఁ తర్వాత?
ఓ..ఓ..ఓ....
ఛల్ ఛల్ ఛల్ ఛల్ ఛల్ ఛల్ చలాకి నడకల గిత్తా
ఘల్ ఘల్ ఘర్ ఘల్ ఘల్ ఘల్ గలగల గంటల గిత్తా
బంగారు కొండవురా నా బరువులు మోసేవురా
వరహాల దండవురా నా పరువే నిలిపేవురా
పస్తున్నా పండగ ఉన్నా పాలుపంచుకున్నావురా
మ్యావ్ .... మ్యావ్ ....
రండీ చిన్నమ్మగారు మాయింటికి రండీ చిట్టెమ్మగారూ
దయతో కూర్చోండి బుల్లెమ్మగారూ!
పూరి గుడిసె మాది। బంగారు మేడకాదు.
చిరుచా పేగానీ ఒక కురిచీయైనాలేదు
రండీ చిన్నమ్మగారు మాయింటికి రండీ చిట్టెమ్మగారు
సరదాగ వచ్చానులే చినవాడా
సన్మానం ఏ మొద్దులే వేరే సత్కారం అసలొద్దులే
చెలిమినాకు కావాలి కలిమితో పనిలేదు
అచ్ఛమైన మనసుంటే హెచ్చు తగ్గులు లేవు
ఏ మంటావ్ ఏ మంటావ్ కోడె దూడ
ఔనంట ఔనంట పిల్లి కూన
అంబా అంబా కోడె దూడ
మ్యావ్ మ్యావ్ పిల్లి కూన
అంబా అంబా కోడె దూడ
మ్యావ్ మ్యావ్ పిల్లి కూన
భౌ భౌ - భౌ భౌ
ఛ ఛ ఛ ఛ కుర్రవాడ
ఛీఛీఛీఛీ కోడె దూడ
పెద్దింటి పిల్లి కూనకు దొరజాతి కుక్క పిల్లకు
కుదురుతుంది జోడి। కాదంటే డీ ...డీ ....డీ ....
అయ్యయ్యో..... ఓ నేస్తం
ఏమిటి.... ఏమిటి .... విపరీతం
నీ కంట నెతుకునే చూడలేను
నీ కన్ను రానిదే బ్రతుకలేను
ఏడవకు.... ఏడవకు....నా పిల్లి కూనకు
జబ్బుచేస్తే నయం చేశాడు మన వేణుగోపాలుడు....
నీ దూడను తీసుకెళ్ళి ఓ దేవా.... అని పిలిస్తే
కాపాడుతాడు ఆబాల గోపాలుడు
ఫో పొమ్ము బాలకా లే లెమ్ము డింభకా
పరమాత్ముని దరిసనమ్ము బోడిగిత్త దూడకా
ఫో ఫో పో
రాజు వెడలె రవితేజములలకగ
రాజు వెడలె రవితేజములలరగ
కుడి యెడమల డాల్ కత్తుల మెరయగ
కత్తులు మెరయగ
అడుగడుగున పూల్ గుత్తులు కురియగ
గుత్తులు కురియగ
రాజు వెడలె - వెడలే
చి తగించుమో ఏలికా
ఆయ్ చెప్పర చెప్పరబాలకా
ఒక తుంటరి నా కోడెదూడను। కంటిలోన పొడిచాడు
దేవునితో చెప్పుకుందా మంటే పూజారి పొమ్మని అరిచాడు
మూరెడు మీసాల - చారెడు గడ్డాల
మునులకే కనిపించని జియ్య
జానెడు కుర్రడు కుయ్యో అంటే
కనిపిస్తాడా పోరా కుయ్య
కృష్ణయ్య
ఎక్కడున్నా వయ్య కృషయ్యా
మాకు దిక్కు ఇంకెవరయ్య కన్నయ్యా
నిన్ను నమ్మిన వారికే ఇన్ని ఆపద లేలనయ్యా
నిను కొలువగా నే పిలువగా
ఈ తలుపు లెందుకు తీయవయ్యా....
తీయవయ్యా కృషయ్యా ...
కనిపించావా కృష్ణయ్యా....
కనువెలుగై నా అనుగు తమ్ముని
కరుణించావా। కన్నయ్యా - కృష్ణయ్యా ... కృష్ణయ్యా....
గోపాల బాల కృష్ణయ్యా.....
కృష్ణయ్యా - మాపాలి బాల కృష్ణయ్యా.....
కృష్ణయ్యా..... కృష్ణయ్యా....
ఎంతెంత దూరం పాట సాహిత్యం
చిత్రం: మా నాన్న నిర్దోషి (1970)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: పి.సుశీల, యస్.జానకి
ఎంతెంత దూరం ఇంకెంత దూరం
కధలు చెప్పుతు పోతూఉంటే కాసింతదూరం
రివ్వున ఎగిరే గువ్వల గుంపులు
ఎక్కడి కెళుతున్నాయి అవి ఎక్కడి కెళుతున్నాయి
కూతకురాని పిల్లల కోసం మేతకు వెళుతున్నాయి
మేతకు వెళుతున్నాయి
చల్లగ సాగే తెల్లని మబ్బులు
ఎక్కడి కెళుతున్నాయి అవి ఎక్కడికెళుకున్నాయి
నోళ్ళు విచ్చిన బీళ్ళకోసం నీళ్ళకు వెళుతున్నాయి
నీళ్ళకు వెళుతున్నాయి.
చక్కని బావా నువ్వు నేనూ
ఎక్కడి కెళుతున్నాము....మన మెక్కడి కెళుతున్నాము
పామును పట్టీ బుట్టలో పెట్టి
పండిన పాపం బ్రద్దలు కొట్టి
మా నాన్నను విడిపించాలనీ ఇద్దరము వెళుతున్నాము
మన మిద్దరము వెళుతున్నాం
ఎంతెంత దూరం ఇంకెంత దూరం
కధలు చెప్పుతూ పోతూ ఉంటే కాసింత దూరం