-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Venkat Akkineni"




చిత్రం: ప్రేమాభిషేకం (1981)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: నాగేశ్వరరావు అక్కినేని, శ్రీదేవి, జయసుధ
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాతలు: వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని
విడుదల తేది: 16.02.1981



Songs List:



నా కళ్ళు చెబుతున్నాయి పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమాభిషేకం (1981)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని

కన్నులు చూడని పెదవులు పలకని
హృదయం చెబుతోందీ ...

నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ
నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ

నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని

నింగి నేలా తెలపాలి నీకు నాకు ప్రేమనీ
ఊరువాడా చెప్పాలి నీకు నాకు పెళ్ళనీ
నింగి నేలా తెలపాలి నీకు నాకు ప్రేమనీ
ఊరువాడా చెప్పాలి నీకు నాకు పెళ్ళనీ

ప్రేమకే పెళ్ళనీ .. ఈ పెళ్ళే ప్రేమనీ
ప్రేమా పెళ్ళి జంటనీ
నూరేళ్ళ పంటనీ .. నూరేళ్ళ పంటనీ

నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
కన్నులు చూడని పెదవులు పలకని
హృదయం చెబుతోందీ ...

నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ
నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ

నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని

గుండెను గుండే చేరాలీ మనసుకు మనసే తోడనీ
పెదవిని పెదవి తాకాలీ తీపికి తీపే చెలిమని
గుండెను గుండే చేరాలీ మనసుకు మనసే తోడనీ
పెదవిని పెదవి తాకాలీ తీపికి తీపే చెలిమని

తోడంటే నేననీ .. చెలిమంటే నువ్వనీ
నువ్వు నేను జంటనీ
నూరేళ్ళ పంటనీ .. నూరేళ్ళ పంటనీ

నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
కన్నులు చూడని పెదవులు పలకని
హృదయం చెబుతోందీ ...

నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ
నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ

నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని



దేవి మౌనమా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమాభిషేకం (1981)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్. పి. బాలు, పి. సుశీల
 
దేవీ మౌనమా - శ్రీదేవీ మౌనమా 
నీకై జపించి జపించి తపించి తపించు భక్తుని పై
దేవీ మౌనమా - శ్రీదేవీ మౌనమా 

మౌన భంగము మౌన భంగము...
భరియించదు ఈ దేవిహృదయము 
ప్రేమపాఠము ప్రేమ పాఠము...
వినకూడదు ఇది పూజాసమయము 

దేవి హృదయము విశాలము
భక్తునికది కైలాసము 
కోరిక కోరుట భక్తుని వంతు 
అడగక తీర్పుట దేవత వంతు 

ధూపం వేయుట భ కుని వంతు 
పాపంమోయుట దేవునివంతు 
పాపానికి మోక్షం ధూపదర్శనం 
ఈ ప్రాణికి మోక్షం నామస్మరణం నీనామస్మరణం 

దేవీ దేవీ దేవీ దేవీ
దేవీ కోపమా - శ్రీదేవీ కోపమా 
నీకె జపించి జపించి తపించి తపించు భక్తుని పై
దేవీ కోపమా - శ్రీ దేవీ కోపమా 

స్వామి విరహము అహోరాత్రము 
చూడలేదు దేవి హృదయము 
దేవీస్తోత్రము నిత్యకృత్యము 
సాగనివ్వదు మౌనవ్రతము

స్వామి హృదయము ఆకాశము 
దేవికి మాత్రమే అవకాశము 
అర్చన చేయుట దాసుని వంతు 
అనుగ్రహించుట దేవత వంతు 

కోపం తాపం మాజన్మ హక్కు
పుష్పం పత్రం అర్పించి మొక్కు 
నాహృదయం ఒక పూజా పుష్పం... 
నా అనురాగం ఒక ప్రేమపత్రం 




ఒక దేవుడి గుడిలో పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమాభిషేకం (1981)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్. పి. బాలు, పి. సుశీల

ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో
నిదురించే అనురాగం కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం  ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం  ప్రేమకు పట్టాభిషేకం

ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో
నిదురించే అనురాగం కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం  ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం  ప్రేమకు పట్టాభిషేకం
 
మరులు పూచిన పూలపందిరిలో
మమతలల్లిన ప్రేమ సుందరికీ
పట్టాభిషేకం  పట్టాభిషేకం
మనసు విరిచినా మనసు మరువనీ
మధుర జీవిత మానవమూర్తికి
మంత్రాభిషేకం మంత్రాభిషేకం
రాగాల సిగలో  అనురాగాల గుడిలో
భావాలబడిలో అనుభవాల ఒడిలో
వెలసిన రాగదేవతా  రాగాభిషేకం
వెలసిన ప్రేమవిజేతా  ప్రేమాభిషేకం 

ప్రేమాభిషేకం  ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం  ప్రేమకు పట్టాభిషేకం
 
ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో
నిదురించే అనురాగం కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం 
  
ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో
నిదురించే అనురాగం కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం  ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం  ప్రేమకు పట్టాభిషేకం

కలలచాటున పెళ్ళిపల్లకిలో
కదలివచ్చిన పెళ్ళికూతురికీ
పుష్పాభిషేకం  పుష్పాభిషేకం
పాట మారినా  పల్లవి మార్చనీ
ప్రణయలోకపు ప్రేమమూర్తికి
స్వర్ణాభిషేకం స్వర్ణాభిషేకం
స్వప్నాల నింగిలో  స్వర్గాల బాటలో
బంగారు తోటలో  రతనాల కొమ్మకు
విరిసిన స్వప్న సుందరీ  క్షీరాభిషేకం
కొలిచినప్రేమ పూజారీ అమృతాభిషేకం
 
ప్రేమాభిషేకం  ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం  ప్రేమకు పట్టాభిషేకం
 
ఒక దేవత గుడిలో ఒక దేవుడి ఒడిలో 
నిదురించే అనురాగం  కురిపించే అభిషేకం
 
ప్రేమాభిషేకం  ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం  ప్రేమకు పట్టాభిషేకం





కోటప్ప కొండకు వస్తానని పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమాభిషేకం (1981)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్. పి. బాలు, పి. సుశీల

కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
ఆరుబయట ఎండలో సరుగుతోట నీడలో
కన్నెపిల్ల కనిపిస్తే
కన్ను కన్ను కలిపేస్తే

నూటొక్క టెంకాయ కొడతానని
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
ఆరుబయట ఎండలో సరుగుతోట నీడలో
బుజ్జిబాబు కనిపిస్తే నా కోసం పడిచస్తే
నూటొక్క టెంకాయ కొడతానని
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా

ఆహాహా కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా

హలో...
హలో...
హలో...
హలో...
హలో...హలో...
మ్..
హలో...
మ్..

హలో హలో అనమంటుంది కుర్రమనసు
చలో చలో పొమ్మంటుంది బుల్లిమనసు
పొమ్మని పైపైకి అంటుంది
రమ్మని లోలోన ఉంటుంది
పొమ్మని పైపైకి అంటుంది
రమ్మని లోలోన ఉంటుంది
పొమ్మని రమ్మంటే అది స్వర్గం
రమ్మని పొమ్మంటే అది నరకం

ఆ స్వర్గంలోనే తేలిపోవాలి
ఈ స్వప్నంలోనే నలిగిపోవాలి
ఔనంటే నువ్వు ఊ... అంటే
అహ. ఔనంటే నువ్వు ఊ... అంటే
నూటొక్క టెంకాయ కొడతానని

కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
ఆహా కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా

గొంతు గొంతు కలిపి పాడితే యుగళ గీతం
పెదవి పెదవి కలిపి పాడితే ప్రణయగీతం
కళ్లు కలుసుకుంటే ప్రేమపాఠము
కళ్లు కుట్టుకుంటే గుణపాఠము
కళ్లు కళ్లు కలిపి చూడు ఒక్కసారి
ఒళ్లు ఝల్లుమంటుంది తొలిసారి
ఆ జల్లుల్లోనే తడిసిపోవాలి
ఆ తడి కౌగిల్లో అలిసిపోవాలి
ఔనంటే నువ్వు ఊ... అంటే
ఆ ఔనంటే నువ్వు ఊ... అంటే
నూటొక్క టెంకాయ కొడతానని

కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
ఆరుబయట ఎండలో సరుగుతోట నీడలో
కన్నెపిల్ల కనిపిస్తే
కన్ను కన్ను కలిపేస్తే
నూటొక్క టెంకాయ కొడతానని
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
హేహే కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా





తారలు దిగివచ్చిన వేళ...పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమాభిషేకం (1981)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్.పి.బాలు

తారలు దిగివచ్చిన వేళ.....
మల్లెలు నడిచొచ్చిన వేళ.....
చందమామతో ఒక మాట చెప్పాలి.. ఒక పాట పాడాలి...
చందమామతో ఒక మాట చెప్పాలి.. ఒక పాట పాడాలి...

ఊరంతా ఆకాశానా గోరంత దివ్వెగా
పిడికెడంత గుండెలోనా కొండంత వెలుగుగా
కనిపించే రంగులన్ని సింధూరపు చీరెగా
కనిపించని సిగ్గులన్ని ముసుగేసిన మబ్బుగా
కనిపించే రంగులన్ని సింధూరపు చీరెగా
కనిపించని సిగ్గులన్ని ముసుగేసిన మబ్బుగా
నిలిచిపొమ్మనీ మబ్బుగా... కురిసిపొమ్మనీ వానగా...
విరిసిపొమ్మనీ వెన్నెలగా... మిగిలిపొమ్మనీ నా గుండెగా...
మిగిలిపొమ్మనీ... నా గుండెగా...

చందమామతో ఒక మాట చెప్పాలి.. ఒక పాట పాడాలి...
చందమామతో ఒక మాట చెప్పాలి.. ఒక పాట పాడాలి...

నీలిరంగు చీకటిలో నీలాల తారగా
చూడనంత శూన్యములో దొరకనంత ఆశగా
వేటాడే చూపులన్ని లోలోని ప్రేమగా
వెంటాడే వలపులన్ని కాబోయే పెళ్లిగా
వేటాడే చూపులన్ని లోలోని ప్రేమగా
వెంటాడే వలపులన్ని కాబోయే పెళ్లిగా
చెప్పిపొమ్మనీ మాటగా... చేసిపొమ్మనీ బాసగా...
చూపిపొమ్మనీ బాటగా... ఇచ్చిపొమ్మనీ ముద్దుగా...
ఇచ్చిపొమ్మనీ... ముద్దుగా

చందమామతో ఒక మాట చెప్పాలి.. ఒక పాట పాడాలి...
చందమామతో ఒక మాట చెప్పాలి.. ఒక పాట పాడాలి...




వందనం అభివందనం పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమాభిషేకం (1981)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్. పి. బాలు

వందనం అభివందనం
నీ అందమే ఒక నందనం
నిన్నకు రేపుకు సంధిగ నిలిచిన సుందరీ
పదాభివందనం పదాభివందనం

చరణం: 1
కన్నుల పొడిచిన చీకటిలో
అరే దీపపు వెలుగుల్లో
తీరని ఊహల రేవుల్లో తీరం చేరని పడవల్లో
వస్తానని నేను వస్తానని
తలుపుల తలుపుకు తనువిచ్చి
వలపుల గడపకు నడుమిచ్చి
ఎదురు చూసిన సారిక అభిసారిక... సారీ...

చరణం: 2
జీవితమన్నది మూడునాళ్ళని
యవ్వనమన్నది తిరిగిరాదని
ప్రేమన్నది ఒక నటనమనీ...
నీకంటూ ఎవరున్నారని
ఉన్నారని ఎవరున్నారని
ఉన్నానని నేను ఉన్నానని
ప్రేమపురానికి సెలవిచ్చి
స్వర్గపురానికి దారిచ్చి
సుఖము పోసిన మేనక అభినయ మేనక... సారీ...



ఆగదు ఆగదు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమాభిషేకం (1981)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్. పి. బాలు

పల్లవి: 
ఆగదూ... ఆగదూ... ఆగదు 
ఆగదు ఏ నిముషము నీ కోసము 
అగితే సాగదు యీ లోకము 
ముందుకు సాగదు యీ లోకము 

ఆగదూ ఆగదూ ఆగితే సాగదూ 

చరణం 1
జాబిలి చల్లననీ వెన్నెలదీపమనీ 
తెలిసినా గ్రహణము రాక ఆగదూ 
పూవులు లలితమనీ తాకితే రాలుననీ... 
తెలిసినా పెనుగాలి రాక ఆగదూ 
హృదయం అద్దమనీ పగిలితే అతకదనీ 
తెలిసినా... మృత్యువు రాక ఆగదూ 
మృత్యువూ రాక ఆగదూ 

చరణం: 2
జీవిత మొక పయనమనీ - గమ్యము తెలియదనీ 
తెలిసినా ఈ మనిషి పయనమాగదు 
జననం ధర్మమనీ మరణం ఖర్మమనీ 
తెలిసినా జనన మరణ చక్రమాగదు 
మరణం తధ్యమనీ ఏ జీవికీ తప్పదనీ 
తెలిసినా... ఈ మనిషి తపన ఆగదు 
ఈ బతుకు తపన ఆగదు 

చరణం: 3
మనసు మనసు కలయికలో ఉదయించక ఆగదు ఆనురాగం 
అనురాగపు అర్పణలో జనియించక మానదు త్యాగం 
ప్రేమ చెరిగినా మనసు చెదిరినా ఆగదు త్యాగాభిషేకం 
గెలుపు ఓడినా ఓటమి గెలిచినా ఆగదు ప్రేమాభిషేకం 

Palli Balakrishna Thursday, June 17, 2021
చిత్రం: కళ్యాణి (1979)
సంగీతం: రమేశ్ నాయుడ
నటీనటులు: మురళీ మోహన్, జయసుధ, మోహన్ బాబు
దర్శకత్వం: దాసరి నారాయణరావు
బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్
నిర్మాతలు: వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కనేని
విడుదల తేది: 1979


చిత్రం: కళ్యాణి (1979)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: దాసం గోపాలకృష్ణ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 

గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా
గుండెలే దోస్తావు ఓ మల్లికా
పూవుల్లో మేనకవె నవమల్లికా
పూబోణి కానుకవె సిరిమల్లికా

గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా
గుండెలే దోస్తావు ఓ మల్లికా
పూవుల్లో మేనకవె నవమల్లికా
పూబోణి కానుకవె సిరిమల్లికా
పూబోణి కానుకవె సిరిమల్లికా

జవరాలి జడలోనా..ఆ... ఆ...
జవరాలి జడలోన జలతారు తారవై
కాముకుల మెడలోన కర్పూర హారమై
దేహాన్ని ఆ... ఆ...
దేహాన్ని పులకించి మురిసిపోతావు
దేవుణ్ణి పూజించ నోచుకోలేవూ
దేవుణ్ణి పూజించ నోచుకోలేవూ

జవరాలి జడలోన జలతారు తారవై
కాముకుల మెడలోన కర్పూర హారమై
దేహాన్ని పులకించి మురిసిపోతావు
దేవుణ్ణి పూజించ నోచుకోలేవూ

గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా
గుండెలే దోస్తావు ఓ మల్లికా
పూవుల్లో మేనకవె నవమల్లికా
పూబోణి కానుకవె సిరిమల్లికా

సుతిమెత్తగా నువ్వు తల్పాలు వేస్తావు
సువాసనలతోటి తానమాడిస్తావు 
ఉల్లాసకేళికి వళ్ళు ఇస్తావు
ఉసిగొల్పి ఉసిగొల్పి కళ్ళుమూస్తావు

సుతిమెత్తగా నువ్వు ఆ... ఆ...
సుతిమెత్తగా నువ్వు తల్పాలు వేస్తావు
సువాసనలతోటి తానమాడిస్తావు
ఉల్లాసకేళికి ఆ... ఆ...
ఉల్లాసకేళికి వళ్ళు ఇస్తావు
ఉసిగొల్పి ఉసిగొల్పి కళ్ళుమూస్తావు
ఉసిగొల్పి ఉసిగొల్పి కళ్ళుమూస్తావు

గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా
గుండెలే దోస్తావు ఓ మల్లికా
పూవుల్లో మేనకవె నవమల్లికా
పూబోణి కానుకవె సిరిమల్లికా
పూబోణి కానుకవె సిరిమల్లికా


Palli Balakrishna Tuesday, March 2, 2021
>




చిత్రం: బుచ్చిబాబు (1980)
సంగీతం: కె.చక్రవర్తి 
నటీనటులు: అక్కినేని నాగేశ్వర రావు, జయప్రద 
దర్శకత్వం: దాసరి నారాయణ రావు 
నిర్మాత: వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని 
విడుదల తేది: 19.03.1980



Songs List:



గుండబతుల బుజ్జమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: బుచ్చిబాబు (1980)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: దాసరి నారాయణ రావు 
గానం: యస్.పి.బాలు 

గుండబతుల బుజ్జమ్మ 




కంగారౌతోంది పాట సాహిత్యం

 
చిత్రం: బుచ్చిబాబు (1980)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: దాసరి నారాయణ రావు 
గానం: జి.ఆనంద్, పి.సుశీల 

కంగారౌతోంది



చందమామ పాట సాహిత్యం

 
చిత్రం: బుచ్చిబాబు (1980)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: దాసరి నారాయణ రావు 
గానం: మాధవ పెద్ది  రమేష్,  పి.సుశీల 

చందమామ 




సిత్తరాల తోటలో పాట సాహిత్యం

 
చిత్రం: బుచ్చిబాబు (1980)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: దాసరి నారాయణ రావు 
గానం: యస్.పి.బాలు ,  పి.సుశీల 

సిత్తరాల తోటలో 




పసుపు పచ్చ పాట సాహిత్యం

 
చిత్రం: బుచ్చిబాబు (1980)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: దాసరి నారాయణ రావు 
గానం:  పి.సుశీల , యస్.పి..శైలజ 

పసుపు పచ్చ 




వాల్మికి ఇంటిలో పాట సాహిత్యం

 
చిత్రం: బుచ్చిబాబు (1980)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: దాసరి నారాయణ రావు 
గానం:  యస్.పి.బాలు

వాల్మికి ఇంటిలో 




ఎర్ర కొక కట్టినావే పాట సాహిత్యం

 
చిత్రం: బుచ్చిబాబు (1980)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: దాసరి నారాయణ రావు 
గానం:  యస్.పి.బాలు, రమణ 

ఎర్ర కొక కట్టినావే 

Palli Balakrishna Tuesday, March 19, 2019



చిత్రం: శ్రీరంగ నీతులు (1983)
సంగీతం: కె.చక్రవర్తి 
నటీనటులు: నాగేశ్వరరావు, శ్రీదేవి, చంద్రమోహన్, విజయశాంతి
దర్శకత్వం: ఎ. కోదండ రామిరెడ్డి
నిర్మాతలు: వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని
విడుదల తేది: 13.09.1983



Songs List:



గూటికొచ్చిన చిలక పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరంగ నీతులు (1983)
సంగీతం: కె.చక్రవర్తి  
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: మాధవపెద్ది రమేష్ 

గూటికొచ్చిన చిలక 




తొంగి తొంగి చూడమాకు... పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరంగ నీతులు (1983)
సంగీతం: కె.చక్రవర్తి  
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

పల్లవి:
హె... హె... హే.. లలలలా..
హె.... హె... హే.. లలలలా.. 

తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా

దోరదోర వయసులో చందమామా
ఆ తారనేం చేశావు చందమామా

వావి వరస చూశావా చందమామా
నీ వయసునాపుకున్నావా చందమామా

అంత మచ్చ పెట్టుకుని చందమామా
నీకెందుకింత మత్సరం చందమామా 

తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా

చరణం: 1
వెన్నెల్లో వేడుకుంది... కన్నుల్లో కోరికుంది ముద్దుగుమ్మా
ఇద్దర్లో వేగముంది... వద్దన్నా ఆగకుంది పైడిబొమ్మా

పూల బాణాలు వేసేకుందమా?
ప్రేమ గాయాలు చేసుకుందామా?
పూల బాణాలు వేసేకుందమా?
ప్రేమ గాయాలు చేసుకుందామా?

కలిసే ఉందామా కరిగే పోదామా
చుప్పనాతి చుక్కల్ని దాటుదామా
చూడలేని చంద్రుణ్ణి తరుముదామా 

తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా
తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా

చరణం: 2
గుండెల్లో తాళముంది... గొంతుల్లో రాగముంది కలుపుదామా
పొద్దెంతో హాయిగుంది... ఎంతెంతో పొద్దువుంది గడుపుదామా

ముద్దు మురిపెంలో మునిగిపోదమా?
తీపిగా వానలో తేలిపోదమా?
ముద్దు మురిపెంలో మునిగిపోదమా?
తీపిగా వానలో తేలిపోదమా?

స్వర్గం చూద్దామా...  సొంతం చేద్దామా
మత్సరాలు మాననీ మచ్చమామా
దండమెట్టి ఇద్దరం కొలుచుకోమా

తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా

దోరదోర వయసులో చందమామా
ఆ తారనేం చేశావు చందమామా

వావి వరస చూశావా చందమామా
నీ వయసునాపుకున్నావా చందమామా

అంత మచ్చ పెట్టుకుని చందమామా
నీకెందుకింత మత్సరం చందమామా 

తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా

తొంగి తొంగి చూడమాకు... చందమామా
తొంగి తొంగి చూడమాకు... చందమామా




కళ్ళు ఒకే పళ్ళు ఒకే పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరంగ నీతులు (1983)
సంగీతం: కె.చక్రవర్తి  
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

పల్లవి:
కళ్ళు ఒకే...పళ్ళు ఒకే..నడుము..  ఒకే...నడక ఒకే..
ఆపైన వర్ణించ వీల్లేని అందాలన్నీ.. ఒకే..ఒకే..ఒకే.. 

మాట ఒకే..ఆట ఒకే.. వయసు.. ఒకే..మనసు ఒకే..
ఆపైన నాపైన నీకున్న.. తాపాలన్నీ.. ఒకే..ఒకే..ఒకే.. 


చరణం: 1
నీ కన్న తల్లీ నిను కన్న నాడే .. అడిగినావట నన్నే..
తొలిసారి నువ్వు..కను విప్పగానే.. వెతికినావట నన్నే..
ఎదిగావు కన్నెవై.. పదహారు వన్నెవై

హద్దులేని తుంటరివై.. ముద్దులాడు అల్లరివై
వంపుల సొంపుల ఒళ్ళంత కులుకై
తడబడు అడుగుల టక్కరి నడకై
నీ చుట్టు చుడుతున్న మనసైన చుట్టానైతే.. ఒకే..ఒకే..ఒకే..

కళ్ళు ఒకే...పళ్ళు ఒకే..నడుము ఒకే...నడక ఒకే..
ఆపైన నాపైన నీకున్నతాపాలన్నీ ఒకే..ఒకే..ఒకే..

చరణం: 2
నునుసిగ్గు మొగ్గై నూటొక్క రేకై.. విచ్చుకొంటిని నీకై
నునూగు వయసై నూరేళ్ళ తపస్సై.. కాచుకొంటిని నీకై

కొండంత కోరికై...  గుండెల్లో చోటుకై..
చేరినావు నా చెలివై..మారినావు కౌగిలివై

ఉరకల తురుగుల పరుగై నురుగై
వలపుల మెలకుల వయ్యారి జతవై
నీకళ్ళు నాకళ్ళు నిలువెత్తు అద్దాలైతే... ఒకే..ఒకే..ఒకే....... 

మాట ఒకే..ఆట ఒకే..వయసు ఒకే..మనసు ఒకే..
ఆపైన నాపైన నీకున్నతాపాలన్నీ ఒకే..ఒకే..ఒకే..

కళ్ళు ఒకే...పళ్ళు ఒకే..నడుము..  ఒకే...నడక ఒకే..
ఆపైన వర్ణించ వీల్లేని అందాలన్నీ.. ఒకే..ఒకే..ఒకే..





పంచమి పూట మంచిదని పాట సాహిత్యం

 
చిత్రం:  శ్రీరంగ నీతులు (1983) 
సంగీతం: కె.చక్రవర్తి   
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం:  ఏఎస్.పి.బాలు, పి.సుశీల      

పల్లవి:
పంచమి పూట మంచిదని మాటిచ్చాను పొరపాటు
వచ్చే  వారం ముచ్చటని రాసిచ్చాను ఎద చాటు
ఆ మాటే నా కొంప ముంచింది  ఆ రాతే నా దుంప తెంచింది
ఆ మాటే నా కొంప ముంచింది  ఆ రాతే నా దుంప తెంచింది
అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో..

అయ్యో పాపం మంచోడని చనువిచ్చాను పొరపాటు
ఊపిరి నీవే అన్నాడని మనసిచ్చాను గ్రహపాటు
ఆ చనువే నా కొంప ముంచింది.. ఆ మనసే నా దుంప తెంచింది
ఆ చనువే నా కొంప ముంచింది.. ఆ మనసే నా దుంప తెంచింది 
అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో... 

పంచమి పూట మంచిదని మాటిచ్చాను పొరపాటు
అయ్యొ పాపం మంచొడని చనువిచ్చాను పొరపాటు

చరణం: 1
కళ్ళలోకి చూస్తే సంకేళ్ళు వేసేస్తావు
నీ పైట చాటుకు వస్తే చాపల్లే చుట్టేస్తావు 

కలలోకి రావదన్నా వస్తావు రేయంతా
నీ ప్రేమ ముద్దరలన్ని వేస్తావు ఒల్లంతా  

సరదాలే ఈ వేళ సరిగమలే పాడాయి 
ఆ మాటే అన్నావు చాలింక.. నీ మొజే మళ్ళింది నా వంక 
అయ్యొ అయొ అయొ అయ్యొ అయ్యో...

పంచమి పూట మంచిదని మాటిచ్చను పొరపాటు
అయ్యొ పాపం మంచోడని చనువిచ్చాను పొరపాటు 

చరణం: 2
ఎదురుగ ఉన్నా గాని ఎదలోకి రమ్మన్నానా?
ఎగతాళికన్న గాని నను దొచుకోమన్నానా ?

వగలన్ని చూస్తూ ఉంటే  వయసూరుకుంటుందా?
కనుసైగ చేస్తూ ఉంటే  వలపాపుకుంటుందా ?  

సరికొత్త గుబులేదో గుండెల్లో రేపేవు
ఈ వింతే పులకింత కావాలి... నీ చెంతే బ్రతుకంతా సాగాలీ
అయ్యొ అయొ అయొ అయ్యొ అయ్యో.... 

అయ్యొ పాపం మంచోడని చనువిచ్చాను పొరపాటు
పంచమి పూట మంచిదని మాటిచ్చాను పొరపాటు
ఆ చనువే నా కొంప ముంచింది.. ఆ మనసే నా దుంప తెంచింది
ఆ మాటే నా కొంప ముంచింది  ఆ రాతే నా దుంప తెంచింది

పంచమి పూట మంచిదని మాటిచ్చాను పొరపాటు
అయ్యొ పాపం మంచోడని చనువిచ్చాను పొరపాటు




అందాలమ్మా నువ్వు నాకు చెందాలమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరంగ నీతులు (1983)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

పల్లవి:
అందాలమ్మా నువ్వు నాకు చెందాలమ్మా
నిన్ను నేను పొందాలమ్మా నీ మీదొట్టమ్మా...
అందాలమ్మా నువ్వు నాకు చెందాలమ్మా
నిన్ను నేను పొందాలమ్మా నీ మీదొట్టమ్మా 

ఉత్తరాన మబ్బుల్లాగా.. కొత్తనీటు పొంగుల్లాగా
ఉత్తరాన మబ్బుల్లాగా.. కొత్తనీటు పొంగుల్లాగా
సిత్తరాలు చూపించాలమ్మా

అందాలయ్యా నువ్వు నాకు చెందాలయ్యా
నిన్ను నేను పొందాలయ్యా నీ మీదొట్టయ్యా
అందాలయ్యా నువ్వు నాకు చెందాలయ్యా
నిన్ను నేను పొందాలయ్యా నీ మీదొట్టయ్యా

సన్నజాజి రమ్మంటుందీ.. సందె పొద్దు సయ్యంటుందీ.
సన్నజాజి రమ్మంటుందీ.. సందె పొద్దు సయ్యంటుందీ.
ఆశలన్నీ నువ్వే కన్నయ్యా...

అందాలమ్మా నువ్వు నాకు చెందాలమ్మా
నిన్ను నేను పొందాలమ్మా నీ మీదొట్టమ్మా

అందాలయ్యా నువ్వు నాకు చెందాలయ్యా
నిన్ను నేను పొందాలయ్యా నీ మీదొట్టయ్యా

చరణం: 1
చూపూ చూపూ చేరాలీ పూటా.. రోజూ మోజూ తీరాలీ చోటా
నీలో నేను నిండుగ నిండాలి.. నీతో నేనూ నీడగ సాగాలి

పాడాలి ముచ్చట్లే పసిడి తలపు తలుపు తెరచి
కొట్టాలి చప్పట్లే మూగ మనసు ఆద మరిచి..

చిందాలి సందళ్ళే చిలిపి చిలిపి వలపు చినుకు
వెయ్యాలి బంధాలే నింగీ నేల నిలుచు వరకు
ఆయోగం నాదీ అనురాగం నీదీ.. అదే అదే.. పదే పదే నా గుండె కోరేది

అందాలయ్యా నువ్వు నాకు చెందాలయ్యా
నిన్ను నేను పొందాలమ్మా నీ మీదొట్టమ్మా 

చరణం: 2
పూచే పువ్వు నీలా నవ్విందీ.. పోంగే తేనే నాదే నంటుందీ..
పారే వాగు నీలా దూకిందీ రేగే జోరూ నాదే నంటూందీ..

చూడాలి చూపుల్లో గడుసు వయసు సొగసులన్నీ
తీరాలి నవ్వుల్లో దుడుకు మనసు ఛణుకులన్నీ

చూశానూ నీలోనూ కన్నుల ఎరుపు కలల మెరుపు
విన్నాను నీలోను మమత తెలుపు మనసు పిలుపు
ఇంకెందుకంటా ఈ వాదులాట అంతే చాలు.. అంతే చాలు నా పంట పండిందీ

అందాలమ్మా నువ్వు నాకు చెందాలమ్మా
నిన్ను నేను పొందాలమ్మా నీ మీదొట్టమ్మా

అందాలయ్యా నువ్వు నాకు చెందాలయ్యా
నిన్ను నేను పొందాలయ్యా నీ మీదొట్టయ్యా

ఉత్తరాన మబ్బుల్లాగా కొత్తనీటు పొంగుల్లాగా
ఉత్తరాన మబ్బుల్లాగా కొత్తనీటు పొంగుల్లాగా
సిత్తరాలు చూపించాలమ్మా

అందాలయ్యా నువ్వు నాకు చెందాలయ్యా
నిన్ను నేను పొందాలయ్యా నీ మీదొట్టయ్యా



నాకు చోక్లెట్ కావాలి పాట సాహిత్యం

 
చిత్రం:  శ్రీరంగ నీతులు (1983)
సంగీతం: కె. చక్రవర్తి   
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల      

నాకు చోక్లెట్ కావాలి 

Palli Balakrishna Thursday, February 7, 2019


చిత్రం: విజయ్ (1989)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: యస్.పి.బాలు , చిత్ర
నటీనటులు: నాగార్జున, విజయశాంతి
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: అక్కినేని వెంకట్
విడుదల తేది: 19.01.1989

వాన రాతిరి ఆరు బయట నను
కవ్వించి రమ్మంది కౌగిల్లు ఇమ్మంది కల కాదు గా
వాన రాతిరి పైట లాగి నను
ఇబ్బంది పెట్టొద్దు ఇంకేమొ చెయ్యొద్దు చలి గా

మోజె తీరాలి నీతో జోడి కుదరాలీ
దాహం తీర్చలి ఈ వేల నీ కౌగిలీ
ఐతె రానా వద్దన్ననా
అమ్మమ్మమ్మో అయ్యయ్యయ్యో

తొలకరి చినుకుకు మెరుపులు మెరిసెను నీ మేనులో
సొగసరి మునకలు పిలవక పిలిచెను ఈ వేలలో
తడిపిన సొగసుకు తపనలు రగిలెను నీ చూపుతో
తడి తడి పెదవులు తడబడి అడిగెను ఏమేమిటో
మెత్తనొ కోరిక రెపరెపలాడెను నాలో
వెచ్చని వయసే అల్లరి చేసె నాలో
జల్లుల్లోనా జతగా రార
అమ్మమ్మమ్మో అయ్యయ్యయ్యో

వాన రాతిరి ఆరు బయట నను
కవ్వించి రమ్మంది కౌగిల్లు ఇమ్మంది కల కాదు గా
వాన రాతిరి పైట లాగి నను
ఇబ్బంది పెట్టొద్దు ఇంకేమొ చెయ్యొద్దు చలి గా

మోజె తీరాలి నీతో జోడి కుదరాలీ
సాహం తీర్చలి ఈ వేల నీ కౌగిలీ
ఐతె రానా వద్దన్ననా
అమ్మమ్మమ్మో అయ్యయ్యయ్యో

తొలి తొలి కోరిక తొనదర చేసెను ఈ జల్లులో
చలి చలి వేలకు తహతహరేగెను నా గుండెలో
విరిసిన మొగ్గకి మెరిసిన బుగ్గకి నా ముద్దుకీ
అలసటి రేగెను అలసట తీరెను ఈ పూటకీ
చిరు చిరు ముద్దులు హద్దులు దాటిన వేలా
చిత్తడి జల్లులు తెచ్చెను మల్లెల గోలా
తియ్యని బాద వస్తే పోదా
అమ్మమ్మమ్మో అయ్యయ్యయ్యో

వాన రాతిరి ఆరు బయట నను
కవ్వించి రమ్మంది కౌగిల్లు ఇమ్మంది కల కాదు గా
వాన రాతిరి పైట లాగి నను
ఇబ్బంది పెట్టొద్దు ఇంకేమొ చెయ్యొద్దు చలి గా

మోజె తీరాలి నీతో జోడి కుదరాలీ
దాహం తీర్చలి ఈ వేల నీ కౌగిలీ
ఐతె రానా వద్దన్ననా
అమ్మమ్మమ్మో అయ్యయ్యయ్యో

Palli Balakrishna Sunday, December 3, 2017


చిత్రం: అగ్ని పుత్రుడు (1987)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
నటీనటులు: నాగార్జున, నాగేశ్వరరావు, శివాజీ గణేషన్, శారద, రజిని
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: అక్కినేని వెంకట్
విడుదల తేది: 14.08.1987

చీరలు విడచిన వనితల్లరా
గౌనులు తొడిగిన చిలకల్లరా
అడిగే ప్రస్నకు బదులిస్తే
వందకు వందా వెసేస్తా
అడిగే ప్రస్నకు బదులిస్తా
వందకు వందా కొట్టెస్తా

యెన్ని రకాలో కాలాలు అవి ఏమిటేమిటో చెప్పండీ
ఆ అ ఆ ఆ
గజ గజ లాడే చలి కాలం
చిటపట చినుకుల వానకాలం
కుత కుత లాడే ఎండా కాలం
చలికాలంలో సాయంత్రం
శ్రుంగారానికి తొలి మంత్రం
నొ నొ నొ
భూత భవిష్యత్ వర్తమానం
మూడె మూడు కాలాలు
నిన్న మొన్నలు రేపు మాపులూ నేడు వాటికి రూపాలు

excuse me sir
what do you want
water sir
yes..you can go
excuse me sir
yes
ఏమిటా వేలాకోలాలు class room లో
comman గోడ కుర్చి వెయ్యి

ఎన్ని రకాలో రసాలు అవి ఏమిటేమిటో చెప్పండి
య య య య
నూజివీడుదీ చిన్న రసం
విజయవడది పెద్ద రసం
అదరామ్రుతమే అసలు రసం
ఆ జోడు రసాలే జోడంటా
ఈ మూడో రసమే ముద్దంటా
you silly girl
శ్రుంగార వీర సోకశంతావి
రసాలు తొమ్మిది వినలేదా
వొల్లు దగ్గర పెట్టుకోనిచో
చెల్లు మంటదీ నా బెత్తం

sir sir
what is it now
copy కొడుతుంది sir
హా ఎవరది ఎక్కడ
హరి హరి
excuse me sir
మల్లి ఏమొచ్చింది నీకు
పెట్టండి sir

అలంకారాలు యెన్ని రకాలో చప్పుడు చేయక చెప్పండి
ఆ అ ఆ ఆ
బిర్రు pantu లు bikini లు
బిగి pocket లో lokcet లు
sleave less లు సీత్రు లు
అలకారాలు మీ కోసం
అందాలన్ని మీ సొంతం
oh my god
బాషలో అలంకారాలు
భారతీ స్వర్న హారాలు
ఉత్ప్రేక్షలో ఉఒమానంలో
మీరే కోటి రూపాలు


*******   *******   ********


చిత్రం: అగ్ని పుత్రుడు (1987)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, జానకి

కమలం కమలం కన్నులలో
మధురం మధురం పెదవులలో
కమలం కమలం కన్నులలో
మధురం మధురం పెదవులలో
హ్రుదయం హ్రుదయం తాలంలో
కుసుమం భ్రమరం రాగంలో
లయలె ప్రియమై శ్రుతులె సుఖమై సాగే అనురాగం

కమలం కమలం కన్నులలో
మధురం మధురం పెదవులలో

చిలకలు పలికే నవ్వులలో
చిలిపిగ ఓ సరిగమా
అలకలు చిలికే బుగ్గలలో
పడుచుగ ఓ పదనిసా
తగిలిన చోట తకదిమిగా
తడబడి పొయే పదములుగా
మెలికలు తెరిగే సోయగాలలో
మెరుపు తీగలే కదలాడాల
జతలే కలిసే జతలో శ్రుతిలో సాగే సంగీతం

కమలం కమలం కన్నులలో
మధురం మధురం పెదవులలో

ముందుగ కొసరే ముద్దులలో
తెలియని ఓ స్వర సుదా
అందం కరిగే ఆవిరిలో
మత్తుగ ఓ గుస గుసా
గిచ్చిన చోట కీర్తనలూ
కిక్కురు మననీ యాతనలూ
తపనలు తెంచే తందనాలలో
పులకరింతలే పురి వీడ
యదలో తమకం వొడిలో గమకం సాగే సాయంత్రం

కమలం కమలం కన్నులలో
మధురం మధురం పెదవులలో
హ్రుదయం హ్రుదతం తాలంలో
కుసుమం భ్రమరం రాగంలో
లయలె ప్రెయమై శ్రుతులె సుఖమై సాగే అనురాగం
కమలం కమలం కన్నులలో
మధురం మధురం పెదవులలో


*******   *******   ********


చిత్రం: అగ్ని పుత్రుడు (1987)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల

పెట్టు పెట్టు పెట్టు పెట్టు ముద్దూ
ముద్దుకో ముద్దెట్టు
కట్టుకో నా జట్టు
ముద్దుకో ముద్దెట్టు
కట్టుకో నా జట్టు
ఒక పట్టు పడతాను ఒడిచేరుకో
కౌగిట్లొ నా మీద కసి తీర్చుకో
డీ డిక్కుం డీ డిక్కుం డీ డీ డీ
డీ డిక్కుం డీ డిక్కుం డీ డీ డీ

పెట్టు పెట్టు పెట్టు పెట్టు ముద్దూ
ముద్దుకో ముద్దెట్టు
కట్టుకో నా జట్టు
ముద్దుకో ముద్దెట్టు
కట్టుకో నా జట్టు
మొగ్గలా విచ్చింది వలపిప్పుడే
బుగ్గలో కొచ్చింది ఎరుపిప్పుడే
డీ డిక్కుం డీ డిక్కుం డీ డీ డీ
డీ డిక్కుం డీ డిక్కుం డీ డీ డీ

పెదవి మీద ముద్దెడితే బుగ్గల్లో సిగ్గు పొడా
బుగ్గల్లొ ముద్దెడితే గుండెల్లొ సన్న దడా
చెంగు మీద ముద్దెడుతే చెదిరింది పావడా
మూడింతలై దొరికే మురిపాలే యెడా పెడా
పదహారు కలలు చూసి పావలించరా
పొదరింటి తలుపు చిలక తగిలించరా
ముసుగులో గుద్దులాట ఇంకేల రా
మసకలో ముద్దులాట కిది వేల రా

ముద్దుకో ముద్దెట్టు
కట్టుకో నా జట్టు
ఒక పట్టు పడతాను ఒడిచేరుకో
కౌగిట్లొ నా మీద కసి తీర్చుకో
డీ డిక్కుం డీ డిక్కుం డీ డీ డీ
డీ డిక్కుం డీ డిక్కుం డీ డీ డీ

చేతి మీద ముద్దెడితే చెంపకొచ్చె తిమ్మిరీ
చంపమీద ముద్దెడితే వంపు సొంపులల్లరీ
నడుము మీద చెయ్యేస్తె పుట్టింది చాటు గిలి
లాగించు ఇట్టాగే ఈ ముద్దుల cetury
పొలిమేర దాటినాక పొగరెందుకో
సగమైనా కాకముందె చలి ఎందుకో
అందమైన నిబ్బరాలు చేజిక్కితే
అంతకన్న దెబ్బలాట ఏముంటదీ

పెట్టు పెట్టు పెట్టు పెట్టు ముద్దూ
ముద్దుకో ముద్దెట్టు
కట్టుకో నా జట్టు
ముద్దుకో ముద్దెట్టు
కట్టుకో నా జట్టు
ఒక పట్టు పడతాను ఒడిచేరుకో
కౌగిట్లొ నా మీద కసి తీర్చుకో
డీ డిక్కుం డీ డిక్కుం డీ డీ డీ
డీ డిక్కుం డీ డిక్కుం డీ డీ డీ


*******   *******   ********


చిత్రం: అగ్ని పుత్రుడు (1987)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
గానం: మనో, జానకి

ఎర్ర ఎర్రానీ బుగ్గమీద
ఎంద బడి మెరిసింది జిగి జిగి
అహా జిగి జిగి
సన్న సన్నానీ నడుము మీదా
చల్ల గాలి విసిరింది గిలి గిలి
అహా గిలి గిలి
ఎర్ర ఎర్రానీ బుగ్గమీద
ఎంద బడి మెరిసింది జిగి జిగి
అహా జిగి జిగి
సన్న సన్నానీ నడుము మీదా
చల్ల గాలి విసిరింది గిలి గిలి
అహా గిలి గిలి

చకనమ్మ వల్లంతా చందనాలో
కౌగిట్లొ ఎన్నెన్ని బందనాలో
చకనమ్మ వల్లంతా చందనాలో
కౌగిట్లొ ఎన్నెన్ని బందనాలో
ఎర్ర ఎర్రానీ బుగ్గమీద
ఎంద బడి మెరిసింది జిగి జిగి
అహా జిగి జిగి
సన్న సన్నానీ నడుము మీదా
చల్ల గాలి విసిరింది గిలి గిలి
అహా గిలి గిలి

కౌగిట్లో నా చిలక కవ్విస్తేనే అలక
తలపడి నాతో కలబదీ
అందాలలో ఎంతో అలజడీ
ఊపే ఉరవడీ
కొత్త రుచి కోడె కసి తెలిసిందిలే
సిగ్గు తడి చిక్కు ముడి తీరిందిలే
విరజాజులా పొద తొలి రోజులా కథ
కౌగిల్లలో కరిగే
చిరు నొక్కిల్లకే చెలి చెక్కిల్లలో
ముద్ద మందారాలె విచ్చె తేనెలొచ్చెనమ్మా
రేపు మాపు నిన్నె రెచ్చ గొట్టుకుంటా
పచ్చి ముద్దు లెన్నొ అచ్చు గుద్దుకుంటా
ఒలియో ఒలియో ఒడిలో ఒదిగే

హేయ్ ఎర్ర ఎర్రానీ బుగ్గమీద
ఎంద బడి మెరిసింది జిగి జిగి
అహా జిగి జిగి
సన్న సన్నానీ నడుము మీదా
చల్ల గాలి విసిరింది గిలి గిలి
అహా గిలి గిలి

పగలంత చీకట్లో రాత్రంత ఎన్నెట్లో
జతపడి నీతో తలపడి
నీ పక్క లోగిల్లే స్తిరపడీ
నీతో పడి పడి
నిద్దరకి నిలకడకి వీడుకోలు
ఇద్దరికి మీగడతో వేడి పాలు
పెనవేతలో ఇక తరువాతలేమిటొ శ్రీవారికే తెలుసు
యదా అంటించకే సొద రెట్టింతలై
ముద్దబంతి మొగ్గ విచ్చుకున్న వేలనాలో
తుమ్మెదల్లె వచ్చి వచ్చి వాలుతుంతా
రెమ్మచాటు కొమ్మ సోకులంకుంటా
కలయో నిజమో కలిసే శ్రుతిలో

ఎర్ర ఎర్రానీ బుగ్గమీద
ఎంద బడి మెరిసింది జిగి జిగి
అహా జిగి జిగి
సన్న సన్నానీ నడుము మీదా
చల్ల గాలి విసిరింది గిలి గిలి
అహా గిలి గిలి

చకనమ్మ వల్లంతా చందనాలో
కౌగిట్లొ ఎన్నెన్ని బందనాలో
చకనమ్మ వల్లంతా చందనాలో
కౌగిట్లొ ఎన్నెన్ని బందనాలో


Palli Balakrishna


చిత్రం: విక్రమ్ (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల
నటీనటులు: నాగార్జున, శోభన
దర్శకత్వం: వి.మధుసూదనరావు
నిర్మాత: అక్కినేని వెంకట్
విడుదల తేది: 23.05.1986

నీవె రాగం నేనె గీతం
శ్రుతి చేసింది అనురాగమే
యెవరేమన్నా యెదురేదైనా
నాలో రాగలన్ని నీకే అంకితం
నాలో రాగలన్ని నీకే అంకితం

నీవె రాగం నేనె గీతం
శ్రుతి చేసింది అనురాగమే
యెవరేమన్నా యెదురేదైనా
నాలో రాగలన్ని నీకే అంకితం
నాలో రాగలన్ని నీకే అంకితం

కలాలకు అది కరగదు లే
దైవాలకే అది బెదరదు లే
నడి వేసవికి వసి వాడదు లే
సుడి గాలులకి ఇలా రాలదు లే
కరీదిచ్చె షరాబేడి
గరీబైనా వరిస్తుందీ
అదే ప్రేమా అదే అనురాగం అనుబంధం

నీవె రాగం నేనె గీతం
శ్రుతి చేసింది అనురాగమే
యెవరేమన్నా యెదురేదైనా

ఒక జ్వాలగా అధి రగులునులే
ప్రియ జ్యోతిగా అది మిగిలెనులే
అది యెరుగనిది భయమొకటేలే
మనసెరుగందీ బ్రతుకెందుకులే

అదే సత్యం అదే నిత్యం
అదే ప్రాణం అదే సర్వం
అదే ప్రేమా అదే అనురాగం అనుబంధం

నీవె రాగం నేనె గీతం
శ్రుతి చేసింది అనురాగమే
యెవరేమన్నా యెదురేదైనా
నాలో రాగలన్ని నీకే అంకితం
నాలో రాగలన్ని నీకే అంకితం




Palli Balakrishna



చిత్రం: డమరుకం (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: నాగార్జున, అనుష్క, ప్రియమణి
దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి
నిర్మాత: అక్కినేని వెంకట్
విడుదల తేది: 23.11.2012



Songs List:



ఓంకారం పాట సాహిత్యం

 
చిత్రం: డమరుకం (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: జొన్నవిత్తుల 
గానం: వెంకట్ సాయి 

ఓం ఓం...
ఓంకారం సృష్టి సారం విధివిధి లిఖితం
మోక్షధక్షం సుభిక్షం
గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం
సాన్నపూర్ణా సమక్షం
వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం
శాంతికాంతం సుఖాంతం
విశ్వేశం చిత్ ప్రకాశం శ్రీతజన వరదం
కాశినాధం నమామి...




అరుణ దవల (పంచ గ్రహ కుటమి) పాట సాహిత్యం

 
చిత్రం: డమరుకం (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: జొన్నవిత్తుల 
గానం: కార్తీక్ 

తొం తొం తన తొం తన  తొం తొం తన  తొం తన 

అరుణ ధవళ స్వర్ణోదయా దీప్తిం  - అఖిల భువన చైతన్య ప్రసాదం
కాలజ్ఞాన సత్కారణ ధీరం  - తం నమమి గ్రహనాయక సూర్యమ్             

అమృతా కిరణ రస రమ్య ప్రవాహం  - లలిత లలితా లవణ్య లలామమ్
మధిత మహిత మాదుర్యం మనోభ్యమ్ - తం నమామి నమామి సాంద్రోదయా చంద్రం    

రాగ భోగ సందన నిధనమ్  - రాజ యోగ సంపూర్ణ ప్రభావం
నవ్య దివ్య సౌందర్య సుధీరం  - తం నమామి సమ్మోహాక శుక్రమ్     

అతుల చతుర పటులోకిక మూర్తిం  - సకల కార్య హీత కౌసల కీర్తమ్
తీవ్ర వేగ సంచరణ తత్వం - తం నమామి సౌమ్యం బుధ దేవం  

తొం తొం తాన తొం తాన తొం తొం తాన తొం తన

పరమ ధర్మ సౌసీల్య మహత్త్వం - చరమ రమ్య భోదామృత తత్త్వమ్
వేద శాశ్త్ర దైవాంకిత భుద్దిం  - తం నమమి ధీరాం గురుదేవం    

తొం తొం తన తొం తన  తొం తొం తన  తొం తన 



నేస్తమా నేస్తమా పాట సాహిత్యం

 
చిత్రం: డమరుకం (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: శ్రీకృష్ణ , హరిణి

నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీ కోసం
ప్రాణామా ప్రాణామా నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడనా నీ కోసం
నేననే పేరులో నువ్వు నువ్వనే మాటలో నేను ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా
ఓహొ ప్రేమకే రూపమే ఇచ్చి దానికే ప్రాణమే పోస్తే ఉండదా నిండుగా మనలాగా

నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీ కోసం
ప్రాణామా ప్రాణామా నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడనా నీ కోసం

చరణం: 1
నువ్వంటే ఎంతిష్టం సరిపోదే ఆకాశం
నాకన్నా నువ్విష్టం చూశావా ఈ చిత్రం
కనుపాపలోన నీదే కల యద ఏటిలోన నువ్వే అలా క్షణకాలమైన చాల్లే ఇలా అది నాకు వెయ్యేళ్ళే
ఇక ఈ క్షణం కాలమే ఆగి పోవాలే...

నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీ కోసం
ప్రాణామా ప్రాణామా నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడనా నీ కోసం

చరణం: 2
అలుపోస్తే తలనిమిరే చెలిమౌతా నీకోసం
నిదరోస్తే తలవాల్చే ఒడినౌతా నీకోసం
పెదవంచు పైన నువ్వే కదా పైటంచు మీద నువ్వే కదా నడువోంపు లోన నువ్వే కదా ప్రతి చోట నువ్వేలే
అరచేతిలో రేఖలా మారిపోయావే

నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీ కోసం
ప్రాణామా ప్రాణామా నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడనా నీ కోసం





రెప్పలపై రెప్పలపై పాట సాహిత్యం

 
చిత్రం: డమరుకం (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హరిహరన్ , చిత్ర

రెప్పలపై రెప్పలపై కాటుక రెప్పలపై 
చిరు చప్పుడు చెయ్యని ముద్దొకటిస్తున్నా.. 
చెంపలపై చెంపలపై కెంపుల చెంపలపై 
మరు ముద్దిమ్మంటూ ముందుకు వస్తున్నా.. 
నెమ్మది నెమ్మదిగ ఝుం ఝుం ఝుమ్మని తుమ్మెదగా 
ముచటగా మూడొ ముద్దుకు చోటిమ్మంటున్నా.. 
తొందర తొందరగా ఇచ్చేదివ్వక తప్పదుగా 
తియ్యని పెదవుల చిరునామా నీ చెవిలో చెబుతున్నా.. 

రెప్పలపై రెప్పలపై కాటుక రెప్పలపై 
చిరు చప్పుడు చెయ్యని ముద్దొకటిస్తున్నా.. 
చెంపలపై చెంపలపై కెంపుల చెంపలపై 
మరు ముద్దిమ్మంటూ ముందుకు వస్తున్నా.. 

జరిగి జరిగీ దరికి జరిగీ కలికి విరహాలు కరగనీ.. 
కరిగి కరిగీ కలలు మరిగీ తగిన మర్యాద జరగనీ.. 
సొంపుల రంపంతో నాపై చక్కిలిబొతవె 
చుక్కల రెక్కల సీతకోకై నోరూరించావే.. 
పువ్వుల ప్రాయంలో గుప్పున నిప్పులు పోసావే 
నన్నక్కడ ఇక్కడ చక్కిలి గింతల అల్లరి పెట్టావే.. 

రెప్పలపై రెప్పలపై కాటుక రెప్పలపై 
చిరు చప్పుడు చెయ్యని ముద్దొకటిస్తున్నా.. 
చెంపలపై చెంపలపై కెంపుల చెంపలపై 
మరు ముద్దిమ్మంటూ ముందుకు వస్తున్నా.. 

చిలిపి కన్నే నెమలి కన్నై చిగురు తనువంత తడిమిపో.. 
పులకరింతే మరొక వింతై అనువు అనువంత రగిలిపో.. 
గోపురమే నువ్వు నీపై పావురమై నేను 
గుప్పెడు గుండెల ప్రాంగనమంతా నాదని అంటాలే.. 
గొపికవే నువ్వు నాలో కోరికవే నువ్వూ 
నీ పున్నమి వెన్నెలనేలె పురుషుడు నేనెలే.. 

రెప్పలపై రెప్పలపై కాటుక రెప్పలపై 
చిరు చప్పుడు చెయ్యని ముద్దొకటిస్తున్నా.. 
చెంపలపై చెంపలపై కెంపుల చెంపలపై 
మరు ముద్దిమ్మంటూ ముందుకు వస్తున్నా.. 




ధీంతన నన పాట సాహిత్యం

 
చిత్రం: డమరుకం (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: కరుణాకర్, జొన్నవిత్తుల (మంత్రాలు)
గానం: శంకర్ మహదేవన్  

ఓం, దేవ్యై నమః
ఓం, శ్రుత్యై నమః
ఓం, అత్యై నమః
ఓం ఓం ఓం ఓం

ఓం, యక్యై నమః
ఓం, శక్త్యై నమః
ఓం, రక్త్యై నమః
ఓం ఓం ఓం

ధీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి  నట భంగిమవో
ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో
ఈశ్వరుడే అను నిత్యం తనలో తలుచుకునే ఓంకారమువో
శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో

నీ మదిలో మహదేవుడినే కొలువుంచగ ఓ కైలశము వో
అతని పాదము చెంతన వెలిగే హారతివో
పామరుడికి పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవేనో

ధీంతనతోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో
ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో
ఈశ్వరుడే అను నిత్యం తనలో తలుచుకునే ఓంకారమువో
శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో

ఓం, దేవ్యై నమః
ఓం, శ్రుత్యై నమః
ఓం, అత్యై నమః
ఓం ఓం ఓం ఓం





సక్కు భాయ్ ఘరం చాయ్ పాట సాహిత్యం

 
చిత్రం: డమరుకం (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సుచిత్ సురేషణ్, మమతా శర్మ 

హే సక్కుభాయి జర  దేఖోనా గరం గరం చాయ్
హే సక్కుభాయి నువ్వు చాయ్ ఇస్తే అదోరకం హాయ్
చాయ్ చాయ్ చాయ్ చాయ్ చాయ్
హే ఏస్కో నా ఘుమ ఘుమ చాయ్
యమ ఫేమస్ ఇది ఢిల్లీ టు దుబాయ్
హే తీస్కో నా సల్ల సల్ల చాయ్
భలే మోగిస్తది నరాల్లో సన్నాయి
గుండె గయ్యంటే అల్లం చాయ్ సుయ్యంటే బెల్లం చాయ్
కెవ్వంటే కర్రకాయి చాయ్
ఒళ్ళు ఉడుకైతే జీరా చాయ్ సలవైతే కార చాయ్
ముసుగెడితే ముల్లకాడు చాయ్
నా బంగారు చేతుల్తో పింగాను సాసర్ లో
నీకోసం తెస్తానబ్బాయ్

వెల్కమ్ టు సక్కుభాయి
గరం  చాయ్, తాగేసేయ్, మజా చేయ్
వెల్కమ్ టు  సక్కుభాయి
గరం చాయ్, తాగేసేయ్, మజా చేయ్

హే సక్కుభాయి జర  దేఖోనా గరం గరం చాయ్
హే సక్కుభాయి నువ్వు చాయ్ ఇస్తే అదోరకం హాయ్

సో సో సొగసాకు తీసి, కాచా డికాషన్
పరువాళ్ల మిల్క్ పెదవుల్లో షుగరు పక్కాగా కలిపేసి పెంచా ఎమోషన్ 
నీకేసి చూసి, హ్యాపీ హ్యాపీ టెన్షన్  
తేయాకు లాంటి నాజుకుతోన ఇరగ తీసావే ప్రిపరేషన్
ఆంధ్ర నైజం సీడెడ్ అన్న సిల్లార పిల్లల ఫాలోయింగే
సక్కుభాయి చాయ్ అంటే పడి సచ్చిపోతారు
క్వాటర్ చాయ్ కి లీటర్ బిల్డుప్ ఇచ్చి
మేటర్ పెంచేసావే నీలో ఉందే తాజా హుషారు

వెల్కమ్ టు సక్కుభాయి
గరం  చాయ్, తాగేసేయ్, మజా చేయ్
వెల్కమ్ టు  సక్కుభాయి
గరం చాయ్, తాగేసేయ్, మజా  చే చే చేయ్

ఫుల్ బాటిల్ వాసు, మరో దేవదాసు
శాంపిల్ చూసాడు సక్కు చాయ్ డోసు 
కిక్ ఎక్కి చేసాడు రికార్డు డాన్స్ 
చాల్లే  ఎక్ష్త్రస్  వాడో తేడాకేసు 
నీ జారే వోణిసు చూసాడు బాసు
అంచేత చేసాడు గాల్లో జుంపింగ్స్
లారీ తోలే దార సింఘు సక్కు చాయ్ కి ఫ్యాన్ అయిపోయి
ఇక్కడికిక్కడే నా దాబాలో సెటిల్ అయిపోయాడు
ఆ తింగరి స్టీరింగ్  ఓడి లెక్కే వేరే తిక్కల పిల్ల
నీ ధాబాలో నులక మంచం మెత్తగ ఉందని హత్తుకుపోయాడు

వెల్కమ్ టు సక్కుభాయి
గరం  చాయ్, తాగేసేయ్, మజా చేయ్
వెల్కమ్ టు  సక్కుభాయి
గరం చాయ్, తాగేసేయ్, మజా  చేయ్





లాలి లాలి జోలాలి పాట సాహిత్యం

 
చిత్రం: డమరుకం (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: గోపిక పూర్ణిమ

లాలి లాలి జోలాలి అంటు లాలించాలి ఈ గాలి
లాలి లాలి జోలాలి వింటు లోకాలన్నీ ఊగాలి
నీతో ఆడాలంటూ నేల జారెనంట జాబిల్లి
నీలా నవ్వలేనంటు తెల్లవారె చుసెనంట సిరిమల్లి

లాలి లాలి జోలాలి అంటు లాలించాలి ఈ గాలి
లాలి లాలి జోలాలి వింటు లోకాలన్నీ ఊగాలి

బోసిపలుకె నువు చిందిస్తూ ఉంటే బొమ్మరిల్లాయే వాకిలి
లేత అడుగె నువు కదిలిస్తూ ఉంటే లేడి పిల్లాయే లోగిలి
నీ చిన్ని పెదవంటితే 
పాలనదులెన్నొ యెదలోన పొంగే పొరలి
నిను కన్నా భాగ్యానికే తల్లి పదవొచ్చి మురిసింది ఇయ్యాలె

లాలి లాలి జోలాలి అంటు లాలించాలి ఈ గాలి
లాలి లాలి జోలాలి వింటు లోకాలన్నీ ఊగాలి

లాల నీకే నె పోసేటివేల అభిషేకంలా అనిపించెర
ఉగ్గు నీకే నె కలిపేటి వేళా నైవేద్యంలా అది ఉందిరా
సిరిమువ్వ కట్టేవేళా 
మాకు శివ పూజె గురుతొచ్చె మరలా మరలా
కేరింత కొట్టే వేలా ఇల్లె కైలాసంలా మారె నీవల్ల

లాలి లాలి జోలాలి అంటు లాలించాలి ఈ గాలి
లాలి లాలి జోలాలి వింటు లోకాలన్నీ ఊగాలి




భూనభోంతాలకే పులకింత రా పాట సాహిత్యం

 
జయజయ శంకర శివశివ శంకర
జయజయ శంకరశివ శివ శంకర
జయ జయ శంకర శివశివ శంకర
జయ జయ శంకర శివ శివ శంకర

భూనభోంతాలకే పులకింత రా
దశదిశాంతలకే ఒకవింతరా
కదిలాడు ధరణికే కాంతిమయుడు
కరుణాంతరంగుడై ప్రణవధారుడు
జయజయ శంకర శివశివశంకర
జయజయశంకరశివశివశంకర
జ్ఞాన ప్రభారాశి దివ్యత్రినేత్రం
వేద వేదాంతార్థ జోతిస్వరూపం
కైలాస శిఖరాలు నిజభుజస్కంధాలు
కరుణా సముద్రాలూ స్వామి కనులు

జయజయ శంకరశివశివ శంకర
జయజయ శంకరశివ శివ శంకర
శిరసుపై చలువ ఆ చలువ గంగ
నుదుటికి తళుకు ఆచంద్రవంక
నెమలిపించమువోలునీలకంఠం
చలి మబ్బులువిబూది భస్మం
జయ జయ శంకర శివ శివ శంకర


అభయ ప్రళయశక్తి ఆ త్రిశూలం
అక్షర వ్యాకృతుల ఆకృతే డమరుకం
మణిభూషణం ఆయే సర్పరాజ్యం
సంధ్య కాంతులనెగసె వ్యాఘ్ర చర్మం
జయజయ శంకరశివశివశంకర
సప్తతాండవనటుల నటరాజుపాదం
బ్రహ్మాది దేవతలు మొక్కేటి పాదం
దివినుండి దిగి రాదా ఇలకే ప్రబోధం
దివినుండి దిగి రాదా ఇలకే ప్రబోధం
జయ జయ శంకరశివశివశంకర
పాహిపాహి అనే పరమ భక్తుడే
ద్రోహి అంటూ నిందించగా
భూషణలు భూషణముగా చేసి కొనిచేరె
నాగభూషణుడైన నటరాజు తానే
దైవం మానుష రూపేణా




కన్యాకుమారి ఓ కన్యాకుమారి పాట సాహిత్యం

 
చిత్రం: డమరుకం (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి
గానం: జస్ ప్రీత్ జాజ్, సునీత

కన్యాకుమారి ఓ కన్యాకుమారి
నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపమ్మా దారి
మీనాకుమారి ఓ  మీనా కుమారి
నీ కళ్ళలోనే ఉండాలంటే ఏంచేయాలే నారి
వేసవికన్నా వెచ్చగ నాతో ముచ్చటలాడాలి
వెన్నెల కన్నా చల్లగ నాకే కౌగిలి ఇవ్వాలి
చక్కర కన్నా తియ్యగ నన్నే ప్రేమించాలి

హే రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాలా
హే రారో నీ ముద్దు మాటకి నా సోకులిస్తా గోపాలా

చరణం: 1
ఓ నీ మీసం చూసి మెలి తిరిగెను వయ్యారం 
అది తాకితే చాలు నిదరే రాదే రేయిక జాగారం
నడుమే నయగారం ఆ నడకే శృంగారం 
నీ నడుమున నలిగే మడతకు చేస్తా ముద్దుల అభిషేకం
చల్లగా నన్నే గారడీ చేయకు మన్మథుని మరిదివలే
కళ్ళే మూసి చల్లగ జారకు పూబంతల్లే

రావే నీ పేరు వెనకా నా పేరు పెడతా మధుబాలా
హే రారో నీ ముద్దు మాటకి నా సోకులిస్తా గోపాలా

కన్యాకుమారి ఓ కన్యాకుమారి
నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపమ్మా దారి
మీనాకుమారి ఓ  మీనా కుమారి
నీ కళ్ళలోనే ఉండాలంటే ఏంచేయాలే నారి

చరణం: 2 
సూటిగ నీ చూపే నా గుండెని తాకింది
పేరే తెలియని జ్వరమే ఏదో ఒంటికి సోకింది
నీలో నిప్పుంది అది నాలో రగిలింది
ఎదలొకటై తెలవారే వరకు  ఆరను లెమ్మంది
ఉక్కిరిబిక్కిరి చేసే కోరిక ఎరగను ఇదివరకు
ఒంటరి తుంటరి తుమ్మెదలాగ అంటుకు పోకు

రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాలా
ఓ రారో నీ ముద్దు మాటకి నా సోకులిస్తా గోపాలా

కన్యాకుమారి ఓ కన్యాకుమారి
నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపమ్మా దారి
రాజకుమార ఓ రాజకుమార 
నా గుండెల్లోనే ఉన్నవయ్యో ఎందుకు ఇంకా దారి




శివ శివ శంకర హర హర శంకర పాట సాహిత్యం

 
చిత్రం: డమరుకం (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: శంకర్ మహదేవన్

భం భం భో - భం భం భో (4)

సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా

శివ శివ శంకర హర హర శంకర 
జయ జయ శంకర దిగిరారా
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర 
ప్రళయ భయంకర దిగిరారా

శివ శివ శంకర హర హర శంకర 
జయ జయ శంకర దిగిరారా
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర 
ప్రళయ భయంకర దిగిరారా

ఓం పరమేశ్వరా పరా
ఓం నిఖిలేశ్వరా హరా
ఓం జీవేశ్వరేశ్వరా కనరారా
ఓం మంత్రేశ్వరా స్వరా
ఓం యాంత్రేేశ్వరా స్థిరా
ఓం తంత్రేశ్వరావరా రావేరా

శివ శివ శంకర హర హర శంకర 
జయ జయ శంకర దిగిరారా
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర 
ప్రళయ భయంకర దిగిరారా

సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా

ఆకాశలింగమై ఆవహించరా
డమ డమమని డమరుఖ ధ్వని సలిపి 
జడతని వదిలించరా
శ్రీ వాయులింగమై సంచరించరా
అణువణువున తన తనువున నిలచి 
చలనమే కలిగించరా

భస్మం చేసేయ్ అసురునే అగ్నిలింగమై ప్రవికారా
వరదై ముంచేయ్ జలలింగమై ఘోరా
వరమై వశమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా
జగమే నడిపే పంచభూత లింగేశ్వరా కరునించరా

శివ శివ శంకర హర హర శంకర 
జయ జయ శంకర దిగిరారా
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర 
ప్రళయ భయంకర దిగిరారా

సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా

విశ్వేశ లింగమై కనికరించరా
విధి లిఖితమునిక బర బర బర చెరిపి 
అమృతమె కురిపించరా
రామేశ లింగమై మహిమ చూపరా
పలు శుభములు గని అభయములిడి హితము 
సతతము అందించరా

గ్రహణం నిధనం బాపరా కాళహస్తి లింగేశ్వరా
ప్రాణం నీవై ఆలింగనంమీరా
ఎదలో కొలువై హర హర ఆత్మా లింగమై నిలబడరా
ద్యుతివై గతివై సర్వ జీవలోకేశ్వరా రక్షించరా

శివ శివ శంకర హర హర శంకర 
జయ జయ శంకర దిగిరారా
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర 
ప్రళయ భయంకర దిగిరారా

శివ శివ హర హర జయ జయ దిగిరారా
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర 
ప్రళయ భయంకర దిగిరారా

సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా - భం భం భో
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా-భం భం భో
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా -భం భం భో
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా


Palli Balakrishna


చిత్రం: ఇద్దరూ ఇద్దరే (1990)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: నాగార్జున , నాగేశ్వరరావు, రమ్యకృష్ణ , కె.ఆర్.విజయ
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాతలు: అక్కినేని వెంకట్ , యార్లగడ్డ సురేంద్ర
విడుదల తేది: 05.09.1990

ఓరి దేవుడో  ఇది ఏమిమాయరో
అదో రకం అయోమయం
ఓరి కాముడో ఇది ఏమి హాయిరో
సుఖాసుఖం ప్రతీ క్షణం
లో  లో ఏదో... అయిందయో...
ప్రేమో... ఏమో...

ఆడ గాలిని అడగాలి వెంటనే
అటో ఇటో తెగించనా
ఈడు గోలని అనచాలి వెంటనే
పెదాలతో బిగించనా
ఏకాంతంలో... ఎకా ఎకీ...
జై జై లో లో...

ఆడు యవ్వనం బరువైన ఈ క్షణం
ఎలా మరి భరించడం
ఓరి దేవుడో  ఇది ఏమిమాయరో
అదో రకం అయోమయం


*******   *******  *******


చిత్రం: ఇద్దరూ ఇద్దరే (1990)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

పిట్ట లొట్టి పిట్ట
నీ చెంపకు చంప్కీ కొట్టా
పిట్ట లొట్టి పిట్ట
నీ చెంపకు చంప్కీ కొట్టా
వీదుల్లొ విస్కి కొట్టి నిన్నేలుకుంటా
మాటల్తొ మస్క కొట్టి నే జారుకుంటా
దాచేసుకోకె బుల్లి తట్ట బుట్టా
లొట్టి పిట్ట
నీ చెంపకు చంప్కీ కొట్టా

పిట్ట పోసు పిట్టా
నీ జోరుకి జోడి కట్టా
సందుల్లొ గిల్లి కజ్జ నే పెట్టుకుంటా
చూపుల్తొ చుమ్మ కొట్టి నేనాడుకుంటా
దోచేసుకుంటె యెట్ట తట్ట బుట్ట
పోసు పిట్టా
నీ జోరుకి జోడి కట్టా

పిట్ట లొట్టి పిట్ట
నీ చెంపకు చంప్కీ కొట్టా

టీనేజి టింకర్లు వేసుతుందీ నా ముద్దు..ఉమ్మా
మ్యారేజి సంకెల్లు వేస్తుందా ఆ ముద్దు
తొలి ముద్దు...తొలి ముద్దు
ట్రై చేస్తా...ట్రై చేస్తా
ప్రేమాటా కొత్తంటా పెల్లాటే పాతంటా
ఒక్కీసు పిట్ట నీకే కిస్స్ ఏ కొట్టా

లొట్టి పిట్ట
నీ చెంపకు చంప్కీ కొట్టా
పిట్ట పోసు పిట్టా
నీ జోరుకి జోడి కట్టా
వీదుల్లొ విస్కి కొట్టి నిన్నేలుకుంటా
చూపుల్తొ చుమ్మ కొట్టి నేనాడుకుంటా
దాచేసుకోకె బుల్లి తట్ట బుట్టా
లొట్టి పిట్ట
నీ చెంపకు చంప్కీ కొట్టా
పిట్ట పోసు పిట్టా
నీ జోరుకి జోడి కట్టా

కాలేజి లెక్చర్లు దంచేద్దం ఈ ప్రేమా
స్వీటెజి స్టిక్కర్లు అంటించే నా ప్రేమా
లక్కుంటె పట్టెస్తా...లక్కుంటె పట్టెస్తా
నా గువ్వ గూడెక్కె నా రాజే వేడెక్కె
నా గూడు నీ నైసు గుడ్డె పెట్ట

పోసు పిట్టా
నీ జోరుకి జోడి కట్టా
పిట్ట పోసు పిట్టా
నీ జోరుకి జోడి కట్టా
సందుల్లొ గిల్లి కజ్జ నే పెట్టుకుంటా
మాటల్తొ మస్క కొట్టి నే జారుకుంటా
దోచేసుకుంటె యెట్ట తట్ట బుట్ట
పోసు పిట్టా
నీ జోరుకి జోడి కట్టా
పిట్ట లొట్టి పిట్ట
నీ చెంపకు చంప్కీ కొట్టా


*******   *******  *******


చిత్రం: ఇద్దరూ ఇద్దరే (1990)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో, చిత్ర

అబ్బయిలు చెప్పన ప్రేమ పాటం
అమ్మయిలు నేర్పన కొత్త నాట్యం
జవ్వనలో జాగ్రఫీలు జానలలో జామెట్రీలు
కిస్సింగులో కెమిస్ట్రీలు రొమాన్సులో రహస్యాలు
తెలిపె వలపె విరిసె వయసిది కద

అబ్బయిలు చెప్పన ప్రేమ పాటం
అమ్మయిలు నేర్పన కొత్త నాట్యం
జవ్వనలో జాగ్రఫీలు జానలలో జామెట్రీలు
కిస్సింగులో కెమిస్ట్రీలు రొమాన్సులో రహస్యాలు
తెలిపె వలపె విరిసె వయసిది కద

అబ్బయిలు చెప్పన ప్రేమ పాటం
అమ్మయిలు నేర్పన కొత్త నాట్యం

టట చెప్పర సోదర ప్రతి క్లాసుకీ
దుట్య్ వెయ్యర వీదిలొ చెలి వేటకీ
వీలు చూసి గాలమేసి ఈల కొట్టు
సందు చూసి సిగ చేసి సైటు కొట్టు
ప్రేమ సిక్ష వేడుకుంటు జోల కొట్టు
జాలి చూసి చేరమంటు గోల పెట్టు
పరాభవం యెదురైనా పరాజం అనుకోకు
పరిక్షలే ఫైల్ అయినా నిరాసలో పడిపోకు
సరిగా వినరా బ్రదరు తొలి సిలబసు

అబ్బయిలు చెప్పన ప్రేమ పాటం
అమ్మయిలు నేర్పన కొత్త నాట్యం

సాయం కాలం పార్కులే నీ క్లాసురూం
బేబి హాబి జాబిత నీ పుస్తకం
పాపకెన్ని పరికినీలొ లెక్క పెట్టు
వాల్లకొచ్చు కుక్కపిల్ల జట్టుకట్టు
ఆమెగారి ఈసడింపు ఓర్చుకుంటు
అడ్డమైన చాకిరీలు చేసి పెట్టు
ఇలా ఇలా గడిచాకా తపొఫలం పెరిగాకా
లికించరా ఓ లేఖ ఫలించురా నీ కాక
బదులె దొరికె వరకు కద నడపర

అబ్బయిలు చెప్పన ప్రేమ పాటం
అమ్మయిలు నేర్పన కొత్త నాట్యం
జవ్వనలో జాగ్రఫీలు జానలలో జామెట్రీలు
కిస్సింగులో కెమిస్ట్రీలు రొమాన్సులో రహస్యాలు
తెలిపె వలపె విరిసె వయసిది కద

అబ్బయిలు చెప్పన ప్రేమ పాటం
అమ్మయిలు నేర్పన కొత్త నాట్యం


*******   *******  *******


చిత్రం: ఇద్దరూ ఇద్దరే (1990)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.ఓయ్.బాలు

ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్న
అందనంత ఎదిగిన నిను చూస్తున్న నాన్నా
ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్న
అందనంత ఎదిగిన నిను చూస్తున్న నాన్నా
కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుకీ
కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుకీ
స్వాగతం చెబుతున్నా
నేనె పసివాడ్నై నీ నీడ చేరుకున్నా

జీవితాన ప్రతి పాటం చేదె అనుకున్నా
తియ్యనైన మమతల రుచి నేడే చూస్తున్నా
అనుబంధపు తీరానికి నడిపించిన గురువనీ
అనుబంధపు తీరానికి నడిపించిన గురువనీ
వందనం చేస్తున్నా
నేనె గురుదక్షినగా అంకితం అవుతున్నా

ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్న
అందనంత ఎదిగిన నిను చూస్తున్న నాన్నా

ఉడుకు నెత్తురున్న కొడుకు దుడుకును ఆపాలనీ
ఆపదలో పడనీయక దీపం చూపాలనీ
ఉడుకు నెత్తురున్న కొడుకు దుడుకును ఆపాలనీ
ఆపదలో పడనీయక దీపం చూపాలనీ
వచ్చిన ఈ పిచ్చి తండ్రి పిత్రు రుణం తీర్చి
చల్లరిన ఒంటికి నీ వేడి రక్తమిచ్చి
తోడైన నీ ముందు ఓడానా గెలిచానా

ఒకేతండ్రి నుంచి రెండు జన్మలందుకున్న
తీరని ఆ రుణం ముందు తలను వంచుతున్న

ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్న
అందనంత ఎదిగిన నిను చూస్తున్న నాన్నా

పగలే గడిచింది పదమర పిలిచింది
వయసు పండి వాలుతున్న సూర్యుడ్ని నేను
కాచుకున్న కాల రాత్రి గెలుచేసులు ఏమిటో
కాటుక నది ఈడొచ్చిన నువ్వు చెప్పు వింటాను
రాతిరి కరిగిందీ తూరుపు దొరికిందీ
కల్లు తెరిచి ఇపుడిపుడె ఉదయిస్తున్ననూ
అచ్చమైన స్వచ్చమైన తెలుపంటె యేమిటో
మచ్చలేని నీ మనసుని అడిగి తెలుసుకుంటాను

ఇన్నాల్ల మన దూరం ఇద్దరికి కూడ
ఒకరి కథలు ఇంకొకరికి సరికొత్త చదువురా
పాటలు ఏమైనా నీతి ఒక్కటె నాన్న
చీకట్లు చీల్చడమే ఆయుదమేదైనా


Palli Balakrishna Wednesday, October 11, 2017




చిత్రం:  యువరాజు (1982)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, మురళీమోహన్ ,జయసుధ, సుజాత
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: అక్కినేని వెంకట్, అక్కినేని నాగార్జున
విడుదల తేది: 24.12.1982



Songs List:



నారినారి నడుమ మురారి.. పాట సాహిత్యం

 
చిత్రం:  యువరాజు (1982)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్.పి.బాలు

పల్లవి:
నారినారి నడుమ మురారి.. నీది నాది వేరే దారి
నారినారి నడుమ మురారి.. నీది నాది వేరే దారి
అటు చూస్తే గోదారి.. ఇటు చూస్తే కావేరి
నడిమధ్య ఉన్నాను హరి హరి.. హరి

నారినారి నడుమ మురారి.. నీది నాది వేరే దారి 

చరణం: 1
హా.. తాగానని తప్ప తాగానని.. 
చేస్తానని తప్పు చేస్తానని
అనుకోమాకు కలగనమాకు... గోదారి
వేశానని పందెం వేశానని.. 
పోతానని ఓడిపోతానని
అనుకోమాకు కలగనమాకు... కావేరి

తాగి.. తాగి తాగి.. ఊగి.. ఊగి ఊగి
అడుగు తప్పక.. పదము తప్పక
ఆడిపాడి నిలిచేవాడే.. మగాడు...

నారినారి నడుమ మురారి.. నీది నాది వేరే దారి
అటు చూస్తే గోదారి.. ఇటు చూస్తే కావేరి
నడిమధ్య ఉన్నాను హరి హరి.. హరి
నారినారి నడుమ మురారి.. నీది నాది వేరే దారి   

చరణం: 2
ఆగానని.. ఆగి తాగానని
తింటానని.. దెబ్బ తింటానని
అనుకోమాకు కలగనమాకు.. గోదారి..
చూశానని.. అందం చూశానని
పోయానని.. పడిపోయానని..
అనుకోమాకు కలగనమాకు.. కావేరి

పాడి ఆడి పాడి.. ఆడి పాడి ఆడి
గెలుపు పొందగ.. పిలుపు అందగ
నిన్ను ఓడి గెలిచేవాడే మగాడు...

నారినారి నడుమ మురారి.. నీది నాది వేరే దారి
నారినారి నడుమ మురారి.. నీది నాది వేరే దారి
అటు చూస్తే గోదారి.. ఇటు చూస్తే కావేరి
నడిమధ్య ఉన్నాను హరి హరి..  హరి
నారినారి నడుమ మురారి.. నీది నాది వేరే దారి    



ఎవరో చెప్పారు పాట సాహిత్యం

 
చిత్రం:  యువరాజు (1982)
సంగీతం:  కె.చక్రవర్తి
సాహిత్యం:  దాసరి నారాయణరావు
గానం:  యస్.పి.బాలు,  సుశీల

పల్లవి:
ఎవరో చెప్పారు చిన్నప్పుడు
నాకెవరో చెప్పారు చిన్నప్పుడు
కార్తీక పున్నమి తొలిపొద్దులో
కృష్ణా గోదారి నడిబొడ్డులో
ఒక యువరాజు పుట్టాడని
ఒక యువరాజు పుట్టాడని
వాడే వాడే నారాజు అవుతాడని

ఆ ఆ.. ఎవరో చెప్పారు చిన్నప్పుడు
నాకెవరో చెప్పారు చిన్నప్పుడు
వైశాఖ పున్నమి తొలిపొద్దులో
కృష్ణా కావేరి నడిబొడ్డులో
ఒక యువరాణి పుడుతుందని
ఒక యువరాణి పుడుతుందని
ఆమే ఆమే నారాణి అవుతుందని

ఆ ఆ ఎవరో చెప్పారు చిన్నప్పుడు
నాకెవరో చెప్పారు చిన్నప్పుడు

చరణం: 1
కనులనిండుగుంటాయనీ.. 
కామాక్షి కాదని.. కంచిలో లేదని
ప్రణయానికి రారాజని.. 
దేవేంద్రుడు కాడని.. స్వర్గంలో లేడని

కనుముక్కు తీరు చూసేటి జోరు
కనుముక్కు తీరు చూసేటి జోరు
ఎవరికీ ఇంకెవరికీ లేదని.. లేనేలేదని
ఆమే ఆమే నారాణి అవుతుందని

ఆ ఆ.. ఎవరో చెప్పారు చిన్నప్పుడు
నాకెవరో చెప్పారు చిన్నప్పుడు

చరణం: 2 
సిరులున్న చిన్నోడనీ.. 
శ్రీనివాసు కాడని.. తిరుపతిలో లేడని
చిన్నిముక్కు చిలకమ్మనీ.. 
చిత్రాంగి కాదని.. చిత్రాలు లేవని

చిరునవ్వు నోరు చిరివాడే తీరు
చిరునవ్వు నోరు చిరివాడే తీరు
ఎవరికీ ఇంకెవరికీ లేదని.. లేనేలేదని
వాడే వాడే నారాజు అవుతాడని

ఆ ఆ ఎవరో చెప్పారు చిన్నప్పుడు
నాకెవరో చెప్పారు చిన్నప్పుడు

వైశాఖ పున్నమి తొలిపొద్దులో
కృష్ణా గోదారి నడిబొడ్డులో
ఒక యువరాణి పుడుతుండని
ఒక యువరాజు పుట్టాడని
ఆమే ఆమే నారాణి అవుతుందని

ఆ ఆ ఎవరో చెప్పారు చిన్నప్పుడు
నాకెవరో చెప్పారు చిన్నప్పుడు




నెలలు నిండినట్టు పాట సాహిత్యం

 
చిత్రం: యువరాజు (1982)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్. పి. బాలసుబ్రహ్మణ్యం

పల్లవి:
నెలలు నిండినట్టు
బతుకు పండినట్టు
కానిచోట కాశావు వెన్నెలా
కారడవుల కాశావు వెన్నెలా
ఎవరికొరకు కాశావే వెన్నెలా
ఆడవి కాసినా వెన్నెలా....
ఓ వెన్నెలా... వెన్నెలా...

చరణం: 1
ఏ గుడిలో చేరుటకో
జడలో ముగియిటకో
పువ్వులు పూస్తాయి ఆశగ చూస్తాయి
ఏ తుఫాను రక్కసికో ఏ పిశాచి చేతులకో
బలియై పోతాయి అవి నేలరాలి పోతాయి
ఎవరికొరకు పూశాయె పువ్వులు
చచ్చి బతుకుతున్న యీ శవాలు
ఓ వెన్నెలా... వెన్నెలా...

చరణం: 2
ప్రేమికులను పిలుచుటకో
ఏ ప్రియులను కలుపుటకో
పున్నమి వస్తుంది  వెన్నెల కాస్తుంది
ఏ మబ్బుల దప్పికకో  ఏ గ్రహణపు ఆకలికో
ఆహుతి అవుతుంది కధ ముగించుకొని పోతుంది
ఎవరికొరకు కాసిందో వెన్నెలా....
అమవాసయి పోతుంది కడకిలా
ఓ  వెన్నెలా... వెన్నెలా...





నీలాల నింగి పాట సాహిత్యం

 
చిత్రం: యువరాజు (1982)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం:  దాసరి నారాయణరావు
గానం:  యస్.పి.బాలు,  సుశీల

పల్లవి:
నీలాల నింగి ఒకసారి వంగి
నీలాల నింగి ఒకసారి వంగి
అద్దాల చెక్కిలి ముద్దాడిపోతే
అదే అచ్చట.. అదే ముచ్చట
అదే ముచ్చట అదే అచ్చట.. ఈ జన్మకంట

నీలాల నింగి ఒకసారి వంగి
నీలాల నింగి ఒకసారి వంగి
అద్దాల చెక్కిలి ముద్దాడిపోతే
అదే అచ్చట.. అదే ముచ్చట
అదే ముచ్చట అదే అచ్చట.. ఈ జన్మకంతా

చరణం: 1
పయనించు మేఘాలు పయనాలు ఆపి
చిరునవ్వు నవ్వి చిరుజల్లు చల్లి
కదలి వెడలిపోతే అదే ముచ్చట

సెలయేటి పరవళ్ళు కాసేపు ఆగి
సెలయేటి పరవళ్ళు కాసేపు ఆగి
సిగ్గుల్లో నిన్ను మైకంలో నన్ను
చూసి చూడలేక.. ఉండీ ఉండలేక
కదలి వెడలిపోతే అదే ముచ్చట.. అదే అచ్చట
అదే ముచ్చట అదే అచ్చట.. ఈ జన్మకంతా

నీలాల నింగి ఒకసారి వంగి
అద్దాల చెక్కిలి ముద్దాడిపోతే
అదే అచ్చట.. అదే ముచ్చట
అదే ముచ్చట అదే అచ్చట.. ఈ జన్మకంతా

చరణం: 2
నిదురించు అందాలు ఒకసారి లేచి
పైపైకి వచ్చి పరువాలు చూసి
నిదుర మరచిపోతే అదే ముచ్చట

లోలోని కోరికలు లోకాలు మరిచి
లోలోని కోరికలు లోకాలు మరిచి
కళ్ళల్లో నిన్ను..  కౌగిళ్ళో నన్ను
ఉంచీ ఉంచలేక వదలీ వదలలేక
కదలి వెడలిపోతే అదే ముచ్చట అదే అచ్చట
అదే ముచ్చట అదే అచ్చట.. ఈ జన్మకంతా

నీలాల నింగి ఒకసారి వంగి
అద్దాల చెక్కిలి ముద్దాడిపోతే
అదే అచ్చట.. అదే ముచ్చట
అదే ముచ్చట అదే అచ్చట.. ఈ జన్మకంతా




ఎవరా నలుగురు పాట సాహిత్యం

 
చిత్రం: యువరాజు (1982)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం:  దాసరి నారాయణరావు
గానం:  యస్.పి.బాలు

పల్లవి :
ఎవరు, ఎవరు ? ఎవరు ?
ఎవరా నలుగురు ఏరా నలుగురు నీవాణ్ణి
నీలో వున్నవాల్లా
నిన్ను చూసి నవ్వేవాళ్ల
నవ్వలేక ఏడ్చేవాణ్ణి

నిను నవ్వులపాలు చేసేవాల్లా
ఎవరా నలుగురు, ఏరా నలుగురు
ఎవరా నలుగురు నలుగురు
ఏరా నలుగురు నలుగురు

Tell me who aro thiey?  Where are they?

చరణం: 1
ఎవడో ఏదో అన్నాడని
ఆలిని వెలివేశాడు యుగపురుషు డొక్కడు
ఎవరో ఏదో అంటారని
ఆలిని అమ్మేశాడు మహనీయు డొక్కడు
వెలివేసిన వానిని ఏమన్నారా నలుగురు
అమ్మేసిన వానిని ఏమన్నారా నలుగురు
వినేవాడు ఒకడుంటే అనేవాళ్ళు కోకొల్లలు
పడేవాడు ఒకడుంటే పడగొట్టేవాళ్ళే పదుగురు
ఎవరా నలుగురు - ఏరా పదుగురు..

Come on - Come on - tell me
ఎవరు ? ఎక్కడ ?

చరణం: 2
ఎవరో పోనీ నాకేమని 
ఇంటను కూర్చుంటే అయ్యేవాడా బుద్దుడు
ఎవరో ఏదో చేస్తారని
భయపడి కూర్చుంటే తలచేవారా అభిమన్యుని
శోధించిన వానిని ఏమన్నారా నలుగురు
సాధించిన వానిని ఏమన్నారా నలుగురు
విన్నానని ఒకడంటే చూశానన్నది నలుగురు
అంటాడని ఒకడంటే అన్నాడనేది పదుగురు
ఎవరా నలుగురు ? ఏరా పదుగురు 
Who are they? Where are they
Come on tell me
Where are they ?




అందగాడు పాట సాహిత్యం

 
చిత్రం: యువరాజు (1982)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం:  దాసరి నారాయణరావు
గానం:  యస్.పి.బాలు,  సుశీల

అందగాడు

Palli Balakrishna Wednesday, October 4, 2017



చిత్రం: పిల్ల జమిందార్ (1980)
సంగీతం: కె.చక్రవర్తి 
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
నిర్మాత: అక్కినేని వెంకట్, అక్కినేని నాగార్జున
విడుదల తేది: 26.09.1980



Songs List:



మొన్ననే మోతగా పాట సాహిత్యం

 
చిత్రం: పిల్ల జమిందార్ (1980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: రాజశ్రీ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

మొన్ననే మోతగా - ఓ పొగరుబోతు పిల్ల కొమ్ములొంచాను
నిన్ననే నీటుగా – ఓ గడుసుపిల్ల వయసు దోచుకున్నాను.
రోజుకొక్క మోజు మార్చు మొనగాణ్ణి
రే రే రే రే రేపులరాముణ్ణి -
జిల్లయిపోవాలి కన్ను కొట్టానంటే -
పిల్లయిపోవాలి చెయ్యిపట్టానంటే

గురిచూసి కన్నెవయసు తడితేచాలు -
నేను గురుతుండీపోవాలి తొంబై ఏళ్ళు
ఒంటరిగా దొరికానని ఏడిపిస్తావా. తుంటరిగా వెంటపడిపగబడతావా
చేతులెత్తి మొక్కుతాను పోనీచాలు-
నలుగురిలో చెయ్యొద్దు నవ్వులపాలు-

మొన్ననే గుట్టుగా - ఓ మంచివాడు పెళ్ళిచూపుకొచ్చాడు,
నిన్ననే నీటుగా – ఓ పూలరంగడొచ్చి నన్ను మెచ్చాడు.
ఏడ్చాడు -
రేపు జరుగు పెళ్ళికడ్డురావద్దు - రేరేరేరే రేపులరాముడు.
అందాల రాముడివని అనుకున్నాను.
దొంగరాముడని యిప్పుడు తెలుసుకున్నాను.
రేపులరాముడంటే రాకపొదును.
నేను యీరోజు నీపాలిట పడకపోదును.
వచ్చాక నాకు లొంగిపోవలసిందే -
చచ్చినట్లు నాదారికి రావలసిందే
కన్నెపిల్ల కంటబడితే వుండబట్టదు -
నాకైపు తీరకుంటే నాకు నిద్దరపట్టదు 




గేరు మార్చు, స్పీడు పెంచు పాట సాహిత్యం

 
చిత్రం: పిల్ల జమిందార్ (1980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: రాజశ్రీ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

గేరు మార్చు, స్పీడు పెంచు - చక చకచకచక
చక చక చక చక పోనీ పోనీ కారు
గేరుమార్చా స్పీడు పెంచా - చకచకచకచక
చక చక చక చక పరుగెడుతోంది కారు

చుక్కలాటి చక్కనమ్మ కారెక్కింది - తిక్క రేగి
ఆకారు చెట్టెక్కింది -
డొక్కుకారు ఎక్కడం నాదే తప్పు - నీ
మాట నమ్మిరావడం అసలే తప్పు -
చూడకుండా తోలావు ముందూ వెనక
నా చూపు చెదిరిపోయింది నిన్ను చూశాక-
ఎక్కుకారు.... వెయ్యిడోరు.... చక చక ....

చుప్పనాతి కారుకీ ఏ మొచ్చిందో చెప్పకుండ ఆగింది ఏమయ్యిందో
ఆకతాయి కుర్రదాని అల్లరిచూసి.. ఉలుకొచ్చిందో లేక వుడుకెత్తిందో
ఊకదంపు మాటలకు బండి కదలదు -
దిగిచూస్తేగాని దాని కిటుకు తెలియదు.
తొయ్యికారు -
ముయ్యినోరు




శంభోశంకర మహదేవా పాట సాహిత్యం

 
చిత్రం: పిల్ల జమిందార్ (1980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: రాజశ్రీ 
గానం: యస్.జానకి, యస్.పి.బాలు

శంభోశంకర మహదేవా రంభను నాలో చూసావా..?
రంగులలోన నాపొంగులలోన ఉయ్యాలూగి తేలిసోలిపోవా శివశివ
శంభోశంకర మహదేవా రంభవు నువ్వనుకున్నావా..
ఇంద్రుడనేనే మహేంద్రుడనేనే నాచేంత మోజుతీర్చుకోవా శివశివ
శంభోశంకర మహదేవా- రంభకులేదు నీచొరవ.
రెపరెపలాడే పరువంలోనే... ఉన్నది ఓచిన్నదీ...

ఆశలు రేగే రాతిరివేళ.- చాటుగ రమ్మన్నదీ
కురిసే జడివానలో గుసగుసలాడాలనీ...
కులికే పొదరిళ్ళలో కోరిక తీరాలనీ...
ఈ సందడి ఇక రాదన్నదీ.
వయసు సొగసు నీదన్నదీ

శంభోశంకర మహదేవా రంభకులేదు నీ చొరవ
రంగులలోన నీ పొంగులలోన.. ఉయ్యాలలూగి తేలిసోలనీవా ||శివ॥
చీకటిలోన చిందులు వేసి విందుగ నేనాడనా-
వేకువదాకా వేడుక చేసి తోడుగనే పాడనా...
అల్లరి కేరింతలో అల్లుకు పోతానులే--
కమ్మని కవ్వింతలో కరిగి పోతానులే-
నీ స్నేహము ఇక నాలోకము.
కనీ విని ఎరుగని ఒక మైకము





అందాలొలికే నందకిశోరుడు పాట సాహిత్యం

 
చిత్రం: పిల్ల జమిందార్ (1980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: రాజశ్రీ 
గానం: యస్.పి.శైలజ, యస్.పి.బాలు

అందాలొలికే నందకిశోరుడు-బృందావనిలో వెలిశాడు.
రాధకోసమా.... రాసలీల కోసమా... ?
వేయిరూపాల రేపల్లె గోపాలుడు
వేణునాదాల సంగీత భూపాలుడు మంచికి గొడుగును పట్టీ
వంచనపై పగబట్టి - మాయపూతకీ మదము అణిచివేశాడు
మధుర బురుజుపై ధ్వజమెత్తసాగేడు. కోటకోసమా....
కంసుడి వేటకోసమా... ?

చవితి చంద్రుణ్ణి చూశాడు పొరపాటున
లేని అపవాదు మోశాడు గ్రహపాటున
కొండాకోనా మించీ - అడవులో గాలించీ....
ఎలుగు రాజుని ఎదిరించి పోరేడు
వెలుగు వెదజల్లు మణి తిరిగి తెచ్చాడు.
ప్రేమకోసమా సత్యభామకోసమా ....



వయసేమో 60 పాట సాహిత్యం

 
చిత్రం: పిల్ల జమిందార్ (1980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: రాజశ్రీ 
గానం: పి.సుశీల , యస్.పి.బాలు

ఆఁ...ఆఁ...ఆఁ...వయసేమో 60, మనసేమో 20
వగరుంది పొగరుందినాలో నర్సమ్మాకాసుకో-సరసమే చూసుకో.

అఁ...ఆఁ...ఆఁ... అరవైలో అడుగుబెట్టి ఇరవైలా పట్టుబడ్డ
ఆడేవు పాడేవు తాతా ఏమిటీ కోరిక, అల్లరి చాలిక

మనవరాలికి తాతకు వరసుందీ_ మనసుంటే మజాలకు దారుందీ
ఊరించే నీ అందం చూస్తే చాలు_ఆబ్రహ్మకైన పుడుతుంది రిమ్మ తెగులు.

ముసలాడికి రేగింది ముద్దుముచ్చట-ఇది కనలేదు వినలేదు నేను ఎచ్చట.
నీ మనవడిపై నా కెప్పుడో మనసయ్యింది -
మా ఇద్దరికీ ఏనాడో జతకుదిరింది.
కళ్ళల్లో తీరని పదునుంది గుండెల్లో తాని వలపుంది -
నీకోసం పడుచువాణ్ణి అయిపోతాను --
నీ పరువానికి పగ్గమేసి నిలబెడతాను

మనసులేని పిల్లతో మనువుదండగ -
మనసుపడి వస్తేనే కనులపండుగ -
నా దోరవలపు దాచాను అందగాడికి -
అది యివ్వలేను ఎవ్వరికీ యీ జన్మకి



నీ చూపులోనా.. పాట సాహిత్యం

 
చిత్రం: పిల్ల జమిందార్ (1980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వడ్డేపల్లి కృష్ణ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్.పి.శైలజ 

పల్లవి:
నీ చూపులోనా.. విరజాజివానా
ఆ వానలోనా నేను తడిసేనా.. హాయిగా

నీ నవ్వులోనా.. రతనాల వానా
ఆ వానలోనా నేను మరిచేనా... తీయగా

చరణం: 1
ఆ వెన్నెలేమో.. పరదాలు వేసే
నీ వన్నెలేమో.. సరదాలు చేసే
ఆ వెన్నెలేమో.. పరదాలు వేసే
నీ వన్నెలేమో.. సరదాలు చేసే
వయసేమో పొంగిందీ... వలపేమొ రేగిందీ
వయసేమో పొంగిందీ... వలపేమొ రేగిందీ
కనివిని ఎరుగని తలపులు చిగురించే...

నీ చూపులోనా.. విరజాజివానా
ఆ వానలోనా నేను తడిసేనా.. హాయిగా

నీ నవ్వులోనా.. వడగళ్ల వానా
ఆ వానలోనా నేను మునిగేనా... తేలనా

చరణం: 2
చిరుగాలిలోనా... చిగురాకు ఊగే
చెలి కులుకులోనా... పరువాలు ఊగే

ఈ పాల రేయీ... మురిపించె నన్ను...
మురిపాలలోనా... ఇరికించె నన్ను...

గిలిగింత కలిగించే... మనసంత పులకించే...
జాబిల్లి కవ్వించే... నిలువెల్ల దహియించే...
చెరగని.. తరగని.. వలపులు కురిపించే...

నీ చూపులోనా... విరజాజివానా
ఆ వానలోనా నేను తడిసేనా... హాయిగా

నీ నవ్వులోనా... రతనాల వానా
ఆ వానలోనా నేను మరిచేనా... తీయగా





నా పేరు బాలరాజు పాట సాహిత్యం

 
చిత్రం: పిల్ల జమిందార్ (1980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: రాజశ్రీ 
గానం: యస్.పి.బాలు, మాధవపెద్ది రమేష్

నా పేరు బాలరాజు మూడింది మీకు రోజు -
మీ ఎత్తులకు మీ జిత్తులకు ఇదే చివరిరోజు_
వదిలిస్తా మీ బూజు

తేరగ బాగా కలిసొచ్చిందని తెగతిని బలిశారు.
అన్నం పెట్టినయింటిలోనే కన్నం వేశారు.
కలిమికిచేరిన కప్పలూ.. గోతులు తీసే నక్కలూ
మీ నాటకాలు చాలు మీ బూటకాలు చాలు
మారుస్తా మీ జాతకం...
ఆడిస్తా శివతాండవం- శివతాండవం

నమ్మిన నాకే చివరకు నువ్వు నామం పెడతావా
దగ్గర వాళ్లని చేరదీసే దగాలు చేస్తావా ..?
తేనెలు పూసిన కత్తులు - చేనేమేసే కంచెలూ-
మీ పొగరు అణచివేస్తా - నే తగిన శాస్తి చేస్తా-
వేయిస్తా కోలాటం – నేర్పిస్తా గుణపాఠం.. గుణపాఠం


Palli Balakrishna Wednesday, September 27, 2017

Most Recent

Default