Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Simhadri (2003)




చిత్రం: సింహాద్రి (2003)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: జూ.యన్. టి. ఆర్, భూమిక, అంకిత
దర్శకత్వం: ఎస్. ఎస్. రాజమౌళి
నిర్మాత: వి.విజయ్ కుమార్ వర్మ
విడుదల: 09.07.2003



Songs List:



సింగమలై పాట సాహిత్యం

 
చిత్రం: సింహాద్రి (2003)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్ ( మలయాళం లిరిక్స్  వాలి)
గానం: కళ్యాణి మాలిక్ 

సింగమలై




చీమ చీమ చీమ చీమ పాట సాహిత్యం

 
చిత్రం: సింహాద్రి (2003)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి.బి.చరణ్, గంగ, బ్రహ్మానందం

కస్తూరి భంగు భంగు కావేరి మింగు మింగు
పిల్లతో పింగు పాంగు చిత్రాల చిందేసి సింగు సాంగూ

జింగల్లో జింగ దొరికింది దొంగ 
ముద్దే ఇవ్వంగ నీ మూతే బుంగ 
కసు బుస్సె ఎస్సై పోవంగా...
చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
చీమ తీపి చిరునామా ప్రేమా తెలుసుకోవే భామా
చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
చీమ తీపి చిరునామా ప్రేమా తెలుసుకోవె భామా

జింగల్లో జింగా టింగుల్లో రంగ 
అనిపిస్తా ఉంగ తీరుస్తా బెంగ 
హైలెస్సా తస్సాదియ్యంగా...
చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
చీమ గారి విలునామా ప్రేమా రెచ్చిపోరా మామా
హోయ్ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
చీమ గారి విలునామా ప్రేమా రెచ్చిపోర మామా

చరణం: 1
అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా
వయసంతా హరతి ఇస్తే వయ్యారి గుళ్ళోకొస్తా
ఓలమ్మీ ఈడే కోడై కొక్కొరక్కో అంటే
అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా
పొగరానిది సెగవున్నది సొగసొక్కటే కదా
చెంగులు జారే చెడుగుడు గుళ్ళో
చెమటలు పోసే ఒడిదుడుకుల్లో
చెప్పక తప్పని తిప్పలు ఓరయ్యో ఓ ఓ ఓ

చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
చీమ తీపి చిరునామా ప్రేమా తెలుసుకోవే భామా
జింగల్లో జింగా టింగుల్లో రంగ 
అనిపిస్తా ఉంగ తీరుస్తా బెంగ 
హైలెస్సా తస్సాదియ్యంగా...
హెయ్ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
చీమ తీపి చిరునామా ప్రేమా తెలుసుకోవె భామా

చరణం: 2
అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా
కుర్రాడు కన్నే కొట్టే కుర్రీడు నన్నే కుట్టే
చిర్రెత్తి చీరే తిడ్తే సిగ్గే పుడుతుంటే
అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా
ఎద కంటికి కధ కంచికి పొదరింటకే పదా
చలి చలి వణుకున దుప్పటి దిక్కు
చాలని వయసున కుంపటి దిక్కు
తిప్పలు తప్పని కంపటి లేవమ్మో

చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
చీమ గారి విలునామా ప్రేమా రెచ్చిపోర మామా
జింగల్లో జింగ దొరికింది దొంగ 
ముద్దే ఇవ్వంగ నీ మూతే బుంగ 
కసు బుస్సె ఎస్సై పోవంగా...
చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
చీమ గారి విలునామా ప్రేమా రెచ్చిపోర మామా
చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
చీమ తీపి చిరునామా ప్రేమా తెలుసుకోవె భామా




అమ్మైన నాన్నైన పాట సాహిత్యం

 
చిత్రం: సింహాద్రి (2003)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: కళ్యాణి మాలిక్ 

అమ్మైన నాన్నైన





చిరాకు అనుకో పరాకు అనుకో పాట సాహిత్యం

 
చిత్రం: సింహాద్రి (2003)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్. పి.బి.చరణ్, చిత్ర

చిరాకు అనుకో పరాకు అనుకో 
మరేమిటైనా అనుకో 
నీలో మగాణ్ణి చూస్తే మరింతగా 
మధించ బుద్దేస్తుందనుకో

చిరాకు అనుకో పరాకు అనుకో 
మరేమిటైనా అనుకో 
నీలో మగాణ్ణి చూస్తే మరింతగా 
మధించ బుద్దేస్తుందనుకో

సవాలు అనుకో శివాలు అనుకో 
మరేమిటైనా అనుకో
నీలో తెగింపు చూస్తే మరింతగా 
తెగించ బుద్దేస్తుందనుకో

చరణం: 1
గులాబి రేకో చలాకి బైకో 
అడల్ట్ జోకో కరెంటు షాకో 
మజాల కేకో మగాడి లాకో 
కుమారి షోకనుకో 

స్వరాల సింకో నరాల లింకో 
వరాల ట్రంకో రసాల డ్రింకో 
కులాస డుంకో పలాస డంకో 
నువ్వంటే లైకనుకో

జవాని కోకో ఇవ్వాళ దేఖో... 
జువాన మస్కో నాతోటి చేస్కో
ఊ అంటే ఉస్కో రా అంటే రాస్కో
నా ఇంట జాయింట తలంటు పోస్కో 

సవాలు అనుకో శివాలు అనుకో 
మరేమిటైనా అనుకో
నీలో తెగింపు చూస్తే మరింతగా 
తెగించ బుద్దేస్తుందనుకో

చిరాకు అనుకో పరాకు అనుకో 
మరేమిటైనా అనుకో 
నీలో మగాణ్ణి చూస్తే మరింతగా 
మధించ బుద్దేస్తుందనుకో

చరణం: 2
ముడేసి ముట్కో పడేసి పట్కో
ఒళ్ళంతా చుట్కో కేరింత కొట్కో
బలంగా అల్కో భలేగా గిల్కో 
అదేదో గెల్కెస్కో

అలాగే చెప్కో చులాగ్గా ఒప్కో 
కుచ్చీళ్ళు విప్కో కౌగిళ్ళు కప్కో 
కోరింది ఇచ్కో కొండంత పుచ్కో
ఆపైన కిచ్ కిచ్ కో 

నీ డోరు తీస్కో
నా నోరు మూస్కో 
హే వచ్చాడు చూస్కో
డిగామ వాస్కో 
వయ్యారి పైనే సవారి వేస్కో 
సకాల సుఖాల షికారు చేస్కో

సవాలు అనుకో శివాలు అనుకో 
మరేమిటైనా అనుకో
నీలో తెగింపు చూస్తే మరింతగా 
తెగించ బుద్దేస్తుందనుకో

చిరాకు అనుకో పరాకు అనుకో 
మరేమిటైనా అనుకో 
నీలో మగాణ్ణి చూస్తే మరింతగా 
మధించ బుద్దేస్తుందనుకో




నన్నేదో సెయ్యమాకు పాట సాహిత్యం

 
చిత్రం: సింహాద్రి (2003)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యమ్.యమ్.కీరవాణి, సునీత

నన్నేదో సెయ్యమాకు నడుముకాడ ఏయ్... హా
ఏదేదో సెయ్యమాకు ఏటికాడ  ఏయ్...హా...
ముద్దులెట్టి ముగ్గులో దించమాకు
ముగ్గులోకి దించి నన్ను ముంచమాకు
నేనింకా చిన్నదాన్నిరో... ఓ... ఓ... ఓ...
సాకేదో సెప్పమాకు సందెకాడ  ఏయ్... ఓయ్...
సొకంతా దాచుకోకు ఆడా ఈడ  ఆ... ఏయ్...
అడ్డమైన సిగ్గు నువ్వు సూపమాకు...
అడ్డుగోడ పెట్టి నన్ను ఆపమాకు...
అలవాటు చేసుకోవమ్మో... ఓ... ఓ... ఓ...

నన్నేదో సెయ్యమాకు నడుముకాడ మ్మ్... హా...

చరణం: 1
కందిచేనుకి షికాఋ కెళితే కందిరీగే నను కుడితే
కందిచేనుకి షికాఋ కెళితే కందిరీగే నిను కుడితే
మంట నాలో మొదలవుతుంటే
మందు నేనే ఇస్తుంటే
పెదవి ఎంగిలి పై పైన పూస్తే
బాధ తగ్గి బాగుంది అంటూ హాయిగ కనులే మూస్తే
ఏదేదో సెయ్యమాకు ఆడ ఈడ హేయ్... హా...
నన్నేదో సెయ్యమాకు అందగాడా ఏయ్... హా...
అంతకంటే హయి ఉంది వదులుకోకు
ముందుకొచ్చి ముట్టుకుంటే ముడుచుకోకు
అలవాటు చేసుకోవమ్మో ... ఓ... ఓ... ఓ...

చరణం: 2
చింతపల్లి సంతకు వెళితే  ఓ చింతపూల చీర కొంటే
ఉఁ చింతపల్లి సంతకు వెళితే చింతపూల చీర కొంటే
ఊఁ కట్టు నీకు కుదరకపోతే
నువ్వు సాయం చేస్తుంటే
చెంగు బొడ్లో దోపుతువుంటే
చెంగుమని నువ్వు ఉలిక్కి పడగా నాలో ఉడుకే పుడితే
సాకేదో చెప్పమాకు సందెకాడ  ఏయ్... హా...
షోకంతా దాచుకోకు కోక నీడ ఏయ్... ఏయ్...
పెళ్లి చీర కట్టే దాకా రెచ్చిపోకు
పెద్ద పెద్ద ఆటలేవి ఆడమాకు
అలవాటు చేసుకోవయ్యో... ఓ... ఓ... ఓ...
నన్నేదో సెయ్యమాకు నడుముకాడ ఏయ్... హా...
ఏయ్... హూఁ




చిన్నదమ్మే చీకులు కావాలా పాట సాహిత్యం

 
చిత్రం: సింహాద్రి (2003)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: మనో, శ్రేయగోషల్

చిన్నదమ్మే చీకులు కావాలా 
నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలా
హే చిన్నదమ్మే చీకులు కావాలా 
నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలా
గుమ్మలూరి పిల్ల నా సమ్మలోరికిల్లా 
చెక్కేస్తే ఎల్లా చేస్తాను ఒళ్ళు గుల్లా

చిన్నదమ్మే చీకులు కావాలి 
నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలీ
హే చిన్నదమ్మే చీకులు కావాలి 
నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలీ

చరణం: 1
ఆకులు కావాలా పోకలు కావాలా 
సోకులు కావాలా పూతరేకులు కావాలా
ఆకులు పోకలు పోకలు సోకులు అన్నీ కావాలా 
జున్నే కావాలా అన్నీ కావాలా లేత జున్నేకావాలా
లస్కు టపా లబ్జులు కావాలా దానిమ్మలిచ్చే 
ఉస్కులపా ఊపులు కావాలా

హే లస్కు టపా లబ్జులు కావాలా 
దానిమ్మలిచ్చే ఉస్కులపా ఊపులు కావాలా
శింగరాయ కొండ నా చికాకోలు దండ 
విస్తా కలకండ కాయిస్తా చలి ఎండ

లస్కు టపా లబ్జులు కావాలి 
ఈ గుమ్మతెచ్చే ఉస్కులపా ఊపులు కావాలి
హే లస్కు టపా లబ్జులు కావాలి 
ఈ గుమ్మతెచ్చే ఉస్కులపా ఊపులు కావాలి

చరణం: 2
షాకులు కావాలా షేకులు కావాలా 
షోకులు కావాలా కిస్సు కేకులు కావాలా
షాకులు షేకులు చూపుల బాకులు మొత్తం కావాలా 
మొకే కావాలా మోజే కావాలా ప్రతిరోజు కావాలా

తద్దినక తాకిడి కావాలా ఓ లంగరు లచ్చీ 
లబ్జనక రాపిడి కావాలా
హే తద్దినక తాకిడి కావాలా ఓ లంగరు లచ్చీ 
లబ్జనక రాపిడి కావాలా

ఓసి అందగాడా అబ్బోసి షోకుమాడా 
దూకుడంత చూడ అదిరింది కుర్రదూడ
తద్దినక తాకిడి కావాలి  ఈ లంగరు లచ్చికి 
లబ్జనక రాపిడి కావాలీ
తక తక తక తద్దినక తాకిడి కావాలి ఈ 
లంగరు లచ్చికి లబ్జనక రాపిడి కావాలీ

హే గుమ్మలురి పిల్ల నా సమ్మలోరికిల్లా 
చెక్కేస్తా ఎల్లా చేస్తాను ఒళ్ళు గుల్లా
చిన్నదమ్మే చీకులు కావాలి 
నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలి హే హే హే
అరె చిన్నదమ్మే చీకులు కావాలి నా సామిరంగా 
చీకులమ్మే చిన్నది కావాలి హే హే హే

లబ్జనక రాపిడి కావాలి  లబ్జనక రాపిడి కావాలి  
లబ్జనక రాపిడి కావాలి
ఏహే... ఏహే...





నువ్వు విజిలేస్తె ఆంధ్ర సోడా బుడ్డి పాట సాహిత్యం

 
చిత్రం: సింహాద్రి (2003)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: టిప్పు, చిత్ర

నువ్వు విజిలేస్తె ఆంధ్ర సోడా బుడ్డి
నువ్వు విజిలేస్తె ఆంధ్ర సోడా బుడ్డి
అది వినబడుతుంటె అలజడి రేగి 
జారుతుంది మిడ్డి 
నీ అధరామృతం పుల్లారెడ్డి
నీ అధరామృతం పుల్లారెడ్డి
అరకేజి అప్పుగ ఇస్తె కడతా వడ్డి మీద వడ్డీ

నువ్వు విజిలేస్తె ఆంధ్ర సోడా బుడ్డి
నీ అధరామృతం పుల్లారెడ్డి

కన్నెబాడి కాదమ్మొ అది జీడిపప్పు జాడి
నిన్ను చూసి పట్టా తప్పె పడుచు రైలు గాడి.
ఎన్ని కోట్ల విలువుంటుందో నువ్వు కాల్చు బీడి
ఎప్పుడప్పులవుతాడయ్యొ నిన్ను కన్న డాడి
వేస్తా బేడి చేస్తా దాడి సొగసుల బావిని తోడి
రారా రౌడి దాదా కేడి రాత్రికి చూసై త్రిడి 
నీ గుర్రం కోసం పెంచా నేనే
నీ గుర్రం కోసం పెంచా నేనే వెచ్చనైన గడ్డి 

ని అధరామృతం పుల్లారెడ్డి - డి డి.
ని అధరామృతం పుల్లారెడ్డి... 
అరకేజి అప్పుగ ఇస్తె కడతా వడ్డి మీద వడ్డి

నువ్వు విజిలేస్తె ఆంధ్ర సోడా బుడ్డి - డి డి

కోక బాంకు లాకర్లోన దాచుకోకు వేడి
చెక్కులిస్తె చిక్కొస్తుందే ఇచ్చుకోవె డీడీ
నువ్వు తాకకుంటె పువ్వు పోవునంట వాడి
సుబ్బరంగ సుకపడిపోర దాన్ని నువ్వు వాడి
అరె పుంజు కొడి పంటకు పాడి.
నువ్వు నేనొక జొడి
చింతల్ ఫూడి చిలకల్ పూడి పోదామ జతకూడి
ఓరయ్యొ నీది చెయ్యేకాదు - ఒయ్ 
ఓరయ్యొ నీది చెయ్యేకాదువిశాఖ ఉక్కు కడ్డి 

నువ్వు విజిలేస్తె ఆంధ్ర సోడా బుడ్డి
అది వినబడుతుంటె అలజడి రేగి 
జారుతుంది మిడ్డి 
నీ అధరామృతం పుల్లారెడ్డి
అరకేజి అప్పుగ ఇస్తె కడతా వడ్డి మీద వడ్డి...

వేస్కొ వేస్కొ  విజిలేస్కొ


Most Recent

Default