Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Prema Desam (1996)


చిత్రం: ప్రేమదేశం (1996)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: మనో, ఉన్నికృష్ణన్, డామ్నిక్
దర్శకత్వం: కధీర్
నిర్మాత: జె. రామచంద్ర రావు
విడుదల తేది: 23.08.1996

వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..
వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..
కడలి ఒడిలో నదులు ఒదిగి.. నిదురపోయే వేళా..
కనుల పైన కలలే వాలి.. సోలిపోయే వేళా..

వెన్నెలా వెన్నెలా.. మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..

ఆశ ఎన్నడు విడువదా..
అడగరాదని తెలియదా..
నా ప్రాణం..చెలియా నీవేలే..
విరగబూసిన వెన్నెలా..
వదిలి వేయకే నన్నిలా..
రారాదా..ఎద నీదే కాదా..
నిదురనిచ్చే జాబిలీ..
నిదురలేక.. నీవే వాడినావా..

వెన్నెలా వెన్నెలా.. మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..

మంచు తెరలో అలిసిపోయి..
మధన సంధ్య తూగెనే..
పుడమి ఒడిలో కలలుకంటూ..
పాపా నీవూ నిదురపో..
మల్లె అందం మగువకెరుక..
మనసు బాధ తెలియదా..
గుండె నిండా ఊసులే..
నీ ఎదుటనుంటే మౌనమే..
జోలపాటా పాడినా..
నే నిదురలేక వాడినా..

వెన్నెలా వెన్నెలా.. మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..
వెన్నెలా వెన్నెలా.. మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..**********   ************  ***********చిత్రం: ప్రేమదేశం (1996)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఏ.ఆర్.రెహమాన్

Ooh yeah friendship
friendship is what we' re looking for
ముస్తఫా ముస్తఫా don' t worry ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా
ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా don' t worry mustaffa
కాలం నీ నేస్తం ముస్తఫా
day-by-day day-by-day
కాలం ఒడిలో day-by-day
పయనించే షిప్పే friendship రా

జూన్ పోయి జూలై పుడితే seniorki juniorki
college champus లోనే రాగింగ్ ఆరంభం
student మనసో నందనవనం మల్లెలుంటాయ్ ముల్లులుంటాయ్
స్నేహానికి రాగింగ్ కూడా చేస్తుందోయ్ సాయం
వాడిపోనిది స్నేహమొకటే వీడిపోనిది నీడ ఒక్కటే
హద్దంటూ లేనే లేనిది friendship ఒక్కటే
కష్టమొచ్చినా నష్టమొచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే
కాలేజీ స్నేహం ఎపుడూ అంతం కానిదే
ఓ....ఓ..ఓ...

ఎక్కడెక్కడి చిట్టి గువ్వలు ఏడనుంచో గోరు వంకలు
కాలేజీ champus లోనే నాట్యం చేసెనే
కన్నెపిల్లల కొంటెనవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు
కాలేజీ compound అంటే కోడైకనాలే
కోర్సు ముగిసే రోజువరకు తుళ్ళిపడిన కుర్ర ఎదలో
కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి
స్నేహితుల్ని వీడిపోయే రోజు మాత్రం కంటి నిండా
కన్నీటి తోడేనంట farewell party**********   ************  ***********చిత్రం: ప్రేమదేశం (1996)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు

ప్రేమా…. ప్రేమా…. ప్రేమా ప్రేమా…..
నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతు ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా…
నా నీడ నన్ను విడిపొయిందే నీ శ్వాసలోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా…
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి
రావా నా వాకిట్లో నీకై నే వేచానే
నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతు ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా…

ఆకాశదీపాన్నై నే వేచిఉన్నా నీ పిలుపుకోసం చిన్నారి
నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించలేవా సుకుమారి
నా గుండె లోతుల్లో దాగుంది నీవే
నువు లేక లోకంలో జీవించలేనే
నీ ఊహతోనే బ్రతికున్నా….
నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతు ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా…
నా నీడ నన్ను విడిపొయిందే నీ శ్వాసలోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా…

నిముషాలు శూలాలై వెంటాడుతున్నా ఒడి చేర్చుకోవా వయ్యారి
విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్నా ఓదార్చిపోవా ఓసారి
ప్రేమించలేకున్నా ప్రియమార ప్రేమా
ప్రేమించినానంటూ బ్రతికించలేవా
అది నాకు చాలే చెలీ…..
నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతు ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా…
నా నీడ నన్ను విడిపొయిందే నీ శ్వాసలోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా…
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి
రావా నా వాకిట్లో నీకై నే వేచానే
నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతు ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా…**********   ************  ***********చిత్రం: ప్రేమదేశం (1996)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఉన్ని కృష్ణన్

ఓ వెన్నెలా తెలిపేదెలా… ఓ నేస్తమా పిలిచేదెలా..
కళ్ళు కళ్ళు కలిసాయంట వలపే పువ్వే పూసిందంట
నమ్మినవారే పువ్వుని కోస్తే నీ యదలో బాధ తీరేదెట్టా (2)
ఓ వెన్నెలా తెలిపేదెలా…

జడివాన నింగిని తడిచేయునా గంధాలు పువ్వుని విడిపోవునా
నన్నడిగి ప్రేమ యద చేరెనా వలదన్న యదను విడిపోవునా
మరిచాను అన్నా మరిచేదెలా మరిచాక నేను బ్రతికేదెలా
ఓ వెన్నెలా తెలిపేదెలా…

వలపించు హృదయం ఒకటే కదా ఎడం అయితే బ్రతుకు బరువే కదా
నిలిపాను ప్రాణం నీకోసమే కలనైన కూడా నీ ధ్యానమే
మదిలోని ప్రేమ చనిపోదులే ఏనాటికైనా నిను చేరులే
ఓ వెన్నెలా తెలిపేదెలా… ఓ నేస్తమా పిలిచేదెలా..
కళ్ళు కళ్ళు కలిసాయంట వలపే పువ్వే పూసిందంట
నమ్మినవారే పువ్వుని కోస్తే నీ యదలో బాధ తీరేదెట్టా

Most Recent

Default