సంగీతం: ఎస్. ఎస్. థమన్
నటీనటులు: అల్లు అర్జున్, పూజా హగ్డే, నివేత పేతురాజ్, టబు, నవదీప్, శుశాంత్
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత: అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ
విడుదల తేది: 12.01.2020
Songs List:
ఓ మై గాడ్ డాడీ పాట సాహిత్యం
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: రాహుల్ స్పిల్గున్జ్, రాహుల్ నంబయార్, రోల్ రిడ, బ్లాజ్జే, లేడీ కాష్
సామజవరగమన పాట సాహిత్యం
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: సిరివెన్నెల సీత రాం శాస్త్రి
గానం: సిద్ శ్రీరామ్
నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
నీ కళ్లకు కావలి కాస్తాయే కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు
నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతు ఉంటే ముంగురులు
నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు
సామజవరగమన.. నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున (2)
నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
చరణం: 1
మల్లెల మాసమా.. మంజుల హాసమా..
ప్రతి మలుపులోన ఎదురుపడిన వెన్నెల వనమా...
విరిసిన పించెమా.. విరుల ప్రపంచమా..
ఎన్నెన్ని వన్నె చిన్నెలంటె ఎన్నగ వశమా..
అరె, నా గాలే తగిలినా.. నా నీడే తరిమినా..
ఉలకవా.. పలకవా.. భామా..
ఎంతో బ్రతిమాలినా.. ఇంతేనా అంగనా..
మదిని మీటు మధురమైన మనవిని వినుమా...
సామజవరగమన.. నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున (2)
నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
నీ కళ్లకు కావలి కాస్తాయే కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు
బుట్ట బొమ్మ పాట సాహిత్యం
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: రామజోగ్గయ్య శాస్త్రి
గానం: అర్మాన్ మాలిక్
రాములో రాములా పాట సాహిత్యం
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: అనురాగ్ కులకర్ణి, మంగ్లి సత్యవతి
హేయ్ బ్రదర్ ఆపమ్మా
ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా
అబ్బా.. కడుపు నిండిపోయింది బంగారం...
బంటు గానికి ట్వెంటీ టు
బస్తీ మస్తు కట్-ఔటూ
బచ్చాగాన్ల బ్యాచుండేది
వచ్చినమంటే సుట్టు
కిక్కే జాలక ఓ నైటూ
ఎక్కి డొక్కు బుల్లెట్టు
సందు సందుల మందు కోసం
ఎతుకుతాంటే రూటు
సిల్కు చీర కట్టుకొని
చిల్డ్ బీరు మెరిసినట్లు
పొట్లంగట్టిన బిర్యానీ
బొట్టు బిల్ల వెట్టినట్లు
బంగ్లా మీద నిల్పోనుందిరో సందామావ
సుక్క తాగక సక్కరొచ్చరో ఎం అందం మావ
జింక లెక్క దుంకుతుంటెరో ఆ సందామావ
జుంకి జారి చిక్కుకుందిరో నా దిల్లుకు మావ
పల్లవి:
రాములో రాములా
నన్ను ఆగం చేసిందిరో
రాములో రాములా
నా పానం తీసిందిరో (2)
రాములో రాములా
నన్ను ఆగం చేసిందిరో
రాములో రాములా
నా పానం తీసిందిరో (2)
చరణం: 1
హెయ్! తమలపాకే ఎస్తుంటే
కమ్మగ వాసన ఒస్తా వే
ఎర్రగ పండిన ఋధలు రెండు
యాది కొస్తాయే.
అరె ఫువ్వుల అంగీ ఎస్తుంటే
గుండీ నువ్వై పూస్తావే
పండూకున్న గుండెలో దూరి
లొల్లే చేస్తావే
అరెయ్ ఇంటి ముందు లైటు
మినుకు మినుకుమంటాంటే
నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గుపుట్టిందే
సీరకొంగు తలుపు సాటు సిక్కుకుంటాంటే
ఎహె.. నువ్వు లాగినట్టు ఒళ్ళు
జల్లుమంటాందే
చరణం: 2
నాగస్వరం ఊదుతుంటే నాగు పాము ఊగినట్టు
ఎంటపడి వస్తున్న నీ
పట్టగొలుసు సప్పుడింటు
పట్టనట్లే తిరుగుతున్నవే ఓ సందామాన
పక్కకు పోయి తొంగిజూస్తవే
ఎం టెక్కురా మావ,
రాములో రాములా
నన్ను ఆగం చేసిందిరో
రాములో రాములా
నా పానం తీసిందిరో (5)
సిత్తరాల సిరపడు పాట సాహిత్యం
సాహిత్యం: విజయ్ కుమార్ భల్ల
గానం: సూర్రన్న, సాకేత్ కొమండురి
అల వైకంఠ పురంలో పాట సాహిత్యం