Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Chitram (2000)




చిత్రం: చిత్రం (2000)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
నటీనటులు: ఉదయ్ కిరణ్, రీమా సేన్
దర్శకత్వం: తేజ
నిర్మాత: రామోజీరావు
విడుదల తేది: 24.05.2000



Songs List:



అణగణగనగా చీమలు దోమలు పాట సాహిత్యం

 
చిత్రం: చిత్రం (2000)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: సాహిత్యం: కులశేఖర్
గానం: 

అణగణగనగా అణగణగనగా చీమలు దోమలు
తెల్లకాకికి పిల్లలు నల్లులు బల్లులు రెక్కలున్నా పిల్లులు
గబగబా గలగలగల గుసగుస చేస్తుంటే
రుద్రా భూమి దద్దరిల్లి నిద్రనుంచి ఒక్కసారి శవాలన్నీ లేచాయి
యుద్ధం చేయాలనుకున్నాయి ఎదురు బోదురు నిలుచున్నాయి
కత్తులు తెంచుకుచోచాయి
బిస్మిల్లా బిస్మిల్లా

ఏ మొదలు బాగుందిరా అల్లరి కాళ్ళ మరదలు పిల్ల సందవేల సందుకోచేదా
నాయుడుబావ నిఘ్టుకోస్తావా కొత్తకోక తీసుకొస్తావా
కొకరైక ఎందుకు మల్లి శృంగారంలో అడ్డంబుల్లి
అబ్బో ఆశ అంగడి జల్సా అబ్బనంగ ఆరగిస్తావా

ఈలలు గోలలు ఆడియన్స్ చిందులు
ఆటలు పాటలు అన్ని కుప్పిగంతులు
ఓకే చాలురా ప్రాక్టీస్ ఆపండ్రా
ఫ్యాషనోడు వచేసాడా
మేక్ అప్ ఓడు వచేసాడా
మైక్ సౌండు పెంచండ్ర

అణగణగనగా అణగణగనగా చీమలు దోమలు
తెల్లకాకికి పిల్లలు నల్లులు బల్లులు రెక్కలున్నా పిల్లులు
గబగబా గలగలగల గుసగుస చేస్తుంటే
రుద్రా భూమి దద్దరిల్లి నిద్రనుంచి ఒక్కసారి శవాలన్నీ లేచాయి
యుద్ధం చేయాలనుకున్నాయి ఎదురు బోదురు నిలుచున్నాయి
కత్తులు తెంచుకుచోచాయి
బిస్మిల్లా బిస్మిల్లా
ఈ మాటలు బాగుందిరో ఈ ప్రైస్ మీదెరో





ఢిల్లీ నుంచి గల్లీ దాకా పాట సాహిత్యం

 
చిత్రం: చిత్రం (2000)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం:  కులశేఖర్
గానం: కౌసల్య , రవివర్మ 

పెద్దాపురం అమలాపురం భోగాపురం పిఠాపురం
మైలవరం ఐలవరం గన్నవరం అన్నవరం
భద్రాచలం సింహాచలం నెల్లూరు అల్లూరు
ఏలూరు ఆలూరు గుంటూరు గూడూరు
మోటూరు పాటూరు చిత్తూరు పుత్తూరు
ఒంగోలు కర్నూలు ద్వారపూడి కత్తిపూడి
సంగారెడ్డి రంగారెడ్డి ఆకివీడు నూజివీడు
గాజువాక ఆరిపాక
బాంగ్ ళోర్ మాంగ్ ళోర్
ముంబై కలకటా ఢిల్లీ

ఢిల్లీ నుంచి గల్లీ దాకా
ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండీ గర్ల్ ఫ్రెండ్సు
మళ్ళీ మళ్ళీ డౌటుందంటే ఇస్తాలెండీ రిఫరెన్సు
హల్లో అంటే అల్లుకుపోయే లేడీసున్నారూ
కల్లోనైనా కిస్సిమ్మంటూ వేధిస్తుంటారూ

ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండీ గర్ల్ ఫ్రెండ్సు
మళ్ళీ మళ్ళీ డౌటుందంటే ఇస్తాలెండీ రిఫరెన్సు

బెజవాడ లోన బేబీ గుడివాడలోన గౌరీ
బలివాడలోన గీతా సతివాడలోన సీత
మరువాడలోన హేమ పరవాడలోన ప్రేమ
దువ్వాడ లోన జూలీ ధార్వాడ లోన డాలీ
వాడ వాడల వాళ్ళు వచ్చి మనవాడని విలువిస్తారు
మాటి మాటికి మీదకొచ్చి మనువాడని విసిగిస్తారూ

ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండీ గర్ల్ ఫ్రెండ్సు
మళ్ళీ మళ్ళీ డౌటుందంటే ఇస్తాలెండీ రిఫరెన్సు

హైద్రాబాదులో షైనీ సైదాబాదులో సోనీ
ఆసిఫ్ బాద్ లో ఆశా అలహాబాద్ లో రోసా
ఆదిలాబాద్ లో షీబా అహ్మదబాద్ లో శోభా
మొయినా బాదులో మోనా జాహనా బాదులో మీనా
బాదుబాదుల వాళ్ళు వచ్చీ జిందాబాదులు కొడతారూ
కోడి కూతకు ముందే వచ్చి అంతా బారులు కడతారూ

ఢిల్లీ నుంచి గల్లీ దాకా
ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండీ గర్ల్ ఫ్రెండ్సు
మళ్ళీ మళ్ళీ డౌటుందంటే ఇస్తాలెండీ రిఫరెన్సు
హల్లో అంటే అల్లుకుపోయే లేడీసున్నారూ
కల్లోనైనా కిస్సిమ్మంటూ వేధిస్తుంటారూ

ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండీ గర్ల్ ఫ్రెండ్సు
మళ్ళీ మళ్ళీ డౌటుందంటే ఇస్తాలెండీ రిఫరెన్సు




ఏకాంతవేళ ఏకాంతసేవ పాట సాహిత్యం

 
చిత్రం: చిత్రం (2000)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం:  కులశేఖర్
గానం: కౌసల్య మల్లికార్జున్ 

ఏకాంతవేళ ఏకాంతసేవ నీకొంటే గోల రేపింది జ్వాలా
ఏంచేయమంటావు నాక్కుడాకొత్తేకదా
ఉకొంటామంటాను చదివించి ని సంపద

ఏ వయసే వరసే కలిపిన సొగసే సరసం తెలిపిన
నీ ని పరువం పదమే పాడిన తనువే థాకథిమ్ అడేనా
సోకు శోకాలు ఆపసోపాలు తీరుతున్నాయి నీ చేతి ఓదార్పుతో

ఏకాంతవేళ ఏకాంతసేవ నీకొంటే గోల రేపింది జ్వాలా

నీ ఆధారం సుధాలే పంచేనా దివినే ఇలకే దించేనా
నీ తమకం తపనే రేపేనా ఎగసే అలాలే ఆపేనా
స్వప్నలోకాలు దూరతీరాలు దగ్గరయ్యాయి ఈ వేడి నిట్టూర్పులూ

ఏకాంతవేళ ఏకాంతసేవ నీకొంటే గోల రేపింది జ్వాలా




అన్నయ్యా కుక్క కావాలి పాట సాహిత్యం

 
చిత్రం: చిత్రం (2000)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: నిహాల్, సందీప్, ఆర్ పి పట్నాయక్, రవి వర్మ, గాయత్రి, ఉత్తేజ్

అన్నయ్యా కుక్క కావాలి కుక్క కావాలి
వినరా బ్రదరూ అయోధ్యనేలే రాముని స్టోరీ
దశరధ రాజుకు వారసుడు 
సకల శాస్త్రాల కోవిదుడు
అస్త్రవిద్యలో ఫస్టతడు
మంచి గుణాల లిస్టతడు
ఎట్లుంటడో ఎరికెనా
బ్లూకలర్ల మస్తుగుంటడు
లక్ష్మణుడని బ్రదరున్నాడు
అన్నకి అండగ నిలిచాడు
సెల్ఫిష్ నెస్సుని విడిచాడు
సేవే గొప్పని తలచాడు

ఈనా బ్లూకలరేనా
బ్రదర్సు ఒకటేగాని కలర్సు వేర్రా నాని
దమాక్ ఖరాబైందా ఏం సార్ నీకు
అన్నదమ్ములేమో ఒకటంటావ్
రంగులేమో అలగలగ్ అంటావ్
కత మంచిగ చెప్పుర్రి సార్ నీకు దండం పెడ్త

సీతాదేవను వైఫు ఉన్నది
రామునితోనే లైఫు అన్నది
హానెస్టి తన వైనమన్నది
ఫారెస్టునకే పయనమైనది
రాముని సేవకు తొలిబంటు
అతిబలవంతుడు హనుమంతు
నమ్మిన బంటుగ రాముని పదముల చెంతే ఉంటాడు
పదముల చెంతే ఉంటాడు
సూన్నీకి కోతి లెక్కుంటడు గానీ రామసామిని ఎవ్వడన్నా ఎమన్నా అన్నాడనుకో
కుక్కని కొట్టినట్టు కొడతాడు
ఆ... కుక్క కుక్క కావాలి కుక్క కావాలి

అసలు నిన్నెవడ్రా ఆమాటనమంది
వీడ్ని నోరు మూసి పక్కకి లాక్కెళ్ళండ్రా నోరిప్పనీయద్దసలు

అతల వితల సుతల తలాతల
రసాతల పాతాళ లోకములయందు
అవిక్రమ పరాక్రమవంతుడు
కురువంశొద్భవుండు సుయోధనుండు
రారాజు సోదరులు హండ్రెడు తకతకిట
ఆ పాండవులతో ఉండరు తకతకిట
వాటాలలోన వాదమొచ్చిందీ
బిగ్ వారు దాకా తీసుకొచ్చిందీ

ద్రౌపది వస్త్రాపహరణం ఆపలేదెవరూ దారుణం
పులిలాగ భీమన్న లంఘించినాడు
బలశాలి కోపంతొ కంపించినాడు
గద ఎత్తినాడు తొడ కొట్టినాడు
గద ఎత్తినాడు తొడ కొట్టినాడు
గద ఎత్తినాడు తొడ కొట్టినా
రారాజు గుండెల్ని చీల్చుతానంటూ
నిండు సభలో తాను ప్రతిన పూనాడు

క్లైమాక్స్ల ఫైటింగ్ షురు ఐంది
భీముడు గద తీసిండు పిసికిండు
దుర్యొధనుడు భీ గద తీసిండు పిసికిండు
ఎవ్వరి తొడలు ఆల్లాల్లు కొట్టుకున్నరు
ఆడు కొట్టిండు ఈడు కొట్టిండు
ఈడు తలకాయ మీద కొడ్తె
ఆడు కాల్ మీద కొట్టిండు
ఈడు కాల్ మీద కొడ్తె
ఆడు తలకాయ మీద కొట్టిండు
కొట్టిండు కొట్టిండు
అరె ఎంతైనా భీముడు హీరొ కదబై
దుర్యొధనుడు ఖాళీ విలన్
ఎమైతది భీముని చేత్ల కుక్క సావు సచ్చిండు
ఆ...కుక్క కుక్క కావాలి కుక్క కావాలి

అయ్యొ మళ్ళి గుర్తుచేసాడ్రా
నువ్వు చెప్పు నువ్వు చెప్పు
ఒరే శ్రీశైలం మద్యలో వచ్చుడు కాదుగాని
నువ్వు చెప్పురా

అరెరె చిన్న పోరన్కి కతచెప్పనీకొస్తల్లేదు
ఎం చదువుకున్నార్ వయ్యా మీరు
ఇస్టోరి నే చెప్తా చెవులు పెట్టి ఇనుండ్రి

ఏడేడు లోకాల యాడుంది అంతటి అందం ఓయమ్మ
పుత్తడి బొమ్మల్లె ఉంటుంది బ్రదరూ బాలనాగమ్మ

జంతరు మంతరు మోళీ చేసే మరాఠ మాంత్రికుడు మాయల ఫకీరు వంచకుడు
అందరిలోన సుందరికోసం దుర్భిణి వేసాడు
ఎన్నో ప్లానులు గీసాడు
దుర్భిణిలోన బాలనాగమ్మ రూపం కనిపించి ఆమెను ఇట్టే మోహించీ
బెగ్గరు వేషం వేసుకొచ్చాడు జిత్తుల మాంత్రికుడు మాయల పకీరు వంచకుడు

గప్పుడేమైందో ఎరికెనా
మాయల ఫకీరుగాడు తన చేతిలో ఉన్న మంత్రం కట్టెతోని 
బాలనాగమ్మ తలకాయ మీద ఒక్కటేసిండు
గంతే బాలనాగమ్మ మారిపోయింది
ఎలా మారిపోయింది అరె చెప్తున్నాగ మారిపోయింది
అదే ఎలా మారింది అరె చెప్తున్నాగ టాప్ టు బాటం మారిపోయింది
చెప్తావా లేదా నే చెప్ప
చెప్తావా లేదా  ఏంది కొడ్తరా
ఆ అందరు కొడ్తారా
ఎం డౌటా అబ్బె డౌటేంలె చెప్పినా చెప్పకున్న కొడ్తారు
మాటర్ అసుంటిది
మీ చెతులల్ల నే చావనీకి కుక్క లెక్క మారిందిబై
కుక్క కావాలి కుక్క కావాలి కుక్క కావాలి




మావోయ్ ఓయ్ పారిపోతున్నది పాట సాహిత్యం

 
చిత్రం: చిత్రం (2000)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: సాహిత్యం: కులశేఖర్
గానం: నిహాల్, కౌసల్య, రవివర్మ 

సూపర్ అన్నాడు థాంక్సు చెప్పింది కిస్సులిచాడు
కాచు పట్టింది ఏదోచెప్పాడు సిగ్గుపడింది
రోజ్లిచాడు ఐ లవ్ యూ అన్నడోచ్
మావోయ్ ఓయ్
పారిపోతున్నది ఎవరేంటి
వెళ్ళిపోతున్నది ఎవరేంటి

ఆ అమెరికా అమ్మాయి మావో వెళ్ళిపోతున్నాది మావో
నివాసుకితగు వన్నెలాడి మావో వెళ్ళిపోతున్నాది మావో
వెళ్ళిపోతే వెళ్ళిపోని పిల్లకోతి చెల్లిగాని ఎలిజిబిత్ తేలేరేటి ఓ పిల్ల
వాళ్ళ కోర వాళ్ళకోరా మనసుపడ్డ మల్లి ఇదేరా వెళ్లి పిలుచుకొచ్చేరా అబ్దుల్లా
పిల్ల అదరహో కళ్ళు చెదరహో అధిరచిన్న ముద్దులగుమ్మ బెదిరనహో
పిల్ల అదరహో కళ్ళు చెదరహో అధిరచిన్న ముద్దులగుమ్మ బెదిరనహో

పాప ఓయ్
ఆగిపొమ్మన్నాడు ఎవరేంటి
పారొచ్చేయమన్నాడు ఎవరేంటి
మా పాలకొల్లు పిల్లగాడు పాపో ఆగిపొమ్మన్నాడు పాప
లోలోన బేళ్ళుమోగుతోంది పాపో బెగిరా అన్నాడు పాప
మల్లెపువ్వులాంటి నువ్వు నవ్వుతుంటే రివ్వుమంటూ లవ్ పుట్టుకొచ్చిందే ఓ పిల్ల
అల్లరిక కట్టిపెట్టి ఒట్టుపెట్టి జట్టుకట్టి అల్లుకోరా చుట్టిముట్టి షోకిల్లా
పిల్ల పిలిచేహో కళ్ళు కలిసేహో అధిరాబన్న అసలు కదా ముదిరానహో
పిల్ల పిలిచేహో కళ్ళు కలిసేహో అధిరాబన్న అసలు కదా ముదిరానహో

మావోయ్ ఓయ్
పారిపోతున్నారు ఎవరేంటి
వెళ్లిపోతున్నారు ఎవరేంటి
ఆ అమెరికా అమ్మాయి పాలకొల్లు అబ్బాయి పారిపోతున్నారు మావ మావ
పిల్ల అదరహో పిల్ల ఖజురహో అదిరబాన్న ఇద్దరి జత కుదిరానహో
పిల్ల అదరహో పిల్ల ఖజురహో అదిరబాన్న ఇద్దరి జత కుదిరానహో
పిల్ల అదరహో పిల్ల ఖజురహో అదిరబాన్న ఇద్దరి జత కుదిరానహో




ఊహల పల్లకీలో ఊరేగించన పాట సాహిత్యం

 
చిత్రం: చిత్రం (2000)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: నిహాల్, ఉష

ఊహల పల్లకీలో ఊరేగించన 
ఆశల వెల్లువై రాగం పలికించనా 
ఊహల పల్లకీలో ఊరేగించన 
ఆశల వెల్లువై రాగం పలికించనా 
కలహంసై కబురులు నింపనా 
రాచిలకై కిలకిల నవ్వనా 
నా పెదవుల మధువులె ఇవ్వనా 
సయ్యాటలోనా...

ఊహల పల్లకీలో ఊరేగించనా 
ఆశల వెల్లువై రాగం పలికించనా 

ప్రేమలో తీపి చూసే వయసే నీదిరా 
బ్రతుకులో చేదులున్నా భయమే వద్దురా 
సుడిగుండం కాదురా సుమగంధం ప్రేమరా 
పెనుగండం కాదురా అనుబంధం ప్రేమరా 
సిరి తానుగానే వచ్చి నిన్ను చేరునురా...

ఊహల పల్లకీలో ఊరేగించనా 
ఆశల వెల్లువై రాగం పలికించనా

మేఘాలకు నిచ్చెనె వేయన 
ఆకాశపుటంచులే వంచన 
ఆ జాబిలి కిందకే దించనా...
నా కన్నెకూనా...

ఊహల పల్లకీలో ఊరేగించనా 
ఆశల వెల్లువై రాగం పలికించనా 

ఆశగా పల్లవించే పాటే నీవులే 
జీవితం తోడులేని మోడే కాదులే 
కలిసుండె వేళలో కలతంటు రాదులే 
అమవాసై పోదులే అడియాసే కాదులే 
చిరు దివ్వె గొంతు ఇంక దారి చూపునులే 

ఊహల పల్లకీలో ఊరేగించనా 
ఆశల వెల్లువై రాగం పలికించనా

మేఘాలకు నిచ్చెనె వేయన 
ఆకాశపుటంచులే వంచన 
ఆ జాబిలి కిందకే దించనా 
నా కన్నెకూనా...

ఊహల పల్లకీలో ఊరేగించనా 
ఆశల వెల్లువై రాగం పలికించనా 


Most Recent

Default