Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Pedarayudu (1995)

చిత్రం: పెదరాయుడు (1995)
సంగీతం: కోటి
నటీనటులు: మోహన్ బాబు, రజినీకాంత్, సౌందర్య, భానుప్రియ
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాత: మోహన్ బాబు
విడుదల తేది: 15.06.1995Songs List:ఢమ ఢమ ఢమ ఢమ పాట సాహిత్యం

 
చిత్రం: పెదరాయుడు (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: యస్. పి. బలు, చిత్ర

హరోం హరా... హరోం హరా... (2) 
హా సరబ సరబ సరబ
ఢమ ఢమ ఢమ ఢమ గుండె ఢమరుకం మ్రోగే
ఘణ ఘణ ఘణ ఘణ గొంతు ఘంటగా మారే
తకదిమి ధిమితక తాండవ శంభో లేవా
జడముడి విడివడి నటనములాడగ రావా
శంభో మా గుండె కైలాస శిఖరమ్మురా 
అంబతో నువ్వు కొలువుండి మమ్మేళరా
మా యోగం, క్షేమం, భారం నీదే హా సరబ సరబ సరబ
హరోం హరా... హరోం హరా... (2)

ఢమ ఢమ ఢమ ఢమ గుండె ఢమరుకం మ్రోగే
ఘణ ఘణ ఘణ ఘణ గొంతు ఘంటగా మారే

నమశ్శివాయ సాంబసదాశివ నమశ్శివాయ హారహర శివ శివ (2)

హరోం హరా... హరోం హరా... (2)

మచ్చలున్న చంద్రుడైన పచ్చి విషపు నాగులైన
చెంతను చేర్చే దేవా మా చింతలు తీర్చగ రావా
నెర నమ్మిన దైవం నీవే రాయుడా...
ముక్కోటి వేల్పులలోన ముక్కోపి నువ్వే ఐనా
ఎలుగెత్తి పిలవంగానే పలికేర ఇంకెవరైనా
మా తల్లి, దండ్రి, దైవం నీవే... హా సరబ సరబ సరబ

హరోం హరా... హరోం హరా... (2)

ఢమ ఢమ ఢమ ఢమ గుండె ఢమరుకం మ్రోగే
ఘణ ఘణ ఘణ ఘణ గొంతు ఘంటగా మారే

నమశ్శివాయ సాంబసదాశివ నమశ్శివాయ హారహర శివ శివ (2)

హరోం హరా... హరోం హరా... (2)

గరళం మింగి గంభీరంగా నిలిచావంట నిబ్బరంగా
జగనవ్వే సగబాగంగా ప్రతిలీలా అపురూపంగా
సమ ధర్మం న్యాయం నీదే కాదయ్యా
ఇల్లేమో వెండి కొండ ఇల్లాలు పైడి కొండ
కొండంతరా నీ అండ అందించరా కై దండ
మా ఊరు, వాడ, ఏలే రేరా... హా సరబ సరబ సరబ

హరోం హరా... హర హర హర
హరోం హరా... శంభో శంకర
హరోం హరా... హరోం హరా
హరోం హరా...

ఢమ ఢమ ఢమ ఢమ గుండె ఢమరుకం మ్రోగే
ఘణ ఘణ ఘణ ఘణ గొంతు ఘంటగా మారే
శంభో మా గుండె కైలాస శిఖరమ్మురా 
అంబతో నువ్వు కొలువుండి మమ్మేళరా
మా యోగం, క్షేమం, భారం నీదే... హా సరబ సరబ సరబకో... అన్నదోయి పాట సాహిత్యం

 
చిత్రం: పెదరాయుడు (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బలు, చిత్ర

కో... అన్నదోయి కొండమీద కొక్కిరాయి
రా... అన్నదోయి పైట చాటు పావురాయి
హా... హా...
కో... అన్నదోయి కొండమీద కొక్కిరాయి
రా... అన్నదోయి పైట చాటు పావురాయి
మావ అరే మావ కొట్టేయ్ చుమ్మా హా
జర చూడు గురు కోక యవ్వారం
అరే దులుపు గురు దుమ్మ దుమారం
ఏం చెయ్యాలో చెప్పాలా సందిట్లో యారో
సాగించేయ్ గురూ సరాగం ఎంచక్కా ఎక్కాలోయ్ నిషా నషాలం
ఏయ్ ఏయ్...
సాగించేయ్ గురూ సరాగం ఎంచక్కా ఎక్కాలోయ్ ఉఁ ఉఁ...
కూతంత సేపు సద్దుమనగ నియ్యవోయ్
ఓ రెచ్చిపోయి ఇంటి పరువు తియ్యకోయి
బామ అరె బామ బజ్జుందామా అహ అహ ఊఁ...

ఒంపు సోంపు ఇంపు నాకున్నదీ పిచ్చెక్కించే దమ్ము నీకున్నది
ఓకే ఓకె పాప బజ్జెయ్యనా ఉన్నదంతా నీకే ఇచ్చేయనా
కమ్మంగ రమ్మంట కౌగిల్లే ఇమ్మంటా కానీవయ్యో గలాటా హో మతులే చెడే సయ్యాటా
ఆహా ఉబికిందా ఉబలాటం పరువాలు బులపాఠం చెబుతాలే ఒడిపాఠం పాపాయమ్మో

కో... అన్నదోయి కొండమీద కొక్కిరాయి
రా... అన్నదోయి పైట చాటు పావురాయి
మావ చలో బామ కొట్టేయ్ చుమ్మా హా

చూపే ఊపై ఉయ్యాలుగాలమ్మో ఒళ్లే తుల్లే కయ్యాలాడాలమ్మో
సిగ్గే అగ్గై భగ్గు మన్నాదయ్యో మత్తే సొత్తై హత్తుకోవలయ్యో
చివురాకు నువ్వంట సుడిగాలి నేనంట వెయినా గరం మసాలా హోయ్ తేలించేయినా సుఖాలా
అహా ఊగాల భూగోళం అధరాల భాగోతం పదరాల పాతాళం సయ్యో సయ్యో

కో... అన్నదోయి కొండమీద కొక్కిరాయి
రా... అన్నదోయి పైట చాటు పావురాయి
బామ చలో బామ కొడతా చుమ్మా...
చూశాను చెలి కోక యవ్వారం అరె దులుపుతాను దుమ్ము దుమారం
ఏం చెయ్యాలో చెప్పాలా సందిట్లో దూరి 
సాగిస్తా చలో సరాగం ఎంచక్కా ఎక్కిస్తా నిషా నషాలం
అరె సాగిస్తా చలో సరాగం ఎంచక్కా ఎక్కిస్తా నిషా నషాలంకదిలే కాలమా పాట సాహిత్యం

 
చిత్రం: పెదరాయుడు (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: సాయి శ్రీ హర్ష
గానం: యస్.పి.బాలు, చిత్ర

కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా
జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా
పేగే కదలగా సీమంతమాయెలే ప్రేమదేవతకు నేడే
కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా

లాలించే తల్లీ పాలించే తండ్రీ నేనేలే నీకన్నీ
కానున్న అమ్మా నీ కంటి చెమ్మ నే చూడలేనమ్మా
కన్నీళ్ళలో చెలికాడినే...
నీ కడుపులో పసివాడినే
ఏనాడు తోడును నీడను వీడనులే

కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా
పేగే కదలగా సీమంతమాయెలే ప్రేమదేవతకు నేడే
జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా

తాతయ్య తేజం పెదనాన్న నైజం కలిసున్న పసిరూపం
నీ రాణితనము నా రాచగుణము ఒకటైన చిరుదీపం
పెరిగేనులే నా అంశము...
వెలిగేనులే మా వంశము...
ఎన్నెన్నో తరములు తరగని యశములకు
ఎన్నో నోములే గతమందు నోచి ఉంటా
నీకే భార్యనై ప్రతి జన్మనందు ఉంటా
నడిచే దైవమా నీ పాదధూళులే పసుపు కుంకుమలు నాకు
ఎన్నో నోములే గతమందు నోచి ఉంటా
నీకే భార్యనై ప్రతి జన్మనందు ఉంటా
అబ్బ దాని సోకుచూసి పాట సాహిత్యం

 
చిత్రం: పెదరాయుడు (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బలు, చిత్ర

ఓ ఓ ఓ హో... ఓ ఓ ఓ హో
అబ్బ దాని సోకుచూసి వచ్చా వచ్చా దాని ఉబ్బరాల జబ్బ షేపు మెచ్చా మెచ్చా
బుజ్జిగాడి జోరుచూసి వచ్చా వచ్చా బొండు మల్లెపూలు మాలగుచ్చి తెచ్చా తెచ్చా
అందమంత అందితే అచ్చా అచ్చా సంబరంగ చెయ్యనా గిచ్చాంగిచ్చా
ఓయబ్బా ఆ గీర చూసి ముందుకొచ్చా
ఓ ఓ ఓ హో... ఓ ఓ ఓ హో

అబ్బ దాని సోకుచూసి వచ్చా వచ్చా దాని ఉబ్బరాల జబ్బ షేపు మెచ్చా మెచ్చా

ఓ ఓ ఓ హో... ఓ ఓ ఓ హో
ఓ ఓ ఓ హో... ఓ ఓ ఓ హో
రేకులు విప్పి సోకుని అడిగా ఎందుకు నీకా తొందరని
సాకులు చెప్పే సిగ్గుని అడిగా మూసిన తలుపులు తెరవమని...
పెట్టాలి కళ్యాణం బొట్టు కట్టాలి కావిడితో జట్టు మోహపు మబ్బులు కమ్మిన రాతిరిలో...
ఔనంటే పట్టేస్తా పట్టు కాదంటే పెట్టేస్తా ఒట్టు కొంగులు జారిన కమ్మని జాతరలో
మధుపర్కాలు కట్టి నాకు మేనాలు ఎక్కి నాకు చూపులన్ని గుచ్చుకుంటే ఎంతొ హోయో
ఓ ఓ ఓ హో... ఓ ఓ ఓ హో

అబ్బ దాని సోకుచూసి వచ్చా వచ్చా దాని ఉబ్బరాల జబ్బ షేపు మెచ్చా మెచ్చా

ఓ ఓ ఓ హో... ఓ ఓ ఓ హో
ముచ్చటగుందే ముద్దుల గుమ్మా మన్మధయాగం సాగించనా
ముద్దుల యోగం తన్నుకు వస్తే చెక్కిలి మేళం పెట్టించనా
వాకిట్లో విరిసింది మల్లి కౌగిట్లో కరగాలే బుల్లి వెచ్చని ఊహలు రెచ్చిన సందడిలో
పెదవుల్లో పుట్టాలి ముద్దు చీకట్లో చెరగాలి హద్దు మక్కువ రేపిన ఆశల ఉప్పెనలో
ముద్దు ప్రాణాలు ఎక్కుపెట్టి తీరాలు గుర్తుపట్టి సోకులన్ని దోచుకుంటే ఎంతో హాయో

ఓ ఓ ఓ హో... ఓ ఓ ఓ హో
అబ్బ దాని సోకుచూసి వచ్చా వచ్చా దాని ఉబ్బరాల జబ్బ షేపు మెచ్చా మెచ్చా
బుజ్జిగాడి జోరుచూసి వచ్చా వచ్చా బొండు మల్లెపూలు మాలగుచ్చి తెచ్చా తెచ్చా
అందమంత అందితే అచ్చా అచ్చా సంబరంగ చెయ్యనా గిచ్చాంగిచ్చా
ఓయబ్బా ఆ గీర చూసి ముందుకొచ్చా
ఓ ఓ ఓ హో... ఓ ఓ ఓ హో (2)
హే బావవి నువ్వు భామని పాట సాహిత్యం

 
చిత్రం: పెదరాయుడు (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బలు, చిత్ర

నన్నా నననే... ఆఁ... (2)
ఆఁ...  హుఁ... నా....
హే బావవి నువ్వు భామని నేను ఇద్దరమొకటవనీ
మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవనీ
బావవి నువ్వు భామని నేను ఇద్దరమొకటవనీ
మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవనీ
కొత్తకోక కిర్రెక్కిపోని సన్నరైక వెర్రెత్తిపోని (2)
కన్నె సొగసే దుమ్మెత్తిపోని
బావవి నువ్వు భామని నేను ఇద్దరమొకటవనీ
మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవనీ

చరణం: 1
ఒంటరి ఒంటరి వయసు తుంటరి తుంటరి మనసు
జంటను వెతికే వేళ ఇది 
తొందర తొందర పడకోయ్ అల్లరి అల్లరి మొగడా రెక్కలు విప్పిన రాతిరిది
హోయ్ పైన చూస్తే తళుకుల తార కింద చూస్తే వెన్నెల ధార
హా పక్కనుందోయ్ ముద్దుల డేరా సక్కగొచ్చి హత్తుకుపోరా
పడుచు ఒడినే పంచుకుపోరా

ఓయ్ భామవి నువ్వు బావను నేను ఇద్దరమొకటవనీ
మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవనీ

చరణం: 2
హే కత్తెర చూపులు కొడితే సిగ్గులు వాకిట తడితే ఉక్కిరిబిక్కిరి అయిపోనా 
తత్తర తత్తర పడితే ఠక్కున కౌగిలి విడితే టక్కరి పిల్ల రెచ్చిపోనా
హో గువ్వ గుట్టు గోరింకకెరుక పిల్ల బెట్టు పిల్లాడికెరుక
ఒప్పుకుంటే వయ్యారికూన కురిసిపోదా ముత్యాలవాన
జంట తాళం చూడవే జాణ

బావవి నువ్వు భామని నేను ఇద్దరమొకటవనీ
మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవనీ
కొత్తకోక కిర్రెక్కిపోని సన్నరైక వెర్రెత్తిపోని (2)
కన్నె సొగసే దుమ్మెత్తిపోని
బావవి నువ్వు భామని నేను ఇద్దరమొకటవనీ
మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవనీ
హాఁ నిద్దర కరువవనీ... 
అహా హా ఇద్దరమొకటవనీ...

Most Recent

Default