చిత్రం: జస్టిస్ చౌదరి (1982)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (ఈ చిత్రం లోని అన్ని పాటలు వేటూరి గారు రాశారు)
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
నటీనటులు: యన్. టి. ఆర్, శ్రీదేవి, శారద, జయంతి
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: టి. త్రివిక్రమ రావు
విడుదల తేది: 28.05.1982
నీ చెక్కిలి వెల ఎంత హ నీ చెక్కెర ముద్దంత
హ నీ కౌగిళి వెల ఎంత హ నీ వెచ్చని గిలిగింత
కన్నుకుట్టి నోళ్ళ చూపు కవ్వింత
కన్నుకొట్టి నోళ్ళ ఊపు ఊరంతా
నాకేల ఆ చింత నీ చెంత
నీ చెక్కిలి వెల ఎంత హ నీ చెక్కెర ముద్దంత
హ నీ కౌగిళి వెల ఎంత హ నీ వెచ్చని గిలిగింత
మల్లెలిచ్చి కొంటాలే మత్తు మత్తు నీ నవ్వు
పాపనిచ్చుకుంటాలే రెప్పలాంటి నీ సోకు
మల్లెలిచ్చి కొంటానే మత్తు మత్తు నీ నవ్వు
పాపనిచ్చుకుంటాలే రెప్పలాంటి నీ సోకు
అందమిచ్చి ఆదుకో అదుపులేని ఆకల్లు
పెడవితోనే వేసుకో ప్రేమ పూల సంకెళ్లు
నీలి కొండ నీటి ఎండ నీడల్లో
గోరువెచ్చ వెన్నెలమ్మ కోనల్లో
వేస్తాలే వెయ్యేళ్ల సంకెళ్లు
నీ చెలిమికి వెల ఎంత హ నీ వెచ్చని వలపంత
హ నీ నవ్వుల వెల ఎంత హ నీ మల్లెల మనసంతా
కన్నుకొట్టి నోళ్ళ ఊపు ఊరంతా
కన్నుకుట్టి నోళ్ళ చూపు కవ్వింత
నాకేల ఆ చింత నీ చెంత
నీ చెక్కిలి వెల ఎంత హ నీ చెక్కెర ముద్దంత
హ నీ కౌగిళి వెల ఎంత హ నీ వెచ్చని గిలిగింత
సిగ్గులిచ్చి కొంటాలే బుగ్గమీద నీ గుర్తు
దమ్ములిచ్చి కొంటాలే అమ్ముకోని నీ గుర్తు
సిగ్గులిచ్చి కొంటాలే బుగ్గమీద నీ గుర్తు
దమ్ములిచ్చి కొంటాలే అమ్ముకోని నీ గుర్తు
సందె బేరమాడుకో చందమామ సంతల్లో
రాయబార మెందుకో చందమామ సైగల్లో
హత్తుకున్న హాయిగున్న గంటల్లో
హాయికన్న తీయగున్న మంటల్లో
కౌగిళ్ళ నూరేళ్ళ పెళ్ళిళ్ళు
నీ చెక్కిలి వెల ఎంత హ నీ చెక్కెర ముద్దంత
హ నీ కౌగిళి వెల ఎంత హ నీ ముద్దుల గిలిగింత
కన్నుకుట్టి నోళ్ళ చూపు కవ్వింత
కన్నుకొట్టి నోళ్ళ ఊపు ఊరంతా
నాకేల ఆ చింత నీ చెంత
నీ చెలిమికి వెల ఎంత హ నీ వెచ్చని వలపంత
హ నీ నవ్వుల వెల ఎంత హ నీ మల్లెల మనసంతా
చిత్రం: జస్టిస్ చౌదరి (1982)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
నీ తొలిచూపులోనే..ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా
వాడిన వన్నెల వలపుల కుంకుమ తిలకాలుగా దిద్దుకోనా
నీ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా మీటు వేళా
నా తొలిచూపుటోనే..నింగిని నేలకు వంచిన చెక్కిట చిరు చుక్కగా ఉండిపోనా
అల్లుకుపోయిన ఆశల ముంగిట తొలి ముగ్గులే దిద్దుకోనా
నీ శ్రుతిలో సుస్వరమై..నీ లయలో మనసుయ్యాలగా ఊగు వేళా..
చిగురు సొగసు చిదిమితేనే దీపమవ్వాలి నా కంటికీ
తొడిమలన్నీ పూలు తొడిగీ..తొలకరించాలి నీ నవ్వుకీ
నీలి నింగీ..తెల్ల మబ్బూ..గొడుగు పట్టాలి నీ రాకకీ
వాగు వంకా వెల్లి విరిసీ మడుగులొత్తాలి నీ కాళ్ళకీ
కన్నులలో..ఆ ఆ ఆ..హారితివై..ఆ ఆ ఆ
కౌగిలిలో..ఆ ఆ ఆ..శ్రీమతివై..ఆ ఆ ఆ
కరిగేది ఎన్నాళ్ళకో..
మది ఆలాపనై సాగు వేళా
నీ తొలిచూపులోనే.. నింగిని నేలకు వంచిన చెక్కిట చిరు చుక్కగా ఉండిపోనా
కోకిలమ్మ కొత్త చీరా సారెలదగాలి మన పెళ్ళికీ
కోనసీమ కొబ్బరాకు పందిరెయ్యాలి మన ఇళ్ళకీ
మాఘమాసాలు ముందు రావాలి..మంచి లగ్గాలు చూసీ
రామచిలకల్ల ప్రేమపలుకుల్లు పెళ్ళి మంత్రాలు చేసీ
కలలన్నీ..ఆ ఆ ఆ..కాపురమై..ఆ ఆ ఆ
మమతలకే..ఆ ఆ ఆ..గోపురమై..ఆ ఆ ఆ
కరిసేది ఎన్నాళ్ళకో..
శుభశకునాలు పలికేటి వేళా
నా తొలిచూపుటోనే.. ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా
అల్లుకుపోయిన ఆశల ముంగిట తొలి ముగ్గులే దిద్దుకోనా
నీ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా మీటు వేళా
చిత్రం: జస్టిస్ చౌదరి (1982)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు
చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో
ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో
కడుపు తీపికి కట్టు బడని తీర్పు
కన్నీటికి కరిగిపోని ఈ తీర్పు
ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు
తప్పా... తప్పా... తప్పా... నో నెవర్
I am in the hands of law
Anything happens its not my law
కఠినమన్నది ధర్మం కన్నులేనిది న్యాయం
మనసు లేనిది చట్టం మనిషి జన్మకి ఖర్మం
న్యాయమూర్తిగా నేనెప్పుడూ
న్యాయస్థానం నాదైనప్పుడు
నాకు మీరు లేరు నేను నేను కాను నేను నేను కాను
ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు
తప్పా... తప్పా... నో
సత్యం కోసం హరిచంద్రుడు సతి సుతులని ఎడబాసింది
గర్భవతిని సీతమ్మని రాముడు కారడవికి పంపించింది
కన్న తల్లిని కాదని కర్ణుడు రాజా త్యాగం చేసింది
కన్న కొడుకునే కాదని నేనే కన్నీటిని దిగమింగుతుంది
ఎందుకోసం ఆ ఎందుకోసం
దహించిన అది ధర్మమా గనుక
సహించాలి అది సత్యం గనుక
కృశించినా నే నశించిన అది న్యాయం గనుక
ఆ న్యాయమే నా దైవం గనుక
చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో
ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో
కడుపు తీపికి కట్టు బడని తీర్పు
కన్నీటికి కరిగిపోని ఈ తీర్పు
ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు
చిత్రం: జస్టిస్ చౌదరి (1982)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
పల్లవి:
అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది
అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది
గుండెల్లో ఎండేసే శీతాకాలంలో
నీ సాయం కావాలి సాయంకాలంలో
అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది
అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది
సాయంగా రావాలి సాయంకాలంలో
నీతోడే కావాలి శీతాకాలంలో
చరణం: 1
పెనుగులాడి పెనవేసుకొనే ఆకలౌతా చలికాబోలు
హత్తుకున్న వత్తిడిలోని హాయి పేరే చలికాబోలు
ఏమిటో మరి ఎందుకోచలి
ప్రేమలో రుచి పెంచుతున్నది
కౌగిలింతల ఉరివేసుకున్న
భోగిమంటల ఎద కాచుకున్నా
పగలు రేయి సెగలు రేపి
దుప్పటిలోనే తప్పెటగుళ్ళు మోగించేసింది
అబ్బ ముసురేసింది
అయ్యో చలి వేసింది
అబ్బ ముసురేసింది
అయ్యో చలి వేసింది
సాయంగా రావాలి సాయంకాలంలో
నీతోడే కావాలి శీతాకాలంలో
చరణం: 2
చేతికందని చెలగాటాలకు బీడు కలుపే చలికాబోలు
నిదురపోయిన నిన్నటి వలపుల మేలుకొలుపే చలికాబోలు
వాడుకో చలి వేడిగా మరి
ఈడుకే ఇది కొత్త ఊపిరి
నిన్ను నాలో కలిపేసుకున్నా
కలిసి ముద్దుల గడి ఏసుకున్నా
పెర పెరలనే సరిగమలతో
గుప్పిటిలోనే గుజ్జన గుళ్ళు ఆడించేసింది
అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది
అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది
సాయంగా రావాలి సాయంకాలంలో
నీతోడే కావాలి శీతాకాలంలో
అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది
అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది
గుండెల్లో ఎండేసే శీతాకాలంలో
నీ సాయం కావాలి సాయంకాలంలో