-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Teja"



చిత్రం: ఒక V చిత్రం (2006)
సంగీతం: శ్రీ మురళి 
సాహిత్యం: శివ గణేష్ (All)
నటీనటులు: ఆది పినిశెట్టి, వంశి కృష్ణ, పూనమ్ కౌర్, మధు శాలిని 
దర్శకత్వం: తేజ
నిర్మాత: దాసరి నారాయణరావు
విడుదల తేది: 19.05.2006



Songs List:



టైటానిక్ పాట సాహిత్యం

 
చిత్రం: ఒక V చిత్రం (2006)
సంగీతం: శ్రీ మురళి 
సాహిత్యం: శివ గణేష్ 
గానం: ఇర్ఫాన్ ఆలి, సౌమ్య, బేబీ శిరీష, తేజ 

టైటానిక్



చంద్రముఖి పాట సాహిత్యం

 
చిత్రం: ఒక V చిత్రం (2006)
సంగీతం: శ్రీ మురళి 
సాహిత్యం: శివ గణేష్ 
గానం: మురళి, సౌమ్య

చంద్రముఖి 



సుగ్రీవా పాట సాహిత్యం

 
చిత్రం: ఒక V చిత్రం (2006)
సంగీతం: శ్రీ మురళి 
సాహిత్యం: శివ గణేష్ 
గానం: నవీన్ , సౌమ్య

సుగ్రీవా




అమిగో పాట సాహిత్యం

 
చిత్రం: ఒక V చిత్రం (2006)
సంగీతం: శ్రీ మురళి 
సాహిత్యం: శివ గణేష్ 
గానం: సౌమ్య

అమిగో 



మనసా పాట సాహిత్యం

 
చిత్రం: ఒక V చిత్రం (2006)
సంగీతం: శ్రీ మురళి 
సాహిత్యం: శివ గణేష్ 
గానం: సౌమ్య

మనసా 



కుక్క మొఖం పాట సాహిత్యం

 
చిత్రం: ఒక V చిత్రం (2006)
సంగీతం: శ్రీ మురళి 
సాహిత్యం: శివ గణేష్ 
గానం: అలెక్స్, రిమిటోమి,  సౌమ్య, శివ గణేష్ 

కుక్క మొఖం 

Palli Balakrishna Saturday, August 6, 2022



చిత్రం: సీత (2019)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, సోను సూద్
దర్శకత్వం: తేజ
నిర్మాత: సుంకర రామబ్రహ్మం
విడుదల తేది: 24.05.2019



Songs List:



బుల్ రెడ్డి పాట సాహిత్యం

 
చిత్రం: సీత (2019)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: సురేంద్ర కృష్ణ 
గానం: ఉమా నేహా , తేజా, జి. సంతోష్, అమితో 

ఒంటి తీరు పాలకోవా… నడక చూస్తే హంస నావా
సోకు బరువు మోయగలవా… సాయమోస్తాం సై అనవా !!

బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి… రాజ్దూత్ మీదొచ్చే రామ్ రెడ్డి
బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి… రాజ్దూత్ మీదొచ్చే రామ్ రెడ్డి
యమహా ఏస్కోచే యాది రెడ్డి… బజాజ్ మీదొచ్చే బాల్ రెడ్డి
స్టాండైనా ఎయ్యరాళ్ళు… వచ్చాక ఆగరాళ్ళు
ఎట్టా సచ్చేదిరో పెద్ది రెడ్డి…

రెడ్డిగారి రెడ్డిగారి…
రెడ్డిగారి కుర్రోళ్ళిట్టా… రెచ్చిపోతే ఎట్టాగంట
రెడ్డిగారి కుర్రోళ్ళిట్టా… రెచ్చిపోతే ఎట్టాగంట

బుల్లెట్టు డుర్ర్ అహ… బుల్లెట్టు డుర్ర్
అరె బుల్ బుల్ బుల్… బుల్ బుల్ బుల్లెట్టు
బుల్లెట్టు మీదొచ్చే… బుల్ రెడ్డి
రాజ్దూత్ మీదొచ్చే… రామ్ రెడ్డి

హే పిల్లా..! నిన్ను చూస్తే రెచ్చిపోకుండా ఎట్టుంటాం కాని
ఇంతకీ మాకు… టులెట్ బోర్డు ఉందా లేదా ??

ఎహే… ముంబైలో మా బావ టైలర్…అబ్బ
అంటారు వాడినంత టైగర్… ఛా
పండక్కు వచ్చి నన్ను పెళ్ళాడతాను… అంటూ ప్రామిస్సు కూడా చేసినాడు

మీ బావ కొట్టాడు పంపు… ఆడేమో అట్నుంచి జంపు
మొన్నాడు పట్నంలో… మసీదు గల్లీలో
పెళ్ళాంతో పూలు కొంటున్నాడు…

మాయగాడు సచ్చినోడు… సొమ్ములన్నీ దోచేశాడు
నన్ను ఇట్టా ముంచేశాడు…
నా సొమ్ములన్నీ దోచేశాడు… నన్ను ఇట్టా ముంచేశాడు
ఓ ఓ… బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి

ఒరే ఒరే ఒరే నీ టైగర్ బావ… జంప్ అయిపోయినాడ
అయితే నువ్వు ఖాళీయే కదా..!!
లేదు… అరె పక్కింటి కుర్రాడు శీను
మా వీధిలో వాడు డాను…

నీలాంటి అందగత్తె జిల్లాలో లేదు… అంటూ రక్తంతో రాసి ఇచ్చాడు
శీనుగాడు ఎసాడు రీలు… ఆహా
వాన్ని నిన్న పంపారు జైలు… అవునా
వాడింక రాడుగాని… ఒక్కడ్ని ఎంచుకుంటే
తక్కినోళ్లం తప్పుకుంటాము…

రెడ్డిగారి రెడ్డిగారి…
రెడ్డిగారి కుర్రాళ్ళను… నే తప్పుగానే అనుకున్నాను
ముందు చూస్తే భయమేసింది… మనసు చూస్తే మతిపోయింది
ముందు చూస్తే భయమేసింది… మనసు చూస్తే మతిపోయింది
బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి…



రోల రోల పాట సాహిత్యం

 
చిత్రం: సీత (2019)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: పరోమ దాస్ గుప్తా 

రోల రోల 



కోయిలమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: సీత (2019)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: లక్ష్మీ భూపాల్
గానం: అర్మాన్ మాలిక్

కుహూ కుహూ అని కోయిలమ్మ 
తీయగ నిన్నే పిలిచిందమ్మ 
కోపం చాలమ్మా బదులుగ నవ్వకటివ్వమ్మా
ఓ ఓ కుహూ కుహూ అని కోయిలమ్మ 
తీయగ నిన్నే పిలిచిందమ్మ 
కోపం చాలమ్మా బదులుగ నవ్వకటివ్వమ్మా
ఆ నవ్వులో సిరిమల్లెలై 
పూయాలిలే నీ పెదవంచులో
ఈ పూలకి ఆరాటమే చేరాలని జడ కుచ్చిళ్ళలో
ఓ ఇంద్ర దనస్సే వర్ణాల వానై 
కురిసెను జల జల చిటపట చినుకులుగా

కూ కూ కూ కూ
కుహూ కుహూ అని కోయిలమ్మ 
తీయగ నిన్నే పిలిచిందమ్మ 
కోపం చాలమ్మా బదులుగ నవ్వకటివ్వమ్మా

ఈ చల్లగాలి ఓ మల్లెపూవై 
నిన్నల్లుకుంటూ ఆగాలి
ఆ వాన మేఘం నీ నవ్వుకోసం 
ఓ మెరుపు లేఖే రాయాలి (2)

సెలయేరు పైన జలతారు వీణ 
పలికెను గల గల సరిగమ పదనిసగ

కూ కూ కూ కూ
కుహూ కుహూ అని కోయిలమ్మ 
తీయగ నిన్నే పిలిచిందమ్మ 
కోపం చాలమ్మా బదులుగ నవ్వకటివ్వమ్మా

నీలాల నింగి చుక్కల్ని తెచ్చి 
నక్షత్రమాలే వెయ్యాలి
నీకంటి నీరు వర్షించకుండా 
దోసిల్ల గొడుగే పట్టాలి (2)

ఏ కష్టమైనా ఉంటాను తోడై 
తడబడు అడుగున జతపడి నేనున్నా

కూ కూ కూ కూ
కుహూ కుహూ అని కోయిలమ్మ 
తీయగ నిన్నే పిలిచిందమ్మ 
కోపం చాలమ్మా బదులుగ నవ్వకటివ్వమ్మా




నిజమేనా నిజమేనా పాట సాహిత్యం

 
చిత్రం: సీత (2019)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: లక్ష్మీ భూపాల్
గానం: అనురాగ్ కులకర్ణి 

నిజమేనా నిజమేనా



ఎవరది ఎవరది పాట సాహిత్యం

 
చిత్రం: సీత (2019)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: లక్ష్మీ భూపాల్
గానం: హరిచరణ్

ఎవరది ఎవరది ఎద గదిలో… తలపుల తలుపులు తెరిచినది
నిజమేనా నిజమేనా… వెతికే ప్రాణమే ఎదురైనదా..!!
అలిసైనా కలిసేనా… ఇకపై వీడని ముడి పడినదా..!!

అలనై మనసంచునా… ఇష్టంగా తల వంచనా
నీ కోసం నీ కోసం… వేచుందే ఈ ప్రాణం

నిజమేనా నిజమేనా… వెతికే ప్రాణమే ఎదురైనదా
అలిసైనా కలిసేనా… ఇకపై వీడని ముడి పడినదా… ఆ ఆ
లలలలా లలలలా లలల లాల… లాల లాల లాలా లాలా లాలా లా

Palli Balakrishna Thursday, June 27, 2019


చిత్రం: లక్ష్మీ కళ్యాణం (2007)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్ , మణిశర్మ (బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్)
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: నిహాల్, ప్రాణవి
నటీనటులు: కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ (తొలిపరిచయం)
దర్శకత్వం: తేజ
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 15.02.2007

అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా
అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా
అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా
అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా

అవుననుకో గోరువంకా అలుసిచ్చాను కనుక
జరిగింది తెలుసుకోక నాపై నింద లేయక
నీకేమీ ఊసుపోక నాదే నేరమనక
నిజమంతే వాదించక....

అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా
అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా

ఓ కన్ను మూసి చూస్తున్నట్టు ఉంది
నా ఒంటి నడక నాకే నచ్చకుంది
నాతోనే నాకు గొడవయ్యినట్టు వుంది
నా నుంచి నేనే వేరయ్యినట్టు వుంది
ఊరుకోలేను చేరుకోలేను మనసిలా ఎందుకుంది
మూగనేకాను మాటకాలేను ఎమిటవుతున్నది...

అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా
అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా

నాతోట పువ్వే నాపై కోపమంటే
ఈ ప్రాణమింకా వున్నా లేనిదంతే
నాలోని సగమే నాకే దూరముంటే
ఏ సందడైనా మనసే నవ్వదంతే
చిలిపి జగడాన్ని పెంచుకున్నను నేస్తమా తప్పు నాదే
చెలిమి విరహాన చేదు చూసాను పంతమా ఆగవే...

అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా
అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా
నీకేమీ ఊసుపోక నాదే నేరమనక
నిజమంతే వాదించక...

Palli Balakrishna Thursday, November 16, 2017



చిత్రం: జై (2004)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: నవదీప్ , సంతోషిణి , అయేషా జుల్కా
దర్శకత్వం: తేజా
నిర్మాత: తేజా
విడుదల తేది: 25.03.2004



Songs List:



జై జై పాట సాహిత్యం

 
చిత్రం: జై (2004)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కులశేఖర్
గానం: మాస్టర్ వేణు , అనూప్ రూబెన్స్, టిప్పు 

జై  జై  




ఎన్ని ఆశలో పాట సాహిత్యం

 
చిత్రం: జై (2004)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కులశేఖర్
గానం: శ్రేయా ఘోషాల్

ఎన్ని ఆశలో 



ఓ మనసా ఓ మనసా పాట సాహిత్యం

 
చిత్రం: జై (2004)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కులశేఖర్
గానం: అనూప్ రూబెన్స్, ఉష 

ఓ మనసా ఓ మనసా 




వన్, టు త్రీ పాట సాహిత్యం

 
చిత్రం: జై (2004)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కులశేఖర్
గానం: టిప్పు 

వన్, టు త్రీ 




వందేమాతరం పాట సాహిత్యం

 
చిత్రం: జై (2004)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కులశేఖర్
గానం: బేబీ ప్రెట్టీ, శ్రీనివాస్.యన్ & కోరస్ 

దేశం మనదే తేజం మనదే
దేశం మనదే తేజం మనదే
ఎగురుతున్న జెండా మనదే
నీతి మనదే జాతి మనదే
ప్రజల అండదండా మనదే
అందాల బంధం ఉంది ఈ నేలలో
ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో
ఏ కులమైనా ఏ మతమైనా
ఏ కులమైనా ఏ మతమైనా
భరతమాతకొకటేలేరా

ఎన్ని బేధాలున్నా మాకెన్ని తేడాలున్నా
దేశమంటే ఏకమౌతాం అంతా ఈ వేళ
వందేమాతరం అంటామందరం
వందేమాతరం అంటామందరం

దేశం మనదే తేజం మనదే
ఎగురుతున్న జెండా మనదే
నీతీ మనదే జాతీ మనదే
ప్రజల అండదండా మనదే
అందాల బంధం ఉంది ఈ నేలలో
ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో
ఏ కులమైనా ఏ మతమైనా
భరతమాతకొకటేలేరా
రాజులు అయినా పేదలు అయినా
భరతమాత సుతులేలేరా

ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా
దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈవేళ
వందేమాతరం అంటామందరం
వందేమాతరం ఓ... అంటామందరం

వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం




నీకోసమే పాట సాహిత్యం

 
చిత్రం: జై (2004)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కులశేఖర్
గానం: మల్లికార్జున్, చిత్ర 

నీకోసమే 





నా చేతిలోన పాట సాహిత్యం

 
చిత్రం: జై (2004)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కులశేఖర్
గానం: సుమంగళి 

నా చేతిలోన 





చుట్టమ్మో చుట్ట పాట సాహిత్యం

 
చిత్రం: జై (2004)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కులశేఖర్
గానం: లలిత 

చుట్టమ్మో చుట్ట 


Palli Balakrishna Wednesday, November 1, 2017







చిత్రం: నేనే రాజు నేనే మంత్రి (2017)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: సురేంద్ర కృష్ణ
గానం: విజయ్ యేసుదాసు, దివ్య స్పందన (రమ్యా)
నటీనటులు: రాణా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్
దర్శకత్వం: తేజా
నిర్మాత: డి.సురేష్ బాబు
విడుదల తేది: 11.08.2017

జోగేంద్ర జోదేంద్ర
జోగేంద్ర జోగేంద్ర

జోగేంద్ర జోగేంద్ర
జై భోలో జోగేంద్ర
మా రాజు మా మంత్రి
నువ్వే జోగేంద్ర

రాధమ్మ రాధమ్మ
రావే రాధమ్మ
నా గెలుపు నా ఆనందం
నీదే లేనేమ్మ

 రాధమ్మ రాధమ్మ
మాటే వినవమ్మా
నిమిషం నువు కనపడకుంటే
మతి పోతుందమ్మా

వరాల వాన స్వరాల వీణ
నిజాన్ని చెబుతున్నా
అరె సందేహం ఉంటె నా కళ్ళలోకే
సరా సరి చూడమంటున్నా నా .. నా ..
దినకు .. దిన్నా  నా .. నా ..
దినకు .. దిన్నా  నా .. నా ..

రాధమ్మ రాధమ్మ
రావే రాధమ్మ
నా గెలుపు నా ఆనందం
నీదే లేనేమ్మ

నీ కళ్ళలోకి చూస్తుంటే చాలు
కాలాన్నే మరచి వుండి పొన
కౌగిలి గుడిలో చోటు ఇస్తే చాలు
దీపాల వెలుగై నిండిపోనా

నేను గెలిచేదే నీకోసం
కోరుకోవే నా ప్రేనమైన
పండు వెన్నెలలో ఆశతోన
నీతోటే ఉయ్యాల ఊగాలి

జోగేంద్ర జోదేంద్ర
జోగేంద్ర జోగేంద్ర

రాధమ్మ రాధమ్మ
రావే రాధమ్మ
నా గెలుపు నా ఆనందం
నీదే లేనేమ్మ

నీ చూపే సైతం పలికే సంగీతం
నాకేగా సొంతం ఆ శాంతం

నీ నవ్వే అందం నీ మాటే వేగం
పుణ్యాల  ఫలితం నీ బంధం

నువ్వు వేల్లేటి దారంతా
పూల వనమల్లె మారిపోదా
ఊరు ఊరంతా దిస్తే పెడితే
ఓ ముద్దుతో దిస్టే తీయనా

ఓ హో..

జోగేంద్ర జోదేంద్ర
జోగేంద్ర జోగేంద్ర

జోగేంద్ర జోగేంద్ర
జై భోలో జోగేంద్ర
మా రాజు మా మంత్రి
నువ్వే జోగేంద్ర







చిత్రం: నేనే రాజు నేనే మంత్రి (2017)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: సురేంద్ర కృష్ణ
గానం: శ్రేయా ఘోషల్, రోహిత్

సుఖీభవ అన్నారు దేవతలంతా
సుమంగళి ఉండాలి ఈ జన్మంతా

పల్లవి :
ఊపిరి అంత నువ్వే నువ్వే
ఊహలోనా నువ్వే నువ్వే
ఉన్నదంతా నువ్వే... బంధమా...

కంటిలోనే నువ్వే నువ్వే
కడుపులోన నీ ప్రతిరూపే
జన్మకి అర్ధం నువ్వే ప్రాణమా

కలోలోనా కథలోనా నువ్వే
నీ జతలో నూరేళ్ళు ఉంటానే

నువ్వే నువ్వే నువ్వే
నేనే నువ్వే నువ్వే
నువ్వే నువ్వే నువ్వే
నీతోనే జీవితం

నువ్వే నువ్వే నువ్వే
నేనే నువ్వే నువ్వే
నువ్వే నువ్వే నువ్వే
నీకేనే అంకితం

సుఖీభవ అన్నారు దేవతలంతా
సుమంగళి ఉండాలి ఈ జన్మంతా

చరణం: 1
నీ పేరే సుప్రబాతం
అడుగున అడుగే ప్రదక్షిణం
నీ మాటే వేద మంత్రం
మనసుకు మనసే సమర్పణం
నీకేగా....
నా తలపు నా గెలుపు నీకోసం
నాదేహం నా ప్రాణం నీదే

చరణం: 2
తనువంత పులకిరింత
రోజూ నువు ధరి చేరితే
వయస్సంత వలుపు సంత
నీ ఊపిరి వెచ్చగా తాకితే
నీ మాయే
కన్నులతో వెన్నెలనే కురిపించే
ఓ మణి కవుగిలలో దాచాలే

నువ్వే నువ్వే నువ్వే
నేనే నువ్వే నువ్వే
నువ్వే నువ్వే నువ్వే
నీతోనే జీవితం

నువ్వే నువ్వే నువ్వే
నేనే నువ్వే నువ్వే
నువ్వే నువ్వే నువ్వే
నీకే నే అంకితం


Palli Balakrishna Tuesday, August 15, 2017


చిత్రం: ఫ్యామిలీ సర్కస్ (2001)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్.పి.పట్నాయక్, లెనిన
నటీనటులు: జగపతిబాబు , రోజా, కంచి కౌల్
దర్శకత్వం: తేజ
నిర్మాత: సుంకర మధుమురళి
విడుదల తేది: 01.01.2001

నను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బులు బావో
నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బులు బావో
నను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బులు బావో
నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బులు బావో
అరె ప్రేమని దోమని పిల్లో మరదలు పిల్లో
నా పరువు కాస్త తియ్యకే పిల్లో మరదలు పిల్లో
నువ్వు కొట్టిన తియ్యని దెబ్బలకి బావో సుబ్బులు బావో
మరి నిద్దర పట్టక చస్తినిరో బావో సుబ్బులు బావో

నువు చూపులతో గిల్లకురో బావో సుబ్బులు బావో
నా బుగ్గలు బూరెలు అయ్యనురో బావో సుబ్బులు బావో
నువు చీటికి మాటికి చంపకే పిల్లో మరదలు పిల్లో
నీ మటలింక నమ్మనే పిల్లో మరదలు పిల్లో
నువు రాతిరి పెట్టిన ముద్దులకు బావో సుబ్బులు బావో
నేను ఉక్కిరిబిక్కిరి అయ్యానురో బావో సుబ్బులు బావో

అరె నీకు నాకు లింకని బావో సుబ్బులు బావో
ఊరంత గుప్పుమందిరో బావో సుబ్బులు బావో
అరె నూతులు గోతులు తియ్యకే పిల్లో మరదలు పిల్లో
నా కొంప ఇంక ముంచకే పిల్లో మరదలు పిల్లో
నువు గుద్దిన చోటే గుద్దకురో బావో సుబ్బులు బావో
నా వీపు వాచిపొయనురో బావో సుబ్బులు బావో


Palli Balakrishna Wednesday, August 2, 2017
Nuvvu Nenu (2001) Telugu Songs Lyrics Album Cover

Nuvvu Nenu (2001) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Nuvvu Nenu (2001)
Director : Teja
Producer : P. Kiran
Actors : Uday Kiran
Actresses : Anita
Release Date : 10 August 2001

Gaajuvaka Pilla Song Lyrics in Telugu – Nuvvu Nenu (2001)

'Gaajuvaka Pilla' song from Nuvvu Nenu (2001) movie is composed by R. P. Patnaik and sung by R. P. Patnaik and Chorus.

SONG INFORMATION
Movie : Nuvvu Nenu (2001)
Lyricist : Kulasekhar
Singers : R. P. Patnaik, Chorus
చిత్రం: నువ్వు నేను (2001) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: ఆర్.పి.పట్నాయక్ ఆహ్ ఒరే వెంకటేషు ఇలా వెయ్యరా దరువు అది అలా కొట్టు డండడడన్ డండడడ డండడడ డన్ డన్ అబ్బబ్బబ్బా ఏముందిరా అది ఏసుకోరా వన్ టు ఇదుగో పాట ఫోర్ గాజువాక పిల్లా మేం గాజులోళ్ళం గాదా గాజువాక పిల్లా మేం గాజులోళ్ళం గాదా గాజువాక పిల్లా మేం గాజులోళ్ళం గాదా నీ చెయ్యి సాపలేదా నీ చెయ్యి సాపలేదా మా గాజు తొడగలేదా గాజువాకే పిల్లా మాది గాజులోళ్ళమే పిల్లా మేము గాజువాకే పిల్లా మాది గాజులోళ్ళమే పిల్లా మేము సబ్బవరం పిల్లా మేం సబ్బులోళ్ళంగాదా (2) సబ్బవరం పిల్లా మేం సబ్బులోళ్ళంగాదా నీ వీపు సూపలేదా నీ వీపు సూపలేదా మా సబ్బు రుబ్బలేదా సబ్బవరమే పిల్లా మాది సబ్బులోళ్ళమే పిల్లా మేము సబ్బవరమే పిల్లా మాది సబ్బులోళ్ళమే పిల్లా మేము సిరిపురం పిల్లా మేం సీరలోళ్ళంగాదా(2) సిరిపురం పిల్లా మేం చీరలోళ్ళంగాదా నీ చీర ఇప్పలేదా నీ చీర ఇప్పలేదా మా చీర సుట్టలేదా సిరిపురమే పిల్లా మాది చీరలోళ్ళమే పిల్లా మేము సిరిపురమే పిల్లా మాది చీరలోళ్ళమే పిల్లా మేము మువ్వలపాలెం పిల్లా మేం మువ్వలోళ్ళంగాదా మువ్వలపాలెం పిల్లా మేం మువ్వలోళ్ళంగాదా మువ్వలపాలెం పిల్లా మేం మువ్వలోళ్ళంగాదా నీ కాలు చాపలేదా నీ కాలు చాపలేదా మా మువ్వ కట్టలేదా మువ్వలపాలెమే పిల్లా మాది మువ్వలోళ్ళమే పిల్లా మేము మువ్వలపాలెమే పిల్లా మాది మువ్వలోళ్ళమే పిల్లా మేము

Priyatama Song Lyrics in Telugu – Nuvvu Nenu (2001)

'Priyatama' song from Nuvvu Nenu (2001) movie is composed by R. P. Patnaik and sung by S. P. Charan, Usha and Chorus.

SONG INFORMATION
Movie : Nuvvu Nenu (2001)
Lyricist : Kulasekhar
Singers : S. P. Charan, Usha, Chorus
చిత్రం: నువ్వు నేను (2001) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: యస్.పి. చరణ్ , ఉష ప్రియతమా ఓ ప్రియతమా ఈ మౌనరాగాలనే పలికే హృదయం ఓహో ప్రియుతమా ఓ ప్రియుతమా ఈ మౌనరాగాలనే పలికే హృదయం నిన్ను చూడాలని ఏదో మాట చెప్పాలని కలవరిస్తోందని తెలుసా ఓహో ప్రియుతమా ఓ ప్రియుతమా ఈ మౌనరాగాలనే పలికే హృదయం ఓహో ప్రియుతమా ఓ ప్రియుతమా చరణం: 1 ఎప్పుడో అపుడెప్పుడో ముడిపడినదీ బంధమేదో ఇప్పుడే ఇపుడిప్పుడే నీ మనసు చెప్పింది నాతో వానవిల్లు ఏదో మెరిసిందలా పూలజల్లు నాపై కురిసిందిలా రాగమో అనురాగమో ఈ వింత మాయనేమంటారో ప్రియుతమా ఓ ప్రియుతమా ఈ మౌనరాగాలనే పలికే హృదయం ఓహో ప్రియుతమా ఓ ప్రియుతమా చరణం: 2 గుట్టుగా కనిపెట్టగా మససంత నీ సంతకాలే మత్తుగా గమ్మత్తుగా ఎదనిండ నీ జ్ఞాపకాలే నిన్ను చూడకుండా మనసుండదే నిన్ను చూసినాక కునుకుండదే మోహమో వ్యామోహమో ఈ వింత మాయనేమంటారో ప్రియుతమా ఓ ప్రియుతమా ఈ మౌనరాగాలనే పలికే హృదయం ప్రియుతమా ఓ ప్రియుతమా ఈ మౌనరాగాలనే పలికే హృదయం నిన్ను చేరిందనీ తన మనసు విప్పిందని ఐ లవ్ యూ అంటోందని తెలుసా నిన్ను చేరిందనీ తన మనసు విప్పిందని ఐ లవ్ యూ అంటోందని తెలుసా

Ayyayyo Song Lyrics in Telugu – Nuvvu Nenu (2001)

'Ayyayyo' song from Nuvvu Nenu (2001) movie is composed by R. P. Patnaik and sung by Ravi Varma, Usha and Chorus.

SONG INFORMATION
Movie : Nuvvu Nenu (2001)
Lyricist : Kulasekhar
Singers : Ravi Varma, Usha, Chorus
చిత్రం: నువ్వు నేను (2001) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: రవి వర్మ, ఉష లవ్‌లంటూ పువ్వులంటూ ఎందుకయ్యో బిల్డప్స్ అయ్యబాబోయ్ నమ్మమయ్యో మీరు చెప్పే స్టోరీస్ పోసిచ్చి చూడంటారే టూ మచ్ చేసేస్తారే అయ్యాక హ్యాండిచ్చి పోతారే అయ్యయో అయ్యయో అయో అయి అయి అయ్యయో మీరసలే కంత్రీగాళ్లయ్యో అయ్యబాబోయ్ అర్థంకారే నేటి కాలం లేడీస్ సిన్సియర్‌గా లవ్ చేస్తే నమ్మరయ్యో నాటీస్ సెల్‌ఫోన్ బిల్డప్ ఇచ్చి కేరెక్కి కలరింగ్ ఇస్తే మర్నాడే ఐ లవ్ యూ అంటారే అయ్యయో అయ్యయో అయో అయి అయి అయ్యయో షో చేస్తే పడిపోతారయ్యో గళ్ళా ప్యాంటు పూల షర్టు చేస్తారయ్యో ఇన్‌షర్ట్స్ ఒళ్ళు మొత్తం వదలకుండా పూస్తారయ్యో పర్‌ఫ్యూమ్స్ హీరోలమనుకుంటారే మా ఫిగ్‌కే పడిపోతారే అద్దంలో ఫేసెందుకు చూసుకోరే అయ్యయో అయ్యయో అయో అయి అయి అయ్యయో మగవాళ్లు మారేదెప్పుడయ్యో సీతలంటూ స్ట్రిక్ట్ అంటూ ఎందుకమ్మో లెక్చర్స్ ఇంటి గుమ్మం దాటగానే గుర్తురావే కస్టమ్స్ చీరీస్ మార్చేస్తారే మిడ్డీస్ తొడిగేస్తారే సీతమ్మ పరువెందుకు తీస్తారే అయ్యయో అయ్యయో అయో అయి అయి అయ్యయో కలికాలం వచ్చేసిందయ్యో వెంకటేష్ శ్రీనివాసు తెలుసులెండి సీక్రెట్స్ నాన్నగారి జేబు కొట్టి తాగుతారే సిగరెట్స్ అలవాటు లేదంటారే సమరాన్ని మీటౌతారే జెంటిల్‌మన్ బిల్డప్ ఇస్తారే అయ్యయో అయ్యయో అయో అయి అయి అయ్యయో లోగుట్టు పెరుమాళ్లే తెలుపయ్యో డిస్కోకంటే ఉస్కో అంటూ వచ్చేస్తారే బేబీస్ నైట్‌దాకా ఊరిమీద చక్కర్లు వేసే జాడూస్ మమ్మీస్ క్లబ్ అంటూ డాడీస్ బిజినెస్ అంటూ పాపల్ని పట్టించుకోరయ్యో అయ్యయో అయ్యయో అయో అయి అయి అయ్యయో భూలోకం చెడిపోయిందయ్యో॥

Nuvvu Nenu Song Lyrics in Telugu – Nuvvu Nenu (2001)

'Nuvvu Nenu' song from Nuvvu Nenu (2001) movie is composed by R. P. Patnaik and sung by KK and Usha.

SONG INFORMATION
Movie : Nuvvu Nenu (2001)
Lyricist : Kulasekhar
Singers : KK, Usha
చిత్రం: నువ్వు నేను (2001) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: కె.కె., ఉష నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను చరితలోన నిలిచిపోయే ప్రేమికులమే నువ్వు నేను నింగి నేల నీరు సాక్షిగా.. కొండ కోన వాగు సాక్షిగా.. ప్రేమా ... నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను లోకమంతా ఏకమైనా వేరు కాము నువ్వు నేను ఆలయాన దైవం సాక్షిగా.. గుండెలోని ప్రేమ సాక్షిగా.. ప్రేమా ...

Nee Kosame Song Lyrics in Telugu – Nuvvu Nenu (2001)

'Nee Kosame' song from Nuvvu Nenu (2001) movie is composed by R. P. Patnaik and sung by KK.

SONG INFORMATION
Movie : Nuvvu Nenu (2001)
Lyricist : Kulasekhar
Singers : KK
చిత్రం: నువ్వు నేను (2001) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: కె.కె. నీకోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ ఆలాపన ఎడబాటు రేపిన విరహావేధనా నరకయాతనా కాలమే దీపమై దారి చూపునా నీకోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ ఆలాపన చరణం: 1 కళ్ళల్లోన నిన్ను దాచిన ఊహాల్లోన ఊసులాడిన స్వప్నంలోన యెంత చూసిన విరహమే తీరదె జాజి కొమ్మగాని ఊగిన కాలిమువ్వగాని మోగిన చల్లగాలి నన్ను తాకినా నీవనే భావనే ఎదురుగ లేనిదే నాకేంతోచదే రేపటి వేకువై రావే... నీకోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ ఆలాపన చరణం: 2 నిన్ను తప్ప కన్ను చూడదే లోకమంత చిమ్మ చీకటే నువ్వు తప్ప దిక్కు లేదులే ఓ సఖి నమ్మవే గుండె గూడు చిన్నబోయనే గొంతు ఇంక మూగబోవునే నీవు లేక ఊపిరాడదే ఓ చెలి చేరవే ఆశలు ఆవిరై మోడైపోతినే తొలకరి జల్లువై రావే... నీకోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ ఆలాపన ఎడబాటు రేపిన విరహావేధనా నరకయాతనా కాలమే దీపమై దారి చూపునా నీకోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ ఆలాపన

Priyatama (Female Version) Song Lyrics in Telugu – Nuvvu Nenu (2001)

'Priyatama (Female Version)' song from Nuvvu Nenu (2001) movie is composed by R. P. Patnaik and sung by Usha.

SONG INFORMATION
Movie : Nuvvu Nenu (2001)
Lyricist : Kulasekhar
Singers : Usha
చిత్రం: నువ్వు నేను (2001) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: ఉష ప్రియతమా ఓ ఓ ప్రియతమా ఈ మౌనరాగాలనే పలికే హృదయం ఓహో... ప్రియతమా ఓ ఓ ప్రియతమా ఈ మౌనరాగాలనే పలికే హృదయం నిన్ను చూడాలని... ఓ మాట చెప్పాలని కలవరిస్తోందని తెలుసా..! ప్రియతమా ఓ ఓ ప్రియతమా ఈ మౌనరాగాలనే పలికే హృదయం ఓహో... ప్రియతమా ఓ ఓ ప్రియతమా ఎప్పుడు అపుడెప్పుడో ముడిపడినదీ ఏ బంధమేదో ఇప్పుడే ఇపుడిప్పుడే నీ మనసు చెప్పింది నాతో వానవిల్లు ఏదో మెరిసిందలా పూలజల్లు నాపై కురిసిందిలా రాగమో అనురాగమో ఏ వింత మాయనేమంటారో ప్రియతమా ఓ ఓ ప్రియతమా ఈ మౌనరాగాలనే పలికే హృదయం ఓహో... ప్రియతమా ఓ ఓ ప్రియతమా గుట్టుగా కనిపెట్టగా మనసంతా నీ సంతకాలు మత్తుగా గమ్మత్తుగా ఎదనిండా నీ జ్ఞాపకాలే నిన్ను చూడకుండ మనసుండదే నిన్ను చూసినాక కునుకుండదే మొహమో వ్యామోహమో ఏ వింత మాయనేమంటారో ప్రియతమా ఓ ఓ ప్రియతమా ఈ మౌనరాగాలనే పలికే హృదయం ప్రియతమా ఓ ఓ ప్రియతమా ఈ మౌనరాగాలనే పలికే హృదయం నిన్ను చేరిందనే తన మనసు విప్పిందనే ఐ లవ్ యూ... అంటోందనే తెలుసా నిన్ను చేరిందనే తన మనసు విప్పిందనే ఐ లవ్ యూ... అంటోందనే తెలుసా ॥

Naa Gundelo Song Lyrics in Telugu – Nuvvu Nenu (2001)

'Naa Gundelo' song from Nuvvu Nenu (2001) movie is composed by R. P. Patnaik and sung by Sandeep, Usha and Chorus.

SONG INFORMATION
Movie : Nuvvu Nenu (2001)
Lyricist : Kulasekhar
Singers : Sandeep, Usha, Chorus
చిత్రం: నువ్వు నేను (2001) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: సందీప్ , ఉష నా గుండెలో నీవుండిపోవా నా కళ్ళల్లో దాగుండిపోవా చిరుగాలిలా వచ్చి గుడిగంటలే కొట్టి మన ప్రేమనే చాటవా... నా గుండెలో నీవుండిపోవా నా కళ్ళల్లో దాగుండిపోవా చిరుగాలిలా వచ్చి గుడిగంటలే కొట్టి మన ప్రేమనే చాటవా... నా గుండెలో నీవుండిపోవా నా హృదయం ప్రతి వైపు వెతికింది నీ కోసమేలే నా నయనం ఎటు వైపు చూస్తున్న నీ రూపమేలే నీ... పాటలో పల్లవే కావాలి నా... ఎదలో మెదిలే కధలే పాడాలి నీ కళ్ళల్లో నన్నుండిపోనీ నీ గుండెలో రాగాన్ని కానీ సిరివెన్నెలై వచ్చి కనురెప్పలే తెరచి మన ప్రేమనే చూపనీ... నీ కళ్ళల్లో నన్నుండిపోనీ ఏ నిమిషం మొదలైనదో గాని మన ప్రేమ గాధ ప్రతి నిమిషం సరికొత్తగా ఉంది ఈ తీపి బాధ ఈ... దూరమే దూరమై పోవాలి నీ... జతలో బతుకే నదిలా సాగాలి నీ కళ్ళల్లో నన్నుండిపోనీ నీ గుండెలో రాగాన్ని కానీ చిరుగాలిలా వచ్చి గుడిగంటలే కొట్టి మన ప్రేమనే చాటవా... లాలాల లాలాల లాలా లాలాలా లాలా లాలా లాలాల లాలాల లాలాల లాలాల లాలాలా లాలా లాలాల లాలాల లాలా

Nuvve Naku Pranam Song Lyrics in Telugu – Nuvvu Nenu (2001)

'Nuvve Naku Pranam' song from Nuvvu Nenu (2001) movie is composed by R. P. Patnaik and sung by KK, Usha and Chorus.

SONG INFORMATION
Movie : Nuvvu Nenu (2001)
Lyricist : Kulasekhar
Singers : KK, Usha, Chorus
చిత్రం: నువ్వు నేను (2001) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: కె.కె., ఉష నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు లోకం ప్రేమే రాగ బంధం ప్రేమే వేద మంత్రం కష్టాలెన్ని ఎదురైనా గాని మనకున్న బలమే ప్రేమ ప్రేమ నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు లోకం ప్రేమే రాగ బంధం ప్రేమే వేద మంత్రం నీలో ఆశ రేపే శ్వాస పేరే ప్రేమ కాదా లోలో పల్లవించే పాట పేరే ప్రేమ కాదా జీవితానికో వరం ప్రేమనీ ప్రేమ లేని జీవితం లేదనీ ఒకటై పలికేనట ఈ పంచ భూతాలు నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు లోకం ప్రేమే రాగ బంధం ప్రేమే వేద మంత్రం నిన్ను నన్ను కలిపే వలపు పేరే ప్రేమ కాదా మిన్ను మన్ను తడిపే చిలిపి చినుకే ప్రేమ కాదా లోపమంటు లేనిదే ప్రేమని ప్రేమ నీకు శాపమేం కాదనీ ఎదలో పలికేనట కళ్యాణ రాగాలు నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు లోకం ప్రేమే రాగ బంధం ప్రేమే వేద మంత్రం కష్టాలెన్ని ఎదురైనా గాని మనకున్న బలమే ప్రేమ ప్రేమ నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు లోకం ప్రేమే రాగ బంధం ప్రేమే వేద మంత్రం

Gunnamavi Song Lyrics in Telugu – Nuvvu Nenu (2001)

'Gunnamavi' song from Nuvvu Nenu (2001) movie is composed by R. P. Patnaik and sung by Mallikarjun and Usha.

SONG INFORMATION
Movie : Nuvvu Nenu (2001)
Lyricist : Kulasekhar
Singers : Mallikarjun, Usha
చిత్రం: నువ్వు నేను (2001) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: మల్లికార్జున్ , ఉష గున్నమావి కొమ్మ మీద గారాల గోరింక సన్నజాజి తీగ మీద అందాల రాచిలక ఎవరూ లేని ఏకాకంట చక్కని గోరింక అంతా ఉన్నా ఒంటరి పాపం వన్నెల రాచిలక మమతలు తెలియని ఆ గోరింకకు చిలకే తోడంట మనసులు కలిసిన ఆ ప్రేమికులు ఒకరికి ఒకరంట గున్నమావి కొమ్మ మీద గారాల గోరింక సన్నజాజి తీగ మీద అందాల రాచిలక గోరువంక తన గుండె గూటిలో చిలకని దాచింది రామచిలక ఆ గోరువంకనే కనుపాపనుకుంది కాటుకెంత అడ్డు వచ్చినా కంటి చాటు స్వప్నమాగునా చేతులెంత అడ్డు పెట్టినా గుండె మాటు సవ్వడాగునా కఠిక హృదయాలు ఏమనుకున్నా ప్రేమొక వరమేగా గున్నమావి కొమ్మ మీద గారాల గోరింక సన్నజాజి తీగ మీద అందాల రాచిలక పాడులోకం ఆ జంటను చూసి కత్తులు దూసింది కక్ష గట్టి ఆ మనసులనిట్టే దూరం చేసింది పంజరాలలోన పెట్టినా రామచిలక మూగబోవునా హోరుగాలి ఎంత వీచినా ప్రేమ దీపమారిపోవునా బ్రహ్మ రాతల్ని మార్చాలంటే మనుషుల వశమేనా గున్నమావి కొమ్మ మీద గారాల గోరింక సన్నజాజి తీగ మీద అందాల రాచిలక ఎవరూ లేని ఏకాకంట చక్కని గోరింక అంతా ఉన్నా ఒంటరి పాపం వన్నెల రాచిలక మమతలు తెలియని ఆ గోరింకకు చిలకే తోడంట మనసులు కలిసిన ఆ ప్రేమికులు ఒకరికి ఒకరంట నువ్వు నేనంటా

Palli Balakrishna Tuesday, August 1, 2017




చిత్రం: నిజం (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
నటీనటులు: మహేష్ బాబు, రక్షిత, గోపిచంద్, రాశి
దర్శకత్వం: తేజా
నిర్మాత: తేజా
విడుదల తేది: 23.05.2003



Songs List:



చందమామ రావే పాట సాహిత్యం

 
చిత్రం: నిజం (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్.పి.పట్నాయక్, ఉష

చందమామ రావే 



రత్తాలు రత్తాలు పాట సాహిత్యం

 
చిత్రం: నిజం (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్.పి.పట్నాయక్, ఉష

రత్తాలు రత్తాలు




నీలో ఉన్నది పాట సాహిత్యం

 
చిత్రం: నిజం (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్.పి.పట్నాయక్, ఉష

నీలో ఉన్నది 



ఛి ఛి అంటే పాట సాహిత్యం

 
చిత్రం: నిజం (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్.పి.పట్నాయక్, ఉష

ఛి ఛి అంటే



దండకం పాట సాహిత్యం

 
చిత్రం: నిజం (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: గోపీచంద్ , గంగాధర్ శాస్త్రి

దండకం



ఇలాగె ఇలాగే పాట సాహిత్యం

 
చిత్రం: నిజం (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్.పి.పట్నాయక్, ఉష

ఇలాగె ఇలాగే



కాకులు దూరని పాట సాహిత్యం

 
చిత్రం: నిజం (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్.పి.పట్నాయక్, రవివర్మ

కాకులు దూరని



అభిమన్యుడు కాడు వీడు పాట సాహిత్యం

 
చిత్రం: నిజం (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: బృందం గాయని గాయకులు

అభిమన్యుడు కాడు వీడు అర్జునుడు కాడు 
ప్రజలందరిలోన ఒకడు సామాన్యుడు వీడు 
అభిమన్యుడు లాగ వీడు అర్ధ జ్ఞాని కాడు 
అర్జునుడికి ఆనాడు శ్రీక్రిష్ణుడు తోడు 
ఎవ్వరండ లేదు ఒంటరైతే కాడు 
వీర మాత పెంచిన మన తెలుగు బిడ్డ వీడు 

అమ్మ జీవితం తోడు అసలు ఓడిపొడు 
ఎంత శత్రువైనా అంతు తేల్చుతాడు 
శక్తి ఉంది యుక్తి ఉంది 
గుండె నిండా ధమ్ము ఉంది 
అస్త్రం ఉంది లక్ష్యం ఉంది 
మొక్కవోని దీక్ష ఉంది 
అగ్గి పిడుగు వీడు 
సామన్యుడు కాడు 
దెబ్బ తిన్న పులిలా ఇక దూకుతాడు 

అభిమన్యుడు కాడు వీడు 
అర్జునుడు కాడు 
ప్రజలందరి లోన ఒకడు 
సామన్యుడు వీడు 
అభిమన్యుడు లాగ వీడు అర్ధ జ్ఞాని కాడు 
అర్జునుడికి ఆనాడు శ్రీక్రిష్ణుడు తోడు 
ఎవ్వరండ లేడు 
ఒంటరైతే కాడు 
వీర మాత పెంచిన మన తెలుగు బిడ్డ వీడు




చర చర పాట సాహిత్యం

 
చిత్రం: నిజం (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఉష, మూర్తి

చర చర 



రంగు రంగుల పాట సాహిత్యం

 
చిత్రం: నిజం (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్.పి.పట్నాయక్

రంగు రంగుల

Palli Balakrishna Monday, July 31, 2017




చిత్రం: జయం (2002)
సంగీతం: ఆర్.పి. పట్నాయక్
నటీనటులు: నితిన్ , సదా
దర్శకత్వం: తేజ
నిర్మాత: తేజ
విడుదల తేది: 14.06.2002



Songs List:



వీరి వీరి గుమ్మడి పండు పాట సాహిత్యం

 
చిత్రం: జయం (2002)
సంగీతం: ఆర్.పి. పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్.పి. పట్నాయక్

పల్లవి:
చిత్రం: జయం (2002)
సంగీతం: ఆర్.పి. పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్.పి. పట్నాయక్

పల్లవి:
వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి
దాగుడుమూతలు దండాకోరు వీరి పేరేమి
ఇది మనుషులు ఆడే ఆట అనుకొంటారె అంట
ఆ దెవుడు ఆడే ఆట అని తెలిసెదెపుడంటా
అయ్యో ఈ ఆటకి అంతే లేదు గా
అయినా లోకానికి అలుపే రాదు గా

వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి
దాగుడుమూతలు దండాకోరు వీరి పేరేమి

చరనం: 1
ఎవరికి వారొక తీరు చివరికి ఏమౌతారు
పైనున్న దెవుడు గారు మీ తెలివికి జోహారు
బంధం అనుకున్నది బండగ మారున
దూరం అనుకున్నది చెంతకు చేరున

వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి
దాగుడుమూతలు దండాకోరు వీరి పేరేమి



శబ్బాసి శబ్బాసే పాట సాహిత్యం

 
చిత్రం: జయం (2002)
సంగీతం: ఆర్.పి. పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: రవివర్మ, బాలాజీ, ఆర్.పి. పట్నాయక్

పల్లవి:
శబ్బాసి శబ్బాసే శబ్బాసి శబ్బాసే
బండి బండి రైలు బండి వేళకంటూ రాదు లెండి
దీన్ని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి
బండి బండి రైలు బండి వేళకంటూ రాదు లెండి
దీన్ని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి
దడక దడక దడక దీని మయదారి నడక
ఉలికి ఉలికి పడకే చిలకా
జరుగు జరుగు మనక ఇది జరగలేదు గనక
క్రీస్తు పూర్వం ఇంజిన్ గనక

శబ్బాసి శబ్బాసే శబ్బాసి శబ్బాసే

చరనం: 1
రంగులతొ హంగులతొ పైన పటారం
అబ్బో సుపర్ అని పోంగిపోకోయ్ లోన లోటారం
అందరిలో నిందలలా ఎంత విడ్డూరం
అయ్యో రైలంటె  మిడిల్ క్లాస్ నేల విమానం
కూత చూడు జోరుగుందిరో దీని తస్సదీయ
అడుగు ముందుకెయకుందిరో
ఎంత సేపు దేకుతుందిరో
దీని దిమ్మదియ చూడు చూడు నత్త నడకరో
ఇది జీవితం లో ఎప్పటికి టైమ్ కసలు రాదు కదా

శబ్బాసి శబ్బాసే శబ్బాసి శబ్బాసే

బండి బండి రైలు బండి వేళకంటూ రాదు లెండి
దీన్ని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి

చరనం: 2
డొక్కుదని బొక్కిదని మూల పడైరు
ఇల ముక్కుతున్న మూల్గుతున్న తిప్పుతుంటారు
పాత సామాన్లోడికైన అమ్ముకొంటేను
తలో పిడికెడునో గుప్పెడునో సెనగలొచ్చేను
ఎంత పొడవు ఉంది చూడరో దీని బండబడ
ఊరి చివర ఇంజినుందిరో
ఎంత పొగలు కక్కుతుందిరో దీని దుంపతెగ
బొగ్గు కొండ మింగినాది రో
నువు ఎక్కబోయె రైల్ ఎపుడు లైఫ్ టైమ్ లేట్ కదా

బండి బండి రైలు బండి వేళకంటూ రాదు లెండి
దీన్ని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి
బండి బండి రైలు బండి వేళకంటూ రాదు లెండి
దీన్ని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి
దడక దడక దడక దీని మయదారి నడక
ఉలికి ఉలికి పడకే చిలకా
జరుగు జరుగు మనక ఇది జరగలేదు గనక
క్రీస్తు పూర్వం ఇంజిన్ గనక

శబ్బాసి శబ్బాసే శబ్బాసి శబ్బాసే
శబ్బాసి శబ్బాసే శబ్బాసి శబ్బాసే



అందమైన మనసులో (Male Version) పాట సాహిత్యం

 
చిత్రం: జయం (2002)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్.పి.పట్నాయక్

పల్లవి:
అందమైన మనసులో ఇంత అలజడెందుకో 
ఎందుకో ఎందుకో ఎందుకో
తేలికైన మాటలే పెదవి దాటవెందుకో
ఎందుకో ఎందుకో ఎందుకో
ఎందుకో అసలెందుకో అడుగెందుకో
మొదటిసారి ప్రేమ కలిగినందుకా

అందమైన మనసులో ఇంత అలజడెందుకో 
ఎందుకో ఎందుకో ఎందుకో

చరణం: 1
అక్షరాలు రెండే లక్షణాలు ఎన్నో
ఏమని చెప్పాలి నీతో
ఒక్కమాట అయినా తక్కువేమి కాదే
ప్రేమకు సాటేది లేదే
రైలుబండి కూతే సన్నాయి పాట కాగా
రెండు మనసులొకటయ్యేనా
కోయిలమ్మ పాటే మది మీటుతున్న వేళా
కాలి మువ్వ గొంతు కలిపెలా

అందమైన మనసులో ఇంత అలజడెందుకో 
ఎందుకో ఎందుకో ఎందుకో

చరణం: 2
ఓర నవ్వుతోనే ఓనమాలు నేర్పి
ఒడిలో చేరిందా ప్రేమ
కంటి చూపుతోనే కొంటె సైగచేసి 
కలవరపెడుతోందా ప్రేమ
గాలిలాగ వచ్చి ఎదచేరెనేమొ ప్రేమ
గాలివాటు కాదేమైనా
ఆలయాన దైవం కరుణించి పంపెనమ్మా అందుకోవె ప్రేమ దీవెన

అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో
తేలికైన మాటలే పెదవి దాటవెందుకో
ఎందుకో ఎందుకో ఎందుకో
ఎందుకో అసలెందుకో అడుగెందుకో
మొదటిసారి ప్రేమ కలిగినందుకా

అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో
తేలికైన మాటలే పెదవి దాటవెందుకో
ఎందుకో ఎందుకో ఎందుకో



నేస్తమా నేస్తమా పాట సాహిత్యం

 
చిత్రం: జయం (2002)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్.పి.పట్నాయక్

నేస్తమా నేస్తమా
ఆ గుడి గంటలు మ్రోగితే
నువ్వచ్చా వనుకున్నా
ఏ జడగంటలు ఊగిన నువ్వే లే అనుకున్నా

నీ ఊహల్లో రేయి పగలు నే విహరిస్తున్నా
నీ జ్ఞాపకమే ఊపిరిగా ఇంకా బతికున్నా

ఎప్పుడు చూస్తానో నీ నవ్వుల పువ్వులనీ
ఎప్పుడు వింటానో నీ మువ్వల సవ్వడిని



ప్రియతమా తెలుసునా పాట సాహిత్యం

 
చిత్రం: జయం (2002)
సంగీతం: ఆర్.పి. పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్.పి. పట్నాయక్, ఉష

ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని
హృదయమా తెలుపనా నీకోసమే నేనని
కనుపాపలో రూపమే..నీవని
కనిపించని భావమే..ప్రేమని

ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని
ప్రియతమా తెలుసునా..

చిలిపి వలపు బహుశా హొహో
మన కథకు మొదలు తెలుసా హొహో
దుడుకు వయసు వరస హుహు
అరె ఎగిరిపడకే మనసా హుహు
మనసులో మాట చెవినెయ్యాలి సరసకే చేరవా
వయసులో చూసి అడుగెయ్యాలి సరసమే ఆపవా
నీకు సందేహమా..ఆఅ..ఆఅ..ఆహా..

ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని
ప్రియతమా తెలుసునా..

తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయ లయల జతుల గతుల తిల్లాన
తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయ లయల జతుల గతుల తిల్లాన

మనసు కనులు తెరిచా హొహో
మన కలల జడిలో అలిశా హొహో
చిగురు పెదవినడిగా హుహు
ప్రతి అణువు అణువు వెతికా హుహు
మాటలే నాకు కరువయ్యాయి కళ్ళలో చూడవా
మనసులో భాష మనసుకు తెలుసు నన్నిలా నమ్మవా
ప్రేమ సందేశమా..ఆఅ..ఆఅ..ఆహా..

ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని
హృదయమా తెలుపనా నీకోసమే నేనని
కనుపాపలో రూపమే..నీవని
కనిపించని భావమే..ప్రేమని



గోరంత ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: జయం (2002)
సంగీతం: ఆర్.పి. పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్.పి. పట్నాయక్, ఉష

గోరంత ప్రేమ కొండంత బలమిస్తుంది
నీ కంట నీరు చిటికేసి తుడిచేస్తుంది
గాయాలను మాన్పే మందే కదా ప్రేమ
ప్రాణాలను పోసే సంజీవని ప్రేమ



ఎవ్వరు ఏమన్న పాట సాహిత్యం

 
చిత్రం: జయం (2002)
సంగీతం: ఆర్.పి. పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్.పి. పట్నాయక్, ఉష

ఎవ్వరు ఏమన్న మారదు ఈ ప్రేమ
ఎవరు రాకున్నా ఆగదు ఈ ప్రేమ
నెత్తుటి కత్తికి ఏనాడు లొంగదు ఈ ప్రేమ
మెత్తని మనసును ఏ రోజు వీడదు ఈ ప్రేమ
కులము మతము లేవంటుంది మనసుకి ఈ ప్రేమ
నింగి నేల ఉన్నన్నాళ్ళు ఉంటుందీ ప్రేమ

కాలమొస్తే సిరి మల్లె తీగకి చిగురే పుడుతుంది
ఈడు వస్తే ఈ పడుచు గుండెలో ప్రేమే పుడుతుంది
గొడుగు అడ్డుపెట్టినంతనే వాన జల్లు ఆగిపోవునా
గులకరాయి వేసినంతనే వరద జోరు ఆగిపోవున
ఏడు లోకాలు ఏకం అయిన ప్రేమను ఆపేనా

ఎవ్వరు ఏమన్న మారదు ఈ ప్రేమ
ఎవరు రాకున్నా ఆగదు ఈ ప్రేమ

ప్రేమ అంటె ఆ దేవుడిచ్చిన చక్కని వరమంట
ప్రేమ ఉంటే ఈ మనసుకెప్పుడు అలుపే రాదంట
కండలెంత పెంచుకొచ్చిన కొండనెత్తి దించలేరురా
కక్షతోటి కాలు దువ్వినా ప్రేమనెవ్వరు ఆపలేరు రా
ప్రేమకెపుడైన జయమే గాని ఓటమి లేదంట

ఎవ్వరు ఏమన్న మారదు ఈ ప్రేమ
ఎవరు రాకున్నా ఆగదు ఈ ప్రేమ
నెత్తుటి కత్తికి ఏనాడు లొంగదు ఈ ప్రేమ
మెత్తని మనసును ఏ రోజు వీడదు ఈ ప్రేమ
కులము మతము లేవంటుంది మనసుకి ఈ ప్రేమ
నింగి నేల ఉన్నన్నాళ్ళు ఉంటుందీ ప్రేమ
శాశ్వతమీ ప్రేమ



అందమైన మనసులో (Female Version) పాట సాహిత్యం

 
చిత్రం: జయం (2002)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఉష

పల్లవి:
అందమైన మనసులో ఇంత అలజడెందుకో 
ఎందుకో ఎందుకో ఎందుకో
తేలికైన మాటలే పెదవి దాటవెందుకో
ఎందుకో ఎందుకో ఎందుకో
ఎందుకో అసలెందుకో అడుగెందుకో
మొదటిసారి ప్రేమ కలిగినందుకా

అందమైన మనసులో ఇంత అలజడెందుకో 
ఎందుకో ఎందుకో ఎందుకో

చరణం: 1
అక్షరాలు రెండే లక్షణాలు ఎన్నో
ఏమని చెప్పాలి నీతో
ఒక్కమాట అయినా తక్కువేమి కాదే
ప్రేమకు సాటేది లేదే
రైలుబండి కూతే సన్నాయి పాట కాగా
రెండు మనసులొకటయ్యేనా
కోయిలమ్మ పాటే మది మీటుతున్న వేళా
కాలి మువ్వ గొంతు కలిపెలా

అందమైన మనసులో ఇంత అలజడెందుకో 
ఎందుకో ఎందుకో ఎందుకో

చరణం: 2
ఓర నవ్వుతోనే ఓనమాలు నేర్పి
ఒడిలో చేరిందా ప్రేమ
కంటి చూపుతోనే కొంటె సైగచేసి 
కలవరపెడుతోందా ప్రేమ
గాలిలాగ వచ్చి ఎదచేరెనేమొ ప్రేమ
గాలివాటు కాదేమైనా
ఆలయాన దైవం కరుణించి పంపెనమ్మా అందుకోవె ప్రేమ దీవెన

అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో
తేలికైన మాటలే పెదవి దాటవెందుకో
ఎందుకో ఎందుకో ఎందుకో
ఎందుకో అసలెందుకో అడుగెందుకో
మొదటిసారి ప్రేమ కలిగినందుకా

అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో
తేలికైన మాటలే పెదవి దాటవెందుకో
ఎందుకో ఎందుకో ఎందుకో



రాను రానంటూనే సిన్నదో పాట సాహిత్యం

 
చిత్రం: జయం (2002)
సంగీతం: ఆర్.పి. పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్.పి. పట్నాయక్, ఉష

ఏమైందిరా - బాధగా ఉంది
నాకు లేని బాధ నీకెందుకురా
నీ బాధ నా బాధ కాదా

ఎహే రాయే..
హబ్బబ్బబ్బ రాను రాను
నాను రాను కుదరదయ్యో
కాదు కాదు ఈలు కాదు వొగ్గేయ్ వయ్యో
వొద్దు వొద్దు మీద మీద పడకరయ్యో
సిగ్గు సిగ్గు సిన్నకోక లాగకయ్యో

రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది
రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది
కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో
తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది
పచ్చి పచ్చివంటూనే పిల్లదో పిల్లదో
పళ్ళట్టుకొచ్చిందోయ్ పిల్లదో పిల్లది

రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది 

ఏం పండు తీసుకొచ్చిందిరా అబ్బాయ్
యాపిలు పండు నారింజ పండు
బత్తాయి పండు బొప్పాయి పండు
అనస పండు పనస పండు
నిమ్మ పండు దానిమ్మ పండు
మామిడి పండు అరటి పండు

రాను అని కాదు అని అంతలేసి మాటలని
సంతకొచ్చె సూడవయ్యో సిన్నది
కాదనంటే ఔనని  లే లేదనంటే ఉందనిలే
ఆడవారి మాట తీరు వేరులే
ఔనా మైనా మాతో చిందేయ్ చిందేయ్
బాబోయ్ రానోయ్ నాకసలే సిగ్గోయ్ సిగ్గోయ్
  
సిగ్గు సిగ్గంటూనే సిన్నదో సిన్నదో
సీరంతా జార్చిందా సిన్నదో సిన్నది
కస్సుబుస్సంటూనే కుర్రదో కుర్రదో
కౌగిట్లో వాలిందా కుర్రదో కుర్రది
  
హరిలో రంగ హరి హరి
స్వామి రంగ హరి హరి
ఏంటో ఎవరూ పట్టించుకోట్లేదేంటి
గాజువాక పిల్లా మే గాజులోళ్ళం కాదా
చెయ్యి చాపలేదా మా గాజు తొడగలేదా

తప్పు అని గిప్పు అని అందరిలో ముందరని
సాటుకొచ్చి సిందులేసె సిన్నది
తప్పనంటే ఒప్పనలే ఒప్పనంటే తప్పనలే
సూటిగాను సెప్పదయ్యో ఆడది
రావే పిల్లా ఎందుకు మల్లాగుల్లా
ఎల్లోయ్ ఎల్లోయ్ ఎల్లెల్లోయ్ ఎల్లో ఎల్లోయ్
  
రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది
కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో
తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది
పచ్చి పచ్చివంటూనే పిల్లదో పిల్లదో
పళ్ళట్టుకొచ్చిందోయ్ పిల్లదో పిల్లది 



ప్రేమా ప్రేమా పాట సాహిత్యం

 
చిత్రం: జయం (2002)
సంగీతం: ఆర్.పి. పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: కె. కె

పల్లవి:
ప్రేమా ప్రేమా ప్రేమా
ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా
ప్రేమా ప్రేమా ప్రేమించడం నేరమా
కళ్ళల్లో నీరు నీవే గుండెలొ కోత నీవే
మౌనగానాలు నీవే పంచప్రాణాలు నీవే
కాలం ముళ్ళ ఒడిలొ బ్రతుకే పథనమా
దైవం కరునిస్తే మాదే విజయమా

ప్రేమా ప్రేమా ప్రేమా
ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా
ప్రేమా ప్రేమా ప్రేమించడం నేరమా

చరనం: 1
కనులే కరువైతే అందమెందుకు
వనమే ముళ్ళైతె కంచె ఎందుకు
కలలే కధలై బ్రతుకే చితులై
సాగె పయనం నీదా ప్రేమా

ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా
ప్రేమా ప్రేమా ప్రేమించడం నేరమా
కళ్ళల్లో నీరు నీవే గుండెలొ కోత నీవే
మౌనగానాలు నీవే పంచప్రాణాలు నీవే
కాలం ముళ్ళ ఒడిలొ బ్రతుకే పథనమా
దైవం కరునిస్తే మాదే విజయమా

చరనం: 2
చెలియ శిల లేక కోవెలెందుకు
జతగా నువు లేక నేను ఎందుకు
మమతే కరువై మనసే బరువై
లోకం నరకం కాదా ప్రేమా



దుష్కర వినాశకం పాట సాహిత్యం

 
చిత్రం: జయం (2002)
సంగీతం: ఆర్.పి. పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: Group Song

దుష్కర వినాశకం
దుష్కర విభూషణం
సర్ప్రధ దర్శనం
తమ పాద పంకేరుపం
రవి మార్గ సంచారి
కపిరాజు మాంపాహి
ప్రేమ భూషావేష హే మారుతీ
రణరంగ హుంకారి
రాక్షస వదంకారి
రామ భక్తవేశ రాగజ్యుతి
సుభమాన సానాం
ప్రభుతాంజమానం
పదా ధైర్య శీలాం
ప్రభావ సురానాం



జయం పాట సాహిత్యం

 
చిత్రం: జయం (2002)
సంగీతం: ఆర్.పి. పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: Group Song

ఆదిమంత్రణం ఉత్సాహ యంత్రణం
అరి వీర ఘోర మారనోద్యమోస్తుతి రంతరం
వీర కర్మటం రుదిరాంత కర్పురం
భయ ధూర్జ దుజ్వలష్పరత్వచండ పరత్పరం

సరళం విరళం గరళం గగనం
మృదలం హితురం హృదయం జయగం

సరసం సగయం హృదయం విధితం
జననం సహజం మరణం సహజం
చరితం లిఖితం జ్వలితం హృదయం
గమనం గతమం ప్రతితుం విజయం

ఎగసే అలలే ఆదర్శమవ్వాలిరా
ప్రేమనేది గుండెల్లో మోగించరా
భరిలో పులిలా తొడకొట్టి లంఖించరా
ప్రేమకున్న బలమెంతో చూపించరా
ప్రవహించే రక్తం ప్రేమేరా ఎదురించే ధైర్యం ప్రేమేరా
యుద్దానికి అస్త్రం ప్రేమేరా నీ లక్ష్యం ప్రేమేరా

జయం  నిశ్చయం
నిశ్చయం నిశ్చయం
జయం  నిశ్చయం
నీ జయం  నిశ్చయం

Palli Balakrishna Tuesday, July 25, 2017



చిత్రం: చిత్రం (2000)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
నటీనటులు: ఉదయ్ కిరణ్, రీమా సేన్
దర్శకత్వం: తేజ
నిర్మాత: రామోజీరావు
విడుదల తేది: 24.05.2000



Songs List:



అణగణగనగా చీమలు దోమలు పాట సాహిత్యం

 
చిత్రం: చిత్రం (2000)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: సాహిత్యం: కులశేఖర్
గానం: 

అణగణగనగా అణగణగనగా చీమలు దోమలు
తెల్లకాకికి పిల్లలు నల్లులు బల్లులు రెక్కలున్నా పిల్లులు
గబగబా గలగలగల గుసగుస చేస్తుంటే
రుద్రా భూమి దద్దరిల్లి నిద్రనుంచి ఒక్కసారి శవాలన్నీ లేచాయి
యుద్ధం చేయాలనుకున్నాయి ఎదురు బోదురు నిలుచున్నాయి
కత్తులు తెంచుకుచోచాయి
బిస్మిల్లా బిస్మిల్లా

ఏ మొదలు బాగుందిరా అల్లరి కాళ్ళ మరదలు పిల్ల సందవేల సందుకోచేదా
నాయుడుబావ నిఘ్టుకోస్తావా కొత్తకోక తీసుకొస్తావా
కొకరైక ఎందుకు మల్లి శృంగారంలో అడ్డంబుల్లి
అబ్బో ఆశ అంగడి జల్సా అబ్బనంగ ఆరగిస్తావా

ఈలలు గోలలు ఆడియన్స్ చిందులు
ఆటలు పాటలు అన్ని కుప్పిగంతులు
ఓకే చాలురా ప్రాక్టీస్ ఆపండ్రా
ఫ్యాషనోడు వచేసాడా
మేక్ అప్ ఓడు వచేసాడా
మైక్ సౌండు పెంచండ్ర

అణగణగనగా అణగణగనగా చీమలు దోమలు
తెల్లకాకికి పిల్లలు నల్లులు బల్లులు రెక్కలున్నా పిల్లులు
గబగబా గలగలగల గుసగుస చేస్తుంటే
రుద్రా భూమి దద్దరిల్లి నిద్రనుంచి ఒక్కసారి శవాలన్నీ లేచాయి
యుద్ధం చేయాలనుకున్నాయి ఎదురు బోదురు నిలుచున్నాయి
కత్తులు తెంచుకుచోచాయి
బిస్మిల్లా బిస్మిల్లా
ఈ మాటలు బాగుందిరో ఈ ప్రైస్ మీదెరో





ఢిల్లీ నుంచి గల్లీ దాకా పాట సాహిత్యం

 
చిత్రం: చిత్రం (2000)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం:  కులశేఖర్
గానం: కౌసల్య , రవివర్మ 

పెద్దాపురం అమలాపురం భోగాపురం పిఠాపురం
మైలవరం ఐలవరం గన్నవరం అన్నవరం
భద్రాచలం సింహాచలం నెల్లూరు అల్లూరు
ఏలూరు ఆలూరు గుంటూరు గూడూరు
మోటూరు పాటూరు చిత్తూరు పుత్తూరు
ఒంగోలు కర్నూలు ద్వారపూడి కత్తిపూడి
సంగారెడ్డి రంగారెడ్డి ఆకివీడు నూజివీడు
గాజువాక ఆరిపాక
బాంగ్ ళోర్ మాంగ్ ళోర్
ముంబై కలకటా ఢిల్లీ

ఢిల్లీ నుంచి గల్లీ దాకా
ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండీ గర్ల్ ఫ్రెండ్సు
మళ్ళీ మళ్ళీ డౌటుందంటే ఇస్తాలెండీ రిఫరెన్సు
హల్లో అంటే అల్లుకుపోయే లేడీసున్నారూ
కల్లోనైనా కిస్సిమ్మంటూ వేధిస్తుంటారూ

ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండీ గర్ల్ ఫ్రెండ్సు
మళ్ళీ మళ్ళీ డౌటుందంటే ఇస్తాలెండీ రిఫరెన్సు

బెజవాడ లోన బేబీ గుడివాడలోన గౌరీ
బలివాడలోన గీతా సతివాడలోన సీత
మరువాడలోన హేమ పరవాడలోన ప్రేమ
దువ్వాడ లోన జూలీ ధార్వాడ లోన డాలీ
వాడ వాడల వాళ్ళు వచ్చి మనవాడని విలువిస్తారు
మాటి మాటికి మీదకొచ్చి మనువాడని విసిగిస్తారూ

ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండీ గర్ల్ ఫ్రెండ్సు
మళ్ళీ మళ్ళీ డౌటుందంటే ఇస్తాలెండీ రిఫరెన్సు

హైద్రాబాదులో షైనీ సైదాబాదులో సోనీ
ఆసిఫ్ బాద్ లో ఆశా అలహాబాద్ లో రోసా
ఆదిలాబాద్ లో షీబా అహ్మదబాద్ లో శోభా
మొయినా బాదులో మోనా జాహనా బాదులో మీనా
బాదుబాదుల వాళ్ళు వచ్చీ జిందాబాదులు కొడతారూ
కోడి కూతకు ముందే వచ్చి అంతా బారులు కడతారూ

ఢిల్లీ నుంచి గల్లీ దాకా
ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండీ గర్ల్ ఫ్రెండ్సు
మళ్ళీ మళ్ళీ డౌటుందంటే ఇస్తాలెండీ రిఫరెన్సు
హల్లో అంటే అల్లుకుపోయే లేడీసున్నారూ
కల్లోనైనా కిస్సిమ్మంటూ వేధిస్తుంటారూ

ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండీ గర్ల్ ఫ్రెండ్సు
మళ్ళీ మళ్ళీ డౌటుందంటే ఇస్తాలెండీ రిఫరెన్సు




ఏకాంతవేళ ఏకాంతసేవ పాట సాహిత్యం

 
చిత్రం: చిత్రం (2000)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం:  కులశేఖర్
గానం: కౌసల్య మల్లికార్జున్ 

ఏకాంతవేళ ఏకాంతసేవ నీకొంటే గోల రేపింది జ్వాలా
ఏంచేయమంటావు నాక్కుడాకొత్తేకదా
ఉకొంటామంటాను చదివించి ని సంపద

ఏ వయసే వరసే కలిపిన సొగసే సరసం తెలిపిన
నీ ని పరువం పదమే పాడిన తనువే థాకథిమ్ అడేనా
సోకు శోకాలు ఆపసోపాలు తీరుతున్నాయి నీ చేతి ఓదార్పుతో

ఏకాంతవేళ ఏకాంతసేవ నీకొంటే గోల రేపింది జ్వాలా

నీ ఆధారం సుధాలే పంచేనా దివినే ఇలకే దించేనా
నీ తమకం తపనే రేపేనా ఎగసే అలాలే ఆపేనా
స్వప్నలోకాలు దూరతీరాలు దగ్గరయ్యాయి ఈ వేడి నిట్టూర్పులూ

ఏకాంతవేళ ఏకాంతసేవ నీకొంటే గోల రేపింది జ్వాలా




అన్నయ్యా కుక్క కావాలి పాట సాహిత్యం

 
చిత్రం: చిత్రం (2000)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: నిహాల్, సందీప్, ఆర్ పి పట్నాయక్, రవి వర్మ, గాయత్రి, ఉత్తేజ్

అన్నయ్యా కుక్క కావాలి కుక్క కావాలి
వినరా బ్రదరూ అయోధ్యనేలే రాముని స్టోరీ
దశరధ రాజుకు వారసుడు 
సకల శాస్త్రాల కోవిదుడు
అస్త్రవిద్యలో ఫస్టతడు
మంచి గుణాల లిస్టతడు
ఎట్లుంటడో ఎరికెనా
బ్లూకలర్ల మస్తుగుంటడు
లక్ష్మణుడని బ్రదరున్నాడు
అన్నకి అండగ నిలిచాడు
సెల్ఫిష్ నెస్సుని విడిచాడు
సేవే గొప్పని తలచాడు

ఈనా బ్లూకలరేనా
బ్రదర్సు ఒకటేగాని కలర్సు వేర్రా నాని
దమాక్ ఖరాబైందా ఏం సార్ నీకు
అన్నదమ్ములేమో ఒకటంటావ్
రంగులేమో అలగలగ్ అంటావ్
కత మంచిగ చెప్పుర్రి సార్ నీకు దండం పెడ్త

సీతాదేవను వైఫు ఉన్నది
రామునితోనే లైఫు అన్నది
హానెస్టి తన వైనమన్నది
ఫారెస్టునకే పయనమైనది
రాముని సేవకు తొలిబంటు
అతిబలవంతుడు హనుమంతు
నమ్మిన బంటుగ రాముని పదముల చెంతే ఉంటాడు
పదముల చెంతే ఉంటాడు
సూన్నీకి కోతి లెక్కుంటడు గానీ రామసామిని ఎవ్వడన్నా ఎమన్నా అన్నాడనుకో
కుక్కని కొట్టినట్టు కొడతాడు
ఆ... కుక్క కుక్క కావాలి కుక్క కావాలి

అసలు నిన్నెవడ్రా ఆమాటనమంది
వీడ్ని నోరు మూసి పక్కకి లాక్కెళ్ళండ్రా నోరిప్పనీయద్దసలు

అతల వితల సుతల తలాతల
రసాతల పాతాళ లోకములయందు
అవిక్రమ పరాక్రమవంతుడు
కురువంశొద్భవుండు సుయోధనుండు
రారాజు సోదరులు హండ్రెడు తకతకిట
ఆ పాండవులతో ఉండరు తకతకిట
వాటాలలోన వాదమొచ్చిందీ
బిగ్ వారు దాకా తీసుకొచ్చిందీ

ద్రౌపది వస్త్రాపహరణం ఆపలేదెవరూ దారుణం
పులిలాగ భీమన్న లంఘించినాడు
బలశాలి కోపంతొ కంపించినాడు
గద ఎత్తినాడు తొడ కొట్టినాడు
గద ఎత్తినాడు తొడ కొట్టినాడు
గద ఎత్తినాడు తొడ కొట్టినా
రారాజు గుండెల్ని చీల్చుతానంటూ
నిండు సభలో తాను ప్రతిన పూనాడు

క్లైమాక్స్ల ఫైటింగ్ షురు ఐంది
భీముడు గద తీసిండు పిసికిండు
దుర్యొధనుడు భీ గద తీసిండు పిసికిండు
ఎవ్వరి తొడలు ఆల్లాల్లు కొట్టుకున్నరు
ఆడు కొట్టిండు ఈడు కొట్టిండు
ఈడు తలకాయ మీద కొడ్తె
ఆడు కాల్ మీద కొట్టిండు
ఈడు కాల్ మీద కొడ్తె
ఆడు తలకాయ మీద కొట్టిండు
కొట్టిండు కొట్టిండు
అరె ఎంతైనా భీముడు హీరొ కదబై
దుర్యొధనుడు ఖాళీ విలన్
ఎమైతది భీముని చేత్ల కుక్క సావు సచ్చిండు
ఆ...కుక్క కుక్క కావాలి కుక్క కావాలి

అయ్యొ మళ్ళి గుర్తుచేసాడ్రా
నువ్వు చెప్పు నువ్వు చెప్పు
ఒరే శ్రీశైలం మద్యలో వచ్చుడు కాదుగాని
నువ్వు చెప్పురా

అరెరె చిన్న పోరన్కి కతచెప్పనీకొస్తల్లేదు
ఎం చదువుకున్నార్ వయ్యా మీరు
ఇస్టోరి నే చెప్తా చెవులు పెట్టి ఇనుండ్రి

ఏడేడు లోకాల యాడుంది అంతటి అందం ఓయమ్మ
పుత్తడి బొమ్మల్లె ఉంటుంది బ్రదరూ బాలనాగమ్మ

జంతరు మంతరు మోళీ చేసే మరాఠ మాంత్రికుడు మాయల ఫకీరు వంచకుడు
అందరిలోన సుందరికోసం దుర్భిణి వేసాడు
ఎన్నో ప్లానులు గీసాడు
దుర్భిణిలోన బాలనాగమ్మ రూపం కనిపించి ఆమెను ఇట్టే మోహించీ
బెగ్గరు వేషం వేసుకొచ్చాడు జిత్తుల మాంత్రికుడు మాయల పకీరు వంచకుడు

గప్పుడేమైందో ఎరికెనా
మాయల ఫకీరుగాడు తన చేతిలో ఉన్న మంత్రం కట్టెతోని 
బాలనాగమ్మ తలకాయ మీద ఒక్కటేసిండు
గంతే బాలనాగమ్మ మారిపోయింది
ఎలా మారిపోయింది అరె చెప్తున్నాగ మారిపోయింది
అదే ఎలా మారింది అరె చెప్తున్నాగ టాప్ టు బాటం మారిపోయింది
చెప్తావా లేదా నే చెప్ప
చెప్తావా లేదా  ఏంది కొడ్తరా
ఆ అందరు కొడ్తారా
ఎం డౌటా అబ్బె డౌటేంలె చెప్పినా చెప్పకున్న కొడ్తారు
మాటర్ అసుంటిది
మీ చెతులల్ల నే చావనీకి కుక్క లెక్క మారిందిబై
కుక్క కావాలి కుక్క కావాలి కుక్క కావాలి




మావోయ్ ఓయ్ పారిపోతున్నది పాట సాహిత్యం

 
చిత్రం: చిత్రం (2000)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: సాహిత్యం: కులశేఖర్
గానం: నిహాల్, కౌసల్య, రవివర్మ 

సూపర్ అన్నాడు థాంక్సు చెప్పింది కిస్సులిచాడు
కాచు పట్టింది ఏదోచెప్పాడు సిగ్గుపడింది
రోజ్లిచాడు ఐ లవ్ యూ అన్నడోచ్
మావోయ్ ఓయ్
పారిపోతున్నది ఎవరేంటి
వెళ్ళిపోతున్నది ఎవరేంటి

ఆ అమెరికా అమ్మాయి మావో వెళ్ళిపోతున్నాది మావో
నివాసుకితగు వన్నెలాడి మావో వెళ్ళిపోతున్నాది మావో
వెళ్ళిపోతే వెళ్ళిపోని పిల్లకోతి చెల్లిగాని ఎలిజిబిత్ తేలేరేటి ఓ పిల్ల
వాళ్ళ కోర వాళ్ళకోరా మనసుపడ్డ మల్లి ఇదేరా వెళ్లి పిలుచుకొచ్చేరా అబ్దుల్లా
పిల్ల అదరహో కళ్ళు చెదరహో అధిరచిన్న ముద్దులగుమ్మ బెదిరనహో
పిల్ల అదరహో కళ్ళు చెదరహో అధిరచిన్న ముద్దులగుమ్మ బెదిరనహో

పాప ఓయ్
ఆగిపొమ్మన్నాడు ఎవరేంటి
పారొచ్చేయమన్నాడు ఎవరేంటి
మా పాలకొల్లు పిల్లగాడు పాపో ఆగిపొమ్మన్నాడు పాప
లోలోన బేళ్ళుమోగుతోంది పాపో బెగిరా అన్నాడు పాప
మల్లెపువ్వులాంటి నువ్వు నవ్వుతుంటే రివ్వుమంటూ లవ్ పుట్టుకొచ్చిందే ఓ పిల్ల
అల్లరిక కట్టిపెట్టి ఒట్టుపెట్టి జట్టుకట్టి అల్లుకోరా చుట్టిముట్టి షోకిల్లా
పిల్ల పిలిచేహో కళ్ళు కలిసేహో అధిరాబన్న అసలు కదా ముదిరానహో
పిల్ల పిలిచేహో కళ్ళు కలిసేహో అధిరాబన్న అసలు కదా ముదిరానహో

మావోయ్ ఓయ్
పారిపోతున్నారు ఎవరేంటి
వెళ్లిపోతున్నారు ఎవరేంటి
ఆ అమెరికా అమ్మాయి పాలకొల్లు అబ్బాయి పారిపోతున్నారు మావ మావ
పిల్ల అదరహో పిల్ల ఖజురహో అదిరబాన్న ఇద్దరి జత కుదిరానహో
పిల్ల అదరహో పిల్ల ఖజురహో అదిరబాన్న ఇద్దరి జత కుదిరానహో
పిల్ల అదరహో పిల్ల ఖజురహో అదిరబాన్న ఇద్దరి జత కుదిరానహో




ఊహల పల్లకీలో ఊరేగించన పాట సాహిత్యం

 
చిత్రం: చిత్రం (2000)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: నిహాల్, ఉష

ఊహల పల్లకీలో ఊరేగించన 
ఆశల వెల్లువై రాగం పలికించనా 
ఊహల పల్లకీలో ఊరేగించన 
ఆశల వెల్లువై రాగం పలికించనా 
కలహంసై కబురులు నింపనా 
రాచిలకై కిలకిల నవ్వనా 
నా పెదవుల మధువులె ఇవ్వనా 
సయ్యాటలోనా...

ఊహల పల్లకీలో ఊరేగించనా 
ఆశల వెల్లువై రాగం పలికించనా 

ప్రేమలో తీపి చూసే వయసే నీదిరా 
బ్రతుకులో చేదులున్నా భయమే వద్దురా 
సుడిగుండం కాదురా సుమగంధం ప్రేమరా 
పెనుగండం కాదురా అనుబంధం ప్రేమరా 
సిరి తానుగానే వచ్చి నిన్ను చేరునురా...

ఊహల పల్లకీలో ఊరేగించనా 
ఆశల వెల్లువై రాగం పలికించనా

మేఘాలకు నిచ్చెనె వేయన 
ఆకాశపుటంచులే వంచన 
ఆ జాబిలి కిందకే దించనా...
నా కన్నెకూనా...

ఊహల పల్లకీలో ఊరేగించనా 
ఆశల వెల్లువై రాగం పలికించనా 

ఆశగా పల్లవించే పాటే నీవులే 
జీవితం తోడులేని మోడే కాదులే 
కలిసుండె వేళలో కలతంటు రాదులే 
అమవాసై పోదులే అడియాసే కాదులే 
చిరు దివ్వె గొంతు ఇంక దారి చూపునులే 

ఊహల పల్లకీలో ఊరేగించనా 
ఆశల వెల్లువై రాగం పలికించనా

మేఘాలకు నిచ్చెనె వేయన 
ఆకాశపుటంచులే వంచన 
ఆ జాబిలి కిందకే దించనా 
నా కన్నెకూనా...

ఊహల పల్లకీలో ఊరేగించనా 
ఆశల వెల్లువై రాగం పలికించనా 


Palli Balakrishna Saturday, July 22, 2017



చిత్రం: ఔనన్నా కాదన్నా (2005)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
నటీనటులు: ఉదయ్ కిరణ్, సదా
దర్శకత్వం: తేజ
నిర్మాత: అట్లూరి పూర్ణచంద్రరావు
విడుదల తేది: 06.04.2005



Songs List:



ఔనన్నా కాదన్నా పాట సాహిత్యం

 
చిత్రం: ఔనన్నా కాదన్నా (2005)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్. పి. పట్నాయక్

ఔనన్నా కాదన్నా నీతోనే నేనున్నా
ఔనన్నా కాదన్నా నీలోనే నేనున్నా
నీ చెలిమే ఓ కాలి వంతెనరా
నీ వినతే చిరుగాలై వస్తున్నా
నీ పిలుపే రోజంతా వింటున్నా
వేదనలో స్వప్నాలే కంటున్నా
ప్రేమైనా చావైనా...
నీ తోనే ఏమైనా...





గుడి గంటలా నవ్వుతావేల పాట సాహిత్యం

 
చిత్రం: ఔనన్నా కాదన్నా (2005)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఎస్.పి.బి.చరణ్ , ఉష

గుడి గంటలా నవ్వుతావేల
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేల
తెలియదు నాకు తెలియదు
అసలేంటి సంగతి ఓ బాలా
తెలియదు తెలియదు తెలియదు తెలియదులే

గుడి గంటలా నవ్వుతావేల
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేల
తెలియదు నాకు తెలియదూ

నీ వైపల చూస్తుంటె ఆకలేయకుందీ
నీ చూపులొ బంధించె మంత్రమేమున్నదీ
నీ మాటలే వింటుంటె రోజు మారుతుందీ
నా తోడుగ నువ్వుంటె స్వర్గమె చిన్నదీ
మనసెందుకొ ఇలా మూగవోతోంది రాప
తెలియదు
మరుమల్లె పూవులా గుప్పుమంటోంది లోన
తెలియదు

గుడి గంటలా నవ్వుతావేల
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేల
తెలియదు నాకు తెలియదూ

నీ నీడలొ నేనున్న చూడమంటున్నదీ
ఈ హాయి పేరేదైనా కొత్తగా ఉన్నదీ
నా కంటినె కాదన్నా నిన్ను చూస్తున్నదీ
నేనెంతగ వద్దన్న ఇష్టమంటున్నదీ
మరి దీనినే కద లోకమంటుంది ప్రేమ
తెలియదూ
అరె దూరమంటూనే చేరువౌతుంది రామ
తెలియదూ

గుడి గంటలా నవ్వుతావేల
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేల
తెలియదు నాకు తెలియదు
అసలేంటి సంగతి ఓ బాలా
తెలియదు తెలియదు తెలియదు తెలియదులే

గుడి గంటలా నవ్వుతావేల
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేల
తెలియదు ...




అనగనగనగా ఒక ఊర్లో పాట సాహిత్యం

 
చిత్రం: ఔనన్నా కాదన్నా (2005)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: కే. కే, ఉష

కానరాని దైవమా జలిలేని కాలమా 
ప్రేమించుకుంటే నేరమా...

అనగనగనగా ఒక ఊర్లో ఉందో గోరింకా
తన వెనకే తిరిగే చిలకంటే ఎంతో ప్రేమంట
ప్రేమలో లీనమై ఒక్కటయ్యే వేళలో
లోకమే ఏకమయ్యి ఒప్పుకోని రేయిలో
ప్రేమ గూడు కూలిపోయే గాలి వానలో

ప్రేమా ఓ ప్రేమా ఇది నీ మాయేనా 
ప్రేమా ఓ ప్రేమా జత కలుపే మైనా

అయ్యో పాపం గోరింకా లోనే ఉందిగా
అయినా పాపం చిలకమ్మా చూడేలేదుగా
ఆశే నీరై కన్నీరై ఏరై పారినా 
ఆరాధించే గుండెల్లో ప్రేమే మారునా
పూత పూసినా పూజ చేసినా 
రాత మారునా దైవమా

అనగనగనగా ఒక ఊర్లో ఉందో గోరింకా
తన వెనకే తిరిగే చిలకంటే ఎంతో ప్రేమంట

ప్రేమించాక విడిపోయే మాటే లేదుగా
ప్రాణం లేని నీడైనా దూరం కాదుగా
గాలికి పోయే గాలైన గదిలో దాగునా
అర్ధంకాదే ఏనాడూ మసలీ వేదన
ఏమి చేసినా ఎవ్వరాపినా ప్రేమ ఆగునా దైవమా


అనగనగనగా ఒక ఊర్లో ఉందో గోరింకా
తన వెనకే తిరిగే చిలకంటే ఎంతో ప్రేమంట
ప్రేమలో లీనమై ఒక్కటయ్యే వేళలో
లోకమే ఏకమయ్యి ఒప్పుకోని రేయిలో
ప్రేమ గూడు కూలిపోయే గాలి వానలో

ప్రేమా ఓ ప్రేమా ఇది నీ మాయేనా 
ప్రేమా ఓ ప్రేమా జత కలుపే మైనా





నేల తల్లి గుండెలో... పాట సాహిత్యం

 
చిత్రం: ఔనన్నా కాదన్నా (2005)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: శంకర్ మహదేవన్

నేల తల్లి గుండెలో...
ఎన్ని వేల పాటలో...
పాటే వింటే ఊపే రావాలిరా
తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా 
చిందులేసి ఆడాలిరా
కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా
ఊరి జనం ఊగేలా నాగస్వరం ఊదాల
మద్దిల దరువెయ్యాలా తుళ్ళి పడేలా

పాటే వింటే ఊపే రావాలిరా
తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా 
చిందులేసి ఆడాలిరా
కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా

ఈ పల్లె పదాలే నోరారా అనాలి
తప్పెట్లే పడాలి రాగానికి
జాబిళ్ళి వినాలి నేలకదే దిగాలి 
జజ్జినకడి జనారే తాళానికి
వానమ్మ చిందేసి ఆడాలిరా 
వెన్నెల్లో గోదారి వెల్లువయ్యేలా
కొండమ్మ కోనమ్మ మోగాలిరా 
ఈ గాలి ఈ నేల పల్లవయ్యేలా
తప్పెటలే మోగాల ఉప్పెనలే రేగాల 
పాట విని పల్లెమ్మ వెంట పడాల

పాటే వింటే ఊపే రావాలిరా
తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా 
చిందులేసి ఆడాలిరా
కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా

ఊరంతా వినాలి అబ్బబ్బో అనాలి 
కానుకలే ఇవ్వాలి ఈ పాటకి
చిన్నారి చకోరి వాలు కళ్ళు వయ్యారి 
వెంట మరి పడాలి సయ్యాటకి
ఈ బుజ్జి భూగోళం ఊగాలిరా
పాపాయిలా పాట ఉయ్యాలలో
పైనున్న ఆకాశం వంగాలి రా
తాతయ్యలా ఈడు తైతక్కలో
మూల నున్న అమ్మమ్మ
మూడుకాళ్ళ ముసలమ్మ
పాట విని రోజంతా చిందులెయ్యాలా

పాటే వింటే ఊపే రావాలిరా
తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా 
చిందులేసి ఆడాలిరా
కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా




మలినం కానిది ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: ఔనన్నా కాదన్నా (2005)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఉష

మలినం కానిది ప్రేమ మరణం లేనిది ప్రేమ
శాశ్వత మైనది ప్రేమ మనసే చిరునామా
గుండెల సందడి ప్రేమ ఆశల పందిరి ప్రేమ
ఓటమి లేనిది ప్రేమ జయమే ఎపుడైనా
గాయం చేస్తే భాదకు బదులు బంధం పుడుతుంది
దూరం చేస్తే బంధం ఇంకా బలపడి పోతుంది
ప్రేమను కోరే మనిసెపుడు ఒరిగే వీలుంది
మనసును మీటే ప్రేమెపుడు నిలిచే ఉంటుంది
ఔనన్నా కాదన్నా...
ప్రేమకోసం మళ్ళి మళ్ళి ప్రేమే పుడుతుంది




సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: ఔనన్నా కాదన్నా (2005)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: చిత్ర , భాస్కర్, మల్లికార్జున్

సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మ 
మాఘమాస మొచ్చేనమ్మ
సంబరాలు తెచ్చెనమ్మా గుండె గూటికి
పెళ్ళి మాట చెప్పి కోయిలమ్మ ఆశలెన్నొ రేపెనమ్మా
కొత్త కాంతి తెచ్చెనమ్మా కంటి పాపకి
చిరు నవ్వుల వానలలో మరుమల్లెల వాకిలలో
మది ఊయల లూగే నమ్మా  ఊహాలలో

సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మ 
మాఘమాస మొచ్చేనమ్మ
సంబరాలు తెచ్చెనమ్మా గుండె గూటికి

ప్రేమ కలిపింది మనసిచ్చిన నెచ్చలితో
తోడు దొరికింది ఎద నోచిన నోములతో
దూరములు దూరమయ్యే ఊహల పల్లకిలో
మాటలిక పాటలయ్యే తియ్యని పల్లవిలో
మనసంతా సంతోషం
మనసంతా ఆనందం

సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మ 
మాఘమాస మొచ్చేనమ్మ
సంబరాలు తెచ్చెనమ్మా గుండె గూటికి

నేల మురిసింది శుభలేఖలు  అందుకొని
వాన కురిసింది ఇక చల్లగ ఉండమని
వేణువులు వేదమయ్యే నీ జత చేరమని
తారకలు తాళి తెచ్చే ఇక తోడుగ సాగమని
అందుకని ఔనన్నా
వదలనుగా కాదన్నా

సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మ 
మాఘమాస మొచ్చేనమ్మ
సంబరాలు తెచ్చెనమ్మా గుండె గూటికి
పెళ్ళి మాట చెప్పి కోయిలమ్మ ఆశలెన్నొ రేపెనమ్మా
కొత్త కాంతి తెచ్చెనమ్మా కంటి పాపకి
చిరు నవ్వుల వానలలో మరుమల్లెల వాకిలలో
మది ఊయల లూగే నమ్మా  ఊహాలలో

పెళ్ళికల వచ్చెనమ్మా పిల్ల సిగ్గుకి
బుగ్గ చుక్క పెట్టారమ్మా ముద్దుగుమ్మకి





నడుమే ఉయ్యాల పాట సాహిత్యం

 
చిత్రం: ఔనన్నా కాదన్నా (2005)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: పార్థ

నడుమే  ఉయ్యాల నడకే  జంపాల
నడుమే  ఉయ్యాల నడకే  జంపాల
సరుకే ఊగేల తకదిమితలాల
వామ్మో ఎగాదిగి జిగేలని అందాల
జనమే వెంటపడేలా
జడతో ఫ్రెంచి పిడేలా
జనమే వెంటపడేలా
జడతో ఫ్రెంచి పిడేలా

సరాసరి కుమారిపై కళ్ళు పడేలా
ఒ ఎకా ఎక్కి నసాడమే అంటుకునేలా
జుర్రుమనేలా జివ్వుమనేలా
సోకే  సునా పెడ పాన్ మసాలా
అంత ఇదేలా కింద పడేలా
బాల బరంపురం భంగిమలెలా

నడుమే  ఉయ్యాల నడకే  జంపాల
సరుకే ఊగేల తకదిమితలాల
వామ్మో ఎగాదిగి జిగేలని అందాల
జనమే వెంటపడేలా
జడతో ఫ్రెంచి పిడేలా
జనమే వెంటపడేలా
జడతో ఫ్రెంచి పిడేలా

చెడమడ చిరాకుల చంపక మాలా
ఒ ఎడపెడ హడావిడ చంపకిలాగా
ఊరె వినేలా బోడి సవాలా
పోవె పిఠాపురం కంతి తపాలా
పోరి ఇవాలా నాతో మజాలా
రావె సికాకుళం సిల్కు రుమాలా

నడుమే  ఉయ్యాల నడకే  జంపాల
సరుకే ఊగేల తకదిమితలాల
వామ్మో ఎగాదిగి జిగేలని అందాల
జనమే వెంటపడేలా
జడతో ఫ్రెంచి పిడేలా
జనమే వెంటపడేలా
జడతో ఫ్రెంచి పిడేలా

జనమే వెంటపడేలా
జడతో ఫ్రెంచి పిడేలా
జనమే వెంటపడేలా
జడతో ఫ్రెంచి పిడేలా





ప్రేమించానని చెప్పనా పాట సాహిత్యం

 
చిత్రం: ఔనన్నా కాదన్నా (2005)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: సందీప్ , ఉష

ప్రేమించానని చెప్పనా 
మనసిచ్చానని చెప్పనా
నాలో ఆశలు చెప్పనా 
నాలో ఊసులు చెప్పనా
నువ్వె నేనై చెప్పనా
నీలో నేనే చెప్పనా

ప్రేమించానని చెప్పనా 
మనసిచ్చానని చెప్పనా
నాలో ఆశలు చెప్పనా 
నాలో ఊసులు చెప్పనా
నువ్వె నేనై చెప్పనా
నీలో నేనే చెప్పనా

పైర గాలి నీలా తాకి పోయె వేళా
ప్రేమలో పులకింతలె అనుకోనా
నీలినింగి నీలా మారి పోయె వేళ
లోకమె ప్రియురాలని అనుకోనా
ఊహలోన తేలీ వేల ఊసులాడీ
శ్వాసలాగ మారీ గుండెలోన చేరీ
తీపి ఆశలే చెప్పనా

ప్రేమించానని చెప్పనా 
మనసిచ్చానని చెప్పనా
నాలో ఆశలు చెప్పనా 
నాలో ఊసులు చెప్పనా

దూరమైన గాని భారమైన గాని
నీడల నిను వీడదె తొలి ప్రేమా
గాలివానె రాని గాయమైనా కాని
హాయిగ చిగురించద మన ప్రేమా
గుండె ఆగిపోనీ గొంతు ఆరిపోనీ
కాలమాగి పోనీ నేల చీలిపోనీ
ప్రేమ పోదనీ చెప్పనా

ప్రేమించానని చెప్పనా 
మనసిచ్చానని చెప్పనా
నాలో ఆశలు చెప్పనా 
నాలో ఊసులు చెప్పనా
నువ్వె నేనై చెప్పనా
నీలో నేనే చెప్పనా
నువ్వె నేనై చెప్పనా
నీలో నేనే చెప్పనా


Palli Balakrishna Sunday, July 16, 2017

Most Recent

Default