-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Swayamvaram"
Swayamvaram (1999) Telugu Songs Lyrics Album Cover

Swayamvaram (1999) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Swayamvaram (1999)
Banner : S.P. Creations
Music : Vandemataram Srinivas
Director : K. Vijaya Bhaskar
Producer : Venkata Shyam Prasad
Actors : Venu Thottempudi
Actress : Laya
Supporting Cast : Brahmanandam, Ali, M.S. Narayana
Release Date : 22 April 1999
MOVIE HIGHLIGHTS

Swayamvaram (1999) is a sensational romantic comedy that marked the successful debut of Venu Thottempudi and Laya.

• Directed by the master of clean entertainment K. Vijaya Bhaskar, the film is known for its witty dialogues and relatable characters.

• Music Director Vandemataram Srinivas delivered a brilliant soundtrack that played a key role in the movie's huge success.

Swayamvaram (1999) also marks the screenwriting debut of the master craftsman Trivikram Srinivas, who later went on to become one of the most celebrated filmmakers in Telugu cinema.

• Soulful melodies like "Keeravaani" and "Marala Telupuna" became instant classics and are still cherished by music lovers.

• All lyrics for the album were penned by Bhuvana Chandra, showcasing his versatility in writing romantic and trendy tracks.

Keeravaani Raagamlo Song Lyrics in Telugu – Swayamvaram (1999)

'Keeravaani Raagamlo' song from Swayamvaram (1999) movie is composed by Vandemataram Srinivas, written by Bhuvana Chandra, and sung by Udit Narayan and Swarnalatha.

SONG INFORMATION
Movie : Swayamvaram (1999)
Music : Vandemataram Srinivas
Lyricist : Bhuvana Chandra
Singers : Udit Narayan, Swarnalatha
కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం కొత్త కొత్త ఉహాలతో వనికిందొక అధరం గాలిలోన తేలిపోవు రాజహంసవు నీవంటా నిన్ను తాకి పొంగిపోవు నీలి మబ్బుని నేనంటా వానలా వచ్చి వరదలా పొంగు ప్రేమవే నీవా మెరుపులా మైమరుపులా జత చేరగా రావా మంచువెన్నెల స్నానమాడిన మల్లె పందిరిలో వలపు వాకిట వేచి నిలిచిన వయసు పల్లకిలో ఏకాంత సేవకు ఉర్రూతలూగిన శృంగార శిల్పానివా కళ్యాణ రాముని కౌగిట్లో వదిగిన బంగారు పుష్పానివా పంచుకో ప్రియతమా ప్రేమనే ప్రేమగా తీయగా తీయ తీయగా తమకానివై ప్రేమా కదనసీమకు కాలు దువ్విన గడుసు మన్మధుడా కౌగిలింతల కాటువేయకు చిలిపి చందురుడా వేవేల సొగసులు వెచ్చంగ పొదిగిన వయ్యారి ముందుండగా మందార పెదవుల గంధాలు తీయక అయ్యారే ఉండేదెలా అందుకో అధరమే హాయిగా ఏకమై ఘాటుగా అలవాటుగా తెరచాటుగా భామా కీరవాణి రాగంలో - పిలిచిందొక హృదయం కొత్త కొత్త ఉహాలతో - వనికిందొక అధరం గాలిలోన తేలిపోవు - రాజహంసవు నీవంటా నిన్ను తాకి పొంగిపోవు - నీలి మబ్బుని నేనంటా వానలా వచ్చి వరదలా పొంగు - ప్రేమవే నీవా మెరుపులా మైమరుపులా - జత చేరగా రావా

Vinave Cheli Song Lyrics in Telugu – Swayamvaram (1999)

'Vinave Cheli' song from Swayamvaram (1999) movie is composed by Vandemataram Srinivas, written by Bhuvana Chandra, and sung by Sonu Nigam and B. Arundhathi.

SONG INFORMATION
Movie : Swayamvaram (1999)
Music : Vandemataram Srinivas
Lyricist : Bhuvana Chandra
Singers : Sonu Nigam, B. Arundhathi
వినవె చెలి... (Full Lyrics to be updated)

Pikaso Chitrama Song Lyrics in Telugu – Swayamvaram (1999)

'Pikaso Chitrama' song from Swayamvaram (1999) movie is composed by Vandemataram Srinivas, written by Bhuvana Chandra, and sung by S.P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Swayamvaram (1999)
Music : Vandemataram Srinivas
Lyricist : Bhuvana Chandra
పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా నీ పెదవుల దాగిన మందారాలకి ఓ చెలీ సలామ్ నీ నడుముని వీడని వయ్యారాలకి కాముడే గులామ్ నీ తనువు తాకి చిరుగాలికొచ్చే మైమరపు సత్యభామా నీ నీలి కురుల కిరణాలు సోకి వసి వాడె చందమామ ఏ దివ్య వరమో అది నీ కంఠస్వరమై ఏ వింటి శరమో అది నీ కంటి వశమై అంగాంగాన శృంగారాన్ని సింగారించగా అభిమానాన్ని అనురాగంతో అభిషేకించగా మనసే మౌన సంగీతాన్ని ఆలాపించగా వయసే పూల పరుపై నిన్ను ఆహ్వానించదా ఏ శృతిలో లయమగు తాళం నీవే కన్యకామణి ఏ సేవలతో నిను మెప్పించాలే మందగామిని ఏ మెరుపు తగిలి భువికొచ్చినావే అందాల మేఘమాలా నీ కులుకు చూసి నా గుండెలోన రగిలిందే విరహా జ్వాలా నీ చూపు తగిలి ఇక నేనుండగలనా నా బాధ తెలిసి జత రావేమె లలనా నాలో ఉన్న ఉల్లాసాన్ని నువు ప్రేమించగా నీలో ఉన్న సౌందర్యాన్ని నే లాలించనా ఏకాంతాన నువ్వు నేను ఉయ్యాలూగగా లోకాలన్ని నిన్నూ నన్ను దీవించేయవా ఏ వెన్నెల ఒడిలో ఉదయించావే నిండు జాబిలి నీ కౌగిళి లేక తీరేదెట్టా తీపి ఆకలి పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా నీ పెదవుల దాగిన మందారాలకి ఓ చెలీ సలామ్ నీ నడుముని వీడని వయ్యారాలకి కాముడే గులామ్

Marala Telupuna Song Lyrics in Telugu – Swayamvaram (1999)

'Marala Telupuna' song from Swayamvaram (1999) movie is composed by Vandemataram Srinivas, written by Bhuvana Chandra, and sung by K.S. Chithra.

SONG INFORMATION
Movie : Swayamvaram (1999)
Music : Vandemataram Srinivas
Lyricist : Bhuvana Chandra
Singers : K.S. Chithra
మరల తెలుపన ప్రియ..మరల తెలుపన మరల తెలుపన ప్రియ..మరల తెలుపన ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని కనుపాపులో నింపుకున్న చిరునవ్వుల పరిచయాన్ని మరల తెలుపన ప్రియ..మరల తెలుపన విరబూసిన వెన్నెలలో తెర తీసిన బిడియాలని విరబూసిన వెన్నెలలో తెర తీసిన బిడియాలని ఆణువణువూ అల్లుకున్న అంతు లేని విరహాలని ఆణువణువూ అల్లుకున్న అంతు లేని విరహాలని నిదుర పోనీ కన్నులలో పవళించు ఆశలని చెప్పలేక చేత కాక మనసు పడే తడబాటుని మరల తెలుపన ప్రియ..మరల తెలుపన నిన్న లేని భావమేదో కనులు తెరిచి కలయ చూసి నిన్న లేని భావమేదో కనులు తెరిచి కలయ చూసి మాట రాని మౌనమేదో పెదవి మీద ఒదిగి పోయే మాట రాని మౌనమేదో పెదవి మీద ఒదిగి పోయే ఒక క్షణమే ఆవేదన మరు క్షణమే ఆరాధన తెలియ రాక తెలుప లేక మనసు పడే మధుర భాద మరల తెలుపన ప్రియ..మరల తెలుపన మరల తెలుపన ప్రియ..మరల తెలుపన

Pellichesukora Song Lyrics in Telugu – Swayamvaram (1999)

'Pellichesukora' song from Swayamvaram (1999) movie is composed by Vandemataram Srinivas, written by Bhuvana Chandra, and sung by Mano.

SONG INFORMATION
Movie : Swayamvaram (1999)
Music : Vandemataram Srinivas
Lyricist : Bhuvana Chandra
Singers : Mano
పెళ్లి చేసుకోరా... (Full Lyrics to be updated)

Yara Ra Roi Song Lyrics in Telugu – Swayamvaram (1999)

'Yara Ra Roi' song from Swayamvaram (1999) movie is composed by Vandemataram Srinivas, written by Bhuvana Chandra, and sung by Suresh Peters.

SONG INFORMATION
Movie : Swayamvaram (1999)
Music : Vandemataram Srinivas
Lyricist : Bhuvana Chandra
Singers : Suresh Peters
ఎరరారోయ్... (Full Lyrics to be updated)

Palli Balakrishna Tuesday, August 1, 2017
Swayamvaram (1982) Telugu Songs Lyrics Album Cover

Swayamvaram (1982) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Swayamvaram (1982)
Banner : Lakshmi Ganesh Chitra
Music : Chellapilla Satyam
Director : Dasari Narayana Rao
Producers : D. Rama Raju, D. Vijaya Rama Raju
Actors : Shoban Babu
Actresses : Jaya Prada, Anjali Devi
Supporting Cast : Rao Gopala Rao, Gummadi, Dasari Narayana Rao
Release Date : 6 August 1982

Nenikkada Song Lyrics in Telugu – Swayamvaram (1982)

'Nenikkada' song from Swayamvaram (1982) movie is composed by Chellapilla Satyam and sung by S. P. Balasubrahmanyam and P. Susheela. Lyrics are written by Rajasri.

SONG INFORMATION
Movie : Swayamvaram (1982)
Lyricist : Rajasri
చిత్రం: స్వయంవరం (1982) సంగీతం: చెల్లపిళ్ల సత్యం సాహిత్యం: రాజశ్రీ గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల పల్లవి: నేనిక్కడా నువ్వక్కడా కనులిక్కడా కలలక్కడా మన ఇద్దరి కలలు తీరేదెపుడు ఇంతే సంగతులు చిత్తగించవలెను ఇంతే సంగతులు చిత్తగించవలెను నేనిక్కడా నువ్వక్కడా కనులిక్కడా కలలక్కడా మన ఇద్దరి కలలు తీరేదెపుడు ఇంతే సంగతులు చిత్తగించవలెను ఇంతే సంగతులు చిత్తగించవలెను చరణం: 1 చూపులతో రాశాను నీకు ఉత్తరం ఊపిరితో చేశాను ప్రేమ సంతకం చిరుగాలికి అందించాను నీకు ఇమ్మని కలలోకైనా ఒకసారి రమ్మని చేశాను చదివాను నీ జాబు ఈ చూపుల్లో చదువుకో నా జవాబు ఇంతే సంగతులు చిత్తగించవలెను ఇంతే సంగతులు చిత్తగించవలెను నేనిక్కడా నువ్వక్కడా కనులిక్కడా కలలక్కడా మన ఇద్దరి కలలు తీరేదెపుడు ఇంతే సంగతులు చిత్తగించవలెను ఇంతే సంగతులు చిత్తగించవలెను చరణం: 2 ఇవి కానే కావు కలం రాతలు కలకాలం నిలిచేటి తీపి భాషలు చిగురశాలు కురిపించె ప్రేమ పత్రము నిలవాలి ఎదలోన జీవితాంతము మాటాడి వేటాడి నీ నవ్వులు నా మదిలోన కురవని తేనెజల్లులు ఇంతే సంగతులు చిత్తగించవలెను ఇంతే సంగతులు చిత్తగించవలెను నేనిక్కడా నువ్వక్కడా కనులిక్కడా కలలక్కడా మన ఇద్దరి కలలు తీరేదెపుడు ఇంతే సంగతులు చిత్తగించవలెను ఇంతే సంగతులు చిత్తగించవలెను

Musigesina Mabbullo Song Lyrics in Telugu – Swayamvaram (1982)

'Musigesina Mabbullo' song from Swayamvaram (1982) movie is composed by Chellapilla Satyam and sung by S. P. Balasubrahmanyam. Lyrics are written by Dasari Narayana Rao.

SONG INFORMATION
Movie : Swayamvaram (1982)
చిత్రం: స్వయంవరం (1982) సంగీతం: చెల్లపిళ్ల సత్యం సాహిత్యం: దాసరి నారాయణరావు గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం పల్లవి: ముసుగేసిన మబ్బులలో మసకేసిన పరదాలలో దాగి దాగిన జాబిల్లి ఒకసారి నువ్వు రావాలి ఒక మాట నే చెప్పాలి నీతో మాట చెప్పి పోవాలి అహ హా ఆ... అహ హా ఆ... చరణం: 1 ఏ హృదయం నిను మార్చిందో మనసు మార్చుకున్నావు ఏ విధి నాపై పగబట్టిందో తెరలు తెంచుకున్నావు అవధులు లేని అనురాగానికి అనుమానం పొగ మంచుఅని మంచు కరిగిన మరు నిమిషంలో అనురాగం ఒక కోవెలని తెలియక తొందర పడ్డావు... తెలియక తొందర పడ్డావు ఈ ప్రశ్నకు బదులేమిస్తావు ఈ ప్రశ్నకు బదులేమిస్తావు ఒకసారి నువ్వు రావాలి ఒక మాట నే చెప్పాలి నీతో మాట చెప్పి పోవాలి చరణం: 2 ఏ రాహువు నిను మింగిందో కను మరుగై పోయావు ఏ గ్రహణం నిను పట్టిందో నను దూరం చేశావు వెన్నెల కురిసే ఆకాశంలో అమావాస్య ఒక నల్లమబ్బని మబ్బు తొలగిన మారునిమిషంలో వెన్నెలదే అకాశమని తెలియక తొందర పడ్డావు... తెలియక తొందర పడ్డావు ఈ ప్రశ్నకు బదులేమిస్తావు ఈ ప్రశ్నకు బదులేమిస్తావు ఒకసారి నువ్వు రావాలి ఒక మాట నే చెప్పాలి నీతో మాట చెప్పి పోవాలి

Harivillu Song Lyrics in Telugu – Swayamvaram (1982)

'Harivillu' song from Swayamvaram (1982) movie is composed by Chellapilla Satyam and sung by S. P. Balasubrahmanyam, S. P. Sailaja and S. P. Vasantha. Lyrics are written by Rajasri.

SONG INFORMATION
Movie : Swayamvaram (1982)
Lyricist : Rajasri
చిత్రం: స్వయంవరం (1982) సంగీతం: చెల్లపిళ్ల సత్యం సాహిత్యం: రాజశ్రీ గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. పి.శైలజ, ఎస్. పి.వసంత పల్లవి: హరివిల్లు పొదరిల్లు చుక్కలు ఆకాశం హరివిల్లు పొదరిల్లు చుక్కలు ఆకాశం అన్నీ అందరికోసం నువ్వన్నది నాకోసం నేనున్నది నీకోసం సిరిమల్లి జాబిల్లి దిక్కులు ఆకాశం అన్నీ అందరికోసం నువ్వన్నది నాకోసం నేనున్నది నీకోసం ఆ ఆ ఆ - ఓ ఓ ఓ చరణం: 1 కలిరాకులు మొగ్గలుగా చివురాకులు పువ్వులుగా అవి నీ చిరునవ్వులుగా మరేను నెలవంకే జాబిలిగా జాబిలి వెన్నెలగా అది నీ కొనచూపులుగా తోచేను నీ చూపులలో నా నవ్వులలో మధురములే పెరిగేను సిరిమల్లి జాబిల్లి దిక్కులు ఆకాశం అన్నీ అందరికోసం నువ్వన్నది నాకోసం నేనున్నది నీకోసం చరణం: 2 నీ అలకే సింధూరం నీ పలుకే సంగీతం నీ సొగసే అందాల బృందావనం నీ మాటే మకరందం నీ మనసే మందారం నీ ఎదలో అణువణువూ నా సొంతం తియ తియ్యనిది వసి వాడనిది మన ఇద్దరి అనుబంధం హరివిల్లు పొదరిల్లు చుక్కలు ఆకాశం అన్నీ అందరికోసం నువ్వన్నది నాకోసం నేనున్నది నీకోసం సిరిమల్లి జాబిల్లి దిక్కులు ఆకాశం అన్నీ అందరికోసం నువ్వన్నది నాకోసం నేనున్నది నీకోసం ఆ ఆ ఆ - ఓ ఓ ఓ

Aakasam Enduko Song Lyrics in Telugu – Swayamvaram (1982)

'Aakasam Enduko' song from Swayamvaram (1982) movie is composed by Chellapilla Satyam and sung by S. P. Balasubrahmanyam and P. Susheela. Lyrics are written by Rajasri.

SONG INFORMATION
Movie : Swayamvaram (1982)
Lyricist : Rajasri
చిత్రం: స్వయంవరం (1982) సంగీతం: చెల్లపిళ్ల సత్యం సాహిత్యం: రాజశ్రీ గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల పల్లవి: ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది వీచే గాలుల తాకిడి సాగే గువ్వల అలజడి రా రమ్మని పిలిచే పైబడి... ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది వీచే గాలుల తాకిడి సాగే గువ్వల అలజడి రా రమ్మని పిలిచే పైబడి... ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది చరణం: 1 పసుపు పచ్చ లోగిలిలో పసుపు కొమ్మ కొట్టినట్టు నీలిరంగు వాకిలిలో పసుపార బోసినట్టు పాదాల పారాణి అద్దినట్టు పాదాల పారాణి అద్దినట్టు నుదుటిపై కుంకుమ దిద్దినట్టు ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది చరణం: 2 పచ్చా పచ్చని పందిరంత తాంబూలమేసినట్టు విరబోసిన తలనిండ కనకాంబర మెట్టినట్టు ఎర్ర నీళ్లు దిష్టి తీసి పోసినట్టు ఎర్ర నీళ్లు దిష్టి తీసి పోసినట్టు కర్పూరం హారతి ఇచ్చినట్టు ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది వీచే గాలుల తాకిడి సాగే గువ్వల అలజడి రా రమ్మని పిలిచే పైబడి...

Gaali Vaanalo Song Lyrics in Telugu – Swayamvaram (1982)

'Gaali Vaanalo' song from Swayamvaram (1982) movie is composed by Chellapilla Satyam and sung by K. J. Yesudas. Lyrics are written by Dasari Narayana Rao.

SONG INFORMATION
Movie : Swayamvaram (1982)
Singer : K. J. Yesudas
చిత్రం: స్వయంవరం (1982) సంగీతం: చెల్లపిళ్ల సత్యం సాహిత్యం: దాసరి నారాయణరావు గానం: కే. జే. యేసుదాస్ పల్లవి: గాలి వానలో... వాన నీటీలో... గాలి వానలో వాన నీటీలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలెయదు పాపం!! గాలి వానలో వాన నీటీలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలెయదు పాపం!! ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... చరణం: 1 ఇది హోరు గాలి అని తెలుసూ... అటు వరద పొంగు అని తెలుసూ... ఇటు హోరు గాలి అని తెలుసూ అటు వరద పొంగు అని తెలుసూ హోరు గాలిలో వరద పొంగులో సాగలేనని తెలుసూ... చరణం: 2 అది జోరు వాన అని తెలుసూ... ఇది నీటి సుడులని తెలుసూ... అది జోరు వాన అని తెలుసూ ఇది నీటి సుడులని తెలుసూ జోరు వానలో నీటి సుడులలో మునక తప్పదని తెలుసు... ఐనా పడవ ప్రయాణం... తీరమెక్కడో గమ్యమేమిటో తెలెయదు పాపం... తెలెయదు పాపం!! ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ...

Ikkada Ikkada Song Lyrics in Telugu – Swayamvaram (1982)

'Ikkada Ikkada' song from Swayamvaram (1982) movie is composed by Chellapilla Satyam and sung by S. P. Balasubrahmanyam and S. Janaki. Lyrics are written by Rajasri.

SONG INFORMATION
Movie : Swayamvaram (1982)
Lyricist : Rajasri
చిత్రం: స్వయంవరం (1982) సంగీతం: చెల్లపిళ్ల సత్యం సాహిత్యం: రాజశ్రీ గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి ఇదిగో - ఉ ఇదిగో - ఆ ఎక్కడిదాకా -ఆహహ్హ ఇంకా ఎక్కడిదాకా - ఆ అదిగో అదిగదిగదిగో అక్కడిదాకా ఇక్కడ ఇక్కడ అంటూనే ఎక్కడికెల్తున్నావో ఇక్కడ ఇక్కడ అంటూనే ఎక్కడికెల్తున్నావో భయమేస్తున్నది... భయమేస్తున్నది... భయం భయం అంటూనే ఇక్కడిదాకా వచ్చేశావ్ భయం భయం అంటూనే ఇక్కడిదాకా వచ్చేశావ్ భయమేమున్నది ఇక భయమేమున్నది అమ్మో ... మల్లెలవేళ కాకపోయినా వెన్నెల రాత్రి రాకపోయినా చల్లని ప్రేమకు చెల్లెలు నేనని ఎదురొస్తున్నది అది ఎదురొస్తున్నది పున్నమి వెన్నెల చల్లదనం కసి కసి వయసులో కొత్తదనం కొరికేస్తున్నది నన్ను చంపేస్తున్నది ఇదిగో - ఉ ఇదిగో - ఆ ఎక్కడ దాకా అహ ఇంకా ఎక్కడ దాకా వచ్చేశావురో ఇక్కడదాకా ఇక్కడే ఇక్కడ ఇక్కడ అంటూనే ఎక్కడికెల్తున్నావో భయమేస్తున్నది... భయమేస్తున్నది... ముసిరే మబ్బులు పందిరిలోన మెరిసే మెరుపుల కాంతులలోన ముసిరే మబ్బులు పందిరిలోన మెరిసే మెరుపుల కాంతులలోన కురిసే చినుకుల అక్షింతలుగా కురిసే చినుకుల అక్షింతలుగా కలిపేస్తున్నవి మనలను కలిపేస్తున్నవి చినుకు చినుకు చల్లదనం తగిలీ తగలని వెచ్చదనం చినుకు చినుకు చల్లదనం తగిలీ తగలని వెచ్చదనం కొరికేస్తున్నది నన్ను చంపేస్తున్నది

Palli Balakrishna Thursday, July 6, 2017

Most Recent

Default