Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Anjali (1990)చిత్రం: అంజలి (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ
గానం: కార్తిక్ రాజా & కోరస్
నటీనటులు: రఘువరన్ , రేవతి, షామిలి, తరుణ్ , ప్రభు
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాత: మణిరత్నం
విడుదల తేది: 03.12.1990 (తెలుగులో)

అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వల జాబిలి
అంజలి అంజలి అంజలి మెరిసే పున్నమి వెన్నెల జాబిలి

అమ్మమ్మ బంగారువే అందాల చిన్నారివే
అమ్మమ్మ బంగారువే అందాల చిన్నారివే
ముద్దుల చిట్టితల్లి నవ్వుల పాలవెల్లి
చల్లని చూపులా నా తల్లి
వన్నెలు విరిసిన సిరిమల్లి
చుక్కల పందిరి నీ ముచ్చటలే
ఆమని శోభలు నీ మురిపాలే

అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వల జాబిలి
అంజలి అంజలి అంజలి మెరిసే పున్నమి వెన్నెల జాబిలి
అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వల జాబిలి
అంజలి అంజలి అంజలి మెరిసే పున్నమి వెన్నెల జాబిలి

ఆకాశం సృష్టించినా దేవుడు గుర్తుండు రీతి
ఈ ఇలకే నిన్నువొక వరముగ ఇచ్చాడమ్మ
తల్లి నీపై వేదాలే పన్నీరే వెదజల్లేను
పూచే వసంత కోయిలలే నీకే జోలలు పాడేను
నడకలోన ఒక పూలతవే - నీవే
నవ్వులోన ఒక మల్లికవే - నీవే
అందచందాల చిన్నారి - నీవే
లోకమే మెచ్చు పొన్నారి
నీవేగ మాకు దేవత
నీలాల అంబరాల తారక

అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వల జాబిలి
అంజలి అంజలి అంజలి మెరిసే పున్నమి వెన్నెల జాబిలి

పూవల్లే నీ కళ్ళతో పలికే సింగారి నీవే
హంసవలే మాతోయిక ఆడే బుజ్జాయివే
వినువీథుల్లో విహరించే వెన్నెలపాప అంజలివే
అమ్మ చల్లని ఒడిలోన ఆడే పాడే అంజలివే
నడచివచ్చు ఒక బొమ్మవటా - నీవే
మెరిసిపోవు ఒక మెరుపువటా - నీవే
చిందులాడు ఒక సిరివంటా - నీవే
చిలకరించు విరి తేనెవటా
తరంగమల్లే ఆడవా స్వరాలకోటి నీవు పంచవా

అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వల జాబిలి
అంజలి అంజలి అంజలి మెరిసే పున్నమి వెన్నెల జాబిలి

అమ్మమ్మ బంగారువే అందాల చిన్నారివే
అమ్మమ్మ బంగారువే అందాల చిన్నారివే
అమ్మమ్మ బంగారువే అందాల చిన్నారివే
అమ్మమ్మ బంగారువే అందాల చిన్నారివే
ముద్దుల చిట్టితల్లి నవ్వుల పాలవెల్లి
చల్లని చూపులా నా తల్లి
వన్నెలు విరిసిన సిరిమల్లి
చుక్కల పందిరి నీ ముచ్చటలే
ఆమని శోభలు నీ మురిపాలే

అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వల జాబిలి
అంజలి అంజలి అంజలి మెరిసే పున్నమి వెన్నెల జాబిలి
అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వల జాబిలి COME ON
అంజలి అంజలి అంజలి మెరిసే పున్నమి వెన్నెల జాబిలి యాహూ

Most Recent

Default