Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Aata (2007)



చిత్రం: ఆట (2007)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శంకర్ మహదేవన్
నటీనటులు: సిద్దార్థ్, ఇలియానా
దర్శకత్వం: వి.యన్. ఆదిత్య
నిర్మాత: యమ్. ఎస్. రాజు
విడుదల తేది: 09.05.2007

హే జెండాపై కపిరాజుంటే రధమాపేదెవరంటా
గుండెల్లొ నమ్మకముంటే బెదురెందుకు పదమంటా
అల్లాద్దీన్ అద్భుత దీపం అవసరమె లేదంట
చల్లారని నీ సంకల్పం తోడుంటె చాలంట
అల్లదిగొ ఆశల ద్విపం  కళ్ళెదుటె ఉందంట
ఎల్లలనె తెంచె వేగం మేఘాలు తాకాలంట
ఆట ఆట నువు నిలబడి చూడకు ఏ చోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట
ఆట ఆట అనుకుంటె బతకడమొక ఆట
ఆట ఆట కాదంటె బరువె ప్రతి పూట

హే ముందుగా తెలుసుకో మునిగే లోతెంతా
సరదాగ సాగదు బేటా నట్టేట ఎదురీతా
తెలివిగా మలచుకో నడిచే దారంతా
పులి మీద స్వారి కూడా అలవాటు అయిపోదా
సాధించె సత్తావుంటె సమరం ఒక సయ్యాటా
తల వంచుకు రావలిసిందె ప్రతి విజయం నీ వెంటా

అల్లాద్దీన్ అద్భుత దీపం అవసరమె లేదంట
చల్లారని నీ సంకల్పం తోడుంటె చాలంట
ఆట ఆట నువు నిలబడి చూడకు ఏ చోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట

హే చెలిమితో గెలుచుకో చెలితో వలపాటా
అతిలోక సుందరి రాద జత కోరి నీ వెంటా
తెగువతో తేల్చుకో చెడుతో చెలగాటా
జగదేక వీరుడు కూడ మనలాంటి మనిషంటా
ఇటునుంచె అటువెళ్ళారు సినిమా హీరోలంతా
దివినుంచేం దిగిరాలేదు మన తారగణమంతా
మనలోను ఉండుంటారు కాబోయె ఘనులంతా
పైకొస్తె జై కొడతారు అభిమానులై జనమంతా
ఆట ఆట నువు నిలబడి చూడకు ఏ చోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట
ఆట ఆట అనుకుంటె బతకడమొక ఆట
ఆట ఆట కాదంటె బరువె ప్రతి పూట


********   *********   ********


చిత్రం: ఆట (2007)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: టిప్పు, గోపిక పూర్ణిమ

కాకినాడ కాజా కాజా కైకలూరు బాజాబాజ
కాణిపాకం గణపతి పూజ మనదేలే

కాకినాడ కాజా కాజా కైకలూరు బాజాబాజ
కాణిపాకం గణపతి పూజ మనదేలే
కోటప్ప కొండపై పేరంటం
సింహాద్రి గుట్టపై సాయంత్రం
వెంకన్న కరుణతో కళ్యాణం మనదేలే
సిద్దాంతి పెట్టిన సుముహుర్తం
పెద్దోళ్ళు చెప్పిన సిద్దాంతం
సిగ్గంతా జారగా శ్రమదానం మనదేలే
లగ్గులాహిరే లగ్గు లాహిరే లగ్గు లాహిరే లగ్‌రే
లగ్గులాహిరే లగ్గు లగ్గు లగ్గులాహిరే

లగ్గులాహిరే లగ్గు లాహిరే లగ్గు లాహిరే లగ్‌రే
లగ్గులాహిరే లగ్గు లగ్గు లగ్గులాహిరే

కాకినాడ కాజా కాజా కైకలూరు బాజాబాజ
కాణిపాకం గణపతి పూజ మనదేలే

చిన్నగుండెనే నీకు దండ చెయ్యనా
చిన్నవాడి ఆశలన్ని కట్టకట్టి కాలికే మెట్టె వేయనా

కన్నె జన్మనే నీకు కట్నమివ్వనా
తాళలేని ప్రేమ పుట్టి తాళికట్టినప్పుడే తప్పకుండ తాళమెయ్యనా
ఓ నీభామ చర్యలే ప్రారంభం నా బ్రహ్మచర్యమే గోవిందం
బ్రహ్మండమైన పరమానందం మనదేలే

లగ్గులాహిరే లగ్గు లాహిరే లగ్గు లాహిరే లగ్‌రే
లగ్గులాహిరే లగ్గు లగ్గు లగ్గులాహిరే

కాకినాడ కాజా కాజా కైకలూరు బాజాబాజ
కాణిపాకం గణపతి పూజ మనదేలే


మల్లెపూలతో ఓ మాట చెప్పనా
పిల్లగాడు గిల్లుతుంటె గొల్లు గొల్లుమంటూ ఏడవొద్దని
వెండి మువ్వతో నే విన్నవించనా
వేడిపుట్టి అల్లుకుంటే ఘల్లు ఘల్లుమంటూ
గుట్టు బైటపెట్టవొద్దని
పడకింట నిండగా నిశ్శబ్దం
పెదవుల్లో పొంగగా కిశ్శబ్దం
అటుపైన జరిగిన అణూయుద్ధం మనదేలే

లగ్గులాహిరే లగ్గు లాహిరే లగ్గు లాహిరే లగ్‌రే
లగ్గులాహిరే లగ్గు లగ్గు లగ్గులాహిరే

కాకినాడ కాజా కాజా కైకలూరు బాజాబాజ
కాణిపాకం గణపతి పూజ మనదేలే


********   *********   ********


చిత్రం: ఆట (2007)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్

హే ముద్దులాట ముద్దులాట ఇద్దరాడె ముద్దులాట
మధ్యలొ ఎవడొస్తె ఏంటటా
ఎవ్రిబాడి ముద్దులాట ముద్దులాట ఇద్దరాడె ముద్దులాట
మధ్యలొ ఎవడొస్తె ఏంటటా

ఓ సారి సయ్యాట ఓ సారి పోట్లాట
హోరెత్తె పడుచాట ఓడేది కాదు ప్రేమాట
అరె బేటా అరె బేట ఆరు నూరవుతున్న ఆటాడేసుకొ
అరె బేట బొమ్మ బొరుసవుతున్న ప్రేమించేసుకో

హే ముద్దులాట ముద్దులాట ఇద్దరాడె ముద్దులాట
మధ్యలొ ఎవడొస్తె ఏంటటా

పాఠశాల లేకున్న పుస్తకాలు చూడకున్న
పాకులాడి నేర్చుకున్న ఆట సోకాటా
పక్కవాళ్ళు చూస్తున్న పొరుగువాళ్ళు వింటున్న
పట్టనట్టు ఆడుకున్న ఆట సొంతాటా
ఏయ్ ఏంటి ఎక్కువ చేస్తున్నావ్ ఇదేం బాలేదు
ఇంకొంచెం ఎక్కువ చేయి బాగుంటుంది
తీయంగ పెదవాట న్యాయంగ నడుమాట
మౌనంగ మనువాట మారేది కాదు మనసాట
అరె బేటా అరె బేట ఆరు నూరవుతున్న ఆటె ఆడేసుకొ
అరె బేట బొమ్మ బొరుసవుతున్న ప్రేమించేసుకో

హే ముద్దులాట ముద్దులాట
ముద్దులాట ముద్దులాట ఇద్దరాడె ముద్దులాట
మధ్యలొ ఎవడొస్తె ఏంటటా

ఎండలేవి లేకున్న వానలేవి రాకున్న
ఒకరినొకరు కమ్ముకున్న ఆట గొడుగాటా
చీకటేల కాకున్న చందమామ రాకున్న
ఒకరినొకరు కప్పుకున్న ఆట పడకాటా హయ్యొ
ఛి ఛి నువ్వు ఎప్పుడు ఇంతె
నీతొ అస్సలు మాట్లాడను ఆట్లాడతాను
ప్రే అంటె మొదలంట మ అంటే చివరంట
ఈ రొండిటి నడిమధ్య ఆడాలి చూడు బ్రతుకాట
అరె బేటా అరె బేట ఆరు నూరవుతున్న ఆటాడేసుకొ
అరె బేట బొమ్మ బొరుసవుతున్న ప్రేమించేసుకో

హే ముద్దులాట ముద్దులాట
ముద్దులాట ముద్దులాట ఇద్దరాడె ముద్దులాట
మధ్యలొ ఎవడొస్తె ఏంటటా


********   *********   ********


చిత్రం: ఆట (2007)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సిద్దార్ధ్, సుమంగళి

హే నిను చూస్తుంటె చెడి పోతానె తప్పనుకోవు కద
పొగిడావంటె పడిపోతానె తప్పని గొడవ కద
పద పద అంటోందే హాయ్ పదె పదె నీ అందం
అహ మహ బాగుందే హాయ్ మతె చెడె ఆనందం
ఉరకలెత్తె యవ్వనం తరుముతుంటె కాదనం
సనం ఓ సనం సనం ఓ సనం

హే నిను చూస్తుంటె చెడి పోతానె తప్పనుకోవు కద
పొగిడావంటె పడిపోతానె తప్పని గొడవ కద

తీగ నడుము కద తూగి తడబడద
రేకు విరిసిన సోకు బరువుకు సాయపడమనదా
ఆడ మనసు కద బైత పడగలద
అంత సులువుగ అంతు దొరకదు వింత పొదుపు కధా
కబురు పంపిన పై యదా ఇపుడు వెయ్యకు వాయిదా
సనం ఓ సనం సనం ఓ సనం

హే నిను చూస్తుంటె చెడి పోతానె తప్పనుకోవు కద
పొగిడావంటె పడిపోతానె తప్పని గొడవ కద

లేడి కన్నులతొ వగలాడి వన్నెలతొ
కంటపడి మహ కొంటెగ కవ్వించు తుంటరివో
వాడి తపనలతొ మగవాడి తహ తహతొ
జంట పడమని వెంటపడి వేధించు తొందరవో
పెదవి అంచున ఆగిన అసలు సంగతి దాగున
సనం ఓ సనం సనం ఓ సనం

హే నిను చూస్తుంటె చెడి పోతానె తప్పనుకోవు కదా
పొగిడావంటె పడిపోతానె తప్పని గొడవ కదా


********   *********   ********


చిత్రం: ఆట (2007)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సునీత, స్మిత

యేల యేలా యేలా యేలా యేల యేలా యేలారె
రేల రేలా రేలా రేలా రేల రేలా రేలారె

హే కొంగు కొంచం భద్రం పిల్లొ కొంప ముంచేటట్టుందే
యేల యేలా యేలా యేలా యేల యేలా యేలారె
పొంగుకొచ్చె సింగారంలొ సంగతేమయ్యుంటుందే

రేల రేలా రేలా రేలా రేల రేలా రేలారె
నాకు మాత్రం ఏం తెలుసే ఆగనంటు నా వయసే
దూకుతుంటె నేనేం చేసేదే
మాటువేసి లాగేసే మాయలోపడి నా మనసే
మాట విననని మారాం చేస్తోందే

యాల యాల యాల యాల
యేల యేలా యేలా యేలా యేల యేలా యేలారె
రేల రేలా రేలా రేలా రేల రేలా రేలారె

హే కళ్ళు చెదిరె ఎన్నందాలొ తుల్లిపడర కురాళ్ళు
యేల యేలా యేలా యేలా యేల యేలా యేలారె
గుండెలదిరె ఆనందంలొ ఎంటపడర ఎర్రోల్లు
రేల రేలా రేలా రేలా రేల రేలా రేలారె
నీడపట్టున ఇన్నాళ్ళు కూడబెట్టిన అందాలు
దాచుకుంటె భారంగా ఉందే
వెచ్చ వెచ్చని ఆవిరితొ వచ్చి తగిలె చూపుల్లొ
వేడి కూడ వేడుకగా ఉందే

యాల యాల యాల యాల
యేల యేలా యేలా యేలా యేల యేలా యేలారె
రేల రేలా రేలా రేలా రేల రేలా రేలారె

ఎప్పుడిట్ట విచ్చేసిందె వంటిమీదకి పెళ్ళీడూ
ఎందుకిట్ట వీధెక్కిందె ఎండ తగలని నీ ఈడు
కాల దోషం వదిలిందొ మీన మేషం కుదిరిందొ
జంట చేరె దారె తెలిసిందో
పచ్చ జెండ ఊగిందొ పడుచు ప్రాయం తూగిందొ
పల్లకి పదమంటు పిలిచిందో

యాల యాల యాల యాల
యేల యేలా యేలా యేలా యేల యేలా యేలారె
రేల రేలా రేలా రేలా రేల రేలా రేలారె


********   *********   ********


చిత్రం: ఆట (2007)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శంకర్ మహదేవన్

హే జెండాపై కపిరాజుంటే రధమాపేదెవరంటా
గుండెల్లొ నమ్మకముంటే బెదురెందుకు పదమంటా
అల్లాద్దీన్ అద్భుత దీపం అవసరమె లేదంట
చల్లారని నీ సంకల్పం తోడుంటె చాలంట
అల్లదిగొ ఆశల దీపం కళ్ళెదుటె ఉందంట
ఎల్లలనె తెంచె వేగం మేఘాలు తాకాలంట

ఆట ఆట నువు నిలబడి చూడకు ఏ చోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట
ఆట ఆట అనుకుంటె బతకడమొక ఆట
ఆట ఆట కాదంటె బరువె ప్రతి పూట


హే ముందుగా తెలుసుకో మునిగే లోతెంతా
సరదాగ సాగదు బేటా నట్టేట ఎదురీతా
తెలివిగా మలచుకో నడిచే దారంతా
పులి మీద స్వారి కూడా అలవాటు అయిపోదా
సాధించె సత్తావుంటె సమరం ఒక సయ్యాటా
తల వంచుకు రావలిసిందె ప్రతి విజయం నీ వెంటా
అల్లాద్దీన్ అద్భుత దీపం అవసరమె లేదంట
చల్లారని నీ సంకల్పం తోడుంటె చాలంట

ఆట ఆట నువు నిలబడి చూడకు ఏ చోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట

హే చెలిమితో గెలుచుకో చెలితో వలపాటా
అతిలోక సుందరి రాద జత కోరి నీ వెంటా
తెగువతో తేల్చుకో చెడుతో చెలగాటా
జగదేక వీరుడు కూడ మనలాంటి మనిషంటా
ఇటునుంచె అటువెళ్ళారు సినిమా హీరోలంతా
దివినుంచేం దిగిరాలేదు మన తారగణమంతా
మనలోను ఉండుంటారు కాబోయె ఘనులంతా
పైకొస్తె జై కొడతారు అభిమానులై జనమంతా

ఆట ఆట నువు నిలబడి చూడకు ఏ చోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట
ఆట ఆట అనుకుంటె బతకడమొక ఆట
ఆట ఆట కాదంటె బరువె ప్రతి పూట

Most Recent

Default