-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Vijay Deverakonda"



చిత్రం: కింగ్డమ్ (2025)
సంగీతం: అనిరుద్ రవిచందర్ 
నటీనటులు: విజయ్ దేవర కొండ , భాగ్యశ్రీ భోర్సే , సత్యదేవ్ 
దర్శకత్వం: గౌతం తిన్ననూరి 
నిర్మాత: నగవంశీ
విడుదల తేది: 31.06.2025



Songs List:



హృదయం లోపల పాట సాహిత్యం

 
చిత్రం: కింగ్డమ్ (2025)
సంగీతం: అనిరుద్ రవిచందర్ 
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: అనిరుధ్ ,  అనుమిత నదేశన్

ఏదో ఏదో గమ్మత్తులా
ఏంటీ కలా… ఏంటీ కలా…
ఏదో ఏదో అయ్యేంతలా
ఉప్పొంగే అల… ముంచేనిలా

ఏవైపు పోనే పోనీ
వీలే లేని దారే ఇదా
అయినా ఆగే పోదు కదా…
చెప్పలేని ఇష్టమిదా, ఇష్టమిదా?
ఏంటి కధా…

చీకట్ల దారుల్లో నీ చూపే ఓ నిప్పే
దూకేశా అందుట్లో… ఏముంది నాతప్పే

తూటాలా వర్షాన… పువ్వేదో పూసేనా
లోకంకే చాటేనా… హృదయం లోపల

కదనం జరిగెనా… హృదయం లోపల
కదనం జరిగెనా… హృదయం లోపలా, ఆ ఆ
కదనం జరిగెనా… ఆ ఆ ఆ

ఏదో ఏదో గమ్మత్తులా
ఏంటీ కలా… ఏంటీ కలా…
ఏదో ఏదో అయ్యేంతలా
ఉప్పొంగే అలా… ముంచేనిలా

ఏవైపు పోనే పోనీ
వీలే లేని దారే ఇదా
అయినా ఆగే పోదు కదా…
చెప్పలేని ఇష్టమిదా, ఇష్టమిదా?
ఏంటి కధా…

చీకట్ల దారుల్లో నీ చూపే ఓ నిప్పే
దూకేశా అందుట్లో… ఏముంది నాతప్పే

తూటాలా వర్షాన… పువ్వేదో పూసేనా
లోకంకే చాటేనా… హృదయం లోపల
కదనం జరిగెనా…




అన్నా అంటేనే పాట సాహిత్యం

 
చిత్రం: కింగ్డమ్ (2025)
సంగీతం: అనిరుద్ రవిచందర్ 
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: అఅనిరుద్ రవిచందర్ 

చిన్నతనమే ఏమైపోయే
నన్ను వదిలే నీదే చేయే
అంత కలలాగే కరిగే
కథ కదలక ఆగే
అందమైన గూడే చెదిరే

కష్టమొచ్చినా ఇంకో వైపే
కంటి రెప్పల కాసే కాపే
కొన్ని గుర్తులేవో.. మిగిలే
విధి ఎరగదు జాలే
చిన్న గుండె నాదే.. పగిలే

అన్నా అంటేనే… ఉన్నానంటూనే..
చిన్నోడికోసం.. నిలబడతావే
అన్నా అంటేనే… ఉన్నానంటూనే..
చిన్నోడికోసం.. కలబడతావే

చిన్నతనమే ఏమైపోయే
నన్ను వదిలే నీదే చేయే
అంత కలలాగే కరిగే
కథ కదలక ఆగే
అందమైన గూడే చెదిరే

నిశబ్దమే వీడెనుగా..
ఇన్నేళ్లుగా వేచిన వేకువ
వెలుగే వడివడిగా ఇటు నడిచేనా..
నిత్యం ఇలా ఒంటరిగా
ఉన్నానులే ఊపిరి ఆడక
కలనా కలవరమా ఇది నిజమేనా..

అన్నా అంటేనే… ఉన్నానంటూనే..
చిన్నోడికోసం.. నిలబడతావే
అన్నా అంటేనే… ఉన్నానంటూనే..
చిన్నోడికోసం.. కలబడతావే

చిన్నతనమే ఏమైపోయే
నన్ను వదిలే నీదే చేయే
అంత కలలాగే కరిగే
కథ కదలక ఆగే
అందమైన గూడే చెదిరే





రగిలే రగిలే పాట సాహిత్యం

 
చిత్రం: కింగ్డమ్ (2025)
సంగీతం: అనిరుద్ రవిచందర్ 
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: అఅనిరుద్ రవిచందర్ 

మృత్యువు జడిసేలా పద పద
శత్రువు బెదిరేలా పద పద
గర్జన తెలిసేలా పద పద
దెబ్బకు గెలిచేలా పద పద

పది తలల రావణుడితో
పోరు కొరకే కదిలాడు
ఇక ఎవడు ఆపగలడు
దహనం చేస్తాడు

తెగబడిన రాక్షసులతో నేడు సహనం మరిచాడు
ఇక ఎవడు ఆపగలడు మరణం రాస్తాడు
చెడునంతమే చేసేలా చెలరేగినది ఈ జ్వాల
చెరబట్టిన మృత్యువుతోనే యుద్ధం ఈ వేళ

నరమే కొలిమవ్వాలా
నరమేధమే జరగాలా
నరకాసుర రక్తం తోనే నేలే తడవాలా..

రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలే
కదిలే కదిలే పదునెక్కే ఖడ్గాలే
రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలే
కదిలే కదిలే పదునెక్కే ఖడ్గాలే
యాల హేల హేల హే….లా
యాల హేల హేల హే….
యాల హేల హేల హే….లా
యాల హేల హేల హే….
యాల హేల హేల హే…..

మృత్యువు జడిసేలా పద పద
శత్రువు బెదిరేలా పద పద
గర్జన తెలిసేలా పద పద
దెబ్బకు గెలిచేలా పద పద

మృత్యువు జడిసేలా పద పద
శత్రువు బెదిరేలా పద పద
గర్జన తెలిసేలా పద పద
దెబ్బకు గెలిచేలా పద పద

అవమానమే అన్ని వైపుల
పెను ఉప్పెన నిన్ను కూల్చేరా
భగ భగ, భగ భగ కలలన్ని కాలే కదరా

నడి గుండెలో కత్తి దించగా
ప్రతితి ఇక దూరమయ్యేగా
భగ భగ, భగ భగ నువ్వు మండుతూనే పదరా

తడి ఉండే కంటిలోనే బాడబాగ్నేనింపరా
తరువాతి జాతికైనా సంకెలేలే తెంచరా..
చెడునంతమే చేసేలా చెలరేగినది ఈ జ్వాల
చెరబట్టిన మృత్యువుతోనే యుద్ధం ఈ వేళ

నరమే కొలిమవ్వాలా
నరమేధమే జరగాలా
నరకాసుర రక్తం తోనే నేలే తడవాలా..

రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలే
కదిలే కదిలే పదునెక్కే ఖడ్గాలే
రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలే
కదిలే కదిలే పదునెక్కే ఖడ్గాలే
యాల హేల హేల హే….లా
యాల హేల హేల హే….
యాల హేల హేల హే….లా
యాల హేల హేల హే….
యాల హేల హేల హే…..

మృత్యువు జడిసేలా పద పద
శత్రువు బెదిరేలా పద పద
గర్జన తెలిసేలా పద పద
దెబ్బకు గెలిచేలా పద పద


Palli Balakrishna Sunday, April 19, 2026



చిత్రం: రణబలి (2026)
సంగీతం: అజయ్ అతుల్ 
నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక 
దర్శకత్వం: రాహుల్ సంక్రిత్యాన్ 
నిర్మాత: 
విడుదల తేది: 2026 



Songs List:



ఏందయ్యా సామి పాట సాహిత్యం

 
చిత్రం: రణబలి (2026)
సంగీతం: అజయ్ అతుల్ 
సాహిత్యం:రామజోగయ్య శాస్త్రి 
గానం: శ్వేతా మోహన్ అజయ్ గంగవాలె 

ఏందయ్యా సామి
ఇట్ట గాస్తాంది ఎన్నెల
ఊపేస్తా ఉంది
సిత్తరాల ఉయ్యాలా

వీచేగాలికి
అత్తరద్దిందెవ్వరో
మారే జాముకి
మందు పెట్టిందెవ్వరో
మాయదారి మనస్సాగాక
జాగరమయ్యారా

తడిసిపోయారా
తడి మెరిసిపోయారా
నీ చిలిపి కలల్లో
ఒళ్లు మరిసిపోయారా

తడిసిపోయారా
తడి మెరిసిపోయారా
నీ చిలిపి కలల్లో
ఒళ్లు మరిసిపోయారా

Palli Balakrishna Saturday, April 4, 2026



చిత్రం: ద ఫ్యామిలీ స్టార్ (2024)
సంగీతం: గోపి సుందర్  
నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్
దర్శకత్వం: పరసురం 
నిర్మాత: రాజు, శిరీష్ 
విడుదల తేది: 05.04.2024



Songs List:



నందనందనా పాట సాహిత్యం

 
చిత్రం: ద ఫ్యామిలీ స్టార్ (2024)
సంగీతం: గోపి సుందర్ 
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: సిద్ శ్రీరామ్

ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా
ఎంత చెప్పిందో
సూచనలు ఇచ్చీ ఇవ్వనట్టుగా
ఎన్నెన్నిచ్చిందో

హృదయాన్ని గిచ్చి గిచ్చకా
ప్రాణాన్ని గుచ్చి గుచ్చకా
చిత్రంగా చెక్కింది దేనికో

ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా
ఎంత చెప్పిందో

నందనందనా
నందనందనా
నందనందనా

అడిగి అడగకా అడుగుతున్నదే, ఆ ఆ
అడిగి అడగకా అడుగుతున్నదే
అలిగి అలగకా తొలగుతున్నదే
కలత నిదురలు కుదుటపడనిదే
కలలనొదలక వెనకపడతదే

కమ్ముతున్నాదే మాయలా
కమ్ముతున్నాదే, టాం టాం టాం….

ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా
ఎంత చెప్పిందో

సిరుల వధువుగా ఎదుట నించుందే
సిరుల వధువుగా ఎదుట నించుందే
విరుల ధనువుగా ఎదని వంచిందే
గగనమవతలి దివిని విడిచిలా
గడపకివతల నడిచి మురిసెనే

ఇంతకన్నానా జన్మకీ
ఇంతకన్నానా

ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా
ఎంత చెప్పిందో
సూచనలు ఇచ్చీ ఇవ్వనట్టుగా
ఎన్నెన్నిచ్చిందో



కళ్యాణి వచ్చా వచ్చా పాట సాహిత్యం

 
చిత్రం: ద ఫ్యామిలీ స్టార్ (2024)
సంగీతం: గోపి సుందర్ 
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కార్తిక్, మంగ్లీ

కళ్యాణి వచ్చా వచ్చా
పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా

ధమకు ధమా ధమారి
చమకు చమా చమారి
సయ్యారి సరాసరి
మొదలుపెట్టేయ్ సవారి
నుందుంతన నుందుంతన
నుందుంతన నుందుంతన

డుముకు డుమా డుమారి
జమకు జమా జమారి
ముస్తాబై ఉన్నా మరి
అదరగొట్టెయ్ కచేరీ

చిటికెలు వేస్తోంది
కునుకు చెడిన కుమారి
చిటికెన వేలిస్తే
చివరి వరకు షికారీ

ఎన్నో పొదలెరకా
ఎంతో పదిలముగా
ఒదిగిన పుప్పొడిని
నీకిప్పుడు అప్పగించా

కళ్యాణి వచ్చా వచ్చా
పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా
సింగారి చెయ్యందించా
ఏనుగంబారి సిద్ధంగుంచా

ధమకు ధమా ధమారి
చమకు చమా చమారి
సయ్యారి సరాసరి
మొదలుపెట్టేయ్ సవారి
నుందుంతన నుందుంతన
నుందుంతన నుందుంతన

హెయ్ హెయ్ హెయ్ హెయ్
సువ్వీ కస్తూరి రంగ
సూపియ్‍కావీధి వంక
సువ్వి బంగారు రంగ
సువ్వి సువ్వి

పచ్చాని పందిరి వేసి
పంచావన్నెల ముగ్గులు పెట్టి
పేరాంటాలు అంతా కలిసి
పసుపు దంచారే

సాహో సమస్తము ఏలుకొనేలా
సర్వం ఇవ్వాలని ముందర ఉంచా
ఎగబడి దండయాత్ర చెయ్‍రా

కలబడిపోతూ గెలిపిస్తా
నీ పడుచు కలనీ
బరిలో నిలిచే ప్రతిసారీ ఆ ఆ
అలసటలోను వదిలెయ్‍కుండా
ఒడిసి ఒడిసి
పడతను చూడే నిను కోరీ ఆ ఆ

తగువుల కధా ఆ ఆ ఆ
ముగిసెను కదా ఆ ఆ ఆ
బిగిసిన ముడి తెగదిక పదా ఆ ఆఆ

కళ్యాణి వచ్చా వచ్చా
పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా
సింగారి చెయ్యందించా
ఏనుగంబారి సిద్ధంగుంచా

కళ్యాణి వచ్చా వచ్చా
పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా
సింగారి చెయ్యందించా
ఏనుగంబారి సిద్ధంగుంచా



మధురము కదా ప పాట సాహిత్యం

 
చిత్రం: ద ఫ్యామిలీ స్టార్ (2024)
సంగీతం: గోపి సుందర్ 
సాహిత్యం: శ్రీమణి
గానం: శ్రేయా ఘోషల్ 

పించం విప్పిన నెమలికిమల్లె
తొలకరి జల్లుల మేఘంమల్లె
అలజడి హృదయం ఆడిన కూచిపూడి

రంగులు దిద్దిన బొమ్మకుమల్లె
కవితలు అద్దిన పుస్తకమల్లె
సంతోషంలో ముద్దుగ ఈ అమ్మాడి

ఆరారు ఋతువుల అందం
ఒకటిగ కలిపి వింతలు ఏడు
పక్కకు జరిపి కొత్తగ పుంతలు
తొక్కెను ఈ అరవిందం

అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి
వేణువుగానం తియ్యగ పండే
రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం

మధురము కదా ప్రతొక నడకా
నీతో కలిసి ఇలా
తరగని కధా మనదే కనుకా
మనసు మురిసెనిలా

ఉసురేమో నాదైనా
నడిపేదే నీవుగా
కసురైన విసురైన
విసుగైన రాదుగా

పించం విప్పిన నెమలికిమల్లె
తొలకరి జల్లుల మేఘంమల్లె
అలజడి హృదయం ఆడిన కూచిపూడి

రంగులు దిద్దిన బొమ్మకుమల్లె
కవితలు అద్దిన పుస్తకమల్లె
సంతోషంలో ముద్దుగ ఈ అమ్మాడి

ఆరారు ఋతువుల అందం
ఒకటిగ కలిపి వింతలు ఏడు
పక్కకు జరిపి కొత్తగ పుంతలు
తొక్కెను ఈ అరవిందం

అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి
వేణువుగానం తియ్యగ పండే
రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం

ఏదో సంగీతమె
హృదయమున ఎంతో సంతోషమే
క్షణములో గాల్లో తేలిన భ్రమే
తిరిగి నవ్వింది ప్రాయమే

ఏదో సవ్వడి విని
టక్కుమని తిరిగాలే నువ్వని
మెరుపులా నువ్వొస్తున్నావని
ఉరుకులో జారె ప్రాణమే

నీపేరే పలికినదో
ఏ మగువైన తగువేనా
నా గాలే తాకినదో
చిరుగాలైన చంపెయ్ నా

హెచ్చరిక చేసినా నీకు నీడయ్యెరా
వెన్నెలను నిన్ను వదలమని వైరం
ప్రతి నిమిషమునా
హక్కులివి నాకు మాత్రమవి సొంతం
ఇలా నీపైనా

మధురము కదా ప్రతొక నడకా
నీతో కలిసి ఇలా
తరగని కధా మనదే కనుకా
మనసు మురిసెనిలా

పించం విప్పిన నెమలికిమల్లె
తొలకరి జల్లుల మేఘంమల్లె
అలజడి హృదయం ఆడిన కూచిపూడి

రంగులు దిద్దిన బొమ్మకుమల్లె
కవితలు అద్దిన పుస్తకమల్లె
సంతోషంలో ముద్దుగ ఈ అమ్మాడి

ఆరారు ఋతువుల అందం
ఒకటిగ కలిపి వింతలు ఏడు
పక్కకు జరిపి కొత్తగ పుంతలు
తొక్కెను ఈ అరవిందం

అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి
వేణువుగానం తియ్యగ పండే
రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం

Palli Balakrishna Tuesday, February 13, 2024



చిత్రం: ఖుషి (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వాహెబ్ 
నటీనటులు: విజయడేవర కొండ , సమంతా రుతుప్రభు 
దర్శకత్వం: శివ నిర్వాణ 
నిర్మాతలు: మైత్రీ మూవీ మేకర్స్
విడుదల తేది: 01.09.2023



Songs List:



నా రోజా నువ్వే పాట సాహిత్యం

 
చిత్రం: ఖుషి (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వాహెబ్ 
సాహిత్యం: శివ నిర్వాణ 
గానం: హేషం అబ్దుల్ వాహెబ్ 

ఆరా ఆరా ఆరా
తననానా తననానా తననానా

ఆరా సే ప్యారు
అందం తన ఊరు
సారె హుషారు
బేగం బెజారు

ఆరా సే ప్యారు
అందం తన ఊరు
దిల్ మాంగే మొరు
ఈ ప్రేమే వేరు

నా రోజా నువ్వే
నా దిల్ సే నువ్వే
నా అంజలి నువ్వే
గీతాంజలి నువ్వే

నా రోజా నువ్వే
నా దిల్ సే నువ్వే
నా అంజలి నువ్వే
గీతాంజలి నువ్వే

నా కడలి కెరటంలో
ఓ మౌన రాగం నువ్వేలే
నీ అమృతపు జడీలో
ఓ ఘర్షణే మొదలయ్యిందే
నా సఖివి నువ్వేలే
నీ దళపతిని నేనేలే
నా చెలియా నువ్వేలే
నీ నాయకుడు నేనే
నువ్వు ఎస్ అంటే ఎస్ అంటా
నో అంటే నో అంటా
ఓకే బంగారం

నా రోజా నువ్వే
నా దిల్ సే నువ్వే
నా అంజలి నువ్వే
గీతాంజలి నువ్వే

నా రోజా నువ్వే
నా దిల్ సే నువ్వే
నా అంజలి నువ్వే
గీతాంజలి నువ్వే

నా ప్రేమ పల్లవిలో
నువ్వు చేరావే అనుపల్లవిగా
నీ గుండె సడి లయలో
నే మారన నీ ప్రతిధ్వనిలా
నీ కనుల కలయికలో
కన్నాను ఎన్నో కలలెన్నో
నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై
నువ్వు ఊ అంటే నేనుంటా కడదాకా తోడుంటా
ఓకే నా బేగం

ఆరా సే ప్యారు
అందం తన ఊరు
సారె హుషారు
బేగం బెజారు



ఆరాధ్యా పాట సాహిత్యం

 
చిత్రం: ఖుషి (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వాహెబ్ 
సాహిత్యం: శివ నిర్వాణ 
గానం: సిద్ శ్రీరాం , చిన్మయి శ్రీపాద 

యు ఆర్ మై సన్ షైన్
యు ఆర్ మై మూన్ లైట్
యు ఆర్ స్టార్ ఇన్ ది స్కై
కం విత్ మీ నౌ, యు హావ్ మై డిసైర్

నాతో రా… నీలా రా ఆరాధ్యా
పదము నీవైపిలా
పరుగు నీదే కదా
తనువు తెర మీదుగా
చేరుకో త్వరగా

మనసారా చెలి తార
నా గుండెని మొత్తం తవ్వి తవ్వి
చందనమంతా చల్లగ దోచావే, ఏ
ఏ వందల కొద్ది పండగలున్న
వెన్నెల మొత్తం నిండుగ ఉన్న

ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా

ఈ పూట నా పాట
చేరాలి నీ దాకా
నీ చిన్ని మెడ వంపులో
సాగాలి ఈ ఆట
తేడాలు తేలాకా గెలిచేది ఎవరేమిటో

ఇలాగే, ఏ ఏ… ఉంటాలే, ఏ ఏ
నీతోనే, ఏ ఏ
దూరాలు తీరాలు లేవే

ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా

ఏదో అనాలంది, ఇంకా వినాలంది
నీ ఊహ మళ్లింపులో
నాదాకా చేరింది నాక్కూడ బాగుంది
నీ ప్రేమ కవ్వింపులో

నీలానే, ఏ ఏ ఏ
మారానే, ఏ ఏ ఏ
అంటానే… ఏ ఏ ఏ
నువ్వంటు నేనంటూ లేనే

మనసారా చెలి తార
నా గుండెని మొత్తం తవ్వి తవ్వి
చందనమంతా చల్లగ దోచావే
ఏ వందల కొద్ది పండగలున్న
వెన్నెల మొత్తం నిండుగ ఉన్న

ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా

పదము నీవైపిలా
పరుగు నీదే కదా
తనువు తెర మీదుగా
చేరుకో త్వరగా



మనసా..! పాట సాహిత్యం

 
చిత్రం: ఖుషి (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వాహెబ్ 
సాహిత్యం: శివ నిర్వాణ 
గానం: హేషం అబ్దుల్ వాహెబ్ , దివ్య యస్.మీనన్ 

మనసా..!
మనకూ సెలవే సెలవు
ముసిరే ఊసులు కనవా..?

ఎదకి ఒక గాయం
వదలమంది ప్రాణం
చెలిమి విడి బంధం
ఎవరు ఇక సొంతం

కలత పడి హృదయం
కరగనంది మౌనం
గతము విడి పాశం
ఏది ఇక బంధం

హే, ఇన్నాళ్లు నన్ను
వెన్నంటి ఉన్న నీడ నీవుగా
కొన్నాళ్ళే అంటూ
కోరింది నన్నే వీడమందిగా

నిను తలచే ప్రతి తలపే
ప్రణయాన శోధనా
నను మరిచే మరుక్షణమే
విరహాల వేధనా

ఎదకి ఒక గాయం
వదలమంది ప్రాణం
చెలిమి విడి బంధం
ఎవరు ఇక సొంతం

హే, మందార పూలే
మంటల్లే మారే… మౌన వేళలో
నిండారా నాతో ఉంటావులే
నా కంట నీరులో

ఇది శరమో, కలవరమో
ఎనలేని శూన్యమో
చెలి వరమో, తుది క్షణమో
ఎడబాటు సoద్రమో

మనసా..!!
మనకూ సెలవే సెలవు
ముసిరే ఊసులు కనవా..?





ఓసి పెళ్ళమా..!పాట సాహిత్యం

 
చిత్రం: ఖుషి (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వాహెబ్ 
సాహిత్యం: శివ నిర్వాణ 
గానం: రాహుల్ సిప్లిగంజ్ , సాకేత్ కొమందూరి

హేయ్, హ్హ హ్హ హా
కాశ్మీరులో ఫస్ట్ టైం తనని చూసినా, హే
ముందెనక చూడకుండా మనసిచ్చినా, హే
బాబు మాట పక్కనెట్టి బైటికొచ్చినా, హే
లగ్గమెట్టి కాపురాన్ని స్టార్ట్ చేసినా

ఓ హో… స్ట్రగుల్ స్టార్టాయెనే
ఓ హో… పాప చేంజయ్యనే

ఓసి పెళ్ళమా..!
నన్ను మిర్చిలాగ నంజుకుంటవే
వద్దు ఆపమ్మా..!
నేను కోడిలాగ గింజుకుంటనే

ఉన్న మాట సెప్పుతాను ఇనుకోండ్రి
పెళ్లి ఊసు పాడుగాను మానుకోండ్రి
గన్ను కంటే పవరుఫుల్లు ఆలండీ
దూల తీర్చేస్తదండీ

ఉన్న మాట సెప్పుతాను ఇనుకోండ్రి
పెళ్లి ఊసు పాడుగాను మానుకోండ్రి
గన్ను కంటే పవరుఫుల్లు ఆలండీ
దూల తీర్చేస్తదండీ

లేట్ నైట్ ఇంటికొస్తే తలుపు తియ్యరు
ఫ్రెండ్ తోన మందు కొడితే తాట తీస్తరు
పాత గర్ల్ ఫ్రెండ్ మీద నిఘా ఏస్తరు
గ్లోబులోన ఎక్కడున్న ట్రాక్ చేస్తరు

బుజ్జికన్న అంటు నిన్ను ముద్దు సేస్తరు, హే
కన్నవాళ్ళ కంటే నువ్వు ఎక్కువంటరు, హే
చిన్న మాట అన్న కూడా బుస కొడతారు, హే
కన్నీళ్లతో నిన్ను కాటేస్తారు

ఓ హో… వైఫ్ నైఫాయనే
ఓ హో… మైండు బ్లాకాయనే
ఓ హో… లైఫ్ చేంజాయనే
ఓ హో… కర్మ కాలిపోయెనే

పెళ్లాలే గయ్యాలా, గయ్యాలే పెళ్ళాలా
పెళ్ళాలు పెళ్ళాలు… పెళ్ళాలు కాదే
దయ్యాలు దయ్యాలు… దయ్యాలు మీరే

ఓసి పెళ్ళమా..!
నన్ను మిర్చిలాగ నంజుకుంటవే
వద్దు ఆపమ్మా..!
నేను కోడిలాగ గింజుకుంటనే

ఉన్న మాట సెప్పుతాను ఇనుకోండ్రి
పెళ్లి ఊసు పాడుగాను మానుకోండ్రి
గన్ను కంటే పవరుఫుల్లు ఆలండీ
దూల తీర్చేస్తదండీ

ఉన్న మాట సెప్పుతాను ఇనుకోండ్రి
పెళ్లి ఊసు పాడుగాను మానుకోండ్రి
గన్ను కంటే పవరుఫుల్లు ఆలండీ
దూల తీర్చేస్తదండీ

Palli Balakrishna Tuesday, August 1, 2023



చిత్రం: లైగర్ (2022)
సంగీతం: విక్రమ్ మంత్రోస్, లిజో జార్జ్ , DJ చీట్స్, సునీల్ కశ్యప్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: సునీల్ కశ్యప్
నటినటులు: విజయ్ దేవరకొండ , అనన్య పాండే, ఐశ్వర్య రాజేష్, రాశిఖన్నా, కేథరీన్ థెరీసా
దర్శకత్వం: పూరీ జగన్నాథ్ 
నిర్మాతలు: కరణ్ జోహార్, ఛార్మి కౌర్ , పూరి జగన్నాధ్ , హిరో యాష్ జోహార్
విడుదల తేది: 25.08.2022



Songs List:



లైగర్… (హంట్) పాట సాహిత్యం

 
చిత్రం: లైగర్ (2022)
సంగీతం: విక్రమ్ మంత్రోస్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: వేదాల హేమచంద్ర 

యా..! దిన్ తకతక దిన్న
తకతక దిన్… తకతక దిన్న
తకతక తకదిన్ దిన్… తకదిన్ దిన్
తకతక దిమ్… తకతక దిమ్

యే, బతకాలంటే గెలవాల్సిందే
లెగు లెగు తక్ దిన్ దిన్
తక్ దిన్ దిన్నా

ఎగరాలంటే రగలాల్సిందే
లెగు లెగు తక్ దిన్ దిన్
తక్ దిన్ దిన్నా
(తకదిన్ దిన్… తకదిన్ దిన్)
(తకతక దిన్… తకతక దిన్)

నువ్ పుట్టిందే గెలిచేటందుకు
దునియా చెమడాల్ ఒలిచేటందుకు
అది గుర్తుంటే… ఇంకేం చూడకు
ఎవడు మిగలడు… ఎదురు పడేందుకు

చల్ లైగర్… లైగర్ (హంట్)
లైగర్… (హంట్)

దిన్ తకతక దిన్న తకతక
దిన్ తకతక దిన్న తకతక
తక దిన్ దిన్… తక దిన్ దిన్
తకతక దిం… తకతక దిన్న




అక్కిడి పక్కిడి పాట సాహిత్యం

 
చిత్రం: లైగర్ (2022)
సంగీతం: లిజో జార్జ్ , DJ చీట్స్, సునీల్ కశ్యప్
సాహిత్యం: భాస్కరభట్ల,  మోశిన్  షేఖ్, అజీం దయాని 
గానం: అనురాగ్ కులకర్ణి , రమ్యా బెహ్రా 

అక్కిడి పక్కిడి దిక్క దికిడి
దికిడి దికిడి దికా దికడి
దిక్క దికిడి దికిడి దికిడి డికిడి డికిడి
దికీరో దికీరో దికీరో… దికీరో దికీరో

అక్డి పక్డి దిక్క దికిడి
దికిడి దికిడి దికా దికడి
దిక్కి దికిడి దికిడి దికిడి
లెట్స్ గో బాయ్స్… ఫుల్లు మాంజా

అకడి పకడి దిక్క దికిడి
దికిడి దికిడి దికా దికడి
దిక్కి దికిడి దికిడి దికిడి
డికిడి డికిడి దికీరో

అకడి పకడి దిక్క దికిడి
దికిడి దికిడి దికా దికడి
దిక్కి దికిడి దికిడి దికిడి
డికిడి డికిడి దికీరో

ఏయ్ నిన్నే చూసి ఓ మై డార్లింగ్
మనసే ఫ్లై ఫ్లై హో గయా
తబలా నడుమే తగలగానే
వయసే షై షై హో గయా

ఏ, నిన్నే చూసి ఓ మై డార్లింగ్
మనసే ఫ్లై ఫ్లై హో గయా
తబలా నడుమే తగలగానే
వయసే షై షై హో గయా

అరె చక్కని చుక్కను పక్కన పెట్టుకు
దిక్కులు చూడకు
కళ్ళల్లోకి కళ్ళు పెట్టే
చెప్పు ఐ లవ్ యూ

అరె చక్కని చుక్కను పక్కన పెట్టుకు
దిక్కులు చూడకు
నిన్నాపతరం ఎవడితరం
లైగర్ స్టెప్పు ఆడి చూపించు

అక్డి పిక్డి తుక్డి పిక్డి వాట్ ద ఫ్…?
అక్డి పక్డి దిక్క దికిడి
దికిడి దికిడి దికా దికడి
దిక్కి దికిడి దికిడి దికిడి
డికిడి డికిడి దికీరో

అక్డి పక్డి దిక్క దికిడి
దికిడి దికిడి దికా దికడి
దిక్కి దికిడి దికిడి దికిడి
డికిడి డికిడి దికీరో

ప ప ప ప పప ప ప
మేరె లైగర్ దీవానా హో గయా
ప ప ప ప పప ప ప
మేరె లైగర్ దీవానా హో గయా
(పార్టీ ఓవర్ – గో హోమ్)



Waat Laga Denge పాట సాహిత్యం

 
చిత్రం: లైగర్ (2022)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: పూరీ జగన్నాథ్ 
గానం: విజయ్ దేవరకొండ

We are Indians
हम किसीसे कम नहीं
Hum Kisise Kam Nahin

मेरी बहन..! मेरे साथ आजा
Meri Bahan..! Mere Sath Aaja
Podaam Kotladadhaam
పోదాం… కొట్లాడ్దాం
सबकी Wa Wa..! Waat Laga Denge

Waat Laga Waat Laga
Waat Waat Waat Waat
Waat Laga Denge
Aag Hain Andar
Aag Aag Aag Hain Andar
Aag Hain Andar

Waat Laga Denge
Waat Laga Denge
Waat Laga Denge
Waat Laga Denge

We are Indians
Waat Waat Waat
Pa Pa Pa Pa Paa Paa
Waat Waat Waat
Waat Waat Waat
Pa Pa Pa Pa Paa Paa

Waat Waat Waat
Waat Waat Waat
Waat Laga Denge



ఆఫట్ పాట సాహిత్యం

 
చిత్రం: లైగర్ (2022)
సంగీతం: తనిస్క్ బాగ్చి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: అనురాగ్ కులకర్ణి, శ్రావణభార్గవి

తేనె కళ్ళతోటి
పిల్లగాడు పట్టేసిండే
మందు పెట్టేసిండే
మంట పుట్టించిండే

ప్రేమ జెండ తెచ్చి
గుండెల్లోన నాటేసిండే
నాలో దూరేసిండే
నన్నే మార్చేసిండే

ఏ, చేసిందే చేసి
నన్నంటావేందీ
నా లవ్లీ లాలిపాప్

జవానీ తేరి… ఆఫట్
జవానీ తేరి… ఆఫట్
జవానీ తేరి… ఆఫట్
జవానీ తేరి… ఆ ఆ
ఫట్ కేలియే చోడ్ దో ముజే

నన్నే ఇచ్చుకుంటాను
గిల్లి గిచ్చుకుంటాను
పంటి గాటుతోటి
పచ్చ బొట్టు పెట్టుకుంటాను

నిన్నే కప్పుకుంటాను
చుట్టూ తిప్పుకుంటాను
నాలో నొప్పులేంటో
తిప్పలేంటో చెప్పుకుంటాను

హే, నువ్వడిగావంటే
కాదంటానేంటే
నువ్వే నా లబ్ డబ్

జవానీ తేరి… ఆఫట్
జవానీ తేరి… ఆఫట్
జవానీ తేరి… ఆఫట్
జవానీ తేరి… ఆ ఆ చోడ్ దో
చోడ్ దో చోడ్ దో ముజే
జవానీ తేరి… ఆ ఫట్




కొనిస్తనే కోక పాట సాహిత్యం

 
చిత్రం: లైగర్ (2022)
సంగీతం: జానీ,  లిజో జార్జ్ , DJ చీట్స్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రామ్ మిరియాల, గీతామాధురి

కొనిస్తనే కొనిస్తనే… కొనిస్తనే
లెట్స్ గో క్రేజీ
కొనిస్తనే కోక కోక కోక కోక కోక కోక కోక
కట్టిస్తనే కోక కోక కోక కోక కోక కోక కోక

కొనిస్తనే కోక కోక కోక
కట్టిస్తనే కోక కోక కోక
కొనిస్తనే కోక కోక కోక
కట్టిస్తనే కోక కోక కోక

కొనిస్తనే కుకుకుకు కుకు కోక కుకు కోక
కట్టిస్తనే కుకుకుకు కుకు కోక కుకు కోక
లెట్స్ గో..!

నల్ల ముక్కుపుడక ఎట్టుకుంటే
మగాడి గుండె ఎట్టాగుతుందే
తెల్ల పాలపిట్ట లాగ నువ్వు ఒళ్ళు
ఇరుసుకుంటే నిద్దరట్టగుందే

నల్ల ముక్కుపుడక ఎట్టుకుంటే
మగాడి గుండె ఎట్టాగుతుందే
తెల్ల పాలపిట్ట లాగ నువ్వు ఒళ్ళు
ఇరుసుకుంటే నిద్దరట్టగుందే

నీ మైకం ఎక్కి దిగదే
ఎక్కి తొక్కే రగడే
నీ అందం చెక్కిందెవడే

కొనిస్తనే కోక కోక కోక
కట్టిస్తనే కోక కోక కోక
కొనిస్తనే కోక కోక కోక
కట్టిస్తనే కోక కోక కోక

హా జీ..! ఓ బాబు ముద్దులెట్టి
తీర్చుకుంట మొక్కులే
నీకు ఇచ్చినాక రాసుకోను లెక్కలే
అసలే వెనక్కి తగ్గను ఇక మొదలే తైతకతక్కలే

బాబు ముద్దులెట్టి
తీర్చుకుంట మొక్కులే
నీకు ఇచ్చినాక రాసుకోను లెక్కలే
అసలే వెనక్కి తగ్గను ఇక మొదలే తైతకతక్కలే

ఓలమ్మో పట్టపగలే
నువ్వట్టా ఇట్టా తగిలే
అమాంతం పుట్టే తెగులే
(తెగులే తెగులే)

కొనిస్తనే కొనిస్తనే కొనిస్తనే, ఆహ
కొనిస్తనే, హ హ… కొనిస్తనే, హ హ
కొనిస్తనే, బ్రేకిట్ డౌన్ నౌ, కమాన్ లెట్స్ గో

కొనిస్తనే కోక కోక కోక కోక
కట్టిస్తనే కోక కోక కోక కోక
కుకుకుకు..!!

Palli Balakrishna Tuesday, August 2, 2022







చిత్రం: మీకు మాత్రమే చెబుతా (2019)
సంగీతం: శివ కుమార్
సాహిత్యం: షమీర్ సుల్తాన్, రాకేందు మౌళి
గానం: అనురాగ్ కులకర్ణి
నటీనటులు: తరుణ్ భాస్కర్, అభినవ్ గౌతమ్, అనసూయ భరద్వాజ్, అవంతిక మిశ్రా , వాణి భోజన్
దర్శకత్వం: సమీర్ సుల్తాన్ 
నిర్మాత: విజయ్ దేవరకొండ 
విడుదల తేది: 01.11.2019


నువ్వు నేను ఎవ్వరో
జత చేర్చిందెవ్వరో
నువ్వు ఎకడో నేనే ఎకడో
కలిపేసింది ఏదో

చాలు చాలు చాలు
నీ నవ్వు నాకు చాలు
నా బ్రతుకుకే అర్ధం
ఇచ్చె నవ్వె చాలు

నువ్వు లేనిదే నాకేదీ లేదులే
నీ నవ్వే లేనిదే నే లేనే లేనులే

చాలు చాలు నువ్వే చాలు
చాలు చాలు నీ నవ్వే చాలు
చాలు చాలు నువ్వే చాలు
చాలు చాలు నీ నవ్వే చాలు

చిన్ని చిన్ని లోపాలే లేకుండా
ప్రేమే ఉండదు లే
ప్రేమే ఉండదులే
మన ప్రేమలో తప్పులే
మనమే సరిదిద్దుకుందాంలే

అబద్దాల వల్లే కవితలకీ అందం
కవితలే ఇచ్చేనే ప్రేమకి అందం
ఐతే నువ్వే చెప్పు
ఆ ఆ ఆ అబద్దాలు
ప్రేమకి అందం కాదా

ఆబద్దాలే లేని ప్రేమే లేదులే
కాని మన ప్రేమే అబద్దం కానే కాదులే
నీ నవ్వులకన్నా నిజమేముందిలే
నాలా నిన్నెవరూ నవ్వించలేరులే

చాలు చాలు నువ్వే చాలు
చాలు చాలు నీ నవ్వే చాలు
చాలు చాలు నువ్వే చాలు
చాలు చాలు నీ నవ్వే చాలు






Palli Balakrishna Saturday, January 23, 2021



చిత్రం: వరల్డ్ ఫేమస్ లవర్  (2020)
సంగీతం: గోపి సుందర్
నటీనటులు: విజయ్ దేవరకొండ, ఐశ్వర్య రాజేష్, రాశిఖన్నా, కేథరీన్ థెరీసా
దర్శకత్వం: క్రాంతి మాధవ్
నిర్మాతలు: కే.ఏ వల్లభ, కే.ఎస్.రామారావు 
విడుదల తేది: 14.02.2020



Songs List:



మై లవ్ మనసును మీటే పాట సాహిత్యం

 
చిత్రం: వరల్డ్ ఫేమస్ లవర్  (2020)
సంగీతం:గోపి సుందర్
సాహిత్యం: రెహ్మాన్
గానం: శ్రీకృష్ణ , రమ్యా బెహ్ర

I’m so crazy for you baby
Life is singing love melody
Every second feeling awesome
Heart is swinging like a baby baby (2)

మై లవ్ మనసును మీటే
ఏదో తియ్యని పాటే
ఎవరూ ఎప్పుడూ వినని
ఎదలో జరిగే సింఫనీ ఐ ఫీల్ లవ్

మై లవ్ మనసును మీటే
ఏదో తియ్యని పాటే

నీతో పయనం ఒక్కో నిమిషం
తడిమినదిలే... తడిమినదిలే...
వెతికే ఉదయం దొరికే
కలలే నిజమై నిలిచే నీవల్లే 

మై లవ్ మనసును మీటే
ఏదో తియ్యని పాటే
ఎవరూ ఎప్పుడూ వినని
ఎదలో జరిగే సింఫనీ ఐ ఫీల్ లవ్




బొగ్గు గనిలో పాట సాహిత్యం

 
చిత్రం: వరల్డ్ ఫేమస్ లవర్  (2020)
సంగీతం:గోపి సుందర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: నిరంజ్ సురేష్

సారూ మస్తుంది ని జోరు
గేరు మార్చింది నీలో హుషారు
డోరు తీసింది పోరి ప్యారు
బురుబుర్రు మోటారు కారు

బొగ్గు గనిలో రంగు మణిరా 
ఏయో చమక్కు మందిరా
చిక్కినదిరా దక్కినదిరా
నీకే కన్నె మోహిని సితార యో
ఆ క్లాసు నక్క తోక తొక్కిందే నీ లుక్
నిర్ధరింకా రాధే నీ కాలకూ
పక్క మాసోడికి దొరికే
బస్తి బంపరు సరుకు
ఇంకేంది యాద్గిరికే మొక్కు

సై సై సై రాజా సై సై
చెయ్ చెయ్ చెయ్ రా మజా చెయ్
సై సై సై రాజా సై సై
చెయ్ చెయ్ రా మజా చెయ్ చెయ్

బొగ్గుట్ట పోరగాడా శీనయ్య
నువ్వట్టా సిగ్గుపడితే ఎత్తయ్య
బొంబాటు పిల్లడింకా నీదయ్యా
యయయయ తస్సాదియ్యా
 
ముక్కుట్టా ముత్యమంటి పిల్లయ్య
తగ్గట్టు జోడి మంచిగుందయ్యా
లుంగీ ఎగ్గట్టి సింధులాడ రావయ్యా
దిళ్లు దీంత దీంత దరువేయ్య

తెల్ల తోలురా అందగత్తెరా 
ఏ...యో ఎసెయ్ కత్తెరా
 
సదువుకుందిరా సందమామరా
పోరి నిన్నే కోరుకుందిలేరా
రేబను కళ్ళతోనే ఎం చూసిందో నీలో
ఎగబడి పైపైనే వాలిందే
సర్లే అట్టాగే కానీ సర్దుకో సరదాలో
ఈ సమయం పోతే రానందే 
 
సై సై సై రాజా సై సై
చెయ్ చెయ్ చెయ్ రా మజా చెయ్
సై సై సై రాజా సై సై
చెయ్ చెయ్ చెయ్ రా మజా చెయ్ చెయ్
 
బొగ్గుట్ట పోరగాడా శీనయ్య
నువ్వట్టా సిగ్గుపడితే ఎత్తయ్య
బొంబాటు పిల్లడింకా నీదయ్యా
యయయయ తస్సాదియ్యా

ముక్కుట్టా ముత్యమంటి పిల్లయ్య
తగ్గట్టు జోడి మంచిగుందయ్యా
లుంగీ ఎగ్గట్టి సింధులాడ రావయ్యా
దిళ్లు దీంత దీంత దరువేయ్య
బొగ్గు గనిలో 




రాలేటి చుక్కల్లో పాట సాహిత్యం

 
చిత్రం: వరల్డ్ ఫేమస్ లవర్  (2020)
సంగీతం:గోపి సుందర్
సాహిత్యం: శ్రేష్ఠ
గానం: దివ్యా యస్ మీనన్

రాలేటి చుక్కల్లో చీకట్ల వాకిట్లో
చూస్తుందిలే రేయి శశి కై
రానంటే రానంటు నీ జతే వద్దంటూ
మిగిలించి జాబిల్లి నిషినే

తగిలే పొడి పొడి మాటలకే
పగిలే తెల తెల్లని మనసేలే
పోగేసి ముక్కల్ని అతికించగ చూసినా

తగిలే పొడి పొడి మాటలకే
పగిలే తెల తెల్లని మనసేలే

రాలేటి చుక్కల్లో చీకట్ల వాకిట్లో
చూస్తుందిలే రేయి శిశికై
రానంటే రానంటు నీ జతే వద్దంటూ
మిగిలించి జాబిలి నిషినే

గతమే మార్చే కథనే మార్చే
కలలో నిలిచే వీలున్నదా
రూపే మలిపే రంగై నులిమే 
సోకై మెరిసేది ఈ ఏలా
యామార్చిన ఓదార్పిలా
ఈ ముళ్ళ సరసాలలో
కన్నీళ్ళ చెరసాలలో

రాలేటి చుక్కల్లో చీకట్ల వాకిట్లో
చూస్తుందిలే రేయి శిశికై
రానంటే రానంటు నీ జతే వద్దంటూ
మిగిలించి జాబిలి నిషినే

తగిలే పొడి పొడి మాటలకే
పగిలే తెల తెల్లని మనసేలే
పోగేసి ముక్కల్ని అతికించగ చూసినా

తగిలే పొడి పొడి మాటలకే
పగిలే తెల తెల్లని మనసేలే

అసలే ఆశే ఉసురే తీసే
మసిలా మారే కుంకుమే
మమతే ఆరే మసకే బారే
నుసిలో వాలే బంధమే
ముడివేసినా ముడిపడలేదే
ఈ కొంగు ఏకాకిగా
బ్రతికున్న ఓ శవమేగా

తగిలే పొడి పొడి మాటలకే
పగిలే తెల తెల్లని మనసేలే
పోగేసి ముక్కల్ని అతికించగ చూసినా

రాలేటి చుక్కల్లో చీకట్ల వాకిట్లో
చూస్తుందిలే రేయి శిశికై
రానంటే రానంటు నీ జతే వద్దంటూ
మిగిలించి జాబిలి నిషినే




Comosava paris పాట సాహిత్యం

 
చిత్రం: వరల్డ్ ఫేమస్ లవర్  (2020)
సంగీతం:గోపి సుందర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: బెన్నీ దయాళ్

Comosava paris comosava
Yeah! Yeah! Yeah!
నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా
నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా

Come let’s go rock it Yo! Yo! Yo!
Let’s have some fun time
Adrenaline ఉప్పొంగింది uuhh

Like a fire bird పైకెగరనా
Don’t stop  నన్నెవరే ఆపినా
Full on attitude చూపించినా
నా లైఫ్ నాదే అననా

What’s up  అంటు లోకాన్ని నిలదీస్తా
What’s new today  అంటూ అడిగేస్తా
అందమైన అనుభవాలు వెతుకుతూ
Brand new everyday నే గడిపేస్తా

Comosava paris comosava
Yeah! Yeah! Yeah!
నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా
నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా
Come let’s go rock it Yo! Yo! Yo!



మన కథ ప్రేమే కాదా పాట సాహిత్యం

 
చిత్రం: వరల్డ్ ఫేమస్ లవర్  (2020)
సంగీతం:గోపి సుందర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రేవంత్

మన కథ ప్రేమే కాదా
గతమది గుర్తే రాదా
ఊపిరి కాల్చే బాధ
చల్లార్చగ చెలియా రావా

రెప్ప మూయనింక అంచులలోన
వేడి చెమ్మనై వేచి చూస్తున్నా
గుండెలోతు గాయలతోన
మండుతోంది మౌన వేదన

Where are u Yamini Yamini
Waiting for u Yamini
Where are u Yamini Yamini
Waiting for u Yamini...

విలవిల హృదయం నేను
తెల్లారిన ఉదయం నేను
నీ మెళకువ చూసేలోపే 
చేజారిన కలవైనావు

ఇన్నినాల్లు నీ చేరువ కాను
పుస్తకంలా పడి ఉన్నాను
నువ్వు లేని ఏ దారిలోన
ఎటుగా కొనసాగనూ...

Where are u Yamini Yamini
Waiting for u Yamini
Where are u Yamini Yamini
Waiting for u Yamini...

Palli Balakrishna




చిత్రం: Dear కామ్రేడ్ (2019)
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మీక మందన్న
దర్శకత్వం: భరత్ కమ్మ
నిర్మాత: యాష్ రంగినేని
విడుదల తేది: 26.07.2019



Songs List:



నీ నీలి కన్నుల్లోని పాట సాహిత్యం

 
చిత్రం: Dear కామ్రేడ్ (2019)
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
సాహిత్యం: రెహ్మాన్
గానం: జస్టిన్ ప్రభాకరన్, గౌతమ్ భరద్వాజ్

నీ నీలి కన్నుల్లోని ఆకాశమే
తెల్లారి అల్లేసింది నన్నే
నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి 
నీ వైపే లాగేస్తుంది నన్నే

ఓ... ఓఓఓఓఓ

నీ పూల నవ్వుల్లోని ఆనందమే
తేనెల్లో ముంచేసింది కన్నే
నీకోసమే, నా... కళ్ళే వాకిల్లే
తీసి చూసే ముంగిల్లే
రోజు ఇలా, నే... వేచే ఉన్నానే
ఊగే ప్రాణం నీ వల్లే

ఎవరు చూడని ఈ అలజడిలో
కుదురుమరచిన నా ఎదసడిలో
ఎదురుచూస్తూ ప్రతి వేకువలో
నిదుర మరిచిన రాతిరి వడిలో

నీ నీలి కన్నుల్లోని ఆకాశమే
నీకాలి అందెల్లోని సంగీతమే సోకి 
దేరన దేరానన దేనా...



కడలల్లె వేచె పాట సాహిత్యం

 
చిత్రం: Dear కామ్రేడ్ (2019)
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
సాహిత్యం: రెహ్మాన్
గానం: ఐశ్వర్య రవిచంద్రన్, సిద్ శ్రీరామ్

కడలల్లె వేచె కనులే
కదిలేను నదిలా కలలే 
కడలల్లె వేచె కనులే
కదిలేను నదిలా కలలే 
ఒడిచేరి ఒకటై పోయే
ఒడిచేరి ఒకటై పోయే
తీరం కోరే ప్రాయం

విరహం పొంగెలే 
హృదయం ఊగెలే 
అధరం అంచులే 
మధురం కోరెలే 

అంతేలేని ఏదో తాపం ఏమిటిలా
నువ్వేలేక వేధిస్తుందే వేసవిలా
చెంతచేరి సేదతీర ప్రాయమిలా
చెయ్యి చాచి కోరుతోంది సాయమిలా

కాలాలు మారినా - మారినా
నీ ధ్యాస మారునా- నీ ధ్యాస మారునా
అడిగింది మోహమే 
నీ తోడు ఇలా ఇలా 

విరహం పొంగెలే 
హృదయం ఊగెలే 
అధరం అంచులే 
మధురం కోరెలే 

కడలల్లె వేచి కనులే 
కదిలేను నదిలా కలలే 
కడలల్లె వేచి కనులే 
కదిలేను నదిలా కలలే 

నిన్నే నిన్నే కన్నులలో
దాచానులే లోకముగా
నన్నే నన్నే మలిచానే
నీవుగా 

బుగ్గమీద ముద్దెపెట్టే చిలిపితనం
ఉన్నట్టుండి నన్నే చుట్టే పడుచుగుణం
పంచుకున్న చిన్ని చిన్ని సంతోషాలెన్నో
నిండిపోయే ఉండిపోయే గుండెలోతుల్లో

నీలోన చేరగా - చేరగా
నా నుంచి వేరుగా - నా నుంచి వేరుగా
కదిలింది ప్రాణమే 
నీ వైపు ఇలా ఇలా 



గిర గిర పాట సాహిత్యం

 
చిత్రం: Dear కామ్రేడ్ (2019)
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
సాహిత్యం: రెహ్మాన్
గానం: గౌతమ్ భరద్వాజ్, యామిని ఘంటసాల

గిర గిర గిర తిరగలి లాగ
తిరిగి అరిగి పోయినా
దినుసె నలగ లేదులే
హొయ్ హొయ్ హొయ్ హొయ్
అలుపెరగక తన వెనకాలె
అలసి సొలసి పోయినా
మనసె కరగ లేదులే
హొయ్ హొయ్ హొయ్ హొయ్
చిన్నదేమొ తిరిగె చూడాదే
ప్రేమంటె అసలే పడదె
హొయ్...

గిర గిర గిర తిరగలి లాగ
తిరిగి అరిగి పోయినా
దినుసె నలగ లేదులే
హొయ్ హొయ్ హొయ్ హొయ్
అలుపెరగక తన వెనకాలె
అలసి సొలసి పోయినా
మనసె కరగ లేదులే
హొయ్ హొయ్ హొయ్ హొయ్

అలలు అలిసి చతికిలపడున
కలలు నిలిచి కలవర పడున
సహజ గునము నిమిషము విడున
ఏమి జరిగినా...
మనసునెపుడు వదలని తపన
వినదు అసలు ఎవరేమనినా
గగనమొరిగి తనపై పడిన
ఆశ కరుగునా...

వేసవిలోన పెనుతాపం
ఓ ఆరాటం ల నింగిని తాకి
దిగి రాద వర్షంలా

గిర గిర గిర తిరగలి లాగ
తిరిగి అరిగి పోయినా
దినుసె నలగ లేదులే

సన్నాయి డోలు పెల్లి పాట పాడె
అబ్బాయి వోరకంట చూస్తున్నాడె
బంగారు బొమ్మ తల యెత్తి చూడె
నీ ఈడు జోడె అందాల చందురూడె

ఎవరికెవరు తెలియదు మునుపు
అడిగి అడిగి కలగదు వలపు
ఒకరికొకరు అని కలపనిదె
మనని వదులునా
ఎదురు పడిన క్షణమొక మలుపు
అడుగు కలిపి కదిలితె గెలుపు
దిసలు రెండు వెరై ఉన్న పయనమాగునా
నెనంటె తానె తను నేనె ఒకటై ఉన్నానె
పొమ్మన్న పోనె పడతానె లేస్తానె

గిర గిర గిర తిరగలి లాగ
తిరిగి అరిగి పోయినా
దినుసె నలగ లేదులే
హొయ్ హొయ్ హొయ్ హొయ్
అలుపెరగక తన వెనకాలె
అలసి సొలసి పోయినా
మనసె కరగ లేదులే



The Canteen Song పాట సాహిత్యం

 
చిత్రం: Dear కామ్రేడ్ (2019)
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
సాహిత్యం:  రెహ్మాన్
గానం: Karthik Rodriguez


The Canteen Song




Comrade Anthem పాట సాహిత్యం

 
చిత్రం: Dear కామ్రేడ్ (2019)
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: స్టోని సైకో, విజయ్ దేవరకొండ, MC Vickey


Comrade Anthem



మామ చూడరొ పాట సాహిత్యం

 
చిత్రం: Dear కామ్రేడ్ (2019)
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
సాహిత్యం: రెహ్మాన్
గానం: కార్తీక్


తాలం వెయ్యరొ
సరికొత్తగ పాటె పాడరో
మేలం ఊదరొ ఇన్నల్లకు
ఇది కుదిరిందిరో

హేయ్ మామ చూడరొ
కథ మల్లి మొదలయ్యిందిరో
చూస్తావేందిరొ
దరువేస్తు అడుగె వెయ్యరో

గడియారం చూడొద్దురో
మన గత కాలం యెగిరొచ్చిందిరో
సరదాల సందల్లలో
నువు తుది ఆట ఆడెయ్యరో

నీ స్నేహం దూరమై ...యెంతకాలం
ఈనాడె చేరువై ...నిండె ప్రాణం
తియ్యని గ్నాపకం
గుండెనే తాకితే

హేయ్ తియ్యని హేయ్ గ్నాపకం
హేయ్ గుండెనె హేయ్ తాకితె
హ తాకితె హ తాకితె
తక తక తాకితె

హేయ్ ఉప్పొంగేటి ఎన్నొ ఎన్నొ
ఆనందాలె వెల్లువల్లె
ముంచేస్తుంటె ఎంత బాగుందో
ఆ సందేహంలొ మనసెమయ్యిందో
ఇక ఎన్నళ్ళైన అంతం కాని
బంధలెన్నొ నిన్ను నన్ను
బందిస్తుంటె ఎంత బాగుందో
ఆ బంధంలోన ఎంత బలముందో




ఓ కలల కథలా పాట సాహిత్యం

 
చిత్రం: Dear కామ్రేడ్ (2019)
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
సాహిత్యం: రెహ్మాన్
గానం: డి. సత్యప్రకాష్ , చిన్మయి శ్రీపాద


ఓ కలల కథలా
కలిసి దూరాలె తీరాలై
ఓ జతగ జగమై కదిలె
పాదాలే ప్రాణాలై

ఇది విదియే విదిగా
కలిపే ఊహించని మలుపై
ఇరుదిశలే ఒకటై నిలిచే
తొలి వేకువలో
ఈ క్షణమే మనకే దొరికే
సంతోషం మనదై కడవరకు
మనతో నడిచె ఈ దారిలొ

రా రా
రెక్కలనె ఒక్కటిగ కలిపి ఇల
రా రా
దిక్కులనె చుక్కలనె దాటి అలా
రా రా
కోరుకొనే కొత్త జగం చేరుకొనె
ఓ స్వేచ్చ కదా ఈ పయనం

గడిచిన కాలం గాయం ఏదొ చేసిన
మనసుపై మందె పూసే మంత్రమున్నదె
నిరంతరం నీడ లాగ
ఉంటున్నది తానేగా
ఉషస్సులొ ఊపిరి పంచె
గాలి పాటలా
ఒక చినుకేదొ తాకి
చిగురేస్తుంటె చైత్రం
తడి కన్నుల్లొ విరిసె
చిరునవ్వె నీ సొంతం

విడిపోలేవు గంధాలు ఆ పూలకుండె
అవి కనరాని బంధాలులె
దారిలొ దారిలొ దారిలొ.

రా రా
రెక్కలనె ఒక్కటిగ కలిపి ఇల
రా రా
దిక్కులనె చుక్కలనె దాటి అలా
రా రా
కోరుకొనె కొత్త జగం చేరుకొనె
ఓ స్వేచ్చ కదా ఈ పయనం

మనసుకె నేడె మల్లి ఇంకొ జన్మల
యెడారిలొ పూలై పూసే
వాన జల్లులా…
వసంతమై ఈ ప్రవాహం
వర్నాలతొ సావాసం
ప్రతిక్షణం పచ్చగ నవ్వె
కొత్త జీవితం

పడి లేచేటి పాదాలు
పారాడుతుంటె నడిపిస్తుంది
ఈ కాలమె…

రా రా
రెక్కలనె ఒక్కటిగ కలిపి ఇల
రా రా
దిక్కులనె చుక్కలనె దాటి అలా
రా రా
కోరుకొనె కొత్త జగం చేరుకొనె
ఓ స్వేచ్చ కదా ఈ పయనం

ఓ కలల కథల
కలిసి దూరాలె తీరాలై
ఓ జతగ జగమై కదిలె
పాదాలె ప్రాణాలై

ఇది విదియె విదిగా
కలిపే ఊహించని మలుపై
ఇరుదిశలె ఒకటై నిలిచె
తొలి వేకువలొ
ఈ క్షణమే మనకె దొరికె
సంతోషం మనదై కడవరకు
మనతో నడిచె ఈ దారిలొ

రా రా
రెక్కలనె ఒక్కటిగ కలిపి ఇల
రా రా
దిక్కులనె చుక్కలనె దాటి అలా
రా రా
కోరుకొనె కొత్త జగం చేరుకొనె
ఓ స్వేచ్చ కదా ఈ పయనం






ఎటు పోనే పాట సాహిత్యం

 
చిత్రం: Dear కామ్రేడ్ (2019)
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
సాహిత్యం: రెహ్మాన్
గానం: కాలభైరవ

ఎటు పోనే
నిను తలచి తలచి
కలలు విడిచి యెటు పోనె

ఎటు పోనే
ఎదకెదురు నిలిచె
పిలుపు విడిచి యెటు పోనే

బహుదూరపు దారిలో
నిను చేరె మలుపుకె
నడిపించె దిక్కుకై
నిను వెతికానే.
తెగుతున్న దారమె
గురుతులతో నేయనా
మన గాలిపటమునె
నేనెగరేయన..

ఆపలేని కోపమె మార్చలేని లోపమా
అదుపులేని మంటని నేను
వచ్చి కౌగిలించవా..
మంచై ఆవహించవా..
నిదరె రాదు కన్నీటికె
అడ్డె పడె కాలి మరకలె చెరగవె

పడిలేచె పయానాలే ఓర్పంటె నేర్పెనులే
యెకాంతం సాయం శాంతముకె అడిగితేనె
పంటి బిగువున బాదనిచ్చే
నవూతున్న నిను తలచె
ఏమైన నాతొ వేరవని తీరొకటే

వెల్లొద్దే వెల్లొద్దే నువ్వె
ఉంటానె తక్కుందె నధె
నీ రక్తం నీ వెన్నెలె
పడుతుంటె నాలొ

నేనొక యెగసె ఉప్పెననె...ఉప్పెననె
చిగురాకైన రాల్చను లె...రాల్చను లె
కురులను సైతం బాదించని
గాలె అవనా...అవనా

తెదిలేని మాసమై
యండమావి తీరమై
ఉండలేను ఊపిరాగుతు
ఇంకా నీకు దూరమై
ఇంకా నీకు దూరమై

ఏటు పోనె
నిను తలచి తలచి
కలలు విడిచి యెటు పోనె
యెటు పోనె

యెటు పోనె
యెదకెదురు నిలిచె
పిలుపు విడిచి యెటు పోనె

Palli Balakrishna Thursday, May 16, 2019

చిత్రం: NOTA (2018)
సంగీతం: శామ్. సి.ఎస్
నటీనటులు: విజయ దేవరకొండ, మేహరీన్ కౌర్ పిర్జాద
దర్శకత్వం: ఆనంద్ శంకర్
నిర్మాత: జ్ఞానవేల్ రాజా
విడుదల తేది: 05.10.2018

Palli Balakrishna Tuesday, February 12, 2019



చిత్రం: టాక్సీ వాలా (2018)
సంగీతం: జాక్స్ బిజాయ్
నటీనటులు: విజయ్ దేవరకొండ, ప్రియాంక జవల్కర్
దర్శకత్వం: రాహుల్ సంకృత్యాన్
నిర్మాత: శ్రీనివాస్ కుమార్ నాయుడు
విడుదల తేది: 16.11.2018



Songs List:



మాటే వినదుగ మాటే వినదుగ పాట సాహిత్యం

 
చిత్రం: టాక్సీ వాలా (2018)
సంగీతం: జాక్స్ బిజాయ్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: సిద్ శ్రీరామ్

మాటే వినదుగ మాటే వినదుగ
పెరిగే వేగమే తగిలే మేఘమే
అసలే ఆగదు ఈ పరుగే
ఒకటే గమ్యమే దారులు వేరులే
పయనమే నీ పనిలే

అలలే పుడుతూ మొదలే
మలుపు కుదుపు నీదే
ఆ అద్దమే చూపే బ్రతుకులలో తీరే
ఆ వైపర్ తుడిచే కారే కన్నీరే

మాటే వినదుగా వినదుగ వినదుగ
వేగం దిగదుగ దిగదుగ వేగం
మాటే వినదుగ వినదుగ వినదుగ
వేగం వేగం వేగం (2)

పెరిగే వేగమే తగిలే మేఘమే
అసలే ఆగదు ఈ పరుగే
ఒకటే గమ్యమే దారులు వేరులే
పయణమే నీ పనిలే

అలలే పుడుతూ మొదలే
మలుపు కుదుపు నీదే
ఆ అద్దమే చూపే బ్రతుకులలో తీరే
ఆ వైపర్ తుడిచే కారే కన్నీరే

చిన్న చిన్న చిన్న నవ్వులే వెదకడమే బ్రతుకంటే
కొన్నిఅందులోను పంచవ మిగిలుంటే హో.. హో..
నీదనే స్నేహమే నీ మనసు చూపురా
నీడలా వీడక సాయాన్నే నేర్పురా

కష్టాలెన్ని రాని జేబే కాలీ కానీ
నడుచునులే బండి నడుచునులే
దారే మారిపోని ఊరే మర్చిపోని
వీడకులే శ్రమ విడవకులే

తడి ఆరే ఎదపై ముసిరేను మేఘం
మనసంతా తడిసేలా కురిసే వానా

మాటే వినదుగ వినదుగ  వినదుగ
వేగం దిగదుగ దిగదుగ వేగం
మాటే వినదుగ వినదుగ వినదుగ
దిగదుగ వేగం వేగం వేగం (2)

మాటే వినదుగ మాటే వినదుగ

పెరిగే వేగమే తగిలే మేఘమే
అసలే ఆగదు ఈ పరుగే
ఒకటే గమ్యమే దారులు వేరులే
పయణమే నీ పనిలే

అలలే పుడుతూ మొదలే
మలుపు కుదుపు నీదే
మరు జన్మతో పరిచయం అంతలా పరవశం
రంగు చినుకులే గుండెపై రాయనా




లేడీస్ & జెంటిల్మెన్ పాట సాహిత్యం

 

చిత్రం: టాక్సీ వాలా (2018)
సంగీతం: జాక్స్ బిజాయ్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: వేదాల రామచంద్ర, జాక్స్ బిజోయ్

లేడీస్ & జెంటిల్మెన్



క్రేజీ గర్ల్ పాట సాహిత్యం

 
చిత్రం: టాక్సీ వాలా (2018)
సంగీతం: జాక్స్ బిజాయ్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: రేవంత్ 

క్రేజీ గర్ల్ 




నీవే నీవే పాట సాహిత్యం

 
చిత్రం: టాక్సీ వాలా (2018)
సంగీతం: జాక్స్ బిజాయ్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: శ్రేయా ఘోషాల్

నీవే నీవే 


Palli Balakrishna Monday, December 3, 2018
Geetha Govindam (2018) Telugu Songs Lyrics Album Cover

Geetha Govindam (2018) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Geetha Govindam (2018)
Banner : GA2 Pictures
Music : Gopi Sundar
Director : Parasuram
Producer : Bunny Vasu
Actors : Vijay Deverakonda
Actresses : Rashmika Mandanna
Release Date : 15 August 2018

Inkem Inkem Inkem Kaavaale Song Lyrics in Telugu – Geetha Govindam (2018)

'Inkem Inkem Inkem Kaavaale' song from Geetha Govindam (2018) movie is composed by Gopi Sundar and sung by Sid Sriram. Lyrics are written by Anantha Sriram.

SONG INFORMATION
Movie : Geetha Govindam (2018)
Music : Gopi Sundar
Lyricist : Anantha Sriram
Singer : Sid Sriram
చిత్రం: గీత గోవింద (2018) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: సిద్ శ్రీరామ్ తదిగిన తకజను తదిగిన తకజను తరికిట తధరిన తద్దింధీంత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం పల్లవి: ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరణాల్లే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కోగంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చస్తున్నానే ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరణాల్లే తదిగిన తకజను తదిగిన తకజను తరికిట తధరిన తద్దింధీంత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం చరణం: 1 ఊహలకు దొరకని సొగసా ఊపిరిని వదలని గొలుసా నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కొసా నీ కనుల మెరుపుల వరసా రేపినది వయసున రభస నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ నీ యెదుట నిలబడు చనువే వీసా అందుకొని గగణపు కొనలే చూసా ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే... ఇకపై తిరణాల్లే చరణం: 2 మాయలకు కదలని మగువా మాటలకు కరగని మధువా పంతములు విడువని బిగువ జరిగినదడగవా నా కధని తెలుపుట సులువా జాలిపడి నిమిషము వినవా ఎందుకని గడికొక గొడవ చెలిమిగ మెలగవ నా పేరు తలచితె ఉబికే లావా చల్లబడి నను నువు కరుణించేవా ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరణాల్లే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కోగంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చస్తున్నానే ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరణాల్లే తదిగిన తకజను తదిగిన తకజను తరికిట తధరిన తద్దింధీంత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం

What The Life Song Lyrics in Telugu – Geetha Govindam (2018)

'What The Life' song from Geetha Govindam (2018) movie is composed by Gopi Sundar and sung by Vijay Deverakonda. Lyrics are written by Srimani.

SONG INFORMATION
Movie : Geetha Govindam (2018)
Music : Gopi Sundar
Lyricist : Srimani
చిత్రం: గీత గోవింద (2018) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: శ్రీమణి గానం: విజయ్ దేవరకొండ అమెరిక గర్ల్ ఆయిన అత్తిలి గర్ల్ ఆయిన యూరప్ గర్ల్ ఆయిన యానాం గర్ల్ ఆయిన (2) చైనా, కెన్యా, జార్జియా, లిబియా, ఆస్ట్రేలియా పాకిస్తాన్ , హిందూస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఏ గర్ల్ అయినా ఆహ్ ఆహ్ వాట్ ద వాట్ ద లైఫ్ అమ్మాయంటేనే టఫ్ ఆల్ల తిక్కకు మనమే స్టఫ్ దానికి నేనే ప్రూఫ్ (2) అమ్మాయిలంతా ఏంజెల్స్ అంటూ అప్పటి కవులే వర్ణించారే ఇప్పుడు గాని వీళ్ళని చూస్తే పెన్నులు పక్కన పడేస్తారు ఫేస్బుక్కుల్లో వాట్సప్పుల్లో పీకల్లోతులో మునిగుంటారు మాకేం పట్టదు పొమ్మంటారు మగవానికి గోల్డెన్ డేస్ పురాణాల్లోనే బాసు సో మై డియర్ సో మై డియర్ ఫ్రస్టేటెడ్ బాయ్స్ డోంట్ ఎక్ష్పెపెక్ట్ దోజ్ థింగ్స్ ఇన్ కాంటెంపరరి డేస్ మగాడు మటాష్ వాట్ ద వాట్ ద లైఫ్ అమ్మాయంటేనే టఫ్ ఆల్ల తిక్కకు మనమే స్టఫ్ దానికి నేనే ప్రూఫ్ (2)

Yenti Yenti Song Lyrics in Telugu – Geetha Govindam (2018)

'Yenti Yenti' song from Geetha Govindam (2018) movie is composed by Gopi Sundar and sung by Chinmayi Sripada and Gopi Sundar. Lyrics are written by Srimani.

SONG INFORMATION
Movie : Geetha Govindam (2018)
Music : Gopi Sundar
Lyricist : Srimani
చిత్రం: గీత గోవింద (2018) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: శ్రీమణి గానం: గోపి సుందర్, చిన్మయి శ్రీపాద అక్షరం చదవకుండా పుస్తకం పేరు పెటేసానా అద్భుతం ఎదుటనున్న చూపు తిప్పేసాన అంగుళం నడవకుండా ప్రయాణమే చేదు పొమ్మన్నానా అమృతం పక్కనున్న విషములా చూసానా ఏంటి ఏంటి ఏంటి కొత్త వరస నాకే తెలియని నన్నే నేడు కలిశా ఏంటి ఏంటి ఏంటి వింత వరసా అంటూ నిన్నే అడిగా ఓసి మనసా రాయిలా రాజులా నన్నేలగా రాణిల మాది పిలిచెనుగా గీతనే దాటుతూ చెరవగా ఒక ప్రణయపు కావ్యం లికించురా రామరి మన ఇరువురి జత గీతా గోవిందంలా ఏంటి ఏంటి ఏంటి కొత్త వరస నాకే తెలియని నన్నే నేడు కలిశా ఏంటి ఏంటి ఏంటి వింత వరసా అంటూ నిన్నే అడిగా ఓసి మనసా ఏంటి ఏంటి ఏంటి కొత్త వరస నాకే తెలియని నన్నే నేడు కలిశా ఏంటి ఏంటి ఏంటి వింత వరసా అంటూ నిన్నే అడిగా ఓసి మనసా

Vachindamma Song Lyrics in Telugu – Geetha Govindam (2018)

'Vachindamma' song from Geetha Govindam (2018) movie is composed by Gopi Sundar and sung by Sid Sriram. Lyrics are written by Srimani.

SONG INFORMATION
Movie : Geetha Govindam (2018)
Music : Gopi Sundar
Lyricist : Srimani
Singer : Sid Sriram
చిత్రం: గీత గోవింద (2018) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: శ్రీమణి గానం: సిద్ శ్రీరామ్ తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా ఆ దేవ దేవుడే పంపగ ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టేనంట బ్రహ్మ కళ్లలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్లీ లాలీ పాడేనంట వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువై కొమ్మ హారతి పళ్ళెం హాయిగ నవ్వే వదినమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిన చుక్కల రెమ్మ నట్టింట్లో నెలవంక ఇక నువ్వమ్మా తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా... సాంప్రదాయణి శుద్ధపద్మిణి ప్రేమ శ్రావణి సర్వాణి (2) చరణం: 1 యద చప్పుడు కదిలే మెడలో తాళవనా ప్రతి నిమిషం ఆయువునే పెంచెయ్యనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోనా కళలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగనాచి కూన ముళ్ళోకాలు మింగే మూతి ముడుపుదాన ఇంద్ర ధనుస్సు దాచి రెండు కళ్ళలోన నిద్ర చెరిపేస్తావే అర్ధ రాతీరైనా ఏ రాకాసి రాశో నీది ఏ గడియల్లో పుట్టావే అయినా వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువై కొమ్మ నా ఉహల్లోన ఉరేగేది నువ్వమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిన చుక్కల రెమ్మ నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా చరణం: 2 ఏకాంతలన్ని ఏకాంతం లేక ఎకరువే పెట్టాయి ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగ లేక కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయె నిలువ నీడ లేక ఎంత అదృష్టం నాదే నంటూ పగ పట్టిందే నాపై జగమంతా... నచ్చిందమ్మా నచ్చిందమ్మా నచ్చిందమ్మా జన్మ నీలో సగమై బతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నుదుటన కుంకుమమ్మ ఓ వెయ్యేళ్ల ఆయుష్ అంటూ దివించండమ్మ తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా

Kanureppala Kaalam Song Lyrics in Telugu – Geetha Govindam (2018)

'Kanureppala Kaalam' song from Geetha Govindam (2018) movie is composed by Gopi Sundar and sung by Gopi Sundar. Lyrics are written by Sagar.

SONG INFORMATION
Movie : Geetha Govindam (2018)
Music : Gopi Sundar
Lyricist : Sagar
Singer : Gopi Sundar
చిత్రం: గీత గోవింద (2018) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: సాగర్ గానం: గోపి సుందర్ కనురెప్పల కాలంలోనే కధ మొత్తం మారే పోయిందే కనుతెరిచి చూసేలోగా దరిచేరని దూరం మిగిలిందే ఇన్నాళ్ళూ ఊహల్లో ఈ నిమిషం శూన్యంలో మిగిలానే ఒంటరినై విడిపోయే వేడుకలో జరిగినదీ వింతేనా... మన పయనం ఇంతేనా... హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్ కనురెప్పల కాలంలోనే కధ మొత్తం మారే పోయిందే కవి ఎవరో ఈ కథకి ఎవరెవరో పాత్రలకి తెలియదుగా ఇప్పటికీ పొడుపు కధే ఎప్పటికీ మనమంటు అనుకున్నా ఒంటరిగానే మిగిలున్నా ఇందరిలో కలిసున్నా వెలితిని నేను చూస్తున్నా పొరపాటు ఏదో తొరబాటు ఏదో అది దాటలేని తడబాటు ఏదో ఎడబాటు చేసే ఈ గీతను దాటలేవా హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్

Tanemandhe Tanemandhe Song Lyrics in Telugu – Geetha Govindam (2018)

'Tanemandhe Tanemandhe' song from Geetha Govindam (2018) movie is composed by Gopi Sundar and sung by Anurag Kulkarni. Lyrics are written by Anantha Sriram.

SONG INFORMATION
Movie : Geetha Govindam (2018)
Music : Gopi Sundar
Lyricist : Anantha Sriram
చిత్రం: గీత గోవింద (2018) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: అనురాగ్ కులకర్ణి తనేమందే తనేమందే నువ్వైనా తెలుపవే సమయమా సమయమా నిజమేదో తెలుపుమా అడుగులే కలపమందా జతపడి నడవమన్నాడా కుదురుగా మొదట నన్నే బయటపడమందా తనేమందే తనేమందే నువ్వైనా తెలుపవే సమయమా సమయమా నిజమేదో తెలుపుమా

Palli Balakrishna Sunday, July 15, 2018


చిత్రం: మహానటి (2018)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అనురాగ్ కులకర్ణి
నటీనటులు: కీర్తి సురేష్ , దూల్కర్ సాల్మన్, సమంత, విజయ దేవరకొండ, షాలిని పాండే
దర్శకత్వం: నాగ్ అశ్విన్
నిర్మాత: అశ్వినీ దత్, ప్రియాంకా దత్
విడుదల తేది: 2018

అభినేత్రి ఓ అభినేత్రి
అభినయనేత్రి నట గాయత్రి
మనసారా నిను కీర్తించి
పులకించినది ఈ జనదాత్రి
నిండుగా ఉందిలే దుర్గ దేవెనం
ఉందిలే జన్మకో దైవ కారణం
నువ్వుగా వెలిగే ప్రతిబాగునం
ఆ నటరాజుకు స్త్రీ రూపం
కనుకే అంకితం ని కన కణం
వెండి తెరకెన్నడో ఉందిలే రుణం
పేరుతో పాటుగా అమ్మనే పదం
నీకే దొరికిన సౌభాగ్యం

మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి

కలను వలచావు కలను గెలిచావు
కడలికెదురీది కథగ నిలిచావు
భాష ఏదైనా ఎదిగి ఒదిగావు
చరితపుటలోన వెలుగు పొదిగావు
పెను శికరాగ్రానివై గాగనాలపై నిలిపావుగా అడుగు
నీ ముఖచిత్రమై నలుచరగుల తలయెత్తినది మన తెలుగు

మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి

మనసు వైశాల్యం పెంచుకున్నావు
పరుల కన్నీరు పంచుకున్నావు
అసలు ధనమేదో తెలుసుకున్నావు
తుధకు మిగిలేది అందుకున్నావు
పరమార్థానికి అసలర్థమే నువు నడిచిన ఈ మార్గం
కనుకే గా మరి నీదైనది నువుగా అడగని వైభోగం

మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి


*******  ******   *******


చిత్రం: మహానటి (2018)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సునీత ఉపద్రష్ట

అనగా అనగా మొదలై కథలు
అటుగా ఇటుగా నదులై కథలు
అపుడో ఇప్పుడో దరి చేరునుగా
కడలై ఓడై కడతేరునుగా
గడిచే కాలానా గతమేదైనా
స్మృతి మత్రమే కదా...

చివరకు మిగిలేది చివరకు మిగిలేది
చివరకు మిగిలేది చివరకు మిగిలేది

ఎవరో ఎవరో ఎవరో నువ్వంటే
నీవు ధరించిన పాత్రలు అంతే
లేదని పిలిచే బ్రతుకేదంటే
తెరపై కదిలే చిత్రమే అంతే
ఈ జగమంతా నీ నర్తనశాలై
చెబుతున్న నీ కథే...

చివరకు మిగిలేది విన్నావా మహానటి
చెరగని చేవ్రాలిది నీదేలే మహానటి
చివరకు మిగిలేది విన్నావా మహానటి
మా చెంపలు మీదుగా ప్రవహించే మహానది

మహానటి మహానటి మహానటి మహానటి
మహానటి మహానటి మహానటి మహానటి



*******  ******   *******


చిత్రం: మహానటి (2018)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అనురాగ్ కులకర్ణి, శ్రేయఘోషల్

మూగ మనసులు మూగ మనసులు
మన్ను మిన్ను కలుసుకున్న సీమలో
నన్ను నిన్ను కలుపుతున్న ప్రేమలో
జగతి అంటే మనమే అన్న మాయలో
సమయమన్న జాడలేని హాయిలో
ఆయువే గేయమై స్వాగతించగా
తరలి రావటె చైత్రమా కుహూ కుహూ కుహూ
స్వరాల ఉయాలుగుతున కోయిలైన వేల

మూగ మనసులు మూగ మనసులు

ఊహల రూపమా ఊపిరి దీపమా
నా చిరునవ్వుల వరమా
గాలి సరాగమ పూల పరాగమా
నా గత జన్మల ఋణమా
ఊసులు బాసలు ఏకమైన శ్వాసలో
నిన్నలు రేపులు లీనమైన నేటిలో
ఈ నిజం కథ అని తరతరాలు చదవని
ఈ కథే నిజమని కలలలోనే గడపని
వేరే లోకంచేరి వేగం పెంచే మైకం
మననిల తరమని తారతీరం తాకే దూరం
ఎంతో ఏమో అడగకే ఎవరిని

మూగ మనసులు మూగ మనసులు


*******  ******   *******


చిత్రం: మహానటి (2018)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చారులత మణి

సదా నన్ను నడిపే నీ చెలిమే పూ దారై నిలిచే...
ప్రతి మలుపు ఇక పై స్వాగతమై నా పేరే పిలిచే
ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే
కాలం నర్తించద నీతో జతై
కాలం స్మృతించదా నీకోసమై
కాలం నటించదా నీతో జతై

నదికి వరదల్లె మదికి పరవల్లై
బెరుకు ఎపుడు వదిలిందో
చురుకు ఎపుడు పేరిగిందో
తలుపు తొలి జల్లై తనువు హరివిల్లై
వయస్సు ఎపుడు కడిలిందో
సొగసు ఎపుడు మేరిసిందో
గమనించే లోగా గమకించే రాగానా
ఏదో ఇలా లోన మోగెనా
కాలం నర్తించద నీతో జతై
ప్రాణం సుమించదా! నీ కోసమై
కాలం నటించదా నీతో జతై


*******  ******   *******


చిత్రం: మహానటి (2018)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రమ్యా బెహ్రా

ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యమా
సరదా సిరిమువ్వలవుదాం
యేటిలో వేగమా పాటలో రాగమా
చిటికెల తాళాలు వేద్దాం
ఇంతలో వెళిపోకుమా వెంట వచ్చే నేస్తమా
ఇంతలో వెళిపోకుమా వెంట వచ్చే నేస్తమా
తొందరగా నన్నే పెంచేసి నువ్వేమో చినబోకు మా

ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యమా
సరదా సిరిమువ్వలవుదాం
యేటిలో వేగమా పాటలో రాగమా

ఓ... ఓ...ఓ...ఓ...

వూరికే పని లేక తీరికస్సలులేక
తోటలో తూనీగల్లే తిరిగొద్దామా ఎంచక్కా
అంత పొడుగెదిగాక తెలుసుకోలేనింక
సులువుగ ఉడతల్లే చెట్టెక్కే ఆ చిట్కా
నింగికి నిచ్చెన వేయవే నింగికి నిచ్చెన వేయవే
గుప్పెడు చుక్కలు కొయ్యవే
హారమల్లే రేపటి మెడ్లో వెయ్యవే
నీ పిలుపె  తంగి నలు వైపుల నుండి
అర చేతులు వాలలేయ్ నీ మధి కోరిన కానుకలన్ని

ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యమా
సరదా సిరిమువ్వలవుదాం
యేటిలో వేగమా పాటలో రాగమా



Palli Balakrishna Thursday, May 10, 2018

చిత్రం: ఏమంత్రం వేసావె (2018)
సంగీతం: అబ్దుస్ సమద్
సాహిత్యం: అరుణ్ వేమూరి
గానం: ప్రణవి ఆచార్య
నటీనటులు: విజయ్ దేవరకొండ, శివాణి సింగ్ , నిలాక్షి సింగ్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీహరి మర్రి
నిర్మాత: మల్కాపురం శివకుమార్
విడుదల తేది: 09.03. 2018

హే సుదూరాల తీరాల పాట
సుదై పెదవి చెర వీడెనా
ఇలా మూగగా నిలిచి మైనా
తన మనసే తెలిపేనా
హే విలాపాలపుంతల్లో తార
నవ్వే రువ్వి ఇల రాలెనా
అలా మయాలోకాన్ని విడిచి
మెళకువలు ఒక కలలా
తపిస్తున్న ఓ ప్రాణమా
శ్రమిస్తున్న నా నేస్తమా
ఫలిస్తుంద అన్వేషణ ఓ ఓ ఓ...

హే సుదూరాల తీరాల పాట
సుదై పెదవి చెర వీడెనా
ఇలా మూగగా నిలిచి మైనా
తన మనసే తెలిపేనా

శిలగ మిగిలినదిలే మనసు మెల్లగా
కరుగుతోంద సత్తె చేయగా
కనుల జారు నాయగారాల సాక్షిగా ఓ ఓ
ఎదురుచూపులన్ని పొగడపూలుగా ఓ ఓ హో
నేను గాచి హారాలల్లనా

హే అలా సందె చీకట్లు కరిగి
ప్రియా వేకువే విరియగా
ఉషా రాగమై గుండె తడుతూ
నా వాకిట నిలిచేవా
హే సుదూరాల తీరాల పాట
సుదై పెదవి చెర వీడెనా
ఇలా మూగగా నిలిచి మైనా
తన మనసే తెలిపేనా

Palli Balakrishna Saturday, March 3, 2018



చిత్రం: నువ్విలా (2011)
సంగీతం: శేఖర్ చంద్ర
నటీనటులు: హావీష్ , అజయ్ , ప్రసాద్ బార్వే , విజయ్ దేవరకొండ , యామి గౌతమ్, సరయు, రేమ్య నాంబీసన్
స్క్రీన్ ప్లే: సత్యానంద్
కథ, మాటలు, దర్శకత్వం: రవిబాబు
నిర్మాత: రామోజీరావు
సినిమాటోగ్రఫీ: సుధాకర్ రెడ్డి
ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్
బ్యానర్: ఉషాకిరన్ మూవీస్
విడుదల తేది: 03.11.2011



Songs List:



అరచేతిని వదలని పాట సాహిత్యం

 
చిత్రం: నువ్విలా (2011)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: కృష్ణ చైతన్య 

అరచేతిని వదలని 



Are you an angel పాట సాహిత్యం

 
చిత్రం: నువ్విలా (2011)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: శేఖర్ చంద్ర 

Are you an angel 



ఏకాకినే అయిపోతున్నానే పాట సాహిత్యం

 
చిత్రం: నువ్విలా (2011)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: దీపు 

ఏకాకినే అయిపోతున్నానే 




బేబీ ఆ పోపుల డబ్బా పాట సాహిత్యం

 
చిత్రం: నువ్విలా (2011)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: 
గానం: రేవంత్ , గీతామాధురి

పల్లవి:
బేబీ ఆ పోపుల డబ్బా 
అందుకో ఆ ఆయిల్ డబ్బా
వండితే గిన్నట్టుకురావాలే ఊరంతా
బేబీ అదిరింది అని బేబీ బాగుంది అని
అంతా లొట్టలేసుకు తింటారే ఫుడ్ అంతా

వెజ్ కర్రీ అయినా నాన్ వెజ్ ఏదైనా
గుమగుమలాడాలంటే నీలా వండాలే
పోట్లకాయల పప్పెయ్యి చామదుంప కలిపెయ్యి
పప్పుచారు పెట్టావంటే నోరే ఊరి చావాలిలే


బేబీ ఆ పోపుల డబ్బా 
అందుకో ఆ ఆయిల్ డబ్బా
వండితే గిన్నట్టుకురావాలే ఊరంతా
బేబీ అదిరింది అని బేబీ బాగుంది అని
అంతా లొట్టలేసుకు తింటారే ఫుడ్ అంతా

చరణం: 1
ముందే కోసి పెట్టుకుందాం ముక్కులు బాగా వేగించేద్దాం
టొమోటోస్ అనియన్స్ అందులో వేసేద్దాం
ఉప్పు కారం బాగా వేద్దాం
అహ బీపీ వస్తది తగ్గించేద్దాం
వంటికి చాలా మంచిది కదా పసుపు చల్లదనం
అరె చింతపండు కొంచం కలుపుకొని 
పావుగంట సేపు మగ్గించేద్దాం
చాలా టైమే ఉంది మరి ఇప్పుడేం చేద్దాం
రావే పక్కకిపోయి గట్టి గట్టిగా వాటేసుకుందాం

బేబీ ఆ పోపుల డబ్బా 
అందుకో ఆ ఆయిల్ డబ్బా
వండితే గిన్నట్టుకురావాలే ఊరంతా

చరణం: 2
బుంగుళూరు వంకాయ్ లో బెండకాయలేద్దాం
కరకర వేపుడు చేద్దాం ఏమంటావ్ ?
హా జీడిపప్పు సెనగ పప్పు  అదో కప్పు ఇదో కప్పు వేస్తే స్మెల్ గుప్పుమని ఊరే దాటాలే
ఐదు చంచాలు ఆయిల్ వేద్దాం
రెండే చాలు లావైపోతాం
హెల్త్ కి చాలా మంచిది కాదా అల్లం వెల్లుల్లి
కొత్తిమీర తురిమి పెట్టుకొని
ఫ్రై అవనిద్దాం కొంచం ఫ్రై అవనిద్దాం
ఇంకేం చేద్దాం
 ఇంకేం చేద్దాం
కర్రీ అయ్యేలోగ హర్రీ బర్రీ గా బదులిచ్చుకుందాం

బేబీ ఆ పోపుల డబ్బా 
అందుకో ఆ ఆయిల్ డబ్బా
వండితే గిన్నట్టుకురావాలే ఊరంతా
బేబీ అదిరింది అని బేబీ బాగుంది అని
అంతా లొట్టలేసుకు తింటారే ఫుడ్ అంతా



ఎన్నో కలలే పాట సాహిత్యం

 
చిత్రం: నువ్విలా (2011)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: శేఖర్ చంద్ర 

ఎన్నో కలలే 



I love you soo much పాట సాహిత్యం

 
చిత్రం: నువ్విలా (2011)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: శేఖర్ చంద్ర 

I love you soo much 




Sugar and Spice పాట సాహిత్యం

 
చిత్రం: నువ్విలా (2011)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: దీపు 

Sugar and Spice 



Why do people fall in love పాట సాహిత్యం

 
చిత్రం: నువ్విలా (2011)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: శేఖర్ చంద్ర , హర్షిక 

Why do people fall in love 



కొట్టుకు చద్దాం పాట సాహిత్యం

 
చిత్రం: నువ్విలా (2011)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: దీపు, గీతామాధురి 

కొట్టుకు చద్దాం 

Palli Balakrishna Tuesday, February 27, 2018



చిత్రం: ఎవడే సుబ్రహ్మణ్యం (2015)
సంగీతం: రధన్ ,  ఇళయరాజా
నటీనటులు: నాని , విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, రీతూ వర్మ
మాటలు ( డైలాగ్స్ ):
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నాగ్ అశ్విన్
నిర్మాతలు: ప్రియాంక దత్ , స్వప్న దత్
బ్యానర్: స్వప్న సినిమా
విడుదల తేది: 21.03.2015



Songs List:



బ్యూటిఫుల్ జిందగీ పాట సాహిత్యం

 
చిత్రం: ఎవడే సుబ్రహ్మణ్యం (2015)
సంగీతం:  రధన్
సాహిత్యం: వశిష్ట 
గానం: నిఖిత శర్మ

జంతర్ మంతర్ జాదులన్ని చేసెయ్ నా నీ పైనా 
సారో గీరో జీరో గారంటే మార్చేనా 
సండే మండే రోజేదైనా తమాషా కరోనా 
లైఫ్ ఈస్ ఫుల్ల్ ఆఫ్ వండర్స్ అన్ని ఎంజోయ్ చేయ్ అంటున్నా 
చిన్ని లైఫు లోన గోలు మాలు గోల లన్ని ఎందుకో ఎందుకో 
చిన్ని చిన్ని ఆశలన్ని చిందులేసి నువ్వు అందుకో అందుకో 
పుట్టె ముందు లేవు టెన్షన్సే 
లైట్ తీసుకుంటె అన్ని బిందాసే 
పల్ పల్కుషీని నువ్ పంచుకుంటె 
ఎవ్రిడే కాద కల్లముందు కలర్ఫుల్ డే 

బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జిందగీ ఒక్కటె ఉందిగా ఈ క్షణం నీది రా 
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జిందగీ ఆగెనె జోరుగా ఎంజోయ్ చెయ్ రా 

నచ్చినట్టుంటె నువ్వే చుట్టు ఉండే ఈ లోకం 
ఒక్కటె నిన్నే మెచ్చుకుంటుందే వెంట వస్తుందే 
చెయ్యి అందిస్తే నువ్వే చేరదీస్తుందే స్నేహం 
నీకు తోడవుతూ నీడగా ఉంటూ వీడిపోదంతే 
ఏక్ దోన్ తీన్ చాల్ 
పుల్ బుస్ హె యార్ 
life is too short so think with your heart 
పంచేస్తు ప్యార్ సాగోయ్ దిల్ దార్ 
ఓ చెరిగి పోని ఘాపకానివోయ్ మిగలాలిగా 

బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జిందగీ ఒక్కటె ఉందిగా ఈ క్షణం నీది రా 
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జిందగీ ఆగెనె జోరుగా ఎంజోయ్ చెయ్ రా




ఇదేరా ఇదేరా పాట సాహిత్యం

 
చిత్రం: ఎవడే సుబ్రహ్మణ్యం (2015)
సంగీతం:  రధన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: మోహిత్ చౌహన్

ఓ మనిషీ ఓ మహర్షీ 
కనిపించిందా ఉదయం 
ఓ మనిషీ ఓ అన్వేషి 
వెలుగైయ్యిందా హౄదయం 
ఆనందం కన్నీరై జారిన క్షణమిది 
నలుపంతా మటుమాయమైనదీ 
నీ ప్రాణం ఈ రోజె మరలా ఊపిరి పొంది 
తానెవరో కనుగొన్నదీ 
ఇదేరా ఇదేరా గెలుపంటె ఇదేరా 
అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా 

వదలనిదే నీ స్వార్దం కనబడునా పరమార్దం 
మనుషులనీ గెలిచేది ప్రేమే కదా 
ప్రేమె మానవత్వం ప్రేమే దైవతత్వం 
జీవించేటి దారే ఇదీ 

ఇదేరా ఇదేరా గెలుపంటె ఇదేరా 
అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా 

యద సడిలో నిజముందీ కను తడిలో నిజముందీ 
అడుగడుగూ గుడి ఉందీ 
ప్రతి మనిషిలో నివేదించు ప్రాణం 
దైవంతో ప్రయాణం సగేస్తుంది నీ జీవితం 

ఇదేరా ఇదేరా గెలుపంటె ఇదేరా 
అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమ్రా 

ఓ మనిషీ ఓ మహర్షీ 
కనిపించిందా ఉదయం 
ఓ మనిషీ ఓ అన్వేషి 
వెలుగైయ్యిందా హౄదయం




నువ్వు నువ్వు కాద పాట సాహిత్యం

 
చిత్రం: ఎవడే సుబ్రహ్మణ్యం (2015)
సంగీతం:  రధన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రంజిత్ , రామి

అద్దంలో నిను చూసుకో 
నిన్నే నువ్ ప్రశ్నించుకో 
నువ్వెవరో తెలుసుకో 
Who are you 
Sun of శివ కైలాసం 
My name is సుబ్రహ్మణ్యం 
బిసినెస్ హా మేరా కాం 
All around నాదే దూం దాం 
వేగం నా వేదాంతం 
గెలవడమే నా సిద్దాంతం 
Now You Know Who I Am 

No No No No No No No నువ్వు నువ్వు కాదు 
వెనక్నే ఏ జవాబు రాదు 
మనసున లెన్సు పెట్టి జర ఆరా తీసి గుర్తించు నువ్వెవరూ 
నొ నొ నొ నొ ఊరు పేరు కాదు 
కంపడు ఒడ్డు పొడవు కాదు 
మసకల పొరలు తీసి నీ లోనికి తీసి రాబట్టుకో ఆన్సరూ 

మల్టి క్రోర్ కంపెనీకి ఒక్క ఓనర్ నీ 
నాకీ అర్దం లేని క్వస్చిన్స్ యెందుకనీ 
ఆల్వేస్ నేనె నంబర్ వన్ అవ్వాలనీ 
డే అండ్ నైట్ పరుగే పరుగు నా పనీ 
అయ్యో రామ బ్రేకె లేని నీ జర్నీ 
రయ్యంటుందీ హార్టే లేదనీ 
ఏదో చోట కట్టెయ్యండె గుర్రాన్ని 
నీకే నువ్వు తెలిసేదెప్పుడనీ 
నా రూట్ ఏంటొ వేటేంటొ చేరేటి హైటేంటొ 
అన్ని తెలిసిన సూపర్ సుబ్బునీ 

ఎవ్రీ టైం నన్నే నేరు ఓడిస్తూ ఉంటా 
పై పై ఎత్తుల్లోకి ఎదిగిపోతుంటా 
రైటొ రాంగొ నాకు అర్దం అక్కర్లేదంటా 
కోరుకుంది పొందటం నా బర్తు రైటంటా 
ఆకాశంలో జంద పాతె తొందర్లో 
పేరు మూలం మిస్స్ అయితే ఎట్టా 
నక్షత్రాల్ని బేరం చేసె సందట్లో 
గాల్లో మేడలు కట్ట ఓ తంటా 
నేణేచోట ఉన్నన్నో ఆ చోటె నాకిష్టం 
ఎక్కడినుచి వస్తే ఏంటంటా 

నొ నొ నొ నొ నొ నొ నొ నువ్వు నువ్వు కాదు 
వెనక్నే ఏ జవాబు రాదు 
మనసున లెన్సు పెట్టి జర ఆరా తీసి గుర్తించు నువ్వెవరూ 
నొ నొ నొ నొ ఊరు పేరు కాదు 
కంపడు ఒడ్డు పొడవు కాదు 
మసకల పొరలు తీసి నీ లోనికి తీసి రాబట్టుకో ఆన్సరూ





ఎవడే సుబ్రహ్మణ్యం పాట సాహిత్యం

 
చిత్రం: ఎవడే సుబ్రహ్మణ్యం (2015)
సంగీతం:  రధన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రామి

ఎవడే సుబ్రహ్మణ్యం




ఓ కలా చూడకే అలా పాట సాహిత్యం

 
చిత్రం: ఎవడే సుబ్రహ్మణ్యం (2015)
సంగీతం:  రధన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: హరిణి

ఓ కలా ఓ కలా చూడకే అలా 
హేయ్ ఇలా నీ వలా అల్లితే ఎలా 
మరో ప్రపంచమే అలా వరించగా 
పరుగులు తీసే నా ఎదకీ నిలకద నేర్పేదెలా 
కుదురుగ ఉంటె మంచిదనీ వెనకకి లాగేదెలా 

ఓ కలా ఓ కలా చూడకే అలా 

కనులె వెతికే వెలుతురు నీదనీ 
ఇపుడే ఇపుడే తెలిసినదీ 
తననే పిలిచే పిలుపులు నీవనీ 
వయసిపుడే తేల్చుకున్నదీ 
నిదురకి చేరితే జోల నువే 
మెలుకువ వచ్చినా ఎదుట నువే 
ఇక నిను వీడటం ఏలా అదెలా 

ఓ కలా ఓ కలా చూడకే అలా 

ఎడమ కుడిలో ఎవరూ లేరనీ 
ఒనికే పెదవే పలికినదీ 
నిజమే పలికే చొరవని ఇచ్చేయ్మనీ 
నసిగినదీ నాంచకన్నదీ 
మనసుకి చేరువా ప్రతి ఒకరూ 
మనకిన దూరమే అని బెదురూ 
మరి నిను చేరడం ఎలా అదెలా 

ఓ కలా ఓ కలా చూడకే అలా




చల్లగాలి తాకుతున్న పాట సాహిత్యం

 
చిత్రం: ఎవడే సుబ్రహ్మణ్యం (2015)
సంగీతం:  ఇళయరాజా
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: సెంథిల్ , రిహిత

చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా 
నేలకేసి జారుతున్న జల్లు అయినదీ వయసిలా 
ఎందుకంట ఇంత దగా నిన్న మొన్న లేదుకాదా లేదుకదా 
ఉండి ఉండి నెమ్మదిగా నన్ను ఎటొ లాగుతుందా 
పదనీ తప్పించుకోలేనని తోచెట్టు చేస్తుందా 

చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా 
నేలకేసి జారుతున్న జల్లు అయినదీ వయసిలా 

ఎవరో అన్నారనీ మారవే నాలో ఆశలూ 
ఎవరేమన్నారని పొంగెలే నాలో ఊహలూ 
ఎవరో అన్నారనీ మారవే నాలో ఆశలూ 
ఎవరేమన్నారని పొంగెలే నాలో ఊహలూ 
తీరం తెలిశాకా ఇంకో దారిని మార్చాలా 
దారులు సరి అయినా వేరె తీరం చేరేనా 
నడకలు నావేనా నడిచేది నేనేనా 

చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా 
నేలకేసి జారుతున్న జల్లు అయినదీ వయసిలా 

ఇంతగా వద్దంటున్నా ఆగదే ఆత్రం ఏమిటో 
ఇంతగా పొంగేటంతా అవసరం ఏమో ఎందుకో 
అయినా ఏమైనా ఎద నా చెయి జారేనే 
ఇపుడు ఏ నాడు ప్రేమె నేరం కానందీ 
చెలిమే ఇంకోలా చిగురిస్తుందంటుంటె 

చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా 
నేలకేసి జారుతున్న జల్లు అయినదీ వయసిలా 

Palli Balakrishna Tuesday, January 30, 2018

Most Recent

Default