Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Snehamante Idera (2001)





చిత్రం: స్నేహమంటే ఇదేరా (2001)
సంగీతం: శివ శంకర్
నటీనటులు: నాగార్జున, భూమిక, సుమంత్
దర్శకత్వం: బాలశేఖరన్
నిర్మాత: ఆర్.బి.చౌదరి
విడుదల తేది: 26.10.2001



Songs List:



స్నేహమంటె ఊపిరి కదరా పాట సాహిత్యం

 
చిత్రం: స్నేహమంటే ఇదేరా (2001)
సంగీతం: శివ శంకర్
సాహిత్యం: కులశేఖర్ 
గానం: శంకర్ మహదేవన్, టిప్పు ,కృష్ణ రాజ్ 

స్నేహమంటె ఊపిరి కదరా
ప్రేమను పంచె గుణమే కదరా
దేవుని గుడిలో హారతి లాగా
తూరుపు దిక్కున వేకువలాగా
కిల కిల గువ్వుల సవ్వడి లాగా మధురం కదరా

అర్రె...స్నేహముంటె చాలన్నా ఏది లేకున్నా
కల కాలమిట్ట కలిసుందాం ఎవ్వరు యేమన్నా
స్నేహమంటె ఇదెరా నమ్మర పెద్దాన్న
కల కాలమిట్ట కలిసుందాం ఎవ్వరు యేమన్నా

ఊరు చివరా ఈతలాడినా చెరువు గురుతుందీ
బడిని మాని పడక వేసినా అరుగు గురుతుందీ
కోతి కుమ్మాచ్చాటల్లోనా...అల పిల్లం గోడుల్లోనా
చిన్నప్పటి స్నేహం బాగుందీ
ఏట జరిగే జాతర్లోనా...మన మద్దెల పండుగలోనా
ఆ అల్లరి ఇంకా బాగుందీ
చూడరా చలాకి స్నేహం
పాడరా ఉషారు గీతం
తీరని రుణాల నబ్ధం సుమాల గంధం స్నేహమేరా

స్నేహముంటె చాలన్నా ఏది లేకున్నా
కల కాలమిట్ట కలిసుందాం ఎవ్వరు యేమన్నా
స్నేహమంటె ఇదెరా నమ్మర పెద్దాన్న
కల కాలమిట్ట కలిసుందాం ఎవ్వరు యేమన్నా

వాన చినుకే నేల తల్లితో చెలిమి కోరిందీ
ఉరకలేసే ఏరు పడవతో చెలి చేసిందీ
ఆ నింగి నేలల్లోనా కొండ కోనల్లోనా
తియ తియ్యని స్నేహం దాగుందీ
ఏడడుగుల బంధం కన్నా
మన బంధం యెంతో మిన్నా
ఇక ఇంతకు మించిన దేముందీ
చూడరా పవిత్ర బంధం...వారెవా ఇదేమి చిత్రం
స్రుష్టికి అనాదిగాను పునాదిగాను ఈ స్నేహమేరా

స్నేహముంటె చాలన్నా ఏది లేకున్నా
కల కాలమిట్ట కలిసుందాం ఎవ్వరు యేమన్నా

స్నేహమంటె ఊపిరి కదరా
ప్రేమను పంచె గుణమే కదరా
దేవుని గుడిలో హారతి లాగా
తూరుపు దిక్కున వేకువలాగా
కిల కిల గువ్వుల సవ్వడి లాగా మధురం కదరా

అర్రె...స్నేహముంటె చాలన్నా ఏది లేకున్నా
కల కాలమిట్ట కలిసుందాం ఎవ్వరు యేమన్నా
స్నేహమంటె ఇదెరా నమ్మర పెద్దాన్న
కల కాలమిట్ట కలిసుందాం ఎవ్వరు యేమన్నా





చెలియా నీ ప్రేమలోనే పాట సాహిత్యం

 
చిత్రం: స్నేహమంటే ఇదేరా (2001)
సంగీతం: శివ శంకర్
సాహిత్యం: మృత్యుంజయుడు 
గానం: హరిచరణ్ , సుజాత

చెలియా నీ ప్రేమలోనే పరవసించి పోయానే
చెలియా నీ ప్రేమలోనే పరవసించి పోయానే
పెదవి మీద సిగ్గు లన్ని పైట చాటు దాచకే
ముద్దు కోరి చెంతకొస్తె సిగ్గులెందుకే
నీ నవ్వె సింగారమో...నీ పలుకే బంగారమో
నీ ముద్దో మందారమో...హో రోజా రా రా రా రా రా

ప్రియుడా నీ ప్రేమలోనే పులకరించి పోయానే

మాటలన్ని మాయాచేసి ప్రేమకు వల వేసా
ప్రేమ మైకం పొందిన వేలా మౌనం సాదించా
కన్నులు నాల్గు కలిసినవేలా భాషకు చోటేదీ
మౌనం పాడే ఆలాపనకు మించించినదేముందీ
మాటలే మనసుకి బరువైతే
మౌనమే కానుక అవుతుందీ
మౌనమను భాషే రాకుంటే
ప్రేమ ఇక వ్యర్దం అవుతుందీ
ఈ ప్రేమ భావనే నిజం నిజం
ఏదొ చెపాలనే ఉందీ గుండె ఝల్లుమందీ
సిగ్గుని చెందని పువ్వుని తుమ్మెద అంటదులే
ముద్దును పొందని సిగ్గులో బుగ్గలు కందవులే

చెలియా నీ ప్రేమలోనే పరవసించి పోయానే

ప్రేమ కానుక పొందిన వేలా సర్వం మరిచానూ
నా ప్రేమకు నిత్యం పాణం పోసి కవినై పోయానూ
తియ్యగ పలికిన స్వరమున జల్లున మనసే తడిసిందీ
నీకై నిలచీ నిన్నే తలచి పాణం ఇస్తుందీ
యవ్వనము వయసుకు తోడైతే
ఆశలకు పండుగ అవుతుందీ
ఆశలో స్వరం కనుగొంటే
జీవితం మధురసమవుతుందీ
ఇక ఊరించే ప్రియా ప్రియా
నీ అంద చందాలన్ని చూసి కల్లు చెదరే
మదిలో దాగిన ఊహలో ఊపిరి నీవైకరీ
వద్దని కన్నులు మూసినా ఎదుటే నీవుంటివీ

చెలియా నీ ప్రేమలోనే పరవసించి పోయానే
ప్రియుడా నీ ప్రేమలోనే పులకరించి పోయానే
పెదవి మీద సిగ్గు లన్ని పైట చాటు దాచకే
ముద్దు కోరి చెంతకొస్తె సిగ్గులెందుకే
నీ నవ్వె సింగారమో...నీ పలుకే బంగారమో
నీ ముద్దో మందారమో...హో రోజా రా రా రా రా రా

చెలియా నీ ప్రేమలోనే పరవసించి పోయానే



కన్నె పిల్లలే పాట సాహిత్యం

 
చిత్రం: స్నేహమంటే ఇదేరా (2001)
సంగీతం: శివ శంకర్
సాహిత్యం: చిర్రావూరి విజయ్ కుమార్
గానం: ఉదిత్ నారాయణ్ , సుజాత

కన్నె పిల్లలే పక పకమటె మీకు తికమకలే
కల్లే కలిపి మేము కుహు కుహు మంటె మీకు తహ తహలే
జడ ఊపుకుంటు మేము వెలుతుంటే
మీ మనసే జివ్వు మనదా
మెలి తిప్పి మీసమే కన్నుకొడితే
మీ సొగసు కెవ్వు మనదా
మేము ముస్తాబై కనిపిస్తే మతిపోదా మీకింకా

కన్నె పిల్లలే పక పకమటె మీకు తికమకలే
కల్లే కలిపి మేము కుహు కుహు మంటె మీకు తహ తహలే

కన్నె పలికే కైపు రేపనీ
పన్నే పలికే కాటు వేయ్మనీ
కొన గోరె మీటని పలికే చెంత చేరు త్వరగా
నీడె పలికే తోడు ఏడనీ
నాడె పలికే వేడి చూడనీ
పలహారం తేమాని పలికే పాలు పళ్లు త్వరగా
పెదవుల్లో దాహం పలికే తాగనీ త్వరగా
పరువంలో మోహం పలికే లాగనీ త్వరగా
మడుము వంపు మదతే పలికే తాకమని త్వరగా
నను విడబోకని వొడి పలికే మెడలో ముడి వెయ్ త్వరగా

కన్నె పిల్లలే పక పకమటె మీకు తికమకలే
కల్లే కలిపి మేము కుహు కుహు మంటె మీకు తహ తహలే

ఒట్టె పలికే కనిపోకనీ
బెట్టె పలికే అందబోకనీ
జద ఏమొ తెమ్మని పలికే జాజి పూలు త్వరగా
మీసం పలికే బుగ్గ ఇమ్మనీ
రోషం పలికే సిగ్గు పడకనీ
సరసంకే వయసే అడిగే చొరవ చెయ్యి త్వరగా
చెలరేగె ఊహలు పలికే ఏలుకో త్వరగా
ఉరికొలిపే ఆశలు పలికే చేరుకో త్వరగా
మల్లె పూల మంచం పలికే రమ్మనీ త్వరగా
ఇక తలుపేయ్ మని గది పలికే ఆలు మగలై త్వరగా

హేయ్...కన్నె పిల్లలే పక పకమటె మీకు తికమకలే
కల్లే కలిపి మేము కుహు కుహు మంటె మీకు తహ తహలే
జడ ఊపుకుంటు మేము వెలుతుంటే
మీ మనసే జివ్వు మనదా
మెలి తిప్పి మీసమే కన్నుకొడితే
మీ సొగసు కెవ్వు మనదా
మేము ముస్తాబై కనిపిస్తే మతిపోదా మీకింకా

కన్నె పిల్లలే పక పకమటె మీకు తికమకలే
కల్లే కలిపి మేము కుహు కుహు మంటె మీకు తహ తహలే



నా పెదవికి పాట సాహిత్యం

 
చిత్రం: స్నేహమంటే ఇదేరా (2001)
సంగీతం: శివ శంకర్
సాహిత్యం: చిర్రావూరి విజయ్ కుమార్
గానం: రాజేష్ , సుజాత

నా పెదవికి నవ్వులు నేర్పావు
ప్రియా నీకు జోహారు
నా కనులకు కళలే చూపావే
చెలీ చెంతకే చేరు
ఎదే ఉండిపో నా మదిలో నిండిపో
సుధవై సఖివై
మన కలయిక కథలుగ సాగాలి
మన కథ ఒక చరితగ వెలగాలి

నా పెదవికి నవ్వులు నేర్పావు
ప్రియా నీకు జోహారు

ఏ దేవిగా బంధమై అల్లుకుంది
ఈ దేవినే అందుకో కానుకంది
నువ్వు పక్కనుంటె ఎండే చల్లగున్నది
నువ్వు ముట్టుకుంటె ముళ్ళే మల్లెలైనవి
నువ్వు నా ప్రాణమై నీ ప్రేమతో నడిపించవా

నా పెదవికి నవ్వులు నేర్పావు
ప్రియా నీకు జోహారు
నా నుదుటిపై కుంకుమై నిలిచిపోవా
మా ఇంటికే దీపమై నడచి రావా
వేల ఊహలందు నిన్నే దాచుకుంటిని
కోటి ఆశలందు నిన్నే చూసుకొంటిని
నువ్వు నా చూపువై నా ఊపిరై ప్రేమించవా

నా పెదవికి నవ్వులు నేర్పావు
ప్రియా నీకు జోహారు
నా కనులకు కళలే చూపావే
చెలీ చెంతకే చేరు
ఎదే ఉండిపో నా మదిలో నిండిపో
సుధవై సఖివై
మన కలయిక కథలుగ సాగాలి
మన కథ ఒక చరితగ వెలగాల




రుక్కు రుక్కు పాట సాహిత్యం

 
చిత్రం: స్నేహమంటే ఇదేరా (2001)
సంగీతం: శివ శంకర్
సాహిత్యం: చిర్రావూరి విజయ్ కుమార్
గానం: దేవన్, సౌమ్య 


రుక్కు రుక్కు 



నేస్తమా నేస్తమా పాట సాహిత్యం

 
చిత్రం: స్నేహమంటే ఇదేరా (2001)
సంగీతం: శివ శంకర్
సాహిత్యం: కులశేఖర్ 
గానం: హరిహరణ్

నేస్తమా నేస్తమా ఇంత శిక్ష న్యాయమా
అనురాగమే నేరమా
స్నేహమే ద్రోహమా కాన రాని దైవమా
బలికోరటం న్యాయమా
బంధమే ఈ వేలా తెంచుకు పోతే
కన్నీరే ఏరై పారేనా
నేస్తమే ఈనాడు శత్రువు అయితే
చితి మంటె కాద లోలోనా

నేస్తమా నేస్తమా ఇంత శిక్ష న్యాయమా
అనురాగమే నేరమా

రావే ఓ చిరు గాలీ నీవే గాలించాలి
నీడె దూరం అయినదే
మేఘం నిగిని వీడి ఎంతో దూరం పోదె
స్నేహం దూరం అయినదే
ఆ దేవుడు లేని ఆలయములా
కెరటము లేని సాగరములా
ఊపిరి లేని గుండె లయలా
నేస్తము లేకా ఉండగలనా
ఓ బ్రహ్మయ్యా నా కంటి పాపను చేర్చి గుండె కోత తీర్చయ్యా

నేస్తమా నేస్తమా ఇంత శిక్ష న్యాయమా
అనురాగమే నేరమా
స్నేహమే ద్రోహమా కాన రాని దైవమా
బలికోరటం న్యాయమా
బంధమే ఈ వేలా తెంచుకు పోతే
కన్నీరే ఏరై పారేనా
నేస్తమే ఈనాడు శత్రువు అయితే
చితి మంటె కాద లోలోనా

Most Recent

Default