• విక్టరీ వెంకటేష్, సౌందర్య కాంబినేషన్‌లో వచ్చిన ఎమోషనల్ మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ చిత్రం 'రాజా'. "ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది.. కానీ ఒక స్త్రీ ఉన్నత స్థాయికి చేరడానికి నిస్వార్థంగా త్యాగం చేసిన ఒక ప్రేమికుడి కథ" అనే కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల హృదయాలను కదిలించింది.
• సంగీత దర్శకుడు ఎస్.ఎ. రాజ్‌కుమార్ సమకూర్చిన బాణీలు అప్పట్లో తెలుగునాట ఒక ఊపు ఊపాయి. ముఖ్యంగా "ఎదో ఒక రాగం" పాట సంచలన విజయం సాధించి, ఇప్పటికీ ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌గా నిలిచింది.
• ఉత్తమ నటిగా సౌందర్య, ఉత్తమ చిత్రంగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ నంది అవార్డులతో పాటు ఫిలింఫేర్ అవార్డులను కైవసం చేసుకున్నాయి.
Edho Oka Raagam (Female) Song Lyrics – Raja (1999)
'Edho Oka Raagam (Female)' is an iconic melodious track from Raja (1999) movie, composed by S. A. Rajkumar, penned by Sirivennela Seetharama Sastry, and sung by K. S. Chithra.
ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా
ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా
నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా
నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా
జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేల్కొలుపు
జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు
ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా
అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే
రా అమ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకమే
అమ్మ కళ్లలో అపుడపుడు చెమరింతలు జ్ఞాపకమే
అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం
అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం
ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా
గుళ్లో కథ వింటూ నిదురించిన జ్ఞాపకమే
బళ్లో చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే
గవ్వలు ఎన్నో సంపాదించిన గర్వం జ్ఞాపకమే
నెమలి కళ్లనే దాచే చోటు జ్ఞాపకం
జామపళ్లనే దోచే తోట జ్ఞాపకం
ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా
నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా
నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా
జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేల్కొలుపు
జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు
ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా
Edho Oka Raagam (Female) Song Lyrics in English (Transliteration)
'Kavvinchake' is an energetic, romantic duet from Raja (1999) movie, composed by S. A. Rajkumar, written by Sirivennela Seetharama Sastry, and sung by Rajesh Krishnan and Sujatha.
'Mellela Vaana' is a melodious romantic duet from Raja (1999) movie, composed by S. A. Rajkumar, written by Sirivennela Seetharama Sastry, and sung by Mano and K. S. Chithra.
'Edho Oka Raagam (Male)' is a deeply emotional classic from Raja (1999) movie, composed by S. A. Rajkumar, penned by Sirivennela Seetharama Sastry, and rendered soulfully by S. P. Balasubrahmanyam.
ఏదో ఒక రాగం పిలిచిందీవేళ
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
ఏదో ఒక రాగం పిలిచిందీవేళ
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా
నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా
జ్ఞాపకాలె మైమరపు జ్ఞాపకాలె మేల్కొలుపు
జ్ఞాపకాలె నిట్టూర్పు జ్ఞాపకాలె ఓదార్పు
ఏదో ఒక రాగం పిలిచిందీవేళ
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
వీచే గాలులలో నీ ఊసులు జ్ఞాపకమే
పూచే పువ్వులలో నీ నవ్వులు జ్ఞాపకమే
తూరుపు కాంతుల ప్రతికిరణం నీ కుంకుమ జ్ఞాపకమే
తులసిమొక్కలో నీ సిరులు జ్ఞాపకం
చిలక ముక్కులా నీ అలక జ్ఞాపకం
ఏదో ఒక రాగం పిలిచిందీవేళ
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
మెరిసే తారలలో నీ చూపులు జ్ఞాపకమే
ఎగసే ప్రతి అలలో నీ ఆశలు జ్ఞాపకమే
కోవెలలోని దీపంలా నీ రూపం జ్ఞాపకమే
పెదవిపైన నీ పేరే చిలిపి జ్ఞాపకం
మరపురాని నీ ప్రేమే మధుర జ్ఞాపకం
ఏదో ఒక రాగం పిలిచిందీవేళ
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా
నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా
జ్ఞాపకాలె మైమరపు జ్ఞాపకాలె మేల్కొలుపు
జ్ఞాపకాలె నిట్టూర్పు జ్ఞాపకాలె ఓదార్పు
ఏదో ఒక రాగం పిలిచిందీవేళ
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
Edho Oka Raagam (Male) Song Lyrics in English (Transliteration)
'Shepu Choosi' is a peppy and fun dance track from Raja (1999) movie, composed by S. A. Rajkumar, written by E. S. Murthy, and sung by Gopal Rao and Anupama.
Shepu Choosi Song Lyrics in English (Transliteration)
Shepu Choosi Song English Lyrics
Kannula Logililo Song Lyrics – Raja (1999)
'Kannula Logililo' is a soothing romantic composition from Raja (1999) movie, composed by S. A. Rajkumar, penned by Sirivennela Seetharama Sastry, and sung by P. Unni Krishnan and K. S. Chithra.
'Pallavinchu Tholi' is a beautiful and pleasant solo track from Raja (1999) movie, composed by S. A. Rajkumar, written by Shanmukha Sharma, and rendered exquisitely by K. S. Chithra.
పల్లవించు తొలిరాగమే సూర్యోదయం
పరవశించు ప్రియగానమే చంద్రోదయం
సరికొత్తగ సాగు ఈపాట
విధిదారులు మారే సయ్యాట
ఒక చల్లని తోడు చేయూత
నాపాటల తీగ తొలిపూత
నాలుగు దిక్కులు నా చిరుపాటలు
అల్లుకునే సమయం
రెక్కలు విప్పుకు చుక్కలసీమకు
సాగెను నాపయనం
పల్లవించు తొలిరాగమే సూర్యోదయం
పరవశించు ప్రియగానమే చంద్రోదయం
పలికే గుండె వేణువులో స్నేహమే ఊపిరి
కదిలే కలల సరిగమలే పాటలో మాధురి
కలిసినవి కోయిలలెన్నో శ్రోతల వరుసలలో
శిలలైనా చిగురించెను ఆ పల్లవి పలుకులలో
ఇంధ్రధనసు సైతం తనలో రంగులనే
ఇప్పటి కిప్పుడు సప్తస్వరాలుగ పలికెను నాతోనే
పల్లవించు తొలిరాగమే సూర్యోదయం
పరవశించు ప్రియగానమే చంద్రోదయం
బ్రతుకే పాటగామారి బాటయే మార్చగా
వెతికే వెలుగులోకాలే ఎదురుగా చేరగా
అణువణువు ఎటు వింటున్నా నా స్వరమే పలికే
అడుగడుగున ఆ స్వరములలో సిరులెన్నో చిలికే
ఆలకించెనే కాలం నా ఆలాపనయై
పాటల జగతిని ఏలే రాణిగ వెలిగే శుభవేళ
పల్లవించు తొలిరాగమే సూర్యోదయం
పరవశించు ప్రియగానమే చంద్రోదయం
సరికొత్తగ సాగు ఈపాట
విధిదారులు మారే సయ్యాట
ఒక చల్లని తోడు చేయూత
నాపాటల తీగ తొలిపూత
నాలుగు దిక్కులు నా చిరుపాటలు
అల్లుకునే సమయం
రెక్కలు విప్పుకు చుక్కలసీమకు
సాగెను నాపయనం
Pallavinchu Tholi Song Lyrics in English (Transliteration)