Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Brindavanam (2010)
చిత్రం: బృందావనం (2010)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
నటీనటులు: జూనియర్ ఎన్ టీ ఆర్ , కాజల్ , సమంత
దర్శకత్వం: వంశీ పైడిపల్లి
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 14.10.2010Songs List:యువకుల పాట సాహిత్యం

 
చిత్రం: బృందావనం (2010)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: కృష్ణ చైతన్య 
గానం: రెమో ఫెర్నాండేజ్, రంజిత్

యువకుల 
ఎయ్ రాజ ఈ రోజు మనదేర పాట సాహిత్యం

 
చిత్రం: బృందావనం (2010)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: శంకర్ మహదేవన్, శ్రేయగోషల్

సిగురాకు సన్నగ ఊగిందె
సినదాని సెంగుని ఊపిందె
సిలకో... ఓ సిలకా... సిలకో...

మల్లి కోమంటి కొండ మల్లి గుండెల్లొ గొండు మల్లి
చామంతి జాజి మల్లి
సోకుల్లో సూది మల్లి నాజూకు నాగ మల్లి
సందెల్లొ సుక్క మల్లి
కవ్వించె కన్నె మల్లి ఎనెల్లో ఎర్ర మల్లి
అందాల బొండు మల్లి
అందాల బొండు మల్లి అందాల బొండు మల్లీ

సూరీడె సూరీడె సూపుల్లొ సూరీడె మాపల్లెలోనె సేరాడే
ఎర్రాని సూరీడె కుర్రాని సూరీడె ఎదలోన సీకటి ఏరాడే
ఇన్నాళ్ళు లేదె ఈ నేల నేడె ఆకాశం అవుతున్నదె
ఈ నింగిలోనె ఆ మాయగాడె వెలుగేదొ నింపాడె

ఎయ్ రాజ ఈ రోజు మనదేర
ఇరగెయ్ రాజ ఈ సోటు మనదేర
ఎయ్ రాజ ఈ ఆట మనదేర సితకెయ్ రాజా...
ఎయ్ రాజ ఈ దుమ్ము రేగేల
ఇరగెయ్ రాజ నీ దిమ్మ తిరిగేల
ఎయ్ రాజ  అ కుమ్ముకోవాల సితకెయ్ రాజా

మల్లి అందాల బొండు మల్లి అందాల బొండు మల్లి
అందాల బొండు మల్లీ

ఈ గాలికి లాలన తెలుసులే
నీ శ్వాసె కలిసాకె లాలించె గుణమొచ్చింది
ఈ పువ్వుకు నవ్వులు తెలుసులే
నీ ఊసె విన్నాకె నవ్వుల్లొ మునకేసింది
అమ్మొ అమ్మమ్మొ అమ్మాయికేమయిందె
మాటల్లో మంత్రాలె కలిపేసి కవ్విస్తుందె
నీ వెంటె ఉందంటె రాయైన మాటాడుద్దె
నేనేం చేసేది నువ్వే చెప్పమ్మ

ఎయ్ రాజ ఆ నింగి ఒంగేల
ఇరగెయ్ రాజ ఈ సందె చిందేల
ఎయ్ రాజ ఈ రంగు పొంగేల సితకెయ్ రాజా

సూరీడె సూరీడె ఎర్రని సూరీడె
మా పల్లె మా పల్లె మా పల్లె మా పల్లె
మా పల్లెల్లోనె సేరాడె

ఆ చూపులు సందడి చేసెనే
నీ మాటె విన్నాకె ఆనందం తుల్లిందంట
ఆ అడుగులు అల్లరి చేసెనే
నీ పాటె సయ్యాటై ఉత్సాహం పొంగిందంట
అంతా నా వల్లె అంటుంటె ఎట్టాగమ్మ
మీరంత కలిసొచ్చి ఈ వింతె చేసారమ్మ
మంత్రాలె నువ్వేసి మేమేదొ చేసామంటె
వేగేదెట్టాగ నువ్వె చెప్పమ్మ

ఎయ్ రాజ ఈ ఊరు కదిలేల
ఇరగెయ్ రాజ లోకాన్ని కుదిపేల
ఎయ్ రాజ ఆ కళ్ళు చదిరేల సితకెయ్ రాజా

సూరీడె సూరీడె  ఎర్రాని సూరీడె
మా పల్లె మా పల్లె మా పల్లె మా పల్లె
మా పల్లెల్లోనె సేరాడె

వరి సేను రెప్పలు వార్సిందె సిరి గువ్వ గూటికి సేరిందె
సిలకో... ఓ సిలకా... సిలకో...నిజమేనా నిజమేనా పాట సాహిత్యం

 
చిత్రం: బృందావనం (2010)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కార్తిక్ , సుచిత్ర

నిజమేనా నిజమేనా నిలబడి కలగంటున్నానా
ఎవరైనా ఎదురైనా నువ్వే అనుకుంటున్నానా
నీ కలలే దాచుకున్న నిజమల్లె వేచివున్న
నీకోసం ఇపుడే నేనే నువ్వవుతున్నా ప్రియా
మరి నాలో ప్రాణం నీదంటున్నా

wanna wanna, Be with you honey
నిన్ను నన్ను ఇక ఒకటైపోనీ
wanna wanna, Be with you honey
నువ్వు నేను ఇక మనమైపోనీ పోనీ పోనీ...
ఇది ప్రేమో ఏమో చంపేస్తున్నాదే...
తోలి ప్రేమే లూ గుచేస్తున్నదే... ఓ

సర సర సర తగిలే గాలే
నీ సరసకి తరిమేస్తోందే
మునుపెరగని సంతోషాలే
ఇపుడిపుడే మొదలవుతుంటే
చిరుగాలె నిన్ను చేరి ఊపిరిలో కలిసి పోయి
ఆ సంతోషాలే నీకే అందించెయ్నా ప్రియా
నీసొంతం అవుతా ఎప్పటికైనా

wanna wanna, Be with you honey
నిన్ను నన్ను ఇక ఒకటై పోనీ
wanna wanna, Be with you honey
నువ్వు నేను ఇక మనమైపోని పోనీ పోనీ....

గిర గిర గిర తిరిగే భూమి
నీ చుట్టూ తిరగాలందే
అమ్మమ్మో ఓ ఓ  అమ్మమ్మో ఓ ఓ ఓ
నిను మరవను అంటూ నన్నే
నా ఆశలు కదిలిస్తుంటే
అమ్మమ్మో
ఆశల్లో ఆగకుండా జన్మంతా జంటగుంటా
వదిలేసే ఊసే రాదే ఏది ఏమైనా ప్రియా
ప్రతి నిమిషం నీతో అడుగేస్తున్నా

wanna wanna, Be with you honey
నిన్ను నన్ను ఇక ఒకటైపోని
wanna wanna, Be with you honey
నువ్వు నేను ఇక మనమైపోని పోనీ పోనీ
ఇది ప్రేమో ఏమో చంపేస్తున్నాదే
తొలి ప్రేమో ఏదో లా గుచ్చేస్తున్నాదే ఓ ఓ
వచ్చాడురా పాట సాహిత్యం

 
చిత్రం: బృందావనం (2010)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: రంజిత్, యం.యం.కీరవాణి, కోటి 

వచ్చాడురాఊపిరాగే బాధంటే పాట సాహిత్యం

 
చిత్రం: బృందావనం (2010)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రాహుల్ నంబియర్

ఊపిరాగే బాధంటే తెలుసుకున్నా ఈ పూటే
కాలమాగే వీలుంటే ఆగిపోనీ ఈ చోటే...
ప్రేమకే ఓ మనసుంటే దానికే ఓ మాటుంటే
నన్నిలా తను చూస్తుంటే ఊరుకోనేలేదంతే...
ప్రేమే నేరమా... ప్రేమే భారమా...
ఎదలో మౌనమా చెప్పమ్మా...
అందే అందమా... వీడిపోని బంధమా...
నువ్వో నరకమా... ఓ ప్రేమా...

నాకు నేను ఎదురవుతూ తేల్చుకోని దారవుతూ
ఉన్నచోటే ఉంటున్నా...
ఈ కొంత ప్రేమ చాలంటూ ఇంకొంత ఎక్కువనుకుంటూ
గుండె కోత చూస్తున్నా...
ప్రేమే ప్రేమని కదిలిస్తుందని
అనుకోలేదు నా మనసైనా...
ఒకటే ఆటను ఓటమి గెలుపుగా
ఆడావెందుకే ఓ ప్రేమా...
చిన్నదో వైపు పెద్దదో వైపు పాట సాహిత్యం

 
చిత్రం: బృందావనం (2010)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: మురళి, సావిత్రి ,  సుఖ్వీందర్ సింగ్

రా యెయ్ రా యెయ్ రా యెయ్ అరె ఏదోటి చేసెయ్
రా యెయ్ రా యెయ్ రా అలా ఆడేసు కోరా

చిన్నదో వైపు పెద్దదో వైపు
చిందేసి చెంగుమంటే పెరగదా ఊపు
ఇచ్చుకో ఇచ్చుకో నిన్నే ఇచ్చుకో
సోకులో వైపు సొంపులో వైపు
అల్లేసి చంపుతుంటే కలగదా కైపు
గిచ్చుకో గిచ్చుకో గిల్లే గిచ్చుకో
అంతేలే అందాలే యమ హరిబరిగున్నా నీ వల్లే
నీ వల్లే పరువాలే ఇలా హుర్రే హుర్రే అన్నాయే కుమ్మేయాలే
అరే సై అంటే సైఅంటూ సై ఆటకే తయారల్లేలా ఆ ఆ
అరే రై అంటే రై అంటూ రహస్యమే రట్టే చేయిస్తా ఆ ఆ

రా యెయ్ రా యెయ్ రా యెయ్ అరె ఏదోటి చేసెయ్
రా యెయ్ రా యెయ్ రా అలా ఆడేసు కోరా

అసలే హడావుడి గున్నాది ఈడు
అందులో ఎడా పెడా ఉన్నారు తోడు
అదిగో అదే అదే కావాలి మాకు
అందుకే పదే పదే అడిగించుకోకు
వాగే వాగే వయ్యారం ఒంపేసుకోకే
కే కే కే కే  వస్తున్నా పిల్లా మీ పైకే
దా దా దా దా రా దా జర పరాకులో చిరాకులే చూపిస్తా
వా వా వా వారే వా నిన్నే సరా సరి సురాపురం చేరుస్తాగా

అరే సై అంటే సైఅంటూ సై ఆటకే తయారుగుంటా
హే రా కమాన్ కమాన్ రా
అరే రై అంటే రై అంటూ రహస్యమే రట్టే చేయిస్తా ఆ ఆ
బేబీ  ఓ బేబీ  ఓబేబీ  ఓ బేబీ  కమాన్ కమాన్

బం బం బం బేబీ వన్ టూ కా ఫోర్ బేబీ
బం బం బం బేబీ వన్ టూ కా ఫోర్ బేబీ
తుక్ జానా రుక్ జానా మన మనకల్ మంజానా
పైజానా పైజ తై తై మే పైజానా
మండే టూ వెడ్ నస్ డే వై వెడ్ నెస్ డే టూ ఫ్రై డే
ఫ్రై డే టూ సండే ఎవ్రీ డే ఈజ్ ఏ ఫన్ డే

హే హే పని లో పడి పడి మరిచానే బాలా
అధిరే తడి పడి సరసాల లీల
ఐతే సరే సరే గుర్తే చేయాలా
మొదట పెదాలతో నడుమే తడమాలా
ఆట పాట మడిచేలో మోగిస్తా మోత
లోన బైట మధురంగా తీరుస్తా తీట
దా దా దా దా రా దా మల్లి గులాబి గులామువై దూకేయ్ రా
వా వా వా వారే వా అలా చలాకిగా గుడారంలో డోరేసెయ్ రా

అరే సై అంటే సైఅంటూ సై ఆటకే తయారుగుంటా
గుంటా టా టా టా
అరే రై అంటే రై అంటూ రహస్యమే రట్టే చేయిస్తా
ఇస్తా ఇస్తా ఇస్తా తా తా తా

చిన్నదో వైపు పెద్దదో వైపు
చిందేసి చెంగుమంటే పెరగదా ఊపు
ఇచ్చుకో ఇచ్చుకో నిన్నే ఇచ్చుకో
సోకులో వైపు సొంపులో వైపు
అల్లేసి చంపుతుంటే కలగదా కైపు
గిచ్చుకో గిచ్చుకో గిల్లే గిచ్చుకో

రా యెయ్ రా యెయ్ రా యెయ్ అరె ఏదోటి చేసెయ్
రా యెయ్ రా యెయ్ రా అలా ఆడేసు కోరా

మోజ్జారే మోజ్జారే పాట సాహిత్యం

 
చిత్రం: బృందావనం (2010)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: బాబా షెహగల్ , రంజిత్, నిఖితా నిగమ్

మోజ్జారే మోజ్జారే

Most Recent

Default