-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Kajal Aggarwal"



చిత్రం: భగవంత్ కేసరి (2023)
సంగీతం: యస్.థమన్
నటీనటులు: బాలక్రిష్ణ, కాజల్ అగర్వాల్ శ్రీలీల
దర్శకత్వం: అనీల్ రావిపూడి
నిర్మాత: సాహు గారపాటి, హరీష్ పెద్ది
విడుదల తేది: 19.10.2023



Songs List:



గణేష్ పాట పాట సాహిత్యం

 
చిత్రం: భగవంత్ కేసరి (2023)
సంగీతం: యస్.థమన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: కరిముల్లా, మనీషా పండ్రంకి

గణేష్ పాట



ఉయ్యాలో ఉయ్యాలా పాట సాహిత్యం

 
చిత్రం: భగవంత్ కేసరి (2023)
సంగీతం: యస్.థమన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: యస్.పి.చరణ్

ఉడత ఉడత ఉష్షా ఉష్
సప్పుడు సెయ్యకుర్రి
నీకన్న మస్తుగ ఉరుకుతాంది
మా సిట్టి సిన్నారీ

ఉడత ఉడత ఉష్షా ఉష్
సప్పుడు సెయ్యకుర్రి
నీకన్న మస్తుగ ఉరుకుతాంది
మా సిట్టి సిన్నారీ

సిలకా సిలకా గప్పు సుప్
గమ్మున కూసోర్రి
నీకన్న తియ్యగ పలుకుతాంది
మా పొట్టి పొన్నారి

నువ్ ఉరకవే నా తల్లి
తుల్లి పలకవే నా తల్లి
ఉరికి పలికి అలిసి వోతే
గుండెపై వాలిపోవే జాబిల్లీ

ఉయ్యాలో ఉయ్యాలా
నా ఊపిరే నీకు ఉయ్యాలా
అవ్ మల్ల అవ్ మల్ల
గీ సేతుల్ల నిన్ను మొయ్యాల

ఉయ్యాలో ఉయ్యాలా
నా ఊపిరే నీకు ఉయ్యాలా
అవ్ మల్ల అవ్ మల్ల
గీ సేతుల్లా నిన్ను మొయ్యాలా

ఉడత ఉడత ఉష్షా ఉష్
సప్పుడు సెయ్యకుర్రి
నీకన్న మస్తుగ ఉరుకుతాంది
మా సిట్టి సిన్నారీ

అమ్మనైత లాల పోస్తా
అయ్యనైత జోల పాడుతా ఆ ఆ
అవ్వనైత బువ్వ వెడతా
దువ్వేనైత జడలల్లుతా ఆ ఆ

పత్తి పువ్వైతా
నీకు రైకలియ్యనీకి
పట్టు పురుగైతా
నీకు పావడియ్యనీకి

ఏమన్నైతే నీకెమన్నైతే
నేనెమన్నైతా నిన్ను కాయనీకీ

ఉయ్యాలో ఉయ్యాలా
నా ఊపిరే నీకు ఉయ్యాలా
అవ్ మల్లా అవ్ మల్ల
గీ సేతుల్ల నిన్ను మొయ్యాలా

ఉయ్యాలో ఉయ్యాలా
నా ఊపిరే నీకు ఉయ్యాలా
అవ్ మల్ల అవ్ మల్ల
గీ సేతుల్లా నిన్ను మొయ్యాలా

ఒప్పుల గుప్పా ఉయ్యాలో
వయ్యారి భామా ఉయ్యాలో
సిగ్గుల మొగ్గ ఉయ్యాలో
సింగారి బొమ్మ ఉయ్యాలో

వోనీల నెమలమ్మ రాణిలెక్కస్తంటే
ఊరూరంతా ఉయ్యాలో
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
సంబరాలా గుమ్మ ఉయ్యాలో
సల్లంగ బతుకమ్మ ఉయ్యాలో

సల్లంగ బతుకమ్మ ఉయ్యాలో
సల్లంగ బతుకమ్మ ఉయ్యాలో
సల్లంగ బతుకమ్మ ఉయ్యాలో
సల్లంగ బతుకమ్మ ఉయ్యాలో



Roar of Kesari పాట సాహిత్యం

 
చిత్రం: భగవంత్ కేసరి (2023)
సంగీతం: యస్.థమన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: బృంద గానం  (Chorus)

చండ్రనిప్పు కండ్లు చూస్తే
సాగరాలే చల్లబడవా
వేట కత్తే వేటు వేస్తే
అగ్గికైనా భగ్గుమనదా

కేసరీ, ననా నన నా
నిట్టనిలువు నీడ చూస్తే
నగము సగమై ఝల్లుమనదా
కీకారణ్యం వాని స్తన్యం
కేసరొస్తే బాంచన్ అనదా

ధడ ధడ ఒకడే కేసరి
వీడికి వీడేలే సరి
తత్వమసి భగవంత్ కేసరి
వీడి కసి నిత్యం ఓ చరి

నిట్టనిలువు నీడ జూస్తే
నగము సగమై ఝల్లుమనదా
కీకారణ్యం వాని స్తన్యం
కేసరొస్తే బాంచన్ అనదా

నిట్టనిలువు నీడ జూస్తే
నగము సగమై ఝల్లుమనదా
కీకారణ్యం వాని స్తన్యం
కేసరొస్తే బాంచన్ అనదా
కేసరీ… లల లల లా



మాను మాకు పాట సాహిత్యం

 
చిత్రం: భగవంత్ కేసరి (2023)
సంగీతం: యస్.థమన్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: కీర్తన శ్రీనివాస్ 

మాను మాకు మారేడు
ఆకు మాటాడుతాంది బిడ్డా
మల్ల ఇన్నాండ్లకు
కుకు కుకు కుకు కుకు
ఇప్ప ఈత తంగేడు పూతా
ఇప్పారుతాంది బిడ్డా
ఇట్టా ఇన్నేండ్లకు
కుకు కుకు కుకు కుకు

పల్లేరు ముల్లు సూడూ
పరిసింది మల్లెరస్తా
గన్నేరు కొమ్మ జూడూ
పన్నీరు సల్లుతాందా

ఎట్ల ఉంటివానని
ఏమి తింటివానని
పొద్దుగాలే యాదికొచ్చేదీ
యాడ ఉంటివానని
యాడ పంటివానని
సందెగాలే ఆగమయ్యేదీ

నా తానకొస్తున్నావనీ
ఈ ఖాన సెపుతున్నాదీ
రెండు కండ్లతో ఒక్కసారి
నిన్ను జూడాలే
గంతకన్న నాకు దునియాలా
ఏం గావాలే
కుకు కుకు కుకు

ఉయ్యాలో ఉయ్యాలా
నా ఊపిరే నీకు ఉయ్యాలా
అవ్ మల్లా అవ్ మల్లా
నా సేతుల్తో నిన్ను మొయ్యాలా

ఉయ్యాలో ఉయ్యాలా
నా ఊపిరే నీకు ఉయ్యాలా
అవ్ మల్లా అవ్ మల్లా
నా సేతుల్తో నిన్ను మొయ్యాలా

Palli Balakrishna Thursday, October 5, 2023



చిత్రం: భార్గవ (2008)
సంగీతం: శ్రీకాంత్ దేవా 
నటీనటులు: భరత్, కాజల్ అగర్వాల్ 
దర్శకత్వం: పేరరసు 
నిర్మాతలు: జి. భరత్, ముత్యాల రాందాస్ 
విడుదల తేది: 08.03.2008



Songs List:



లోకల్ లోకల్ పాట సాహిత్యం

 
చిత్రం: భార్గవ (2008)
సంగీతం: శ్రీకాంత్ దేవా 
సాహిత్యం: వనమాలి 
గానం: కార్తీక్, సునంద

లోకల్ లోకల్ 




ఇంకొక పాట సాహిత్యం

 
చిత్రం: భార్గవ (2008)
సంగీతం: శ్రీకాంత్ దేవా 
సాహిత్యం: సాహితి 
గానం: రంజిత్, రోషిణి 

ఇంకొక 



దేవా దేవా దేవుడా పాట సాహిత్యం

 
చిత్రం: భార్గవ (2008)
సంగీతం: శ్రీకాంత్ దేవా 
సాహిత్యం: కండికొండ 
గానం: టిప్పు & కోరస్ 

దేవా దేవా దేవుడా 




ఏయ్ అంటుకుంది పాట సాహిత్యం

 
చిత్రం: భార్గవ (2008)
సంగీతం: శ్రీకాంత్ దేవా 
సాహిత్యం: వనమాలి 
గానం: రంజిత్, అనురాధ శ్రీరామ్ 

ఏయ్ అంటుకుంది 



తల్లి హృదయమే పాట సాహిత్యం

 
చిత్రం: భార్గవ (2008)
సంగీతం: శ్రీకాంత్ దేవా 
సాహిత్యం: వెన్నెలకంటి 
గానం: శ్రీరామ్ 

తల్లి హృదయమే 

Palli Balakrishna Friday, August 12, 2022


చిత్రం: ఆచార్య (2022)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: చిరంజీవి, రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే
దర్శకత్వం: కొరటాల శివ
నిర్మాత: రామ్ చరణ్
విడుదల తేది: 14.02.2022



Songs List:



లాహే లాహే పాట సాహిత్యం

 
చిత్రం: ఆచార్య (2022)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హరిత నారాయణ్, సాహితి చాగంటి

లాహే లాహేలాహేలాహే లాహే లాహేలాహేలాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

కొండలరాజు బంగరు కొండ
కొండా జాతికి అండా దండా
మద్దే రాతిరి లేచి మంగళ గౌరీ మల్లెలు కోసిందే
ఆటిని మాలలు కడతా
మంచు కొండల సామిని తలసిందే

లాహే లాహేలాహేలాహే లాహే లాహేలాహేలాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

మెళ్ళో మెలికల నాగుల దండ
వలపుల వేడికి ఎగిరిపడంగా
ఒంటి యిబూది జలజల రాలిపడంగా
సాంబడు కదిలిండే
అమ్మ పిలుపుకు సామి
అత్తరు సెగలై విలవిల నలిగిండే

లాహే లాహేలాహేలాహే లాహే లాహేలాహేలాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

నాదర్దిన్న దినదిన నాననా
నాదర్దిన్న దినదిన నాననా

కొరకొర కొరువులు మండే కళ్ళు
జడలిరబోసిన సింపిరి కురులు
ఎర్రటి కోపాలెగసిన కుంకంబొట్టు వెన్నెల కాసిందే
పెనిమిటి రాకను తెలిసి సీమాతంగి సిగ్గులు పూసిందే

ఉబలాటంగా ముందటి కురికి 
అయ్యవతారం చూసిన కల్కి
ఎందా శంఖం సూళం భైరాగేసం ఏందని సణిగిందే
ఇంపుగ ఈ పూటైనా రాలేవా అని సనువుగ కసిరిందే

లాహే లాహేలాహేలాహే లాహే లాహేలాహేలాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

లోకాలేలే ఎంతోడైన లోకువమడిసే సొంతింట్లోన
అమ్మోరు గడ్డంపట్టి బతిమాలినవి అడ్డాల నామాలు
ఆలుమగల నడుమన అడ్డంరావులే ఇట్టాంటి నియమాలు

ఒకటో జామున కలిగిన విరహం
రెండో జాముకి ముదిరిన విరసం
సర్దుకుపోయే సరసం కుదిరే వేళకు మూడో జామాయే
ఒద్దిక పెరిగే నాలుగో జాముకి
గుళో గంటలు మొదలాయే

లాహే లాహేలాహేలాహే లాహే లాహేలాహేలాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే
లాహే లాహేలాహేలాహే లాహే లాహేలాహేలాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

ప్రతి ఒక రోజిది జరిగే ఘట్టం
ఎడమొకమయ్యి ఏకం అవటం
అనాది అలవాటీళ్ళకి అలకలలోనే కిలకిలమనుకోటం
స్వయాన చెబుతున్నారు అనుబంధాలు
కడతేరే పాఠం



నీలాంబరీ పాట సాహిత్యం

 
చిత్రం: ఆచార్య (2022)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: అనురాగ్ కులకర్ణి , రమ్య బెహ్రా

నీలాంబరీ నీలాంబరీ
వేరెవ్వరే నీలా మరి
అయ్యోరింటి సుందరి
వయ్యారాల వల్లరి
నీలాంబరీ (నీలాంబరీ)

వందే చంద్ర సోదరి
వస్తున్నాను నీ దరి
నీలాంబరీ నీలాంబరీ

మంత్రాలేంటోయ్ ఓ పూజారి
కాలం పోదా చేజారి
తంత్రాలేవి రావే నారి
నేనేం చెయ్ నే నన్నారి
నువ్వే చూపాలేమో చిలిపి వలపు నగరి

నీలాంబరీ నీలాంబరీ
వేరెవ్వరే నీలా మరి
నీలాంబరీ నీలాంబరీ
నీ అందమే నీ అల్లరి

విడిచా ఇపుడే ప్రహరీ… నిన్నే కోరి
గాలాలేయకోయ్… మాటలా జాలరి
ఒళ్ళో వాలదా నాలో సిరి టెన్ టు ఫైవ్
నీతో సాగితే మాటలే ఆవిరి
అయినా వేసినా పాటతో పందిరి
అడుగేస్తే చేస్తా నీకే నౌకరి

నీలాంబరీ నీలాంబరీ
వేరెవ్వరే నీలా మరి
నీలాంబరీ నీలాంబరీ
నీ అందమే నీ అల్లరి

ధీం తోం తోం పా సరిగమప ని
ధీం తోం తోం రీ మగరిస
ధీం తోం తోం పా సరిగమప ని
ధీం తోం తోం రీ మగరిస

మెరిశా వలచే కలలో ఆరితేరి
ఇంకా నేర్చుకో చాలదోయ్ నీ గురి
నేనే ఆపినా వీడకోయ్ ఈ బరి
విడనే వీడనే… నువ్వు నా ఊపిరి
సాక్ష్యం ఉన్నదీ జీవధార ఝరి
ప్రతిజన్మ నీకే రాశా ఛోకిరి

నీలాంబరీ నీలాంబరీ
వేరెవ్వరే నీలా మరి
నీలాంబరీ నీలాంబరీ
నీ అందమే నీ అల్లరి



శాన కష్టం పాట సాహిత్యం

 

చిత్రం: ఆచార్య (2022)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కర భట్ల 
గానం: రేవంత్, గీత మాధురి

కల్లోలం కల్లోలం ఊరువాడా కల్లోలం
నేనొస్తే అల్లకల్లోలం
కల్లోలం కల్లోలం కిందా మీద కల్లోలం
నా అందం అల్లకల్లోలం

నా జడ గంటలూ ఊగే కొద్ది
ఓ అరగంటలో పెరిగే రద్దీ
ధగధగలా వయ్యారాన్ని
దాచి పెట్టేదెట్టాగా

శాన కష్టం సాన కష్టం
సాన కష్టం వచ్చిందే మందాకిని
చూసే వాళ్ళ కళ్ళు కాకులెత్తుకుపోని
సాన కష్టం వచ్చిందే మందాకిని
నీ నడుం మడతలోన జనం నలిగేపోనీ

నా కొలతే చూడాలని
ప్రతోడు టైలర్లా అయిపోతాడే
ఓ నిజంగా భలే బాగున్నాదే
నీ మూలంగా ఒక పని దొరికిందే

ఏడేడో నిమరొచ్చని
కుర్రాళ్ళే ఆర్ఎంపిలు అవుతున్నారే
హే ఇదేదో కొంచెం తేడాగుందే
నీ అబద్ధం కూడా అందంగుందే
ఇల్లు దాటితే ఇబ్బందే... ఒంపు సొంపుల్తో

శాన కష్టం, పాపం... సాన కష్టం
సాన కష్టం వచ్చిందే మందాకిని
అంటించకే అందాల అగరొత్తిని
సాన కష్టం వచ్చిందే మందాకిని
నానమ్మతో తీయించేయ్ నర దిష్టిని

ఓ యే ఓ యే ఎంగిలంది అమ్మాయో
ఓ యే ఓ యే ఎంగిలంది అమ్మాయో

హే, నా పైట పిన్నీసుని
అదేంటో విలన్లా చూస్తుంటారే
ఏ లెవెల్లో ఫోజెడుతున్నావే
మా చెవుల్లో పూలెడుతున్నావే

డాబాలే ఎక్కేస్తారే
పెరట్లో మా యమ్మే నలుగెడుతుంటే
నీ కహాని మాకెందుకు చెప్పు
మేం వింటున్నాం అని కొట్టకే డప్పు
గంప గుత్తగా సోకుల్తో ఎట్టా వేగాలో

శాన కష్టం, అరెరే... సాన కష్టం
సాన కష్టం వచ్చిందే మందాకిని
పంచాయితీలెట్టొద్ధే వద్దొద్దనీ
సాన కష్టం వచ్చిందే మందాకిని
అచ్చు బొమ్మాటాడించు యావత్తుని



భలే భలే బంజారా పాట సాహిత్యం

 
చిత్రం: ఆచార్య (2022)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: శంకర్ మహదేవన్, రాహుల్ సిప్లిగంజ్

హే సింబా రింబా సింబా రింబా 
చిరత పులుల చిందాట
హే సింబా రింబా సింబా రింబా 
సరదా బురద సయ్యాట

చీమలు దూరని చిట్టడవికి
చిరు నవ్వొచ్చింది
నిప్పు కాక రేగింది
డప్పు మోత మోగింది

కాకులు దూరని కారడవిలో
పండగ పుట్టింది
గాలి గంతులాడింది
నేల వంతపాడింది

సీకటంతా సిల్లుపడి
యెన్నెలయ్యిందియాల
అందినంత దండుకుందాం
పద దలో చెయ్యారా

భలే భలే బంజారా మజా మనదేర
రేయి కచ్చేరీలో రెచ్చి పోదాం రా (2)

చీమలు దూరని చిట్టడవికి
చిరు నవ్వొచ్చింది
నిప్పు కాక రేగింది
డప్పు మోత మోగింది

హే కొక్కొరోకో కోడె కూత
ఈ పక్క రావద్దే
అయితలెక్క ఆడేపాడే
మాలెక్క నాపొద్దే

తద్దిన దిన సుక్కల దాక లెగిసి ఆడాల
అద్దిర బన్నా ఆకాశ కప్పు అదిరి పడాల

అరిచేయి గీతకు చిక్కింది
భూగోళమ్మీయాల
పిల్లోల్ల మల్లే దాన్నట్టా
బొంగర మెయ్యాలా

భలే భలే బంజారా మజా మనదేర
రేయి కచ్చేరీలో రెచ్చి పోదాంరా (2)

నేస్తమేగా చుట్టూ ఉన్న 
చెట్టైన పిట్టైనా
దోస్తులేగా రాస్తాలోని
గుట్టహా మిట్టైన

అమ్మకుమల్లే నిన్నూ నన్ను
సాకింది ఈ వనము
ఆ తల్లీ బిడ్డల సల్లంగ జూసే
ఆయుధమే మనము

గుండెకు దగ్గరి ప్రాణాలు
ఈ గూడెం జనాలు
ఈల్ల కష్టం సుఖం
రెండిటికీ మనమే అయినోళ్లు

భలే భలే బంజారా మజా మనదేర
రేయి కచ్చేరీలో రెచ్చి పోదాం రా (2)

Palli Balakrishna Monday, April 18, 2022

 


చిత్రం: మోసగాళ్లు (2021)
సంగీతం: శ్యామ్ సి.ఎస్
సాహిత్యం: సిరాశ్రీ (సి.రామ్ శ్రీకాంత్)
గానం: ఎస్. హరిచరణ్
నటీనటులు: మంచు విష్ణు, కాజల్ అగర్వాల్, రుహీ సింగ్, సునీల్ శెట్టి, నవదీప్, నవీన్ చంద్రా
దర్శకత్వం: జెఫ్రీ గీ చిన్
నిర్మాతలు: మంచు విష్ణు, అర్. విజయ్ కుమార్
విడుదల తేది: 19.03.2021







డబ్బులు సంపాదించాలంటే
రైటు రాంగు డిస్కషనొద్దు కన్నా
స్కీమే అయినా స్కామే అయినా
రెండు ఒకటే తప్పే లేదురా అన్నా

లోకం మొత్తం డబ్బుల మూటలు 
పడి ఉన్నాయిరా బ్రదరు
దమ్మునోడు తెలివున్నాడు
ఏరుకుపోతుంటాడు
దిమాక్ తోటి, తెగింపు తోటి
డబ్బుని గెల్చుకుంటే
గెలిచినోడిని ఓడినవాడు 
మోసం అంటే ఎట్టా ఎట్టా ఎట్టా

హా... డబ్బులు సంపాదించాలంటే
రైటు రాంగు డిస్కషనొద్దు కన్నా
స్కీమే అయినా స్కామే అయినా
రెండు ఒకటే తప్పే లేదురా అన్నా

నీలాసు ఒకడికి గెయిను
నీ గేయిను ఒకడికి లాసు
ఏముంది ఇందులో ఫాల్సు
ఈ సత్యం వినరా బాసు 
బాసు బాసు బాసు







చిత్రం: మోసగాళ్లు (2021)
సంగీతం: శ్యామ్ సి.ఎస్
సాహిత్యం: సిరాశ్రీ (సి.రామ్ శ్రీకాంత్)
గానం: హేమచంద్ర

డబ్బే మనది కుమ్మెస్కో మస్తీ మస్తీ చేసేస్కో
కాస్ట్లీ మందే ఏసేస్కో ఏస్కో ఏస్కోరోయ్
కోరికలన్నీ తీర్చేస్కో నచ్చినవన్నీ తెచ్చేస్కో
రాతే నువ్వు మార్చేస్కో లైఫే నీదేరోయ్

ఆ చేతుల్లోన డబ్బేలేని కాలం దాటి పోయింది
పీకల్దాకా డబ్బుల్లోన మునిగే డేస్ వచ్చాయి
చేతిలోని జాతకరేఖ మొత్తం మారిందోయ్
ఇదే ఇదే మన టాలెంటోయ్

డబ్బే మనది కుమ్మెస్కో మస్తీ మస్తీ చేసేస్కో
కాస్ట్లీ మందే ఏసేస్కో ఏస్కో ఏస్కోరోయ్
కోరికలన్నీ తీర్చేస్కో నచ్చినవన్నీ తెచ్చేస్కో
రాతే నువ్వు మార్చేస్కో లైఫే నీదేరోయ్

ఏదేమైనా కోరు చెంత చేరు నీకు
పైసా పవరే చూడు బ్రదర్
అంబానీలు అయినా టాటా బిర్లా అయినా
దోస్తులేరా నీకు ఇదర్ ఉదర్ బ్రదర్

డబ్బే మనది కుమ్మెస్కో మస్తీ మస్తీ చేసేస్కో
కాస్ట్లీ మందే ఏసేస్కో ఏస్కో ఏస్కోరోయ్
కోరికలన్నీ తీర్చేస్కో నచ్చినవన్నీ తెచ్చేస్కో
రాతే నువ్వు మార్చేస్కో

డబ్బే మనది కుమ్మెస్కో మస్తీ మస్తీ చేసేస్కో
కాస్ట్రీ మందే ఏసేస్కో ఏస్కో ఏస్కోరోయ్

కోటల్లోనా లైఫు కోటి పైన కారు
కోరుకుంటే నీదే, పదా...
అందమైన లోకం అంతులేని సౌఖ్యం
కాళ్ళ కింద ఉంది కదా...

డబ్బే మనది కుమ్మెస్కో మస్తీ మస్తీ చేసేస్కో
కాస్ట్లీ మందే ఏసేస్కో ఏస్కో ఏస్కోరోయ్
కోరికలన్నీ తీర్చేస్కో నచ్చినవన్నీ తెచ్చేస్కో
రాతే నువ్వు మార్చేస్కో లైఫే నీదే లే (2)






Palli Balakrishna Monday, February 8, 2021




చిత్రం: రణరంగం (2019)
సంగీతం: ప్రశాంత్ పిళ్ళై, Karthik Rodriguez, సున్నీ MR
నటీనటులు: శర్వానంద్, కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శిన్
దర్శకత్వం: సుదీర్ వర్మ
నిర్మాత: సూర్య దేవర నాగ వంశీ
విడుదల తేది: 02.08.2019



Songs List:



సీత కళ్యాన వైభోగమే పాట సాహిత్యం

 
చిత్రం: రణరంగం (2019)
సంగీతం: ప్రశాంత్ పిళ్ళై
సాహిత్యం: బాలాజీ 
గానం: శ్రీహరి .కె

పవనజ స్తుతి పాత్ర ఆ..
పావన చరిత్ర ఆ..
ప్రతి సోమమర నేత్ర ఆ..
రమనీయ గాత్ర ఆ..
సీత కళ్యాన వైభోగమే
రామ కళ్యాన వైభోగమే

శుభం అనేల అక్షింతలు
అలా దీవెనలతో
అటు ఇటు జనం హడావిడి తనం
తుళ్ళింతల ఈ పెల్లి లోగిల్లలొ
పదండని బందువులొకటై
సన్నయిల సందడి మొదలై
తధాస్తని ముడులు వేసెయ్
హెయ్ హెయ్.....

సీత కళ్యాన వైభోగమే
రామ కళ్యాన వైభోగమే

దూరం తరుగుతుంటె
గారం పెరుగుతుంటె
వనికె చేతులకు గాజుల
చప్పుడు చప్పున ఆపుకొని
గడేయక మరిచిన తలుపె
వెయండని సైగలు తెలిపె
క్షనాలిక కరిగిపోవా

సీత కళ్యాన వైభోగమే
రామ కళ్యాన వైభోగమే




పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్ పాట సాహిత్యం

 
చిత్రం: రణరంగం (2019)
సంగీతం: సున్నీ MR
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: నిఖితాగాంధీ 

అడుగె నాతొ అడుగై
యేదైన నన్నే అడిగై
ఆ వానకి నువ్వె గొడుగై నాతో అడుగై
పొగిడై నన్ను పొగిడై
నీ అంతెనె పొడుగై
అయ్ తేలానె కవ్వింతై నాతొ అడుగై

నేనెవరు అని జర తెలుసుకొని
పలువిదములుగ నా వద్దకుర
సాగర తీరం సాయం సమయం
నేనెవరు అని నా వద్దకు రా

పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్
పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్
పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్

వేలా పాల లేని వేలాకోలాలన్ని
ఊగెనుగా మరి తూగెనుగా
నీల నాల లేని యెంతొ కొంత మంది
కలిసానుగా మాట కలిపెనుగా

నేనెవరు అని జర తెలుసుకొని
పలువిదములుగ నా వద్దకుర
సాగర తీరం సాయం సమయం
నేనెవరు అని నా వద్దకు రా

పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్
పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్
పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్

కలే కల కలాములా
కథే ఇక మోదలవని గమనికల
ప్రాయం పంతం మోహం మంత్రం ఏకం అయ్యిందా
కూడికలైన కోరికలైన కనులకు విందేగా

పిల్ల దేశం మారినా కొంచం వేషం మారినా
ఆడ పిల్లే మారేనా
కొంచం మాటె కలపనా కాలం నీథొ గడపన
అడుగె నీతొ సాగనా

పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్
పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్
పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్




కన్నుకొట్టి పాట సాహిత్యం

 
చిత్రం: రణరంగం (2019)
సంగీతం: Karthik Rodriguez
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: Karthik Rodriguez

కన్నుకొట్టి చూసేనంట సుందరి
సుందర్ సుందరి
మనసు మీటి వెల్లేనంట మనోహరి
మనోహరి మనోహరి

కన్నుకొట్టి చూసేనంట సుందరి
మనసు మెటి వెల్లేనంట మనోహరి
ఆ లేత కళ్ళల్లొ మునిగిపోయానేమో సుందరి
నీ చూపు సూదల్లె గుచ్చుకుందొ ఏమో మనోహరి

కన్నుకొట్టి చూసేనంట సుందరి
మనసు మీటి వెల్లేనంట మనోహరి

ల ల ల ల లా ల ల లా

You Are My Groove
You Are My Kick
You Are My Snare
And You Are My Song
You Are My Green
You Are My Blue
You Are My Peace
And You Are My Pain
You Are My Breath
You Are My Smile
You Are My Cry
An You Are My Die
You Are My Soul
You Are My Feel
You Are My Heel
And You Are My Love

వింతవొ నియంతవొ
నువ్వెవరైన నిన్నునే వరించనా
తట్టుకొ ఆకట్టుకొ
అంటోంది మనసు
రేయిలొ స్మరించనా
మొదటి సారి అద్దంలొ
నన్నైతె చూసుకున్న
నీకు నేను నచ్చానొ లేదొ అని
మట్టి పైన పడేటి
ముత్యాల వెండి వాన
ఇంకిపోద నాలోకి నీల ఇలా హలా

కన్నుకొట్టి చూసేనంట
మనసు మీటి వెల్లేనంట
కన్నుకొట్టి చూసేనంట సుందరి
మనసు మీటి వెల్లేనంట మనోహరి



ఎవరో ఎవరో పాట సాహిత్యం

 
చిత్రం: రణరంగం (2019)
సంగీతం: ప్రశాంత్ పిళ్ళై
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: ప్రీతి పిళ్ళై

ఎవరో ఎవరో నువ్వెవ్వరో
ఎవరో ఎవరో నీకెవ్వెవ్వరో
కురిసే చినుకంది నువ్వెవరో
వాలే పొద్దేమో నీకెవ్వెవ్వరో

పులకింతెవ్వరో పలికిందెవ్వరో
నీ జత ఎవరో ఎవరో ఎవ్వరో 

అడుగై నడిచేదెవ్వరో
ఓ వెలుగై నవ్వింది ఎవ్వరో
కాలం మనదే అలా
కారణమే ఉందలా
ఏకాంతమో నిశ్చాబ్ధమో
ఈ వేళలో ఎవ్వరో

పులకింతెవ్వరో పలికిందెవ్వరో
నీ జత ఎవరో ఎవరో ఎవ్వరో 

ఎవరో ఎవరో నువ్వెవ్వరో
ఎవరో ఎవరో నీకెవ్వెవ్వరో
కురిసే చినుకంది నువ్వెవరో
వాలే పొద్దేమో నీకెవ్వెవ్వరో

పదములుగా అడుగే వేసిందెవరో
పరుగులుగా ఆ గధి లేఖల ఎవరో
నును వెచ్చని వెన్నెలలో
చనువిచ్చిన చెలిమమెవరో
తొలి వేకువ జాములను
నీకై మరి మెరిసిందెవరో
వెలుగెవరో వేధంలా రా నిలిచేదెవరో

పులకింతెవ్వరో పలికిందెవ్వరో
నీ జత ఎవరో ఎవరో ఎవ్వరో 



కుమ్మెయ్ రా పాట సాహిత్యం

 
చిత్రం: రణరంగం (2019)
సంగీతం: Karthik Rodriguez
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: Karthik Rodriguez

మామ ప్రేమరా పెద్ద బాల శిక్ష రా
మొదటి రెండు పేజీలు అర్దమవదు రా
బావ వేమన విడమరచి చెప్పెరా
తినగ తినగ వేప కూడ తియ్యనవును రా
ధమ్ముంటె చెప్పెయ్ రా
నో అందా గోవిందా

పద పద పదమని అనదే
అలకల చిలకే ఇది లే
మొరవిని మనసే ఇవ్వే
మగువా తియ్యకు పరువే
ఓ సారి చింతామని
వీలేశావే రా రమ్మని
నీ చూపే విసిరెయ్ మని
మొక్కానే ఆ పైవాడిని
దండాలే పెట్టెయ్ రా
దమ్ముంటె చెప్పెయ్ రా

కూసేటి రైలింజన్ లా
వచ్చింది వీధిలోకిలా
మచ్చేమొ నడుముపై అలా
మత్తెక్కె ఇప్ప సారలా
ఓ సారి చింతామని
ఓ సారి చింతామని
వీలేశావే రా రమ్మని
నీ చూపే విసిరెయ్ మని
మొక్కానే ఆ పైవాడిని
కుమ్మెయ్ రా కమ్మెయ్ రా
దమ్ముంటె చెప్పెయ్ రా

Palli Balakrishna Saturday, July 13, 2019



చిత్రం: సీత (2019)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, సోను సూద్
దర్శకత్వం: తేజ
నిర్మాత: సుంకర రామబ్రహ్మం
విడుదల తేది: 24.05.2019



Songs List:



బుల్ రెడ్డి పాట సాహిత్యం

 
చిత్రం: సీత (2019)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: సురేంద్ర కృష్ణ 
గానం: ఉమా నేహా , తేజా, జి. సంతోష్, అమితో 

ఒంటి తీరు పాలకోవా… నడక చూస్తే హంస నావా
సోకు బరువు మోయగలవా… సాయమోస్తాం సై అనవా !!

బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి… రాజ్దూత్ మీదొచ్చే రామ్ రెడ్డి
బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి… రాజ్దూత్ మీదొచ్చే రామ్ రెడ్డి
యమహా ఏస్కోచే యాది రెడ్డి… బజాజ్ మీదొచ్చే బాల్ రెడ్డి
స్టాండైనా ఎయ్యరాళ్ళు… వచ్చాక ఆగరాళ్ళు
ఎట్టా సచ్చేదిరో పెద్ది రెడ్డి…

రెడ్డిగారి రెడ్డిగారి…
రెడ్డిగారి కుర్రోళ్ళిట్టా… రెచ్చిపోతే ఎట్టాగంట
రెడ్డిగారి కుర్రోళ్ళిట్టా… రెచ్చిపోతే ఎట్టాగంట

బుల్లెట్టు డుర్ర్ అహ… బుల్లెట్టు డుర్ర్
అరె బుల్ బుల్ బుల్… బుల్ బుల్ బుల్లెట్టు
బుల్లెట్టు మీదొచ్చే… బుల్ రెడ్డి
రాజ్దూత్ మీదొచ్చే… రామ్ రెడ్డి

హే పిల్లా..! నిన్ను చూస్తే రెచ్చిపోకుండా ఎట్టుంటాం కాని
ఇంతకీ మాకు… టులెట్ బోర్డు ఉందా లేదా ??

ఎహే… ముంబైలో మా బావ టైలర్…అబ్బ
అంటారు వాడినంత టైగర్… ఛా
పండక్కు వచ్చి నన్ను పెళ్ళాడతాను… అంటూ ప్రామిస్సు కూడా చేసినాడు

మీ బావ కొట్టాడు పంపు… ఆడేమో అట్నుంచి జంపు
మొన్నాడు పట్నంలో… మసీదు గల్లీలో
పెళ్ళాంతో పూలు కొంటున్నాడు…

మాయగాడు సచ్చినోడు… సొమ్ములన్నీ దోచేశాడు
నన్ను ఇట్టా ముంచేశాడు…
నా సొమ్ములన్నీ దోచేశాడు… నన్ను ఇట్టా ముంచేశాడు
ఓ ఓ… బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి

ఒరే ఒరే ఒరే నీ టైగర్ బావ… జంప్ అయిపోయినాడ
అయితే నువ్వు ఖాళీయే కదా..!!
లేదు… అరె పక్కింటి కుర్రాడు శీను
మా వీధిలో వాడు డాను…

నీలాంటి అందగత్తె జిల్లాలో లేదు… అంటూ రక్తంతో రాసి ఇచ్చాడు
శీనుగాడు ఎసాడు రీలు… ఆహా
వాన్ని నిన్న పంపారు జైలు… అవునా
వాడింక రాడుగాని… ఒక్కడ్ని ఎంచుకుంటే
తక్కినోళ్లం తప్పుకుంటాము…

రెడ్డిగారి రెడ్డిగారి…
రెడ్డిగారి కుర్రాళ్ళను… నే తప్పుగానే అనుకున్నాను
ముందు చూస్తే భయమేసింది… మనసు చూస్తే మతిపోయింది
ముందు చూస్తే భయమేసింది… మనసు చూస్తే మతిపోయింది
బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి…



రోల రోల పాట సాహిత్యం

 
చిత్రం: సీత (2019)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: పరోమ దాస్ గుప్తా 

రోల రోల 



కోయిలమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: సీత (2019)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: లక్ష్మీ భూపాల్
గానం: అర్మాన్ మాలిక్

కుహూ కుహూ అని కోయిలమ్మ 
తీయగ నిన్నే పిలిచిందమ్మ 
కోపం చాలమ్మా బదులుగ నవ్వకటివ్వమ్మా
ఓ ఓ కుహూ కుహూ అని కోయిలమ్మ 
తీయగ నిన్నే పిలిచిందమ్మ 
కోపం చాలమ్మా బదులుగ నవ్వకటివ్వమ్మా
ఆ నవ్వులో సిరిమల్లెలై 
పూయాలిలే నీ పెదవంచులో
ఈ పూలకి ఆరాటమే చేరాలని జడ కుచ్చిళ్ళలో
ఓ ఇంద్ర దనస్సే వర్ణాల వానై 
కురిసెను జల జల చిటపట చినుకులుగా

కూ కూ కూ కూ
కుహూ కుహూ అని కోయిలమ్మ 
తీయగ నిన్నే పిలిచిందమ్మ 
కోపం చాలమ్మా బదులుగ నవ్వకటివ్వమ్మా

ఈ చల్లగాలి ఓ మల్లెపూవై 
నిన్నల్లుకుంటూ ఆగాలి
ఆ వాన మేఘం నీ నవ్వుకోసం 
ఓ మెరుపు లేఖే రాయాలి (2)

సెలయేరు పైన జలతారు వీణ 
పలికెను గల గల సరిగమ పదనిసగ

కూ కూ కూ కూ
కుహూ కుహూ అని కోయిలమ్మ 
తీయగ నిన్నే పిలిచిందమ్మ 
కోపం చాలమ్మా బదులుగ నవ్వకటివ్వమ్మా

నీలాల నింగి చుక్కల్ని తెచ్చి 
నక్షత్రమాలే వెయ్యాలి
నీకంటి నీరు వర్షించకుండా 
దోసిల్ల గొడుగే పట్టాలి (2)

ఏ కష్టమైనా ఉంటాను తోడై 
తడబడు అడుగున జతపడి నేనున్నా

కూ కూ కూ కూ
కుహూ కుహూ అని కోయిలమ్మ 
తీయగ నిన్నే పిలిచిందమ్మ 
కోపం చాలమ్మా బదులుగ నవ్వకటివ్వమ్మా




నిజమేనా నిజమేనా పాట సాహిత్యం

 
చిత్రం: సీత (2019)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: లక్ష్మీ భూపాల్
గానం: అనురాగ్ కులకర్ణి 

నిజమేనా నిజమేనా



ఎవరది ఎవరది పాట సాహిత్యం

 
చిత్రం: సీత (2019)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: లక్ష్మీ భూపాల్
గానం: హరిచరణ్

ఎవరది ఎవరది ఎద గదిలో… తలపుల తలుపులు తెరిచినది
నిజమేనా నిజమేనా… వెతికే ప్రాణమే ఎదురైనదా..!!
అలిసైనా కలిసేనా… ఇకపై వీడని ముడి పడినదా..!!

అలనై మనసంచునా… ఇష్టంగా తల వంచనా
నీ కోసం నీ కోసం… వేచుందే ఈ ప్రాణం

నిజమేనా నిజమేనా… వెతికే ప్రాణమే ఎదురైనదా
అలిసైనా కలిసేనా… ఇకపై వీడని ముడి పడినదా… ఆ ఆ
లలలలా లలలలా లలల లాల… లాల లాల లాలా లాలా లాలా లా

Palli Balakrishna Thursday, June 27, 2019

చిత్రం: కవచం (2018)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం:చంద్రబోస్
గానం: రఘు దిక్సిత్
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహ్రీన్ పిర్జద
దర్శకత్వం: శ్రీనివాస మామిళ్ల
నిర్మాత: నవీన్ చౌదరి
విడుదల తేది: 07.12.2018

నా అడుగే పడితే ఆయుధం
మొదలవుతుంది అనునిత్యం
అని అనవసరంగా బిల్డప్ ఇవ్వను బ్రో

నే చిటికే వేస్తే భూగోళం
వెళ్ళిపోతుంది పాతాళం
అని అక్కర్లేని బిల్డప్ ఇవ్వను బ్రో

అరె వెరీ వెరీ స్పెషల్ గా
వేరే పవర్స్ ఏవీ లేవంట
హే చాలా చాలా చాలా సింపుల్ గా
లైఫ్ ని గడుపుతానే

అరె నాలా నేనే ఉంటా ఇలాగ
నచ్చిందేదో అంతా నిజంగా
చేయాల్సింది చేస్తా ఇష్టంగా
వెనకడుగేయనే

డెడికేషన్ వద్దురా
డెటెర్మినషన్ వద్దురా
చేసే పనిమీద నీకు లవ్ ఉంటే చాలురా
అటెన్షన్ వద్దురా కాన్సంట్రేషన్ వద్దురా
నీ పేరే నీ ప్రొఫెషన్ అయిపోతే అంతే చాలురా

ఇది ఫిలాసఫీ కానే కాదంట
ఫ్రీగా ఇచ్చే లెక్చర్ కాదంట
నే ఫాలో అయ్యే రూటే ఇదంట
నచ్చితే నడవరా

బెడ్రూమ్ లో అద్దమే
నా బెస్ట్ ఫ్రెండ్ రా
నా ఫీలింగ్స్ అన్నిటిని
తాను నాలా ఫీల్ అవుతుంది రా
యుద్ధంలో శత్రువే
నా బెస్ట్ గైడ్ రా
గెలిచేందుకు ఫైర్ ని పెంచి
ఇన్స్పైరే చేస్తాడు రా

ఇది సైకాలజీ థియరీ కాదంట
మెంటాలజీ స్టడీ కాదంట
నా ఐడియాలజీ ఇదే లెమ్మంటా
నమ్మితే నమ్మరా

Palli Balakrishna Tuesday, January 15, 2019




చిత్రం: MLA (2018)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: కళ్యాణ్ రామ్ , కాజల్ అగర్వాల్
దర్శకత్వం: ఉపేంద్ర మాధవ్
నిర్మాతలు: భరత్ చౌదరి , కిరణ్ రెడ్డి
విడుదల తేది: 23.03.2018



Songs List:



మోస్ట్ వాంటెడ్ అబ్బాయి పాట సాహిత్యం

 
చిత్రం: MLA (2018)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: యాజిన్ నజీర్ , రమ్య బెహ్రా

ఓయ్ అర్మాని స్యూట్ ఆడిదాస్ బూట్
అదిరే నీ కటౌట్ మస్తుగున్నదే
బాపురే బలే స్వీట్ బెల్జియం చోక్లెట్
ఫ్యుజ్ లే పేలిపోయేట్టు గుంజుతున్నాయే
అరిటాకు సోకుల్నే అటూ ఇటుగా
అల్లుకోర పిల్లడ త్వర త్వరగా గది దాటేసి గలబ చేసి
సిగ్నల్ ఇచ్చినావే సిగ్గు సిగతరగా

మోస్ట్ వాంటెడ్ అబ్బాయి
మోగించు డోలు సన్నాయి
ఐ వాంట్ బూస్ట్ బుజ్జాయి
వాస్తు సూపర్ అమ్మాయి
వయసు పీచు మిఠాయి
కొసరి కానుకిచ్చేయి

పిల్లగాడు పాట పటాసే
పిల్ల సోకు జక్క జకాసే
ఎక్ ధమ్ జోడియే క్లాసే
అంటుకుంది క్రేజీ రొమాన్స్

ఓయ్ అర్మాని స్యూట్ ఆడిదాస్ బూట్
అదిరే నీ కటౌట్ మస్తుగున్నదే

ప్రిడ్జిలోన దాచిపెట్టుకున్న
పూత రేకు నోటపెట్టుకోన
మండుటెండలోన మంచుముక్కలగా కరిగిపోనా
టచ్ ప్యాడ్ లాంటి బుగ్గపైన
ముచ్చటేసి ముద్దు పెట్టుకోనా

మోస్ట్ వాంటెడ్ అబ్బాయి
మోగించు డోలు సన్నాయి
ఐ వాంట్ బూస్ట్ బుజ్జాయి
వాస్తు సూపర్ అమ్మాయి
వయసు పీచు మిఠాయి
కొసరి కానుకిచ్చేయి

పిల్లగాడు పాట పటాసే
పిల్ల సోకు జక్క జకాసే
ఎక్ ధమ్ జోడియే క్లాసే
అంటుకుంది క్రేజీ రొమాన్స
రోజా లిప్స్ నట్టా రౌండ్ తిప్పి
ఫుల్ సౌండ్ ముద్దులిచ్చుకివే
సిగ్గు బారికేడ్స్ తెంచుకున్న ఈడు స్పీడైంది

బాడీలైన్పూలబంతి లాగా
గుండెమీదకొచ్చి గుచ్చుకోవే
అత్తగారి హౌస్ ఆల్ గేట్స్ తీసి వెల్కమ్ అంది

నీ మాటల్లో మన పెళ్లి బాజా
DJ మిక్స్ లోన మోత మోగుతుంది

మోస్ట్ వాంటెడ్ అబ్బాయి
మోగించు డోలు సన్నాయి
ఐ వాంట్ బూస్ట్ బుజ్జాయి
వాస్తు సూపర్ అమ్మాయి
వయసు పీచు మిఠాయి
కొసరి కానుకిచ్చేయి

ఓయ్ అర్మాని స్యూట్ ఆడిదాస్ బూట్
అదిరే నీ కటౌట్ మస్తుగున్నదే

బాపురే బలే స్వీట్ బెల్జియం చోక్లెట్
ఫ్యుజ్ లే పేలిపోయేట్టు గుంజుతున్నాయే
అరిటాకు సోకుల్నే అటూ ఇటుగా
అల్లుకోర పిల్లడ త్వర త్వరగా గది దాటేసి గలబ చేసి
సిగ్నల్ ఇచ్చినావే సిగ్గు సిగతరగా

మోస్ట్ వాంటెడ్ అబ్బాయి
మోగించు డోలు సన్నాయి
ఐ వాంట్ బూస్ట్ బుజ్జాయి
వాస్తు సూపర్ అమ్మాయి
వయసు పీచు మిఠాయి
కొసరి కానుకిచ్చేయి



హేయ్ ఇందూ పాట సాహిత్యం

 
చిత్రం: MLA (2018)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రాహుల్ సిప్లిగంజ్

సన్నజాజి నిను చూస్తే ఫైటింగు చేస్తాదే చిన్నదానా హేయ్ చిన్నదానా 
చందమామే ఎదురొస్తే బ్రేక్ అప్పు వేస్తాదే చిన్నదానా హేయ్ చిన్నదానా 
బ్యూటీలో నువ్ ఎవరెస్టువే భూమి మీదే నువ్ బెస్టులే 
ఊహకందని ఓ టిస్టువే నిన్ను దాచిన ఈ కల్లే ఎన్నడు మూయనులే 

హేయ్ ఇందూ ఓ ఇందూ సిరాకు పడకే నువు ముందూ 
ఓ ఇందూ నా ఇందూ ఇద్దరముకటే మునుముందూ 

సన్నజాజి నిను చూస్తే ఫైటింగు చేస్తాదే చిన్నదానా హేయ్ చిన్నదానా 
చందమామే ఎదురొస్తే బ్రేక్ అప్పు వేస్తాదే చిన్నదానా హేయ్ చిన్నదానా 

హల్లో అంటావంటే సెల్లు ఫోనై పుట్టేస్తానే 
కల్లోకొస్తానంటె సూర్యుద్ నే జో కొట్టేస్తానే 
సోలో లైఫ్ రందుకే నాలో హాఫ్ అవ్వవే 
పిల్లో ఫోస్ ఎందుకే దిల్లో ప్లేస్ ఇవ్వవే 
పక్కనుంటే నువు చాలే ప్రపంచమే వాలే 

హేయ్ ఇందూ ఓ ఇందూ సిరాకు పడకే నువు ముందూ 
ఓ ఇందూ నా ఇందూ ఇద్దరముకటే మునుముందూ 

ఎక్కిల్లే నీ కొస్తే తలచినోడ్నే తన్నేస్తా 
పైనోడే పవరిస్తే నీ మైండ్ నాపై మల్లిస్తా 
నీతో నీడే ఉంటుందే ఓ పూటే 
నా ద్యాసే నీ వెంటే తిరిగే డే అండ్ నైటే 
తిక్కపిల్ల నీ కెట్టా చెప్తే ఎక్కుతదే 

హేయ్ ఇందూ ఓ ఇందూ సిరాకు పడకే నువు ముందూ 
ఓ ఇందూ నా ఇందూ ఇద్దరముకటే మునుముందూ 


హేయ్ ఇందూ ఓ ఇందూ సిరాకు పడకే నువు ముందూ 
ఓ ఇందూ నా ఇందూ ఇద్దరముకటే మునుముందూ




గర్ల్ ఫ్రెండ్ పాట సాహిత్యం

 
చిత్రం: MLA (2018)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అనురాగ్ కులకర్ణి

All the best అందీ బుజ్జి హార్టు బీటూ 
దూసుకెల్లిపోతా ఇంకెందుకంత లేటూ 
ఓరిదేవుడో నువ్వూ ఎంత కుట్ర చేశావూ 
ఉన్నా చోట ఉన్నా నా జిందగీని కలిఓఅవూ 
చలొ పడి పడి త్వరపడి ఎగబడి చెబుతా 
Thanks a lot నీకూ 
అరరరే  గర్ల్ ఫ్రెండ్  గర్ల్ ఫ్రెండ్  నచ్చింది నాకు గర్ల్ ఫ్రెండ్ 
అరరరే గర్ల్ ఫ్రెండ్  గర్ల్ ఫ్రెండ్  నచ్చింది నాకు గర్ల్ ఫ్రెండ్ 
అరరరే గర్ల్ ఫ్రెండ్  గర్ల్ ఫ్రెండ్  నచ్చింది నాకు 
అరరరే గర్ల్ ఫ్రెండ్  గర్ల్ ఫ్రెండ్  నచ్చింది నాకు 

ఆరో సెన్సు అపుడే అంది తను నాకు సోల్ మేట్ అనీ 
హార్ట్ వీల్స్ పైన స్వారీ చేస్తు కదిలింది నా కలల జర్నీ 
మనసంతా ట్రాఫిక్ జాం ఏం చేస్తు ఉన్నా 
రోజంతా తన మాటే అల్లోచిస్తున్నా 
ఎన్నో ఎన్నో హరికేలి జంట కూడీ 
నా పై దూకి చేస్తుంటె ప్రేమ దాడీ 
ఆ తలవని తలపుల ఋతుపవనాలకు పులకరించిపోయా 

అరరరే  గర్ల్ ఫ్రెండ్  గర్ల్ ఫ్రెండ్  నచ్చింది నాకు గర్ల్ ఫ్రెండ్ 
అరరరే గర్ల్ ఫ్రెండ్  గర్ల్ ఫ్రెండ్  నచ్చింది నాకు గర్ల్ ఫ్రెండ్ 
అరరరే గర్ల్ ఫ్రెండ్  గర్ల్ ఫ్రెండ్  నచ్చింది నాకు 
అరరరే గర్ల్ ఫ్రెండ్  గర్ల్ ఫ్రెండ్  నచ్చింది నాకు 

ఊరూ పేరు ఏమో గాని ఏదైతె ఏముందిలే 
తీరూ తెన్ను బలె బాగుంది నచ్చిందిలే అందువల్లే 
బంగారం మనసంటూ అంటే విన్నానూ 
ఆ మాటే మనిషైతే తానే అంటానూ 
కొలతే లేనీ ఎత్తుల్లొ తేలిపోయా 
దిగిరాలేని మత్తుల్లొ ఉండిపోయా 
నన్నెవరని అడిగితె ఈ క్షనమున నా పేరు మరచిపోయా 

అరరరే  గర్ల్ ఫ్రెండ్  గర్ల్ ఫ్రెండ్  నచ్చింది నాకు గర్ల్ ఫ్రెండ్ 
అరరరే గర్ల్ ఫ్రెండ్  గర్ల్ ఫ్రెండ్  నచ్చింది నాకు గర్ల్ ఫ్రెండ్ 
అరరరే గర్ల్ ఫ్రెండ్  గర్ల్ ఫ్రెండ్  నచ్చింది నాకు 
అరరరే గర్ల్ ఫ్రెండ్  గర్ల్ ఫ్రెండ్  నచ్చింది నాకు 





యుద్దం యుద్దం పాట సాహిత్యం

 
చిత్రం: MLA (2018)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అనురాగ్ కులకర్ణి

నెడే వెలిగిద్దాం సంక్రాంతి కాంతుల సంద్యా దీపం 
యుద్దం యుద్దం యుదానికి సిద్దం 
ఈ నాడే తొలగిద్దాం జగాన మిగిలిన చీకటి మొత్తం 
యుద్దం యుద్దం యుదానికి సిద్దం 
ఒక మంచి పని తలకెత్తుకునీ 
తగడాలతొ తలపడదాం 
విధివంచితులా తలరాతలకు చిరు నవ్వులు చూపెడదాం 
మన సాయం మనమే మన సైన్యం మనమే 
గెలుపొందే దెపుడూ పోరాడే గుణమే 
తడి బారిన చెంపలు తుడిచేద్దం తక్షనమే 
యుద్దం యుద్దం యుదానికి సిద్దం 
యుద్దం యుద్దం యుదానికి సిద్దం 

నెడే వెలిగిద్దాం సంక్రాంతి కాంతుల సంద్యా దీపం 
యుద్దం యుద్దం యుదానికి సిద్దం 
యుద్దం యుద్దం యుదానికి సిద్దం 

సై అన్నదీ ధర్మాగ్రహం 
సంకల్పమే వజ్రాయుదం 
కల్లునెత్తి ఎక్కీ నెత్తికెక్కి తొక్కే కండకావరాలు ఎన్నాల్లూ 
వొల్లు కొవ్వెక్కీ పేద గొంతు నొక్కీ ఆ రాచకాలు ఇంక చాలు చాలూ 
చలి చీమలన్ని చేరీ విషనాగుల మదమనచాలీ 
ఇన్న్ల్ల దౌర్జన్యాన్నీ నిలదీసి నిరసించాలీ 
ఎలుగెత్తే వరకూ దండెత్తే వరకూ 
గుర్తించడు యెవడు మన నెత్తుటి ఉడుకూ 
నీ ఊపిరికర్దం ఉద్యమమే కడవరకూ 
యుద్దం యుద్దం యుదానికి సిద్దం 
యుద్దం యుద్దం యుదానికి సిద్దం 

కన్నీల్లకూ గుంతున్నదీ 
కష్టాలకూ చెల్ అన్నదీ 
బానిసతమే పౌరుసత్వమంటూ బలిసినోడు తిప్పితుంటే మీసం 
ఈ జనం కింతే నంటూ ఆ మాటనొప్పుకుంటూ నీకు నువ్వు చేసుకోకు మోసం 
పిడికిల్లు బిగిశాయంటే సంకెల్లు చెల్లా చెదురే 
గడి దాటి కదిలారంటే బలహీనులైనా పులులే 
భయపడుతూ ఉనటే భయపెడూతునటారే 
పడి ఉంటామంటే పడగై కాటెస్తారే 
ఇక తెగబడితే మన జోలికి యెవరూ రారే 
యుద్దం యుద్దం యుదానికి సిద్దం 
యుద్దం యుద్దం యుదానికి సిద్దం 

నెడే వెలిగిద్దాం సంక్రాంతి కాంతుల సంద్యా దీపం 
యుద్దం యుద్దం యుదానికి సిద్దం 
యుద్దం యుద్దం యుదానికి సిద్దం 
యుద్దం యుద్దం యుదానికి సిద్దం 
యుద్దం యుద్దం యుదానికి సిద్దం 

Palli Balakrishna Tuesday, March 20, 2018


చిత్రం: ఆటాడిస్తా (2008)
సంగీతం: చక్రి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: సూరజ్ జగన్
నటీనటులు: నితిన్ , కాజల్ అగర్వాల్, జయసుధ , నాగబాబు, శివప్రసాద్
దర్శకత్వం: ఎ. యస్. రవికుమార్ చౌదరి
నిర్మాతలు: సి.కళ్యాణ్, యస్. విజయానంద్
బ్యానర్:
విడుదల తేది: 20.03.2008

స్టైల్.. స్టైల్.. స్టైల్.. స్టైల్.. (2)

పంచె లోన పవరే అది ఉన్నవాడనే స్టైలే
పంచి ఇచ్చెమనసే కలిగున్నవాడినే స్టైలే
ప్రోబ్లేమ్స్ తో ఫ్రెండ్షిప్ చేస్తూ
డేంజర్ తో స్టెప్స్ వేస్తూ
స్టైలిష్ గా స్మైలే ఇస్తే స్టైల్ స్టైల్...
ఎవ్వడైనా ఎక్కడైనా
దిక్కరిస్తే నేనే అటాడిస్తా
నవ్వుతూనే వాడ్ని అటాడిస్తా

స్టైల్.. స్టైల్.. స్టైల్.. స్టైల్.. (2)

బ్రాస్లెట్ కాదు రిస్ట్ వాచ్ కాదు
హెల్ప్ చేసే హ్యాండే సూపరు
వాలు కళ్ళు కాదు చేపకళ్ళు కాదు
జాలి ఉన్న కళ్ళే సూపరు
ట్రెండులెన్నో మారుతున్నా
ఫ్యాషనంటే పడి చస్తున్నా
ట్రెడిషనేది మారని వాడిదే   స్టైల్.. స్టైల్..
పాలరాయి ప్యాలస్ ఉన్నా
స్విమ్మింగ్ ఫూల్ లో పన్నీరు ఉన్నా
ముగ్గు వేసే కల్చరుంటే స్టైల్.. స్టైల్..

ఎవ్వడైనా ఎక్కడైనా
దిక్కరిస్తే నేనే అటాడిస్తా
నవ్వుతూనే వాడ్ని అటాడిస్తా

స్టైల్.. స్టైల్.. స్టైల్.. స్టైల్.. (2)

షర్ట్ కి షర్ట్ కి మధ్య గాప్ లుంటే ఓకే
హార్ట్ కి హార్ట్ కి మధ్య గాప్ నో
హ్యాండ్ ను హ్యాండు ను తాకే టచ్చింగ్ ఉంటే ఓకే
లిప్ కి లిప్ టచ్చింగ్  నో నో
3 స్టార్ లో లంచ్ చేసుకో
5 స్టార్ లో డిన్నర్ చేసుకో
ముద్దపప్పులో ఆవకాయే స్టైల్.. స్టైల్..
పబ్బులోన మగ్గే వేసుకో
క్లూబ్లో న బెగ్గే తీసుకో
కోనసీమ కొబ్బరి వాటర్ స్టైల్.. స్టైల్..

ఎవ్వడైనా ఎక్కడైనా
దిక్కరిస్తే నేనే అటాడిస్తా
నవ్వుతూనే వాడ్ని అటాడిస్తా

స్టైల్.. స్టైల్.. స్టైల్.. స్టైల్.. (2)

Palli Balakrishna Wednesday, February 21, 2018


చిత్రం: నాపేరు శివ (2010)
సంగీతం: యువన్‌శంకర్‌రాజా
నటీనటులు: కార్తి, కాజల్ అగర్వాల్
కథ, మాటలు ( డైలాగ్స్ ) , స్క్రీన్ ప్లే, దర్శకత్వం:  సుసీంద్రన్
నిర్మాతలు: యస్. ఆర్. ప్రకాష్ , ఎస్.ఆర్.మధు
సినిమాటోగ్రఫీ:
ఎడిటర్:
బ్యానర్:
విడుదల తేది: 20.08.2010


చిత్రం : నాపేరు శివ (2010)
సంగీతం : యువన్‌శంకర్‌రాజా
సాహిత్యం: సాహితి
గానం : హరిచరణ్

పల్లవి:
వెన్నెల చేతపట్టి తేనా పిండి బొమ్మ చేసి ఈనా
ఓహో ఆటలాడుదాం
పాటపాడుదాం చంద్రవంక పైన
నింగికి వెయ్యి నిచ్చెనలు
మేఘము చెయ్యి మాలికలు
వెల్‌కమ్ కడదాం చెలిమితో పై మెట్లు (2)

చరణం: 1
రేయి చూసి బెదురేలా వేదనెంతో పడనేలా
చీకటి లేక ఈ లోకాన జాబిలి అందం తెలిసేనా
కలలు నమ్ముకోనేలా కరుగు వేళ వగపేలా
కలలో పూచే పూవులు అన్నీ
చేతిలో మిలమిల మెరిసేనా
ఆ నింగికి మల్లే ఓ బంధం
మబ్బులు కమ్మిన ఎద మౌనం
కలిసొచ్చే రోజున వలపై రాదా
ప్రియమౌ అనుబంధం

చరణం: 2
కలత చెందు ఒక నిమిషం
గడిచిపోతే సంతోషం
నిలువున జ్వాలై మండేటపుడే
దీపపు వెలుగుకు ఉత్సాహం
కడలిలోన నది ఐక్యం
ఉనికి విడిన ఉప్పు గుణం
చినుకే ఐనా వానగ మారి
చివరికి కాదా మణిముత్యం
ఈ జీవితమన్నది ఓ వలయం
విశ్రాంతెరుగని ఓ స్వప్నం
అది మొదలే లేని ముగియని కథనీ
పొందకు దుఃఖాన్ని


*******  ******  ******


చిత్రం: నాపేరు శివ (2011)
సంగీతం: యువన్‌శంకర్‌రాజా
సాహిత్యం: సాహితి
గానం: కార్తీక్


పల్లవి:
మనసే గువ్వై ఎగిసేనమ్మో
చెలిమి మాటే వినపడగా
పసిపాపల్లే తడబడినానే నీ చూపెదనే తాకంగా
ఎద నాడే చేజారే నీ చెయ్యే నన్ను సోకగా
మంచల్లే కరిగేనే ఈ గాలే నాపై వీచగా
అయ్యయ్యో ప్రేమే పుట్టెనే
అది అణగని ఆశై పట్టెనే
నా ఎదలో ఏదో మెరుపై మెరిసి తలుపే తట్టేనే
కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతేచాలు
నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతేచాలు

చరణం: 1
చెంతకొచ్చి నువు నిలవడం నిన్ను కలిసి
నే వెళ్లడం అనుదినం జరిగెడి ఈ నాటకం
ఒక సగాన్ని చెప్పేయడం మరు సగాన్ని
దాపెట్టడం తెలిసెలే తెలిసెలే కారణం
కాలాలు పూచెలే వేగాలు వేచెలే
కలువా నీ కాటుక కన్నుల చూపులు
గారడి చేసేలే

చరణం: 2
నా కంటికి ఏమైనదో రేయంతా
ఎరుగదు కునుకును
ప్రియా నువు లేనిదే నీ లేను ఓవ్ ఓహో
నా మీద నీ సువాసన ఏనాడో వీచగ కోరెను
ఎలా నిను చేరక బతికేను ఓవ్ ఓహో
నా ఇరు కళ్లకే ఓ హరివిల్లువే
నీ విరిసే నవ్వులే ఎదలో పూల జల్లులే


Palli Balakrishna Friday, February 2, 2018


చిత్రం: వీర (2011)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: కార్తిక్ , గీతామధురి
నటీనటులు: రవితేజ , కాజల్ అగర్వాల్ , తాప్సి పన్ను
దర్శకత్వం: రమేష్ వర్మ
నిర్మాత: ఇందుకూరి గణేష్
విడుదల తేది: 20.05.2011

ఓసి నా చిట్టీ చిట్టీ ముద్దులే పెట్టీ పెట్టీ
మూడే రప్పిస్తున్నావే
నువ్వు నా గల్లా పెట్టీ గుండెలో గంటే కొట్టి
మోతే మోగిస్తున్నావే

చలో మరి చెయ్యెసుకో నా మీద
మడతేశాక నాతో మరి ప్రమాదాన్నే పర్లేదా
అరె నిన్ను చూసి దిల్లే ఇట్టా దూకేస్తున్నాదే
నీ బొటా బొటి నడుము బలేగుందే

నా కొంగే ఇలా పచ్చ జండా ఊపేస్తున్నాదే
ఈ దూకుడుకు ఊపుడు బండి నీదే

ఓసి నా చిట్టీ చిట్టీ ముద్దులే పెట్టీ పెట్టీ
మూడే రప్పిస్తున్నావే

నన్ను ఎగబడమని ఎదురుగ పడి అందం గిల్లేస్తుందే
ఇక త్వరపడమని తడి పెదవుల తేలే కుట్టేస్తుందే

నిన్ను వదలను అని వయుసుని సెగ రాట్నం తిప్పేస్తున్నాదే
నా అడుగడుగున చలిపిడుగుల తాపం చంపేస్తుందే

పొగిడేసి పడి పడి నీకే మొక్కుతా
నీ బుగ్గే నొక్కుతా నీ మొగ్గే తొక్కేస్తా

శివ శివ కాశీ చిటపటలేంటో చూసేస్తా
నీ వెంటే వచ్చేస్తా

అరె నిన్ను చూసి దిల్లే ఇట్టా దూకేస్తున్నాదే
నీ బొటా బొటి నడుము బలేగుందే

నా కొంగే ఇలా పచ్చ జండా ఊపేస్తున్నాదే
ఈ దూకుడుకు ఊపుడు బండి నీదే

నీ సొగసుల పొడి చిటికెడు పడి
మైకం కమ్మేస్తుందే
నీ కులుకుల ఉలి గది గది గది గుండె చెక్కుతుందే

కొసమెరుపుల ఘని గునపంవలె
చూపే తవ్వేస్తుందే
కసి ముదిరెను కద పదమని
ఈడే దొర్లేస్తున్నాదే

అదిరిందే
పిట పిట మిర్చి మసాలా
నీ నవ్వే  వాంఛలా నా సిల్క్ రుమాల

రుచిమరిగిందే మరి మరి కావాలందే
నీ మీదే పడేలా నా మదే చెడేలా

అరె నిన్ను చూసి దిల్లే ఇట్టా దూకేస్తున్నాదే
నీ బొటా బొటి నడుము బలేగుందే

నా కొంగే ఇలా పచ్చ జండా ఊపేస్తున్నాదే
ఈ దూకుడుకు ఊపుడు బండి నీదే

Palli Balakrishna Sunday, November 26, 2017


చిత్రం: వివేకం (2017)
సంగీతం: అనిరుధ్ రవిచందర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సత్యప్రకాష్, షాషాతిరుపతి
నటీనటులు: అజిత్, కాజల్ అగర్వాల్, అక్షర హసన్, వివేక్ ఒబేరాయ్
దర్శకత్వం: సిరుతై శివ
నిర్మాత: త్యాగరాజన్
విడుదల తేది: 24.08.2017

ఆనందమానందం ఆనందమే
ఒక్కోక్షణం నీతో అద్భుతమే
సరసాలు రాగాలు ఆనందమే
సరిపోని బింకాలు అద్భుతమే
కనుల నిండా కలల నిండా ఉంది నీవేలే
ఊపిరైనా ఊపిరల్లే ఉంది నీవల్లే
నా యీ జీవితం నీదే మరేదీ కోరికే లేదే
స్వయానా నువ్వుగా ప్రేమేఇలా నను కోరి చేరిందే

ఆనందమానందమానందమే
ఒక్కోక్షణం నీతో అద్భుతమే
సరసాలు రాగాలు ఆనందమే
సరిపోని బింకాలు అద్భుతమే

ఒక నువ్వు పక్కనుంటే చాలునంటానే
స్వర్గమైనా నరకమైనా మరచిపోతానే
అర ముద్దులొ చలిమల్లెపూవై నలిగిపొతాలే
తెల్లారి పొద్దులో నీ గుండెగువ్వై ఒదిగిపోతాలే
నీవు నేను ఒక్కరె అనీవేళ చాటాలే
చంటి పాపై జననమై మన ప్రేమ వెలగాలే

ఆనందమానందం ఆనందమే
ఆనందమానందం ఆనందమే
ఆనందమానందం ఆనందమే

Palli Balakrishna Tuesday, November 21, 2017


చిత్రం: లక్ష్మీ కళ్యాణం (2007)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్ , మణిశర్మ (బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్)
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: నిహాల్, ప్రాణవి
నటీనటులు: కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ (తొలిపరిచయం)
దర్శకత్వం: తేజ
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 15.02.2007

అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా
అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా
అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా
అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా

అవుననుకో గోరువంకా అలుసిచ్చాను కనుక
జరిగింది తెలుసుకోక నాపై నింద లేయక
నీకేమీ ఊసుపోక నాదే నేరమనక
నిజమంతే వాదించక....

అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా
అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా

ఓ కన్ను మూసి చూస్తున్నట్టు ఉంది
నా ఒంటి నడక నాకే నచ్చకుంది
నాతోనే నాకు గొడవయ్యినట్టు వుంది
నా నుంచి నేనే వేరయ్యినట్టు వుంది
ఊరుకోలేను చేరుకోలేను మనసిలా ఎందుకుంది
మూగనేకాను మాటకాలేను ఎమిటవుతున్నది...

అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా
అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా

నాతోట పువ్వే నాపై కోపమంటే
ఈ ప్రాణమింకా వున్నా లేనిదంతే
నాలోని సగమే నాకే దూరముంటే
ఏ సందడైనా మనసే నవ్వదంతే
చిలిపి జగడాన్ని పెంచుకున్నను నేస్తమా తప్పు నాదే
చెలిమి విరహాన చేదు చూసాను పంతమా ఆగవే...

అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా
అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా
నీకేమీ ఊసుపోక నాదే నేరమనక
నిజమంతే వాదించక...

Palli Balakrishna Thursday, November 16, 2017

చిత్రం: అదిరింది (2017)
సంగీతం: ఎ. ఆర్.రెహమాన్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: ఎ. ఆర్.రెహమాన్, శ్రేయఘోషల్
నటీనటులు: విజయ్ , సమంతా, కాజల్ అగర్వాల్, నిత్యామీనన్
దర్శకత్వం: అట్లీ
నిర్మాతలు: యన్. రామసామి, హేమ రుక్మిణి
విడుదల తేది: 09.11.2017

నీవేలే నీవేలే గుండెల్లో నిండే శబ్దం
సడి ఏదైనా నీవే అర్ధం
నీవేలే నీవేలే గుండెల్లో నిండే శబ్దం
సడి ఏదైనా నీవే అర్ధం
ఈ సాయంకాలం మొత్తం ఏకాంతం పంచే శబ్దం
ఇది నువ్వునేను మాత్రం వినుకనిదయా

నీవేలే నీవేలే కళ్ళల్లో తుళ్ళే బింబం
నా కళ్ళలో చిలికే కుంభం
వెన్నెల్లో ముంచే సంద్రం అనురాగం పంచే సంద్రం
నీవేలే నకీవేలలో ఆనందం

యార్చే  యార్చే యార్చే  యార్చే యార్చే  యార్చే
తనసొగసే యామార్చే
యార్చే  యార్చే యార్చే  యార్చే యార్చే  యార్చే
తన పలుకే ఓదార్చే

నీవేలే నీవేలే గుండెల్లో నిండే శబ్దం
సడి ఏదైనా నీవే అర్ధం
ఈ సాయంకాలం మొత్తం ఏకాంతం పంచే శబ్దం
ఇది నువ్వునేను మాత్రం వినుకనిదయా

యాలే యాలే యాలే యాలే యాలే యాలే యాలే యాలే
నువ్వుంటే అది చాలే
యాలే యాలే యాలే యాలే యాలే యాలే యాలే యాలే
ఇంకేమి అక్కర్లే

నీవేలే నీవేలే గుండెల్లో నిండే శబ్దం
సడి ఏదైనా నీవే అర్ధం
ఈ సాయంకాలం మొత్తం ఏకాంతం పంచే శబ్దం
ఇది నువ్వునేను మాత్రం వినుకనిదయా


*******  ******  *******


చిత్రం: అదిరింది (2017)
సంగీతం: ఎ. ఆర్.రెహమాన్
సాహిత్యం: శ్రీమణి
గానం: నరేష్ అయ్యర్, విశ్వనాధ్ ప్రసాద్ , జి.వి.ప్రకాష్ కుమార్

వచ్చినాడు చూడు విల్లు విల్లు
ఒహ్ నవ్వులెక్కపెట్టి పూలే చల్లు
ఏయ్ పాత బాజాలింక చెల్లు చెల్లు
చెల్లు చెల్లు లే బ్రదరు బ్రదరు
ఇక ఊరు వాడ సందల్లు వారం నిండా
సరదాలు దలపతి వెదర అదరా
ఏయ్ సిటీ రాని పోరడు కూడా
ఈలే కొట్టే గోలే అదిరే
రెక్కలు విరిచి మక్కెలు విరిచి
మంచే పంచే అస్సలు సిస్సలు రాజా
ఎయ్ రా రా రాజ

మనసే మెరుపా
మీసం తిప్పడో పిచ్చ గెలుపా
కొత్త స్టెప్పే వెసేలా
వీడి రాకే సుపర్ రా
చూపు మల్లె తీగ కత్తి షాకురా

కత్తి తీసి ప్రాణం పోసె ఏకైక స్వామి రా
ఎవ్వరేమన్న జగ్గం మా రాతలు నేసె మగ్గం
నువ్వే మా దీమ
పసోడి నవ్వుకన్న తెల్లనైన మనసురా

ఎదురే చెల్లు చెల్లు
వెదరే అదిరెనే
ఎదురే చెల్లు చెల్లు
వెదరే అదిరెనే
ఎదురే చెల్లు చెల్లు
వెదరే అదిరెనే
చెల్లు చెల్లు అదిరెను రా
అదిరె అదిరె
హెయ్ ఆడ్రా ఆడ్రా ఆడ్రా ఆడ్రా

మనిషి అంటేనె అర్దం సాయం
డబ్బు అంటేనె మాయా మర్మం
రాత దాటి చూడు కాస్తా
ఉత్త పేపరు రా
ఒంగి దండాలు పెట్టకు నువ్వు
లొంగ నివ్వకు నీ చిరు నవ్వు
మంచి మనసే పంచి ఇస్తూ
మనిషివైపోరా

పాషమేసి ప్రేమించావా
చెయ్యి కలిపీ తోడుంటా
ప్రాణమేసి బతికించావా
కంటి పాపై కాస్తుంటా

ఏయ్ సిటీ రాని పోరడు కూడా
ఈలే కొట్టే గోలే అదిరే
రెక్కలు విరిచి మక్కెలు విరిచి
మంచే పంచే అస్సలు సిస్సలు రాజా
ఎయ్ రా రా రాజ

మనసే మెరుపా
మీసం తిప్పడో పిచ్చ గెలుపా
కొత్త స్టెప్పే వెసేలా
వీడి రాకే సుపర్ రా
చూపు మల్లె తీగ కత్తి చాకురా

ఎదురే చెల్లు చెల్లు
వెదరే అదిరెనే
ఎదురే చెల్లు చెల్లు
వెదరే అదిరెనే
ఎదురే చెల్లు చెల్లు
వెదరే అదిరెనే
చెల్లు చెల్లు అదిరెను రా
ఏయ్ ఆడ్రా ఆడ్రా ఆడ్రా ఆడ్రా


*******  ******  *******

చిత్రం: అదిరింది (2017)
సంగీతం: ఎ. ఆర్.రెహమాన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: కైలాష్ కెహర్, సత్యప్రకాష్ , దీపక్, పూజా ఎ. వి

చెట్టు దిష్టీ బిడ్డ దిష్టీ
చుట్టూ ఇరుగు పొరుగూ దిష్టీ
చిన్నీ మహారాజా వీడే
హారతివ్వండే
హెయ్ నిన్నే కన్న నేలె నీకూ
వేసెనంట వెన్నెల దండే

ముద్దు ముద్దు మాటల్లోనా పొంగాలంట బంగరం
జన్మ భూమి కోసం బ్రతుకే చెయ్యాలంటా బహుమానం
కన్నవారి పేరె నువ్వు నిలపాలంటా కలకాలం
నిన్ను చూసి నక్షత్రంలా నవ్వలంటా భూగోలం

పాలించరా పిల్లోడా వీర భూమిని
ప్రేమించరా పిల్లొడా పుణ్య భూమిని
ప్రేమె మన బాషని ఎద గోషని ఎలుగెత్తాలి
ప్రేమించే జాతిని ఘన కీర్తిని ఘనతెత్తాలి

వీచె వీచె గల్లుల్లో ఉంది మంచితనమే
పొంగే పొంగే నిల్లల్లో ఉంది గ్ననం పెంచే గుణమే
పడుచు కుర్రొడికైన పండు ముసలోడికైనా
రక్తం లోనే నిండెనంటా రాజసమే

ఓ సోదరా రా రా మనచూపులో పిలుపుంది
ఓ సోదరా రా రా మనచెతిలో గెలుపుంది
అచ్చుల అచ్చం గా అల్లులా అల్లరిగా
కలిసుండె వర్నాలం వెలుగొందె వేగాలం

హెయ్ అన్న అంటె అన్నం పెట్టి ప్రాణాలైనా ఇస్తాం
ఏరా అంటే సైరా అంటు ఎగిరి ఎగిరి తంతాం
కాదు అంటె అవుతుందంటు అయ్యేలాగ చేస్తాం
కారం తీపి రెండు మేమె ఇష్టంగానె చూస్తాం

మన బాషే అతి ప్రాచీనం మనదే లేరా ఆదునికం
బాషే బలహీనం ఐతే బందం కాదా బలహీనం
మాత్రు బాషను మ్రుతులో సైతం కలవాలే

ముద్దు ముద్దు మాటల్లోనా పొంగాలంట బంగరం....కలవాలే
జన్మ భూమి కోసం బ్రతుకే చెయ్యాలంటా బహుమానం.....కలవాలే
కన్నవారి పేరె నువ్వు నిలపాలంటా కలకాలం.....కలవాలే
నిన్ను చూసి నక్షత్రంలా నవ్వలంటా భూగోలం

సరాగాల రాగం లాగ
సమీరాల తీరం లాగ
కిరణాల హారం లాగ
ఇలా నన్ను వరించీ
హ్రుదయములో నువ్వు నిలదించావే
సుగందాల గీతం లాగా

ముద్దు ముద్దు మాటల్లోనా పొంగాలంట బంగరం....తియ్యగా
జన్మ భూమి కోసం బ్రతుకే చెయ్యాలంటా బహుమానం
కన్నవారి పేరె నువ్వు నిలపాలంటా కలకాలం
నిన్ను చూసి నక్షత్రంలా నవ్వలంటా భూగోలం

పాలించరా పిల్లోడా వీర భూమిని
ప్రేమించరా పిల్లొడా పుణ్య భూమిని
ప్రేమె మన బాషని ఎద గోషని ఎలుగెత్తాలి
ప్రేమించే జాతిని ఎద కీర్తిని ఘనతెత్తాలి


ఓ సోదరా రా రా మనచూపులో పిలుపుంది
ఓ సోదరా రా రా మనచెతిలో గెలుపుంది
అచ్చుల అచ్చం గా అల్లులా అల్లరిగా
కలిసుండె వర్నాలం వెలుగొందె వేగాలం



Palli Balakrishna Friday, November 10, 2017


చిత్రం: బ్రదర్స్ (2012)
సంగీతం: హరీష్ జైరాజ్
సాహిత్యం: వనమాలి
గానం: విజయ్ ప్రకాష్ , కార్తీక్ , హరిణి
నటీనటులు: సూర్య , కాజల్ అగర్వాల్, ఇషా శార్వాణి
దర్శకత్వం: కె. వి.ఆనంద్
నిర్మాత: బెల్లంకొండ సురేష్
విడుదల తేది: 12.10.2012

రాని నన్నీ మేని కొంచం తాకి బోణీ చెయ్యని
ఏ హవ రాని నన్నీ మేని కొంచం తాకి బోణీ చెయ్యని
మనసే నీమీదే కానీ నువ్వే లేని నేనేం కానని
నువు దూరం అయితే భాదని కలిసుంటే ముళ్ళే పువ్వని
నీ దాసుడ్లాగ మారని నను నేనే ఆరా తియ్యనీ..

రానీ రానీ నిను మేఘంలాగా రానీ
కానీ కానీ ఈ దాహం అంతం కానీ
పోనీ పోనీ నే నాతో వేరై పోనీ
కొంచం కొంచం పంచే ప్రేమనీ...

ఏ రాని నన్నీ మేని కొంచం నాలో నేనే దాచని
మనసే నీమీదే  కానీ నువ్వే లేని నేనేం కానని
నువు దూరం అయితే భాదని కలిసుంటే ముళ్ళే పువ్వని
నీ దాసీలాగ మారని నను నేనే ఆరా తియ్యనీ..

రానీ రానీ నీ మేఘంలాగా రానీ
కానీ కానీ ఈ దాహం అంతం కానీ
పోనీ పోనీ నే నాతో వేరై పోనీ
కొంచం కొంచం పంచే ప్రేమనీ...

ఒక వేకువల్లే నువ్వస్తుంటే
పరుగాపి చిరుగాలి చలి కాసుకోదా ఓ నిమిషం
కన్నుల్లో స్వప్నమే చూపిస్తూ నీ ప్రేమే చాలంటూ
మనసేమో చేసే సావాసం

ఓ పాట ఈ తనకేగ మధురం సుఖమైన తరుణం
మునిగింది మాయల్లో హృదయం
నడవకే తనువేమొ కరిగే నీ వైపు జరిగే
మరి కాస్త మరి కాస్త నీదవ్వదా
ఒడిలో ఒదుగు తొలి ప్రేమ పూజలకు

రాని నన్నీ మేని కొంచం తాకి బోణీ చెయ్యని
మనసే నీమీదే  కానీ నువ్వే లేని నేనేం కానని
నువు దూరం అయితే భాదని కలిసుంటే ముళ్ళే పువ్వని
నీ దాసీలాగ మారని నను నేనే ఆరా తియ్యనీ..

నను వీడి వెళ్ళగా ఓ స్నేహం హృదయంలో ఈ శోకం
చిరు ముళ్ళై గుచ్చిందే నిత్యం
హో మది నేడు ఒంటరై పోతుంటే నా కనులు నీరవగా
తన కంట ఏదో సంతోషం
నీ సొగసే మెరిసేటి వేళల్లో నా రూపంలో  ఎవరో
నిను తాకుతుంటే చూశాలే
నా గుండెలో మృతిలేని ఆరాటం మృదువైన భూకంపం
నన్నేమి చేస్తున్న చిరు ఆనందం
సత్యం స్వప్నం సరిపోల్చు తరుణమిది

రాని నన్నీ మేని కొంచం తాకి బోణీ చెయ్యని
మనసే నీమీదే కానీ నువ్వే లేని నేనేం ఏలహా
నువు దూరం అయితే భాదని కలిసుంటే ముళ్ళే పువ్వని
నీ దాసీలాగ మారని నను నేనే ఆరా తియ్యనీ..

రానీ రానీ - నీ మేఘంలాగా రానీ
కానీ కానీ - ఈ దాహం అంతం కానీ
పోనీ పోనీ - నే నాతో వేరై పోనీ
కొంచం కొంచం పంచే ప్రేమనీ...

Palli Balakrishna Wednesday, October 18, 2017


చిత్రం: పౌరుడు (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల 
గానం: రంజిత్
నటీనటులు: సుమంత్ , కాజల్ అగర్వాల్
దర్శకత్వం: రాజ్ ఆదిత్య
నిర్మాత: డి.సుప్రియ
విడుదల తేది: 13.01.2008

చల్‌రే చల్‌రే చెలరేగాలి దునియా మొత్తం దున్నెయ్యాలి
బరిలో దిగితే గెలిచెయ్యాలి అప్పుడే కదరా సరదావిలువైన
కొద్ది కాలాన్ని వదలొద్దం కాళ్ళతన్ని విజయంతో పొంది
పతకాన్ని ఎక్కెయి అందలాన్ని కలకన్నది మిగలొద్దురా
కలలా నీ నసీబు నీ చేతిలో ఉందిరో నువ్వు దిమాకు పెట్టేసి
యోచించరో ధమ్‌ ధమ్‌కే బోలో భజవానుగోతమ్‌ ||చల్‌రే||

గెలుపున్నది ఒక్కసారిగా కలగదు కదా నేరుగా
మనసెడితే ఏకదాటిగా మార్గం వెతుకొచ్చుగా
దొరికిన అలలను తెరచిన కనులతో కదలిక నిలబడి చూడు
పదపద పదమని ఓటమి తగదని పడినా లేవక పోదు
అదరకు బెదరకు దొరికిన దొదలకు అలుపని అరవకు బాసు
అలజడి తడబడి పొరబడి అడుగులు వెనకకి వేస్తే దాసు

చెలిమన్నది తోడులేనిదే బ్రతుకెంతటి భారమో
మనసున్నది ఇవ్వడానికే ఎందుకు మోహమాటమో
అదరకు అనకురా అడిగిన తడవగా కలిగిన సాయముచేద్దు
నలుగురు నడిచి నలిగిన దారిలో నువ్వు నడిచెయ్యెద్దు
జరిగిన దిదియని తరుచుగా తలవకు పదిలెయ్‌ వెళ్ళిన నేను
పెదవుల ప్రమిదలు చిరు చిరునవ్వుల దివ్వెలు యు డోంట్‌ మిస్సు 


********   ********   *********


చిత్రం: పౌరుడు (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హేమచంద్ర , ఉష

నీ పక్కనుంటే పగలే వెన్నెల నేనెక్కడుంది గురుతే రాదెలా
నా నిదురను దోచావే కల ఉవ్వాహు ఉవ్వాహు ఉవ్వాహు
మైకంలో ప్రేమా స్వాగతం నీ పేరే హద్దుకు శ్లోకం
I Love You సంయుక్తతా వెబ్‌సైటుకి నువ్వే లౌక్యం
నువ్వు స్టైలిస్తే నీ ఫ్యాషన్‌ నువ్వంటే నే ఎట్రాక్షన్‌ యుసోప్‌
బాయ్‌ ఐ బాడ్‌ బాయ్‌ ఐ ఎవ్రిడే లవ్‌ సన్‌షై సన్‌షై

నాలోని మనసును కలుసుకున్నా కలలు కన్నా కలలుకన్నా
నేనే నన్నెవరని అడుగుతున్నా తెలుసుకున్నా తెలుసుకున్నా
ఇన్నాళ్ళు నీడలో దాగున్నది ఆలోచన నీ వల్లే ఈ నిజం
విన్నావని నే నమ్మనా ప్రేమంటే కలిసున్నా అది నీలోనే చూసున్నా
ఏ ఎండావాన ఎందుకే నువ్వే నా ఎవ్రి సీజన్‌
నే పుట్టిందంటూ ఎందుకే నీ నవ్వే ఓన్ని రీజన్‌
నువ్వేమో రంగుల ప్యూచన్‌ వితేయుసో కన్‌ఫ్యూషన్
మేరె ధన్‌మన్‌ జానే మన్‌ మీరే దిల్‌కి తుహి దడకన్‌ దడకన్‌

నీ రోజా సొగసుకు పరవశమే పంచిందెవరే పంచిందెవరే
లేలేత పెదవికి ఎరుపునలా పెంచిందెవరే పెంచిందెవరే
ఏమో ఏరోమియో పూబాణమో ఏమోమరి
నీ కైనా తెలుసునా ఈ నాడిలా అవుతుందని
ప్రేమంటే వింతేలే ప్రేమిస్తే ఇంతేలే నా గూబుల్‌ కళ్ళ సర్చ్‌
లోనీ ప్రేమెక ఎన్నోవేషన్‌ నీ బబ్లీ బుగ్గలో టచ్‌లో
అయిపోనా హల్వా మెడిసన్‌ నీ బ్యూటి నా కొక ఫ్యాషన్‌
మై ఓన్లి న్యూ సన్‌సేషన్‌ మై ఓషన్‌ లవ్‌ ఓషన్‌ మై లవ్లీ లవ్లీ కాజ్‌బ్రేషన్


********   ********   *********


చిత్రం: పౌరుడు (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: సుచిత్ర

అమ్యామియా ఆంక్‌ మారొమియా హే నీతోటి బోల్డంత
పని ఉందయ్యా నచ్చారయ్యా నాచో నా చోరయ్యా ఏ
దిల్‌మాంగె‌ మోరంది దేదోనయ్యా కళ్ళను చూస్తే నిప్పులు
గుర్తుకు రావాలయ్యా అరె చేతులు చప్పున విరిసాయంటే
ఉరితాడయ్యా ముందోనుయ్యా వెనుకోగొయ్యా పారిపోయే
దారి లేదు లొంగిపోరా తస్సాదియ్యా 

దిల్లే కదా అనిహింసించితే అది పంతం కొద్ది పంజావిప్పే
పులి అవ్వదా చినుకే కదా అని అనుకోకుండా అవకాశం
చూసి వరదై నిన్నే ముంచెయ్యదా తలచించి ఉన్నోడు తల
ఎత్తివచ్చాడు తలతీసేపోతాడు ఇక ఊరుకోడు తన శత్రువే
తన లక్ష్యం ఇక యుద్ధమే కదా తద్యం ఆ దేవుడొచ్చినా ఆ
పలేడురా పట్టలేని ఆవేశం 

అందం అనే ఒక ఆనందమై వీడిప్పటి దాకా ఎప్పటిలాగా
ఉన్నాడురా ఆ బంధమే నువ్వు తెంచెయ్యగా ఇక తప్పని
సరిగా తాడో పేడో తేల్చేయడా నా కెందుకో అనుకుంటూ
న్యాయంగా వెళుతుంటే అన్యాయం ఆగేనా అడుగడు
గునా ఆరోషమే కదా అస్త్రం తన ధైర్యమే కదా పత్రం యాడ
దాగినా వీడి చేతిలో రాసి ఉందిరా నీ అందం 


********   ********   *********


చిత్రం: పౌరుడు (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: పెద్దడ మూర్తి
గానం: రాహుల్ నంబియర్ , రీటా

అందాలనే అందిస్తా వయ్యారమే వడ్డిస్తా నీకే నా కంచం
మంచం పంచిస్తా కావాలనే కలిపిస్తా రావాలనే రప్పిస్తా
ఇంకొంచెం కొంచెం కొంచెం కొసరిస్తా అన్నీ బాగా చూసుకో
నామీదే చెయ్యెవేసుకో ఏం కావాలో తీసుకో ఏం చెయ్యాలన్నా
చేసుకో చీకు చింత మానుకో చీకట్లో చెంత చేరుకో
ముద్దంటే చేదా ఇయ్యరాదా ఆ అనుభవ మంటూ లేదా పోని
ఇప్పుడైనా నేర్పేదా సరేలే అంటే సరిపోదా 

తొందరలే చూశా మరి ముందడుగే వేశా చెలి కోరిందిస్తా చెయ్యందిస్తాలే
మల్లికలా పూచా మరి అందుకనే వేచా ఒక సాయం హాయని పిస్తాలే
కావాలనుకుంటే ఇవ్వాళే నీ తికమక తీరుస్తాలే
వద్దొద్దంటున్నా వస్తాలే ఆ చెకుముకి రాజేస్తాలే

ఆశలనే చూశా చెలి ఆగడమే చూశాపిలిచే పెదవుల్లో మీగడ తీస్తాలే
ఆగడమే లేని చెలరేగడమై వస్తే బిగి కౌగిళిలోని సగమై పోతాలే
అల్లాడే ఈడే ఈనాడే ముద్దుల్లో లాలిస్తాలే
అల్లర్లే చేసే కుర్రోడా ఒళ్ళోనే చోటిస్తాలే 


********   ********   *********


చిత్రం: పౌరుడు (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: వేణు, ఉష

సాల్సా ఇద సాల్సా హై క్లాసు డాన్సు సాల్సా
హంస కలహంస ఈ డ్రిల్ పేరు డాన్సా
సాల్సా మాసాల్సా నీ వల్ల కాదు తెల్సా
స్టెప్సా అవి ఫిట్సా మాకెందుకింత హింసా
నోటికొచ్చినట్టు పిచ్చి కామెంట్సా
అరె ఉన్నమాటి చెప్పుకుంటె ఫీలింగ్సా
నిను బొట్టుపెట్టి పిలిచినట్టు జోలికొచ్చి ఏంటిరభసా
మాతో పెట్టుకోకు మాతో రెచ్చిపోకు పిచ్చికా మేంతీర
మారత్తుకుంటే తోకే ముడుచుకోవాపిచ్చుకా

షర్టు కొంచెం మడిచికట్టి నాలుకిట్టా మడతపెట్టి దుమ్ము రేపే బస్తీలే మావిలే
ఒకటి రెండు లెక్కపెట్టి బీటుమీద మనస్సుపెట్టి స్వింగు చెయ్యడం ఈజి కాదులే
చాల్లే బడాయేలే నైసు పాపా ఊరికేలడాయేలా పట్టుకోకా
యాలో కలేజాలు ఓర్చలేకా ఏవోకహానీలు చెప్పమాకా
గల బాకులోకి గయ్యమంది రామ రామ మీరా మేమా 

టింగురంగా ఇంగ్లీషు ఎంగిలాట లెందుకంటా కింగు లాంటి మాస్టైలే నేర్చుకో
ఊర నాటు చిల్లరాట అంత సీనులేనిదంటూ బీరపాంటు మేళాలే మానుకో
లోకల్ డాన్సు మీకులోకువెందుకే ఫారన్ జాబుమీద
మొజా దేనుకో వెస్టెన్ టేస్టులోని ఎక్కువేమిటో మేడిన్ ఆంధ్రకబ్నా తక్కువేమిటో
నీ బ్రైను వాషు చాలు చాలు వెస్ట్‌టేస్టు మాదేననుకో 

Palli Balakrishna Thursday, September 14, 2017




చిత్రం: బ్రహ్మోత్సవం (2016)
సంగీతం: మిక్కీ జే. మేయర్ 
నటీనటులు: మహేష్ బాబు, సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత
దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
నిర్మాతలు: ప్రసాద్ వి. పొట్లూరి, మహేష్ బాబు
విడుదల తేది: 20.05.2016



Songs List:



వచ్చింది కదా అవకాశం పాట సాహిత్యం

 
చిత్రం: బ్రహ్మోత్సవం (2016)
సంగీతం:  స్టీఫెన్ దేవాస్సి (రి రికార్డింగ్ : మిక్కీ జే. మేయర్)
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అభయ్ జోద్పుర్కర్

వచ్చింది కదా అవకాశం 



మధురం మధురం పాట సాహిత్యం

 
చిత్రం: బ్రహ్మోత్సవం (2016)
సంగీతం:  స్టీఫెన్ దేవాస్సి (రి రికార్డింగ్ : మిక్కీ జే. మేయర్)
సాహిత్యం: ట్రెడిషనల్
గానం: పద్మ , శ్రీదేవి

అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురం
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్
మధురం మధురం మధురం మధురం

అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురమ్
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్
మధురం మధురం మధురం మధురం

వచనం మధురం చరితం మధురం
వసనం మధురం వలితం మధురమ్
చలితం మధురం భ్రమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్
మధురం మధురం అఖిలం మధురమ్
మధురం మధురం అఖిలం మధురమ్



బ్రహ్మోత్సవం పాట సాహిత్యం

 
చిత్రం: బ్రహ్మోత్సవం (2016)
సంగీతం:  స్టీఫెన్ దేవాస్సి (రి రికార్డింగ్ : మిక్కీ జే. మేయర్)
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శ్రీరాంచంద్ర మన్యంపాటి

బ్రహ్మోత్సవం 




ఆట పాటలాడు పాట సాహిత్యం

 
చిత్రం: బ్రహ్మోత్సవం (2016)
సంగీతం:  స్టీఫెన్ దేవాస్సి (రి రికార్డింగ్ : మిక్కీ జే. మేయర్)
సాహిత్యం: శ్రీకాంత్ అడ్డాల
గానం: కార్తీక్

ఆట పాటలాడు



నాయుడోళ్ళింటికాడ పాట సాహిత్యం

 
చిత్రం: బ్రహ్మోత్సవం (2016)
సంగీతం: మిక్కీ జే. మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రమ్యా బెహ్రా , అంజనా సౌమ్య

నాయుడోళ్ళింటికాడ నల్లతుమ్మ చెట్టు కాడ
నాయుడెమన్నడె పిల్లా...
అబ్బ ఎంత వింతగున్నావే పిల్లా..
నాయుడోళ్ళింటికాడ నల్లతుమ్మ చెట్టు కాడ
నాలుగు కోళ్ళు ఇచ్చాడే నాయుడు
అబ్బ గుండె జల్లుమన్నాదే పిన్నీ...
కరణం గారి ఇంటీ కాడ
కారుమునగ చెట్టు కాడ
కాముడేమన్నాడే పిల్లా...
ఒహొ కాముడేమన్నాడే పిల్లా..
కరణం గారి ఇంటీ కాడ
కారుమునగ చెట్టు కాడ
కాసులపేరు ఇస్తాన్నాడమ్మ..
ఓ కాసులపేరు ఇస్తాన్నాడమ్మ...
మునుసుబు గారి ఇంటీ కాడ
ముందర దర్వాజు కాడ
ఆతాడేమన్నాడే పిల్లా..

ఓ ఆతాడేమన్నాడే పిల్లా..
మునుసుబు గారి ఇంటీ కాడ
ముందర దర్వాజూ కాడ

ముక్కుపుడకలు ఇస్తాన్నాడమ్మ..
ముక్కుపుడకలు ఇస్తాన్నాడమ్మ...

ముంతంత కొప్పు మీద
మూడు చేమంతి పూలు
ఏ రాజు పేట్టాడే పిల్లా..
అబ్బ ఎంత చక్కగున్నావే పిల్లా..
చేమంతి పువ్వులు చెంగులోన తానేట్టీ
కోరి కోరి పిలిచాడే నాయుడు
అబ్బ గుండె దడ దడ ఆడె పిన్నీ...
కాసులపేరు ఏసుకోని
కాలవగట్టు ఎల్తుంటే
పానిపట్టు పట్టాడే నాయుడు
అబ్బ గుండె జల్లుమన్నాదే పిన్నీ...
మాయమ్మ తమ్ముళ్లు
మాకు మేన మామలు..
గుబ్బ గొడుగులవారు..
కిర్రు చెప్పులవారు..
చేతి కర్రలవారు..
వార కన్నులవారు..
వయ్యారి నడకవారు...
ఏతొవనున్నారో..
రవికేసుకో పమిటేసుకో..
పంచడిలో మంచమేసుకో..
వాకిట్లో దీపమెట్టుకో...
రాకపోతే కేకెసుకో...



బాల త్రిపురమని పాట సాహిత్యం

 
చిత్రం: బ్రహ్మోత్సవం (2016)
సంగీతం:  స్టీఫెన్ దేవాస్సి (రి రికార్డింగ్ : మిక్కీ జే. మేయర్)
సాహిత్యం: కృష్ణ చైతన్య 
గానం: రాహుల్ నంబియార్

బాల త్రిపురమని



Put Your Hands Up పాట సాహిత్యం

 
చిత్రం: బ్రహ్మోత్సవం (2016)
సంగీతం:  స్టీఫెన్ దేవాస్సి (రి రికార్డింగ్ : మిక్కీ జే. మేయర్)
సాహిత్యం: కృష్ణ చైతన్య 
గానం: శ్రావణ భార్గవి

Put Your Hands Up

Palli Balakrishna Saturday, August 19, 2017



చిత్రం: సారొచ్చారు (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: రవితేజ, కాజల్ అగర్వాల్, రిచా గంగోపాధ్యాయ
దర్శకత్వం: పరశురాం
నిర్మాత: ప్రియాంక దత్
విడుదల తేది: 21.12.2012



Songs List:



Made for each other పాట సాహిత్యం

 
చిత్రం: సారొచ్చారు (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: దేవి శ్రీ ప్రసాద్

Made for each other




జగ జగ జగదేకవీర పాట సాహిత్యం

 
చిత్రం: సారొచ్చారు (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: వేణు, రనైనా రెడ్డి

జగ జగ జగదేకవీర



రచ్చ రంబోల పాట సాహిత్యం

 
చిత్రం: సారొచ్చారు (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: జేవేద్ అలీ, రీటా

రచ్చ రంబోల




గుస గుస పాట సాహిత్యం

 
చిత్రం: సారొచ్చారు (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: సాగర్, సునీత

గుస గుస




కాటుక కళ్ళు పాట సాహిత్యం

 
చిత్రం: సారొచ్చారు (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఖుషి మురళి, శ్వేతా మోహన్, చిన్న పొన్ను

పల్లవి:
సిన్నదాని సూపుల్లో చిక్కినాడు సూరీడు 
పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు చందురుడు
నవ్వలేని సూపుల్లోన ఏదో గుట్టుంది గుట్టుంది
హో సూడలేని నవ్వుల్లోన ఏదో బెట్టుంది బెట్టుంది 

కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో
మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో 
చెప్పేయ్వా ఓ పిల్లా చెప్పేయ్వా 
గాజుల ఘల్లు గాజుల ఘల్లు ఏమన్తున్నాదో
గుట్టుగ రేగిన గుండెలో జల్లు ఏమంతున్నాదో
చెప్పేయ్వా ఓ పిల్లా చెప్పేయ్వా 

నా గుండెల్లో పండగ తెచ్చావే 
నా గాజుల్లో సడిపెంచావే 
నా పూవుల్లో రారమ్మయ్యావే
నా కళ్ళలో నీరై నువ్వే జారావే

కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో
మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో 
చెప్పేయ్వా ఓ పిల్లా చెప్పేయ్వా 

సిన్నదాని సూపుల్లో చిక్కినాడు సూరీడు 
పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు చందురుడు
నవ్వలేని సూపుల్లోన ఏదో గుట్టుంది గుట్టుంది
హో సూడలేని నవ్వుల్లోన ఏదో బెట్టుంది బెట్టుంది 

చరణం: 1
చిన్ని చిన్ని పాదాలు చిట్టి చిట్టి అందెళ్లు
చిందే చిందే రాగాలన్నీ ఏమంటూన్నాయో
హో నువ్వే నువ్వే నా జంటా నీతో స్నేహం చాలంటా 
వేరే వద్దు ఆరే అడుగులు నడవాలన్నాయే
చిటికేసే చేతులలో గోరింట ఎరుపే ఏమంటుందో 
కలకాలం కాకుండా క్షణకాలం చెలిమై 
చేయ్ కలిపేస్తే  చాలంది

కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో
మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో 
చెప్పేయ్వా ఓ పిల్లా చెప్పేయ్వా 

చరణం: 2
ఓ ముద్దు ముద్దు అందంలో ముద్దుగుమ్మ రూపంలో 
ముత్యం లాంటి ముక్కుపుడక ఏమంటున్నాదో
హో ముక్కెర పైన మెరుపల్లె బుగ్గెర చుట్టూ సిగ్గల్లె 
ముక్కెర కింద ఊపిరి నువ్వైవుంటే చాలంది

గలగలలా నాలాగే గుసగుసగా చెవిలో ఏమంటుందో 
నీ పలుకే పాటలకే నీ బదులే వింటూ ఇక ఏమాటా విననంది 

కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో
మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో 
చెప్పేయ్వా ఓ పిల్లా చెప్పేయ్వా  చెప్పేయ్వా

సిన్నదాని సూపుల్లో చిక్కినాడు సూరీడు 
పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు చందురుడు
నవ్వలేని సూపుల్లోన ఏదో గుట్టుంది గుట్టుంది
హో సూడలేని నవ్వుల్లోన ఏదో బెట్టుంది బెట్టుంది 

Palli Balakrishna

Most Recent

Default