Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Pallakilo Pellikuthuru (2004)




చిత్రం: పల్లకిలో పెళ్ళికూతురు (2004)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
నటీనటులు: గౌతమ్, రతి
దర్శకత్వం: సుచిత్ర చంద్రబోస్
నిర్మాత: ప్రసాద్ దేవినేని
విడుదల తేది: 30.07.2004



Songs List:



పల్లకిలో పెళ్ళికూతురు పాట సాహిత్యం

 
చిత్రం: పల్లకిలో పెళ్ళికూతురు (2004)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు, చిత్ర

చంపకు చుక్కను పెట్టి పాదాలకి పారాణి పూసి
చేతికి గాజులు వేసి కస్తూరి నుదుట దిద్ది ముత్యానికి ముస్తాబే చేసి
మా హృదయాలను బోయిలుగా మలచిన ఈ పల్లకిలో

పల్లకిలో...

పల్లకిలో పెళ్ళికూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది
రాణి గారికి సిగ్గుల వచ్చే రాజుగారికి చిరునవ్వొచ్చే
ఈ ఇద్దరి పెళ్ళికి ఆనందం అతిధిగా వచ్చే
పల్లకిలో పెళ్ళికూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది

మా గూటిలో ఎదిగిన బంగరు బొమ్మా
బంగరు బొమ్మా బంగరు బొమ్మా 
మా నీడలో వెలిగిన వెన్నెల బొమ్మా
వెన్నెల బొమ్మా  వెన్నెల బొమ్మా 
పరిమళాల గంధపు బొమ్మా సున్నితాల గాజు బొమ్మా
పుట్టినింట లేతబోమ్మా మెట్టినింట సీతవమ్మా
ఈ బొమ్మని అత్తింటికి పంపించే ఆనందంలో మాటరాని బొమ్మలమయ్యాము
మాటరాని బొమ్మలమయ్యాము

పల్లకిలో పెళ్ళికూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది

నా పెళ్ళిలో అతిధులు మీరేకదా
అతిధులంటే దేవుళ్ళనే అర్ధం కదా
ఈ పందిరి మీ రాకతో మందిరమే అయ్యింది
నాపై మీ చల్లని చూపే వరముల వరదయింది
ఈ అతిధి దేవుడు ఆ దేవుణ్ణే కోరేది సౌఖ్యాంగా నువ్వుండాలని
నీ బ్రతుకంతా బాగుండాలనీ...

పల్లకిలో పెళ్ళికూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది
రాణి గారికి సిగ్గులు వచ్చే రాజుగారికి చిరునవ్వొచ్చే
ఈ ఇద్దరి పెళ్ళికి ఆనందం అతిధిగా వచ్చే





స ఒక చినుకు పాట సాహిత్యం

 
చిత్రం: పల్లకిలో పెళ్ళికూతురు (2004)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చక్రి, గంగ 

స ఒక చినుకు 




ముద్దు లేని ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: పల్లకిలో పెళ్ళికూతురు (2004)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: కళ్యాణి మాలిక్, సుమంగళి 

ముద్దు లేని ప్రేమ 




నా పేరు చెప్పుకోండి పాట సాహిత్యం

 
చిత్రం: పల్లకిలో పెళ్ళికూతురు (2004)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: సునీత ఉపాద్రష్ట

చిత్రం: పల్లకిలో పెళ్ళికూతురు (2004)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: సునీత ఉపాద్రష్ట

నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా 
నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా 
చల్లగాలి, చందమామ, మల్లెతీగ, చిలకమ్మ, మీలో ఒకరైనా
నా పేరు చెప్పుకోండి 
నా  నా  నా పేరు చెప్పుకోండి

కవిత, సరిత , మమత, నిఖిత, రెండు జళ్ళ సీత
ప్రతిమ, ఫాతిమ, మహిమా, ఉమ, సత్యభామ
నీలిమేఘాలతోటి ఆడుకుంటాను గాని
నా పేరు నీలిమ కాదు
అన్ని రాగాలబాణి పాడుకుంటాను గాని
నా పేరు రాగిణి కాదు
బంగారమంటి మనసుంది గాని నా పేరు కనకం కాదు
భోగాలు పంచే సొగసుంది గాని నా పేరు భాగ్యం కాదు
హొ హొ హ్హో....హొ హొ హొ హ్హొ.....
ఓటమంటు వొప్పుకోను విజయను కాను వొట్టిమాట చెప్పలేను సత్యను కాను
మీ ఊహకే వదిలేస్తున్నాను ఊహను కాను.. కల్పన కాను

నా పేరు,  నా నా  నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా
నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా
 
చిన్ని చెక్కిళ్ళలోనా కొన్ని గులాబిలున్న నా పేరు రోజా కాదు
అన్ని పుష్పాలు చేరి నను అర్చించుతున్న నా పేరు పూజిత కాదు
ఏ కన్ను సోకని కన్యను ఐనా నా పేరు సుకన్య కాదు
అమవస చీకటి అంటదు ఎపుడు నా పేరు పూర్ణిమ కాదు
హొ హొ హ్హో....హొ హొ హొ హ్హొ
బోలేడంత జాలి ఉంది కరుణను కాను
అంతులేని పేరు ఉంది కీర్తిని కాను
మీరే మీరే తేల్చాలండి మీరా నసలే కానే కాను

నా పేరు చెప్పుకోండి  
నా  నా  నా పేరు చెప్పుకోండి
మీలో ఎవరైనా  నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా ..
చల్లగాలి  చందమామ  మల్లెతీగ  చిలకమ్మ మీలో  ఒకరైనా
నా పేరు  రాణి  రాణి  రాణి



చీరలోని గొప్పతనం తెలుసుకో పాట సాహిత్యం

 
చిత్రం: పల్లకిలో పెళ్ళికూతురు (2004)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఎమ్.ఎమ్.కీరవాణి

చీరలోని గొప్పతనం తెలుసుకో
ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో
సింగారమనే దారంతో చేసింది చీర
ఆనందమనే రంగులునే అద్దింది చీర
మమకారమనే మగ్గంపై నేసింది చీర

చీరలోని గొప్పతనం తెలుసుకో
ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో

చరణం: 1
మడికట్టుతో నువ్వు పూజచేస్తే గుడి వదిలి దిగివచ్చును దేవుడు
ఎంకి కట్టుతో పొలం పనులు చేస్తే సిరిలక్ష్మిని కురిపించును పంటలు
జారుకట్టుతో పడకటింట చేరితే గుండె జారి చూస్తాడు పురుషుడు
నిండు కట్టుతో నువ్వు నడిచెళుతుంటే దండాలే పెడతారు అందరూ
అన్నం తిన్న తదుపరి నీ మూతిని తుడిచేది
కన్నీరై ఉన్నప్పుడు నీ చెంపను తడిమేది
చిన్న చీరకొంగులోన కన్నతల్లి ఉన్నది
 
చీరలోని గొప్పతనం తెలుసుకో
ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో

చరణం: 2
పసిపాపలా నిదురపోయినప్పుడు అమ్మ చీరే మారేను ఊయలగా
పువ్వై నువ్వు విచ్చుకున్నప్పుడు ఈ చీరేగా అందాలకు అడ్డుతెర
గాలి ఆడకా ఉక్కపోసినప్పుడు ఆ పైటేగా నీ పాలిట వింజామర
ఎండా వాన నీకు తగిలినప్పుడు ఆ కడకొంగే నీ తలపై గొడుగు
విదేశాల వనితలకు సారె పోసి పంపేది
భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది
మన జాతీయ జెండాకు సమానంగా నిలిచేది
 
చీరలోని గొప్పతనం తెలుసుకో
ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో
సింగారమనే దారంతో చేసింది చీర
ఆనందమనే రంగులనే అద్దింది చీర
మమకారమనే మగ్గంపై నేసింది చీర

చీరలోని గొప్పతనం తెలుసుకో
ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో




నువు 'ప్రే' నేను 'మా' పాట సాహిత్యం

 
చిత్రం: పల్లకిలో పెళ్ళికూతురు (2004)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఎస్.పి.బి.చరణ్ , నిత్య సంతోషిని 

నువు  'ప్రే' నేను 'మా'

Most Recent

Default