Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Annamayya (1997)






చిత్రం: అన్నమయ్య (1997)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: నాగార్జున, మోహన్ బాబు, రమ్యకృష్ణ, కస్తూరి, రోజా
దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
నిర్మాత: వి.ద్వరస్వామిరాజు
విడుదల తేది: 22.05.1997





Songs List:





వినరో భాగ్యము పాట సాహిత్యం

చిత్రం: అన్నమయ్య (1997)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: అన్నమాచార్య
గానం: యస్ పి బాలు, యమ్.యమ్.శ్రీలేఖ

వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ
వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ
వెనుబలమిదివో విష్ణు కథ...
చేరి యశోదకు శిశువితడు
ధారుణి బ్రహ్మకు తండ్రియునితడు
చేరి యశోదకు శిశువితడు
ధారుణి బ్రహ్మకు తండ్రియునితడు చేరి యశోదకు శిశువితడు
అణువేణు పరిపూర్ణమైన రూపము
అణివారి సిరి అంజనాద్రి వీని రూపము
అణువేణు పరిపూర్ణమైన రూపము
అణివారి సిరి అంజనాద్రి వీని రూపము
అణువేణు పరిపూర్ణమైన రూపము
ఏమని పొగడుదుమే ఇక నిను ఆమని సొబగుల
అలమేల్ మంగా... ఏమని పొగడుదుమే

వేడుకొందామా... వేడుకొందామా...
వేడుకొందామా వేంకటగిరి
వేంకటేశ్వరుని వేడుకొందామా
వేడుకొందామా వేంకటగిరి
వేంకటేశ్వరుని వేడుకొందామా
ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే
ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే
వాడు అలమేల్మంగ... వాడు అలమేల్మంగ...
శ్రీ వెంకటాద్రి నాథుడే వేడుకొందామా
వేడుకొందామా వేంకటగిరి
వేంకటేశ్వరుని వేడుకొందామా
వేడుకొందామా... వేడుకొందామా...
వేడుకొందామా... వేడుకొందామా...
ఏడు కొండల వాడా వేంకటరమణా
గోవిందా... గోవింద
ఏడు కొండల వాడా వేంకటరమణా
గోవిందా... గోవింద

ఇందరికి అభయంబు లిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి
ఇందరికి అభయంబు లిచ్చు చేయి
ఇందరికి అభయంబు లిచ్చు చేయి





తెలుగు పదానికి జన్మదినం పాట సాహిత్యం

చిత్రం: అన్నమయ్య (1997)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్ పి బాలు, సుజాత


ఓం... ఓం...
తెలుగు పదానికి జన్మదినం
ఇది జానపదానికి జ్నానపథం
ఏడు స్వరాలే ఏడు కొండలై
వెలసిన కలియుగ విష్ణు పదం
అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం

అరిషడ్వర్గము తెగనరికే
హరిఖడ్గమ్మిది నందకము
బ్రహ్మలోకమున బ్రహ్మాభారతి
నాదాశిస్సులు పొందినదై
శివలోకమ్మున చిద్విలాసమున
డమరుధ్వనిలో గమకితమై
దివ్యసభలలో నవ్య నాట్యముల
పూబంతుల చేమంతిగ ఎగసి
నీరద మండల నారద తుంబుర
మహతీ గానపు మహిమలు తెలిసి
స్థిత హిమకందుర యతిరాట్ స్సభలో
తపః ఫలమ్ముగ తళుకుమని
ఓం...
తల్లి తనముకై తల్లడిల్లు
ఆ లక్కమాంబ గర్భాలయమ్ములో
ప్రవేశించె ఆ నందకము
నందనానంద కారకము

అన్నమయ్య జననం...
ఇది అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం

పద్మావతియే పురుడు పోయగా
పద్మాసనుడే ఉసురు పోయగా
విష్ణు తేజమై నాద బీజమై
ఆంధ్ర సాహితీ అమర కోశమై
అవతరించెను అన్నమయ్య
అసతోమా సద్గమయ
అవతరించెను అన్నమయ్య
అసతోమా సద్గమయ

పాపడుగా నట్టింట పాకుతూ
భాగవతము చేపట్టెనయా
హరినామమ్మును ఆలకించక
అరముద్దలనే ముట్టడయా
తెలుగు భారతికి వెలుగు హారతై
ఎదలయలో పద కవితలు కలయ
తాళ్ళపాకలో ఎదిగే అన్నమయ్య
తమసోమా జ్యోతిర్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
తమసోమా జ్యోతిర్గమయ




ఏలే ఏలే మరదలా పాట సాహిత్యం

చిత్రం: అన్నమయ్య (1997)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్ పి బాలు, సుజాత


ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసలా
నచ్చింది నచ్చింది నాజూకు
నీకే ఇస్తా సొభగులు
ఇచ్చేయి పచ్చాలు సొగసులు
చాలు నీ తోటి
అహ చాలు నీ తోటి సరసాలు బావా

ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసలా

గాటపు గుబ్బలు గదలగ గులికేవు
మాటల తేటల మరదలా
వెంటరి చూపులు విసురుతు మురిసేవు
వాటపు వలపుల వరదలా
చీటికి మాటికి జెనకేవు...
చీటికి మాటికి జెనకేవు
వట్టి బూటకాలు మానిపోయే బావా
చాలు చాలు నీ తోటి
అహ చాలు నీ తోటి సరసాలు బావా

ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసలా
నచ్చింది నచ్చింది నాజూకు
నీకే ఇస్తా సొభగులు
ఇచ్చేయి పచ్చాలు సొగసులు
చాలు నీ తోటి
అహ చాలు నీ తోటి సరసాలు బావా

ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసలా

కన్నుల గంటపు కవితలు గిలికేవు
నా ఎద చాటున మరదలా
పాడని పాటల పైటల సరిదేవు
పల్లవి పదముల దరువులా
కంటికి ఒంటికి కదిపేవు...
కంటికి ఒంటికి కదిపేవు
ఎన్ని కొంటె లీలాలెందుకోలో బావా
అహ పాడుతు పాట
జంట పాడుకున్న పాట జజిపూదోట

ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసలా
నచ్చింది నచ్చింది నాజూకు
నీకే ఇస్తా సొభగులు
ఇచ్చేయి పచ్చాలు సొగసులు
చాలు నీ తోటి
అహ చాలు నీ తోటి సరసాలు బావా

ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసలా
ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసలా





పదహారు కళలకు పాట సాహిత్యం

చిత్రం: అన్నమయ్య (1997)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: జే. కే. భారవి
గానం: మనో

ఓం... శ్రీ పద్మావతే భూదేవే సమేతస్య
శ్రీ మద్వేంకట నాయకస్య నిత్యషోడశోపచార
పూజాం చ కరిష్యే ఆవాహయామి

పదహారు కళలకు ప్రాణాలైన
నా ప్రణవ ప్రణయ దేవతలకు ఆవాహనం

కోరస్: ఓం ఆసనం సమర్పయామి

పరువాల హొయలకు పైయ్యెదలైన
నా ఊహల లలనలకు ఊరువులాసనం

కోరస్: ఓం ధ్యానం సమర్పయామి

చిత్తడి చిరు చెమటలా చిందులు చిలికే
పద్మినీ కామినులకు పన్నీటి స్నానం

కోరస్: ఓం గంధం సమర్పయామి

ఘలం ఘలన నడల వలన అలిసిన
నీ గగన జఘన సొబగులకు శీతల గంధం

కోరస్: ఓం నైవేద్యం సమర్పయామి

రతి వేద వేద్యులైన రమణులకు
అనుభవైక వేద్యమైన నైవేద్యం

కోరస్: ఓం తాంబూలం సమర్పయామి

మీ తహతహలకు తపనలకు తాకిళ్లకు
ఈ కొసరి కొసరి తాంబూలం

కోరస్: ఓం సాష్టాంగ వందనం సమర్పయామి

ఘనం ఘరంగ భంగిమలకు
సర్వాంగ చుంబనాల వందనం








కలగంటి కలగంటి పాట సాహిత్యం

చిత్రం: అన్నమయ్య (1997)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: అన్నమాచార్య
గానం:యస్ పి బాలు


కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి
ఎల్లలోకములకు అప్పడగు తిరు వేంకటాద్రీశుగంటి
కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరు వేంకటాద్రీశుగంటి
ఇప్పుడిటు కలగంటి

అతిశయంబైన శేషాద్రి శిఖరముగంటి
ప్రతిలేని గోపుర ప్రభలుగంటి
శతకోటి సూర్యతేజములు వెలుగగంటి
చతురాస్యు పొడగంటి
చతురాస్యు పొడగంటి చయ్యన మేలుకొంటి
ఇప్పుడిటు కలగంటి

అరుదైన శంఖ చక్రాదు లిరుగడగంటి
సరిలేని అభయ హస్తమునుకంటి
తిరు వేంకటాచలాధిపుని చూడగగంటి
హరిగంటి గురుగంటి
హరిగంటి గురుగంటి అంతట మేలుకొంటి
కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి
ఎల్లలోకములకు అప్పడగు తిరు వేంకటాద్రీశుగంటి
ఇప్పుడిటు కలగంటి ఇప్పుడిటు కలగంటి




అదివొ అల్లదివో పాట సాహిత్యం

చిత్రం: అన్నమయ్య (1997)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: అన్నమాచార్య
గానం:  యస్ పి బాలు



ఏడుకొండలవాడా వెంకట రమణా
గోవిందా...గోవిందా...

అదివో...ఓ... ఓ...ఓ...
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద (2)

అదివొ అల్లదివో శ్రీహరి వాసము
అదివొ అల్లదివో శ్రీహరి వాసము
పది వేలు శేశుల పడగల మయము
అదివొ అల్లదివో శ్రీహరి వాసము
పది వేలు శేశుల పడగల మయము
అదివొ అల్లదివో శ్రీహరి వాసము

ఏడుకొండలవాడా వెంకట రమణా
గోవిందా... గోవిందా...
ఏడుకొండలవాడా వెంకట రమణా
గోవిందా...గోవిందా...

చరణం: 1
అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకు

వెంకట రమణ సంకట హరణా (2)
నారాయణా నారాయణా

అదివో నిత్యనివాస మఖిలమునులకు
అదే చూడుడు అదె మ్రొక్కుడు
ఆనంద మయము
అదే చూడుడు అదె మ్రొక్కుడు
ఆనంద మయము
అదివొ అల్లదివో శ్రీహరి వాసము

వడ్డీకాసుల వాడా వెంకటరమణా
గోవిందా... గోవిందా...
ఆపద మొక్కుల వాడా అనాథ రక్షక
గోవిందా... గోవిందా...

కైవల్య పథము వేంకటనగమదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది
భావింప సకల సంపద రూప మదివో...
అదివో...అదివో...
వేంకటరమణ సంకటహరణ (2)

భావింప సకల సంపద రూప మదివో
పాపనముల కెల్ల పావనమయము
అదివొ అల్లదివో శ్రీహరి వాసము
శ్రీహరి వాసము... శ్రీహరి వాసము

వేంకటేశా నమో... శ్రీనివాసా నమో (2)
అదివో...అదివో...అదివో...అదివో...









పొడగంటిమయ్యా మిమ్ము పాట సాహిత్యం


చిత్రం: అన్నమయ్య (1997)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: అన్నమాచార్య
గానం: యస్. పి. బాలు


పురుషోత్తమా పురుషోత్తమా పురుషోత్తమా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా

చరణం: 1
కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా
నేరిచి పెద్దలిచ్చిన నిధానమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా...
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా...
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా...
మాకు చేరువ జిత్తములోని శ్రీనివాసుడా

పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా

చరణం: 2
చెడనీక బ్రతికించే సిధ్ధమంత్రమా...
ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ
చెడనీక బ్రతికించే సిధ్ధమంత్రమా
రోగాలడచి రక్షించే దివ్యౌషదమా
బడి బాయక తిరిగే ప్రాణ బంధుడా...
బడి బాయక తిరిగే ప్రాణ బంధుడా...
బడి బాయక తిరిగే ప్రాణ బంధుడా
మమ్ము గడియించినట్టి శ్రీ వేంకటనాథుడా

పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
పురుషోత్తమా...పురుషోత్తమా...పురుషోత్తమా...




అస్మదీయ మగటిమి పాట సాహిత్యం


చిత్రం: అన్నమయ్య (1997)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: మనో, చైత్ర


అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా
వలపే ఇక తొలిపే చెలి ఒయ్యారంగా
కథలే ఇక నడిపే కడు శృంగారంగా
పెనుగొండ యెద నిండా రగిలింది వెన్నెలా... హలా

అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా
ఆ...ఆ...రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా

బృందం: సాపమ సామగ సాగసనిపస
సాపమ సామగ సపగ గమప మపని పసనిస

నీ పని నీ చాటు పని
రసలీల లాడుకున్న రాజసాల పని
నా పని అందాల పని
ఘనసాళ్వవంశ రసికరాజు కోరు పని
ఎపుడెపుడని ఎద ఎద కలిపే ఆ పని
రేపని మరి మాపని క్షణమాపని నా పని
ప ప్ప ప్ప పని పనిసగమని పని
మమ మని - మపనీ
ఆ పని ఏదో ఇపుడే తెలుపని - వలపని

అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా
ఆ...ఆ...ఆ

బృందం: స స స స నిస... స స స స నిస.... స స స స నిస....

ఓ సఖి రాకేందుముఖి
ముద్దులాడు యుద్ధరంగాన ముఖాముఖి
ఓ సఖా మదనువి జనక
ఈ సందిట కుదరాలి మనకు సంధియిక
బుతువునకొక రుచి మరిగిన మనసైన సఖి
మాటికి మొగమాటకు సగమాటలు ఏటికి
ప ప ప పని పనిసగమని మని
మమ మని - మ పని
పెళ్ళికి పల్లకి తెచ్చే వరసకి వయసుకి

అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా
ఆ...ఆ...రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా
 ఓ హ హ హా




విన్నపాలు వినవలె పాట సాహిత్యం


చిత్రం: అన్నమయ్య (1997)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: అన్నమాచార్య
గానం: యస్.పి. బాలు, ఎమ్.ఎమ్.శ్రీలేఖ


విన్నపాలు వినవలె వింతవింతలు
విన్నపాలు వినవలె వింతవింతలు
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా
విన్నపాలు వినవలె వింతవింతలు
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా

విన్నపాలు వినవలె వింతవింతలు...

కంటి శుక్రవారము గడియలేడింట
అంటి అలమేలు మంగ అండ నుండే స్వామిని
కంటి శుక్రవారము గడియలేడింట
అంటి అలమేలు మంగ అండ నుండే స్వామిని కంటీ...
 
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
సొంత పెడమరిలీ నవ్వినీ పెండ్లి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
సొంత పెడమరిలీ నవ్వినీ పెండ్లి కూతురు
పేరుగల జవరాలీ పెండ్లి కూతురు
పెద్ద పేరున ముత్యాల మెడ పెండ్లి కూతురు
పేరంటాడ్ల నడిమి పెండ్లి కూతురు
పేరంటాడ్ల నడిమి పెండ్లి కూతురు
మిగు పేరు గుచ్చ సిగ్గువడి పెండ్లి కూతురు

అలర చంచలమైన ఆత్మనందుండ
నీ అలవాటు చేసెనీ ఉయ్యాల

కోరస్: అలర చంచలమైన ఆత్మనందుండ
నీ అలవాటు చేసెనీ ఉయ్యాల

పలుమారు ఉచ్చ్వాస పవనమందుండ
నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల

కోరస్: పలుమారు ఉచ్చ్వాస పవనమందుండ

నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
ఉయ్యాల... - ఉయ్యాల (4)




ఫాలనేత్రానల ప్రబల పాట సాహిత్యం


చిత్రం: అన్నమయ్య (1997)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: అన్నమాచార్య
గానం: యస్ పి బాలు


ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా
కేళీవిహార లక్ష్మీనారసింహా...
లక్ష్మీనారసింహా...

చరణం: 1
ప్రళయ మారుత ఘోరభస్త్రికా పూత్కార
లలిత నిశ్వాసడోలారచనయా
కులశైలకుంభినీ కుముదహిత రవిగగన
చలన విధి నిపుణ నిశ్చల నారసింహా...
నిశ్చల నారసింహా...
దారుణోజ్జ్వల ధగధ్ధగిత దంష్ట్రానల
వికార స్ఫులింగ సంగక్రీడయా
వైరి దానవ ఘోర వంశ భస్మీకరణ
కారణ ప్రకట వేంకట నారసింహా...
వేంకట నారసింహా... వేంకట నారసింహా...





గోవిందా శ్రిత పాట సాహిత్యం


చిత్రం: అన్నమయ్య (1997)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: అన్నమాచార్య
గానం: యస్.పి. బాలు, యమ్.యమ్.కీరవాణి


గోవిందా శ్రిత గోకుల బృంద
పావన జయజయ పరమానంద
గోవిందాశ్రిత గోకుల బృంద
పావన జయజయ పరమానందా...

హరినామమే కడు ఆనందకరము
మరుగవో మరుగవో మరుగవో మనసా
హరినామమే కడు ఆనందకరము
మరుగవో మరుగవో మరుగవో మనసా

కోరస్: హరినామమే కడు ఆనందకరము

రంగా... రంగా...
రంగ రంగ రంగపతి రంగనాథ
నీ సింగారాలె తరచాయ శ్రీ రంగనాథా
రంగ రంగ రంగపతి రంగనాథ
నీ సింగారాలె తరచాయ శ్రీ రంగనాథా
రంగనాథ శ్రీ రంగనాథా
రంగనాథ శ్రీ రంగనాథా

రాముడు రాఘవుడు రవికులుడితడు
భువిజకు పతియైన పురుషనిధానము
రాముడు రాఘవుడు రవికులుడితడు
భువిజకు పతియైన పురుషనిధానము
రాముడు రాఘవుడు రవికులుడితడు

కోరస్: రాం రాం సీతారాం  (4)

పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడూ...
పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడూ...
పరగి నానా విద్యలో బలవంతుడు

కోరస్: పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడూ

వేదములు నుతింపగ వేడుకలు దైవారగ
ఆదరించి దాసుల మోహన నారసింహుడు
మోహన నారసింహుడు..
మోహన నారసింహుడూ...

చక్కని తల్లికి ఛాంగుభళా
తన చక్కెర మోవికి ఛాంగుభళా
చక్కని తల్లికి ఛాంగుభళా
తన చక్కెర మోవికి ఛాంగుభళా
చక్కని తల్లికి ఛాంగుభళా
చక్కని తల్లికి ఛాంగుభళా

కోరస్: గోవిందా... గోవిందా...

కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టెలాయ మహిమలే తిరుమల కొండా తిరుమల కొండా
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ తెట్టెలాయ మహిమలే ...

కోరస్: తిరుమల కొండా... తిరుమల కొండా...
తిరుమల కొండా... తిరుమల కొండా...

తిరువీధుల వెలిసి ఈ దేవదేవుడు

కోరస్: గోవిందా... గోవిందా...(2)

తిరువీధుల వెలిసి ఈ దేవదేవుడు
గరిమల మించిన సింగారముల తోడను
తిరువీధుల వెలిసి ఈ దేవ దేవుడు
దేవ దేవుడు...





బ్రహ్మ కడిగిన పాదము పాట సాహిత్యం


చిత్రం: అన్నమయ్య (1997)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: అన్నమాచార్య
గానం: చైత్ర , శ్రీరామ్ పార్ధసారధి


బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము దానెనీ పాదము
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము దానెనీ పాదము
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము దానెనీ పాదము
బ్రహ్మ కడిగిన పాదము
చెల గి వసుధ గొలిచిన నీ పాదము
బలి తలమోపిన పాదము
తల కక గగనము తన్నిన పాదము
తలకక గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము
బ్రహ్మ కడిగిన పాదము
పరమయోగులకు పరిపరి విధముల
వరమొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన
పరమ పదము నీ పాదము
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము దానెనీ పాదము
బ్రహ్మ కడిగిన పాదము





అంతర్యామి అలసితి పాట సాహిత్యం


చిత్రం: అన్నమయ్య (1997)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్ పి బాలు, యస్.పి. శైలజ


అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితినీ...
అంతర్యామి అలసితీ... సొలసితీ...
కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెంచకా

కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెంచకా
భారపు పగ్గాలు పాపపుణ్యములు
భారపు పగ్గాలు పాపపుణ్యములు
నేరుపునకో నీవు వద్దనక
అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితినీ...
అంతర్యా... మీ...

మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనకా
మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనకా
ఎదుటనే శ్రీ వేంకటేశ్వరా...
వేంకటేశా శ్రీనివాసా ప్రభో
ఎదుటనే శ్రీ వేంకటేశ్వరా నీవదే అదనుగాచితివి అట్టిట్టనక
అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితినీ...
అంతర్యామి కోరస్: అంతర్యామి
అంతర్యామి కోరస్: అంతర్యామి
అంతర్యామి కోరస్: అంతర్యామి
అంతర్యామి కోరస్: అంతర్యామి
అంతర్యామి కోరస్: అంతర్యామి
అలసితీ...





నిగమ నిగమాంత పాట సాహిత్యం


చిత్రం: అన్నమయ్య (1997)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: అన్నమాచార్య
గానం: యస్ పి బాలు, చిత్ర


ఊ...ఊ... నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజ ధరుడా శ్రీనారాయణా...
గమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజ ధరుడా శ్రీ నారాయణా...
నారాయణా శ్రీమన్నారాయణా..
నారాయణా వేంకట నారాయణా...ఆ...ఆ..
దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంభీయ
లోకటగా నన్ను నొడబరుకుచు పై పై..
పై పైనే సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లున నారాయణా
పై పైనే సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లున నారాయణా
నిగమ...
గమదని సగమగసని
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజ ధరుడా శ్రీ నారాయణా...
నారాయణా శ్రీమన్నారాయణా..
నారాయణా వేంకట నారాయణా...ఆ...ఆ..
ని సా గాస గాస గాస గాసగా
గనిసగమగ సనిగస నీసాగా
సగమ గమద మదనీ దనిసా మగసానీద మగస
వివిధ నిర్భంధముల
వివిధ నిర్భంధముల ఎడల గ్రోయకనన్ను
భవ సాగరముల దడ బడజేతురా..
దివిజేంద్ర వంద్య శ్రీ తిరువేంకటాద్రీశా... హరే..
హరే...
హరే... దివిజేంద్ర వంద్య శ్రీ తిరువేంకటాద్రీశా
నవనీతచోర శ్రీ నారాయణా
నిగమ
సగమగసని దమదని నిగమ
గసమగ దమ నిద సని
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజ ధరుడా శ్రీ నారాయణా...
నారాయణా శ్రీమన్నారాయణా..
నారాయణా వేంకట నారాయణా...
తిరుమల నారాయణా...
హరే...
కలియుగ నారాయణా...హరి హరి నారాయణా...
ఆదినారాయణా... లక్ష్మీ నారాయణా...
శ్రీమన్నారాయణా... శ్రీమన్నారాయణా... శ్రీమన్నారాయణా...
హరే హరే..





మూసిన ముత్యాల కే పాట సాహిత్యం


చిత్రం: అన్నమయ్య (1997)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: అన్నమాచార్య
గానం: యస్ పి బాలు, చైత్ర


మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికేలే అలవోకలు
మూసిన ముత్యాలకేలే మొరగులు
ఆశల చిత్తానికేలే అలవోకలు
మూసిన ముత్యాలకేలే మొరగులు
ఆశల చిత్తానికేలే అలవోకలు
ఊ ఊ ఊ ఊ ఊ ఊ (2)

కందులేని మోమున కేలే - కస్తూరి
చిందు నీ కొప్పున కేలే - చేమంతులు

కోరస్: గమపప పపప నిపమ గసని
సగమమ మమమ గపద మ ప ని దనిస

మందయానమున కేలే మట్టెల మోతలు
మందయానమున కేలే మట్టెల మోతలు
గంధమేలే పై కమ్మని నీ మేనికి

మూసిన ముత్యాలకేలే మొరగులు
ఆశల చిత్తాని కేలే అలవోకలు

ముద్దు ముద్దు మాటల కేలే - ముదములు
నీ అద్దపు చెక్కిలి కేలే - అరవిరి
ఒద్దిక కూటమికే లే... ఏలే ఏలే ఏలేలే
ఒద్దిక కూటమికేలే వూర్పులు
నీకు అద్దమేలే తిరువేంకటాద్రీశుగూడి
మూసిన ముత్యాలకేలే మొరగులు
ఆశల చిత్తాని కేలే అలవోకలు





బ్రహ్మమొక్కటే...పాట సాహిత్యం


చిత్రం: అన్నమయ్య (1997)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: అన్నమాచార్య
గానం: యస్ పి బాలు


బ్రహ్మమొక్కటే... పర బ్రహ్మ మొక్కటే...

బ్రహ్మ మొక్కటే పర బ్రహ్మ మొక్కటే
పర బ్రహ్మ మొక్కటే పర బ్రహ్మ మొక్కటే
కోరస్: తందనానా ఆహి తందనానా పురె
తందనానా భళా తందనానా

పర బ్రహ్మ మొక్కటే పర బ్రహ్మమొక్కటే
కోరస్: భళా తందనానా భళా తందనానా

నిండార రాజు నిద్రించు నిద్రియునొకటే
అండనే బంటు నిద్ర ఆదియూనొకటే
మెండైన బ్రహ్మణుడు మెట్టుభూమి యొకటే
మెండైన బ్రహ్మణుడు మెట్టుభూమి యొకటే
ఛండాలు డుండేటి సరి భూమి యొకటే

బ్రహ్మమొక్కటే  పర బ్రహ్మ మొక్కటే
బ్రహ్మ మొక్కటే పర బ్రహ్మ మొక్కటే

కడగి యేనుగు మీద గాయు యెండొకటె
పుడమి శునకము మీద పొలయు యెండొకటె
కడు పుణ్యులను పాపకర్ములను సరిగావ
జడియు శ్రీ వేంకటేశ్వరు నామ మొకటే
కడు పుణ్యులను పాపకర్ములను సరిగావ
జడియు శ్రీ వేంకటేశ్వరు నామ మొకటే

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మ మొక్కటే
బ్రహ్మ మొక్కటే పర బ్రహ్మ మొక్కటే

కోరస్: తందనానా ఆహి తందనానా పురె
తందనానా భళా తందనానా

పర బ్రహ్మ మొక్కటే...
కోరస్: భళా తందనానా... (4)





నానాటి బతుకు పాట సాహిత్యం


చిత్రం: అన్నమయ్య (1997)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: అన్నమాచార్య
గానం: మనో


నానాటి బతుకు నాటకము
కానక కన్నది కైవల్యము
నానాటి బతుకు నాటకము... నాటకము

చరణం: 1
పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్టనడిమీ పని నాటకము
యెట్టనెదుట గలదీ ప్రపంచము
కట్ట కడపటిది కైవల్యము






కొండలలో నెలకొన్న పాట సాహిత్యం


చిత్రం: అన్నమయ్య (1997)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: అన్నమాచార్య
గానం: యస్. పి. బాలు


ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న.. ఆ...
కొండలలో నెలకొన్న...ఆ...
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు






దాచుకో నీ పాదాలకు పాట సాహిత్యం


చిత్రం: అన్నమయ్య (1997)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: అన్నమాచార్య
గానం: యస్ పి బాలు, యస్.పి. శైలజ

దాచుకో నీ పాదాలకు తగ నే చేసిన పూజలివి
పూచీ నీ కీరితి రూప పుష్పములివె అయ్యా...
దాచుకో... దాచుకో...దాచుకో...







శోభనమే శోభనమే పాట సాహిత్యం



చిత్రం: అన్నమయ్య (1997)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: అన్నమాచార్య
గానం: మనో

శోభనమే శోభనమే. శోభనమే శోభనమే
వైభవముల పావనమూర్తికి

శోభనమే శోభనమే. శోభనమే శోభనమే
వైభవముల పావనమూర్తికి
శోభనమే శోభనమే

దేవదానవుల ధీరతను
ధావతిపడి వాగ్గేతరువుగను
దేవదానవుల ధీరతను
ధావతిపడి వాగ్గేతరువుగను
శ్రీవనితామణి చెలగి పెండ్లాడిన
శ్రీవేంకటగిరి శ్రీనిధికీ

శోభనమే శోభనమే. శోభనమే శోభనమే
వైభవముల పావనమూర్తికి
శోభనమే శోభనమే. శోభనమే శోభనమే
వైభవముల పావనమూర్తికి
శోభనమే శోభనమే






ఏమొకో పాట సాహిత్యం





చిత్రం: అన్నమయ్య (1997)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: అన్నమాచార్య
గానం: యస్.పి. బాలు

గోవిందా నిశ్చలానంద మందార మకరందా
నీ నామం మధురం నీ రూపం మధురం
నీ సరస శృంగార కీర్తన
మధురాతి మధురం స్వామి ఆహా..

ఏమొకో ఏమొకో
చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను
భామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా
ఏమొకో ఏమొకో
చిగురుటధరమున ఎడ నెడ కస్తూరి నిండెను

కలికి చకోరాక్షికి కడ కన్నులు కెంపై తోచిన
చెలువంబిప్పుడిదేమో చింతింపరే చెలులు
నలువున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన
చూపులు 
నలువున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన
చూపులు 
నిలువున పెరుకగనంటిన నెత్తురు కాదు కదా

ఏమొకో ఏమొకో
చిగురుటధరమున ఎడ నెడ కస్తూరి నిండెను
ఆ.. ఆ.. ఆ...

జగడపు చనవుల జాజర సగినల మంచపు
జాజర
జగడపు చనవుల జాజర
తరిక్త జం జం జం జం జం జం కరికిట
తరికిటతోం
మొల్లలు తురుముల ముడిచిన బరువున
మొల్లపు సరసపు మురిపెమున
జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లేరతివలు
జాజర

జగడపు చనవుల జాజర సగినల మంచపు
జాజర
జగడపు చనవుల జాజర
తా ధనక్ తా జనుక తాధిమిక్ తా తధీం
గిణతోం

భారపు కుచముల పైపై కడుసింగారం నెరపెడి
గంధ ఒడి
చేరువ పతిపై చిందగ పడతులు సారెకు
చల్లేరు జాజర
జగడపు చనవుల జాజర సగినల మంచపు
జాజర
జగడపు చనవుల జాజర

తత్త దిత్త జణుతాం తరికిడ తరిగిడత
తట్ట దిట్ట జన తధీం తిరగాడతో
తడి తధీం త
జానూ తధీం త తట్టీం
గినతో తధీం గినతోం తరిగిడ తరిగిడత

బింకపు కూటమిపెనగేటి చెమటల
పంకపు పూతల పరిమళము
వేంకటపతిపై వెలదులు నించేరు
సంకుమదమ్ముల జాజర
జగడపు చనవుల జాజర సగినల మంచపు
జాజర



Most Recent

Default