Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Charana Daasi (1956)




Movie Datails



Songs List:



గులాబీల తావులీనే పాట సాహిత్యం

 
చిత్రం: చరణదాసి (1956)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల
గానం: ఘంటసాల, పి. లీల

గులాబీల తావులీనే కులాసాల జీవితాల
విలాసాలివే వికాసాలివే ఇవే ప్రేమజీవితాల వరాలౌను ప్రేయసీ
మానససీమల మాయని ప్రేమల - మాధురు లెపుడూ మారవుగా
మారవులే ప్రమాణముగా - జీవనతారవు దేవివినీవే
గులాబీల తావులీనే - కులాసాల జీవితాల
మనజాలినా అదేచాలులే ఇవే ప్రేమజీవితాలా వరించేవ రాలుగా



ఈదయ చాలునురాకృష్ణా పాట సాహిత్యం

 
చిత్రం: చరణదాసి (1956)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల
గానం: పి. లీల

ఈదయ చాలునురాకృష్ణా కాదనకీరా నాకోవరమూ
వంతులుకోరను రుక్మిణితో- సామంతములాడను సత్యభామతో
మౌళినిపింఛమయినై మెలగను కె - మ్మోలిని పిల్లనగ్రోవికానురా ॥ ఈ॥
మవ్వముగా నీకాలిని ఘల్లను మువ్వల నన్నొక మువ్వచేయరా
నీపద కమలము పై నాడుచు - నెమ్మేనును మరచే భాగ్యమీయరా



అరే బేటా ! నమ్మర నా మాట పాట సాహిత్యం

 
చిత్రం: చరణదాసి (1956)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సదాశివ బ్రహ్మం 
గానం: మల్లికార్జున రావు 

అరే బేటా ! నమ్మర నా మాట-మన స్వతంత్రమంతా ఝూటా !
బొమ్మలాట యిది బొమ్మలాటరా ! నమ్మర నా మాట !
ఆ బొమ్మలలో ఒక బొమ్మవిరా ! నీ యిష్టము సాగదురా బేటా
మన స్వతంత్రమంతా ఘూటా ||బొ||

తెరవెనుక ఆడించేవాడికె తెలుసునురా మన ఆట
మరు నిముసములో ఏమౌతుందో మనకే మెరుక బేటా
యీ ప్రపంచమంతా ఝూటా॥

ప్రేమొక చోట పెళ్ళొకచోట ఏమిటిరా యీ వింత,
పీటమీద పెళ్ళిళ్ళు దాటడం నాటక మిదియంతా,
బేటా యిదే బొమ్మలాట

బయలు దేరి బండెక్కి నంతనే బసకు చేరగలమా,
బాటలో ఏ ఆటంకమున్నదో మనకు తెలియతరమా
బేటా మన తెలివంతా ఝూటా॥

పురుషప్రయత్నం మిధ్య దేవుడే శరణం నమ్మర నా మాట
పరమేశ్వరుడే కర్త వానిపై భారము వేయర బేటా
నీ కేల పీకులాటా ఇదే మంచిమాటా బేటా యిదే తెలివి తేటా





శ్రీలలితా దయాకలితా పాట సాహిత్యం

 
చిత్రం: చరణదాసి (1956)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల
గానం: పి. లీల

శ్రీలలితా దయాకలితా
శివమోహిని జగ దేకమాతా ॥
ఓంకారమయీ త్రిపురసుందరీ
హ్రీంకారీ నతలోక శంకరీ
శ్రీచక్రరాజ నిలయా సేవక
సంకట హారిణీ సర్వమంగళా॥శ్రీ ॥
పరమేశుని జత బాయగ నేరని
మరులున సామేనైన కుమారీ
కరుణించవె హృదయేశుని సన్నిధి
ముగిసే భాగ్యము నంబా ॥ శ్రీలలితా ||





# పాట సాహిత్యం

 
చిత్రం: చరణదాసి (1956)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సదాశివబ్రహ్మం 
గానం: పి. నాగేశ్వరరావు, స్వర్ణలత

నేడె కదా హాయి యీనాడె కదా హాయి
మన ఆలుమగల నడుమ మరి లేరెవరీ రేయి
మనలో మన మాటలకే మధ్య నొక్క తడక
పైగా మామయ్యొక్కడు-పానకంలో పుడక
చాలు సమాళించుకోండి ఏమిటి మీ పాట
ఇరుగుపొరుగువారు వింటె యిదో నవ్వులాట
మగడు పెళ్ళామైతే మాత్రం మంచీ చెడ్డా లేదా
ఎగబడి నడివీధి కెక్కితే -ఏమిటి మర్యాద !!
మర్యాదా గిర్యాదా మనకెందుకు పో
నేడె కదా నేను నువ్వు దొర దొరసాని
ఇద్దరమే కదా యిపుడు మాటా మంతీ మానీ
ముద్దు మొగము చూపవు మోమాట మెందుకే రాణీ




తారుమారులాడేవేమే పాట సాహిత్యం

 
చిత్రం: చరణదాసి (1956)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: వి.యన్. సుందరం
గానం: 

తారుమారులాడేవేమే వయ్యారీ
తారుమారులాడేవేమే వయ్యారీ
తామసించకనే గౌరవించమంటే
తామసించకనే గౌరవించమంటే | తారు ||

కొమ్మరో కపురంపుతంమ్ములంబునీయ ॥
సమ్మతించి వలపు కుమ్మరించమంటే ॥
తారుమారులాడేవేమే వయ్యారీ
తారుమారులాడేవేమే వయ్యారీ
తారుమారులాడేవేమే వయ్యారీ
(మగమపని తారుమారులాడేవేమే.)




ఎక్కడున్నదీ పాట సాహిత్యం

 
చిత్రం: చరణదాసి (1956)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు
గానం: జిక్కి, రాణి

ఎక్కడున్నదీ ధర్మ మెక్కడున్నదీ -
మాటల్లొ వున్నదీ మనసుల్లో లేదదీ
మగువ పేరు చెప్పితేను మాతృదేవతంటారు కళ్ళకద్దుకుంటారు
ఒంటరిగా కనిపిస్తె కొంటెమాటలంటారు కోతులవలె చూస్తారు
ఆడవాళ్ళకు చదువెంతో అవసరమంటారు అలంకారమంటారు
ఈడువచ్చెనంటె ఇంట్లో కూడువండమంటారు
ఘోషా పొమ్మంటారు
పతిభక్తే ఇల్లాలికి భూషణమని చెప్తారు బుద్ధులు బోధిస్తారు.
పరకాంతల సేవతోటి పరవశమౌతుంటారు -
బ్రతుకు గడుపుతుంటారు
ఉన్నవాడు ఆశతోటి ఉడికిపోతున్నాడురా ఉబ్బిపోతున్నాడురా
లేనివాడు లేమితోటి కృంగిపోతున్నాడురా
కుమిలిపోతున్నాడురా
పంచభక్ష్య పరమాన్నం భోంచేసే దొకడురా
ఎంగిలాకులోని మెతుకు లేరుకుతినే దొకడురా
ఇదేనా సమానత్వ మిదేనా స్వాతంత్య్రం
ఇదేనా సౌభాగ్యం ఇదేనా లోకశాంతి




రేగిన ఆశా పాట సాహిత్యం

 
చిత్రం: చరణదాసి (1956)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల
గానం: జిక్కి

రేగిన ఆశా తీవలు సాగెను
ఊగేవులే సుమడోలికా
తూగేవులే సుఖడోలికా
ఓసుకుమారీ నీజీవితమ్మే
పూవులపానుపేలే వరాలా
దేవతతీరున హాయిగ నేలే !
తీయని కలలే పండెను నేటికి
తీరెనులే నీ కోరికా
వేసేవులే సుమడోలికా  
కోరుకొనే వరుడే సమకూరే - కావలెనా మరి దీవన వేరే
నీసరినారీ ఎవరిక లేరే - నిన్నెడజేసే వారే లేరే ||




ఆశలు పూచినవీ పాట సాహిత్యం

 
చిత్రం: చరణదాసి (1956)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల
గానం: పి. సుశీల

ఆశలు పూచినవీ నవోదయ రేఖలు తోచినవీ
మదీగోరే మనోహరునీ దరిజేరగనాయే
నాలో, ఆశలుపూసినవి నవోదయ రేఖలు తోచినవి

దరీదారి కానరానీ ఎడారైనా జీవితానా
గులాబీల కమ్మతావీ గుబాళించెగాలికూనా
నారిజాతీ గౌరవింపనాధుని పాదాలఒరిగెదా
సలి పెద పూజలనూ

మహీలోన యింకఎవరూ మమూ వేరు చేయలేరు
తలంచేను వారితీరే జపించేను వారిపేరే
బ్రతికించారూ చావనీక దేవతలిందులకే
నిరంతర పతిపద సేవలకే 
తరింతును పతిపద సేవలలో




గుండె రాయిచేసుకో పాట సాహిత్యం

 
చిత్రం: చరణదాసి (1956)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: బి. వి. యన్. ఆచార్య
గానం: మాదవపెద్ది సత్యం

సాకీ : 
గుండె రాయిచేసుకో కోలుపోకు నీ ధైర్యము
కాలముతో సాగించే కదనమే నరజీవనము

పల్లవి :
శాంతి లేదు జీవికి
విశ్రాంతి లేని పోరొకటే
మూసుకొనిన పెనుచీకటి
మాసి చనేదాక
కన్నీ రే పన్నీరౌ
వెన్నెల పెనుచీకటౌను
దేవుని చదరంగములో
పావులుగా జీవులిలా
పావులుగా జీవులిలా 

అదునుగాని వేళ పనులు కుదురవిసుక గోడలవలె
చేతికందినదనుకున్నది చెదరి పరుల పాలౌను
చెదరి పరుల పాలౌను
మరగబోకుమీ వెతలకు, కారణమెవరోలే
రగిలే ఈ దిగులే చిరునగవై ముగిసేలే
గుండె రాయి చేసుకో






మురిసేను లోకాలు కనుమా పాట సాహిత్యం

 
చిత్రం: చరణదాసి (1956)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: 
గానం: ఘంటసాల, పి.సుశీల

మురిసేను లోకాలు కనుమా
నినుజూచి దేవి నాలీల ॥
మురిసేను లోకాలు కనుమా -
ప్రియదర్శనాన నెమ్మేను
పులకించగా నాధా ||
పతికౌనుగా సంబరమే ॥
చెలిచూపులో కాపురమె సతికానుగ -
పతి సేవలే దీవనలు
చెలి ప్రేమలే కానుకలు
రఘునాయకా కులపాలి కా
ముదమా యెగా
విరబూచే యీ పూల పొదలు
మురిపాలు దూర యాలీల li
విరబూచే యీపూల పొదలు




మరువకుమా మనోరమణా పాట సాహిత్యం

 
చిత్రం: చరణదాసి (1956)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల
గానం: పి.సుశీల

మరువకుమా మనోరమణా
మరువకుమా మనోరమణా, నీ
మనసెరిగీ మొర సేటి వీణను
జిలిబిలిపలికీ అమృతము చిలికీ
జిలిబిలిపలికీ అమృతముచిలికీ
కులికించేనుర ప్రణయనిధానా
కనులను మెరసే నీ మురు పే
కనులను మెరసే నీ మురుపే, నా
మనసున విరిసే నీ తలపే
వీణియ విని నవనవరాగమే
వీణియనిచే నవనవరాగ మే
వినిమనియేనుక ధరారమణ.
కళాశరణ గుణాభరణ




ఓహో వియోగినీ! పాట సాహిత్యం

 
చిత్రం: చరణదాసి (1956)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల
గానం: పి.సుశీల

ఓహో వియోగినీ! ఓ అభాగినీ!
ఎఎంతమధురజీవనము
ఎంతకఠిన సంఘటన
మహారాజుచేతులలో
మంజుల వీణతంత్రి వై

మనసులో__మధుర ప్రేమగీతిక వై.
కనులలో | దివ్యనాట్యసుందరి వై
రసమయి వై జీవించే నీకి భీకర శాసనమా'

అయ్యో! అయ్యో!
ఒక టే దేహము ఒకేప్ర్రాణముగా
అర్థనారీశ్వరులై మనినా రే,
నరపాలుని పరులపాలు జేసి ఎటుల మనెనో !
లె నేలకూలి పోయేవో!
ఓహోవియోగినీ! ఓ అభాగినీ!




బదలీ అయిపోయిందె పాట సాహిత్యం

 
చిత్రం: చరణదాసి (1956)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల
గానం: పిఠాపురం నాగేశ్వర రావు

పలవి : 
బదలీ అయిపోయిందె భామామణీ
ప్రియభామామణీ
మనకీ వదలిపోయిందె పీడా రామామణీ
ఓ రామామణీ, ఓ రామామణీ
బదలీ అయిపోయిందే భామామణీ -
మదరాసు కె సలాముకొట్టి మూటా చంకానబెట్టి
పదవే విశాఖపట్టణం కదలీపోదాం
వడిగా కదలీపోదాం వడిగా
బదలీఅయిపోయిందే భామామణీ
కెవ్వూన నవ్వూకుంటు…నువ్వూ నేనుకలసి
గూవలజంటలాగ రివ్వూన ఎగిరిపోదాం
రివ్వూన ఎగిరిపోదాం రివ్వూన ఎగిరిపోదాం
బదలీఅయిపోయిందే భామామణీ -
దూరంగాపో తేగాని ఆరుపోరు చల్లారిపోదు
తారసించినాడె సైతానుమామయ్య
సైతానుమామయ్య_నాకు ॥పల్లవి |
బదలీఅయిపోయిం దే భామామణీ







కంటిని సత్యము పాట సాహిత్యం

 
చిత్రం: చరణదాసి (1956)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: 
గానం: పి. లీల

కంటిని సత్యము నేనీ రేయీ - కనగంటిని బ్రతుకులలోహాయీ
పతిసుఖమునకై యీ దీనా - బలిజేయును ప్రాణాలైనా
శ్రీ లలితా దయాకలితా ||
కోరను సిరిసంపద లేవీ
కోరను సురలోక సుఖాలేవీ
వరమీయవె నిరతమ్మును నా పతి
చరణదాసిగా మనగా !
జగ జగదంబా !




శ్రీ రాముడు పద్యములు పాట సాహిత్యం

 
శ్రీ రాముడు పద్యములు

దుష్టుడు జూచెనిన్ను గడుదోసపుచూడ్కులచే దదంక సం
భ్రష్టవునైతి పెట్టినిను రాజకుమారిక వంశశీలత
శిష్టుడనంచు జెప్పికొనునే నెటు వెండి గ్రహింప నేర్చెద
గష్టము మానహానికర కార్యము రాముడు చేయడెన్నడు.
మా

కావున నాదు కీ రి నిలగాచుకొనన్ దశకంఠు ద్రుంచి సీ
తా! విడిపించినాడ నిను తథ్యము నీపయి స్నేహమోహముల్
భావమునందు లేవు మగువా చను మిచ్చటనుండి నీకు మో
దావహ న భంగి నెట కేనియు నీకు ననుజ్ఞ యిచ్చితి.
సీతా దేవి -
చిరముగ గూడియుండితిమి చి త్తము లేకము గాగ, హాళిమై
దిరిగితి మొక్కడై పెరిగితి న్నినుగూడి పరస్పరంబు దా
పుర మొక యింత లేక యిటు బొల్పుగ నుండియు నాదు శీలమే.
యరయవయేని నీవు, హతనైతి హృదీశ్వర! శాశ్వతంబుగన్.
అగ్ని సాక్షి, కోరి బెండ్లాడినట్టి
మగ
నమ్మని పల్కులు జగము వినదు
సకల కార్యాల కగ్నియే సాక్షిగాన
సొదను బేర్పించు లక్ష్మణా చొచ్చుదాన.
పరమదయాకరా ! పతితపావన పావక రాజు నామనం
బెరుగుదువీవు, భూపతి వచించిన మాటలు వింటివేను దా
శరధీపదమ్ముల మరచి చంచలనై చరియించి పాపము
పొరసితి నేని నాతనువు బూదియొనర్పుము హవ్యవాహనా !

No comments

Most Recent

Default