Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Katakataala Rudraiah (1978)




చిత్రం: కటకటాల రుద్రయ్య (1978)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్. పి. బాలు, పి.సుశీల, యస్. జానకి
నటీనటులు: జమున, కృష్ణంరాజు, జయసుధ, రామకృష్ణ , జయచిత్ర
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: వడ్డే శోభనాద్రి
విడుదల తేది: 11.10.1978



Songs List:



వీణ నాది..తీగ నీది.. పాట సాహిత్యం

 
చిత్రం: కటకటాల రుద్రయ్య (1978) 
సంగీతం: జె.వి. రాఘవులు 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్. పి. బాలు, పి.సుశీల 

పల్లవి:
వీణ నాది..తీగ నీది..తీగ చాటు రాగ ముంది.. 
పువ్వు నాది..పూత నీది..ఆకుచాటు అందముంది.. 
వీణ నాది..తీగ నీది..తీగ చాటు రాగ ముంది.. తీగ చాటు రాగ ముంది...  
ఉమ్మ్.. ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్మ్ 

చరణం: 1
తొలిపొద్దు ముద్దాడగానే... ఎరుపెక్కె తూరుపు దిక్కూ.. 
తొలిచూపు రాపాడగానే... వలపొక్కటే వయసు దిక్కూ.. 
వరదల్లే వాటేసి...  మనసల్లే మాటేసి...  వయసల్లే కాటేస్తే చిక్కు 
తీపిముద్దిచ్చి తీర్చాలి మొక్కు 

వీణ నాది..తీగ నీది..తీగ చాటు రాగ ముంది..తీగ చాటు రాగ ముంది.. 

ఉమ్మ్.. ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్మ్ 

చరణం: 2 
మబ్బుల్లో మెరుపల్లే కాదూ... వలపు వాన కురిసీ వెలిసి పోదూ.. 
మనసంటే మాటలు కాదూ... అది మాట ఇస్తే మరచి పోదూ.. 
బ్రతుకల్లే జతగూడి...  వలపల్లె వనగూడి... వొడిలోనే గుడి కట్టే దిక్కు 
నా గుడి దీపమై నాకు దక్కూ 

వీణ నాది..తీగ నీది..తీగ చాటు రాగ ముంది.. 
పువ్వు నాది..పూత నీది..ఆకుచాటు అందముంది.. 
వీణ నాది..తీగ నీది..తీగ చాటు రాగ ముంది..తీగ చాటు రాగ ముంది..




ఈదురు గాలికి పాట సాహిత్యం

 
చిత్రం: కటకటాల రుద్రయ్య (1978)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, పి.సుశీల

పల్లవి:
ఈదురు గాలికి మా దొరగారికి... ఏదో గుబులు రేగిందీ
ఈ చలిగాలికి.. మా దొరసానికి... ఎదలో..వీణ మ్రోగింది..

హహ..ఉ హు ఉహు....హహా..ఉహూ..ఉహు ఉహు..

ఈదురు గాలికి మా దొరగారికి... ఏదో గుబులు రేగిందీ
ఈ చలిగాలికి..మా దొరసానికి... ఎదలో.. వీణ మ్రోగింది..
హహ...ఉ హు ఉహు....హహా..ఉహూ..ఉహు ఉహు..
లల లలా..హుహు హుహూ

చరణం: 1
తడిసినకొద్ది..బిగిసిన రైక... మిడిసి మిడిసి పడుతుంటే..
నిన్నొడిసి ఒడిసి పడుతుంటే....

తడిసే వగలు.. రగిలే సెగలు చిలిపి చిగురులేస్తుంటే...
నా కలలు నిదుర లేస్తుంటే...
నీ కళలు గెలలు వేస్తుంటే...

ఈదురుగాలికి మా దొరగారికి... ఏదో గుబులు రేగిందీ
ఈ చలిగాలికి.. మా దొరసానికి... ఎదలో.. వీణ మ్రోగింది..

లల లలా.. ఉహు ఉహూ
హెహె హెహే.. ఉహు ఉహూ

చరణం: 2
కరిగిన కుంకుమ పెదవి ఎరుపునే కౌగిలి కోరుతు ఉంటే...
నా పెదవులెర్రబడుతుంటే...
పడుచు సొగసులే ఇంద్రధనస్సులో... ఏడు రంగులౌతుంటే..
నా పైట పొంగులౌతుంటే...
నీ హొయలు లయలు వేస్తుంటే...

ఈదురుగాలికి మా దొరగారికి... ఏదో గుబులు రేగిందీ
హ.. ఈ చలిగాలికి.. మా దొరసానికి.. ఎదలో వీణ మ్రోగింది..

హహ హహా..ఉహు ఉహూ
హహ హహా..ఉహు ఉహూ
లల లలా..హుహు హుహూ
హెహె హెహే..హుహు హుహూ




పాలకంకి మీదుంది పైరు పాట సాహిత్యం

 
చిత్రం: కటకటాల రుద్రయ్య (1978)
సంగీతం: జె వి రాఘవులు 
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, పి. సుశీల  

పల్లవి:
పాలకంకి మీదుంది పైరు 
అబ్బాబ్బాబ్బ పడలేనమ్మా పిట్టల పోరు 
ఒడిసి పట్టి కొట్టబోతే  గడుసు పిట్టరో
కన్నుకొట్టి తుర్రు మంది కన్నె మోజు పిట్టరో 
కటకటాల రుద్దరయ్యో ఈ కిటికిటీలు వద్దురయ్యో 

పాలకంకి మీదుందా  పైరు
అరెరే పడలేవా ఈ పిట్టల పోరు 
ఒడుపు చూసి పట్టబోతే గడుసు పిట్టరో 
కన్ను కొట్టి తుర్రు మంది కన్నె కౌజు పిట్టరో 
పడుచు బళ్ళో పంతులమ్మో పావు సేరు మెంతులమ్మో 
ఎహె ...

చరణం: 1 
మొదని  కన్ను గింజనుకొని  కులికింది పికిలి పిట్టా 
పెదవి దొండ పండనుకొని చిదిమింది చికిలి పిట్టా 
పిట్ట కథలు ఎన్నని నే చెప్పుకొనమ్మో 
పొదుపు కథలు ఎట్టా  నే విప్పుకోనమ్మా
ఆడ గొట్టే ఈడ గొట్టే వున్నా గుట్టే బైట పెట్టె 

చరణం: 2 
నీలాంటి రేవు కాడ తెల్లారి పొద్దు కాడ 
ఏమైందటా...
ఒడ్డుమీద ముక్కు పుడక పట్టుకెళ్ళే పాడు పిట్ట 

వెరీ వెరీ గుడ్డు ...
ఆరేసుకున్న కొక కాజేయ లేక నిన్న
ఎక్కించుకున్న రైక ఎత్తుకెళ్లే పడుచు పిట్ట  
బావుంది బావుంది 
ఈ పిట్ట కథలు ఎన్నని నే చెప్పుకొనమ్మో 
ఆ పొడుపు కథలు ఎట్టా  నే విప్పుకోనమ్మా
ఆడ గొట్టే ఈడ గొట్టే వున్నా గుట్టే బైట పెట్టె 

పాలకంకి మీదుంది పైరు 
అబ్బాబ్బాబ్బ పడలేనమ్మా పిట్టల పోరు 
ఒడుపు చూసి పట్టబోతే గడుసు పిట్టరో 
కన్ను కొట్టి తుర్రు మంది కన్నె కౌజు పిట్టరో 
కటకటాల రుద్దరయ్యో ఈ కిటికిటీలు వద్దురయ్యో 

పడుచు బళ్ళో పంతులమ్మో పావు సేరు మెంతులమ్మో




ఎంత కులుకు ఎంతో ఉలుకు పాట సాహిత్యం

 
చిత్రం: కటకటాల రుద్రయ్య (1978)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: వేటూరి 
గానం: యస్. పి. బాలు, పి. సుశీల 

పల్లవి:
ఎంత కులుకు ఎంతో ఉలుకు
తొలి మోజులు తీరే వరకు
ఎంత కులుకు ఎంతో ఉలుకు
తొలి మోజులు తీరే వరకు

ఎంత ఉడుగు... ఎంతో దుడుకు... హొయ్.. హొయ్.. హొయ్
చిరుగాజులు చిట్లే వరకు... హొయ్.. హొయ్.. హొయ్

ఎంత కులుకు ఎంతో ఉలుకు
తొలి మోజులు తీరే వరకు
లలల్లా.. లలల్లా

చరణం: 1
చలికాలం వచ్చిందంటే... చెలి కౌగిలి ఇచ్చిందంటే
మనసనేది సొద పెడుతుంటే... వయసు సొగసు ముడిపడుతుంటే

విడి విడిగా ఉండలేక... తడబడుతూ సాగలేక
విడి విడిగా ఉండలేక... తడబడుతూ సాగలేక

ఒకరిలోన ఒకరొదిగి అతికి బ్రతికి పోతుంటే
లలల్లలల్లా... హోయ్.. లలల్లలలా

ఎంత కులుకు...  ఎంతో ఉలుకు
తొలి మోజులు తీరే వరకు

చరణం: 2
ముసురసలే పడితే గిడితే... కసిగా కోరిక బుసకొడితే
పడుచు పైట గొడుగే పడితే... ఆ గొడుగులోన ఇరుకున పడితే

తహతహలో ఆగలేక...  తడిగాలికి సాగ లేక
గొడుగు గాలికికెగిరిపోయి... గొడవ  ముదిరిపోతుంటే
లలలలల్లా... లలలలల్లా

ఎంత కులుకు...  ఎంతో ఉలుకు 
తొలి మోజులు తీరే వరకు

ఎంత ఉడుగు... ఎంత దుడుకు
చిరుగాజులు చిట్లే వరకు

ఎంత కులుకు...  ఎంతో ఉలుకు
తొలి మోజులు తీరే వరకు
లలల్లా.. లలల్లా




మధురా నగరిలో పాట సాహిత్యం

 
చిత్రం: కటకటాల రుద్రయ్య (1978)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: వేటూరి 
గానం: యస్. పి. బాలు, పి. సుశీల 

మధురా నగరిలో 



పట్టాడే... కొట్టాడే... పాట సాహిత్యం

 
చిత్రం: కటకటాల రుద్రయ్య (1978)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: వేటూరి 
గానం: యస్. జానకి, పి. సుశీల 

పట్టాడే... కొట్టాడే...
జబ్బపట్టాడే లాగి దెబ్బ కొట్టాడే 




మాలిష్ బూట్ పాలిష్ పాట సాహిత్యం

 
చిత్రం: కటకటాల రుద్రయ్య (1978)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: వేటూరి 
గానం: యస్. జానకి, పి. సుశీల 

మాలిష్ బూట్ పాలిష్


No comments

Most Recent

Default