చిత్రం: అల్లుడు దిద్దిన కాపురం (1991) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల, డా॥ సి. నారాయణరెడ్డి నటీనటులు: కృష్ణ , మోహన్ బాబు, బి సరోజాదేవి, శోభన, మానస మాటలు: జంధ్యాల స్క్రీన్ ప్లే, కూర్పు, దర్శకత్వం: కృష్ణ ఘట్టమనేని నిర్మాత: యు.సూర్యనారాయణబాబు బ్యానర్: పద్మావతి ఫిలిమ్స్ విడుదల తేది: 21.07.1991
Songs List:
ఇది మల్లెలమాసం పాట సాహిత్యం
చిత్రం: అల్లుడు దిద్దిన కాపురం (1991) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం: యస్.పి. బాలు, వాణీ జయరాం (ఈ పాట అమీర్ ఖాన్ మరియు మాధురి దీక్షిత్ నటించిన Dil (1990) సినిమాలోని సాంగ్ Mujhe neend na aayi - Music: Anand Milind Singers: అనూరాధ పాడ్వల్, ఉదిత్ నారాయణ్ గారు) పల్లవి: ఇది మల్లెలమాసం వలపుల వారం ప్రేమకు తీరం పరువానికి ప్రాయం మదనుడి సాయం కోరిన గేయం ఈ మల్లెల మాసంలో... చెలికొమ్మలలో తొలికోయిలలా చిగురాకుల ఊయలలూగె వసంతమిక వచ్చెనులే వయసు నులి వెచ్చనలే ఉషస్సులిక కన్నులులే మనసులిక వెన్నెలలే తడి చిత్తడిలో ఎద హాత్తుకునే పడుచాకుల పందిరి వేసె ముహూర్తమిక ఆగదులే ముడే ఇక వీడదులే జతే ఒక జావళిగా శ్రుతే ఇక మించెనులే చరణం: 1 వేణువు వంతెన వేసే మధూదయంలోనే పరువము పదే పదే.. విరబూసేనే సూర్యుడు కన్నులు గీటే శుభోదయంలోనే.. పిలుపులు ప్రియా ప్రియా.. అనురాగాలే తడబడు పెదవుల చప్పుడే తగిలెను ముద్దులు ఇప్పుడే అడగక తప్పదు అప్పుడే అలిగిన సొగసులు గుప్పెడే ఇవి జంటలలో చలి మంటలులే ఒడి గంటలు మోగిన వేళా కులుకు ముల్లు గుచ్చుకునే వగలు అరవిచ్చెనులే చినుకువాలు కన్నులలో... నెమలి కళలొచ్చెనులే చరణం: 2 హంసలు మోసుకు వచ్చిన హాయివి నీవేలే... హంపిని కాసిన సొంపుల రేయివి నీవేలే.. ప్రేమకు పాటలు నేర్పిన పల్లవి నీవేలే పూచిన ఆశల పూవుల పల్లకి నీవేలే కుడి బుజమదిరెను గుట్టుగా శుభశకునములకు గుర్తుగా తొడిమకు చాటున మొగ్గలా తడమకు నేనా సిగ్గిలా తొలి చూపులనే గాలింపులలో జల్లించకు మన్మధ మాల వయస్సొక వాకిలిలే ప్రియా అది దాటవలే ఇది మల్లెలమాసం వలపుల వారం ప్రేమకు తీరం పరువానికి ప్రాయం మదనుడి సాయం కోరిన గేయం.. చెలికొమ్మలలో తొలికోయిలలా చిగురాకుల ఊయలలూగె వసంతమిక వచ్చెనులే వయసు నులి వెచ్చనలే జతే ఒక జావళిగా.. శృతే ఇక మించెనులే
ఇత్తడి బిందెకు పాట సాహిత్యం
చిత్రం: అల్లుడు దిద్దిన కాపురం (1991) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: గానం: ఇత్తడి బిందెకు
కాస్కో కాంతామణి పాట సాహిత్యం
చిత్రం: అల్లుడు దిద్దిన కాపురం (1991) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: గానం: కాస్కో కాంతామణి
లబ్బుడు డిబ్బుడు పాట సాహిత్యం
చిత్రం: అల్లుడు దిద్దిన కాపురం (1991) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: గానం: లబ్బుడు డిబ్బుడు
వయస్సుర పాట సాహిత్యం
చిత్రం: అల్లుడు దిద్దిన కాపురం (1991) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: గానం: వయస్సుర

No comments
Post a Comment