Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Maa Voori Maaraju (1994)



చిత్రం: మావూరి మారాజు (1994)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం:
గానం: ఎస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: అర్జున్ సార్జా, సౌందర్య, ప్రియారామాన్, సుజాత, సిల్క్ స్మిత
కథ: రాజ్ కిరణ్
మాటలు: గణేష్ పాత్రో
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాతలు: కొల్లి వెంకటేశ్వరరావు, ఎస్.ఆదిరెడ్డి
విడుదల తేది: 1994

కోరస్:
ఘణ ఘణ గంటలు గుండెలో మ్రోగెను
మంగళ వాద్యములై
గురువు గువ్వలు కమ్మగ పాడెను మన్మధ మంత్రములై
అణువణువున అల్లరి మల్లెలు పూసెను ఆశల ఆమణియై

పల్లవి:
తక థింత థింత తక
దిథోమ్ థోమ్ తక తదిగిన థోమ్
ఒక తోడు దొరికెనని కథం తొక్కినది పడుచుదనం
సిరిమువ్వై చిలిపిమది ఉరికింది ఉప్పొంగి
చెంగు చెంగుమని జతులాడినది
శుభ తరుణం చూసుకొని

తక థింత థింత తక
దిథోమ్ థోమ్ తక తదిగిన థోమ్
ఒక తోడు దొరికెనని కథం తొక్కినది పడుచుదనం

చరణం: 1
మెల్లగా మేలుకో ఈడులో కోరిక
చల్లగా ఏలుకో కౌగిలే కోటగా
ముళ్ళు వేయగ పిలిచింది పెళ్లి పందిరి వేడుక
అల్లుకుందుకు రమ్మంది మల్లె పానుపు వేదిక
ఇకపైన రేయిపగలు మనపాలి పూల పొదలు
ఒక ప్రాణమైన వడిలో కలవాలి రెండు కథలు

తక థింత థింత తక
దిథోమ్ థోమ్ తక తదిగిన థోమ్
ఒక తోడు దొరికెనని కథం తొక్కినది పడుచుదనం

చరణం: 2
నింగిలో రంగులే నేలపై వాలెనా
గంగలో పొంగులే కన్నెగా మారెనా
కోవెలే దరిచేరినది పావురానికి గూడుగా
వెన్నెలే వడి చేరినది జీవితానికి తోడుగా
ఎదురైన ఇంత సుఖమో ఏ పూర్వ పుణ్యఫలమో
ఎదలోని వింత స్వరము ఏ వెనుక జన్మ వరమో

తక థింత థింత తక
దిథోమ్ థోమ్ తక తదిగిన థోమ్
ఒక తోడు దొరికెనని కథం తొక్కినది పడుచుదనం
సిరిమువ్వై చిలిపిమది ఉరికింది ఉప్పొంగి
చెంగు చెంగుమని జతులాడినది
శుభ తరుణం చూసుకొని

తక థింత థింత తక
దిథోమ్ థోమ్ తక తదిగిన థోమ్
ఒక తోడు దొరికెనని కథం తొక్కినది పడుచుదనం






No comments

Most Recent

Default