Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bangaru Papa (1955)
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
నటీనటులు: కైకాల సత్యన్నారాయణ, జగ్గయ్య, యస్.వి.రంగారావు 
నిర్మాత & దర్శకత్వం: బి.యన్.రెడ్డి 
విడుదల తేది: 19.03.1955Songs List:హరికథ సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: 

హరికథ

సీతాదేవి శ్రీరామచంద్రుని మరీమరీ వేడుకోగా-
మిసమిసలాడే పసిడిలేడికయి
మిథిలానందనవేడ
ఆ మిథిలానందనవేడ
విసవిస నా రఘువీర వరేణ్యుడు
వెడలె లేడిజాడ

అది – వెనుకకొక్క పరిజూచి
తన మునిగాళ్ల పైనిలేచి
అట వేచి తన మెడను సాచి
భయమెదను దోచి
తన యొడలు దాచి
మరి – తారి పొదలలో దూరియడవి బం
గారు లేడి పరు గెత్తె

అంతట 
పారు లేడి గని శ్రీరాముడు తన
బాహువులను విల్లెత్తె
రోసముతో రఘురాముడు బాణము
మోసకారిపై వదలె -
హా సీతా ! హా లక్ష్మణా! యని యా
హరిణము ప్రాణము వదలే -

ఆ యార్త నాదమునిని యదరిపడి జానకీదేవి మరదియయిన లక్ష్మణస్వామితో.

తే॥ గీ॥ 
అన్న పొమ్మయ్య, పొమ్ము, నీ యన్నగారి
ఆర్తనాదము వలెదోచునది యదేమొ
నా మనసుకీడు శంకించునయ్య! క్రూరు.
లైన రాక్షసులుందురీ కానలోన!

ఆ పలుకులు విన్న సౌమిత్రి పక్కున నవ్వి, “అమ్మా !”

తెలియక అందువుగానీ ఆ
దేవదేవునకు భయమేమీ
తులువలైన దైత్యులను దునిమి – ఈ
ఇలనుబ్రోవ జనియించె రాముడని॥ తెలియక ||

అన్న మరది మాటలకు ఆపార్ధంబు కల్పించి ఆ సీతా మహిసాధ్వి అనరాని నిష్ఠురో క్తులాడింది

తే॥ గీ॥ 
అవురవుర మాయదారి! నీ యన్నగారి
మోసకారి రక్కసుల పార్టీని, ఇచట
నేమిచేయ దలంచితో యెరుగవచ్చె
కుటిల బుద్ధులు, నీకు దక్కుదునె నేను

అన్న సీతమ్మ పలుకులు చెవులకు ములుకులై సోకిన లక్ష్మణస్వామి, “హరి హరీ!" యని దుఃఖించి, చేయునదిలేక పర్ణశాల వాకిట.. ఏడుగీటులు గీసి, ఏమి
సంభవించినను, వానిని దాటి అడుగు పెట్టకూడదని వదినగారితో పదేపదే చెప్పి, ఒప్పించి అన్నగారు పోయిన మార్గము ననుసరించి తానునూ బయలుదేరెను.
అంతలో అదనుకై ప్రక్కనే పొంచియున్న రావణాసురుడు వృద్ధభిక్షుక వేషంలో
పర్ణశాల ముంగిట నిలిచి, "భవతి భిక్షాందేహీ” అన్నాడు. ఆ కేక విని జానకి దేవి
బిచ్చంతో బైటికివచ్చి గుమ్మందగ్గిరే నిలబడింది. ఆ తల్లి ఆ గీటుదాటి
రాకపోవడం జూచి, తాను ముందుకు రావడానికి భయపడి, లేని ఆగ్రహం నటిస్తూ
ఆ కపటి - “ ఔరా ! ఈ ముసలి సన్యాసిపై ఇంత తిరస్కారమా: నాలుగడుగులు

ముందుకు రాలేవా ? అభ్యాగతుణ్ణి దైవంలాగ పూజించాలని సాధ్వివి నీకు ఆ మాయావి తెలియదా ? నీ భిక్షం నీ దగ్గరే ఉంచుకో-నే వెళ్లొస్తా” నన్నాడు.
మాటలు విని, మనస్సు కలతపడి అమాయకురాలైన ఆ తల్లి తోందరగా విచ్చంతో ఆ రాక్షసుడి ముందు నిలబడగా,

చటుకున తన పది తలలతోడ
ఆ కుటిల రాక్షసుడు తో చె
వికటముగా పకపకమని నగి
తన వింశతిబాహులు చాచె
అది గని 'హా'యని గుండెలదర
సీతమ్మ నేలపై వ్రాలె

అప్పుడా లంకాధిపతి మూర్ఛపోయిన సీతాదేవిని భూమితోసహా పెల్లగించి ఆకాశమార్గాన్ని ఎత్తుకుని పారిపోయాడు. పాపం ! ఆ మహా సాధ్వి....
బ్రతుకు స్వప్నముకాదు పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: పి. సుశీల

బ్రతుకు స్వప్నముకాదు పండుపున్నమికాదు
అంతులేని వసంతమస లెక్కడాలేదు.

ఈసెగల ఈ పొగల నీబ్రతుకు ముగిసెనే
నీ కలలు మాసెనే - అయ్యో -

ఈదీన పసికూన కేదారి చూపేవు
ఏరాతి మనసు నీ పాపకై కరుగునో

ఆమంటలంతలో ఆరిపోవునుగాని
నీ మనసులో మంట నిలిచి రగిలేను

తానెవరో నీవెవరో ఏనాటి బంధమో
దైవమే నీ గుండె దయతోడ నింపెనా!
తాధిమి తకధిమి తోల్బొమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: మాధవపెద్ది సత్యం 

లుళ లుళ లుళా.... ఆయీ.... ఆయి
తాధిమి తకధిమి తోల్ బొమ్మా
దీని తమాష చూడవె కీల్బోమ్మా

తాధిమి తకధిమి తోల్బొమ్మా
దీని తమాష చూడవె కీల్ బొమ్మా
దీని తమాష చూడవే మాయబొమ్మా
ఆటమ్మా పాటమ్మా జగ
మంతా బొమ్మాలాటమ్మా....
తలాంగు తకధిమి తోలొ బొమ్మా తోం
తకతై తకతై మాయబొమ్మా

లుళ లుళ లుళా.... ఆయీ... ఆయి
ఆయి - ఆయీ
ఆపదలు కాయీ.... ఆపదలు కాయీ....
ఆయి - ఆయీ
ఆపదలు కాయీ.....

తకతై - తకతై మాయబొమ్మా
నాలుగు దిక్కుల నడిమి సంతలో
తూలే తుళ్లే తోల్బొమ్మా
తూలే తుళ్లే కీల్బొమ్మా
ఎవరికెవ్వరో ఏమౌతారో
ఇవరము తెలుసా ? - కీల్ బొమ్మా
ఈ-ఇవరము తెలుసా ? - మాయబొమ్మా

తలాంగు తకధిమి తోల్ బొమ్మా - తోం
తకతై - తకతై - మాయబొమ్మా

కోపము తాపము క్రూర కర్మలూ
కూడని పనులే తోలొమ్మా
పాపపు రొంపిని పడబోకే పర
మాత్ముని నమ్మవె కీల్బొమ్మా
ఆటన్నా - పాటన్నా పర
మాత్ముని బొమ్మా లాటన్నా
ఆటన్నా - పాటన్నా.........

కన్నదేవకి వంతు పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: 

కన్నదేవకి వంతు కన్నీరే కాని
కన్నార నీలీల కాంచలేదాయె, కృష్ణా....
ఏకొర నోములు - ఏవి నోచెనో
శన్నదేవకికి - కన్నీరాయె

నీ మురిపెములూ - నీ చిరుసొగసులు
పేద యశోదా - పెన్నిధులాయె
వ్రేపల్లియలో - వెలసిన కృష్ణా
వెన్నమీగడల చిన్నారికృష్ణా ! పొన్నారి కృష్ణా!
కృష్ణా ! గోవర్ధన గిరిధారీ కృష్ణా !
గోపీ హృదయ విహారీ కృష్ణా !
బృందావన సంచారీ కృష్ణా !
సుందర మురళీ ధారీ కృష్ణా !
అగణిత గుణ పరమాత్మా,
అగణిత గుణ పరమాత్మా, కృష్ణా !
జగముల వెలిగే స్వామి కృష్ణా, స్వామి కృష్ణా !
నీ లీలల మే మెరుగము, కృష్ణా !
నీలమోహనా ! బాలా కృష్ణా !
బాలా కృష్ణా ! బాలా కృష్ణా !వెడలె ఈ రాజకుమారుడు పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: ఎ.యం.రాజా, పి.సుశీల

వెడలె ఈ రాజకుమారుడు బంగారు తేరుపైన
రంగైన రాణితోడ వెడలె ఈ రాజకుమారుడు

మోజైన నాట్యాలాడ జైజై గీతాలు పాడ
బాజా బాకాల తోడ తాదీం తక తకతక తకతై
కస్తూరి రంగయ్య కావేటి రంగయ్య
ఎచటికి పయనము ఎరుగము వైనము
ఒయ్యారి భామాతోడ ఊరేగే రంగయ్య
ఒయ్యారి దేవీతోడ ఊరేగే రంగయ్య
కస్తూరి రంగయ్య కావేటి రంగయ్య
మాఊరికావల తామరపూవుల కోనేటికీవల
కొలువుండ పొయ్యేము రంగయ్య రంగయ్య
రావయ్య రంగయ్య కస్తూరి రంగయ్య

కోరమీసపు చిన్నావాడ
ఓరచూపుల పిల్లాతోడ
కులుకుతు బెళుకుతు జాతరకెళ్లేవ్ రయ్యో చిన్నోడ
నీవు గోటుగ నీటుగ జాతరకెళ్లేవ్ రయ్యో చిన్నోడ
ఓరయ్యో చిన్నోడు....
అయ్యో చిన్నోడ
ఓ లమ్మీ చిన్నమ్మీ !
గలగల మువ్వల సవ్వడితో తలలూ పుచు లేగల తో
అదే అదే ఆలమందా ఆ పుంతలోన
రెక్కలుసాచి చుక్కలదారి రివురివ్వున గూళ్లకు చేరే
అదే అదే పిట్టల బారు ఆకాశ వీధి....
ఆరేవు కాడ ఆతోపు నీడ
సన్ను సూసి సిన్నది నవ్వి ఊరు కున్నది
నన్ను చూసి చిన్నది నవ్వి ఊరు కున్నది

మిన్నేటి జాడ మేఘాల ఓడ
వెండి తెర చాపతో కొండ దాటి పోదువా
వెడలె ఈ రాజకుమారుడు బంగారు తేరుపైన
పొంగారు ఠీవి తోడ వెడలె మా రాజకుమారుడువెన్నెలపందిరిలోన పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: ఎ.యం.రాజా, పి.సుశీల

ఈ వెన్నెల.... మల్లి విరిపందిరిలోనా
చిరునవ్వుల హారతి శేఖరుతీనా
వెన్నెలపందిరిలోన - చిరునవ్వుల హారతులీనా
పండువెన్నెలా - మనసునిండా వెన్నెలా
కొండపైనా కోనపైనా కురిసేవెన్నెలా! విరిసేవెన్నెలా!
మబ్బులదారీ, ఓ బాటసారీ !
నీ ఒంటరి పయనముకాదా.
నీ జంటగ నీ సఖిలేదా.....
నాకై వేచే - నవ్వులు పూచే
నా చెలి కన్నులకాసే వెన్నెలా
పైనా వెన్నెలా - మనసులోనా వెన్నెలా
పైనాలోనా చందమామ పరచేవెన్నెలా! పాలా వెన్నెలా!
చల్లనిరేయి - మెలమెల్లని గాలి
అలనల్లన మమతలు మూగే
తియతీయని తలపులు రేగే
తీయని తలపులు తెచ్చేదెవరో
నాకై పరుగున వచ్చేదెవరో

పండువెన్నెలా - మనసునిండా వెన్నెలా
కొండపైనా కోనపైనా కురిసేవెన్నెలా ! విరిసేవెన్నెలా !

యౌవన మధువనిలో పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: ఎ.యం.రాజా, పి.సుశీల

ఉయ్యాల పాట

యౌవన మధువనిలో - వన్నెలపూవుల ఉయ్యాలా
ఉయ్యాల జంపాలా - ఉయ్యాల జంపాలా
జీవన మధువనిలో - పచ్చనితీగల ఊయాలా
ఉయ్యాల జంపాలా -
ఉయ్యాల జంపాలా
బ్రతుకే యెలమావితోట - మదిలో మకరందపుతేట
అడుగడుగున పూవులబాట అనిచాటే కోయిల పాట
ఉయ్యాల జంపాలా - ఉయ్యాల జంపాల
అలనల్లన నామదిలోనా - పలికేబంగారు వీణ
ఏమెత్తని అంగుళి ఆనీ - ఈ తీగెలు మీటెనొగానీ
ఉయ్యాల జంపాల - ఉయ్యాల జంపాల
పచ్చని మధువనిలో - వలపులు విచ్చిన ఊయాలా
పచ్చని మధువనిలో వలపులు....

ఘలుఘల్లున గజ్జెలుమోగ పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: 

బిచ్చగాళ్ల నాట్యం

ఘలుఘల్లున గజ్జెలుమోగ
తకతై తైతైతై ఆడవే

బులబుల్ జిల్లాలల్ ఆడవే
ఘలుఘల్లున గజ్జెలుమోగ ॥
వారే బుల్ బుల్!
చుక్కాలకోకగట్టి
అద్దాలారెయికా తొడిగి
కులుకుతూ నీవు ఆడ
రాలాలీ పైసా జోరుగ
రావాలీ పైసా జోరుగ
ఘలుఘల్లున గజ్జెలుమోగ
గలగలగల పైసా రాలునే
వెన్నెలవేళలు పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: పి.సుశీల

వెన్నెలవేళలు పోయినా
ఏమున్నది నాకిక బ్రతుకునా
అనురాగ మెరుగలేని జగతిని
జీవితమంతా చీకటిరేయేనా
సుఖమంతా పోయెనా ॥
కలిమిలేనిదానా - ఏకులములేనిదీనా
అందరాని ఆచందమామకై
ఆశపడితినేలా బేలనై
జీవితమంతా చీకటిరేయేనా
సుఖమంతా పోయెనా

ఏరికొరకు ఈ వాకిట నిలబడి
ఎదురుచూచి వేచేనో
చేరి ఎవరునను “పాపా”యని ఇక
చెంతనిలిచి పిలిచేరో
కనుల కొకసారయిన కనబడని పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: పి.సుశీల

పాప పాట

కనుల కొకసారయిన కనబడని నాతల్లి
సెలవిమ్మ నీకన్న పాపకు
ఈ చోటికేనాడు ఇంక రాలేనమ్మా
ఒకసారి ఒడిలోన ఒరిగి సెలవడగనా
సెలవిమ్మ నీకన్నపాపకు -
కలలెన్నో బేలనై కనిమురిసినా నమ్మ
కడలేని వేదనే కడకు మిగిలేనమ్మా
కలనేని ఏనాడు కనరాని నాతల్లి
నీ పాప బ్రతుకింక నేలపాలేనా ?

No comments

Most Recent

Default