Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Krishnaveni (1974)




చిత్రం: కృష్ణవేణి (1974)
సంగీతం: విజయభాస్కర్
నటినటులు: కృష్ణం రాజు, వాణిశ్రీ
దర్శకత్వం: వి. మధుసూదనరావు
నిర్మాత: యు. వి. సూర్యనారాయణ రాజు
విడుదల తేది: 11.07.1974



Songs List:



కృష్ణవేణి పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణవేణి (1974)
సంగీతం: విజయభాస్కర్
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: వి.రామకృష్ణ , పి.సుశీల

హే జనని కృష్ణవేణి
రాజిత తరంగవాణి
పంచ పాతక హారిణి
పరమ మంగళకారిణి
దక్షినోర్వి దివ్యవాహిని
అక్షీణ భాగ్య ప్రదాయిని
శ్రీశైల మల్లికార్జున దివ్యచరణ సంశేవిని
కనకదుర్గా భవ్య కరుణాకటాక్ష సంవర్ధిని
కనకదుర్గా భవ్య కరుణాకటాక్ష సంవర్ధిని
కృష్ణవేణి కృష్ణవేణి మమ: ప్రశీద, మమ: ప్రశీద

పల్లవి:
కృష్ణవేణి కృష్ణవేణి
కృష్ణవేణి తెలుగింటి విరివోణి
కృష్ణవేణి నా ఇంటి అలివేణి
కృష్ణవేణి తెలుగింటి విరివోణి
కృష్ణవేణి నా ఇంటి అలివేణి

చరణం: 1
శ్రీగిరిలోయల సాగే జాడల
శ్రీగిరిలోయల సాగే జాడల
విద్యుల్లతలు కోటి వికశింపజేసేవు
లావణ్యలతవై నను చేరువేళ
లావణ్యలతవై నను చేరువేళ
శతకోటి చంద్రికలు వెలిగించు కృష్ణవేణి
కృష్ణవేణి తెలుగింటి విరివోణి
కృష్ణవేణి నా ఇంటి అలివేణి

చరణం: 2
నాగార్జున గిరి కౌగిట ఆగి
నాగార్జున గిరి కౌగిట ఆగి
బీళ్ళను బంగారు చేలుగా మార్చేవు
ఆంధ్రావనికై అన్నపూర్ణవై కరువులు బాపేవు,బ్రతుకులు నిలిపేవు
నా జీవనదివై ఎదలోన ఒదిగి
నా జీవనదివై ఎదలోన ఒదిగి
పచ్చని వలపులు పండించు కృష్ణవేణి
కృష్ణవేణి తెలుగింటి విరివోణి
కృష్ణవేణి నా ఇంటి అలివేణి

చరణం: 3
అమరావతి గుడి అడుగుల నడయాడి
అమరావతి గుడి అడుగుల నడయాడి
రాళ్ళను అందాల రమణులుగ తీర్చేవు
ఏ శిల్ప రమణులు , ఏ దివ్య లలనలు
ఏ శిల్ప రమణులు , ఏ దివ్య లలనలు
ఓర్చని అందాలు దాచిన కృష్ణవేణి

చరణం: 4
అభిసారికవై హంసలదీవిలో
సాగర హృదయాన సంగమించేవు
నా మేని సగమై నా ప్రాణసుధవై
నా మేని సగమై నా ప్రాణసుధవై
నిఖిలము నీవై నిలిచిన కృష్ణవేణి
కృష్ణవేణి తెలుగింటి విరివోణి
కృష్ణవేణి నా ఇంటి అలివేణి




శ్రీశైల మల్లయ్య పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణవేణి (1974)
సంగీతం: విజయభాస్కర్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల

శ్రీశైల మల్లయ్య 




సంగీతం మధుర సంగీతం పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణవేణి (1974)
సంగీతం: విజయభాస్కర్
సాహిత్యం: 
గానం: పి.సుశీల

సంగీతం మధుర సంగీతం 





పదునాలుగేల్లు వనవాసమేగి పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణవేణి (1974)
సంగీతం: విజయభాస్కర్
సాహిత్యం: 
గానం: పి.సుశీల

పదునాలుగేల్లు వనవాసమేగి మరలి వచ్చేను సీత




ఎందుకో నీవు నాతో పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణవేణి (1974)
సంగీతం: విజయభాస్కర్
సాహిత్యం: దాశరథి
గానం: వి.రామకృష్ణ, పి.సుశీల

పల్లవి:
ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి
ఎందుకో నిన్ను విడిచి నిమిషమైన నిలువలేనోయి
ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి
ఎందుకో నిన్ను విడిచి నిమిషమైన నిలువలేనోయి

చరణం: 1
మనసులోని మమతలన్నీ
మల్లెపూలై విరిసే నీకై
మనసులోని మమతలన్నీ
మల్లెపూలై విరిసే నీకై
వలపులన్నీ పూలమాలై
కురులలోన కొలిచె నీకై
ఎన్ని జన్మాలకైనా... నీవు నాదానివేనే
ఇందుకు సాక్షులు గిరులు తరులు 
గిరులు తరులు...

ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి
ఎందుకో నిన్ను విడిచి నిమిషమైన నిలువలేనోయి

చరణం: 2
నీలికన్నుల ఆలయాన
నిన్ను స్వామిగ నిలుపుకోనా
నీలికన్నుల ఆలయాన
నిన్ను స్వామిగ నిలుపుకోనా

ఎల్లవేళలా జీవితాన
నిన్ను దేవిగా కొలుచుకోనా
గౌరీశంకరుల చందం
మనది విడిపోని బంధం
ఇందుకు సాక్షులు సూర్యుడు చంద్రుడు
సూర్యుడు చంద్రుడు...

ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి
ఎందుకో నిన్ను విడిచి నిమిషమైన నిలువలేనోయి
ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి

No comments

Most Recent

Default