Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Dongalludu (1993)





చిత్రం: దొంగల్లుడు (1993)
సంగీతం: రాజ్-కోటి
నటీనటులు:సుమన్, సౌందర్య
దర్శకత్వం: శరత్
ర్మాతలు: సి.అంజిరెడ్డి, వి.జగన్మోహన్ రెడ్డి
విడుదల తేది: 31.12.1993



Songs List:



చందమామ కన్నుగొట్టె సందెవేళ పాట సాహిత్యం

 
చిత్రం: దొంగల్లుడు (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

చందమామ కన్నుగొట్టె సందెవేళ
సిగ్గుమల్లె పూలుపెట్టె చీకటేల
మంచెకాడుంది రావే పంచదార మాపటేల
తోడుపెట్టేసుకుంటా పొంగులన్ని పాలవేల
అందమంత ఆరబెట్టె పైటజారే
కోడిగాలి కొట్టగానే కోకజారే
పడలేని ఆరాటం...

చందమామ కన్నుగొట్టె సందెవేళ
సిగ్గుమల్లె పూలుపెట్టె చీకటేల
మంచెకాడుంది రారా పంచదార మాపటేల
తోడుపెట్టేసుకోర పొంగులన్ని పాలవేల

చరణం: 1
జాజిమల్లి మంచునీకు జల్లుకుంట
కొత్త నాగమల్లి తీగలాగ అల్లుకుంటా
వాలింది పొద్దు - వడ్డించు ముద్దు
తప్పులెన్ని చేసుకున్న ఒప్పుకుంటా
నువ్వు తప్పుకుంటే తిప్పలెట్టి తిప్పుకుంటా
కౌగిళ్ళు పట్టు  -  కవ్వింత కొట్టు
నీషా కళ్ళ నీడలో హుషారైన ఓ కల
ఓ రసాలమ్మ కోనలో పసందైన ఆకలా
చలి తీరాలి సాయంత్రం

చందమామ కన్నుగొట్టె సందెవేళ
సిగ్గుమల్లే పూలుపెట్టె చీకటేల
మంచెకాడుంది రారా పంచదార మాపటేల
తోడుపెట్టేసుకోర పొంగులన్ని పాలవేల

చరణం: 2
మొక్కజొన్న తోటకాడ మొక్కుకుంటా
పాలబుగ్గలోని మొగ్గలన్ని ఇచ్చుకుంటా
జాబిల్లి జంట  - జాగారమంట
చీరకున్న సిగ్గులన్ని దోచుకుంటా
నీకు బిర్రుపట్టు రైకలెట్టి చూసుకుంటా
శ్రీ కంచి పట్టు  - స్త్రీ కన్ను కొట్టు
హాయ్ గులాబీల తోటలో కులసాలు పండని
హ పెదాలమ్మ పేటలో పదలెన్నో పాడని
చిలకమ్మ నీకోసం

చందమామ కన్నుగొట్టె సందెవేళ
సిగ్గుమల్లె పూలుపెట్టె చీకటేల
మంచెకాడుంది రావే పంచదార మాపటేల
తోడుపెట్టేసుకుంటా పొంగులన్ని పాలవేల
అందమంత ఆరబెట్టె పైటజారే
కోడిగాలి కొట్టగానే కోకజారే
పడలేని ఆరాటం...




వానజల్లు జాతర పాట సాహిత్యం

 
చిత్రం: దొంగల్లుడు (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర


బృందం:
చం చ చం చం చం చం చం (4)
ధిననన ధిననన ధిననన ధిననన  ధిననననా
ధిననన ధిననన ధిననన ధిననన  ధిననననా

వానజల్లు జాతర
స్వాతిముద్దు మోతరా
ఎడా పెడా కొట్టే జల్లులు
నీ చినుకు ఆరదు
నా ఉడుకు తీరదు

చిలుకలు కిలకిల వణకగ చిలిపిగ చినుకు పడ
గొడుగులు అదరగ గొడవలు ముదరగ పిడుగు పడ

వానజల్లు జాతర
స్వాతిముద్దు మోతరా
ఎడా పెడా కొట్టే జల్లులు

పదగరిసనీరి... పదగరిసనీరి...

చరణం: 1
శ్రావణవేళ  సంధ్యలలోనా
కన్నె గులాబీ కౌగిలిలోన
కరిగెనులే సోకులే కడిగెను పూరేకులే
చినుకులు చీరైనవి పైటైనవి చలాకీ వానలో
చిటపటమంటున్నవి  మాటన్నవి ప్రియా నీ వీణలో
నీ పిలుపు దాహమై
నీ మెరుపు మోహమై

ధిననన ధిననన ధిననన ధిననన  ధిననననా
ధిననన ధిననన ధిననన ధిననన  ధిననననా

వానజల్లు జాతర
స్వాతిముద్దు మోతరా
ఎడా పెడా కొట్టే జల్లులు

ధిననన ధిననన ధిననన ధిననన  ధిననననా

చరణం: 2
ఉపిరిగాలి మువ్వల వాన
అల్లరి చేసి అల్లికలోన
మెరుపుల మేనాలలో
ఉరుములు ఊరేగేలే
అలిగిన ఓ అందమా
ఆషాడమా వయస్సే వేడిలే
బిగిసిన ఓ బింకమా
చాలించుమా మనస్సే నీదిలే
నీ తడుకు తాళమై...
నీ నడక గేయమై...

ధిననన ధిననన ధిననన ధిననన  ధిననననా
ధిననన ధిననన ధిననన ధిననన  ధిననననా

వానజల్లు జాతర
స్వాతిముద్దు మోతరా
ఓ ఎడా పెడా కొట్టే జల్లులు
నీ చినుకు ఆరదు
నా ఉడుకు తీరదు

చిలుకలు కిలకిల వణకగ చిలిపిగా చినుకు పడ
గొడుగులు అదరగ గొడవలు ముదరగ పిడుగు పడ



గంగరావి చెట్టుకాడ పాట సాహిత్యం

 
చిత్రం: దొంగల్లుడు (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

గంగరావి చెట్టుకాడ



చిలకలపూడి పాట సాహిత్యం

 
చిత్రం: దొంగల్లుడు (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, రాధిక 

చిలకలపూడి 




నీ కొంగు చాటు పాట సాహిత్యం

 
చిత్రం: దొంగల్లుడు (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర


నీ కొంగు చాటు 

Most Recent

Default