Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Narasimha (1999)




చిత్రం: నరసింహా (1999)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
నటీనటులు: రజినీకాంత్, సౌందర్య, రమ్యకృష్ణ
దర్శకత్వం: కె.యస్. రవికుమార్
నిర్మాత: ఏ. యమ్. రత్నం
విడుదల తేది: 10.04.1999



Songs List:



నా పేరు నరసింహ పాట సాహిత్యం

 
చిత్రం: నరసింహా (1999)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
రచన: ఏ.యమ్.రత్నం , శివగణేష్
గానం: యస్.పి.బాలు 

సింగమల్లే నువ్వు శిఖరము చేరు
శిఖరము చేరి నింగిని కోరు

నా పేరు నరసింహ
ఇంటిపేరు రణసింహ
నాతోటి ఉన్న సేన ఉరికెటి యువసేన
చూపు ఉగ్ర నరసింహ
రూపు దివ్య నరసింహ
యుద్దమంటూ వచ్చిందంటే పంజా విప్పే నరసింహ
నరసింహ నరసింహ నరసింహ నరసింహ

మనసు ఉన్న మనిషినయ్యా
నేను మీసమున్న బాలుడయ్యా
నేను మేలు చేయు వాడ్నయ
మేలు మర్చిపోనయ్యా
ఈ జన్మ ఎత్తింది దెస సేవకేనయ్యా

సింగమల్లే నువ్వు శిఖరము చేరు
నా పేరు నరసింహ
ఇంటిపేరు రణసింహ
నాతోటి ఉన్న సేన ఉరికెటి యువసేన
చూపు ఉగ్ర నరసింహ
రూపు దివ్య నరసింహ
యుద్దమంటూ వచ్చిందంటే పంజా విప్పే నరసింహ
మనసు ఉన్న మనిషినయ్యా
నేను మీసమున్న బాలుడయ్యా

కోట్ల కోట్ల విలువ చేసే ఆస్తి పాస్తులొద్దు
బిరుదులెన్నో తెచ్చిపెట్టే
పదవులు వద్దు
దండలు వేయొద్దు
మని మకుటాలసలొద్దు
నా జన్మ భూమి ప్రేమ చాలు లే
నా గోరంత చమటకు
కొండంత సిరులిచ్చి పెంచినది ప్రజలే కదా
నా తనువును ధనమును
ప్రజలకు ప్రగతికి పంచుట
పాడి కదా

సింగమల్లే నువ్వు శిఖరము చేరు
నా పేరు నరసింహ
ఇంటిపేరు రణసింహ
నాతోటి ఉన్న సేన ఉరికెటి యువసేన
చూపు ఉగ్ర నరసింహ
రూపు దివ్య నరసింహ
యుద్దమంటూ వచ్చిందంటే పంజా విప్పే నరసింహ
నరసింహ నరసింహ నరసింహ

మనసు ఉన్న మనిషినయ్యా
నేను మీసమున్న బాలుడయ్యా

నిన్ను నువ్వు నమ్మి ముందుకు సాగు
చరితగా మారే స్థాయికి ఎదుగు
నీలో శక్తి ఉన్నది
దాన్ని పదును పెడితే ఫలితమున్నది
మంచి రోజు రేపే ఆరంభించావా

అరేయ్ ఎవరి గుణం ఏవిటో
ఎవరి బలం ఏవిటో
చూసింది ఎవరంటాయా
అరేయ్ విత్తనము చిన్నదంట మర్రి చెట్టు పెద్దదంట
కొంత కాలం ఆగమంట

సింగమల్లే నువ్వు శిఖరము చేరు
శిఖరము చేరి నింగిని కోరు

నా పేరు నరసింహ
ఇంటిపేరు రాణసింహ
నాతోటి ఉన్న సేన ఉరికెటి యువసేన
నరసింహ నరసింహ నరసింహ నరసింహ
చూపు ఉగ్ర నరసింహ రూపు దివ్య నరసింహ
యుద్దమంటూ వచ్చిందంటే పంజా విప్పే నరసింహ
నరసింహ నరసింహ నరసింహ నరసింహ

మనసు ఉన్న మణిశివయ్య
నేను మీసమున్న బాలుడయ్యా
నేను మేలు చేయు వాడ్నయ
మేలు మర్చిపోనయ్యా
ఈ జన్మ ఎత్తింది దెస సేవకేనయ్యా

సింగమల్లే నువ్వు
శిఖరము చేరు
శిఖరము చేరి
నింగిని కోరు హోయ్




మెరిసేటి పువ్వా పాట సాహిత్యం

 
చిత్రం: నరసింహా (1999)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
రచన: ఏ.యమ్.రత్నం , శివగణేష్
గానం: శ్రీనివాస్, నిత్యశ్రీ, శ్రీరామ్

తకధిమి తకఝుణు తకధిమి తకఝుణు
తకధిమి తకఝుణు తకధిమి తకఝుణు
మెరిసేటి పువ్వా సిరిమువ్వ పెనవేసుకోవా
నాతోడురావా నా ఆశ భాష వినవా
మెరిసేటి పువ్వా సిరిమువ్వ పెనవేసుకోవా
నాతోడురావా నా ఆశ భాష వినవా
రేయిలో నీ గుండెపై నను పవళించనీవా
హాయిగా నీ చూపుతో నను చలికాయనీవా..
సఖియా సఖియా సఖియా...
నా ముద్దులో సద్దుల్లో హద్దుల్లో ఉండవ

శృంగారవీర... 
శృంగారవీర రణధీర 
నా ఆజ్ఞ తోటి నావెంటరార నా ఆశ ఘోష వినరా
రాలెడు సిగపూలకై నువు ఒడి పట్టుకోరా
వెచ్చని నా శ్వాసలో నువు చలికాచుకోరా...
మదనా మదనా మదనా...
నా సందిట్లో ముంగిట్లో గుప్పిట్లో ఉండరా శృంగారవీరా...

సఖీ..ఈఈ..ఏఏ...

మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా
నా పదముల చేరగ నీకొక అనుమతి నిచ్చా
సా రిర్రీరి సస్సాస నిన్నీని
రిర్రీరి తత్తాత తక తకిట నిస్సారి నిస్సారి
మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా
గా.. రి స్సా నీ ద
నా పదముల చేరగ నీకొక అనుమతి నిచ్చా
సా నీ స దామగనిస
నా పైట కొంగును మోయా
నా కురుల చిక్కులుతియ్యా నీకొక అవకాశమే
నే తాగ మిగిలిన పాలు
నువ్వు తాగి జీవించంగా మోక్షము నీకె కదా
నింగే వంగి నిలచినదే.. వేడగరా...ఆఆ....

మెరిసేటి పువ్వా సిరిమువ్వ పెనవేసుకోవా
నాతోడురావా నా ఆశ భాష వినవా

వీరా..ఆఆఆ... వీరా..ఆఆఆఅ... 
చంద్రుని చెక్కి చెక్కి చేసినట్టి శిల్పమొకటి చూసా
తన చూపున అమృతం కాదు విషమును చూసా
తన నీడను తాకిన పాపమని వదలి వెళ్ళా..ఆ.ఆ
వాలు చూపుతో వలవేస్తే వలపే నెగ్గదులే
వలలోనా చేప చిక్కినా నీరు ఎన్నడు చిక్కదులే
రా అంటే నే వస్తానా పో అంటే నే పోతానా
ఇది నువ్వు నేనన్న పోటి కాదు
నీ ఆజ్ఞలన్ని తలను దాల్చ పురుషులెవరు పువులు కాదు

శృంగారవీర రణధీరా నా ఆజ్ఞ తోటి
నా వెంటరార నా ఆశ ఘోష వినరా

తోంత తకిట తక్కిటతక తద్ధిన్నా
తధీంకిటక తోంగ తధీంకిటక తోంగ తధీకిటక
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
తాత్తకిట తాత్తకిట తోం ధీం తకిట ధీం తకిట తోం
ఆ.ఆ..ఆ.ఆ..ఆ..
తోంత తకిట తతక తకిట తతక తకిట తతక తకిట
తక్కిట తోంగ్ త క్కి ట తోంగ్ తా క్కి ట
ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
తకధిద్ది త్తత్తోం తరికిటధిద్దితత్తోం తకధిద్దిత్తత్తోం
తకధీం..తరికిటధీం కిరకిటధీం
తకధిద్ది త్తత్తోం తరికిటధిద్దితత్తోం తకధిద్దిత్తత్తోం
తకధీం తరికిటధీం కిరకిటధీం
తకధీం తరికిటధీం కిరికిటధీం
తకధీం తరికిటధీం కిరికిటధీం
తకధీం తరికిటధీం కిరికిటధీం
తరికిటధీం తరికిటధీం తరికిటధీం
తోంత తకిట తరికిడతక తరికిడతక
తోంత తకిట తరికిడతక తరికిడతక
తోంత తకిట తరికిడతక తరికిడతక
తాకిటతక తరికిడతక తాకిటతక తరికిడతక
తాకిటతక తరికిడతక తాకిటతక తరికిడతక
తరికిటతక తోంగ తరికిటతక తోంగ
తరికిటతక తోంగ తరికిటతక తోంగ
తరికిడతక తరికిడతక తోంత
తరికిడతక తరికిడతక తోంత

శృంగారవీరా..ఆఆఆ..ఆఆ...
తరికిడతక తరికిడతక తోంత
తరికిడతక తరికిడతక తోంత
తోంగిడతక తరికిడతక తోంగిడతక తరికిడతక
శృంగారవీరా..ఆఆఆ..ఆఆ...
తోంగిడతక తరికిడతక  తోంగిడతక తరికిడతక
తొంగిట తరికిడతోం తొంగిట తరికిడతోం
తొంగిట తరికిడతోం తొంగిట తరికిడతోం..త..

శృంగారవీరా..ఆఆఆ..ఆఆ...
తోంగిట తరికిట తోంగిట తరికిడతోం
తోంగిట తరికిట తోంగిట తరికిడతోం
తోంగిట తరికిట తోంగిట తరికిడ తోంగిట తరికిడతోం



చుట్టూ చుట్టి పాట సాహిత్యం

 
చిత్రం: నరసింహా (1999)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
రచన: ఏ.యమ్.రత్నం , శివగణేష్
గానం:  యస్.పి.బాలు, హరిణి, సవితా రెడ్డి 

చుట్టూ చుట్టి వచ్చావా చూపుడువేలితో పేల్చావా
అయ్యో నా సిగ్గే పారిపోగా
కళ్ళతో ఏదో చూసావా కాయా పండా అడిగావా
నాలోని ప్రాయం రేగిపోగా
చుట్టూ చుట్టి వచ్చావా చూపుతో నన్ను కాల్చావా
ముద్దాడే ఆశ ముదిరిపోగా
ఎందరో పడుచులు వచ్చారు నను తొందర పెట్టగ చూసారు
నీవే నను కొంగున కట్టావు

సుందరి సొగసు ఉక్కిరి బిక్కిరి కాగా
సుందర వదనా తీయని వేదన సాగా
విరి పాన్పు గుర్తుతో ప్రేమ ఎన్నికలో గెలిచి నువ్వు వర్ధిల్లు

చుట్టూ చుట్టి వచ్చావా చూపుడువేలితో పేల్చావా
అయ్యో నా సిగ్గే పారిపోగా
చుట్టూ చుట్టి వచ్చావా చూపుతో నన్ను కాల్చావా
ముద్దాడే ఆశ ముదిరిపోగా

నా చెవిని కొరుకు చెవిని కొరుకు పంటిని
గాయపరుచు గాయ పరుచు గాజుకి
యదను తాకు యదను తాకు కాలికి ముద్దులివానా
నా సొగసు తాను సొగసు తాను పెదవికి
మనసు లాగు మనసు లాగు కంటికి
బుగ్గ గిల్లు బుగ్గ గిల్లు గోటికి ముద్దులివ్వనా

అరె తుమ్ము వచ్చిన చీమ కుట్టినా విడిపోవద్దు
తమ తపన తీరగా ముసుగు కప్పుకొని పడుకోవద్దు
నా కనులు సోలినా చేతులూరుకోవుగా
మన పెళ్ళికి ముందుగా ఉయ్యాలలూపించకు

చుట్టూ చుట్టి వచ్చావా చూపుతో నన్ను కాల్చావా
ముద్దాడే ఆశ ముదిరిపోగా
ఎందరో పడుచులు వచ్చారు నను తొందర పెట్టగ చూసారు
నీవే నను కొంగున కట్టవు
సుందరి సొగసు ఉక్కిరి బిక్కిరి కాగా
పురుషుడు చేసే అల్లరి విల్లరి సాగా
వీరి పాన్పు గుర్తులో ప్రేమ ఎన్నికలో గెలిచి నువ్వు వర్ధిల్లు

నే పాలవోలె పాలవోలె పొంగుగా
పెరుగు వోలె పెరుగు వోలె మారగా
తాడు మీద తాడు వేసి అయ్యో చిలికేవా
నే మత్తు మత్తు మత్తు మత్తుగా సోలాగా
మత్తు వదలి మత్తు వదలి లేవగా
చిత్తగించి కొత్త వలపు అయ్యో ఒలికేవా
మండుటెండలో ఐస్ ఫ్రూప్ట్లా కరిగే పోకు
చలి వేండ్రామా దాహ మన్నచో తోసెయ్యకు

హద్దు దాటెయ్యకు నన్ను కాటెయ్యకు
నా ఆదరాన్ని కదరాన్ని అందించిన అడ్డేయాకు

చుట్టూ చుట్టి వచ్చావా చూపుతో నన్ను కాల్చావా
ముద్దాడే ఆశ ముదిరిపోగా
ఎందరో పడుచులు వచ్చారు నను తొందర పెట్టగ చూసారు
నీవే నను కొంగున కట్టావు





ఎక్కు తొలిమెట్టు (జీవితమంటే పోరాటం) పాట సాహిత్యం

 
చిత్రం: నరసింహా (1999)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
రచన: ఏ.యమ్.రత్నం , శివగణేష్
గానం: శ్రీరామ్

జీవితమంటే పోరాటం
పోరాటంతో ఉంది జయం (2)

ఎక్కు తొలిమెట్టు కొండని కొట్టు ఢీకొట్టు
గట్టిగా పట్టే నువు పట్టు గమ్యం చేరేట్టు

ఎక్కు తొలిమెట్టు కొండని కొట్టు ఢీకొట్టు
గట్టిగా పట్టే నువు పట్టు గమ్యం చేరేట్టు

నువు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందేట్టు
బండలు రెండుగ పగిలేట్టు తలబడు నరసింహా

పట్టుపురుగల్లే ఉండక వెంటాడే పులివై
టక్కరి శత్రువు తల తుంచి
సాగర నరసింహా

పిక్క బలముంది యువకుల పక్క బలముంది
అండగా దేవుడి తోడుంది అడుగిడు నరసింహా
పిక్క బలముంది యువకుల పక్క బలముంది
అండగా దేవుడి తోడుంది అడుగిడు నరసింహా

 జీవితమంటే పోరాటం
పోరాటంతో ఉంది జయం (2)

మరు ప్రాణి ప్రాణం తీసి బ్రతికేది మృగమేరా
మరు ప్రాణి ప్రాణం తీసి బ్రతికేది మృగమేరా
మరు ప్రాణి ప్రాణం తీసి నవ్వేది అసురుడురా
కీడే చేయని వాడే మనిషి మేలునే కోరే వాడే మహర్షి
కీడే చేయని వాడే మనిషి మేలునే కోరే వాడే మహర్షి
నిన్నటి వరకు మనిషివయా
నేటి మొదలు నువు ఋషివయ్యా




ఓ కిక్ ఎక్కేలే పాట సాహిత్యం

 
చిత్రం: నరసింహా (1999)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
రచన: ఏ.యమ్.రత్నం , శివగణేష్
గానం: మనో, ఫెబి మణి

ఓ ఓ ఓ కిక్ ఎక్కేలే
ఓ ఓ ఓ సిగ్గు పోయేలే
ఉన్నట్టుండి గ్యానమ్ పెరిగేలే
ఉన్న నిజం చెప్పా తోచేలే

వట్టి గంజి నీళ్లు తాగినోడు మట్టిలోనే
అరేయ్ బెంజ్ కార్ ఎక్కినోడు మట్టిలోనే
ఈ జీవితం కోసం
మనం పుట్టగానే మనతోపాటు
తెచ్చిందేంటి తీసుకెళ్ల

ఓ ఓ ఓ కిక్ ఎక్కేలే
ఓ ఓ ఓ సిగ్గు పోయేలే
ఉన్నట్టుండి గ్యానమ్ పెరిగేలే
ఉన్న నిజం చెప్పా తోచేలే

వట్టి గంజి నీళ్లు తాగినోడు మట్టిలోనే
అరేయ్ బెంజ్ కార్ ఎక్కినోడు మట్టిలోనే
ఈ జీవితం కోసం
మనం పుట్టగానే మనతోపాటు
తెచ్చిందేంటి తీసుకెళ్ల

బంగారం దాచిపెట్టావ్
వజ్రాలే దాచిపెట్టావ్
ప్రాణాలే దాచ ఏది తాళం
శిశువులు గ్యానులు ఇద్దరు తప్ప ఇక్కడ
సుఖముగా ఉన్నదెవరో చెప్పు
జీవం ఉన్నవరకు జీవితం ఉంది మనకు
ఇదియే వేమన వేదం
జీవం ఉన్నవరకు జీవితం ఉంది మనకు
ఇదియే వేమన వేదం

ఈ భూమి మనదేలే
మన వీధిలో జాతి కోసం
మతం కోసం గొడవెందుకు

ఓ ఓ ఓ కిక్ ఎక్కేలే
ఓ ఓ ఓ సిగ్గు పోయేలే
ఉన్నట్టుండి గ్యానమ్ పెరిగేలే
ఉన్న నిజం చెప్పా తోచేలే

తల్లిని ఎంచుకునే
తండ్రిని ఎంచుకునే
హక్కే నీకు లేనేలేదు
రూపం ఎంచుకునే
రంగుని ఎంచుకునే
హక్కే నీకు లేనేలేదు

పుట్టుక నెంచుకునే మరణము నెంచుకునే
హక్కే నీకు లేనే లేదు లేదు
పరిశోధించి చూస్తే
నీ జీవితమొకటే నీ చేతుల్లో
ఉంది లేరా సాధించేయరా

ఓ ఓ ఓ కిక్ ఎక్కేలే
ఓ ఓ ఓ సిగ్గు పోయేలే
ఉన్నట్టుండి గ్యానమ్ పెరిగేలే
ఉన్న నిజం చెప్పా తోచేలే

వట్టి గంజి నీళ్లు తాగినోడు మట్టిలోనే
అరేయ్ బెంజ్ కార్ ఎక్కినోడు మట్టిలోనే

ఈ జీవితం కోసం
మనం పుట్టగానే మనతోపాటు
తెచ్చిందేంటి తీసుకెళ్ల
మనతోపాటు తెచ్చిందేంటి తీసుకెళ్ల
మనతోపాటు తెచ్చిందేంటి తీసుకెళ్ల
తీసుకెళ్ల

Most Recent

Default