Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kalisundam Raa (2000)




చిత్రం: కలిసుందాం రా (2000)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
నటీనటులు: వెంకటేష్, సిమ్రాన్
దర్శకత్వం: ఉదయ్ శంకర్
నిర్మాత: డి. సురేష్ బాబు
విడుదల తేది: 14.01.2000



Songs List:



పసిఫిక్ లో దూకేమంటే పాట సాహిత్యం

 
చిత్రం: కలిసుందాం రా (2000)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్, అనురాధ శ్రీరామ్

పసిఫిక్ లో దూకేమంటే దూకేస్తానే నీకోసం
ఎవరెస్ట్ ఎంతెత్తైన ఎక్కేస్తానే నీకోసం
పసిఫిక్ లో దూకేమంటే దూకేస్తానే నీకోసం
ఎవరెస్ట్ ఎంతెత్తైన ఎక్కేస్తానే నీకోసం
తలకోన జంగెల్లోనా జాగింగ్ చేస్తా జంటై నూవ్వుంటే
భామ రోమియో కన్నా నేను పిచ్చివాన్నమ్మా
నువ్వు తాకి పొమ్మన్నా లవ్వు బిచ్చగాన్నమ్మ

పసిఫిక్ లో దూకేమంటే దూకేస్తానే నీకోసం
ఎవరెస్ట్ ఎంతెత్తైన ఎక్కేస్తానే నీకోసం

పిల్లాడికి విసుగొస్తే క్యార్ క్యార్ మంటాడు
కుర్రాడికి మనసైతే ప్యార్ ప్యారుమంటాడు
టెలిస్కోప్ చూడలేని వింతకాద ప్రేమ గాధ
టెలిఫోన్ తీగ చాలు సాగుతుంది ప్రేమ వార్త
భగవద్గీత బైబిల్ రాత చెప్పిందంతా ప్రేమే కాదా
తోడు వస్తున్నా ప్రేమే తోడుకుంటున్నా

పసిఫిక్ లో దూకేమన్నా దూకేస్తావా నాకోసం
ఎవరెస్ట్ ఎత్తెంత్తైన ఎక్కేస్తావా నాకోసం

నీ ఒంపుల టెంపుల్లో ప్రేమ పూజ చేస్తున్నా
నీ గుండెల గార్డెన్లో ప్రేమ పువ్వు నవుతున్నా
కరెన్సీ నోటు కన్నా కాస్ట్ కాదా ప్రేమ మాట
కరంట్ కాంతి కన్నా బ్రైట్ కాదా ప్రేమ బాట
నాలో బాధ అర్ధం కాదా వద్దకు రావే ముద్దుల రాధ
సిగ్గు పడుతున్నా ఐనా సిగ్నలిస్తున్నా

పసిఫిక్ లో దూకేమంటే దూకేస్తానే నీకోసం
ఎవరెస్ట్ ఎంతెత్తైన ఎక్కేస్తానే నీకోసం
తలకోన జంగెల్లోనా జాగింగ్ చేస్తా జంటై నూవ్వుంటే
భామ రోమియో కన్నా నేను పిచ్చివాన్నమ్మా
నువ్వు తాకి పొమ్మన్నా లవ్వు బిచ్చగాన్నమ్మ

పసిఫిక్ లో దూకేమంటే దూకేస్తానే నీకోసం
ఎవరెస్ట్ ఎంతెత్తైన ఎక్కేస్తానే నీకోసం





నువ్వే నువ్వే అంటూ పాట సాహిత్యం

 
చిత్రం: కలిసుందాం రా (2000)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిహరన్, సుజాత

నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
పదే పదే పిలిచే ఈ గానం
ప్రతిచోట నీకోసం వెతుకుతుండగా
కనుల్లోన నీరూపం వెలుగుతుండగా
మనస్సంత మల్లెల జలపాతం

నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
పదే పదే పిలిచే ఈ గానం

తరుముతు వచ్చే తీయని భావం
ప్రేమో ఏమో ఎలాచెప్పడం
తహ తహ పెంచే తుంటరి దాహం
తప్పో ఒప్పో ఏం చెయ్యడం
ఊహల్లో ఊయ్యాలూపే సంతోషం రేగేలా
ఊపిరిలో రాగం తీసే సంగీతం సాగేలా
అలలై పిలిచే ప్రణయ సుప్రభాతం

నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
పదే పదే పిలిచే ఈ గానం

ఎవరెవరంటూ ఎగిసిన ప్రాయం
నిన్నే చూసి తలొంచే క్షణం
నిగనిగమంటూ నీ నయగారం
హారం వేసి వరించే క్షణం
స్నేహాల సంకెళ్ళే అల్లేసే కౌగిల్లో
పారాణి పాదాలె పారాడే గుండెల్లో
నడకే మరిచీ శిలయ్యింది కాలం

నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
పదే పదే పిలిచే ఈ గానం
ప్రతిచోట నీకోసం వెతుకుతుండగా
కనుల్లోన నీరూపం వెలుగుతుండగా
మనస్సంతా మల్లెల జలపాతం
నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
పదే పదే పిలిచే ఈ గానం



ప్రేమా ప్రేమా విరహం నీ పేరా పాట సాహిత్యం

 
చిత్రం: కలిసుందాం రా (2000)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఉన్ని కృష్ణన్

ప్రేమా ప్రేమా విరహం నీ పేరా
ప్రేమా ప్రేమా విరహం నీ పేరా
ప్రేమా ప్రేమా విలయం నీ ఊరా
కన్నీటిలో పడవల్లే కడలి నడిపినా
కన్నీటిలో పడదోసి నిజం తెలిపినా
మరపురాని గురుతైనావమ్మా

ప్రేమా ప్రేమా విరహం నీ పేరా
ప్రేమా ప్రేమా విలయం నీ ఊరా

జతపడి మురిసే జంటల ఒడిలో
జ్వాలై కురిసే నీలి మేఘమా
ఇన్నాళ్లు ఎదలను మీటిన అనురాగం నీదేనా
కన్నీళ్లే వరముగ పొందిన ఈ త్యాగం నీదేనా
బదులే రాదే మంచు మౌనమా

ప్రేమా ప్రేమా విరహం నీ పేరా
ప్రేమా ప్రేమా విలయం నీ ఊరా




మనసు మనసు కలిసిపోయే పాట సాహిత్యం

 
చిత్రం: కలిసుందాం రా (2000)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

మనసు మనసు కలిసిపోయే
కనులు ఎదలు తడిసిపోయే
మూడుతరాల దూరమంతా ముచ్చటైపోయే
మనసు మనసు కలిసిపోయే
కనులు ఎదలు తడిసిపోయే
మూడుతరాల దూరమంతా ముచ్చటైపోయే
ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే
ఇల్లే స్వర్గమాయే ఎదజల్లే మూగ  ప్రేమల్లోన
మూడుతరాల దూరమంతా ముచ్చటైపోయే
ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే

చరణం: 1
కలిగిన కలతలు కరిగిన వేళ కవితలు చెలరేగే
మనుషుల మనసులు ఎదిగిన వేళ మమతలు విరబూసే
ఊరువాడ ఉయ్యాలూగే ఉషారంతా మాదేలే
నింగినేల తాళాలేసే సరాగాలు మాకేలే
తాతే మనవడాయే నానమ్మే మనువు ఆడేవేళ
అరవై ఏళ్ల కుర్రవాడి ఆశకే పెళ్లి
మనసు మనసు కలిసిపోయే
కనులు ఎదలు తడిసిపోయే
మూడుతరాల దూరమంతా ముచ్చటైపోయే

నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో
చెప్పటానికి భాష లేదు ఆశే తప్ప
నువ్వే నాప్రాణం నువ్వే నా సర్వస్వం
నువ్వు లేని ఈ లోకం నాకు శూన్యం

చరణం: 2
అరగని అరుగులు అలికిన వేళ అతిథులకాహ్వానం
తొలకరి వయసులు కలిసిన వేళ తరగని అభిమానం
హోయ్... హోయ్... హోయ్...ఈడు జోడు ఆడేపాడే పదాలన్నీ మావేలే
ఏకమైన మా గుండెల్లో శ్రుతి లయ ప్రేమేలే
వీరా రాఘవయ్య నీ పేరే నిలుపుకుంటామయ్యా
ఇల్లు ఇల్లు ఏకమైన పండగీనాడే

మనసు మనసు కలిసిపోయే
కనులు ఎదలు తడిసిపోయే
మూడుతరాల దూరమంతా ముచ్చటైపోయే
ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే
ఇల్లే స్వర్గమాయే ఎదజల్లే మూగ  ప్రేమల్లోన
మూడుతరాల దూరమంతా ముచ్చటైపోయే
ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే

లల లల లలలా లాలలా లాల లాలలా
లల లల లలలా లాలలా లాల లాలలా




కలిసుంటే కలదు సుఖం పాట సాహిత్యం

 
చిత్రం: కలిసుందాం రా (2000)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: వేటూరి
గానం: రాజేష్

దింతన దింతన ధిరణన నా ధిరణ ధిరణ నానా
దింతన దింతన ధిరణన నా ధిరణ ధిరణ నానా

కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం
అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం
గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చుసే
కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంధ్రదనసు విరిసే
వస్తారా మా యింటికి ప్రతిరోజూ సంక్రాంతికీ
గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చుసే
కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంధ్రదనసు విరిసే

ఖుషితోటలో గులాబీలు పూయిస్తుంటే
హలో ఆమని చెలో ప్రేమని
వసంతాలిలా ప్రతిరోజూ వస్తూ ఉంటే చలీకేకలా చెలే కోకిలా
నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమ వనం
వెన్నెలలే వెల్లువలై పొంగెను సంతోషం
ప్రేమలన్ని ఒకసారే పెనేశాయీ మా యింటా
గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చుసే
కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంధ్రదనసు విరిసే
కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం
అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం

ఒకే ఈడుగా యదే జోడుకడుతూ ఉంటె అదే ముచ్చట కధే ముద్దటా
తరం మారినా స్వరం మారనీప్రేమ సరాగానికే వరం ఐనదీ
పాటలకే అందనిది పడుచుల పల్లవిలే
చాటులలో మాటులలో సాగిన అల్లరిలే
పాల పొంగు కోపాలో పైట చెంగు తాపాలో
గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చుసే
కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంధ్రదనసు విరిసే
కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం
అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం
గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చుసే
కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంధ్రదనసు విరిసే
వస్తారా మా యింటికి ప్రతిరోజూ సంక్రాంతికీ

దింతన దింతన ధిరణన నా ధిరణ ధిరణ నానా
దింతన దింతన ధిరణన నా ధిరణ ధిరణ నానా



భూమ్ భూమ్ చికినక పాట సాహిత్యం

 
చిత్రం: కలిసుందాం రా (2000)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్

భూమ్ భూమ్ చికినక లోకమంతా ఒక్కటవ్వాలోయ్




వచ్చింది పాల పిట్టా పాట సాహిత్యం

 
చిత్రం: కలిసుందాం రా (2000)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్. పి. బాలు, స్వర్ణలత

వచ్చింది పాల పిట్టా తెచ్చింది పూల బుట్టా
హే నచ్చావే పాల పిట్టా రెచ్చావే కోడిపెట్టా
నీ కట్టుబొట్టు కరిగేటట్టు కన్నే గురిపెట్టా
నీ గుట్టు మట్టు లాగేటట్టు ఒళ్ళో కొలువెట్టా
మొదలెట్టాలమ్మో అష్టాచమ్మాటా...హే
వచ్చింది పాల పిట్టా తెచ్చింది పూల బుట్టా
నా పుట్టుమచ్చా మాపేటట్టు నువ్వే ముద్దెట్టా
నా చుట్టూ కొలత చిక్కేటట్టు నువ్వే మెలిపెట్టా
మొర పెట్టిందమ్మా లాల్ దుప్పట్టా

హే నచ్చావే పాల పిట్టా
తెచ్చింది పూల బుట్టా

చీకట్లో వద్దంటావు వెన్నెల్లో సిగ్గంటావు
ఎందమ్మో ఎడ్డెం అంటే టెడ్డెం అంటావు హే
కాలేస్తే చెయ్యంటావు పండిస్తే పో అంటావు
ఎందయ్యో ఇంకా ఏదో కావాలంటావు
ఒంపుల తొణలు వలుచుకుంటా
ఒంటిని తడితే జడుచుకుంటా
ఔనంటే బాదంపిస్తా కొనితెస్తానే బాల
అందాలే రేపటికిస్తా పై పై కొస్తావేలా
అందాకా చూస్తూ ఉండాలా హేయ్...

వచ్చింది పాల పిట్టా
రెచ్చావే కోడిపెట్టా

కోలు కోలోయన్న కోలోయ్ నా కోలు, కోలు కోలోయన్న కోలు
హో కోలు కోలోయన్న కోలోయ్ నా కోలు, కోలు కోలోయన్న కోలు

పొద్దున్నే పూజంటావు మధ్యాహ్నం మడి అంటావు
సాయంత్రం సరదా పడితే సంతకు పోతావు హొయ్
సోకంతా చిదిమేస్తావు నడుమంతా తడిమేస్తావు
గడియైనా వెయ్యకముందే గడబిడ చేస్తావు
చిల్లర పనులు మానుకుంటా
జల్లెడ పడితే వల్లనంటా
నీతోటి సరసం చేసి పోతానమ్మో కాశీ
నీ లోని చొరవే చూసి అయ్యనయ్యో దాసి
పట్టేగా నిన్నే ఎరవేసి హేయ్

నచ్చావే పాల పిట్టా రెచ్చావే కోడిపెట్టా
నా పుట్టుమచ్చా మాపేటట్టు నువ్వే ముద్దెట్టా
నా చుట్టూ కొలత చిక్కేటట్టు నువ్వే మెలిపెట్టా
మొర పెట్టిందమ్మా లాల్ దుప్పట్టా
హా హా హోయ్ నచ్చావే పాల పిట్టా రెచ్చావే కోడిపెట్టా హోయ్

Most Recent

Default