Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Krishna Gaadi Veera Prema Gaadha (2016)
చిత్రం: కృష్ణగాడి వీరప్రేమగాధ (2016)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
నటీనటులు: నాని, మెహరీన్ కౌర్ పిర్జాదా
దర్శకత్వం: హను రాఘవపూడి
నిర్మాతలు: రామ్ అచంట, గోపి అచంట, అనీల్ సుంకర
విడుదల తేది: 12.02.2016Songs List:రా రా రావేరా పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణగాడి వీరప్రేమగాధ (2016)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: ఆంటోని దాసన్ , వేదాల రామచంద్ర

రతనాల రాసుల నేలిదీ కాలంతొ మారనిదీ
ఆసతోనె అడిగి చూస్తే లేదు దొరకనిదీ

వచ్చేశాడు చూడు పొద్దున్నె ఆ సూరీడు
చల్ చలిపుడితే దిగిపోతాడు
మా రగిలే పగలే వేడంటాడు
తిష్టెసాడు చూడు పిలిమేరల్లోనె యముడు
ఆ ఊరంటె భయమంటాడు
తన నరకము చాల మేలంటాడు
మండుతున్న కుండె పైనా
ఓ సంద్రముంది గుండెల్లోనా
ధాన వీర సూర గునముల్లోన
కర్నుడికి కసిన్సు మేమురా
రా రా రావేరా గంపకింద కొంపలంటు కున్నైరా
రా రా రావేరా గిన్నె కోడి గన్ను పట్టుకుందేరా
రా రా రావేరా గంపకింద కొంపలంటు కున్నైరా
రా రా రావేరా గిన్నె కోడి గన్ను పట్టుకుందేరా

కృషుండైతే నేను కాదు కాని
వెనకనుండి యుద్దలె నడుపుతానురా
బుద్దుడైనా నా చూపుతోటె
అదేంటొ మారిపోయి కత్తి తిప్పడా
అయ్య బాబోయ్ నే పట్టుకుంటె
అంతైన మారిపోద నాటు బాంబులా
ముసలోడు నేను ముందరుంటె
పరేసి చేతి కర్ర గన్ను పట్టడా
గంజితో మేం బ్రతికేస్తాం
బెంజికే ఎదురుగ వెల్తాం
చేతికే చెయ్యిక ఇస్తే
గొడవలు మరిచి బ్రతుకని వదిలేస్తాం
కృష్నుడి మాకేమి కామురా
కర్నుడికే కసిన్సు మేమేరా

రా రా రావేరా గంపకింద కొంపలంటు కున్నైరా
రా రా రావేరా గిన్నె కోడి గన్ను పట్టుకుందేరా
రా రా రావేరా గంపకింద కొంపలంటు కున్నైరా
రా రా రావేరా గిన్నె కోడి గన్ను పట్టుకుందేరా

వచ్చేశాడు చూడు పొద్దున్నె ఆ సూరీడు
చల్ చలిపుడితే దిగిపోతాడు
మా రగిలే పగలే వేడంటాడు

మండుతున్న కుండె పైనా
ఓ సంద్రముంది గుండెల్లోనా
ధాన వీర సూర గునముల్లోన
కర్నుడికి కసిన్సు మేమురా
రా రా రావేరా గంపకింద కొంపలంటు కున్నైరా
రా రా రావేరా గిన్నె కోడి గన్ను పట్టుకుందేరా
రా రా రావేరా గంపకింద కొంపలంటు కున్నైరా
రా రా రావేరా గిన్నె కోడి గన్ను పట్టుకుందేరా

నువ్వంటే నా నవ్వు పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణగాడి వీరప్రేమగాధ (2016)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: హరిచరన్ శేషాద్రి , సింధూరి విశాల్

నువ్వంటే నా నవ్వు నేనంటేనే నువ్వు
నువ్వంటూ నేనంటూ లేమని
అవునంటు మాటివ్వు నిజమంటునే నువ్వు
నే రాని దూరాల్ని నువ్ పోనని

ఎటువున్నా నీ నడక వస్తాగా నీ వెనక
దగ్గరగా రానీను దూరమే
నే వేసే ప్రతి అడుగు ఎక్కడికో నువ్వడుగు
నిలుచున్న నీవైపే చేరేనులే

నీ అడుగేమో పడి నేల గుడి అయినదే
నీ చూపేమో సడిలేని ఉరుమైనదే
నువ్వు ఆకాశం నేను నీకోసం
తడిసిపోదామా ఈ వానలో

ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే
సూర్యుడితో జతకట్టి ఒకటౌతాయే
నీడల్లో నలుపల్లే మల్లెల్లో తెలుపల్లే
ఈ భువికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమ

ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే
సూర్యుడితో జతకట్టి ఒకటౌతాయే
నీడల్లో నలుపల్లే మల్లెల్లో తెలుపల్లే
ఈ భువికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమ

నే ఇటు వస్తాననుకోలేదా
తలుపస్సలు తీయ్యవు తడితే
పో పసివాడని జాలే పడితే
బుగ్గన ముద్దిచ్చి చంపేశావే

నువ్వు నేనంటూ పలికే పదముల్లో
అధరాలు తగిలేన కలిసే ఉన్నా
మనమంటూ పాడు పెదవుల్లో
చూడు క్షణమైనా విడిపోవులే

ఇది ఓ వేదం పద రుజువవుదాం
అంతులేని ప్రేమకే మనం
నివురు తొలగేలా నిజము గెలిచేలా
మౌనమే మాట మార్చేసినా

నువ్ నవ్వేటి కోపానివే
మనసతికిన ఓ రాయివే
నువ్ కలిసొచ్చే శాపానివే
నీరల్లే మారేటి రూపానివే

నచ్చే దారులలో నడిచే నదులైనా
కాదన్నా కలవాలి సంద్రంలోన
విడివిడిగా ఉన్నా విడిపోలేకున్నా
ప్రవహించే ప్రణయం ఇదే

వద్దన్నా తిరిగేటి భువిమీదొట్టు
నా ప్రాణం తిరిగేనే ఇక నీ చుట్టూ
నాలోనే నువ్వుంటు నీతోనే నేనంటూ
ఈ భువిలో విహరించే వెలుగే మన ప్రేమా
కృష్ణగాడి వీరప్రేమగాధ పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణగాడి వీరప్రేమగాధ (2016)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: కె.జి. రంజిత్

వినరా సోదర ఈ కృష్ణగాడి వీరప్రేమగాధ
వీర ప్రేమ గాదా
యెక్కడ చూడని యెప్పుడు వినని అంత వింత గాదా
తందన దందా నానే...తందన దందా నానే
తందన దందా నానేనా...తందన దందా నానేనా

అమ్మయ్యా సింకేది బాబాయ్
అన్నయ్యా నీ పిచ్చికి మా ఇన్స్టుమెంట్స్ సరిపోవుగాని
మా స్టైల్లో పాడెయ్

రం పం పర ర ర రం ప రం ప రం
రం పం పర ర ర రం ప రం ప రం
రం పం పర ర ర రం

ఓరి బ్రహ్మా దేవుడొ ఎంత డేంజర్ గాడివో
గిఫ్టుగిచ్చి ప్రేమని మరిచినావ పెళ్ళినీ
సీతలాంటి ఆ పిల్ల అన్న రావనుడు రా రామ రామ
అందుకేరా ప్రేమెంత ఉన్నా బైటకసలే చెప్పలేమా
టాకు నో నో టచ్చు నో నో
డ్రీములోను డ్యూయటులోను
ఒకడు బ్రహ్మా టూ బ్యాడు జన్మా ఇచ్చావ్ ఏం కర్మా

రం పం పర ర ర రం ప రం ప రం
రం పం పర ర ర రం ప రం ప రం
రం పం పర ర ర రం
రం పం పర ర ర రం ప రం ప రం
రం పం పర ర ర రం ప రం ప రం
రం పం పర ర ర రం

ఓరి బ్రహ్మా దేవుడొ ఎంత డేంజర్ గాడివో
ఇష్కు తోటె పాటుగా రిస్కు నే ఇచ్చావురో
లైఫు రోడ్డుని తిప్పడు మలపు
తెరిచినాడు పెళ్ళి తలుపూ
వెతికి చూశ మాలక్ష్మి కొరకూ
కలవలేదు ఇంత వరకూ
ఫోనెత్తలేదు అడ్రెస్స్ తెలీదు
పాప జాడె పత్తా లేదు

ఒకడు బ్రహ్మా టూ బ్యాడు జన్మా ఇచ్చావ్ ఏం కర్మా

రం పం పర ర ర రం ప రం ప రం
రం పం పర ర ర రం ప రం ప రం
రం పం పర ర ర రం
రం పం పర ర ర రం ప రం ప రం
రం పం పర ర ర రం ప రం ప రం
రం పం పర ర ర రం

ఉలికిపడకు ఉలికిపడకు పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణగాడి వీరప్రేమగాధ (2016)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: రాహుల్ నంబియర్, సింధూరి విశాల్

వెండి చీర చుట్టుకున్న వెచ్చనైన వెన్నెలా
వచ్చి వాలి చంపమాకు నన్నిలా
చిచ్చుపుట్టి కల్లతోటి గుచ్చుకుంటె నువ్వలా
మచ్చకైన మెచ్చుకోదు నువ్విలా
అబ్బ ఇంత కోపమా దగ్గరుండి దూరమా
తియ్యనైన కొరివి కారమా
పరుగులేదు సులువు కాదు
మలుపులేని నలుపు దారివే
అలాగ ఉలికిపడకు ఉలికిపడకు ఉలికిపడకలా
ఊ అంటె ఉడికిపోయి ఉరికిపడకలా
ఓ ఓహ్ ఓహ్ ఎగిరి పడకు ఎగిరిపడకు ఎగిరిపడకలా
తుఫాను హోరులోని గాలిపటములా

బిల్లి విలనుతో పాటు పిల్ల దెయ్యమే కాదు
బుజ్జి భూతముంది నువ్వు ముద్దు పెట్టకే
ప్రేమ చూపటం రేపు లేని పోని డౌటు
చిన్న బుచ్చుతావు హద్దు దాటితే
కొలవలేని గారమ పొగుడుతుంటె గారమా
లైఫు టైము తెగని బేరమా
పొగడమాకూ వినను నీకూ
లొంగనింక బేరమాడకూ

అలాగ ఉలికిపడకు ఉలికిపడకు ఉలికిపడకలా
ఊ అంటె ఉడికిపోయి ఉరికిపడకలా
ఓ ఓహ్ ఓహ్ ఎగిరి పడకు ఎగిరిపడకు ఎగిరిపడకలా
తుఫాను హోరులోని గాలిపటములా

పెళ్ళితంతుకే మేము పెద్దమనుషలం కాద
పక్కనున్న లెక్క లేదు మేము ఇప్ప్డే
బుజ్జి బుగ్గలే మావి ముద్దు పెట్టర మీరు
బుంగ మూతి పెట్టుకోమ మేము ఇప్పుడే
చిన్ని చిన్ని నవ్వులం చిట్టి పొట్టి పిల్లలం
చుట్టుకుంటె విడిచిపోములే
బ్లాకు రోడ్డు రెడ్డు కారు
పైగ మేము బంపరాఫరూ

అలాగ ఉలికిపడకు ఉలికిపడకు ఉలికిపడకలా
ఊ అంటె ఉడికిపోయి ఉరికిపడకలా
ఓ ఓహ్ ఓహ్ ఎగిరి పడకు ఎగిరిపడకు ఎగిరిపడకలా
తుఫాను హోరులోని గాలిపటములా
ఆ సీత దేవైనా పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణగాడి వీరప్రేమగాధ (2016)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: శ్రియ , సుమేధ

ఆ సీత దేవైనా నిను చూసి మెచ్చేనె
వంటరిగ వనవాసం చేశావనీ
సీతల్లె నేనుంట గీతైన దాటొస్త
రాముడిలా నా కోసం వస్తానంటెనెత్తురుడికే శత్రువులనే పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణగాడి వీరప్రేమగాధ (2016)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: 

నెత్తురుడికే శత్రువులనే మట్టి కలిపే ఆయుధం
కత్తి కొనతో కొత్తుకలనే పోత్తుకలిపే రాక్షసం 
చంపడం ధైర్యమా బ్రతకడం పెను భారమా 
హంస కోరే  తెగువ కన్నా హితమయే భయమే నయం 
నీ భయం నిర్భయం, పౌరుషం దుర్భరం
అర్జునుడికే యుద్దమాపే భీతి కొలిపినదీ భయం  
భగవతీతే  ఉద్భవించే ------

Most Recent

Default