-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sunil"
Sri Ramadasu (2006) Telugu Songs Lyrics Album Cover

Sri Ramadasu (2006) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Sri Ramadasu (2006)
Music : M. M. Keeravani
Actors : Akkineni Nageswara Rao, Akkineni Nagarjuna
Actress : Sneha, Veda Sastry
Supporting Cast : Suman, Nassar, Brahmanandam, Sunil, Venu Madhav
Director : K. Raghavendra Rao
Producer : Konda Krishnam Raju
Release Date : 30 March 2006

Sri Raghavam Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Sri Raghavam' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani and sung by M. M. Keeravani.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
Singers : M. M. Keeravani
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: ట్రెడిషనల్ గానం: ఎం. ఎం. కీరవాణి ఓం గం క్లీం లక్ష్మీ గణపతయే నమః శ్రీరాఘవం దశరధాత్మజ మప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి ఓం

Adigadigo Badragiri Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Adigadigo Badragiri' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: వేటూరి గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, బృందం ఓం... ఓం... ఓం... శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః అదిగో అదిగో భద్రగిరీ ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ ఏ వాల్మీకీ రాయని కధగా సీతారాములు తనపై ఒదగా రామదాసకృత రామపదామృత వాగ్గేయస్వర సంపదగా వెలసిన దక్షిణ సాకేతపురీ అదిగో అదిగో భద్రగిరీ ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ రాం రాం రాం రాం రామనామ జీవన నిర్నిద్రుడు పునః దర్శనము కోరిన భద్రుడు సీతారాముల దర్శనానికై ఘోరతపస్సును చేసెనప్పుడూ తపమును మెచ్చీ ధరణికి వచ్చీ దర్శనమిచ్చెను మహావిష్ణువూ సాససా నీదరి సానిదాప గమ పాదనీ దామపా త్రేతాయుగమున రామరూపమే త్రికరణశుద్దిగ కోరెను భద్రుడు ఆదర్శాలకు అగ్రపీఠమౌ ఆ దర్శనమే కోరెనప్పుడూ ధరణిపతియే ధరకు అల్లుడై శంఖచక్రములు అటు ఇటు కాగా ధనుర్బాణములు తనువై పోగా సీతాలక్ష్మణ సమితుడై కొలువు తీరె కొండంత దేవుడూ శిలగా మళ్ళీ మలచీ శిరమును నీవే నిలచీ భద్రగిరిగ నను పిలిచే భాగ్యము నిమ్మని కోరె భద్రుడూ వామాంకస్థిత జానకీ పరిలస కోదండ దండం కరే చక్రం చోర్భకరేణ బాహు యుగళే శంఖం శరం దక్షిణే విఘ్రాణం జలజాత పత్ర నయనం భద్రాద్రి మూర్తిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రి యుక్తం భజే ! అదిగో అదిగో భద్రగిరీ ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ

Hylessa Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Hylessa' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: సుద్దాల అశోక్‌తేజ గానం: దేవి శ్రీ ప్రసాద్, ఎం. ఎం. కీరవాణి, మాళవిక హొలేసా హొలేసా హొలేసా హొలె హొలేసా ఏటయ్యిందె గోదారమ్మ ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు ఎవ్వరో వస్తున్నట్టు ఎదురుసూస్తున్నది గట్టు ఎమైనట్టు నాకు కూడ ఎడమకన్ను అదురుతుంది నీమీదొట్టు మన సీతారామస్వామికి మంచి ఘడియ రాబోతున్నట్టు ఉ ఉ ఉ హొలేసా హొలేసా హొలేసా హొలేసా ఏటయ్యిందె గోదారమ్మా... కృష్ణయ్యకు ఫించమైన నెమిలమ్మల దుంకులాట దుంకులాట దుంకులాట ఎంకన్నకు పాలుతాపిన పాడావుల ఎగురులాట ఎగురులాట రామునికి సాయం చేసిన ఉడుతపిల్లల ఉరుకులాట ఉరుకులాట చెప్పకనే చెబుతున్నవి చెప్పాకనే చెబుతున్నవి మన సీతారామస్వామికి మంచి ఘడియ రాబోతున్నట్టు... ఉ ఉ ఉ హొలేసా హొలేసా హొలేసా హొలేసా ఏటయ్యిందె గోదారమ్మఎందుకీ ఉలికిపాటు గగురుపాటు ఎవ్వరో వస్తున్నట్టు ఎదురుచూస్తున్నది గట్టు ఎమైనట్టు చిటుకిపందిరెయ్యాలని పిచ్చిపిచ్చి ఆశ నాది ముల్లోకాలని కాసేటొన్ని కాపాడాలని పిచ్చి నాది నీడనిచ్చే దేవునికి నీడనిచ్చే ఎదురుచూపు ఇన్నాళ్ళకు నిజమయ్యి ఎదరొంకన పడుతున్నది రాలేని శబరి కడకు రాముడు నడిచొచ్చినట్టు మన రాముని సేవకెవరో మనసుపడి వస్తున్నట్టు... హొలేసా హొలె హొలేసా హొలేసా హొలేసా ఏటయ్యిందె గోదారమ్మ ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు ఎవ్వరో వస్తున్నట్టు ఎదురుచూస్తున్నది గట్టు ఎమైనట్టు నాకు కూడ ఎడమకన్ను అదురుతుంది నీమీదొట్టు మన సీతారామస్వామికి మంచి ఘడియ రాబోతున్నట్టు ఉ ఉ ఉ హొలేసా హొలేసా హొలేసా - హొలె హొలేసా హొలేసా హొలేసా హొలేసా - హొలె హొలేసా హొలేసా హొలె హొలేసా హొలేసా హొలేసా

Antha Ramamayam Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Antha Ramamayam' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: రామదాసు కీర్తన గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, బృందం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం అంతరంగమున అత్మారాముడు రామ రామ రామ రామ అనంత రూపముల వింతలు సలుపగ రామ రామ రామ రామ సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఓం నమో నారాయణాయ,ఓం నమో నారాయణాయ,ఓం నమో నారాయణాయ అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ నదులు వనంబులు నానామృగములు పీత కర్మములు వేద శాస్త్రములు అంతా రామమయం ఈ జగమంతా రామమయం రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ సిరికిన్ జెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రకపతిన్ బంధింపడు ఆకర్ణికాంతర ధన్ విల్లము చక్క నొక్కడు నివాదప్రోద్ధీత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై

Isvakulaku Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Isvakulaku' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: రామదాసు కీర్తన గానం: శంకర్ మహదేవన్ ఇక్ష్వాకు కుల తిలకా ఇకనైన పలుకవే రామచంద్రా నను రక్షింపకున్నను రక్షకులు ఎవరింక రామచంద్రా చుట్టు ప్రాకారములు సొంపుతో గట్టిస్తి రామచంద్రా ఆ ప్రాకారముకు బట్టె పదివేల వరహాలు రామంచంద్రా లక్ష్మణుకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్రా ఆ పతకానికీ బట్టె పదివేల మొహరీలు రామచంద్రా సీతమ్మకూ చేయిస్తినీ చింతాకు పతకము రామచంద్రా ఆ పతకానికీ బట్టె పదివేల వరహాలు రామచంద్రా కలికి తురాయి నీకు కొలుపుగా జేయిస్తినీ రామచంద్రా నీ తండ్రి దశరధ మహరాజు పంపెనా లేక నీ మామ జనక మహరాజు పెట్టెనా ఎవడబ్బ సొమ్మనీ కులుకుతూ తిరిగేవు రామచంద్రా ఎవడబ్బ సొమ్మనీ కులుకుతూ తిరిగేవు రామచంద్రా

Allah Rama Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Allah Rama' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani and sung by Vijay Yesudas.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
Singers : Vijay Yesudas
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: శ్రీ వేద వ్యాస గానం: శంకర్ మహదేవన్, విజయ్ యేసుదాసు అల్లా... శ్రీ రామా... శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు కళ్యాణ గుణగణుడు కరుణా ఘనాఘనుడు ఎవడు అల్లా తత్వమున అల్లారుముద్దుగ అలరారు అందాల చంద్రుడెవడు ఆనంద నందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు తాగరా శ్రీ రామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం తాగరా శ్రీ రామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి ఏ మూర్తి ముజ్జగంబుల మూలమవ్ మూర్తి ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి ఏ మూర్తి నిర్వాన నిజ ధర్మ సమవర్తి ఏ మూర్తి జగదేక చక్రవర్తి ఏ మూర్తి గణమూర్తి ఏ మూర్తి గుణకీర్తి ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి ఆ మూర్తి ఏ మూర్తి వునుగాని రస మూర్తి ఆ మూర్తి శ్రీ రామ చంద్ర మూర్తి తాగరా... ఆ ఆ తాగరా శ్రీ రామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం పాపప మపనిప మపనిప మపసనిప మపమ శ్రీ రామ పాపప మపనిని పనిసస రిరిసనిప మపని మపమ కోదండ రామ మపనిసరి సని పనిపమ సీతా రామ మపనిసరి సరి సరిమరిస నిపమ ఆనంద రామ మామా రిమ రిమరి సరిమ రామ జయ రామ సరిమ రామ సపమ రామ పా వననామ ఏ వేల్పు యెల్ల వేల్పులును గొల్చెడి వేల్పు ఏ వేల్పు ఏడేడు లోకాలకె వేల్పు ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెల్పు ఏ వేల్పు నింగి నేలలను కల్పు ఏ వేల్పు ద్యుతిగొల్పు ఏ వేల్పు మరుగొల్పు ఏ వేల్పుదె మల్పులేని గెలుపు ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు ఆ వేల్పు దాసానుదాసులకు కై మోడ్పు తాగరా...ఆ ఆ తాగరా శ్రీ రామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం

Idhigidhigo Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Idhigidhigo' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: జె. కె. భారవి గానం: సునీత ఉపద్రస్ట ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువుండినాడు ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువుండినాడు ముద్దుల సీతతో ఈడనే మురిపాలాడినాడు ఇది సీతమ్మ తల్లి ఆరేసుకున్న నార చీరె ఇదె రాముడు కట్టుకొనగ పులకించిన పంచె ఏడేడు లోకాలను ఏలెడి పాదాలివే మాయల బంగారు లేడి మాయని గురుతులివే పచ్చగ అయిదోతనమే పదికాలాలుండగా సీతమ్మ వాడిన పసుపుకుంకుమ రాళ్ళివే దాటొద్దని లక్ష్మణుడు గీతను గీసిన చోటిదే అమ్మను రావణుడెత్తుకుపోయిన ఆనవాళ్ళివే ఇది ఆ రాముడు నడయాడిన పుణ్యభూమి మరి నా రామునికీడ నిలువనీడ లేదిదేమి నిలువ నీడ లేదిదేమి

Charanamule Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Charanamule' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani and sung by K. S. Chithra.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
Singers : K. S. Chithra
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: రామదాసు కీర్తన గానం: కె. ఎస్. చిత్ర, మధు బాలకృష్ణన్, రామాచారి చరణములే నమ్మితీ నీ దివ్య చరణములే నమ్మితీ చరణములే నమ్మితీ నీ దివ్య చరణములే నమ్మితీ చరణములే నమ్మితీ వారధి కట్టిన వరభద్రాచల వరదా వరదా వరదా నీ దివ్య చరణములే నమ్మితీ చరణములే నమ్మితీ పావన రామ నామసుధారస పానము చేసేదెన్నటికో సేవించియు శ్రీహరి పాదంబులు చిత్తమునుంచేదెన్నటికో రామ రామ జయ సీతారామా రఘుకులసోమ రణభీమా రామ రామ జయ సీతారామా జగదభిరామా జయరామా చంచలగుణములు మాని సదా నిశ్చల మదియుండేదెన్నటికో పంచతత్వములు తారకనామము పఠియించుట నాకెన్నటికో రామ రామ జయ సీతారామా రఘుకులసోమ రణభీమా రామ రామ జయ సీతారామా జగదభిరామా జయరామా నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందలోలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందలోలం జలజ సంభవాది వినుతా జలజ సంభవాది వినుతా జలజ సంభవాది వినుతా జలజ సంభవాది వినుతా జలజ సంభవాది వినుతా చరణారవిందం కృష్ణ లలితా మోహన రాధ వదనా నళినా మిళిందం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందలోలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందలోలం శ్రీరామ నామం మరువాం మరువాం సిద్దము యమునికి వెరువాం వెరువాం శ్రీరామ నామం మరువాం మరువాం సిద్దము యమునికి వెరువాం వెరువాం గోవిందునీవేళ కొలుతాం కొలుతాం గోవిందునీవేళ కొలుతాం కొలుతాం దేవుని గుణములు తలుతాం తలుతాం దేవుని గుణములు తలుతాం తలుతాం శ్రీరామ నామం మరువాం మరువాం సిద్దము యమునికి వెరువాం వెరువాం విష్ణు కధలు చెవుల విందాం విందాం విష్ణు కధలు చెవుల విందాం విందాం వేరు కధలు చెవిన మాందాం మాందాం వేరు కధలు చెవిన మాందాం మాందాం శ్రీరామ నామం మరువాం మరువాం సిద్దము యమునికి వెరువాం వెరువాం హే జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ పావన నామ పట్టాభి రామ పావన నామ పట్టాభి రామ నిత్యము నిన్నే కొలిచెద రామ అహ నిత్యము నిన్నే కొలిచెద రామ ఆహా రామా అయోధ్య రామ ఆహా రామా అయోధ్య రామ రామా రామా రఘుకుల సోమా అహ రామా రామా రఘుకులసోమా జై జై రామ జానకిరామ జై జై రామ జానకిరామ జై జై రామ జానకిరామ జై జై రామ జానకిరామ జై జై రామ జానకిరామ జై జై రామ జానకిరామ జై జై రామ జానకిరామ జై జై రామ జానకిరామ

Chalu Chalu Chalu Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Chalu Chalu Chalu' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: ఎస్. పి. చరణ్, సునీత ఉపద్రస్ట ససలు గగలు గగలు నినిలు ససలు నినిలు గగలు నినిలు గమదని సగసగ సగమగ సనిదని దనిసగ సనిదమ గమకములు చాలు చాలు చాలు చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు చాలు చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు ముద్దుగ ముద్దుగ వినవలెగా నా ముద్దు విన్నపాలు పాలు వన్నెపూలలో విన్నపాలు ను ఆరగిస్తే మేలు చాలు చాలు చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు నీ కరములు నా మేనికి వశీకరములు నీ స్వరములు ఈ రేయికి అవసరములు నీ కరములు నా మేనికి వశీకరములు నీ స్వరములు ఈ రేయికి అవసరములు ఈ క్షణములు మన జంటకి విలక్షణములు ఈ సుఖములు మునుపెరుగని బహుముఖములు రా మా ఇంటికి అను పిలుపులు ఆ లీలలు అవలీలలు చాలు - చాలు చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు ఈ చిలకలు సరసానికి మధుర గుళికలు ఈ పడకలు మోక్షానికి ముందు గడపలు ఈ చిలకలు సరసానికి మధుర గుళికలు ఈ పడకలు మోక్షానికి ముందు గడపలు ఈ తనువులు సమరానికి ప్రాణ ధనువులు ఈ రణములు రససిద్దికి కారణములు విరామాలెన్నడు ఎరుగనివి చలి ఈడులు తొలి జాడలు ఛి పాడులు చాలు - చీ చాలు చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు చాలు చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు

Nannu Brovamani Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Nannu Brovamani' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: రామదాసు కీర్తన గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సునీత ఉపద్రస్ట నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవమని చెప్పవే నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవమని చెప్పవే నను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి జనకుని కూతురా జనని జానకమ్మా నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవమని చెప్పవే లోకాంతరంగూడి శ్రీకాంత నినుగూడి ఏకాంతమున ఏకో శెయ్య నున్నావేయ్య నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవమని చెప్పవే అద్రిజ వినుతుడు బధ్రగిరీశుడు నిద్ర మేల్కొను వేళ నెలతరో బోధించి నను బ్రోవమని, నను బ్రోవమని, నను బ్రోవమని చెప్పవే… సీతమ్మ తల్లి

Sri Rama Rama Ramethi Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Sri Rama Rama Ramethi' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: ట్ట్రెడిషనల్ గానం: ఎం. ఎం. కీరవాణి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తతుల్యం రామ నామ వరాననే

Entho Ruchira Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Entho Ruchira' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: రామదాసు కీర్తన గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం రామా శ్రీరామా కోదండ రామా ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ నీనామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా కదళీ ఖర్జూరాది ఫలముల కన్నను కదళి ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పావన నామ మేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నవసర పరమాన్న నవనీతముల కన్న అధికమౌ నీ నామమేమి రుచిరా శ్రీరామ అహ శ్రీరామ ఓ రామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా సదాశివుడు నిను సదా భజించెడి సదానంద నీ నామ మేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామ మేమి రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా శ్రీరామ నీనామమెంతో రుచిరా ఎంతో రుచిరా

Paluke Bangaramayena Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Paluke Bangaramayena' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani and sung by M. M. Keeravani.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
Singers : M. M. Keeravani
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: రామదాసు కీర్తన గానం: కె. ఎస్. చిత్ర, ఎం. ఎం. కీరవాణి కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి పిలిచిన పలుకవేమి.... పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి పలుకే... పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రి పలుకే బంగారమాయెనా... పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా శరణాగతత్రాణ బిరుదాంకితుడవు కావా శరణాగతత్రాణ బిరుదాంకితుడవు కావా కరుణించు బధ్రాచల వన రామదాస పోషా పలుకే బంగారమాయెనా... పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా

Shuddha Brahma Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Shuddha Brahma' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: ట్ట్రెడిషనల్ గానం: ప్రణవి శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శేషతల్ప సుఖనిద్రిత రామ బ్రహ్మద్యమర ప్రార్ధిత రామ శేషతల్ప సుఖనిద్రిత రామ బ్రహ్మద్యమర ప్రార్ధిత రామ రామ రామ జయ రాజా రామ రామ రామ జయ సీతా రామ రామ రామ జయ రాజా రామ రామ రామ జయ సీతా రామ ప్రియగుహ వినివేధితపద రామ శబరీ దత్త ఫలాశన రామ ప్రియగుహ వినివేధితపద రామ శబరీ దత్త ఫలాశన రామ హనుమత్సేవిత నిజపద రామ సీతా ప్రాణాదారక రామ రామ రామ జయ రాజా రామ రామ రామ జయ సీతా రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ

Bhadra Shaila Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Bhadra Shaila' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani and sung by K. S. Chithra and M. M. Keeravani.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: రామదాసు గానం: హరిహరన్, కె. ఎస్. చిత్ర సాకీ: రామాయ రామబద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథయ నాథాయ సీతాయః పతయే నమః పల్లవి: భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా బృందం: భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మకర్మ యుగళ మండలా బృందం: వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మకర్మ యుగళ మండలా సతత రామదాస పోషకా శ్రీరామచంద్ర వితత భద్రగిరినివేషకా బృందం: భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా కోదండరామ కోదండరామ కోదండరాంపాహి కోదండ రామా బృందం: కోదండరామ కోదండరామ కోదండరాంపాహి కోదండ రామా నీ దండ నాకు నీవెందుబోకు వాదేల నీకు వద్దుపరాకు బృందం: కోదండరామ కోదండరామ కోదండరాంపాహి కోదండరామా తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవే దైవము నీవే బృందం: కోదండరామ కోదండరామ రామ రామ రామ కోదండరామ చరణం: దశరధ రామా గోవిందా మము దయజూడు పాహి ముకుందా బృందం: దశరధ రామా గోవిందా మము దయజూడు పాహి ముకుందా దశరథ రామా గోవిందా దశముఖ సంహారధరణిజ పతిరావ శశిధర పూజిత శంఖచక్రధర బృందం: దశరథ రామా గోవిందా తక్కువేమి మనకూ రాముండొక్కడుండు వరకూ బృందం: తక్కువేమి మనకూ రాముండొక్కడుండు వరకూ పక్కతోడుగా భగవంతుడు మును చక్రధారియై చెంతనె వుండగ తక్కువేమి మనకూ రాముండొక్కడుండు వరకూ తక్కువేమి మనకూ రాముండొక్కడుండు వరకూ బృందం: జయ జయ రామా జగదభిరామా జానకిరామా పాహిరామ ప్రభో పాహిరామ ప్రభో పాహి భద్రాద్రివై దేహి రామప్రభో బృందం: పాహిరామ ప్రభో పాహిరామ ప్రభో పాహి భద్రాద్రివై దేహి రామప్రభో పాహిరామ ప్రభో... శ్రీమన్మహా గుణస్తోమాభిరామ నీ నామ కీర్తనలు వర్ణింతు రామ ప్రభో సుందరాకార మన్మందిరోద్దార సీతేందిరా సమ్యుతానందరామ ప్రభో బృందం: పాహిరామప్రభో...

Ye Theerugananu Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Ye Theerugananu' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani and sung by Nanditha.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
Singers : Nanditha
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: రామదాసు కీర్తన గానం: విజయ్ యేసుదాస్ శ్రీ రఘునందన సీతా రమణా శ్రితజన పోషక రామా కారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కానుపు రామా ఏ తీరుగ నను దయ జూచెదవో ఇలవంశోత్తమ రామా నా తరమా భవసాగరమీదను నళిన దళేక్షణ రామా వాసవ కమల బావా సుర వందిత వారధి బంధన రామా భాసురవత సద్గుణములు గల్గిన బధ్రాద్రీశ్వర రామా రామా ఏ తీరుగ నను

Thandri Matanu Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Thandri Matanu' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani and sung by Sunitha Upadrashta.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
Lyricist : J. K. Bhairavi
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: జె. కె. భారవి గానం: సునీత ఉపద్రస్ట తండ్రి మాటను నిలుపగా రాముండు అడవులకు పైనమయ్యే నేను మీ బాటలోనే వస్తాను అనుచూ సీతమ్మ కదిలే ఓ పడతి ఆ అడవిలో కష్టాలు పడలేవు అని రాముడు నీడనే వదిలి పెట్టి మీరెలా వెళ్లగలరనెను సీతా

Dhasaradhi Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Dhasaradhi' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
Lyricist : Ramadasu Keerthana
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: వ్యాదవ్యాస్ గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర దాసరధి కరుణా పయొనిది నువ్వె దిక్కని నమ్మడమా నీ అలయమును నిర్మించడమా నిరతము నిను భజియించడమా రామ కొటి రచియించడమా సీత రామస్వామి నే చేసిన నెరమదెమి నీ దయ చుపవ దెమి నీ దర్శన మీయవిదెమి దాసరధి కరుణపయొనిది గుహుడు నీకు చుట్టమ గుండెలకు హత్తుకున్నావు శబరి నీకు తొబుట్టువ ఎంగిలి పళ్ళను తిన్నావు నీ రాజ్యము రాసిమ్మంటిన నీ దర్శనమె ఇమ్మంటిని కాని ఏల రావు నన్నెలరావు నన్నెల ఏల రావు సీత రామస్వమ్య్ నే చేసిన నెరమదెమి నీ దయ చుపవ దెమి నీ దర్శన మీయవిదెమి దాసరధి కరుణపయొనిది రామ రసరమ్య ధామ, రమణీయ నామ రఘువంస సోమ ,రణరంగ భీమ రాక్షస విరమ కమనీయ ధమ్మ సౌందర్య సీమ నీరజస్యామ నిజబుజొధామ భొజనల రామ భువన జయ రామ పాహి భద్రాద్రి రమ పాహీ తక్షన రక్షన విశ్వవిలక్షన ధర్మ విచక్షన గొదారిన కలిసెనెమి రా డాన్ డ డ డండ డండ నినధమ్ముల జాండము నిండ మత్త వెదండము నిక్కినె పొగడు నీ అభయవ్రతమెదిరా ప్రెమ రసాంతరంగ హౄదయంగమ శుంగశుభంగ రంగ బహురంగడ భంగ తుంగ సుగునైక తరంగ శుసంగ సత్య సారంగ సుస్రుతివిహంగ పాప మ్రుదు సంగ విభంగా భుతల పతంగ మదు మంగళ రూపము చుపవెమి రా గరుడగమన రా రా గరుడగమన రా రా

Mangalam Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Mangalam' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani and sung by M. M. Keeravani.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
Lyricist : Traditional
Singers : M. M. Keeravani
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: రామదాసు కీర్తన గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్, కోరస్ రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ శుభగ మంగళం రామదాస మ్రుదుల హృదయ తామరసనివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం దివ్య మంగళం దివ్య మంగళం

Palli Balakrishna Thursday, June 11, 2026
Pushpa 2: The Rule (2024) Telugu Songs Lyrics Album Cover

Pushpa 2: The Rule (2024) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Pushpa 2: The Rule (2024)
Banner : Mythri Movie Makers
Music : Devi Sri Prasad
Director : Sukumar
Producers : Naveen Yerneni, Y. Ravi Shankar
Actors : Allu Arjun
Actresses : Rashmika Mandanna
Release Date : 05 December 2024

Pushpa Pushpa Song Lyrics in Telugu – Pushpa 2: The Rule (2024)

'Pushpa Pushpa' song from Pushpa 2: The Rule (2024) movie is composed by Devi Sri Prasad and sung by Nakash Aziz and Deepak Blue. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Pushpa 2: The Rule (2024)
Lyricist : Chandrabose
చిత్రం: పుష్ప 2 (2024) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: నకాష్ అజీజ్, దీపక్ బ్లూ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప నువ్వు భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమే బద్దలయ్యే పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప నిన్ను కొలవాలంటే సంద్రం ఇంకా లోతే తవ్వాలే పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప హే గువ్వపిట్ట లాగ వానకు తడిసి బిక్కుమంటు రెక్కలు ముడిసి వణుకుతు వుంటే నీదే తప్పవదా పెద్ద గద్దలాగమబ్బులపైన హద్దు దాటి ఎగిరావంటే వర్షమైనా తలనే వంచి కాళ్ళ కింద కురిసెయ్‍దా పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ ఎన్నో వచ్చిన పుష్పాకి పాపం కొన్ని రావంటా వణుకే రాదు ఓటమి రాదు వెనకడుగు ఆగడము అస్సలు రానే రాదు అన్నీ ఉన్న పుష్పాకి పాపం కొన్ని లేవంటా భయమే లేదు బెంగే లేదు బెదురు ఎదురు తిరిగే లేదు తగ్గేదే లేదు ఎయ్ దండమెడితే దేవుడికే సలాము కొడితే గురువులకే కాళ్ళు మొక్కితే అమ్మకే రా తల దించినావా బానిసవి ఎత్తినావా బాద్‍షావి తలపొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ ఆడు కాలుమీద కాలేసి కూసున్నాడంటే బండరాయి కూడా బంగారు సింహాసనమంటా వేరే సింహాసనమేదైనా వట్టి బండరాయంటా ఆడు సేతిలోన సెయ్యేసి మాటిచ్చాడంటే తుఫాకిలోంచి తూటా దూసుకెళ్ళినట్టే ఆ తూటాలాగే మాట కూడా ఎనక్కి రానట్టే హే వాడు నీకు గొప్పే కాదు వీడు నీకు ఎక్కువ కాదు నీకు నువ్వే బాసులా ఉండు హే ఎవడో విలువ ఇచ్చేదేంది ఎవడో నిను గుర్తించేదేంది ఒంటి నిండా తిమ్మిరి ఉంటె నీ పేరే నీ బ్రాండు పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ అస్సలు తగ్గేదెలే

Sooseki Song Lyrics in Telugu – Pushpa 2: The Rule (2024)

'Sooseki' song from Pushpa 2: The Rule (2024) movie is composed by Devi Sri Prasad and sung by Shreya Ghoshal. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Pushpa 2: The Rule (2024)
Lyricist : Chandrabose
చిత్రం: పుష్ప 2 (2024) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: శ్రేయా ఘోషాల్ వీడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్నా పసిపిల్లవాడు నా వాడు వీడు మొండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నా వాడు ఓ ఓ మాట పెళుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్న వాడిలోన దేవుడెవరికి తెలుసును నా కన్నా సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి మెత్తాని పత్తి పువ్వులా మరి సంటోడే నా సామి హో ఎర్రబడ్డ కళ్ళలోన కోపమే మీకు తెలుసు కళ్ళలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు కోరమీసం రువ్వుతున్న రోషమే మీకు తెలుసు మీసమెనక ముసురుకున్న ముసినవ్వు నాకు తెలుసు అడవిలో పులిలా సరసర సరసర చెలరేగడమే నీకు తెలుసు అలసిన రాతిరి ఒడిలో చేరి తల వాల్చడమే శ్రీవల్లికి తెలుసు సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి మెత్తాని పత్తి పువ్వులా మరి సంటోడే నా సామి హో ఓ ఓ గొప్ప గొప్ప ఇనాములనే ఇచ్చివేసే నవాబు నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గరీబు పెద్ద పెద్ద పనులు ఇట్టే చక్కబెట్టే మగాడు వాడి చొక్కా ఎక్కడుందో వెతకమంటాడు సూడు బయటికి వెళ్లి ఎందరెందరినో ఎదిరించేటి దొరగారు నేనే తనకి ఎదురెళ్ళకుండా బయటికి వెళ్ళరు శ్రీవారు సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామే ఇట్టాంటి మంచి మొగుడుంటే ఏ పిళ్ళైనా మహారాణీ

Peelings Song Lyrics in Telugu – Pushpa 2: The Rule (2024)

'Peelings' song from Pushpa 2: The Rule (2024) movie is composed by Devi Sri Prasad and sung by Shankar Babu Kandukoori and Laxmi Dasa. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Pushpa 2: The Rule (2024)
Lyricist : Chandrabose
చిత్రం: పుష్ప 2 (2024) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: శంకర్ బాబు కందుకూరి, లక్ష్మి దాస మల్లిక రన్నంటే అంబుకలా కన్మున తుంబుకలో అంబిలి పూనిలా నంబుకలో పుంజిరి తుంబికలో ముళ్ల మలర్మని చెండుకలో నిన్ మలి చుండుకలో తెన్ తెడి ఎత్తున్న వండుకలో పుంకిల తుండుకలో హుఁ, ఆరింటికోసారి, ఏడింటికోసారి పావు తక్కువ పదింటికోసారీ…. పడుకుంటె ఓసారి… మేల్కుంటె ఓసారి ఏమి తోసక కూసుంటె ఓసారీ… యేలు నొక్కుతుంటే ఓసారి ఓసారి కాలు తొక్కుతుంటే ఓసారి ఓసారి నువ్వు పక్కనుంటే ప్రతొక్కసారీ……. వచ్హుండాయ్ పీలింగ్సు వచ్హుండాయ్ పీలింగ్సు వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్సు వచ్హుండాయ్ పీలింగ్సు వచ్హుండాయ్ పీలింగ్సు వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్సు ఏయ్, ఛీ అంటే ఓసారి పో అంటే ఓసారి చాటుమాటుగా సై అంటే ఓసారీ పూలెడ్తే ఓసారి… నగలెడ్తే ఓసారి సాదా సీదా చీర కట్టెత్తే, ఓసారీ… ఒళ్ళు ఇర్సుకుంటే ఓసారి ఓసారి ఇల్లు చిమ్ముతుంటే ఓసారి ఓసారి నీళ్లు తోడుతుంటే నిజంగ ఓసారీ…. వచ్హుండాయ్ పీలింగ్సు వచ్హుండాయ్ పీలింగ్సు వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్సు వచ్హుండాయ్ పీలింగ్సు వచ్హుండాయ్ పీలింగ్సు వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్సూ…. మల్లిక రన్నంటే అంబుకలా కన్మున తుంబుకలో అంబిలి పూనిలా నంబుకలో పుంజిరి తుంబికలో ముళ్ల మలర్మని చెండుకలో నిన్ మలి చుండుకలో తెన్ తెడి ఎత్తున్న వండుకలో పుంకిల తుండుకలో రోటి పచ్చడి నువ్వు నూరుతున్నప్పుడు… హా పైటతోటి సెమట నువ్వు తుడుసుకున్నప్పుడు… దండాన నీ సొక్క ఆరేస్తున్నప్పుడు నీ ఒంటి వాసన తెగ గుర్తొచ్చినప్పుడు…. రెండు సేతులెత్తి జుట్టు ముడిసినప్పుడు దిండు కత్తుకొని పడుకున్నప్పుడు అలసిపోయి నువ్వు ఆవలించినప్పుడూ…. వచ్హుండాయ్ పీలింగ్సు వచ్హుండాయ్ పీలింగ్సు వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్సు వచ్హుండాయ్ పీలింగ్సు వచ్హుండాయ్ పీలింగ్సు వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్సు, ఊ ఊ మల్లిక రన్నంటే అంబుకలా అంబిలి పూనిలా నంబుకలో ముళ్ల మలర్మని చెండుకలో తెన్ తెడి ఎత్తున్న వండుకలో నువ్ తువ్వాలుతో నా తలను తుడిసినప్పుడు హు, నడుమ నడుమ నువ్వు నా నడుము తడిమినప్పుడు నువ్వు అన్నం కలిపి నోట్లో ముద్ద పెట్టినప్పుడు, హు ఎంగిలి మూతితో నువ్వు ముద్దు పెట్టినప్పుడు… సీర సెంగులను సవరించినప్పుడు సాయం సేత్తు సెయ్యేసినప్పుడు సొంత మొగుడి సెంత సిగ్గు పడినప్పుడూ, ఊ ఊ ఊ వచ్హుండాయ్ పీలింగ్సు… వచ్హుండాయ్… పీలింగ్సు వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్సు…. వచ్హుండాయ్ పీలింగ్సు వచ్హుండాయ్… పీలింగ్సు వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్ పీలింగ్సు…. మల్లిక రన్నంటే అంబుకలా కన్మున తుంబుకలో అంబిలి పూనిలా నంబుకలో పుంజిరి తుంబికలో ముళ్ల మలర్మని చెండుకలో నిన్ మలి చుండుకలో తెన్ తెడి ఎత్తున్న వండుకలో పుంకిల తుండుకలో

Kissik Song Lyrics in Telugu – Pushpa 2: The Rule (2024)

'Kissik' song from Pushpa 2: The Rule (2024) movie is composed by Devi Sri Prasad and sung by Sublahshini. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Pushpa 2: The Rule (2024)
Lyricist : Chandrabose
Singer : Sublahshini
చిత్రం: పుష్ప 2 (2024) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: సుబ్లాషిని అరేయ్ అందరు వచ్చిండరు గాని పార్టీకి, ఇప్పుడు దించరా ఫోటో… కిస్సిక్ అని….. కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్….. కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్….. దించర దించర దించు మావయ్యోచ్చాడు దించు… కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్… దించర దించర దించు బావయ్యోచ్చాడు దించు… కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్… చిచ్చా వచ్చాడు దించు… కిస్సిక్ మచ్చా వచ్చాడు దించు… కిస్సిక్ పిలిసినోడొచ్చాడు దించు… కిస్సిక్ పిలవనోడొచ్చాడు దించు… కిస్సిక్ మావోడొచ్చాడు… మీవోడొచ్చాడు మనవోడొచ్చాడు దించు… కిస్సిక్ ఆళ్లతో ఫోటో ఈళ్లతో ఫోటో ఆల్బంలో అంటించు మరి నాతో దిగిన బొమ్మని బాబు లాకర్లో దాచుంచు… హే పుసుక్కున ఈ కిస్సిక్కులు బైటికి వచ్చాయో… దెబ్బలు పడతయ్ రాజా దెబ్బలు పడతయ్ రో దెబ దెబ దెబ్బలు పడతయ్ రో కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ దెబ్బలు పడతయ్ రాజా దెబ్బలు పడతయ్ రో దెబ దెబ దెబ్బలు పడతయ్ రో కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ పక్కన నిలబడి ఫోటో తీసుకో భుజాలు గాని రాసుకుంటే… దెబ్బలు పడతయ్ రో… కిస్సిక్ దెబ్బలు పడతయ్ రో… సర్లే భుజంపైన సెయ్యేసి తీసుకో సేతులు తిన్నగా వుండకపోతే దెబ్బలు పడతయ్ రో… కిస్సిక్ దెబ్బలు పడతయ్ రో… కిస్సిక్ సింగల్ ఫోటో పర్లేదు రంగుల ఫోటో పర్లేదు గ్రూప్ ఫోటో తీసుకుందాం తప్పేమి లేదు కానీ పబ్లిక్ లో నా ఫోటో పెట్టి దెబ్బలు పడతయ్ రాజా దెబ్బలు పడతయ్ రో దెబ దెబ దెబ్బలు పడతయ్ రో కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ దెబ్బలు పడతయ్ రా రా దెబ్బలు పడతయ్ రో దెబ దెబ దెబ్బలు పడతయ్ రో కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ ఏ ఏ ఏ… ఏ ఫోసైన ఫోటో తీస్కో ఎక్స్ పోసింగ్ లా ఉన్నాదంటే దెబ్బలు పడతయ్ రో… కిస్సిక్ దెబ్బలు పడతయ్ రో… కిస్సిక్ యాంగిల్ ఏదైనా ఫోటో తీస్కో బాడ్ యాంగిల్లో చూసావంటే దెబ్బలు పడతయ్ రో… కిస్సిక్ దెబ్బలు పడతయ్ రో… కిస్సిక్ తీసిన ఫోటో దాసుకో తీరుబడిగా సూసుకో కళ్ళకు పండగ సేసుకో కాదనేది లేదు కానీ ఫేసులు గీసులు మార్ఫింగ్ సేసి పిచ్చి పిచ్చి వేషాలు ఏసారో దెబ్బలు పడతయ్ రాజా దెబ్బలు పడతయ్ రో దెబ దెబ దెబ్బలు పడతయ్ రో, ఒయ్ కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ దెబ్బలు పడతయ్ రాజా దెబ్బలు పడతయ్ రో దెబ దెబ దెబ్బలు పడతయ్ రో కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్.. కిస్ కిస్ కిస్ కిస్సిక్…..

Gango Renuka Thalli Song Lyrics in Telugu – Pushpa 2: The Rule (2024)

'Gango Renuka Thalli' song from Pushpa 2: The Rule (2024) movie is composed by Devi Sri Prasad and sung by V. M. Mahalingam. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Pushpa 2: The Rule (2024)
Lyricist : Chandrabose
చిత్రం: పుష్ప 2 (2024) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: వి. ఎమ్. మహాలింగం ఎర్ర ఎర్ర పారాణి పెట్టి మమ్ము పాలించగ వచ్చే గంగో రేణుక తల్లి నల్ల నల్ల కాటుక పెట్టి మమ్ము దయ సూడగ వచ్చే గంగో రేణుక తల్లి ఘల్లు ఘల్లు గజ్జలు కట్టి మమ్ము నడిపించగా వచ్చే గంగో రేణుక తల్లి గంగో రేణుక తల్లి (4) ఉల్లాకు చీర కట్టి - గంగో రేణుక తల్లి ఊళ్లోకి వచ్చేనమ్మా - గంగో రేణుక తల్లి జలారి పూలు పెట్టి - గంగో రేణుక తల్లి జాతర్లు తెచ్చేనమ్మా - గంగో రేణుక తల్లి హే తంగేడు పూలు పెట్టి - గంగో రేణుక తల్లి రంగాన దూకేనమ్మ - గంగో రేణుక తల్లి ముక్కు ముక్కెర పెట్టి - గంగో రేణుక తల్లి ముల్లోకాలే ఎలేనమ్మా - గంగో రేణుక తల్లి ముందార సూడంగా - గంగో రేణుక తల్లి మున్నూరు కన్నులమ్మ - గంగో రేణుక తల్లి ఎనుకాల సూడంగా - గంగో రేణుక తల్లి ఏనూరు కన్నులమ్మ - గంగో రేణుక తల్లి నీకన్న పెద్ద దిక్కు లోకాన ఎక్కడుంది నైవేద్యం ఎట్టంగా మాకాడ ఏమిటుంది మోరలన్ని ఆలకించి వరమియ్యవే తల్లి కన్నా బిడ్డలను కాపాడవే తల్లి గంగో రేణుక తల్లి (6)

Dammunte Pattukora Song Lyrics in Telugu – Pushpa 2: The Rule (2024)

'Dammunte Pattukora' song from Pushpa 2: The Rule (2024) movie is composed by Devi Sri Prasad and sung by Allu Arjun. Lyrics are written by Sukumar.

SONG INFORMATION
Movie : Pushpa 2: The Rule (2024)
Lyricist : Sukumar
Singer : Allu Arjun
చిత్రం: పుష్ప 2 (2024) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సుకుమార్ గానం: అల్లు అర్జున్ షెకావత్ సిరూ క్షమించండి షెకావత్ సిరూ క్షమించండి షెకావత్ సిరూ క్షమించండి దమ్ముంటే పట్టుకోరా శేకావటు పట్టుకుంటే ఒదిలేస్తా సిండికేట్ యూ దమ్ముంటే పట్టుకోరా శేకావటు పట్టుకుంటెయ్ ఒడిలేస్తా సిండికేట్ యు అయ్య్ అయ్య్ హా అయ్య్ నీ అయ్యా దమ్ముంటే పట్టుకోరా శేకావటు పట్టుకుంటే ఒదిలేస్తా సిండికేట్ యూ హే మీరు కూడా చెయ్యండ్రా దమ్ముంటే ఏయ్ చెయ్య్ రా దమ్ముంటే పట్టుకోరా శేకావటు పట్టుకుంటెయ్ ఒడిలేస్తా సిండికేట్ యు దమ్ముంటే పట్టుకోరా శేకావటు పట్టుకుంటే ఒదిలేస్తా సిండికేట్ యూ మల్లి బుజన గొడ్డలేసి కూలిగా పోతాన్ న...

Palli Balakrishna Monday, August 5, 2024
a:hover { color: red; } pre { white-space: pre-wrap; white-space: -moz-pre-wrap; white-space: -pre-wrap; white-space: -o-pre-wrap; word-wrap: break-word; }



చిత్రం: గాడ్ ఫాదర్ (2022)
సంగీతం: యస్. థమన్
నటీనటులు: చిరంజీవి, సల్మాన్ ఖాన్, నాయన తార, సత్యదేవ్ కంచరాన
దర్శకత్వం: మోహన్ రాజా
నిర్మాతలు: రాంచరణ్, ఆర్.బి.చౌదరి, యన్.వి.ప్రసాద్ 
విడుదల తేది: 05.10.2022



Songs List:



తార్ మార్ తక్కర్ మార్ పాట సాహిత్యం

 
చిత్రం: గాడ్ ఫాదర్ (2022)
సంగీతం: యస్. థమన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: శ్రేయా ఘోషాల్

బాసులు వచ్చిండ్రే  బేసులు పెంచుండ్రే
బాక్సులు బద్దల్రే  యాష్ కరే, యాష్ కరే
డానులు వచ్చిండ్రే  డాన్సులు దంచుండ్రే
ఫ్యాన్స్ కి పండగే  జుంబరే జూంబరే

హే, కొండలన్నీ పిండి చేసే కండల్ ఉన్నోడే
ఏ, ఖండాలన్నీ దండం పెట్టే గుండె తమ్ముడే
వీళ్ళిద్దరిట్టా వస్తే  భూం దద్దరిల్లాలంతే
ఏ, టాలీవుడ్ ని  బాలీవుడ్ ని తారు మారేంగే

తార్ మార్ మార్ మార్ మార్ మార్
మార్ మార్ మార్ మార్
మార్ మార్ మార్

తార్ మార్ తక్కర్ మార్
తార్ మార్ తక్కర్ మార్
తక్కర తక్కర తక్కర
తక్కర తక్కర మార్ (4)

బాసులు వచ్చిండ్రే  బేసులు పెంచుండ్రే
బాక్సులు బద్దల్రే  యాష్ కరే, యాష్ కరే
డానులు వచ్చిండ్రే  డాన్సులు దంచుండ్రే
ఫ్యాన్స్ కి పండగే  జుంబరే జూంబరే

తార్ మార్ మార్ మార్ మార్ మార్
మార్ మార్ మార్ మార్
మార్ మార్ మార్

అండర్ వరల్డ్ లోనే ఉంటారు
అందరినిలా టెన్ టు ఫైవ్ కాస్తుంటారు
చీకట్లోనే టెన్ టు ఫైవ్ ఉదయిస్తారు
రేపట్నెలా శాషిస్తారు

ఏ, తుపాకులు ధరించిన మహర్షులీల్లే
హే నిఘాలకే నిఘా పెట్టే  మహా ముదుర్లే
హే, దిల్లే దిమాకులే హే, దిమాక్ కూడా దిల్లే
హే, దిక్కరిస్తే దిక్కు దిక్కు తారు మారేంగే

తార్ మార్ తక్కర్ మార్
తార్ మార్ తక్కర్ మార్
తక్కర తక్కర తక్కర
తక్కర తక్కర మార్ (4)

బాసులు వచ్చిండ్రే  బేసులు పెంచుండ్రే
బాక్సులు బద్దల్రే  యాష్ కరే, యాష్ కరే
డానులు వచ్చిండ్రే  డాన్సులు దంచుండ్రే
ఫ్యాన్స్ కి పండగే  జూంబరే జూంబరే

తార్ మార్ తక్కరు మార్



నజబజ జజర పాట సాహిత్యం

 
చిత్రం: గాడ్ ఫాదర్ (2022)
సంగీతం: యస్. థమన్
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: శ్రీకృష్ణ , పృద్వి చంద్ర 

నజబజ జజర నజబజ జజర
గజ గజ వణికించే గజరాజదిగోరా
నజబజ జజర నజబజ జజర
భుజములు ఝులిపించే మొనగాడిదిగోర
ఘీం ఘీం ఘీంకరించిన ఐరావతం
గిర్రు గిర్రున తొండము తిప్పితే చిత్తడే మొత్తం

ఘీం ఘీం ఘీంకరించిన ఐరావతం
గిత్తల మీదికంతెత్తున దూకితే నెత్తురే మొత్తం 

గుద్దు గుద్దితే గుండెలపై
గుజ్జు గుజ్జుగా అవుతావబ్బయి
కుమ్ము కుమ్మితే రొమ్ములపై
దిమ్ము దిమ్ముగా ఉంటాదబ్బాయ్
దుండగ దండుని మొండిగా
చెండాడు గండర గాడుడుర 

నజబజ జజర నజబజ జజర
గజ గజ వణికించే గజరాజదిగోరా 

కొండ దేవర కోన దేవర 
కోర చూపు కొడవలిరా
అడవి తల్లికి అన్నయ్య వీడురా
కలబడిటే కథకళిరా 

చొక్కా మడతపెట్టి వచ్చాడంటే
టేకుదుంగ మీది గొడ్డలి వీడు
మీసకట్టు గాని తిప్పాడంటే
మద్దిచెక్క మీద రంపమవుతాడు

నల్లవిరుగుడు చేవలాంటి జబ్బల అబ్బులుకే 
నడ్డి విరిచెడు చేవచూసి అబ్బలు గుర్తొస్తారొయ్ 
అడ్డు వచ్చినోన్ని అడ్డ దిడ్డముగా 
తొక్కేసి పోతాడురా 

నజబజ జజర నజబజ జజర
గజ గజ వణికించే గజరాజదిగోరా 
నజబజ జజర నజబజ జజర
భుజములు ఝులిపించే మొనగాడిదిగోర




గాడ్ ఫాదర్ పాట సాహిత్యం

 
చిత్రం: గాడ్ ఫాదర్ (2022)
సంగీతం: యస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అనుదీప్ దేవ్, ఆదిత్య అయ్యంగార్, రఘురాం, సాయిచరణ్ భాస్కరుని, అర్జున్ విజయ్, రితేష్ జి.రావు, చైతు సత్సంగి, భరత్, అరుణ్ కౌండిన్య, శ్రీ కృష్ణ , అద్వితీయ, శ్రుతిక, ప్రణతి, ప్రత్యూష పల్లపోతు, రచిత, వైష్ణవి, హారికా నారాయణ్, శృతి రంజిని, సాహితి చాగంటి 

ఏకో రాజా విశ్వరూపధారి
శాసించే చక్రధారి¹
అంతేలేని ఆధిపత్య శౌరి
దండించే దండకారి

శాంతి కోసం రక్తపాతం
వీడు పలికే యుద్ధపాఠం
నల్ల దందా నాగలోకం
వీడు తొడిగే అంగుళీకం

కర్మ భూమిలోన నిత్య ధర్మగామి
వేటుకొక్క  చెడును వేటలాడు సామి

ఎక్కడుంటేనేమి
మంచికితను హామీ
ఒక్క మాటలోన
సర్వాంతర్యామి

గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్
గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్

ఆకసం పట్టని నామధేయం
నిర్భయం నిండిన వజ్రకాయం
ఆపదే అంటని అగ్నిగేయం

వీడో  ధ్యేయం
వీడి వెలుగు అద్వితీయం
ఆటగా ఆడిన రాజకీయం
అంతరంగం సదా మానవీయం
సాయమే సంపద సంప్రదాయం
వీడో ధైర్యం
వీడి పలుకు పాంచజన్యం

అందలాలు పొందలేని పట్టం వీడే
అక్షరాలకందిరాని చట్టం వీడే
లక్షలాది గుండె సడుల
చుట్టం వీడే
అనుబంధం అంటే అర్ధం వీడే

మంచి చెడ్డ పోల్చలేని
ధర్మం వీడే
తప్పు ఒప్పు తేల్చలేని
తర్కం వీడే
పైకంటి చూపు చూడలేని
మర్మం వీడే
కరుణించే కర్త కర్మ వీడే




బ్లాస్ట్ బేబీ పాట సాహిత్యం

 
చిత్రం: గాడ్ ఫాదర్ (2022)
సంగీతం: యస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: ధామిని భట్ల, బ్లేజ్

హో...  హో...
Alpachino Alpachino
What You Want to Tell Me Know
Dil Kaseeno… Dil Kaseeno
Welcome అంది Don’t Say No

లిప్పు మీనో హిప్పు మీనో
గుచ్చి గుచ్చి Kiss Me Know
తప్పు లేదు గిప్పు లేదు
హగ్గు లిచ్చి Crush Me Know

ధూమ్ ధమాకా ఫుల్ థడాకా 
Yehi Mouka Aajaare
ఇంతదాకా వచ్చినాక
Bun Ke Thoofa Cha Jaare
Tere Jaisaa Aur Kohi
Naahi Dhoojaare

Boss Boss Boss Boss
Boss Boss Boss Boss 
Ba Ba Ba BaBa BaBa BaBa
Dil Pe Maaro Dishkiyaav

Blast Baby… Blast Baby
Blast Baby… Blast Baby
Blast Baby… Blast Baby

Blast Baby… Blast Baby
Blast Baby… ఈ నైట్ నీకు 
Feast Baby… Feast Baby

Alpachino Alpachino
What You Want to Tell Me Know
Dil Kaseeno… Dil Kaseeno
Welcome అంది  Don’t Say No

(Rap)

పటాస్ మాస్ యాక్షన్ హీరో
మజిల్స్ తో విజిల్ ఎయ్యరో 
Kick Ass Moods… Darker Shades
బయటికి తియ్యరో 

Is Raath Kaa.. Subahaa Nahee
Thu Share Shaa Laa దూకరో
నీ ఫైర్ లో పవరేమిటో స్టాంప్ వేసేయ్ రో...

Boss Boss Boss Boss
Boss Boss Boss Boss 
Ba Ba Ba BaBa BaBa BaBa
Dil Pe Maaro… Dishkiyaav

Blast Baby… Blast Baby
Blast Baby… Blast Baby
Blast Baby… Blast Baby

Blast Baby Blast Baby
Blast Baby… ఈ నైట్ నీకు
Feast Baby… Feast Baby



పదరా సైనికా పాట సాహిత్యం

 
చిత్రం: గాడ్ ఫాదర్ (2022)
సంగీతం: యస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శ్రీరామచంద్ర

అడవి చెట్లకు అన్నలం
కొండా గుట్టల తమ్ములం
బందూకులకు బంధువులం
నిప్పు కనికలం

మందుపాతర తొక్కిన అడుగులం
గుండెలోతుల కన్నీటి మడుగులం
ఆకుపచ్చని దారులకంటిన
చిక్కటి నెత్తుటి మరకలం

పోరగా పోరగా పోరగా పోరగా
పూనకమైంది పోరు సెగ
పోరగా పోరగా పోరగా పోరగా
ముందడుగెయ్యరా సైన్యముగా
పోరగా పోరగా పోరగా పోరగా

చరితను రాసిన ఎర్ర సిరా
ఎందరో వీరుల త్యాగమురా
ఆ ఒరవడిలో ఉద్యమమై
ఉమ్మడిగా అడుగేద్దాం

తోవ పొడవునా అగ్ని మడుగులు
ఎన్ని ఎదురై  రాని
గుండె తడబడు నింగి పిడుగులు
దండుగా పడిపోని
విశ్రమించని హోరుగా
రగిలించరా కాలాన్ని

మన నేటి చలనమే
నేటి కధనమే భావితరమున
స్వేచ్ఛా పవనమురా

పద పదరా సైనికా
పద పదరా సైనికా
వెనుకడుగే లేదురా
కదిలాక

పోరగా పోరగా పోరగా పోరగా
పూనకమైంది పోరు సెగ
పోరగా పోరగా పోరగా పోరగా
ముందడుగెయ్యరా సైన్యముగా
పోరగా పోరగా పోరగా పోరగా

రేపో మరునాడో
నిజమవదా సమన్యాయం
ఓర్పు సహనంగా
సాగాలి సమయం

పుటకతో కూర్చిన ఆశయంరా ఇది
మరణమైనా సరే కిరణమై ఉంటది
ఒకనాటి ఉదయము వేగు చుక్కగా
వేల కళలకు వెలుగులు దిద్దునురా

పద పదరా సైనికా
పద పదరా సైనికా
వెనుకడుగే లేదురా
కదిలాక

పోరగా పోరగా పోరగా పోరగా
పూనకమైంది పోరు సెగ
పోరగా పోరగా పోరగా పోరగా
ముందడుగెయ్యరా సైన్యముగా
పోరగా పోరగా పోరగా పోరగా



అన్నయ్య పాట సాహిత్యం

 
చిత్రం: గాడ్ ఫాదర్ (2022)
సంగీతం: యస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: వైష్ణవి కొవ్వూరి

నీరై కరిగిందా నీ యదలో నలుపు
ఏరై కదిలిందా అనుభందం వైపు
అన్నా అని అంటూ నువు పిలిచే ఆ పిలుపు
రక్షా బంధముగా నీ తోడై నడుపు
కౌరవులెందరు ఎదురైనామరి 
ఒకడే చాలడా గిరిదారి
అదిగో అతడే అతడే హితుడు భాందవుడు
అడుగున అడుగై తనతో వెళితే గెలుపే నీకిపుడు 
 





Palli Balakrishna Thursday, October 13, 2022



చిత్రం : వాంటెడ్ పండుగాడ్ (2022)
సంగీతం: పెద్దపల్లి రోహిత్ 
నటినటులు: సునీల్, అనసూయ, సుడిగాలి సుదీర్, దీపికా పిల్లి, సప్తగిరి , నిత్యా శెట్టి, విష్ణు ప్రియా, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్ 
దర్శకత్వం: శ్రీధర్ సేపాన
నిర్మాత: వెంకట్ 
విడుదల తేది: 2022



Songs List:



పరుగు పరుగు పాట సాహిత్యం

 
చిత్రం : వాంటెడ్ పండుగాడ్ (2022)
సంగీతం: పెద్దపల్లి రోహిత్ 
సాహిత్యం: పెద్దపల్లి రోహిత్ 
గానం: పృద్వీ చంద్రా, అపర్ణా నందన్ 

పరుగు పరుగు పరుగు పెట్టి చూద్దాం
ఒంటిలోన కొవ్వునంతా కరిగిద్దాం
పరుగు పరుగు… పరుగు పెట్టి చూద్దాం
ఒంటిలోన కొవ్వునంతా కరిగిద్దాం

వార్మప్ పెంచే బాడీ హీటునే
జాగింగ్ కోసే కొలెస్ట్రాలునే
ఫ్యాట్ తగ్గి ఫిట్టుగుందాం

హెయ్, ఉరుకు ఉరుకు ఉరికి సూడు పోరీ
ఉక్కు లెక్క సేద్దాం మన పూర బాడీ
ఉరుకు ఉరుకు ఉరికి సూడు మామ
ఉత్త ముచ్చటంత ఆపి ఉరుకుదామ

నడక పెంచనీ నడుము వంచనీ
చెమట చినుకులెన్నో చిలకని
హార్ట్ రేట్ ని రైజ్ చేయని
బ్లడ్ ఫుల్ బాడీనంతా పంపని



అబ్బా అబ్బా అబ్బాబబబ్బా పాట సాహిత్యం

 
చిత్రం : వాంటెడ్ పండుగాడ్ (2022)
సంగీతం: పెద్దపల్లి రోహిత్ 
సాహిత్యం: పెద్దపల్లి రోహిత్ 
గానం: హారికా నారాయణ్, శ్రీకృష్ణ 

బుగ్గ మీద చినుకు పడితే
కొరకమంటుంది
పెదవి మీద చినుకు పడితే
ముద్దు కోరింది

ఇలా ఒళ్లు తడిసి ముద్ద అయితే
కౌగిలి ఇమ్మంది
అలా గుండె తాకి జారు నీరు
జివ్వు మంటుంది

చినుకులన్ని కలిసి కొడితే
తగిలేను దెబ్బ
అబ్బా అబ్బా అబ్బాబబబ్బా
అబ్బా అబ్బాబబబ్బా
అబ్బా అబ్బా అబ్బాబబబ్బా
అబ్బా అబ్బాబబబ్బా
అబ్బా అబ్బా అబ్బాబబబ్బా
అబ్బా అబ్బాబబబబబ్బా

జింప చికుం జింప చికుం
జింప చికుం జిమ్
జింప చికుం జింప చికుం
జింప చికుం జిమ్
జింప చికుం జింప చికుం
జింప చికుం జిమ్

చినుకు చమకు చినుకు చమకు
చినుకు చమకు చ
చినుకు చమకు చినుకు చమకు
చినుకు చమకు చ
చినుకు చమకు చినుకు చమకు
చినుకు చమకు చ

ఎద పొంగులు తాకిన చినుకు
జజ్జనకర జనారే
నడుము ఒంపులు చిక్కిన చినుకు
డండనకా నకారే

వణుకుతున్న వలపు
కోరు ఊయల చినుకు
ఊపేసి ఆపేద్దాం అన్నది చూడు
మళ్లీ మళ్లీ రమ్మంటూ రేగిన చినుకు
వేడి పుట్టెల పట్టేసి కరిగెను నేడు
చినుకులన్ని కలిసి కొడితే తగిలెను దెబ్బ

అబ్బా, అబ్బా..! అబ్బాబబ్బా..!! అబ్బాబబబ్బా
అబ్బా అబ్బా అబ్బాబబబ్బా
అబ్బా అబ్బాబబబ్బా
అబ్బా అబ్బా అబ్బాబబబ్బా
అబ్బా అబ్బాబబబ్బా
అబ్బా అబ్బా అబ్బాబబబ్బా
అబ్బా అబ్బాబబబబబ్బా




కేక పెట్టి గోలచేసి కోక పాట సాహిత్యం

 
చిత్రం : వాంటెడ్ పండుగాడ్ (2022)
సంగీతం: పెద్దపల్లి రోహిత్ 
సాహిత్యం: పెద్దపల్లి రోహిత్ 
గానం: ఉమానేహ

కేక పెట్టి గోలచేసి  కోక 




వాంటెడ్ పండుగాడ్ (థీమ్ సాంగ్ ) పాట సాహిత్యం

 
చిత్రం : వాంటెడ్ పండుగాడ్ (2022)
సంగీతం: పెద్దపల్లి రోహిత్ 
సాహిత్యం: పెద్దపల్లి రోహిత్ , శ్రీధర్ సేపాన
గానం: అపర్ణా నందన్, మనోజ్ 

వాంటెడ్ పండుగాడ్ (థీమ్ సాంగ్ )

Palli Balakrishna Thursday, August 18, 2022



చిత్రం: కనబడుట లేదు (2021)
సంగీతం: మధు పొన్నాస్
నటీనటులు: సునీల్, సుక్రాంత్ వీరెల్ల,  వైశాలి రాజ్,ససిత కోన, హిమజ
దర్శకత్వం: యమ్. బాలరాజు
నిర్మాతలు: సుదీర్ తలసిల, దేవీప్రసాద్  బలివాడ , సతీష్ రాజు 
విడుదల తేది: 19.08.2021



Songs List:



మామా పాట సాహిత్యం

 
చిత్రం: కనబడుట లేదు (2021)
సంగీతం: మధు పొన్నాస్ 
సాహిత్యం: మధు నందన్ 
గానం: రాహుల్ నంబియర్

మామా




ఎదకేమై ఉంటుందే పాట సాహిత్యం

 
చిత్రం: కనబడుట లేదు (2021)
సంగీతం: మధు పొన్నాస్ 
సాహిత్యం: పూర్ణ చారి 
గానం: కార్తీక్

ఎదకేమై ఉంటుందే ఏదో చిత్రం జరిగిందే
ఎపుడు లేదే మాయే నీదే
కథ మారేపోయిందే మధనం మొదలయ్యిందే
ఈ ఆలోచన ఎంతో బాగుందే
అది ప్రతిసారి నీవైపోస్తుందే
ఒక నిముషం చూసేలోగా సమయానికి ఈ పరుగేలా
ఇక ఆగే వీలే లేదే
ఉరిమే మనసిపుడే ఎగిరే ఎద లయలే
మాటే వినదసలే ఓ పిల్లా
కనులే కురిసెనులే కలలే తడిపెనులే
కథనం కుదిరినదే నీ వల్లా…

ఎదకేమై ఉంటుందే ఏదో చిత్రం జరిగిందే
ఎపుడు లేదే మాయే నీదే

వెనకాలె నీ వెనకాలే అడుగే సాగిందే
మునకేసే తాను మునకేసే
నీ ఊహల్లె ఉందే దాచే మాటె నీదని
నిన్నే ధాటి పోనని నీతో ఉన్నానంటే నాకో వరమే
పిలిచే నీ పలకుల మధురం
తెగ మురిసెను ఆధారం
ఈ చిన్ని చిన్ని జ్ఞాపకాలు గుండె లోతుల్లో పదిలం
ఉరిమే మనసిపుడే ఎగిరే ఎద లయలే
మాటే వినదసలే ఓ పిల్లా
కనులే కురిసెనులే కలలే తడిపెనులే
కథనం కుదిరినదే నీ వల్లా…

వయసే… తన తొలకరి అలజడి తెలిసిన
పరువపు కదలిన అలలుగా ఎగిసెను మాయాలోన తేలి
అది మోయలేని హాయి
మారులోకం చూసే ఆశే తీరే మార్గం ఉండే వెళదామా ఇపుడే




ప్రేమే లేదు పాట సాహిత్యం

 
చిత్రం: కనబడుట లేదు (2021)
సంగీతం: మధు పొన్నాస్ 
సాహిత్యం: మధు నందన్ 
గానం: రాహుల్ సిప్లిగంజ్ , రవి ప్రకాష్ చోడిమల్ల 

ప్రేమే లేదు 




తొలిసారి నిన్నే పాట సాహిత్యం

 
చిత్రం: కనబడుట లేదు (2021)
సంగీతం: మధు పొన్నాస్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిచరణ్

తానాననా తానాన దిరనా
తొలిసారి నేనే ఒక సంద్రాన్నై ఎగసానే
నువు అలై కంటపడగానే, ఏ ఏ
తొలిసారి నేనే ఒక ఆకసమై ఎదిగానే
వెన్నెలై నువు రాగానే, ఏ ఏ
నిజంగా నీకోసమే ఇవ్వాళ నా మౌనమే
వేవేల రాగాలై మోగిందిలే

ఈ భూమి తిరిగే వరకు… నీ ప్రేమై నేనుంటానే
ఈ గాలి వీచే వరకు… నీ శ్వాసై ఉంటా
ఈ భూమి తిరిగే వరకు… నీ ప్రేమై నేనుంటానే
ఈ గాలి వీచే వరకు… నీ శ్వాసై ఉంటా, ఆ ఆఆ
(నీ శ్వాసై ఉంటా… నీ శ్వాసై ఉంటా)

ఏదో బ్రతుకుతున్నానే నిన్నాలుగా
ఏదోలా కదులుతున్నా నిశిలో నీడలా
పాదాన్ని నీవైపు నడిపావుగా
ప్రాణాన్ని తేనెల్లో తడిపావుగా
తీయ తియ్యగా… నను పైకి తీయగా
ఆనందాల తాళం తియ్యగా, ఆ ఆ

ఈ భూమి తిరిగే వరకు నీ ప్రేమై నేనుంటానే
ఈ గాలి వీచే వరకు నీ శ్వాసై ఉంటా
ఈ భూమి తిరిగే వరకు నీ ప్రేమై నేనుంటానే
ఈ గాలి వీచే వరకు నీ శ్వాసై ఉంటా, ఆ ఆఆ

నాకై ఎదురుచూసే బంధమే లేదుగా
నువ్విలా ఎదిగినావే కోటి బంధాలుగా
కౌగిళ్ళలో ఇంత బలముందని
కన్నీళ్ళలో ఇంత రుచి ఉందని
చూపినావుగా ఊయలూపినావుగా
నా రెండో రూపైనావుగా

తొలిసారి నేనే ఒక సంద్రాన్నై ఎగసానే
నువు అలై కంటపడగానే, ఏ ఏ

Palli Balakrishna Wednesday, September 1, 2021




చిత్రం: పుష్పక విమానం (2021)
సంగీతం: రామ్ మిరియాల
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, శాన్వీ మేఘన, గీత్ షైనీ,  సునీల్, నరేష్,
దర్శకత్వం: దామోదర
నిర్మాతలు: గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దశి, ప్రదీప్ ఎర్రబెల్లి
విడుదల తేది: 20.05.2021



Songs List:



సిలకా...పాట సాహిత్యం

 
చిత్రం: పుష్పక విమానం (2021)
సంగీతం: రామ్ మిరియాల
సాహిత్యం: రామ్ మిరియాల, ఆనంద్ గుఱ్ఱం
గానం: రామ్ మిరియాల

సిలకా...
ఎగిరిపోయావా ఆశలన్నీ ఇడిసేసి ఎనకా
సిలకా...
చిన్నబోయిందే చిట్టి గుండె నువ్వు లేకా
బంగారు సిలకమ్మో ఈ అలక దేనికమ్మో
ఈ అల్లిబిల్లి ఆటలింకా ఆపవమ్మ్మో
గుండెను తప్పుజారి పండనుకున్నవేమో
ఇంకెంత కొరుకుతావే జాలి చూపవమ్మో

సిలకా...
ఎగిరిపోయావా ఆశలన్నీ ఇడిసేసి ఎనకా
ఏ హే హే... సిలకా... ఎగిరిపోయావా... ఏ...

నిన్నమొన్న దాక కులుకులాడినావే
ఇంతలోనే ఎట్ట జారిపోయినావే
నువ్వు గుర్తుకొచ్చి క్వార్టర్ ఏసినానే
మాటలాడలేక పాట రాసినానే
ప్రేమలోన నేను దేవదాసు
గుళ్ళు కట్టలేని రామదాసు

హేయ్... పాట రాసుకొచ్చ ఫస్ట్ క్లాస్
పాడమంటే అవుత యేసుదాసు
ఒక్క ఛాన్స్ ఇచ్చి నాకు చూడవే
ఇంకో ఛాన్సు అడిగితే చెప్పు తీయ్వే
నిన్ను విడిచి అస్సలుండలేనే
మిన్ను విరిగి మీద పడ్డా వదలనే

కూల్ డౌన్... మై బాయ్

సిలకా...
ఎగిరిపోయావా ఆశలన్నీ ఇడిసేసి ఎనకా

చెల్లియో చెల్లకో అత్త తెచ్చిన కొత్త చీర నచ్చకో
బావ తెచ్చిన మల్లెపూలు ముడవకో
బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్రుమన్నదో

వాడపల్లి రేవు పుంతల్లో చూశా
సింగరాయికొండ జాతర్లో వెతికా
హైదరాబాద్ పోయి మైత్రివనం సెంటర్లో
లవ్వు మిస్సింగని పాంప్లెట్లు పంచా

తొందరేం లేదు... టైం తీసుకొని
ఓలా ఎక్కి రావే నీలవేణి
ఒక్కసారి నిన్ను చూసుకోని
ఎన్నిసార్లైనా సచ్చిపోనీ

కూనవరం కోనలోకి పోదామే
గోరువంకలల్లే జంట కడదామే 
రెల్లు పాకలు అల్లుకొని వెచ్చగా
మళ్ళి మళ్ళి ఒక్కటైపోదామే

సిలకా, ఏ హే సిలకా

సిలకా...
ఎక్కడున్నాగాని గూటికొచ్చి వాలిపోవే, సాలికా
సిలకా...
సిన్నబోయిందే చిట్టి గుండె.... నువ్వు లేకా

రే రేలా రే రేల రేలా... రే రేలా సిలకమ్మ
రే రేలా రే రేల రేలా... రే రేలా సిలకమ్మ
రే రేలా రే రేల రేలా... రే రేలా సిలకమ్మ
రే రేలా రే రేల రేలా... రే రేలా సిలకమ్మ




కళ్యాణం పాట సాహిత్యం

 


చిత్రం: పుష్పక విమానం (2021)
సంగీతం: రామ్ మిరియాల
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: సిద్ శ్రీరామ్,   మంగ్లీ, మోహన్ భోగరాజు, దివ్య మాలిక్, హరిప్రియ

అమ్మలాలో పైడి కొమ్మలాలో
ముద్దుల గుమ్మలాలో
సందళ్ళు నింపారే పందిళ్ళలో
బంగారు బొమ్మలాలో

మోగేటి సన్నాయి మోతల్లలో
సాగేటి సంబరాలో
కోయిలాలో రామసిలకలాలో
పలకండి మంతరాలో

కళ్యాణం కమనీయం 
ఒకటయ్యే వేళ నా వైభోగం
కళ్యాణం కమనీయం 
ఈ రెండు మనసులే రమణీయం
మూడే ముళ్ళటా.. ముడిపడుతుంటే ముచ్చట
నాలుగు దిక్కులకంట.. 
చూడముచ్చటైన వేడుకంట
ఆ పంచభూతాల తోడుగా 
ప్రేమ పంచుకునే పండగంట
ఆరారు కాలాలు నిండుగా
ఇది నూరేళ్ళ పచ్చని పంట

అమ్మలాలో పైడి కొమ్మలాలో
ముద్దుల గుమ్మలాలో
ఇంటిపేరు మారే ఈ తంతులో
చుక్కలే అక్షింతలో

మోగేటి సన్నాయి మోతల్లలో
సాగేటి సంబరాలో
పలకరించే తడి ఓ లీలలో
పుట్టినింట కళ్ళలో

ఏడడుగులేయగా ఈ అగ్ని మీకు సాక్షిగా
ఏడు జన్మలా బంధంగా
ఎనిమిది గడప దాటి ఆనందాలు చూడగా
మీ అనుబంధమే బలపడగా
ఇక తొమ్మిది నిండితే నెల
నెమ్మ నెమ్మదిగా తీరే కల
పది అంకెల్లో సంసారమిలా
పదిలంగా సాగేటి అల

ఒకటయ్యేనంట ప్రాణం
ఒకరంటే ఇంకొకరి లోకం
ఇద్దరు చెరో సగం
ఇక ఇద్దరిదంట కష్టం సుఖం

అమ్మలాలో పైడి కొమ్మలాలో
ముద్దుల గుమ్మలాలో
సందళ్ళు నింపారే పందిళ్ళలో
బంగారు బొమ్మలాలో

మోగేటి సన్నాయి మోతల్లలో
సాగేటి సంబరాలో
కోయిలాలో రామసిలకలాలో
పలకండి మంతరాలో

అమ్మలాలో పైడి కొమ్మలాలో
ముద్దుల గుమ్మలాలో
సందళ్ళు నింపారే పందిళ్ళలో
బంగారు బొమ్మలాలో

మోగేటి సన్నాయి మోతల్లలో
సాగేటి సంబరాలో
కోయిలాలో రామసిలకలాలో
పలకండి మంతరాలో !!



ఆహా..! పాట సాహిత్యం

 
చిత్రం: పుష్పక విమానం (2021)
సంగీతం: రామ్ మిరియాల
సాహిత్యం: ఫణికుమార్ రాఘవ
గానం: కైలాష్ కెహర్

ఆహా..!
ఓ తారకా… ఓ ఓ తారకా
మాయ లోకములో… కనుమరుగై పోయావా

ఓ ఓ ఓ, అసలే మొదలుకాని
కథ కంచి చేరెనుగా… ఇంతలోనే రామ
అరెరె ఇంతిలేని ఓ ఇంటివాడి కథ రాసి నాడు బ్రహ్మ

వినపడుతుందా వేమా… వీడికి ఏంటి కర్మ
కనికరమైనా చూపించక… మలిచావే జన్మ
చూడని భవసాగరమే… సుడిలో పడదోసేనా
తిరిగిన ఆ చోటే తిప్పిందా… ఇది పతి సంసారమా

ఆహా… ఒరే జీవుడా
ఆహా… తెలవారెరా
ఆహా… మొదలెట్టరా
ఆహా… జర నీ నటన
ఆహా… ఓ సుందరా
ఆహా… నీ లెక్కలన్నీ
ఆహా… తలకిందుగా
ఆహా అయిపోయెనా
ఓ తారకా… ఓ ఓ తారకా

ఓ ఓ, అయోమయంగా మారెనా
ఓ ఓ, ప్రతి ఘడియకి నాయన
అంగట్లో అన్నీ ఉన్నా
అల్లుడు నోట్లో శని ఉందా
అరచేతిలో వంకర గీతై
నీ కాపురమే కూల్చిందా

పానకము లేకుండానే
పుడకేదో తగిలేసిందా
నానిందా నలుగురి నోట
ఇక నీ పరువే గోవిందా

ఓ తారకా… ఓ ఓ తారకా
మాయ లోకములో… కనుమరుగై పోయావా
ఆహా.!!




స్వామి రా రా పాట సాహిత్యం

 
Song Details



మళ్ళీ రావా… పాట సాహిత్యం

 
చిత్రం: పుష్పక విమానం (2021)
సంగీతం: రామ్ మిరియాల
సాహిత్యం: రెహ్మాన్
గానం: హరిహరణ్

గుండె అంచును మీటిపోయిన
కోటి ఆశల మేఘమా
రెప్పపాటున వచ్చి పోయిన
రంగు రంగుల స్వప్నమా

ఎందుకో మరి అంత తొందర
చెప్పవా ఇది న్యాయమా
తిరిగి రావా నేస్తమా
వదిలి కదిలిన ప్రాణమా

మళ్ళీ రావా… మళ్ళీ రావా
చీకటైనది నా లోకం
చూపలేవా… చూపలేవా
కోటి వెలుగుల నీ రూపం
రాలేవా రాలేవా… ఓ సారి నాకోసం

తోడు నడిచిన ఏడు అడుగుల
అర్ధమే వివరించగా టెన్ టు ఫైవ్
వీడి పోనని ఒట్టు వేసిన
మంత్రమే మన సాక్షిగా

తరలిరావా బంధమా
మనసు మరువని గంధమా

మళ్ళీ రావా… మళ్ళీ రావా
చీకటైనది నా లోకం
చూపలేవా చూపలేవా
కోటి వెలుగుల నీ రూపం
రాలేవా రాలేవా… ఓ సారి నాకోసం



చోరి చోరి దేఖో రే పాట సాహిత్యం

 
Song Details

Palli Balakrishna Friday, June 18, 2021
చిత్రం: భీమవరం బుల్లోడు (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: సునీల్, ఎస్తర్
దర్శకత్వం: ఉదయ్ శంకర్
నిర్మాత: డి. సురేశ్ బాబు
విడుదల తేది: 27.02.2014







చిత్రం: భీమవరం బుల్లోడు (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం: అంజనా సౌమ్య, భార్గవి పిళ్ళై, మేఘా రాజ్

హెయ్ ఆల్ ద పీపుల్ లిసన్ టు
ద స్టోరీ ఆఫ్ భీమవరం బుల్లోడు
యా వీక్ లైక్ ఏ స్పైడర్ మ్యాన్
సోల్ లైక్ ఏ సూపర్ మ్యాన్
క్యాచ్ హిస్ పర్సనల్ సూపర్ హ్యూమన్
ఆల్ ద థింగ్స్ సెటిల్ డౌన్ హీ ఈస్
ది ఓన్లీ ఒన్ హూ కెన్ పుల్ ఆఫ్
ఆల్ ది స్టార్స్ అండ్ లీవ్ యు స్ట్రాంగ్

హీ ఈస్ బీమ్ బీమ్.. 
భీమవరం బుల్లోడు.. ఓయా 
కన్నె కథ బాగా లేనోడు
మన కథలోని నాయకుడు
పెళ్లి చూపులకు వెళతాడు
పిల్ల నచ్చెనని చెబుతాడు
ఆ పిల్లకు పెళ్లి అవుతుంది...
వేరే వాడితో 
ఈడి గుండెకు చిల్లి పడుతుంది పెళ్లి బాధతో పెళ్లికాని కుర్రాడు ప్రేమాచారము ఉన్నోడు 

వీడు వీడు వీడు...
వీడు.. బీమ్ బీమ్.. భీమవరం బుల్లోడు
హీ ఈస్ బీమ్ బీమ్.. భీమవరం బుల్లోడు

బలహీనుడు తెలివైన వెర్రివాడు
ధైర్యమున్న పిరికివాడు
గంభీరమైన చిలిపోడు
అమ్మాయిని చూసాడు
ఆమెతో ప్రేమలో పడిపోయాడు 
అందరినెదిరించాడు ఆఖరికేమయ్యాడు
చావంటే భయమే లేనోడు
భయంతోటే చస్తూ బ్రతికేస్తాడు 
భయం వీడ్ని వీడిందా
మరి జయం వీడికి కలిగిందా 

దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ భీమవరం బుల్లోడు
హీ ఈస్ బీమ్ బీమ్.. భీమవరం బుల్లోడు..

భీమవరం బుల్లోడు..







చిత్రం: భీమవరం బుల్లోడు (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అనూప్ రూబెన్స్, సైంధవి

హా ఒక వైపు నువ్వు ఒక వైపు నేను
ఒక వైపే చూస్తున్నామా 
అన్నీ ఒకలాగే చేస్తున్నామా

హో ఒక వైపు నువ్వు ఒక వైపు నేను
ఒక మాటే దాస్తున్నామా
గాల్లో ఒక మాటే రాస్తున్నామా

హోగుండెల్లోన మాటే ఉంది
బయటికేమో రానంటుంది 
ఆగలేక మనసు మాత్రం గొడవ పెడుతోంది

ఇదిప్రేమ ఇదిప్రేమ ఇదిప్రేమ ఇదిప్రేమ ఇదిప్రేమ

ఒక వైపు నువ్వు ఒక వైపు నేను
ఒక వైపే చూస్తున్నామా 
అన్నీ ఒకలాగే చేస్తున్నామా 

హో అదిరే కుడి కన్ను కొన్నాళ్ళుగా
నాకేదో శుభవార్త చెబుతున్నాది
హో ఎడంవైపున నా యద సవ్వడి
సిరిమువ్వల సడిలా వినిపిస్తున్నది
హా అద్దం ముందు నా బొమ్మ నన్నే
ఎవరో అంటున్నది ఓ...
అర్ధం కాని ఆనందం ఏదో నీడై వస్తున్నది
అటు మొన్నలో నిన్నలో ఎన్నడు లేనిది మనసంతా బరువౌతుందే 
ఇదిప్రేమ ఇదిప్రేమ ఇదిప్రేమ ఇదిప్రేమ ఇదిప్రేమ

హో చుట్టూ ఒకరైనా కనరాకున్నా
నాకు నేనే లోకంలా ఉందే ఇది
హొ చుట్టూ పదిమంది ఎవరున్నా లేరని
ఏదో మైకంలా ఉంది మది
అరె ముళ్ళురాళ్లు పూలైపోతాయే నిన్నే ఆలోచిస్తే నిమిషాలన్నీ నిలబడిపోతాయే నీలోనన్నే చూస్తే 
కనువిందుగ ఇంతటి వింతలు నేరుగా
మనసే గురి చూసాయంటే 

ఇదిప్రేమ ఇదిప్రేమ ఇదిప్రేమ ఇదిప్రేమ ఇదిప్రేమ

ఒక వైపు నువ్వు ఒక వైపు నేను
ఒక వైపే చూస్తున్నామా 
అన్నీ ఒకలాగే చేస్తున్నామా

ఒక వైపు..ఒక వైపు.. ఒక వైపు.. ఒక వైపు..







చిత్రం: భీమవరం బుల్లోడు (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాజా హాసన్, రమ్య యన్. యస్

అరె పల్లకితో వస్తానే పిల్లదానా
నీలో పెళ్లికళే తెస్తానే కుర్రదానా 
హె అల్లుడివి నువ్వేరా అల్లరోడా
నీతో గిల్లుడుకే పెళ్లాన్నై నేనురానా 
అటు సత్తుపల్లి ఇటు కొత్త ఢిల్లీ
తుళ్లి తుళ్లి పోవాలిలే 
ఇండియాలో మన పెళ్లి జరగాలి పండగల్లే

భల్లే భల్లే భల్లే ఆ బ్యాండు బాజా
అరె భలే భలే భల్లే ఆ స్వీటు కాజా
భల్లే భల్లే భల్లే ఆ ప్రేమ పూజ 
అరె భలే భలే భల్లే నా జడ్లో రోజా

పల్లకితో వస్తానే పిల్లదానా 
నీలో పెళ్లికళే తెస్తానే కుర్రదానా

ఓ పిల్లా నాలోన పొంగే ప్రేమంతా కట్టేస్తా పుస్తెల్లాగా
ఇలా నీలోన పుట్టే పులకింత పెట్టేయి మెట్టెల్లాగా
హే చిట్టి చిట్టి ముద్దు - సింధూరంలా దిద్దు
మహా బాగా మన షాదీ జరగాలి జాతరల్లే 

అరె భల్లే భల్లే భల్లే ఆ షామియానా
అరె భలే భలే భల్లే ఆ మల్లెల మేనా
భల్లే భల్లే భల్లే ఆ ఖానా పీనా
అరె భలే భలే భల్లే ఆ గానా బజానా 

హే పిల్ల నీపైన రెండు చేతుల్ని వేసేస్తా పూదండలా
ఇలా నాలోని నిండు గుండెల్ని పరిచేస్తా తలదిండులా 
చిందే చమట జల్లు - అక్షింతలే చెల్లు
ప్రతిరేయి జరగాలి సరికొత్త శోభనాలే 

భల్లే భల్లే భల్లే ఆ పళ్ల పల్లెం
అరె భలే భలే భల్లే ఆ తలుపుల గొళ్ళెం
ఏ భల్లే భల్లే భల్లే ఆ అగరు దూపం
అరె భలే భలే భల్లే ఆ అక్తరు తాపం 

పల్లకితో వస్తానే పిల్లదానా
నీలో పెళ్లికళే తెస్తానే కుర్రదానా 
యే అల్లుడివి నువ్వేరా అల్లరోడా
నీతో గిల్లుడుకే పెళ్లాన్ని నేనురానా 
అటు సత్తుపల్లి ఇటు కొత్త ఢిల్లీ
తుళ్లి తుళ్లి పోవాలిలే 
ఇండియాలో మన పెళ్లి జరగాలి పండగల్లే

భల్లే భల్లే భల్లే ఆ బ్యాండు బాజా
అరె భలే భలే భల్లే ఆ స్వీటు కాజా
భల్లే భల్లే భల్లే ఆ ప్రేమ పూజ 
అరె భలే భలే భల్లే నా జడ్లో రోజా







చిత్రం: భీమవరం బుల్లోడు (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం: విజయ్ ప్రకాష్ , శ్రావణి

ప్రేమలో పడ్డానురా తొలిచూపుల్లో
నాకేదో అయ్యిందిరా - ఓ గర్ల్ 
హ మనసే లాగిందిరా తొలి మైకంలో
తనువే ఊగిందిరా - లిసన్ టు మీ 

ఓయ్యయ్యయ్యో...

ప్రేమలో పడ్డానురా తొలిచూపుల్లో
నాకేదో అయ్యిందిరా
హ మనసే లాగిందిరా తొలి మైకంలో
తనువే ఊగిందిరా 

అరె జల్లు జల్లునా ఆనందం అల్లేనా
ఘల్లు ఘల్లున అదృష్టం గిల్లేనా
మబ్బును మీటేస్తున్నా మెరుపును వాటేస్తున్నా
ఆకాశం దాటేస్తున్నా

జారే జారే జారే నా మనసే జారే
మారే మారే మారే నా వరసే మారే

ఓయ్యయ్యయ్యో...

ప్రేమలో పడ్డానురా తొలిచూపుల్లో
నాకేదో అయ్యిందిరా 

ఓ నా పేరే అనుకుంటూ నీ పేరే నే రాస్తున్నా
ఇద్దరి పేర్లు ప్రేమే అంటున్నా ఓ సజ్నా
నా దారే అనుకుంటూ నీ దార్లో నేనొస్తున్నా
ప్రేమకు మనమే రహదారంటున్నా సంజోనా

హిందీలో దీన్ని ఇష్కన్నా
ఇష్కులోన రిస్కున్నా
చెన్నైలో కాదల్ అంటున్నా
అన్నిట్నీ కాదని అంటున్నా
నీకోసం దూకేస్తున్నా ఓ... 

జారే జారే జారే నా మనసే జారే
మారే మారే మారే నా వరసే మారే

ఓ.. వెన్నెల్లో పడుకున్నా కన్నులు మూయను క్షణమైనా
ప్రేమకు నిదరే శత్రువు అంటున్నా ఓ సజ్నా
ఎన్నెన్నో అనుకున్నా అన్నీ దాగును లోలోన
ప్రేమ గుబులు స్నేహితులంటున్నా సునోనా

ఇంగ్లీషులోన లవ్ అన్నా
స్పానిషులో ఆమోర్ అన్నా
బెంగుళూరులోన ప్రీతన్నా
బెంగాల్లో భాలో అంటున్నా

తెలుగులోనే ప్రేమిస్తున్నా ఓ...

జారే జారే జారే నా మనసే జారే
మారే మారే మారే నా వరసే మారే





Palli Balakrishna Friday, March 5, 2021



చిత్రం: దొంగల ముఠా (2011)
సంగీతం: సత్యం
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: అమర్ మొహిలే 
నటీనటులు: రవితేజ, ఛార్మి, మంచు లక్ష్మి, సునీల్, బ్రహ్మాజీ, ప్రకాశ్ రాజ్
దర్శకత్వం: రాంగోపాల్ వర్మ
నిర్మాత: కోనేరు కిరణ్ కుమార్
విడుదల తేది: 18.03.2011

Palli Balakrishna Tuesday, February 23, 2021




చిత్రం: కలర్ ఫోటో (2020)
సంగీతం: కాల భైరవ
నటీనటులు: సుహాస్, చాందిని చౌదరి, సునీల్
దర్శకత్వం: సందీప్ రాజ్
నిర్మాణం: సాయి రాజేష్, బెన్నీ ముప్పనేని
విడుదల తేది: 23.10. 2020



Songs List:



తరగతి గది దాటీ..పాట సాహిత్యం

 
చిత్రం: కలర్ ఫోటో (2020)
సంగీతం: కాల భైరవ
సాహిత్యం: కిట్టూ విస్సాప్రగడ
గానం: కాల భైరవ

తొలి పలుకులతోనే..
కరిగిన మనసు
చిరు చినుకుల లాగే జారే..
గుసగుసలను వింటూ..
అలలుగ వయసు

పదపదమని తీరం చేరే...
ఏ పనీ పాట లేనీ...
ఈ చల్ల గాలి
ఓ సగం చోటే కోరి
మీ కథే విందా...

ఊరూ  పేరూ లేని 
ఊహా లోకానా...
తారాతీరం దాటీ..
సాగిందా ప్రేమా...

తరగతి గది దాటీ..
తరలిన కథకీ..
తెలియని తెగువేదో చేరే...
అడుగులు పడలేనీ..
తొలి తపనలకీ..
ఇరువురి మొహమాటాలే..
దూరము పోయే... నేడే...

రాణే.. గీత దాటే.. విధేమారే..
తానే... తోటమాలి దరే చేరే...
వెలుగూ నీడల్లే....
కలిసే సాయంత్రం
రంగే లేకుండా...
సాగే చదరంగం

సంద్రం లో నదిలా...
జంటవ్వాలంటూ...
రాసారో లేదో...
ఆ దేవుడుగారు...

తరగతి గది దాటీ...
తరలిన కథకీ..
తెలియని తెగువేదో చేరే...
అడుగులు పడలేనీ..
తొలి తపనలకీ..
ఇరువురి మొహమాటాలే..
దూరము పోయే... 




అరెరే... ఆకాశంలోన పాట సాహిత్యం

 
చిత్రం: కలర్ ఫోటో (2020)
సంగీతం: కాల భైరవ
సాహిత్యం: కిట్టూ విస్సాప్రగడ
గానం: అనురాగ్ కులకర్ణి, కాల భైరవ

అరెరే... ఆకాశంలోన
ఇల్లే కడుతున్నావా.....
సూరీడు కూడా పడలేనిసోట...
రంగేసినాడు తలదాసుకుంటా..
తనరూపు తానే తెగ సూసుకుంటా.. ఆ ఆ...
మా కిట్టిగాడు పడ్డాడు తంటా.. ఆ...

అరెరే.. ఆకాశంలోన
ఇల్లే కడుతున్నానా....

ఓ..ఓ..ఓ..ఓ...

సిత్రలహరి పాటంట తాను..
రేడియోలో గోలంట నేను..
బొమ్మ కదిలేలా....
గొంతు కలిసేనా.....
టూరింగ్ టాకీసు తెర నువ్వనీ...
నేనేమో కట్టైన టిక్కెట్టునీ...
మన జంట హిట్టైన సినిమా అనీ...
అభిమానులే ఒచ్చి సూత్తారనీ.....

పగలు రేయంటూ..లేదు..
కలలే కంటూ.. ఉన్నా...
తనతో నుంచుంటే.. చాలూ.. ఊఊ...
కలరు ఫోటోలోనా.....




ఏకాంతం లేనే లేదు పాట సాహిత్యం

 
చిత్రం: కలర్ ఫోటో (2020)
సంగీతం: కాల భైరవ
సాహిత్యం: సాయి కిరణ్ 
గానం: రమ్యా బెహ్రా

కన్నీళ్లు కొన్నేళ్లుగా
రానన్న రాలేదుగా
గతముంది లేనిండుగా
కడవరకు తోడుండగా

నా కోపం నా ద్వేషం
నా తోడే రావేమో నాతో నాతోనే...
నా గాయం నా సాయం
నా తోడే రావేమో నాతో నాతోనే...

ఏకాంతం లేనే లేదు
అయినా మనసే ఊరుకోదు
నిశ్శబ్దం కొత్త కాదు
మనసేమో ఊరుకోదు
నా యుద్ధం నాతోనే

ఏకాంతం నా లోనే లేదు
నిశ్శబ్దం కొత్తేమి కాదు
మనసేమో ఊరుకోదు
నా యుద్ధం నాతోనే

ఓ నేమోయలేని పొరపాటులెన్నో
ఎన్నో ఎన్నెన్నో
నే దాటలేని ఆ మాటలెన్నో
ఎన్నో ఎన్నెన్నో

కన్నీళ్లు కొన్నేళ్లుగా
రానన్న రాలేదుగా
గతముంది అనిండుగా
కడవరకు తోడుండగా

నేమోయలేని పొరపాటులెన్నో
నే దాటలేని ఆ మాటలెన్నో
ఎన్నో ఎన్నెన్నో
ఎన్నో ఎన్నెన్నో
కన్నీళ్లు కొన్నేళ్లుగా
రానన్న రాలేదుగా





కాలేజ్ సాంగ్ పాట సాహిత్యం

 
చిత్రం: కలర్ ఫోటో (2020)
సంగీతం: కాల భైరవ
సాహిత్యం: సాయి కిరణ్ 
గానం: హేమ చంద్ర


కాలేజ్ సాంగ్



తరగతి గది ఫొటోస్ పాట సాహిత్యం

 
చిత్రం: కలర్ ఫోటో (2020)
సంగీతం: కాల భైరవ
సాహిత్యం: సాయి కిరణ్ 
గానం: హేమ చంద్ర


తరగతి గది ఫొటోస్


 


చిత్రం: కలర్ ఫోటో (2020)
సంగీతం: కాల భైరవ
నటీనటులు: సుహాస్, చాందిని చౌదరి, సునీల్
దర్శకత్వం: సందీప్ రాజ్
నిర్మాణం: సాయి రాజేష్, బెన్నీ ముప్పనేని
విడుదల తేది: 23.10. 2020









తరగతి గది పాట సాహిత్యం

చిత్రం: కలర్ ఫోటో (2020)
సంగీతం: కాల భైరవ
సాహిత్యం: కిట్టూ విస్సాప్రగడ
గానం: కాల భైరవ




తొలి పలుకులతోనే..
కరిగిన మనసు
చిరు చినుకుల లాగే జారే..
గుసగుసలను వింటూ..
అలలుగ వయసు

పదపదమని తీరం చేరే...
ఏ పనీ పాట లేనీ...
ఈ చల్ల గాలి
ఓ సగం చోటే కోరి
మీ కథే విందా...

ఊరూ పేరూ లేని 
ఊహా లోకానా...
తారాతీరం దాటీ..
సాగిందా ప్రేమా...

తరగతి గది దాటీ..
తరలిన కథకీ..
తెలియని తెగువేదో చేరే...
అడుగులు పడలేనీ..
తొలి తపనలకీ..
ఇరువురి మొహమాటాలే..
దూరము పోయే... నేడే...

రాణే.. గీత దాటే.. విధేమారే..
తానే... తోటమాలి దరే చేరే...
వెలుగూ నీడల్లే....
కలిసే సాయంత్రం
రంగే లేకుండా...
సాగే చదరంగం

సంద్రం లో నదిలా...
జంటవ్వాలంటూ...
రాసారో లేదో...
ఆ దేవుడుగారు...

తరగతి గది దాటీ...
తరలిన కథకీ..
తెలియని తెగువేదో చేరే...
అడుగులు పడలేనీ..
తొలి తపనలకీ..
ఇరువురి మొహమాటాలే..
దూరము పోయే... 




అరెరే... ఆకాశం పాట సాహిత్యం

చిత్రం: కలర్ ఫోటో (2020)
సంగీతం: కాల భైరవ
సాహిత్యం: కిట్టూ విస్సాప్రగడ
గానం: అనురాగ్ కులకర్ణి, కాల భైరవ





అరెరే... ఆకాశంలోన
ఇల్లే కడుతున్నావా.....
సూరీడు కూడా పడలేనిసోట...
రంగేసినాడు తలదాసుకుంటా..
తనరూపు తానే తెగ సూసుకుంటా.. ఆ ఆ...
మా కిట్టిగాడు పడ్డాడు తంటా.. ఆ...

అరెరే.. ఆకాశంలోన
ఇల్లే కడుతున్నానా....

ఓ..ఓ..ఓ..ఓ...

సిత్రలహరి పాటంట తాను..
రేడియోలో గోలంట నేను..
బొమ్మ కదిలేలా....
గొంతు కలిసేనా.....
టూరింగ్ టాకీసు తెర నువ్వనీ...
నేనేమో కట్టైన టిక్కెట్టునీ...
మన జంట హిట్టైన సినిమా అనీ...
అభిమానులే ఒచ్చి సూత్తారనీ.....

పగలు రేయంటూ..లేదు..
కలలే కంటూ.. ఉన్నా...
తనతో నుంచుంటే.. చాలూ.. ఊఊ...
కలరు ఫోటోలోనా.....






ఏకాంతం పాట సాహిత్యం

చిత్రం: కలర్ ఫోటో (2020)
సంగీతం: కాల భైరవ
సాహిత్యం: సాయి కిరణ్ 
గానం: రమ్యా బెహ్రా








కన్నీళ్లు కొన్నేళ్లుగా
రానన్న రాలేదుగా
గతముంది లేనిండుగా
కడవరకు తోడుండగా

నా కోపం నా ద్వేషం
నా తోడే రావేమో నాతో నాతోనే...
నా గాయం నా సాయం
నా తోడే రావేమో నాతో నాతోనే...

ఏకాంతం లేనే లేదు
అయినా మనసే ఊరుకోదు
నిశ్శబ్దం కొత్త కాదు
మనసేమో ఊరుకోదు
నా యుద్ధం నాతోనే

ఏకాంతం నా లోనే లేదు
నిశ్శబ్దం కొత్తేమి కాదు
మనసేమో ఊరుకోదు
నా యుద్ధం నాతోనే

ఓ నేమోయలేని పొరపాటులెన్నో
ఎన్నో ఎన్నెన్నో
నే దాటలేని ఆ మాటలెన్నో
ఎన్నో ఎన్నెన్నో

కన్నీళ్లు కొన్నేళ్లుగా
రానన్న రాలేదుగా
గతముంది అనిండుగా
కడవరకు తోడుండగా

నేమోయలేని పొరపాటులెన్నో
నే దాటలేని ఆ మాటలెన్నో
ఎన్నో ఎన్నెన్నో
ఎన్నో ఎన్నెన్నో
కన్నీళ్లు కొన్నేళ్లుగా
రానన్న రాలేదుగా


Palli Balakrishna Sunday, January 17, 2021

Most Recent

Default